శ్రీ వాల్మీకి రామాయణం -- అరణ్యకాండ
======================
ఇ ది పంచవటి మూల తపోభూమి అట్టి భూమియందు ఎవరి చేత నైనను ఎదిరింప సెక్యం కానీ రాముడు ప్రవేశించెను .అక్కడ ఆ దండకారణ్యం ఆశ్రమ వాటికలను చూచెను .
ఆ ఆశ్రమంలో అక్కడక్కడ కుశలు నారచీరలు కనబడుతున్నాయి. స్పష్టమైనటువంటి వైదిక శోభ తో ఉంది .అది ఒక సూర్యమండలం వలే సామాన్యులకు దర్శింప వీలుకానిదిగా యున్నది.
ఆశ్రమములోని ముంగిళ్ళు అన్నియు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పలుకుతూ ఉండడం వలన అవి చాలా సుందరంగా ఉన్నాయి.
పలు రకాల పక్షులు మరియు మృగములు ఆనందంగా సంచరిస్తూ ఉన్నాయి. ఆ ఆశ్రమ ప్రదేశాలలో ఎంతో పూజ్య భావంతో అప్సరసలు నాట్యం చేస్తూ ఉన్నారు ఆ ఆశ్రమాలలో రక రకాల పూల చెట్లు మరియు వాటి ఫలములు ఇచ్చే వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి ఆ ప్రదేశం అన్ని విధములుగా తపో జీవనమునకు యోగ్యముగా కూర్చబడినది.
ఆశ్రమంలో కేవలం పండ్లు కందమూలములు భుజిస్తూ నారచీరలు కృష్ణాజినం లు ధరించి లోక క్షేమం కొరకు యజ్ఞం యాగాదులు నిర్వహించు ఋషులు మౌనులు అచట నివసించుచున్నారు.
నిత్య వేద గానము చె ఆ ఆశ్రమ మండలం బ్రహ్మలోకము ను తలపింప చేయునది గా ప్రకాశించుచున్నది.
సత్య ప్రకాషం గల రాముడు....
తన గొప్ప ధనస్సు కు గల అల్లె త్రాటిని విప్పి వేసి .....
ఎంతో వినయంతో ఆ ముని వాటికలో ప్రవేశించెను.
అప్పుడు....
దివ్య జ్ఞాన సంపన్నులైన అ మునులు పుణ్య దంపతులగు శ్రీ సీతారాముడు వచ్చుచున్నాడు అని గ్రహించి వారికి ఎదురే గిరి .
ఉదయించుచున్న సూర్యుని వలె ధర్మస్వరుపుడైన రాముని లక్ష్మణుని కీర్తిమంతురాలైన సీతను జూచి సంతోషించి మంగళకరమగు వచనములతో స్వాగతం పలికిరి.
వనములో నివసించేవారు......
రాముని శరీర సౌష్టవం ...
రాముని రూపమును ....
ఆ సౌకుమార్యము ను
మంచి వేషం చూచి ...ఆశ్చర్య చకితులైరి.
వనము లోని ఆ జనులందరూ ఆశ్చర్యం కలిగించే సౌందర్యం గల సీతను, రాముని, లక్ష్మణునిగాంచి రెప్ప వాల్చకుండా చూచిరి.
సకల ప్రాణుల హితము ను కోరు ఆ మునులు తమకు అతిథులుగా వచ్చిన సీతారామలక్ష్మణులకు ఋషి మండలంలోని ఒక పర్ణశాలలో విడిది ఏర్పాటు చేసిరి.
తపస్సు సంపన్నులైన ఆ మునులు యధా శాస్త్రముగా సత్కరించి , ఉదకములను, పండ్లను, మూలములను పుష్పములను వారికి సమర్పిస్తూ ఆశ్రమం అంతా ఇస్తున్నామనే అటువంటి భావనతో ఆనంద పడిరి.
రామా మేము అందరము నీ రాజ్యము నివసించు వారం కనుక మా అందరి రక్షణ భారము నీదే నగరమందు వున్న లేక అడవి నందు వున్నా.......
నీవే మాకు ప్రభుడవు.మేము శాపాయుధములను ప్రక్కనపెట్టి తపో విధులకు శత్రువు అయినటువంటి క్రోదమును పరిత్యజించి జీవించు వారము. తపస్సు లే మా సంపదలు కనుక గర్భస్థ శిశువును తల్లివలె అనుక్షణం నీవే మము కాపాడవలెను.
మునీశ్వరులు సిద్ధులు భక్తిపూర్వకంగా సమర్పించిన అతిథి సత్కారము లను స్వీకరించిన పిమ్మట శ్రీరాముడు రాత్రి అచట గడిపి సూర్యోదయ కాలమున స్నానాదికాలు ముగించుకుని ఆ ప్రభువు మునీశ్వరులను వీడ్కొని సీతా లక్ష్మణులతో కోడి వనములలో ముందుకు సాగెను.
ఆ వనం మధ్య ప్రదేశం అంతయును విధములగు మృగముల గుంపులతో నిండి యుండెను. పెద్ద పులులు తోడేళ్లు సంచరించుచుండెను .అఛటి చెట్లన్నీ ధ్వంసమై ఉండెను. తీగలు పాడుబడి ఉండెను. సరస్సులు కనిపించకుండా వున్నాయి. ఆకాశమున ఎగురుతున్న పక్షులు సైతం బిక్కుబిక్కుమని ఏ శబ్దం చేయకుండా
మౌనంగా సాగుతున్నాయి.
కీచురాళ్ళ రోధనలు మాత్రం కర్ణకఠోరంగా వినబడుతున్నాయి. సీతారాములు అట్టి భయంకరమగు అరణ్యంలో ప్రవేశించిరి
శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి భయంకర మృగములు సంచరించెడి ఆ వనము నందు పర్వత కారుడైన ఒక రాక్షసుని చూచిరి. అతని కంఠ ధ్వని భయంకరమైనది. అతడు లోతైన కన్నులతో మిగుల పెద్దది యగు వికృత కారం తో భయంకరంగా ఉండెను . అతని పొట్ట ఎగుడుదిగుడుగా మాంస కండరాల తో అతని శరీరం హెచ్చు తగ్గులుగా ఉండెను.అతని శరీరము మిక్కిలి పొడవు గా వుండి సకల ప్రాణులకు భయము గొలుపు తున్నది. అతడు పులి తోలు కప్పుకుని ఉండెను. ఆ పులి తోలు మాంసం తోనెత్తురోడుతున్నది.
మూడు సింహములను నాలుగు పులులను రెండు తోడేళ్ళను, పది చుక్కల వేళ్ళను, దంతములు కలిగి ఉన్నటువంటి ఒక పెద్ద ఏనుగు తలను తన ఇనుప శూలము నకు గృచ్చుకొని భయంకరంగా కెకలు వెయుచూ వస్తున్నాడు.
*****
వాల్మీకి రామాయణం అరణ్యకాండ ....... రెండో భాగం
........................................................
ఆ రాక్షసుడు రామలక్ష్మణులను జనకుని కూతురగు సీతను చూచి మిక్కిలి కృద్ధుడై
వారిపై విరుకొని పడెను....
వాడి వేగము నకు భూమి దద్దరిల్లెను.వాడు భీకరనాధములు చేయుచు,సితాదేవిని పట్టుకొని కొంత దూరం వెళ్ళి నిలిచి......
ఇట్లనెను.
ఓ పాపాత్ములార ! మీరు మునులవలే జటావల్కములు ధరించి........
రాజులవలే ధనుర్బాణాలు ఖడ్గము ధరించి...
పైగా అందమైన యువతి తో అధర్మవర్తనులై చరిస్తున్నారు.మీ పద్దతి మునుల
జీవనము నకు విరుద్ధం కాదా ?!.
ఇంతకు మీరు ఎవరు నేను నిరాధుడను రాక్షసుడను. నిత్యం మునుల భక్షించు చు ఈ కీకారణ్యమున సాయుధడనై సంచరింఛు వాడి. ఈ సుందరి నాకు భార్య కాగలదు. మీ రక్తం తాగుతా నాకు ఎదురు తిరిగారు అంటే.
ఈ సుందరాంగిని భార్యగా పొందుతున్న ందుకు మిమ్మల్ని క్షమించి విడిచి పెడుతున్నాను పిక్కబలం చూపి పరిగెత్తుడు
అని గర్జించాడు.
దుర్మార్గుడైన ఆ కబంధుడు ఈ విధముగా పలుకుచుండగా అతని ఉన్నత ప్రేలాపనలు విని జనకుని కూతురు అయిన సీతాదేవి భయంతో సుడిగాలికి దెబ్బతిన్న అరటి చెట్టు వలె మిగుల వణికిపోయాను..
పిమ్మట శ్రీరాముడు ని రాధుని చేతికి చిక్కిన సుకుమారి అయినా ఆ సీతాదేవిని చూచి చిన్నబోయిన ముఖము గలవాడై లక్ష్మణునితో ఇట్లు నుడివెను........
నాయన లక్ష్మణా ! జనకమహారాజు కూతురు నా భార్య అయిన సీతాదేవి మిగుల ఉత్తమురాలు ఆమె వాసిగాంచిన రాజకుమారి సుఖసంపదలలో పుట్టిపెరిగింది. అయ్యో అట్టి సాధ్వి,ఈ నిరాధుని చేతికి చిక్కినది కదా!
మనము అడవులలో ఇడుముల పాలగుటయే నా పిన తల్లి అయినా కైకేయికి ఇష్టమై ఉండవచ్చును. అందువల్లనే ఆమె వరముల సాకుతో నా వనవాసం కోరినది తన కుమారునకు రాజ్యమును కట్టబెట్టడమే కాక తృప్తి చెందక దూరదృష్టి గల ఆమె నన్ను అడవులపాలు చేసినది ఇప్పుడు ఆమె కోరిక నెరవేరి నట్లే అయినది. అని శ్రీరాముడు కంటతడి పెట్టగా అది సహించలేని లక్ష్మణుడు
అన్నయ్య ! ఆ కైక వలన ఆ గూనిదాని వలన నాలో ఏర్పడినటువంటి క్రోధము ఇంకాచల్లార లేదు. ఆ ఆగ్రహము ను ఈ రాకాసి పై ప్రయోగింఛెదను గాక అని విల్లంబు చేతపట్టెను.
శుభ లక్షణ సంపన్నుడైన లక్ష్మణుడు ఇట్లు పలికిన పిమ్మట దరహాసము చేయుచు ఆ రాక్షసునితో నీవు ఎవరు ఈ వనమున చేరి నేల సంచరించుచు టివి అని ప్రశ్నించెను
అంతట ఆ నిరాధుడు వనము దద్దరిల్లేలా వికటాట్టహాసం చేసి " ఓరి నన్ను ప్రశ్నిస్తున్న నీవు ఇంతకు ఎవరు ఎక్కడికి వెళుతున్నారు ?"
భయంకరుడైన ఆ రాక్షసుడు ఇట్లు పలకగా మిగుల పరాక్రమశాలి అయిన ఆ రఘురాముడు తమ ఇక్ష్వాకు వంశం గూర్చి అతనికి తెలిపిను.
" నేను క్షత్రియులం సచ్చరిత్ర కలవారము
వనములలో సంచరించుచుంటిమి. ఈ దండకారణ్యంలో సంచరించు నీ గురించి తెలుసుకొనగోరుచున్నాను".
నేను jayudu అను రాక్షసుని కుమారుడను. నా తల్లి శతహ్రద ఈ భూ తలమున రాక్షసులందరు నన్ను నిరాధుడని పిలుతురు. నా తపస్సునకు మెచ్చి బ్రహ్మ దేవుడు నాకు వరమును ప్రసాదించెను . దాని ప్రభావం వలన శస్త్రముల తో, ఆస్త్రముల తో నన్ను ఎవరూ కూడా చంపలేరు. నా శరీరం ఎవరు ఛేదించ లేరు. మీరు ఇరువురూ ఈ తరుణినీ విడిచి వెళ్లండి. ఆశించిన చో మీరు అసువులతో మిగలరు. ఈమె నాకు దక్కడం వలన నేను మీ ప్రాణావను తీయను.. నా మనసు మారక ముందే మీరు వచ్చిన దారి పట్టుఢు.
వాడి మాటలకు వృద్ధుడైన రామచంద్రుడు " ఛీ నీచుడా ఒక సద్ వంశ స్త్రీ ని కోరుకుని నీ ప్రాణాన్ని నీవు కోల్పోయేకాలం దగ్గర పడింది.. క్షణకాలం ఆగుము నీ ప్రాణం తీస్తాను"
అంతట శ్రీరాముడు ధనుస్సు ఎక్కుపెట్టి నిశితమైన బాణములను ఆ రాక్షసుని పై ప్రయోగించెను ఇంకనూ బంగారపు పిడులు గల బానములను సంధించి వదలెను. అవి వాయు వలె మహా వేగంతో సాగిపోయాను . ఆ బాణములు నెమలి ఈకలను చుట్టుకుని వున్నా రాక్షసుడి శరీరాన్ని చీల్చుకొని రక్తసిక్తములై నేలపై పడి పోయినవి
అంతటా రాముని బాణాల చే కొట్టబడిన ఆ రాక్షసుడు డు సీతాదేవిని అక్కడ నుంచి కోపావేశంతో ఊగిపోవుచు రామలక్ష్మణుల మీద విరుచుకు పడెను. అప్పుడు ఆ నిరాధుడు దిక్కులు పిక్కటిల్లే మహా నాథ మొనర్చుచు వజ్రాయుధం వలె మహోన్నతమైన శూలమును చేతబట్టి మృత్యుదేవత వలె నోరు తెరుచుకుని భయంకరంగా ఉండెను.
రామలక్ష్మణులు ఆ నిరాధునిపై అగ్ని తుల్యమైన బాణములను మరల మరల వేసిరి. వాడు ఆ బాణములను సరకు గొనక ఆవలించుచు అచ్చటనే ఉండెను.
ఆ బాణములు తనకు తగిలినను వర ప్రభావంచే ఆ రాక్షసుడు తన ప్రాణాలను నిలుపుకునెను. శూలం తో వారిపై దాడి చేసెను. రాముడు రెండు బాణములతో ఆ శూలమును తుత్తునియలు చేసెను.
పిమ్మట రామలక్ష్మణులిద్దరూ నల్లత్రాచు వలె భయంకరములైన ఖడ్గం లను చేబూని వేగంగా వాడిపై లంఘించి మంచి బలము తో కొట్టిరి.
బలమైన ప్రహరణలకు గురి అవుతున్న నిరాధుడు క్రుద్ధుడై నిర్భయముగా ఆ నర శ్రేష్టులను తన బాహువులలో బంధించి తీసుకొని పోవుటకు సిద్ధపడెను.
శ్రీరాముడు ఆ రాక్షసుని అభిప్రాయమును గమనించి లక్ష్మణునితో ఇట్లు అనే " ఓ సౌమిత్రి ఈ రాక్షసుడు ఈ మార్గమున నే మనలను చక్కగా మూసుకొని పోయిన పోనిమ్ము ఏలనన అతడు వెళ్ళడు మార్గమున నే మనము వెళ్ళ వలసి ఉన్నది కనుక అతడు మనలను తన ఇష్టానుసారం తీసుకుని పోనిమ్ము"
అనంతరం ఉద్దండుడైన ఆ రాక్షసుడు మిగుల బలశాలులు అయినా రామలక్ష్మణులను మోసుకొనుచు బాలురు లను వలె తన భుజముపై కూర్చుండ బెట్టుకొని గర్జించు చు అడవి త్రోవ పట్టెను.
పిమ్మట ఆ రాక్షసుడు రామలక్ష్మణులను మోసి కొనుచు మేఘముల వలె దట్టమైన ఒక వనమున ప్రవేశించెను ఆ అరణ్యం నానా విధములైన మహా వృక్షములతో నిండి యుండెను అది వివిధములైన పక్షుల గుంపులతో చిత్ర విచిత్రంగా నుండెను ఇంకా అది నక్కల తోడను పెద్ద పులుల తోడను మొదలగు అదృష్ట మృగముల తోడను వ్యాప్తమై ఉండెను.
ఇట్లు రామలక్ష్మణులను తీసుకొని ని పోవుచుండగా చూచి చక్కని సౌందర్యము గల వైదేహి వ్యాకుల పాటుకు లోనై తన రెండు భుజము లను పైకెత్తి బిగ్గరగా ఇట్లు అనెను.
" అయ్యో నా రామలక్ష్మణులను ఈ రాక్షసుడు అపహరించు కొన్ని పోతున్నాడు ఓరి రాక్షసుడా ! నా రాముని లక్ష్మణ్ ని వదిలి పెట్టు నీకు పుణ్యం ఉంటుంది వారికి బదులు నన్ను తీసుకుని వెళ్ళు" అని రోధించ సాగెను.
అప్పుడు మహా వీరులైన రామలక్ష్మణులు ఆ సీతా దేవి యొక్క ఆక్రందనలు విని ఆ రాక్షసుడిని వేగముగా వధించుటకు సిద్ధపడిరి.
వెంటనే లక్ష్మణుడు భయంకరముగా ఉన్న ఆ రాక్షసుని ఎడమ భుజం ను ఖండించెను. శ్రీరాముడు కుడిభుజము ఖండించెను.
రామలక్ష్మణులు తన చేతులను నరికి వేయగా మేఘ సమానుడైన ఆ నిరాధుడు మిగుల భీతిల్లి ఇంద్రుని వజ్రాయుధం చే నరకబడిన పర్వతం వలె నేలపై పడిపోయెను వారు ఆ రాక్షసుని పిడి కెళ్ళతో మోకాళ్ళతో పొడిచి పొడిచి కాళ్లతో తన్ని తన్ని భూతలమున పిండి పిండి గా చేసిరి
అయినను ఆ నిరాధుడు చనిపోవడం లేదు ఈ విషయం గమనించిన శ్రీ రాముడు
పురుష శ్రేష్ట లక్ష్మణ ! ఈ నిరాధుడు తపస్సు నొనర్చి ఉన్నాడు. వీడికి ఆయుధములతో చావు లేదు కనుక ఇతన్ని గోతిలో పూడ్చి పెట్టి గాలి రాకుండా చంపి వేయడమే మార్గం అని పలికెను.
శ్రీరాముని పలుకులను విన్న ఆ రాక్షసుడు " రాము మీ స్పర్శ వలన నాకు పూర్వజన్మ జ్నప్తికి వచ్చినది. నాయనా ! నాయన నువ్వు కౌసల్యా దేవి ముద్దుల పట్టివి కదా ఈమె మహాసాధ్వి అయినా జానకి దేవి కథ ఇతడు మీ తమ్ముడు లక్ష్మణుడు కదా.
నేను పూర్వ జన్మలో తుంబురుడు అను గంధర్వుని . కుబేరుని శాపం వలన నేను ఈ జన్మ ఎత్తవలసి వచ్చినది ఇప్పుడు మీ స్పర్శజ్ఞానం వలన ఇది తెలిసినది
రంభ అను దేవకన్య తో ప్రేమలో పడటం వలన కుబేరుని కొలువులో సరిగా ఉండలేకపోయాను ఆ మహాత్ముడు నన్ను శపించెను. నేను పశ్చాత్తాపపడి శాప ఉపసంహరణ కోరితిని అందుకు అతడు రామలక్ష్మణుల వలన నీకు శాపం పోతుంది అని సెలవిచ్చెను. నేను నా లోకమునకు వెళుతున్నాను రాను ఇచ్చటికి దగ్గరలోనే సూర్యుని వలె తేజశ్శాలి అయిన శరభంగ మహర్షి ఉన్నాడు ఆయనను సందర్శించుడు
ఆ ముని మీకు మేలు చేయగలడు రామా నేను ఈ బాధ భరించలేక ఉన్నాను మీరు త్వరగా పూడ్చి పెట్టండి. అని ప్రార్థించాడు.
వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద గుంత తీసేను.
తర్వాత ఆ రాక్షసుడిని గుంత లో వేసి పూడ్చి పెట్టెను. ఒక మహా తేజము గోతినుండి వెలుపలికి వచ్చి దివ్యాకారం పొంది " మీ అందరికీ శుభం కలుగుగాక మహర్షిని వేగమే దర్శింపుడు" అని అదృశ్యమయ్యెను
శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండ మూడవ భాగం
=======================
ముందుగా నా మిత్రులందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు
పరాక్రమశాలి ఐన శ్రీ రాములు భయంకరుడైన ఆ నిరాధుడిని సంహరించిన తర్వాత సీతను కౌగలించుకొని వీపు నిమురుతూ , శిరము దువ్వుచు లాలించెను.
అటు తర్వాత లక్ష్మణునితో ఈ దుర్గమారణ్యం చాలా కష్టం లకు నెలవై ఉన్నది. మనం వనవాస జీవనమునకు అలవాటు పడిన వారము కాదు. కనుక శరభంగ మహర్షి దగ్గరకు త్వరగా వెళదాము అని పలికి ఆ మువ్వురు ఆశ్రమమునకు త్వరత్వరగా వెళ్ళిరి.
శ్రీరాముడు శరభంగ ఆశ్రమమునకు చేరి ,దేవతల వంటి ప్రభావం కలవాడు ...
తపస్సు చేత పరిశుద్ధ పరచ బడిన మనస్సు గలవాడు ...
ఆయిన ఆ ముని చెంత ఒక ఆశ్చర్య కరమైన విషయమును గాంచెను.
అచట త్రిలోకాధిపతి యగు దేవేంద్రుని చూచెను. అతడు తేజోవంతమైన శరీరంతో సూర్యుని వలె అగ్ని వలె ప్రకాశించు చుండెను. ఆకాశం మీద ఉన్నటువంటి ఒక రథమును అధిష్టించి ఉండెను. దేవతలు అనుచరులుగా అతని వెంట నుండిరి. చంద్రుని వంటి ప్రకాశము గల వస్త్రములను మరియు తేజోవంతమైన ఆభరణములను ధరించియుండెను. అదే విధముగా నున్న ఎందరో మహాత్ములు అతనిని సేవించుచుండిరి.
ఆ దేవేంద్రునికి దగ్గరగా ఆకాశములో ఆకుపచ్చని గుర్రము లచే కట్టబడిన ఒక దివ్యరథం ను చూచెను.
చిత్ర విచిత్రములైన పుష్పములతో అలంకరించబడిన వింజామరలను ఉత్తములైన ఇద్దరు దేవతాస్త్రీలు ఆయన శిరస్సు పై వీచు చుండిరి.
ఆకాశంలో ఉన్న ఆ దేవేంద్రుని గంధర్వులు దేవతలు సిద్ధులు చాలా మంది ఋషులు వేదమంత్రములతో స్తుతించు చుండిరి.
అక్కడ శరభంగ మహర్షి తో సంభాషణ చేయుచున్న దేవేంద్రుని చూచి రాముడు తన తమ్ముడితో ఇట్లనెను.
పిదప రాముడు ఆ రథమును తన వ్రేలితో నిర్దేశిస్తు ఆశ్చర్యకరమైన విషయం చెప్పిను. లక్ష్మణా ! ఆకాశంలో సూర్యుని వలే ప్రకాశించు చున్న ఆ రథమును చూడడు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ! అనేకులు యజ్ఞము నందు ఆహ్వానించు దేవేంద్రునకు ఏ అశ్వములు ఉన్నవని మనం పూర్వం విన్నామో, అవే అశ్వములను నేడు మనం చూస్తున్నాము సందేహం లేదు.
పురుష శ్రేష్టుడైన లక్ష్మణా! అచటచట ఆకాశం నందు నూరుగురు నూర్గురు చొప్పున గుంపు గుంపు గా ఏర్పడి కుండలములు ధరించిన యువకులు చేతియందు ఖఢ్గములు ధరించి ఉన్నారు. వీరందరూ పెద్దపులి వలే ఎదురింప సఖ్యము కాని వారు. వీరందరూ విశాలమైన వక్షస్థలము లను కలిగి పరిగెలవలే ( కోట గడియల వలె ) పొడవైన బాహువులతో ఎర్రని కిరణముల వంటి వస్త్రములను ధరించి ఉన్నారు.
వీరి వక్షస్థలం లపై అగ్ని వంటి హారము లు ప్రకాశించుచున్నవి. వీరందరూ కూడా కేవలం 25 సంవత్సరాల వయస్సు గల వారి వలె దేహములు కలిగి ఉన్నారు చూచుటకు ఆనందం కలిగించు ఆ పురుష శ్రేష్టులు ఎట్లు కనిపిస్తున్నారో చూడు. సరిగ్గా ఈ వయసే దేవతలకు నిత్యముండును.
లక్ష్మణా ! రథం లో ఉన్న ఆ కాంతి వంతుడు ఎవరో తెలుసుకుని వచ్చెదను నీవు సీతతో క్షణకాలం ఇచట ఉండును. అని పలికి రాముడు ఆశ్రమం వైపు కదిలెను.
రాముడు అటువైపు వచ్చు చుండుట గమనించి దేవేంద్రుడు ఆ మహాముని యొక్క ఆజ్ఞ గైకొని దేవతలతో ఇట్లనెను
" శ్రీరాముడు నన్ను కలుసుకునే ముందు ఆయనకు మీరు కార్యసిద్ధి కలుగజేయుడు. ఆ పిదప మా ఇరువురి కలయిక జరుగును.
ఇతరులు ఎవ్వరూ సాధించ లేని కార్యము ఈయన చేయవలసి ఉన్నది. ఆ కార్యము పూర్తి అయిన పిదప మనమే శ్రీరాముని కలుసుకుందాం. ఇప్పుడు కలుసుకొనుట ఉచితము కాదు. అని పలికి దేవతలతో సహా ఇంద్రుడు ఆ ముని నుండి సెలవు గ్రహించి స్వర్గమునకు వెళ్ళెను.
దేవేంద్రుడు వెళ్ళి పోయిన పిమ్మట రాముడు , సీతా లక్ష్మణులతో కూడి అగ్నిహోత్రము చేయుటకై కూర్చున్న శరభంగ మహర్షి వద్దకు చేరిరి.
రాముడు లక్ష్మణుడు సీత ఆ ముని కి పాద నమస్కారములు చేసి ఆయన అనుజ్ఞ పొంది అచట కూర్చుండిరి.
ఆయన వారిని ఈనాడు అచ్చట నివసింపుడని కోరెను. తదుపరి రాముడు ఆ తేజస్వి తో వినయముగా " ఓ తపో నిధి ! దేవేంద్రుడు ఇచటికి వచ్చుటకు గల కారణ మేమని" అడిగెను.
అప్పుడు ఆ మహర్షి రామ ! వరములిచ్చే ఈ ఇంద్రుడు, బ్రహ్మ లోకమునకు నన్ను తీసుకొని వెళ్ళుటకు వచ్చెను.
ప్రియమైన రామ ! అతిధి వై సమీపమున నీ వచ్చు చుండుట తెలుసుకుని నీ కొరకై ఇచ్చట నిలచి ఉంటిని. తపస్సు చేత నా చే జయించ బడిన బ్రహ్మాది లోకములు, పుణ్య వంతమైన స్వర్గాది లోకములు నీకు ధార పోస్తున్నాను స్వీకరించు అని ఆ మహర్షి తన తపస్సు అంతయు రామునికి ధారపోసెను.
ఈ దండకారణ్యంలో మాకు నివాసయోగ్య మగు స్థానము తెలుపండి అని రాముడు ముని తో పలికెను.
అప్పుడు ఆ ముని ఓ రామా ! మహా తేజస్వి యు ధర్మజ్ఞుడు ధర్మనిరతి అయినా సుతీక్ష్ణ మహర్షి, ఈ సమీపమున గల వనములో నివసించుచున్నారు. ఆ మహానుభావుడు మీకు చక్కగా తోడ్పడగలడు. రమణీయమై ఉన్న ఆ ప్రదేశమున ఒక పవిత్ర స్థానం నందు తపమాచరించు చున్న ఆయన కడ కు వెళ్ళాడు . మీకు సరియగు నివాస స్థానము ఏర్పరచ గలడు.
ఓ రామా ! ఈ మందాకిని నదిలో పుష్పములు తెప్పల వలే తేలియాడు చుండును. తూర్పునకు ప్రవహించుచున్న ఈ నదీ తీరము నందు ఆముని తపస్సు చేయుచున్నాడు . ఇదియే మీరు వెళ్ళవలసిన మార్గం. కానీ రామ ! ఒక క్షణం ఆగుము. నిన్ను దర్శించుటకై నేను ఇంతవరకు ఈ శరీరంతో ఉంటిని . ఇప్పుడు నిన్ను దర్శించి ధన్యుడనైతిని కనుక పాము కుబుసమును విడిచినట్లు గా నేను ఈ శరీరం ను తొలగించడం చూడము అని యజ్ఞం కుండలం లో ప్రవేశించి, అందుండి ఒక బాలుని రూపంలో ఆ మహర్షి బయటకు వచ్చి " రామా మీకు శుభమగుగాక అని ఆశీర్వదించి ఆయన బ్రహ్మలోకమున కు చనెను.
శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండ 4వ భాగం
******************************
శరభంగ మహర్షి దివంగతులైన పిమ్మట ఎందరో తాపసులు మహా తేజస్వి ఐన శ్రీ రాముని కడకు విచ్చేసిరి.
అన్ని రకముల సాంప్రదాయములకు చెందినవారు ధర్మ నిష్ఠా గరిష్టులు అయినటు వంటి తాపసులు రాముని కలిసి కొనుటకు వచ్చిరి
1. వైఖానసులు = బ్రహ్మ దేవుని యొక్క ముఖం నుండి పుట్టిన వారు
2. వాలఖిల్యులు= బ్రహ్మ యొక్క రోమములో నుండి ఉద్భవించిన వారు
3. సంప్రక్షాలురు = బ్రహ్మ యొక్క పాద ప్రక్షాళన నుండి పుట్టిన వారు
4. మరీచిపులు = సూర్య చంద్ర కిరణములను ఆహారంగా స్వీకరించె వారు.
5 అస్మి కుట్టు లు = ధాన్యమును పిండి చేసి భుజించేవారు
6. పత్రహారులు = ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకొనువారు
7. కంఠం వరకు నీటిలో ఉండి తపస్సు చేసేవారు
8. నిరాశ్రయులై నుండి చేతులను తలగడగా చేసుకుని పరుండేవారు
9. కటిక నేలపై ఉండేవారు
ఏ ఆచ్చాదన లేక ఎండకు గాలికి వానకు చలికి సహిస్తూ తపస్సు చేసేవారు
10 జలములను మాత్రమే ఆహారంగా కొనేవారు
11 గాలిని ఆహారంగా తీసుకునేవారు
12 పంచాగ్నుల మధ్య నుండి ఒంటికాలిపై తపస్సు చేసేవారు
13నిరాహారు లు
మొదలైన మహానీయులు కఠిన నియమాలు అవలంబిస్తూ బ్రహ్మ జ్ఞాన తేజో విరాజితులై ఉన్నవారు ఎందరో శ్రీరాముని దర్శించుటకు ఆ ఆశ్రమానికి వచ్చిరి.
ధనుర్ ధారులలో మేటి మరియు పరమ ధర్మ స్వరూపుడైన రామచంద్రుని తో అందరూ ఈ విధంగా విన్నవించారు
" రామా నీ లో అపారమైన పితృభక్తి ఉంది అదియునుగాక ధర్మమును నిర్వహించుట లో నీకు నీవే సాటి . ప్రజల బాధలను రాజు గాక మరి ఎవరు వినగలరు ?!.
అందుకే ప్రభూ ! మీకు మా బాధలను విన్నవించుకొనుట కు వచ్చి తిమి.
రైతులు పండించే ఫలములో 6 వ భాగం రాజు కు చెందుతుంది.
అలాగే ఋషులు చేయు యజ్ఞయాగాదులలో, తపస్సు లో 4వ భాగం రాజు కు చెందుతుంది. ఈ ఫలములను గ్రహించి ఏరాజైతే ప్రజలను కంటికి రెప్పలా గా కాపాడడో,.....
అతడు గొప్ప ఆపదలకు లోనవుతాడు ఇది మా విజ్ఞప్తి గా భావించండి రామచంద్ర ప్రభు.
మీ వంటి పాలకులు ఉండి కూడా ఈ వనం లోని చాలా మంది ఋషులు రాక్షసులు పెట్టే బాధలు భరించలేక అసువులు బాశారు. ఈ వినాశనం ఇంకా ఎన్నాళ్లు జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు. ఇక మేము దీనిని సహించ లేని స్థితికి వచ్చాము . మా యొక్క అశక్తతను మన్నించండి. మీరు వచ్చి ఎన్ని కలేబరాలు పడి వున్నాయో ఒకసారి పరికించండి రామచంద్ర." అని ఆ తాపసులు తమ గోడును విన్నవించుకున్నారు
" బ్రహ్మ జ్ఞానులు తాపసులు మహనీయులు అయినటువంటి మీరు ఇలా విన్నపం చేయకూడదు నన్ను మీరు అజ్ఞాపించాలి.
నా తండ్రి ఆజ్ఞపై మీ కోసమే అన్నట్లు ఈ వనవాసానికి వచ్చాను.
దైవం మా తల్లి కైకమ్మ రూపంలో ఈ విధంగా కరుణించినందుకు నేను దైవానికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.
ఋషులను బాధపెట్టే ఏ ఒక్క రాక్షసుని కూడా వదలని ఈ సమరంలో నా తమ్ముని యొక్క శౌర్యం నా యొక్క దీక్ష మీరు చూచెదరు గాక" అని రామచంద్రుడు ఋషులందరికీ అభయమిచ్చెను.
ఆటు తరువాత సీతారామలక్ష్మణులు ఆ ఋషులతో పాటుగా సుతీక్ష మహాముని ని దర్శించుటకు బయలుదేరిరి.
ఆఋసుల తో పాటుగా మనందరినీ ఆయనపై ఆధారపడి జీవిస్తున్న మనలను ఆ రామచంద్రుడు రక్షించుగాక....
*******
శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండ ఐదవ భాగం
శరభంగ మహాముని ఆజ్ఞమేరకు శ్రీరాముడు మునులతో కూడి సుతీక్ష మహామునిని దర్శించుటకై అనేక విధములైన చెట్లతో దట్టంగా ఉన్న వనం లో ప్రవేశించెను.
భయంకరంగా ఉన్న ఆ అడవి అనేక పుష్పములతో ఫలవృక్షములనతో నిండి పుష్కలంగా ఉన్నది.
వనం లో ప్రవేశించిన రాముడు ఒక ప్రశాంతమైన ప్రదేశం లో గల ఆశ్రమమును చూచెను. దాని చుట్టుపక్కల అక్కడక్కడ నారచీరలు కట్టుట చె అది చాలా అందంగా ఉండెను.
తపస్సె ధనము గా గల సుతీక్ష మహాముని ఆశ్రమములో ప్రశాంతంగా కూర్చుని ధ్యానం లో ఉన్నాడు. యథా శాస్త్ర ముగా శ్రీరాముడు అతనితో( చేతులు కట్టుకుని వినయంతో) సంభాషించెను.
ఆ తపస్వి శరీరంపై మురికి చేత పద్మా కారమైన మచ్చలు ఏర్పడి ఉండెను.
ఓ పూజ్యుడా ! నేను దశరథ పుత్రుడైన శ్రీరాముడిని నిన్ను చూచుటకై వచ్చితిని ధర్మం తెలిసిన స్వచ్ఛ ప్రభావం గల ఓ మహర్షి నాతో మాట్లాడుము.
ధర్మం పోషించుట లో శ్రేష్టుడైన శ్రీ రామ చంద్రుని చూసి ఆ మహర్షి
రామా ! నీ పాదం మోపడం వలన ఈ ఆశ్రమానికి నిజమైన రక్షకుడు లభించినట్లైనది అంటూ ప్రేమ తో రఘువీరుని కౌగిలించు కొనెను. నీ రాకకు పూర్వము దేవేంద్రుడు వచ్చెను ...వచ్చి ఓ ముని నీ తపః ప్రభావం వలన ఎల్లలోకములను జయించితివి. స్వర్గాది బ్రహ్మ లోక పర్యంతం గా గల లోకములు మీ కొరకు వేచి ఉన్నవి దయ చేయుడు అని కోరెను.
మునుల కార్యార్థమై నీవు చిత్రకూట పర్వతం పై ఉన్నావని తెలిసి నీ దర్శనార్ధమై నేను వేచి ఉన్నాను రామ.
నేను ఏది సంపాదించిన అది లోక కళ్యాణం కోసమే. నీ కన్నా కళ్యాణ కరుడు ఎవరు ఉన్నారు. కనుక ఈ పుణ్య ఫలములను ఇస్తున్నాను దయచేసి గ్రహింపుము.
రామా ! ఈ ఆశ్రమం మీకు అన్ని విధాలుగా అనుకూలముగా ఉండును. కందమూలములు పండ్లు తేనెలు పుష్పములు కొల్లలుగా లభించును.
మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే ఇక్కడికి కొన్ని మృగములు వచ్చి పోతూ ఉంటాయి .వాటి వల్ల ఎవరికీ హాని ఉండదు. మీరు మీ వనవాస కాలమును ఇచటనే హాయిగా పూర్తి చేయవచ్చును .
అప్పుడు రాముడు ఆ మహర్షితో ఇట్లనెను " క్రూర మృగములు కాని, కౄర రాక్షసులు కాని మునులకు హాని చేయు వారెవరైనా నా కంట పడినచో నిర్దాక్షిణ్యంగా వధింతును.
నా యీ చర్య దయాస్వభావం కల మీకు ఇబ్బంది కలుగవచ్చు.
కనుక నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకపోవచ్చు మన్నించగలరు. ఇకపోతే ఈ రోజు ఈ ఆశ్రమ నందు మేము విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం మిగతా ఋష్యాశ్రమాలను దర్శించుటకు వెళ్లాలనుకుంటున్నాను. మీరు అనుజ్ఞ ఇవ్వగలరు అని రాముడు పలికిను.
ఆ రాత్రికి సీతా రాముడు లక్ష్మణుడు ఆ ఋషులు ఆశ్రమమున విశ్రాంతి తీసుకుని ప్రాతఃకాలమున ముఖ్య విధులు నిర్వర్తించి సుదీక్ష మహాముని వద్ద సెలవు తీసుకుని మిగతా ముని వాసములను దర్శించుటకై బయలుదేరిరి.
మహనీయుల దర్శనం ఎల్లరకు శుభం చేకూరును. కనుక అప్పుడప్పుడు మనం కూడా మహర్షులను దర్శించి వారి ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉండాలి.
*******
శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండ ఆరవ భాగం
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
అది ప్రభాతవేళ........
కలువ పువ్వుల సువాసనలతో గోరువెచ్చని నీటితో ఆశ్రమ ప్రాంగణంలోని కోనేరు కళకళలాడుతుంది.......
అట్టి నిర్మలమైన జలములలో
కలువ పువ్వుల సువాసనలను ఆఘ్రాణిస్తూ......
సీతారాములు స్నానాదికాలు పూర్తిచేసిరి. ఇదివరకే స్నానం చేసి తమ సేవకే సిద్ధంగా ఉన్నా లక్ష్మణ్ తో పాటు ఆ పుణ్య దంపతులు సుతీక్ష మహామునిని దర్శించుటకై ఆశ్రమంలోనికి వెళ్లిరి.
సుదీక్షనుని సమీపించి ఆయనతో మృదుమధురంగా ఇట్లు నుడివిరి
" మహర్షి ! మీరు నెరిపిన అతిథి సత్కారాల తో మేము ఇచ్చట హాయిగా ఉంటిమి. మా వెంట నున్న మునులు తొందర పెడుతున్నారు.......మా ప్రయాణమునకు అనుమతి ఇవ్వండి. ఆలస్యమైతే అధర్మ మార్గంలో డబ్బు సంపాదించిన వాని ప్రవర్తన వలే........
సూర్యకిరణములు మాపై దాడి చేయును.' అని చిరు మందహాసంతో వినయంగా రాఘవుడు మహర్షితో అనెను.
తన పాదములు అంటి నమస్కరిస్తున్న శ్రీరాముని లేవదీసి గాఢాలింగన చేసుకుని మహర్షి "
ఓ రామా ! నీడవలే నిన్ను వెన్నంటి వస్తున్న ఈ సీతా లక్ష్మణులతో కూడి ఎట్టి ఉపద్రవములు లేని దారిలో సాగిపో....
మహావీర ! తపః ప్రభావంచే నిర్మలమైన అంతకరణ కలిగి దండకారణ్యంలో నివసించువారు ఐన ఈ మునీశ్వరులు యొక్క రమ్యమైన ఆశ్రమములను దర్శించుము .
ఆ దండక వనములో కందమూల ఫలములు కొల్లలుగా లభించును. వృక్షములన్ని వికసించిన పూలతో నిండి యుండును . ప్రసిద్ధములైన మృగముల సమూహములు తిరుగు చుండును.
గుంపులుగుంపులుగా పక్షులన్నీ ఎగురు చుండును. అచటి చెరువులు సెలయేర్లు సరస్సులు బాగా వికసించిన పద్మం లతో స్వచ్ఛమైన జలములతో అంతటా వ్యాపించి ఉన్న కన్నె లేడి పిట్టలతో కనువిందు కలిగించు చుండును.
ఆ వనంలో నెమలుల క్రేంకారములు వీణులవిందుగా వినిపించు చుండును. దర్శనీయమైన ఆ ప్రదేశము లన్నియును చక్కగా వీక్షించండి.
ప్రయాణమును నెమ్మదిగా ఆహ్లాదంగా చేయుడు.
నాయన లక్ష్మణ ! నీవు కూడా వెళ్ళాము నాయనలారా మరల మీరు తప్పక మన ఆశ్రమమునకు రావలెను ' అని ఆ మునీశ్వరుడు ఇట్లు పలుకగా అట్లే అని శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఆ మహర్షికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి ప్రయాణమునకు సన్నద్దుడాయెను.
ఇంతలో విశాలాక్షి అయినా సీతాదేవి చక్కని అమ్ములపొదలను,ధనస్సులను, స్వచ్ఛ ములై మెరుస్తున్న ఖడ్గాలను సీతారామలక్ష్మణులకు తెచ్చి ఇచ్చెను. పిమ్మట ఆ సోదరులు ఇరువురు శ్రేష్టమైన తూనీరములను అలంకారములతో ఒప్పు చున్న ధనస్సు లను ధరించి ప్రయాణమునకై ఆ ఆశ్రమం నుండి బయటికి వచ్చిరి.
శుభ లక్షణాలతో రూప వైభవముల తో విలసిల్లుతూ తమ దివ్య తేజస్సును విరజిమ్ముతున్న రామలక్ష్మణులు ధనస్సులను చేబూని సీతా సహితులై ముందుకు నడవ సాగిరి.
మునుల వెంట సీతారాముల లక్ష్మణుల ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా కొనసాగుతూ ఉంది.
.......
శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండ ఏడవ భాగము శ్రీ సీతా రామ సంవాదము
తన భర్త శ్రీరాముడు సుతీక్ష్ణ మహర్షి యొక్క అనుమతి తో బయలుదేరుట చూచి సీతాదేవి ప్రేమతో యుక్తి యుక్తముగా ఇట్లు వచించెను
" ఆర్య పుత్ర ! ఈ మనిధర్మం మహోన్నతమైనది మిక్కిలి సూక్ష్మమైనది దీనిని ఎరుగుట కష్టం. కామజములైన వ్యసనముల నుండి బయటపడిన వారు మాత్రమే ఈ ధర్మాన్ని అవలంబించుట సాధ్యమగును.
క్షత్రియులకు ముఖ్యంగా మూడు వ్యసనాలు ఉంటాయి ఇవి మీకు తెలియదని కాదు ఒకసారి గుర్తు చేస్తున్నాను అని అనుకో
1 అబద్ధము లాడుట
2 పర స్త్రీ వ్యామోహం
3 హింసాత్మక ప్రవృత్తి కలిగి ఉండుట
ఓ రాఘవ !...
ఇంతకముందు గాని ప్రస్తుతం గాని ఇకమీదట గాని అసత్య వచనం మీరు ఎరుగనిది .
"పరస్త్రీ వాంచ " ధర్మ నిరతు లైన, త్యాగధనులైన మీకు అది అసంభవం.
ఇకపోతే హింసాప్రవృత్తి దీని గురించి కొంత మీకు చెప్పదలుచుకున్నాను.
మీ సవతి తల్లి మరియు మీ తండ్రి దశరథుడు మిమ్మల్ని 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమని ముని ధర్మంలో ఉండి జీవించమని చెప్పారు. దానికి అనుగుణంగానే మీ సోదరులు ఇరువురు జటావల్కములు ధరించినారు. కానీ మీరు ముని ధర్మమునకు విరుద్ధంగా ఆయుధాలను ధరించి వచ్చారు.
ఓ రాజ కుమార ! నీవు పరమ ధార్మికుడవు.... సత్యసంధుడివి. తండ్రి మాటను జవదాటని వాడవు. నీవు ఇంద్రియములను జయించినవాడవని నేనెరుగుదును. ధర్మములను నిర్వహించుట అనునది మీవంటి వారికి మాత్రమే సాధ్యం.
లక్ష్మణాగ్రజ ! ఎల్లప్పుడు సత్య ధర్మములు రెండు కూడా నిన్ను ఆశ్రయించి ఉండును. ఇటువంటి మీరు మనుల సమక్షమున ప్రతిజ్ఞ చేసి ఉన్నారు వారి తపస్సు ను భంగం చేసే రాక్షసులను వధించితీరుతానని.
మీరు చేసిన ప్రతిజ్ఞ నన్ను కొంచెం కలవర పెడుతున్నది.
ఓ వీర ! చేతిలో ఆయుధములు ఉంటే ఎవరైనా ఊరికే ఉంటార?!
నీకు ఒక కథ చెబుతాను విను
పూర్వకాలమున మృగములు పక్షులు హాయిగా జీవించు ఒక పవిత్ర వనమున ఒక tapaswi జీవించుచుండే వాడు.
అతడు సత్య ధనుడు, నిర్మలమైన మనస్సు కలవాడు.
శచీపతి యైన ఇంద్రుడు ఆ ముని తపస్సు ను చెడగొట్టాలని, ఒక భటుని వేశం ధరించి ఒక ఖడ్గం తీసుకుని వచ్చాడు.
ఆముని కి నమస్కరించి మహాత్మా! ఒక పని నిమిత్తమై నేను వేరే దేశం వెళుతున్నాను అంతవరకు దయచేసి ఈ కత్తిని మీ వద్ద ఉంచుకొనుడు అని ఆయనకు దానిని ఇచ్చేసి అతడు వెళ్ళిపోయెను.
ఆ ఖడ్గం ఎవరైనా తీసుకొని వెళ్తారు ఏమో అని అతడు నిరంతరం తన వద్దనే ఉంచుకొనెను.
ఆ ముని తనకు తెలియకుండానే దాని సాంగత్యం వలన దానిని ప్రయోగించడం మొదలు పెట్టాడు.
దీనివలన అతనిలో హింసాప్రవృత్తి మొదలైనది మునులకు ఆటంకపరచు కౄర మృగములను అతడు చంపెను. తర్వాత వాటిని భక్షించడం మెదలు పెట్టెను.
ఈ విధంగా అతడు తన తపస్సు నుండి పతనుడై పోయెను. మన సాంగత్యం వలన మన బుద్ధులు మారిపోతూ ఉంటాయి. మీ చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి వీటితో మీరు ప్రశాంతంగా ఉండగలరా?! ఒకసారి ఆలోచించండి
ఓ సత్య జ్ఞాన సంపన్న...రామా !
ఈ సృష్టి చాలా చిత్రమైనది విభిన్న రీతుల తో ఇది ప్రకాశిస్తూ ఉంది.
చీకటి వెలుగులు సహజంగా ఉన్నట్లు అనేక ద్వంధాలతో ఇది ఉంది.
సన్మార్గులు -దుర్మార్గులు
దేవతలు - దైత్యులు (రాక్షసులు)
సజ్జనులు- దుర్జనులు
భోగులు - విరాగులు
దుష్ట మృగాలు - సాదు జీవులు
ఇలా ఉండడమే సృష్టిధర్మం ఇందులో ఒకటి మాత్రమే ఉండాలి రెండవది ఉండకూడదు అని అనుకోవడంలో పరమార్థం ఏమిటి?.
గోవులు ఉండాలి కానీ వాటిని భక్షించే వ్యాఘ్రములు ఉండకూడదు..
దేవతలు మాత్రమే ఉండాలి దైత్యులు ఉండకూడదు....
శాకాహార జీవులు మాత్రమే ఉండాలి మాంసాహార జీవులు ఉండకూడదు అని మనం అనుకోవచ్చా?!.
ఓ రాఘవా ! మనకు హాని చేయని, మన జోలికి రాని రాక్షసులను చంపుతాను అని నిర్ణయించుకోవడం ఎంతవరకు సమంజసం.
మహర్షుల వద్ద తపోశక్తి ఉంది ఆ తపోశక్తితో రాక్షసులను వారు అంతం చేయగలరు........
కానీ వారి తపః శక్తిని మాత్రం వారు ఉపయోగించరు ......కానీ మీరు మాత్రం ఆ రాక్షసులను సంహరించాలి.
ఈ విధంగా నీవు నీ శత్రువులను పెంచుకుంటూ పోవాలి.
రామా ! ఏదో మనం విధి వశాన ఈ అరణ్యవాసం చేయడానికి వచ్చాము. ప్రశాంతంగా 14 సంవత్సరాలు జీవించి వెళ్ళిపోతాము. మనకు ఈ సమస్యలన్నీ అవసరమా?!
ఓ ధర్మ జ్ఞ ! నీకు తెలియని ధర్మమే లేదు . ఏదో స్త్రీ చాపల్యమున నా అభిప్రాయం నేను మీకు చెప్పాను. ఏమి అనుకోకు ఒకసారి లక్ష్మణ్ తో కూడా విచారించి నిర్ణయం తీసుకోగలరు.
*********
శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము ఎనిమిదవ భాగం శ్రీ సీతారాముల సంవాదము
తన అర్ధాంగి సీతాదేవి చెప్పినదంతా చాలా ఓపిగ్గా విన్నాడు రామచంద్రుడు. ఆ తరువాత రాముడు ఆమెతో ఇట్లనెను మహా జ్ఞాని అగు జనకమహారాజు కూతురా ! ఓ జానకి ! మీ స్థాయికి తగ్గట్లుగా చాలా యుక్తి యుక్తము గా వినడానికి చాలా బాగున్నట్టుగా పలికావు.
మీరు చెప్పింది నిజమే ధర్మము అతి సూక్ష్మమైనది గ్రహించుటకు అంత సులువు కాదు అయినప్పటికీ మనిషి తనకు తెలిసినంత వరకు ధర్మాన్ని అనుసరించక తప్పదు.
మనం ఈ వనవాసానికి కేవలం ముని వృత్తి కోసం వచ్చినట్లు గా చెప్పావు కానీ ఇది తాత్కాలికమే.
కానీ మన సహజ గుణం క్షాత్రము. ఇది స్వధర్మం దీనిని ఎన్నటికీ ఒక క్షత్రియుడు విడువకూడదు.
స్వధర్మం నుండి ఎవరు కూడా విముక్తం కాకూడదు అది అధర్మం అవుతుంది. దానిని ఎవరు సమర్థించిన కూడా వారు అధర్మపరులు అవుతారు. నా తల్లిదండ్రులు నన్ను మునివృత్తి ఆవలంభించు అని అన్నారంటే స్వధర్మాన్ని వదలమని కాదు. అందుకే వనవాసానికి వచ్చేటప్పుడు ధనుర్బాణాలు వెంట తెచ్చుకుంటుంన్నప్పుడు కైకమ్మ వాటిని వద్దని చెప్పలేదు దీనికి అర్థం చేసుకోవాలి.
సామాన్యులకు అయితే ఆయుధాలతో సాంగత్యం ఏర్పడినప్పుడు వారి బుద్ధులు మారిపోవచ్చు కానీ ఒక క్షత్రియుని కి నిరంతరం ఆయుధాలతో సాంగత్యం ఉంటుంది కానీ అతడు వాటిని ధర్మబద్ధంగా ఉపయోగిస్తాడు. ప్రజల క్షేమం కొరకు వారి రక్షణ కొరకు అతడు ఆయుధాలను ధరిస్తాడు.
ఒక యోగి తనలోని చెడు గుణాలను అణచి శుద్ధ గుణాలను పెంపొందించుకున్నట్లు ....
ఒక వైద్యుడు చెడిపోయిన శరీర భాగాలను నిర్దాక్షిణ్యంగా కోసి వేరు చేసినట్లు......
ఒక క్షత్రియుడు దుర్మార్గులను తుంచి సన్మార్గులను నిలబెడతాడు ఇది సమసమాజం కోసం వారి శాంతి జీవనం కోసం ఈ చర్య ప్రతి క్షత్రియుడు తప్పక చేస్తాడు.
ఇకపోతే ఓ సీత ! నిష్కారణ వైరం గురించి చెప్పావు. ఈ గుణము రాక్షసులకు ఉంటుంది కానీ సుక్షత్రీయునకు ఉండదు.
మేము సిగ్గుపడవలసిన విషయం ఏమిటంటే ఓ సీత ! మునులు నోరు తెరిచి అడగక ముందే వారి రక్షణ భారం స్వీకరించవలసి ఉన్నది. కానీ వారు నోరు తెరిచే అడిగారు రా మా మమ్మల్ని కాపాడమని.
రామా ! ఇక్కడ చాలా మంది రాక్షసులు నివాసముంటున్నారు వారు కామరూపులై ఇచ్చటికి వచ్చి విధ్వంసం చేస్తున్నారు. అదేమిటని అడిగితే చంపుతున్నారు వారు నిత్యం మునులను హింసిస్తూనే ఉన్నారు అని చెప్పే దాకా మాకు తెలియదు.
ఈ సాధు జీవులు ఎవరికీ ఏం అన్యాయం చేశారు ?!. ఆ నరమాంస భక్షకులు వీరి మాంసం తింటూ వీరి రక్తం తాగుతూ విచ్చలవిడిగా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా చూస్తూ ఊరుకోమంటావా ?!.
ఈ ఋషుల వల్లనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స కాలానికి వర్షాలు కురుస్తాయి. రోగాలు కీడలు లేకుండా ప్రజలు హాయిగా ఉంటున్నారు .వీరు చేసే తపస్సులో దేశం ఏలే రాజు కు నాలుగో భాగం అందుతుంది. ఈ ఋషి ఋణం తీర్చుకోలేనిది సీత.
వీరు నివసించే భూమి ఏ రాజ్యం లోనిది ?! మన రాజ్యం లోనిది కాదా ?
మన రాజ్యంలో అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటే ఆ అపకీర్తి ఎవరికి వస్తుంది మనకు రాదా?
ఇక్ష్వాకు వంశ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. వీరందరికీ నేను మాట ఇచ్చాను రక్షకుడిగా ఉంటానని ....సత్యమైన నా మాట కోసం నేను దేనినైనా వదులు కుంటాను. మిమ్మల్ని ...చివరికి నా ప్రాణాలను కూడా.
ఈ నిర్ణయంలో ఎప్పుడూ కూడా మార్పు ఉండదు.
అని శ్రీరామచంద్రుడు సీతకు తన నిర్ణయాన్ని తెలిపాడు
********
శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండ 9వ భాగం
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఆ వన ప్రయాణంలో శ్రీరాముడు ముందు భాగము నడుస్తుండగా సౌందర్యవతి అయిన సీతాదేవి ఆయనను అనుసరించి చుండెను ఆ ఇరువురి వెనక లక్ష్మణుడు ధనుస్సు పాణియై నడుచుచుండెను........ ఇలా మనల వెంట సీతారామలక్ష్మణ ప్రయాణం కొనసాగుతోంది.
క్రమముగా వారు వివిధ పర్వత సానువులను.......
వనాలను... కన్నులకు ఇంపైన సుందరంగా ప్రవహిస్తున్న నదులను సువిశాలమైన అందమైన సరస్సులను అందులో విహరించే విహంగ ములైన.......
బెగ్గురు పక్షులను సారస పక్షులను చక్రవాక పక్షులను........ క్రమముగ దర్శిస్తూ చాలా ఉల్లాసంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు
పద్మముల తోడను అందమైన పూల తీగలతో ను.... జల పక్షులతో కళకళలాడే.... చెరువులను వారు దర్శిస్తూ వెళుతున్నారు.
ఆ మార్గమున గుంపులు గుంపులుగా ఉన్న చుక్కల లేల్లను(జింకలు)...... వాడి అయిన కొమ్ములతో మత్తిలి ఉన్న దున్నలను..వరాహములు........
