Friday 9 September 2016

* sloka bhaavaalu --

 ఓం శ్రీ రామ్        ఓం శ్రీ రామ్      ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ  - అంతర్జాల సేకరణ ప్రభ 


భోజనే తత్ర వార్తా కా,వార్తాకా స్తత్ర భోజనే
నసంతి యది వార్తకా,వార్తా కా తత్రభోజనే

 

తా :-ఇద్దరు వ్యక్తులు భోజనం గురించి మాట్లాడు కుంటున్నారు.ఒకడు భోజనం లో వార్త ఏమిటి?
రెండో వాడు వార్త యే భోజనం అని అన్నాడు.మొదటివాడు వార్త లేకపోతే ఏమిటి? మొదటివాడు
వార్త ఏముం ది? భోజనం లో ?
వివరణ:--ఇదంతా అయోమయంగా వున్నది కదా!ప్రశ్నలను విడదీద్దాం ఈరోజు భోజనం లో వార్త ఏమిటి?వార్త అంటే సంస్కృతం లో విశేషం అనే అర్థం వుంది.మొదటి వ్యక్తీ ఈరోజు భోజనం లో ఏమి విశేషం వుంది?అంటే రెండో వాడు వార్తాకం అంటే వంకాయ వంకాయే కూరే విశేషం. (వంకాయవంటి కూర లేదు అని అంటారు కదా!) మొదటివాడు వార్తాకం(వంకాయకూర ) భోజనము లో లేకుంటే ఏమి? ఇంక భోజనము లో విశేష
మేముంటుంది ?అంటే వంకాయకూర ఒక్కటే విశేషం భోజనం లో యింకేమి వున్నా విశేషం లేనట్టే అని రెండోవాడి సమాధానం.
--------------------------------------------
ఇవన్నీ చమత్కార శ్లోకాలు.
సమస్య:-"గౌరీ ముఖం చుంబతి వాసుదేవః" దీన్ని క్రమాలంకారము లో పూర్తి చేశారు.ఒక అజ్ఞాతకవి,
 

కా శైల పుత్రీ ,కిము నేత్రరమ్యం,
శుకార్థకః కిం కురుతే ఫలాని:
మోక్షస్య దాతా స్మరణేన కోవా,
గౌరీ, ముఖం చుంబతి వాసుదేవః


తా:--మొదటి పాదం లోని ప్రశ్న కు చివరి పాదం లో సమాధానం వస్తుంది. .
కా శైల పుత్రీ?=గౌరీ (చివరిపాదము లోని మొదటి పదం) కిము నేత్ర రమ్యం?=కళ్ళుంటే అందంగా వుండేది ఏది?=ముఖం, కిం శుకార్థకః కురుతే ఫలాని= చిలుక పండుని ఏమి చేస్తుంది?చుంబతి =ముద్దు పెట్టుకుంటుంది (కొరుకుతుంది). స్మరించగానే మోక్షము నిచ్చేది ఎవరు?=వాసుదేవుడు

--((**))--

కాశీలో తనకూ తన శిష్యులకూవారం రోజులు అన్నం దొరక లేదని ఆగ్రహించిన వ్యాసుడు.

కుక్షి ప్రోద్భవ నిష్ఠుర క్షుభిత దుష్క్రోధా0 ధకారంబునన్
జక్షుల్రెండును జిమ్మచీకటులుగా సంరంభ శుమ్భద్గతిన్
బ్రేక్ష చ్ఛాత్రులు భీతి నొంద గడు నుద్రేకించి హట్టంబునన్
భిక్షాపాత్రము ఱాతిమీద శతథా భిన్నంబుగా వైచితిన్

వ్యాసుడు కాశీలో వారం రోజులు భిక్షాన్నం దొరక్క ఆకలితో అలమటించాడు.ఎనిమిదోదిన సాయంత్రాన ఆయన ఆ కష్టాన్ని భరించ లేక పొయ్యాడు.అన్నపూర్ణకు నివాసమైన కాశి
లో అన్నం పుట్టలేదా పురాణకర్తకు.కరకరమని ప్రేవులు కొరికేస్తుంటే చురచురమని
ఆయన చూపుల్లో కోపం మండుకొచ్చింది.శిష్యులా కోపాన్ని చూచి కంపించి పొయ్యారు.
భిక్షాపాత్రను వెయ్యి వ్రక్కలయ్యేలా ఱాతి మీద కొట్టాడు.కాశిని శపించటానికి
కమండలోదకంబు చేపట్టాడు.అన్నపూర్ణ అడ్డం వచ్చి ఆయన ఆగ్రహాన్ని అదలించింది.
అన్నానికి రమ్మని పిలిచింది.అమృతం లాంటి ఆ ఆహ్వానానికి వ్యాసుని కళ్ళల్లో ఆశాజ్యోతి మొలకెత్తింది తానొక్కడే కాదు.300 మంది తన శిష్యులు కూడా ఆకలితో వున్నారు.వారిని వదిలి తానొక్కడే యెలా వెళ్తాడు?అడగండి అమ్మయినా పెట్టదు.అని యిలా అర్థించాడు

--((**))--


తల్లీ!యిన్ని దినాలకేనియు సుధాధారా రసస్యంది యై
యుల్లంబు న్సుఖింప జేయు పలుకెట్లో వింటి మివ్వీటిలో
బెల్లాకొన్న తనాన నే నొక్కడనే భిక్షాటనకు న్వత్తునో
యెల్లన్ శిష్యుల గొంచు వత్తునొ?నిజంబేర్పాటుగా జెప్పుమా

ఈవు పెట్టిన భిక్ష మేమందరమును
బంచుకొని చేయువారము ప్రాణరక్ష
నాతి! యందరివియును బ్రాణములు కావె
నాదియేప్రాణమని వత్తునా; భుజింప

తల్లీ! యిన్నాళ్ళకైనా అమృతం లాంటి హృదయము ఆనంద మొందె మాట ఈ నగరం
లో వినపడింది.నాకొక్కడిదే ఆకలి యని నేనొక్కడనే యెలా వస్తాను?నన్ను తండ్రిలా
చూసుకునే నా బిడ్డల్లాంటి శిష్యులనొదిలి నేనెలా వస్తాను? బిడ్డలను వదిలి తండ్రి యొక్కడే యెలా భుజింపగలడు?అందరికీ అన్నము పెడతానని చెప్పు.
మేమందరమూ నీవిచ్చిన భిక్ష పంచుకొని తింటాము.అందరివీ కూడా ప్రాణాలే కదా!
నా ఒక్కడిదే ఆకలి నేను యెలా రాగలను?
అందరికీ పంచభక్ష్య పరమాన్నాలతో వడ్డించింది అన్నపూర్ణ అందరూ ఆశ్చర్యముతో సంతోషముతో విందారగించారు.
అంతలో విరూపాక్షుడు వేడి చూపులతో కోపంగా ప్రత్యక్ష మైనాడు.కాశీని శపించబోయిన వ్యాసుడిని బాగా తిట్టాడు.వూరు వదిలి పొమ్మని బహిష్కరించాడు.

పోక నడగొట్టితేనియు,రాకింతు జుమీ మొగంబు రాచట్టుపయిన్
శ్రీ కాశిక నిందించిన, నీకింతట నేలపోవు నీచచరిత్రా!
కాశీ వదిలి పోకుంటే ఈ రాయి పైన నీ మొహం పగులగొడ్తాను.కాశీని నిందించిన నీవు యిక్కడ వుండడానికి తగవు యని నిష్ఠురంగా బెదిరించాడు.
వ్యాసునికి శ్వాస ఆగినంత పనైంది.పరమేశ్వరునికి ప్రణామం చేసి చేసి ప్రయాణమయ్యాడు.భర్గుడు భయంకరంగా శాసించినా భావాన్ని తల్లిగా చల్లని మాటలు పలికి దోవ చూపి దీవించింది.
--((**))--

వెరవకుమో కుమార!పదివేల విధంబులఁ నైన నిన్ను నే
మఱవ మారేడకుం జనుట మాని సుఖంబున దక్షవాటికిన్
దుఱగలి గొన్న సమ్మదముతో గమనింపుము భీమనాయకుం
డఱగొఱ లేనివేల్పు నిఖిలాభ్యుదయంబులు నీకు నయ్యెడున్

భయపడకు కుమారా! నేను నిన్ను మరచిపోను,వేరే యెక్కడకు పోవుట మాని దక్షిణా పథమున దాక్షారామము లోనున్న భీమేశ్వరుడు దాక్షిణ్య మూర్తి ఉత్తరాన కాశీలో విశ్వేశ్వరుడు ఉద్ధత మూర్తి.నీవు దాక్షారామములో నివసించుము. నీకు ఎప్పుడూ అభ్యుదయమే వుండును.
వ్యాసుడు కాశీని బాసిన ఘట్టం భీమఖండంలో చదివేవారికి రోమాంచితం గలిగించే రసవత్తరమైన సన్నివేశం.ఈ కథలో వ్యాసుని క్రోధావిర్భావం.క్రోధం వాళ్ళ జనియించేది రౌద్రం.రౌద్రవల్ల జనించేది కరుణం.వ్యాసుని క్రోధం,విశ్వేశ్వరుని రౌద్రానికి కారణం.
దానివల్ల వ్యాసునికి కలిగింది శాప శోకం,కాశీ వియోగ తాపం.జనకజన్య రసాల సంవిధానం
ఈ ఉపాఖ్యాన శిల్పం.కారణాలు వేరైనా వ్యాసునిలాగే కాశీని విడిచి దాక్షారామం చేరిన
వాడు అగస్త్యమహర్షి.ఇరువురికీ కాశీవియోగ దుఃఖం సమం.ఆర్ద్రమైన ఆర్ష శోకం ఈ పురాణం లో కరుణగా జాలువారింది.భీమఖండం లో లాగానే కాశీఖండం లో కూడా
ఈ కథ వస్తుంది.కాశీ ఖండం లో అన్నపూర్ణ కన్నతల్లిగా పలకరిస్తుంది.

--((**))--


ఓ మునీశ్వర వినవయ్య! యున్న యూరు
గన్నతల్లియు నొకరూపన్నరీతి
యటు విశేషించి శివుని అర్ధాంగలక్ష్మి
కాశి యవ్వీటి మీద నాగ్రహము దగునె

ఉన్నవూరు,కన్నతల్లి ఒకటి."స్వీయ రాష్ట్రానికి చేటు చేసుకోవడం కూర్చున్న కొమ్మను నరుక్కోవడం వంటిది.పార్వతీదేవి శివుని అర్ధాంగలక్ష్మి.అటువంటి కాశీ క్షేత్రాన్ని శపించ రాదు తెలుగువారు నేటికీ గురైఉంచుకోవలిసిన త్రికాల సత్యమిది.


--((**))--

ఒక నెరజాణ యైన వేశ్య తనదగ్గరకు వచ్చిన విటుడిని గురించి తన కూతురుతో యిలా అంటున్నది.


నగపగతు పగతు పగతుని
పగతుండగు మగధరాజు బరిమార్చిన యా
జగజెట్టి యన్న తండ్రికి
దగు వాహనమైన యట్టి ధన్యున్డితడే


వివరణ:-నగపగతుడు= కొండలకు శత్రువు ఇంద్రుడు, ఇంద్రుడి విరోధి నరకాసురుడు,
వాని విరోధి శ్రీకృష్ణుడు,అతని విరోధి జరాసంధుడు,జరాసంధుడిని చంపినవాడు భీముడు, భీముడి అన్న ధర్మరాజు,ధర్మరాజు తండ్రి యముడు,యముడి వాహనము దున్నపోతు.ఇతడు వట్టి దున్నపోతు అని అర్థం.

--((**))--


ఆకాకు గదిసియుండును
ప్రాకటముగ బూవు, పిందె,ఫలముండదు తా
బైకొని చినుకులగాచును
భూకాంతా దీని దెలియు పురుషులు గలరే?


ఆకు ఆకూ కలిసి వుంటుంది,పూవుగానీ,పిందె,ఫలమూ యేమీ వుండవు, చినుకు లు పడకుండా కాపాడుతుంది.రాజా!దీనిని చెప్పే పురుషులు గలరా?
జవాబు:--- తాటాకు గొడుగు
 


--((**))--

No comments:

Post a Comment