Saturday 2 April 2022

/లఘు కవితా ప్రక్రియ


లఘు కవితా ప్రక్రియ 

మరణం జననం సృష్టి ధర్మం
అనుభవమే మన కర్మం
......
మృత్యువు నీ నిజమైన నేస్తం
కలుపుతుంది సమస్తం
......
ఎవరికివాళ్ళం మేధావులని అనుకుంటాం 
స్వార్ధంతో అండ్ నిజమనుకుంటాం 
......
తగ్గుతగ్గు వయసు ఏనాటికైనా 
పొందలేవు సుఖం ఖరీదైనా
......
ప్రాణముంటేనే అభిమానంతో నమస్కారాలు
లేకపోతె అభిమానంతో చేస్తారు దహనసంస్కారాలు/
.....
మాదకద్రవ్యాలతో అలవాటు అతలాకుతలం
అలవాటు తో మనసు వ్యాకులం
....
చిక్కు కోవద్దు విషపు అలవాట్లు 
ఇరుక్కోవద్దు  అగచాట్లు 
....
జీవితం తియ్యని బూందీ కానే కాదు 
చేదు విషము అసలు కాదు 
....
సిగ్గు వదిలేసిన రాజకీయము
అర్హులకు అందనిసహాయము  
.....
 లఘు కవితా ప్రక్రియ ---  2 

చేతిలో మొబైల్ ఉంటుంది గానీ  .. చేతిలో కేబుల్ ఉండదు 
చేతిలో కలము ఉంటుంది కానీ ... చేతిలో కాల ముండదు   
నెలవంక ఉంటుంది గానీ... వారంవంక ఉండదు.
పాలపుంత ఉంటుంది గానీ... పెరుగుపుంత ఉండదు.

దాహం ఉంటుంది గానీ... దాపరికం ఉండదు 
పలకరింపు ఉంటుంది గానీ... పులకరింపు అందరికి ఉండదు  
ప్రేమ ఉంటుందికానీ .. ప్రేమ కనబడుతూ ఉండదు 
పిల్లకాలవ ఉంటుంది గానీ... పిల్లల కాలవ ఉండదు

పాము నూనె ఉంటాది గానీ... తేలు నూనె  ఉండదు 
ట్యూబ్ లైటు ఉంది గానీ... టైర్ లైటు ఉండదు.
ట్రాఫిక్ జామ్ ఉంటాది గానీ... ట్రాఫిక్ బ్రెడ్ ఉండదు.
వడదెబ్బ ఉంటాది గానీ... ఇడ్లీ దెబ్బ ఉండదు 

నిద్రగన్నేరు చెట్టు ఉంటాది గానీ.... మెలకువ గన్నేరు చెట్టు ఉండదు 
ఆకురాయి ఉంటాది గానీ... కొమ్మరాయి ఉండదు 
పాలపిట్ట ఉన్నది గానీ... పెరుగు పిట్ట ఉండదు 
వడ్రంగి పిట్ట ఉంటాది గానీ... కంసాలి పిట్ట ఉండదు 

రంగులరాట్నం ఉంటది గానీ... బ్లాక్ అండ్ వైట్ రాట్నం ఉండదు 
ఫైర్ స్టేషన్ లో ఫైర్ ఉండదు  ... పులిహారలో పులి ఉండదు 
నేతి బీరకాయలో నెయ్యి ఉండదు... మైసూర్ పాక్ లో మైసూర్ ఉండనే ఉండదు.
గాలిపటంలో గాలి ఉండదు ... గల్లాపెట్టిలో గల్లా ఉండదు 

కారు మబ్బులు ఉంటాయి గానీ... బస్సు మబ్బులు ఉండవు 
చుట్టరికాలు ఉంటాయి గానీ... సిగరెట్టరికాలు ఉండవు 

ఫేసు బుక్కులో పుస్తకం ఉండదు ....  యూ ట్యూబులో గొట్టం ఉండదు 
***
లఘు కవితా పాఠము ... 3.... ప్రక్రియ వాన పలుకులు 
 
మనకు వర్షం గురించే తెల్సు..  ఒక్క సారి మీరు చదవండి  
వానలు కురుస్తాయి. ఎప్పుడూ ఒకే‌ వాన కురిస్తే ఎలా? ఇన్ని రకాల వానలు కురిస్తే?

* గాంధారి వాన = కంటికి ఎదురుగా ఉన్నది  కనిపించనంత జోరుగా కురిసే వాన
* మాపుసారి వాన = సాయంత్రం కురిసే వాన
* మీసరవాన = మృగశిరకార్తెలో కురిసే వాన
* దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన
.....
* సానిపి వాన = అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన
* సూరునీల్ల వాన = ఇంటి చూరు నుండి ధార పడేంత వాన
* బట్టదడుపు వాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన
* తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన
.....
* సాలు వాన = ఒక నాగలిసాలుకు సరిపడా వాన
* ఇరువాలు వాన = రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన
* మడికట్టు వాన = బురదపొలం దున్నేటంత వాన
* ముంతపోత వాన = ముంతతోటి పోసినంత వాన
.....
* కుండపోత వాన = కుండతో కుమ్మరించినంత వాన
* ముసురు వాన = విడువకుండా కురిసే వాన
* దరోదరి వాన = ఎడతెగకుండా కురిసే వాన
* బొయ్య బొయ్య గొట్టే వాన = హోరుగాలితో కూడిన వాన
.....
* రాళ్ల వాన = వడగండ్ల వాన
* కప్పదాటు వాన =  అక్కడక్కడా కొంచెం కురిసే వాన
* తప్పడ తప్పడ వాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.
* దొంగ వాన = రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన
.....
* కోపులు నిండే వాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన
* ఏక్దార వాన = ఏకధారగా కురిసే వాన
* మొదటివాన = విత్తనాలకు బలమిచ్చే వాన
* సాలేటి వాన = భూమి తడిసేంత భారీ వాన
.....
* సాలు పెట్టు వాన = దున్నేందుకు సరిపోయేంత వాన
* నాన పెట్టు వాన  = నీటిలో మునిగి పోయేటి వాన   
* కొంప కూల్చే వాన= పిడుగులు పడుతూ ఉదృతవాన 
* స్వార్ధపు వాన   = ముసలి కన్నీరు వాన 
....
* మంత్రాల వాన = హృదయాన్ని తడిపే వాన
* సూత్రాల వాన  = మనసుని తడిపే వాన  
  ***

శివాభిషేకాలు - వాటి ఫలితాలు ---4 -- ప్రాంజలి ప్రభ పాఠము  

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
.....
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
.....
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
.....
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
....
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
....
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

🙏ఓం నమః శివాయ 🙏


No comments:

Post a Comment