Friday 7 October 2016

శిలీముఖోజ్జృంభిత -





మూడవ ఉదాహరణమును క్రింది విధముగా వ్రాస్తే అది ఇంద్రవజ్ర లయతో ఉండే నా కల్పన "శివరంజని" (స/య/త/గ - IIUI UU - UUI UU 11 త్రిష్టుప్పు 268) వృత్తము అవుతుంది -

విధిపత్ని నన్నున్ - బ్రేమమ్ముతోడన్
జదివించు తల్లీ - చైతన్యరూపీ
హృదయమ్ములోనన్ - నృత్యమ్ము లాడన్
సదయాంతరంగా - సత్యార్థి రావా


పద్మా లేక ప్రీతి - స/స/స/జ/గ IIU IIUII - UIUIU
13 అతిజగతి 6746 



పద్మా -

మొన్న సరస్వతీపూజ సందర్భముగా సర్వగురు వృత్తమైన "భారతీ" వృత్తమును, నిన్న దుర్గాష్టమికై చంపకమాలను తలపించే "అద్రితనయా" వృత్తమును పరిచయము చేసినాను. ఈ రోజు మహర్నవమి పండుగకోసం లక్ష్మీదేవిపై "పద్మా" వృత్తమును మీకు అందిస్తున్నాను. ఇది అప్పకవీయములో చెప్పబడినది.

పద్మా లేక ప్రీతి - స/స/స/జ/గ IIU IIUII - UIUIU
13 అతిజగతి 6746

నవరాత్రులలో నిల - నాట్యమాడ రా
కవనమ్ములలోఁ గల-కాల ముండ రా
నవనీతములా నిట - నవ్వుచుండ రా
భవపద్మము పూయఁగ - వన్నెఁ జల్ల రా



వచ్చి రూపించు ...
----------------------------
మాలిని వృత్తము-11
గణములు - న,న,మ,య,య
కళల కధలు కారుణ్యా లయాన్వీ శుభాలే 



గణములు - న,న,మ,య,య
యతి -1,9
నిరుపమగుణదీప్తీ నిత్యకల్యాణ కారీ
హరిహర నుతకీర్తీ ఆత్మవిద్యాప్రదాత్రీ
పరశివహృదిభాసా భక్తిగమ్యా భవానీ
సురుచిర మృదుహాసా శోభితాంగీ సుభద్రా
మఱి మఱి తలపో్తున్‌ మాతగా నిన్ను నిచ్చల్‌
నిరతము వినుతింతున్‌ నెమ్మియున్‌ శ్రద్ధ తోడన్‌
కరుణనుఁ గనవేలా కంజనేత్రీ సవిత్రీ
హరుసము నిడలేవా యన్నిటంజూపి వెల్గున్‌
వరములనిడకుండన్‌ వాక్ప్రదాత్రీ వరాంగీ
మఱిమఱి యడిగించన్‌ మంచిదా నీకునైనన్‌
సరసములవి చాలున్‌ జాటుగానుండి యెప్డున్‌‌
మురిపెము నిడరమ్మా ముందు నిల్చుండి పేర్మిన్‌
వినతుల విననట్లున్‌ వేసటం గూర్చ నేలా
తనయనె యనియంచున్‌ దాపమీయంగ మేలే
కనులకుఁ గనువిందై‌ కమ్రమౌ రూపుతోడన్‌
తనివినిఁ గలిగించన్‌ ధర్మమౌ కాద నీకున్‌
గుణయుత నని యంచున్‌ గ్రుంగఁజేయన్‌ శుభమ్మే
కినుకనునిడకుండన్ ఖేలగా నాడిబాసల్
వనరుహ దళనేత్రీ బ్రహ్మజిహ్వాగ్ర వాసీ
ప్రణతులు, నుతులందన్‌ వచ్చి రూపించు రక్తిన్‌
సుప్రభ
శిలీముఖోజ్జృంభిత -

శార్దూలవిక్రీడితపు మొదటి మూడు గణములతో ఆరంభమవుతుంది ఈ వృత్తము. పాదములో మొత్తము 28 మాత్రలు (విక్రీడితములో 30 మాత్రలు). శిలీముఖము అంటే తుమ్మెద లేక బాణము. ఈ వృత్తమును వాగ్వల్లభకారుడు పేర్కొన్నాడు. క్రింద నా ఉదాహరణములు -

శిలీముఖోజ్జృంభితము - మ/స/జ/న/జ/త/గ
UU UII UIUI - IIII UIU UIU
19 అతిధృతి 155481

రావా నన్నిటఁ జూడ నీవు - రసమయ రాత్రిలో నా ప్రియా
నీవే యన్నియు నంచు నేను - నిరతము దల్చితిన్ బ్రేమతో
భావాతీతము గాదె చేరి - ప్రణయరథమ్ములో యానముల్
నీవే నేనుగ మోదమొంద - నెనరున నుంద మానందమై

అమ్మా చూడవు నన్ను నీవు - హరుసము గల్గఁగా నా హృదిన్
వమ్మా పూజ లవన్ని నీకు - పలుక వదేల నాతోడ శా-
స్త్రమ్ముల్ వేదము లన్ని నీవె - రసనను నాట్యమాడంగ రా-
గమ్ముల్ నిండఁగ పద్యమందు - గళమున నింపు పీయూషమున్

ఇంపై పాడె శిలీముఖమ్ము - లిట వనిలోన నుజ్జృంభిత
మ్మంపెన్ రావములన్ ధ్వనించ - నలలుగ వీనులన్ హాయిగా
సొంపుల్ పుష్ప శిలీముఖంపు - సొబగులఁ జిత్రమై మన్మథుం
డంపెన్ మాధవమాసమందు - నలలుగ సోలఁగాఁ బ్రేమికుల్



అశ్వలలితా లేక అద్రితనయా - న/జ/భ/జ/భ/జ/భ/లగ
IIII UIUI - IIUI UIII - UIU IIIU
23 వికృతి 3861424
తపములతోడ నద్రి-తనయా మహేశ్వరుని - దారయైతివిగదా
యపరిమితమ్ముగాను - హరుసమ్ము నింపుమమ - హారిణీ హరసతీ
కృప నిటఁ జూపు కాంతి - కిరణాళిఁ జల్లుమమ - గేల నిచ్చి త్వరగా
యెపుడును నన్ను గావు - మిలపైనఁ దీర్చుమమ - యీప్సితమ్ముల సదా 





నెమ్మికందము - 556

నావలె నేడువవలెరా
నీవును విరహమ్ముతోడ - నీళ్లుల కనులన్
బావురుమని నీకప్పుడె
దేవా ప్రేమయన నేమొ - తెలియును గాదా
నెమ్మికందము - 555

పేరేమని పెట్టుట మన
కూరిమి శిశువునకుఁ జెప్పు - గోముగ నీవున్
నీరజయా పార్వతియా
భారతియా తెలుపు నీదు - వాంఛను ద్వరగా
 

విధేయుడు - మోహన

1 comment: