Monday 26 September 2016

**ఎవరు, ఎవరన్నారు .. నాకు తెలివి లేదని

ఓం శ్రీ రామ్  - ఓం శ్రీ కృష్ణ 


28/9  నేటి నా పాట

నాన్నా నీకు ఏమీ తెలియదు అన్న మాటకు  

ఎవరు, ఎవరన్నారు ..  నాకు తెలివి లేదని
మంచి- చెడు మధ్య నలిగి పోతున్నాని
ఈ వయసులో పనికి రారన్న ...  వారితో 
అంటాను నన్ను ఉపయోగించు కోలేని
వారే ..  చాతకాని వా .... రని

విరక్తిలేదు మధువు త్రాగుతున్నా
ప్రపంచాన్ని చుట్టివచ్చే శక్తితో ఉన్నా 
కడలిని ఈదే ధైర్యంతో బ్రతుకుతున్నా
నా ఆలోచనలతో ప్రజలకు సేవలు చేస్తున్నా

ఎవరు, ఎవరన్నారు నాకు తెలివి లేదని
మంచి చెడు మధ్య నలిగి పోతున్నాని

కవితా శక్తితో సంతోషాన్నిఅందిస్తున్నా
పకృతి బట్టి కష్ట సుఖాలు హెచ్చరిస్తున్నా     
నాడిని బట్టి రోగులకు మందు లిస్తున్నా
సేవా పదంలో వయసును చూడక సేవ చేస్తున్నా

ఎవరు, ఎవరన్నారు నాకు తెలివి లేదని
మంచి చెడు మధ్య నలిగి పోతున్నాని

గాలిలా ప్రజలలో స్వాసగా ఉంటున్నా
తరువులా ఒంటరినై సహకరిస్తున్నా
మనసంతా ప్రేమ నింపుకొని జీవిస్తున్నా
స్త్రీలను అగౌరపరిచే వారిని ఎదిరిస్తున్నా

ఎవరు, ఎవరన్నారు నాకు తెలివి లేదని
మంచి చెడు మధ్య నలిగి పోతున్నాని
ఈ వయసులో పనికి రారన్న వారితో 
అంటాను నన్ను ఉపయోగించు కోలేని
వారే చాతకాని వారని
వారే చాతకాని వారని
వారే చాతకాని వారని
ఎవరు, ఎవరన్నారు నాకు తెలివి లేదని
--((*))--

1 comment: