Tuesday 25 August 2020

25-08-2020




                      తలుపు తీసేది లేదు పో!
                           Dr.chilakamarthi Durgaprasada Rao
                    డాక్టర్ .  చిలకమర్తి దుర్గాప్రసాద రావు.
                                   09897959425
శివుడు బోళాశంకరుడు. ఎవరు ప్రార్థించినా పొంగిపోతాడు. ఎవరేమి కోరినా లొంగిపోతాడు. ఒకసారి ముసలి ఎద్దు మీద కూర్చుని భక్తుల కోరికలు తీరుస్తూ ఇంటికి చేరవలసిన  సమయాన్ని కూడ మర్చిపోయాడు. ఆయన ఇల్లాలైన పార్వతి తన భర్త ఎప్పుడొస్తాడా అని ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది . ఎంతసేపైన రాకపోయేటప్పడికి విసిగి విసిగి వేసారి పోయింది. ఒకవేళ వచ్చినా తలుపు తీయకూడదని ఒక నిర్ణయానికొచ్చేసింది.  ఇంచుమించు అర్థరాత్రి కావొచ్చింది. అంతలో ఆమెకు కునుకు పట్టింది.  ఆయనగారు అప్పుడే ఇల్లు చేరాడు. కాలింగ్ బెల్ సౌకర్యం లేకపోవడం వల్ల తలుపు దబదబా బాదవలసి వచ్చింది . దాంతో  ఆమెకు నిద్ర కూడ చెడింది. అసలే కోపంతో ఉందేమో.. 
ఎవరివయ్యా నువ్వు?(కస్త్వం?) అంది తలుపు తీయకుండానే లోపలనుంచి. 
ఆయన 'శూలీ' అన్నాడు. శూలం కలవాణ్ణి (శివుణ్ణి) అన్నాడు. ధనంకలవాడు ధనీ అయినట్లే  శూలం కలవాడు శూలీ అవుతాడు . కానీ శూలపదానికి శూలరోగం అనే అర్థం కూడ ఉంది . దీన్ని బట్టి శూలరోగం (డొక్కలో పోటు) కలవాణ్ణి కూడ 'శూలీ' అనొచ్చు. పార్వతి ఆ అర్థం తీసింది. వెంటనే మృగయ భిషజం అంది  . అటైతే వైద్యుణ్ణి వెదుక్కోవయ్యా (వైద్యుడి దగ్గరకెళ్లవయ్యా)  ఇక్కడికెందుకొచ్చావు? అంది.
వెంటనే శివుడు ఆమెతో  'నీలకంఠ: ప్రియేsహం' అన్నాడు. ఓ ప్రియురాలా! నేను నీలకంఠుణ్ణి (శివుణ్ణి) గుర్తుపట్టలేదా! అన్నాడు.  నీలకంఠ పదానికి నెమలి అనే మరొక అర్థం కూడ ఉంది. పార్వతి ఆ అర్థం తీసుకుంది . కేకామేకాం కురు అంది. అటైతే ఒక కేక వెయ్యవయ్యా! అంది . నెమలికూతను 'కేక'  అని కూడ పిలుస్తారు. అందుకే నెమలిని 'కేకి' అంటాం.
ఆమె నిద్రలో ఉండడం వల్ల తనని గుర్తు పట్టలేకపోతోందనుకున్నాడు ఆ అమాయకచక్రవర్తి.  ఈసారి  'అహం పశుపతి:'  అన్నాడు.  నేనే పశుపతిని (శివుణ్ణి) గుర్తుపట్టలేదా!అన్నాడు.  ఆమె 'పశుపతి' పదానికి ఎద్దు అనే అర్థం తీసింది. పశువుల్లో మగది అంటే ఎద్దే అవుతుంది కదా! . పార్వతి వెంటనే ‘ నైవ దృశ్యే విషాణే'' అంది . “నువ్వు పశుపతివైతే కొమ్ములేవీ ఎక్కడా కనిపించడం లేదే''  అంది.  శివుడికి మతిపోయినంతపనయింది. కాని ఏంచేస్తాడు. ఎలాగైనా తనని గుర్తు పట్టేలా చేసుకోవాలి . వెంటనే స్థాణుర్ముగ్ధే  అన్నాడు . ఓ అమాయకురాలా! నన్ను గుర్తు పట్టలేదా! నేను స్థాణువుని (శివుణ్ణి) అన్నాడు. 'స్థాణు:'  అంటే శివుడని అర్థం.  ఆయన దురదృష్టమో లేక ఆమె అదృష్టమో తెలియదు గాని 'స్థాణు:'  అంటే  'చెట్టు'  అనే అర్థం కూడ ఉంది. వెంటనే ఆమె ‘న వదతి తరు:’ అంది.   "చెట్టు మాట్లాడదు కదా! నువ్వు మాట్లాడుతున్నావు స్థాణువునంటావేమిటి”? అంది.
శివుడికి తలతిరిగిపోయింది. ఎలా సమాధానం చెప్పాలో తెలియలేదు. చాలసేపు ఆలోచించాడు.  చివరికి 'జీవితేశ: శివాయా:' అన్నాడు. 'శివా ' అంటే పార్వతి ,  జీవితేశ: అంటే భర్త.  నేనే పార్వతీపతిని (నీమొగుణ్ణి)  ఆనమాలు కట్టలేదా అన్నాడు.  ఈ సారి ఆమె తప్పక గుర్తు పడుతుందనుకున్నాడు. కాని ఈసారి కూడ నిరాశే ఎదురయింది. శివా అంటే ఆడునక్క అనే అర్థం కూడ ఉంది . అది పార్వతికి లాభించింది. '' ఓహో! అలాగా! నువ్వు మగనక్కవన్నమాట. అటైతే(గచ్ఛాటవ్యా౦) అడవుల్లోకి పోయి నీ జంటను వెతుక్కో ఇక్కడకెందుకు రావడం'' ? అంది.
ఆయన ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. ఓటమినంగీకరించి తలొంచుకున్నాడు. ఆమె కరుణాంతరంగిణి,  కరుణాతరంగిణి కదా! తలుపు తీసి లోపలకు ఆహ్వానించే  ఉంటుందని ఊహిద్దాం.
ఇంత రసవత్తరమైన సంభాషణను తనలో పొందుపరచుకున్న ఈ శ్లోకం చూడండి.

కస్త్వం? శూలీ మృగయ భిషజం నీలకంఠ: ప్రియేsహం
కేకామేకాంకురు పశుపతి:నైవదృశ్యే విషాణే |
స్థాణుర్ముగ్ధే న వదతి తరుర్జీవితేశ: శివాయా:
గచ్ఛాటవ్యామితి హతవచ: పాతున: చంద్రచూడ: ||
*******


[🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

"శ్రీ లలితా రహస్య సహస్ర నామావళి" 
అంతరార్థం: అద్వైత అర్థం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
26. చక్రరాజ రధా రూఢ సర్వాయుధ పరిష్కృత
గేయచక్ర రధా రూఢ మంత్రిణీ పరిసేవిత
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 ప్రతిపదార్థం:
 చక్రరాజ=  సహస్రారం
 రధారూఢ= సహస్రార అనే రథాన్ని అధిరోహించినది
  సర్వంయుద= సకల విధాలైన సాధనల చేత
 పరిష్కృత= సాధించ  బడిన
 గేయ చక్ర= విశుద్ధ  చక్రం 
\రధారూడా= విశుద్ధ చక్రం ని అధిరోహించిన
 మంత్రిని= మన+ త్రయంయ+ని= మనసు, చిత్తము, బుద్ధి లచే
 పరి సేవితా= సేవించ బడినది
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
 విశేషణ అర్ధం:
 ధ్యాన యోగం లో కేవలం సాధన ఒక్కటే సరిపోదు. శమము మరి ద మములతో కూడిన సాధు సత్ప్రవర్తనను కూడా కలిగి ఉండాలి..

యమ నియమాలను ఆచరిస్తూ మనసు, బుద్ధి ,మరి చిత్తము లను పూర్తిగా నియంత్రిస్తు సాధన చేయాలి. అప్పుడు డు ప్రాణశక్తి  సహస్రా రా న్ని అధిరోహించి.. "గేయ చక్రం" అంటే "విశుద్ధ చక్రము" అంటే స్వరపేటికను తేజోవంతం చేస్తుంది. ఇలా ఉచ్ఛ్వాస నిశ్వాసల ను క్రమ పద్ధతిలో నియంత్రణ చేసే సాధననీ ప్రాణాయామ సాధన అంటాము

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
: మనసు.....

భావన, ఆలోచన, స్పందనలతో మనసు నిరంతరం ఏదోక దానితో మమేకమై పోతుంటే, దాన్ని అదే ఎలా అదుపులో పెట్టుకుంటుంది...

మనసు శరీరభావనతో ఉన్నప్పుడు శరీరం తాలూకా కష్టసుఖాలను అనుభవిస్తుంది. మండుటెండలో తిరిగినప్పుడు కష్టంగా అనిపించటం, ఏసీ గదిలో ఉంటే హాయిగా ఉండటం వంటివి మనసు పొందే దేహానుభవాలు.

మనసు ఆలోచనలో ఉన్నప్పుడు శరీరంతో నిమిత్తంలేని సంతోష దుఃఖాలను అనుభవిస్తుంది. ఏదైనా శుభవార్త గుర్తుకు రావటంతోనే సంతోషం కలగటం, అవమానకరమైన విషయం గుర్తుకు రాగానే దుఃఖం కలగటం మానవుని అనుభవంలోనివే.

మనసు శరీరభావం ఆలోచనలతో కాకుండా తన సహజస్థితిలో ఉంటే ఆత్మశాంతితో ఉంటుంది. అంటే ఆత్మలక్షణమైన పరిపూర్ణ శాంతిని మనసు అనుభవిస్తుంది. క్రియలో శరీరానికి కష్టసుఖాలు, భావనతో సంతోష దుఃఖాలు, కలుగుతున్నాయి. కాబట్టే నీళ్ళలో పడినట్లు కలవస్తే మనసుకు మాత్రం ఆందోళన ఉన్నా నిజంగా శరీరానికి ఏ తడి అంటదు.

మనసు ఈ భావనాస్థితిని దాటితే మనోమూలంలోనే ఉన్న ఆత్మశాంతి అనుభవంలోకి వస్తుంది. ఆత్మగుణమైన పరిపూర్ణశాంతి మనసుకు కలగటమే ఆత్మానుభవం. అదే దైవదర్శనం...
--(())--

 25/08/2020] +91 72870 25099: 💫 గర్భములో శిశువు పిండ రూపంలో భగవంతుని ప్రార్థిస్తాడా ? ఎలా !? 
🕉🌞🌏🌙🌟🚩

స్త్రీ గర్భములోనే శేషన దు:ఖముతో జీవుడు ప్రవేశిస్తాడు. ఫలదీకరణము జరిగిన తరువాత శిశువు పరిణామక్రమము. ఒక రోజుకు ఖలిలమౌతాడు. ఐదు రోజులకు బుద్భుదాకారము పొందుతుంది. పది రోజులకు బదరీఫలములాగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు.

ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది. రెండు నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడుతాయి. మూడు నెలలకు గోళ్లు, రోమాలు, చర్మము, లింగము, నవరంధ్రములు ఏర్పడుతాయి. నాలుగు నెలలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి. ఐదు నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడుతాయి. ఆరు నెలలకు జరాయువు, మావిచేకప్పబడి గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు.

మాతృ భుక్తాన్న పానీయాలచే క్రమక్రమంగా వృద్ది చెందుతూ దుర్గంధ భూయిష్టమైన మల మూత్రాల గుంటలో ఉన్న పురుగులు, సుకుమారమైన శరీరాన్ని కరుస్తూ ఉండగా, ఆ బాధకు తట్టుకోలేక మాటిమాటికి మూర్చబోతాడు. నరకయాతన, నరకాను భవము జీవుడు మాతృ గర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది.

తల్లి తీసుకునే ఆహారములోని, దుస్సాహాలైన కట్వాములు (ఉప్పు) లవణాది పదార్థముల వలన సర్వాంగాల యందు వేదన కలుగుతూ ఉంటుంది. మావి చేత ప్రేవుల చేత చుట్టబడి వక్రీభూతమై పృష్ఠశిరోధరుడై, అధశిరస్కుడై తల్ల కిందులుగా ఉంటాడు. పంజరంలో పక్షిలాగా జీవుడు గర్భంలో బంధింప బడి ఉంటాడు.

అప్పుడు భగవంతుని దయ వలన, పూర్వ జన్మలలో చేసిన పాపములు గుర్తొస్తాయి. అపుడు గత జన్మలో చేసిన పాప పుణ్యముల కారణంగానే కదా ఈ జన్మమునకు వచ్చింది, అని బాధ పడుచూ ఉంటాడు. కర్మ ఫలితం అనుభవించడానికే కదా మరలా ఈ జన్మ అని గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటాడు.

అలా పరితపిస్తూ జీవుడు బంధభూతాలైన సప్తధాతువులు కలిగి, భగవంతుని మీద కృతజ్ఞతతో (మరలా మానవ జన్మ ఇచ్చినందుకు) గద్గద స్వరంతో భగవంతుని ప్రార్థించడం గర్భంలోనే ప్ర్రారంభిస్తాడు.

గత జన్మలలో చేసిన పాపపుణ్యముల సంఘాతమే కదా ఈ మానవజన్మ. అని తలంచుచూ భగవంతునికి మాతృ గర్భంలో ఉన్నప్పుడే మాట ఇస్తాడు. ప్రమాణం చేస్తాడు. ఓ శ్రీహరీ నీ మాయచే మోహితుడు కావడం వలన బిడ్డలు, భార్య, అహంకారము, మమకారము, కామము వీటియందు పడి, సంసార నిమగ్నుడనై, సంసారమే బ్రతుకని మంచి, చెడులను విడచి ధర్మము, అధర్మము అని చూడకుండా, ధన సంపాదనే ధ్యేయంగా, చేయకూడని, చెప్పుకోలేని పాపములు జరగడానికి కారకుడయ్యాను.

అలా సంపాదించిన ధనము, భాగ్యములను నా భార్యాబిడ్డలు అనుభవించుచున్నారే కానీ నన్ను గురించి పట్టించుకోవడం లేదు. నేను సంపాదించిన ఆస్తిపాస్తులు బిడ్డల పాలు పాపములు మాత్రం నా పాలు అయినది.

ఓ భగవంతుడా ఈ దుర్గంధముతో ఈ గర్భములో ఇక ఉండలేను. దయచేసి నన్ను బయటపడవేయుము. నేను బయటపడితే ఈ సారి పాపకృత్యముల జోలికిపోను. నన్ను నమ్ముము. మీ చరణారవిందములను విడువను. ఎల్లప్పుడూ మీ చరణాలనే స్మరిస్తూ ఉంటాను. ఈ సారైనా ముక్తి పొందడానికి ప్రయత్నము చేస్తాను.

ఈ సారి నాకు సంసారబంధములను కట్టబెట్టవద్దు. పొరపాటున కూడా సంసారము జోలికి పోను. పరాత్పరా ఈ మల మూత్ర కూపములోని దుర్గంధమును భరిచలేక, మరియు జఠరాగ్ని రూపంలోని వేడి వలన మాడిపోవుచున్నాను. భరించలేకున్నాను. నన్ను బయట పడవేయుము. మిమ్ములను మరచిపోను అని ప్రార్థిస్తాడు జీవుడు.

మరి మాతృ గర్భంలో భగవంతునికి ఇచ్చిన మాటను మనము నిలబెట్టుకుంటున్నామా? 
ఆలోచించండి. మీరే తగు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మనము విజ్ఞులము !

--(())--


[18:36, 25/08/2020] +91 94923 06908: బ్రహ్మ కుంభకర్ణుడికి ఇచ్చిన వరం

ఆరు మాసాలకు ఒకసారి మాత్రమే కుంభకర్ణుడు మేల్కొంటాడనే విషయం మాత్రమే మనకు తెలుసు. కానీ రామాయణంలో కుంభకర్ణుడి పాత్ర గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. రావణుడి సోదరుల్లో ఒకరైన కుంభకర్ణుడు ఆరు మాసాలకు ఒకసారి నిద్ర మేల్కొంటాడు. ఆ రోజంతా తిని మళ్లీ నిద్రపోతాడు. అసలు నిరంతరం నిద్రలో ఉండానికి కారణం ఏంటనే విషయం ఎవరికైనా తెలుసా?. రామాయణంలోని ఉత్తర కాండలో దీని గురించి పేర్కొన్నారు. రాక్షస సోదరులై రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు గురించి ఆసక్తికరమైన విషయాలను ఓ అధ్యాయంలో తెలియజేశారు.
దైవానుగ్రహం కోసం తండ్రి విశ్రావసుడి ఆఙ్ఞతో ముగ్గురు సోదరులైన రావణ, విభీషణ, కుంభకర్ణాదులు తపస్సు  ప్రారంభించారు. అనేక సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేయడంతో బ్రహ్మ ప్రత్యక్షమై వారిని వరాలను కోరుకోమన్నాడు. ముందు రావణుడిని వరం కోరుకోమని బ్రహ్మ అడిగాడు. తనకు అమరత్వాన్ని ప్రసాదించాలని రావణుడు కోరితే బ్రహ్మ దానికి తిరస్కరించాడు. అయితే పక్షులు, పాములు, యక్షులు, రాక్షసులు, దేవతలు వల్ల మాత్రం మరణం ఉండదని వరమిచ్చాడు.
విభీషుణుడు తాను ఎప్పుడూ నీతి పాటిస్తూ ఉండేలా వరం ప్రసాదించమని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. దీనికి సమ్మతించిన బ్రహ్మ అతడు కోరుకున్న వరాన్నే ప్రసాదించాడు. కుంభకర్ణుడి దగ్గరకు బ్రహ్మ వచ్చేసరికి దేవతలు అడ్డుపడ్డారు. అతడికి ఎలాంటి వరం ప్రసాదించవద్దని పేర్కొన్నారు. ఎందుకంటే రావణ సోదరుల్లో ఇతడు చాలా బలవంతుడు. తృప్తిపరచని ఆకలితో ఇతడు ప్రపంచాన్ని నాశనం చేస్తాడని సలహా ఇచ్చారు. దీంతో బ్రహ్మదేవుడు కుంభకర్ణుడిని మభ్యపెట్టి వరం అడగకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇందుకు జ్ఞానం, తెలివితేటలకు మూలమైన తన భార్య సరస్వతి దేవి సహాయాన్ని బ్రహ్మ అర్థించాడు. కుంభకర్ణుడు వరం అడిగేటప్పుడు అతడి నాలుకను నియంత్రించాలని కోరాడు. ఇంద్రాసనం అంటే ఇంద్రుడి సింహాసం వరంగా కోరుకోవాలని పొరపాటున కుంభకర్ణుడు నిద్రాసనం అని అన్నాడు. దీనికి వెంటనే బ్రహ్మ తధాస్తు అని వరం ఇచ్చాడు. వెంటనే రావణుడు కలుగజేసుకుని నిరంతరం కుంభకర్ణుడు నిద్రలో ఉండటం సరికాదు, ఒక నిర్ణీత సమయం ఉండాలని, తర్వాత మేల్కొనేలా సడలించమన్నాడు. అతడు ఆరు మాసాలు నిద్రలో ఉండి ఒక రోజు మేల్కొంటాడు. ఆ రోజు మాత్రం భూమి మీద సంచరించి మానవులను ఆహారంగా స్వీకరిస్తాడని బ్రహ్మ వరం ప్రసాదించాడు.
రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడు నిద్రపోయిన కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే రావణుడు మేల్కొలిపినట్లు రామాయణంలోని యద్ధ కాండలో వివరించారు. మోక్షం పొందడానికే రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడు బయలుదేరినట్లు తులసీదాస్ రచించిన రామచరితమానస్ తెలియజేస్తుంది. రాముడు శ్రీమహావిష్ణువు అవతారమని అతడికి ముందే తెలుసు. అందుకే సీతను అపహరించినందుకు రావణుడిని వ్యతిరేకించాడు కూడా.
                                                           ==(())==

   🌸 క్షమ... ప్రేమ... ఆనందం. 🌸

   🌸 క్షమ ప్రేమ ఆనందం గురించే చెప్పే ముందు వీటి గుణాలు వెటివల్ల ఇవి మనకు లభ్యమవుతాయి అనేది తెలుసుకుంటే మన దారి మనకు అర్ధమౌతుంది... ఇక్కడ అంత అన్ని కోణాల్లో చెప్పేసారు మనం మన జీవితం లో ఎలా చూస్తామో అనేది ముఖ్యం.. అందుకే మరోసారి గుర్తు చేసుకుందాం...

   🌸 క్షమించాలి అన్న.. క్షమాపణ అడగాలన్న ధైర్యం కావాలి.. ధైర్యం అనేది పరిస్థిని ఉన్నది ఉన్నట్లు చుస్తే భయం అనేది మన దరికి రాదు.. ఉన్నది ఉన్నట్లు ఎప్పుడైతే అంగీకరిస్తామో అక్కడ క్షమిచడం క్షమాపణ అడగడం తేలిక కారణం అక్కడ మనలోని ఆహానికి చోటు ఉండదు కాబట్టి.. ఎప్పుడైతే క్షమించడానికి క్షమాపణ అడగాటానికి సిద్ధం అయ్యమో అక్కడ మనలో సజీవమైన ప్రేమను మనమే దర్శిస్తాము.. 

   🌸 ప్రేమ మనలో స్థిరంగా ఉండాలి అంటే అంగీకార స్తితిని సాధన చెయ్యటం మినహా వేరే దారి ఉన్నది అనుకోలేము... మిగతా దారులు ప్రేమను చుబిస్తాయి పలకరిస్తాయి... కానీ సంఘటన మారగానే ప్రేమ స్తితి మారిపోతుంది... నిలకడ ఉండదు... అంగీకారబావ0తోనే అది సాధ్యం అనేది స్పష్టం..ఎప్పుడైతే ప్రేమను ప్రేమగా మనలో స్థిరపరచుకుంటామో మనం ప్రేమగా మారిపోతాం.. అక్కడ ఏ భావం వ్యక్తమైన ఆది ప్రేమ మాత్రమే అవుతుంది..

   🌸 ప్రేమగా మారిన మనo అందరిలో ప్రేమనే చూస్తాం.. ఇక్కడ ప్రేమతో చేసే సవరణలు కొంచెం చాదస్తం అనిపించినా అంత ఆ స్థితికి వస్తారు అనే అవగాహన మనకు వచ్చిన తరువాత 'మాన అబిమానలు.. మంచి చెడులు, లాభ నష్టాల చెక్రంలోనుంచి బయటకు వచ్చేస్తాం... అంటే ఇక జడ్జిమెంట్లు కంప్లైంట్స్ ఆగిపోతాయి... అక్కడ ఇక మిగిలేది మనం అందరికి పంచేది ఆనందమే... ఏది ఎలా ఉన్నా ఆనందమే ఉంటుంది మనలో... ఇక్కడివరకు ప్రయాణం శుభం ఇప్పటికి..
--(())--

కుడి-యెడమల ఏకపద సంగమం

క్రింద ఇచ్చిన ప్రతి కుడియెడమ పదాలకు తగినైన రెండక్షరాల పదాన్ని, మొదటి పదానికి చివర, దాన్నే రెండవ పదానికి మొదట జోడించి రెండు క్రొత్త పదాలు పొందగలరు.
ఉదాహరణ: కంద......పార 
జవాబు: కందగడ్డ, గడ్డపార 

01. వెండి......చాప
02. చేతి........సాము
03. మందు....మల్లె
04. ఉక్క.......పాలు
05. మణి.......కథ
06. పూల......యాత్ర
07. ఇంటి.......గడ
08. బొట్టు.......గోచి
09. సిగ..........చీర
10. అల.........వాన
11. మేక.........రాజు
12. మట్టి........ధారి
13. పాల........గోడ
14. సుడి........పటం
15. పులి........వంక
16. చుర.........పీట
17. చెవి..........గాడు
18. నిండు.......పోత
19. కను..........జాజి
20. నర...........పీఠం
21. ఎగ...........బొట్టు
22. బోడి..........సూది
23. పాము.......వాడు
24. చింత.........బలం
25. నిప్పు.........నిద్ర
26. కుక్క..........చుక్క
27. లెక్క...........బడి
28. గద్ద............చెంబు
29. జన్మ...........దారు
30. నిద్ర............మందు
31. అర............మీను
32. వెన్న...........బంతి

దీనికి "కీ " దొరక లేదు.మనం సాయం పడదాం.

1 comment:

  1. 1. వెండితెర...తెరచాప
    4.ఉక్కపోత....పోతపాలు
    11.మేకపోతు.....పోతురాజు
    13.పాలపిట్ట....పిట్టగోడ
    14.సుడిగాలి....గాలిపటం
    15.పులిగోరు....గోరువంక
    16.చురకత్తి.....కత్తిపీట
    18.నిండుకుండ....కుండపోత
    19.కనుసన్న......సన్నజాజి
    21.ఎగతాళి.....తాళిబొట్టు
    22.బోడిగుండు....గుండు సూది
    31.అరకొర....కొరమీను
    32.వెన్నముద్ద....ముద్దబంతి

    ReplyDelete