Saturday 8 July 2017


" బ్రాహ్మణో భోజన ప్రియః " అనేది అనాదిగా వస్తున్న నానుడి . బ్రాహ్మణుల భోజన ప్రియత్వము గురించి సరదాగా పోస్టింగు . దయచేసి ఎవ్వరూ అపార్ధం చేసుకోవద్దు . బ్రాహ్మణుల ఇంటి భోజనము గురించి . Watsup message . మీరేమన్నా అనుకోండి మాష్ఠారూ... బ్రాహ్మణ భోజనాలు భలేగా ఉంటాయండీ! "అంటే ఏవిటయ్యా? మిగతా భోజనాలన్నీ తేడాగా ఉంటాయంటావా!?" అని నామీద విరుచుకుపడొద్దు... నిజం చెప్పొద్దూ.! ఇవాళ మనస్పూర్తిగా బొజ్జ పూర్తిగా నింపుకుని ఉత్తరావపోసన పట్టి.. బ్రే....వ్వ్ అనడం జరిగింది.

వర్ణన:- మొదట చాప వేసి మమ్ములను ఆశీనులౌమన్నారు. మా ముందుగా వయసులో ఉన్న పచ్చటి అరిటాకులను వరసగా పరుచుకుంటూ వెళ్లారు. ఆ ఆకులకు ప్రథమ సంస్కారంగా ఆకులపై నీళ్ళు చల్లారు . వెంటనే విస్తట్లోకి “నచ్చుతానో,నచ్చనో” అని పెళ్లిచూపుల్లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లాగా మొహమాటంగా వస్తున్న వంటకాలు . మొదట విస్తట్లోకి జీడిపప్పు, పల్లీ సహిత పులిహోర హోరెత్తింది. పక్కనే పరమాన్నం ప్రత్యక్షం అయింది . పక్కన టమాట పప్పూ, శనగ నూనెలో వేయించిన అప్పడ,వడియ,చల్ల మిరపకాయలు . వెంటనే శాఖాహారుల శాకాంబరి గుత్తి వంకాయ! ఇంటల్లుళ్ళకు ఇష్టమంటూ బాగా ఆవ పెట్టి చేసిన పనసపొట్టు కూర . వేసవి కాలం ఒడుగు లగ్గాల్లో ఉపనయనం అయిన పిల్లవాడిలా ముచ్చట గొలిపేలా ఉన్న అప్పుడే పెట్టిన ఆవకాయ! దాని పక్కనే ఈర్ష్యాసూయలతో దోసావకాయ! కోపం తో మాడిపోయిన బెండకాయ వేపుడు, శనగ పొడిలో విసిగిపోయిన దొండకాయ వేపుడు . చివర్లో తమన్నాని తలదన్నే అందంతో అన్నమూ వచ్చాయి. ఆగాగు తొందర పడమాకూ... అయ్యా నేనొస్తుండా...బాబూ నేనొస్తుండా.... అయ్యా నేనొస్తుండా...బాబూ నేనొస్తుండా.... అంటూ చివర్లో నెయ్యి వచ్చింది. ఇక రాగి చెంబులో నీళ్ళిచ్చి “చిన్నగా కూర్చోండి... బాబూ” అని ఒక మాట చెప్పారు. నా చెవులకది డైరెట్రు గారు "action "అనరిచినట్టు వినబడింది. ఇక అవపోసన పట్టి మొదలెట్టాం. మొదట పులిహోర తిని, తర్వాత పప్పు పని పట్టాను అప్పడంతో. ఇంకా సగం పప్పు మిగిలి ఉంది!. నేను మొదట్నుంచీ గమనిస్తూనే ఉన్నాను ఆ టమాటపప్పు విస్తట్లోకి వచ్చినప్పటి నుంచి ఆ ఆవకాయకి లైనేస్తోంది. ఇక ఆ ఆవకాయ్...పెట్టి ఆర్రోజులే ఐనా అప్పుడే ఆరింద ఐపోయింది. వాళ్ళ ప్రేమకి ఆ నెయ్యిగాడు కారణం ఐయ్యాడు... ఇక నేనూరుకోలేదు... విశాల హృదయంతో ఆ రెంటినీ నెయ్యి గాడి సాక్షిగా కలిపి మింగేశాను. "వేడి తగ్గేలోపు తొందరగా తినవయ్యా మగడా... !" అంటూ గుత్తొంకాయ ఘుమఘుమలాడింది. దాని పని కూడా పట్టేసా… వెంటనే బెండకాయ్ వేపుడు అందుకుంది...ఉంది కదా అని ఆ టక్కులమారి వంకాయ ని అలా లాగించేయకయ్యా... తర్వాత దురదలని మొత్తుకుంటావు. పచ్చటి జీవితాన్ని త్యాగం చేసి వచ్చిందెవరికోసం...? నీకోసం కాదా? అంటూ నసిగింది.. దానికి దొండకాయ వత్తాసు పలికింది. ఇద్దర్ని కలిపి ఒకేసారి లాగించేసాను... మొహమాటం తో మూల నుండి “హాయ్ బావా” అని మరదలు పిల్ల పలకరించినట్టు పనసపొట్టు కూర సిగ్గు పడుతూ అక్కడే ఉండిపోయింది... దాని పనికూడా పట్టి ఇక పెరుగన్నం వైపు కాశి యాత్ర చేద్దాం అనుకునే లోపు...పరిగెత్తుకుంటూ వేడి వేడిగా సాంబారు బామ్మర్ది గాడు వచ్చి “అదేంటి బా అలా వెళ్లి పోతున్నావ్!? నన్ను నాలో ఉన్న ముక్కలని గ్రహించి మమ్మల్నందర్నీ ఉద్దరించండి” అని బెల్లం ముక్క తో బ్రతిమిలాడాడు... ఏవిటో నా మీద వెర్రి అభిమానం అనుకోండి ఈ వంటకాలన్నిటికీనూ ... ఓ పట్టు పట్టేదాకా ఓ పట్టాన వదల్లేదు... చివర్లో గులాబ్ జామూన్ శోభనం పెళ్లి కూతురు లాగా వచ్చి కవ్వించింది... దాన్ని తింటూ అల్లకల్లోలమైయున్న నా విస్తట్లోకి చూసాను..విస్తట్లో నుంచి వెలి వేసిన కరివేపాకు దీనంగా నా వైపు చూస్తే, ఆవకాయ టెంకే మోక్షం పొంది నాలో ఐక్యం ఐపోయిన భావనతో చూసింది. విస్తట్లో మిగిలిపోయిన దోసావకాయ్ నాకు తెల్సు నీకు ఆ ఆవకయంటేనే ఇష్టం నేనంటే ఇష్టం లేదు అని ప్రేయసి లా గొడవ పెట్టుకుంది . సగం కరచిన పూర్ణం బూరి, సగం సగం మిగిల్చిన వంటకాలు... "మాలో అర్ధ భాగమే తిని మా బ్రతుకులకి అర్ధం లేకుండా అర్ధాంతరంగా వదిలేసావ్ అంటూ అర్ధించాయి." ఇక నా పొట్టలో ఏ మాత్రం కాళి లేనందున ఉత్తరావపోసన పట్టి లేచి శుభ్రంగా బ్రే...వ్ అని త్రేన్చి... కాస్త అటూ ఇటూ తిరిగి ఓ కునుకు తీసాను... అన్నధాతా సుఖీభవ.

* మంగళ సూత్రంలో పిన్నీసులు ఉంచరాదు. అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి ఉంచుతుంటారు. మంగళ సూత్రం వేద మంత్రాల సహితంగా ప్రభావితం కాబడిన భర్త ఆయువుపట్టు. మంగళ సూత్రం రూపంలో హృదయం వద్ద చేరి ఉంది. ఇనుప వస్తువులు [పిన్నీసులు, ఇనుముతో చేసినవి] దివ్య శక్తులను ఆకర్షించుకొను గుణం ఉన్నాయి. అవి మంగళ సూత్రంలో దివ్య శక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి.
 * స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులై ఉంటే చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక, వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది.
* ఇంట్లో గుర్రం బొమ్మలు ఉంచ‌డం అంత క్షేమం కాదని, డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలా మంది నమ్మకం.
* సంపదలను, ఎక్కువగా ప్రదర్శించ‌డం వల్ల నరఘోష ఏర్పడుతుంది. తద్వారా చెడు జరుగుతుంది. అలంకారాదులు సాధారణంగా ఉండేలా చూసుకోవటం, సాధారణ జీవిత విధానాన్ని పాటించటం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు.

 * ఆడపడుచులు, అత్తమామలతో విభేదాలు ఎక్కువైతే, వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే వారు పడుకునే దిండు కింద తులసి వేరు ఉంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు. విరోధాలు తగ్గిపోతాయి.
 * వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి… వంటకాలు ఎంతో రుచిగాను, ఆరోగ్యకరంగాను ఉంటాయి.
 * పని మనిషిరానప్పుడు విసుగు చెంది కోపంతో బాధపడే కంటె, పని మనిషి కంటే నేనే శుభ్రంగా గిన్నెలు శుభ్రం చేసుకుంటాను, వాళ్ళ‌కంటే నేనైతే శుభ్రంగా ఉంచుకోగలనని మనస్సుకు పదేపదే చెప్పుకుని మీరు మీ పనిని చేసుకునే ప్రయత్నం మొదలెట్టండి. అసలు పని మనిషిని మానిపించాలనే అనిపిస్తుంది మీకు. * సుఖ సంతోషాలు కరువైనవారు పసుపు రంగు పూలు ధరించండి, క్రమేపీ స్థితి మెరుగవుతుంది. * అప్పుల బాధ ఎక్కువగా వుంటే తెలుపు పూలు ధరించటం వల్ల రుణ బాధలు తగ్గుతాయి.
* ఆరోగ్యం సరిగా లేని వారు, శరీరం నొప్పులు వున్నవారు మరువం, మందారాలు కలిపి ధరించండి. ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది.
 * పెళ్ళి చూపులప్పుడు ఎరుపు పూలు, పసుపు పూలు కలిపి మాలకట్టి పెట్టుకుంటే అమ్మాయిలకు మంచి సబంధాలు వస్తాయట.
 * ఇక ఆఖరుది అతి ముఖ్యమైనది భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే, గుండీలు మీరు పెట్టండి. మీ కుడి చేతిని తాకి వెళ్లమనండి. భర్తకు ఆ రోజు సంపాదనా , విజయం సంతోషం వెంట ఉంటాయి. ఇవన్నీ మూఢ నమ్మకాలు. అలా జరుగుతుందా.. ఇలా ఎందుకు జరుగుతుందనే వాదనలు చేసేవారి సంగతి కాసేపు పక్కన పెడితే.. ప్రపంచవ్యాప్తంగా నమ్మకాలు అనుభవాలను బట్టే కలుగుతాయి అంటున్నారు.

*ప్రతి ఒక్కరికి గురు పౌర్ణమి సందర్భముగా శుభాకాంక్షలు తెలియ పరుస్తున్నాను ఫెస్ బుక్ ద్వారా మీ స్నేహాన్ని కోరు తున్నాను, శ్రీ గురు చరిత్ర లో ఉన్న అన్నీ కధలను నేను రికార్డు చేస్తున్నాను, వాటిని ఫెస్ బుక్ లో పెడుతున్నాను, విని శ్రీ గురు కృపకు ప్రతిఒక్కరు పాత్రులు కాగాలరని ఆశయంతో ఇందు పొందు పరుస్తున్నాను. విని మీ అభిప్రాయాలు తెలుపగలరు


*హాయ్...........
ఇవి మీకు తెలుసా ?
*అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
*కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
*నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
*గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
*అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
*జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
*బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
*సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
*మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
*దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
*ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
*అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
*కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
*మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
*ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
*బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
*క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
*మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
*ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
*అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
*పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
*సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
*దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
*ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
*చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
*కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
*క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
*యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
*వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
*పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
*ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
*ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
*ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
*జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
*ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
*నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
*మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
*మునగ కాయలు ఆకలిని పెంచుతాయి. యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి దీనిని


1 comment: