Thursday 7 July 2016

కార్తీక పురాణము

 ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
పంజలి ప్రభ - పాటల ప్రభ

సర్వేజనా సుఖినోభవంతు

కార్తీక పురాణము 

1వ అధ్యాయం

శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిశారణ్యములో శౌనకాది మహామునులతో నొక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచూ సూతమహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, 'ఆర్యా ! తమ వలన అనేక పురాణేతిహాసములను, వేదవేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి.

అంత నా సూతమహర్షి, 'ఓ ముని పుంగవులారా ! ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీ దేవికి, సాంబశివుడు పార్వతీ దేవికీ తెలియజేసిన విధముగా నా గాధను వినిపించెను.
అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుటవలన మానవులకు ధర్మార్ధములు కలుగటయే గాక, వారు యిహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని యిట్లు చెప్పెను.

పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీ దేవి, 'ప్రాణేశ్వరా సకలైశ్వర్యములు కలుగజేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది యగు వ్రతమును వివరింపుడని కోరెను.

అంతట మహేశ్వరుడు మందహాస మొనరించి. 'దేవీ ! నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమున చెప్పబడియున్నది. దానినిప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడుమా మిథిలా నగరము వైపూ, అని మిథిలా నగరపు దిశగా చూపించెను .

అట, మిథిలా నగరములో వశిష్టుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి, ఆ జలమును శిరస్సుపై జల్లుకొని 'మహాయోగీ! మునివర్యా ! తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాద ధూళీ చే నా గేహము పవిత్రమైనది. తమ రిటకేల వచ్చితిరో సెలవొసంగుడూ, అని వేడుకొనెను.

అందులకు వశిష్టుడు 'జనక మహారాజా! నేనొక మహాయజ్ఞుము చేయతలపెట్టితిని. దానికి కావలసిన అర్ధ బలమును, అంగ బలము నిన్నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిశ్చయించి యిటువచ్చితినీ, అని పలుకగా, జనకుడు, 'ముని చంద్రమా!' అటులనే యిత్తును. స్వీకరింపుడు. కానీ. చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమబోటి దైవజ్ఞులనడిగి సంశయమును తీర్చుకోదలిచితిని. నాయదౄష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురు రత్నా! సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది? ఆ కార్తీక మాస గొప్పతనమేమి? అను సంశయము నాకు చాలా కాలము నుండి యున్నది. కావున తాము కార్తీక మహత్మ్యము గురించి వివరింపవలసినదీ, అని ప్రార్థించెను.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి 'రాజా! తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది. సకల పాపహరమైనది అయివున్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలవి కాదు. వినుటకు గూడా ఆనందదాయకమైనది. అంతియే గాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక యిహమందును, పరమందును, సౌఖ్యమును పొందగలరు, నీబోటి సజ్జనులు యీ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని యిట్లు చెప్పసాగెను.

వశిష్టుడు కార్తీక వ్రత విధానము తెలుపుట

ఓ మిథిలాధీశ్వరా! జనక మహారాజా! ఏ మానవుడైనను, ఏ వయసు వాడైనను, ఉచ్ఛ, నీఛ అనే భేదము లేక కార్తీక మాసములో, సూర్య భగవానుడు తులారాశియందుండగా, వేకువ జామున లేచి కాలకృత్యములను తీర్చుకొని, స్నానమాచరించి, దానధర్మములను, దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండియు యిట్లు చేయుచూ, విష్ణుసహస్ర నామార్చన, శివలింగార్చన, ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, 'ఓ దామోదరా! నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుమ', అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించవలెను.

కార్తీక స్నాన విధానము

'ఓ రాజా!' ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి, కాలకృత్యములు తీర్చుకొని, నదికి బోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు, నమస్కరించి, సంకల్పము చెప్పుకొని, మరలా నీట మునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదాన మొసంగి, పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములొనర్చి గట్టుపై మూడు దోసిళ్ళ నీళ్ళు పోయవలెను.

ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున, మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైననూ స్నానమాచరించిన యెడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలు వీడి, మడి బట్టలు కట్టుకొని, శ్రీమహావిష్ణువుకు ప్రీతి కరమైన పుష్పములను తానే కోసితెచ్చి నిత్య ధూప, దీప, నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి, గంధము తీసి భగవంతునికి సమర్పించి, తాను బొట్టు పెట్టుకొని, పిమ్మట అతిధి అభ్యాగతులను పూజించి, వారికి ప్రసాదమిడి, తన ఇంటి వద్ద కానీ, దేవాలయములో కానీ, లేక రావిచెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి. శివాలయమందు కానీ, విష్ణ్వాలయమందు కానీ, లేక తులసి తోట వద్ద కానీ, దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి, అందరికీ పంచిపెట్టి, తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలయును.

ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ, పురుషులకు పూర్వమందును, ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు, వ్రతము చేసిన వారలను జూచి, వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును.

ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణము సమాప్తము.
--((**))--









  
   
 
ఓహో చెలీ - ఓహో సఖీ
నాకు ఉంది చలీ - తీర్చాలి గిలీ - అందుకో నా కౌగిలి    


/ / ఒకఓదార్పు-వెయ్యినిట్టూర్పులు //

దోబూచులాడే నీ ముఖబింబం చాలు
నిరంతరం నీ దర్శనం కోరే నామనసుకి
నీ చిరు దరహాస రేఖ చాలు
న జీవన రేఖ నిడివి పెంచేందుకు
నన్నుపరిహసించె నీ చిలిపిమాటలు చాలు.
నా మదిలో నీ ఉనికిని సుడి తిప్పుతూ
ఎంతటి వేదనైనా ఓర్పుతో భరించగలను
నా వెయ్యి నిట్టూర్పులకు
నీ ఒక్క ఓదార్పు చాలు..
కుంగిపోయిన నా బ్రతుకులోఅనుక్షణం..
చావు తోడై వుంటానంటోంది..
నిన్నువిడిచి పోనా? పోగలనా?
మరణాన్ని కౌగలించుకోనా?
నాకోసం నువ్వున్నావో లేదో
తెలియని భ్రమలో
అబద్ధంగా బతుకుతున్న నాకు.
మరణం శరణాన్నిస్తానంటుంటే
తెలియని సందిగ్ధం.!
నన్ను కోరుతున్న చావుకుచేరువవనా?
నిన్నే కోరుకుంటున్న భ్రాంతిని చేదుకోనా?
ప్రశ్నా నాదే!
జవాబూ నాదే!
............ నాకు తెలుసు
నువ్వు నిమిత్తమాత్రుడవని...
ప్రేమకోసం చరిత్రలో
ఎందరు మరణించారోతెలియదు గానీ,
నీ తపస్సులో పంచభూతాల్లో
కలిసే నా ప్రాణం మాత్రం ..చెదరని సాక్ష్యం...
కనువిప్పైన క్షణాన ఒక్క కన్నీటి చుక్క చాలు..
మట్టిలో కలిసి ప్రేమ గంధాన్నిపంచడానికి





//రావోయీ...నల్లనయ్యా//
_ కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
10.09.2016
అల్లన మెల్లన పిల్లన గ్రోవితో...
పాడిన పల్లవి చరణ జంఝరి..
జల్లన గుండెలు జారేలా..!
శూన్యం నింపనోయీ..

నీ మ్రోవి, మురళీల
గాంధర్వ రసకేళీ సమీరం...
గమ్మున తాకెనోయీ...
ఒడలు పులకించెనోయి..
కనులు వెదికెనోయీ..
మనసు వేచెనోయీ..
గోపాల బాలా..
వేగిర రావేలా..
వేచేనుగా గోపీకా ..
వేధించక రా ఇక..!
నీవు లేక వేగేనులే బృందావని
కళ్ళు చేసుకుని చూసే నీవస్తావని.

   






 రాధా కృష్ణ మనోహరం

ఓ .....ఓ... ఓ....
వయ్యారి వసంతమా
సింగారిని మురిపించుమా

వలలో చిక్కును
మనసు పండించును
వయసు అర్పించును

అష్ట నాయికలు :
ఇరులలో తారక లివియంచు, తానేనా
కురులలో మల్లియ విరులు తురుము!
అసలే కెందమ్ము లీ అడుగు లనుచు, ఎంతో
పొందుగ లత్తుక పూయు తానే!
అదియేదో అంటే నీ అధరాన నని, తన
మెత్తని పెదవుల నొత్తి తుడుచు!
చూచుచు, మరి మరి చూచి మెచ్చుచు, మక
రికల చెక్కిళ్ళ చిత్రించు తానే!
ఎంత పున్నెమ్ము చేసినానే, మగండు
ఒక్క క్రీగంటి చూపులో, ఒక్క లేత
నగవులో, నా మనస్సు నెరిగి గ్రహించి,
తీర్చునే యంచు మురియు `స్వాధీన పతిక '
------------------
విభుని దోతేర పంపిన ప్రియ దూతిక
లెంతకు తిరిగి రారేమో కాని-
ఘనుల సద్గోష్ఠిలో మునిగి యున్నాడని
వెరతురేమో స్వామి దరియుటకును;
నిప్పుల వర్షమై నిలువెల్ల దహియించు
నిలబడనీదు వెన్నెలల వాన;
అయ్యయో మదన దేవా! మ్రొక్కు దాన, నా
పైననా ననతూపు పదను బాకు?
అతనుదవు, నీవు పోగల వటకు, - వారి
ఉల్లమున జేరి నా మాట నూదగలవు;
చనుము - నా ప్రాణముల నిల్పు మని నెలాంత
తల్లడిలు విరహోత్కంఠిత వలవంత?
---------------
పవళింపు గదిలోన, పగడంపు కోళ్ళ చ
ప్పరపు మంచము పైన పాంపు పైన
వలిపంపు జిలుగు దుప్పటి వేసి, కస్తూరి
జువ్వాది కలిపిన గంధ సార,
మగరు వత్తులు, మేలి అత్తరుల్, పచ్చక
ప్పురపు వీడియము పళ్ళెరమున నిడి
ద్వారాన తోరణాల్ కూరిచి, ముంగిట
వన్నెవన్నెల రంగవల్లులుంచి
తానమాడి, పుప్పొళ్ళ నెమ్మేన నలది
నెరుల సిగ నల్లి, నుదుట చెందిరపు బొట్టు,
కనుల కాటుక, అలతి నగవులు మెరయ
విభుని కొరకు వాసక సజ్జ వేచి యుండు
-------------
ఈ తీవ యోవరియే గదా తాముర
మ్మన్న యేకాంత గృహమ్ము! తాము
మెత్తురనే గదా, మెలత, ఈ కయిసేత!
ఈ నిరీక్ష్ణము లింకెంత శేపె?
కడచెనే రేయి సగ; మ్మైన శ్రీ వారి
అడుగుల సడియును పడదు చెవుల-
మరిమరి పొగడకే మాయల మారిని,
విసిగిన ప్రాణాలు వేపి తినకె!
పదవె, అడుసాయె నేల నా బాష్పవారి
ననుచు నెవ్వగ మెయినగ లన్ని ఊడ్చు;
"అసలు దోషము నాదే" నటంచు ఏడ్చు;
విరహమున వేగిపోయిన విప్రలబ్ధ
-----------
"మన సార వలచి వచ్చిన వాడు,నీ రేడు
తొగరేని మించు సోయగము వాడు;
లాలించినాడు, తన్నేలు కొమ్మన్నాడు-
చప్పగా వాయైన విప్పవపుడు.
అవియేటి అలకలో! అ మూతి ముడుపులు
ఆ మొండిపట్టులు, ఆ బిగువులు!
ఇక నిప్పుడోయమ్మ! ఎన్ని నిట్టూర్పులు
అసురుస్సునంటలు, అలమటలును!
ఓసి, ఇవియేటి చేతలే బైసి మాలి!
ఏరు విన్నను నవ్వగలారు లె" మ్మ
టంచు చెలి పల్క, తెలివొంది అలవి కాని
వెతల పాలౌచు కలహాంతరిత తపించు
--------------
విన్నవే యిన్నాళ్ళు, కన్నులారగ చూసి
న్నను, నేడేంతో ఆనంద మాయె;
ఆ చందనాంకము లా తమ్ములపు ముద్ర
లే లేమవో చెప్పలేరు తామె;
వేయికి పైనాయె ప్రియురాండ్రు, రేయికో
మూడే ఝామములాయె - మోహ యాత్ర
నేదో ఈ దారి నూరేగు చుబుసుపోక
వేంచేసినార లీ వేగుబోక
వలదు విడియగ నిట మానవతులే గాని
వలపు బిచ్చ మాశించెడి వారులేరు;
పిలిచుచున్నవి వేరె కౌగిళులు, వెడలు
మనుచు తెగనాడు ఖండిత అయిన రాధ
--------
"అటు చూడ వీటి ముంగిటను మౌనమ్ముగా
తల వాలిచె మన మందార తరువు!
పురి విప్పదు మన పెంపుడు మయూరమ్ము ది
గులుచెంది దిక్కుదిక్కులకు చూచు!
సరెసారెకు మన శారిక పలవించు
కలువరపడి ఏదృ పలుకబోవు!-
ఏలాగు నీ మేఘవేళ ఒంటరి రేల
ప్రాణేశ్వరు ప్రవ్వసి బాసి" యనుచు
చల్లుకొను మేన గొజ్జంగి నీరు;
గుప్పుకొను కప్పురము తోడి పుప్పొడులను;
పొరలు సెజ్జ, లేచి మరల నొరుగు సుంత;
పొగులు ప్రోషిత భర్తృక మగని కొరకు
-------------------


నడి రేయి, చక్కని పున్నమి నాటి వెన్నెల 
పాల వెన్నెల జడివాన లీల! 
హృదయేశు డున్న ఆ పొదరింటి వర కొరుల్ 
పసిగట్టకుండ పోవలయు గాదె! 
తెలికోక తెలి రైక, తెలిమేలి ముసుగులో 
మెయి సోయగపు మిసమిసలు దాచి 
కాలి యందెల కడియాల గాజుల మువల్ 
రవళింపకుండ చెరగున జొనిపి 
మోముపై, కేలిపై గంద వొడి నలంది 
పులుగు రవ్వంత గూట కదల బెదరుచు 
ఆకుసడి కదరుచు, గాలి అడుగు లిడుచు, 
వెడలె నభిసారికగ ప్రియు కడకు రాధ.. 



సేకరణే,,నాదికాదు..... కృతజ్ఞతలతో...
(అమ్మయ్య..చెల్లుచీటీ రాసేసాను...)







No comments:

Post a Comment