ఘీంకరిస్తూ చెట్లను కూలద్రోసే ఏనుగులను వారు చూచిరి.....
వారు మునులతో కూడి ఇలా కొంత దూరం ప్రయాణించిన పిమ్మట.......
సూర్యుడు అస్తమించు సమయం ఆసన్న మాయను..........
అప్పుడు వారు యోజనము మేర విస్తరించిన సుమనోహరంగా ఉన్న ఒక తటాకము(సరస్సు) ను చూచిరి.
ఆ సరస్సు నందలి ఎర్ర తామర లు నల్లకలువలు నీటిలో సంచరించే డి పక్షులు రాజహంసలు కలహంస లు ఏనుగుల గుంపులు ఇలా అది చూడముచ్చటగా ఉన్నది.
స్వచ్ఛమైన జలములతో మనోహరముగా ఉన్నా ఆ సరస్సు నుండి వీణా వేణూ మృదంగ తాళములతో కూడిన మధురమైన సంగీతం వినిపించు చున్నది.
ఆ వాద్య గోష్ఠి వినిన పిమ్మట మిక్కిలి బలశాలురు అయిన రామలక్ష్మణులు చాలా కుతూహలంతో ధర్మబృతుడను మహర్షిని ఇలా ప్రశ్నించిరి. " ఓ మహా ముని ! అత్యద్భుతమైన ఈ సంగీతమును వినుట వలన మా అందరి లో కుతూహలం ఏర్పడింది. ఒకవేళ ఈ విషయం గోప్యము కానిచో దానిని సవిస్తరంగా మాకు విశదపరచడు"
ఈ విధంగా శ్రీరాముడు అడిగిన పిమ్మట ధర్మబృతుడు అను ఆ మహాముని ఆ సరస్సు యొక్క పుట్టు పూర్వోత్తరాలను ఇలా వివరించెను.
" ఓ రామా ఈ సరస్సు పేరు పంచాప్సరము. అన్ని కాలములలో కూడా ఈ సరస్సులో నీరు ఇంకదు జలసమృద్ధి గా ఉండును.
' మాండకర్ణి' అను మహర్షి ఈ సరస్సును నిర్మించను.ఆ మాండకర్ణి 10 వేల సంవత్సరములు జలమే గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుని తపస్సు చేశాడు. ఈయన తపస్సునకు భయపడి దేవతలు ఇలా అనుకున్నారు ఈ మహనీయుని తపస్సు వలన మనలో ఎవరి పదవి వో ఊడిపోయేటట్లు ఉన్నది . కనుక ఈయనకు భోగాలను పెంచుదాం అని మిరుమిట్లు గొలిపే బహు సుందరమైన ఐదు మంది దేవ కన్నెలను ఆ మహర్షి ని సేవించుటకు పంపిరి.
ఇహపర ధర్మాలు పూర్తిగా తెలిసిన ఆ మహర్షిని వారు సవినయముగా సేవించుచు ఆయనలో కామ వాసనలను మేల్కొల్పి రి.
ఆ మహర్షి తన పరిస్థితిని గమనించి ధర్మబద్ధముగా ఆ ఐదు మంది అప్సరసలను వివాహం చేసుకొనెను.
ఆ మహర్షి తన తపఃశక్తి చే సక్కని యవ్వనం పొంది..... సంకల్ప బలంచే ఈ తటాకము అడుగు భాగంలో గొప్ప దివ్య మందిరం నిర్మించుకుని అందులో కాపురం ఉంటున్నాడు. దివ్య భోగాలను అనుభవిస్తున్నాడు." అని తెలియజేసెను ఈ సంగతులను రామలక్ష్మణులు చాలా కుతూహలంగా వినిరి. సంధ్యా సమయం దాటిపోయింది రాత్రి ప్రవేశించింది సీతారామలక్ష్మణులు మరియు ఆ మహర్షులుఆ తటాకమునకు పరిసర ప్రాంతంలో గల ముని వాటికలో ఆ రాత్రి కి వారు విశ్రమించారు.
ఇలా సీతారామలక్ష్మణులు చిత్ర విచిత్రములైన ముని వాటికలను ఎన్నింటినో దర్శిస్తూ వెళుతున్నారు.
ఒక ఆశ్రమంలో రెండు నెలలు మరియొక ఆశ్రమంలో సంవత్సరము ఇంకొక ఆశ్రమములో వారం రోజులు ఇలా వారు స్వేచ్ఛగా తమ ఇష్టానుసారం 10 సంవత్సరములు గడిపిరి .చివరిగా సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమమునకు చేరిరి.
******
శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండ 10 వ భాగము
శ్రీ సీతా రాములు సుతీక్ష్ణ మహాముని ఆశ్రమంలో నివసిస్తున్నారు .....ఒకరోజు రాముడు సమయం చూసుకుని ఏకాంతంగా సుతీక్ష్ణ మునిని సందర్శించి సవినయముగా ఇట్లు అడిగెను " ఓ మహర్షి ! మహాత్ముడైన అగస్త్యుడు ఈ అరణ్యమందు నివసిస్తున్నారని మునులు చెప్పగా అప్పుడప్పుడు వింటిని . ఈ అరణ్యము అతి విశాలమై ఉండడం వలన ఆ ప్రదేశం ఏదో నాకు తెలియలేదు. దయవుంచి ఆయన ఆశ్రమం ఎక్కడ ఉందో చెప్పగలరని ప్రార్థన. మీరు అనుగ్రహిస్తే నేను సీతా లక్ష్మణ సమేతుడనై ఆయన దర్శనం చేసుకుంటాను. ఆ ముని శ్రేష్ఠుడైన అగస్త్యుని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటానో కదా అనే కోరిక నా మనసులో సుడులు తిరుగుతోంది........... అని శ్రీరాముడు ఆ మహర్షికి చెప్పెను.
ధర్మాత్ముడైన రాముని మాటలు విని సంతసించిన వాడై, సుతీక్ష్ణ మహాముని ఇట్లు పలికెను " నాయనా రామ ! అగస్త్యుని వద్దకు మిమ్మల్ని పంపించాలని అనుకుంటూ ఉండగా దైవవశము చేత ఆ మాటలు నీవే పలికావు. ఇక్కడ నుండి దక్షిణ దిశగా నాలుగు యోజనముల(ఆమడల) దూరం వెళితే ముందుగా అగస్త్య సోదరుని యొక్క ఆశ్రమం వస్తుంది.
https://mallapragadaramakrishna.blogspot.com/2020/11/blog-post.html
పై విధముగా లెక్కకడితే ఒక యోజనం అనగా నాలుగు కోసుల దూరం అనగా పది మైళ్లు
ఒక మైలు అనగా రెండు వేల ఐదు వందల వాకింగ్ స్టెప్స్ ఈ విధముగా నాలుగు యోజనాలు కలిపి 16 క్రోసుల దూరం లేక 40 మైళ్ళ దూరం.
40 ఇంటూ 2,500 అనగా ఒక లక్ష వాకింగ్ ఫీట్స్ అన్నమాట అనగా ఇంత దూరం వారు నడిస్తే గాని అగస్త్యుని సోదరుని ఆశ్రమానికి చేరుకోలేరు అన్నమాట.
ఆ తర్వాత సుతీక్ష్ణ మహాముని చెబుతున్నాడు " రామా ! అగస్త్య సోదరుని ఆశ్రమం మెట్ట ప్రాంతంలో ఉంటుంది అచట దట్టమైన పిప్పిలి వనం( రావిచెట్ల సముదాయం) కనిపిస్తుంది అనేకమైన ఫలపుష్పా ల తో కూడిన వృక్షములు ఉంటాయి. అచట పలు రకాల పక్షులు ధ్వనిచేస్తూ ఉంటాయి. అక్కడి నిర్మలమైన తటాకాల లో మంగళప్రదమైన హంసలు, కారండ పక్షులు, చక్రవాక పక్షులు మొదలైనవి దర్శనీయం గా ఉంటాయి. సువాసనలతో కూడిన పద్మాలతో నిండిన చెరువులు ఉంటాయి ఆ ఆశ్రమములో మీరు రాత్రి విశ్రాంతి తీసుకోండి.
తిరిగి ఉదయం ప్రయాణం మొదలు పెట్టండి
కారండ వనం నుండి దక్షిణ దిశగా మీరు వెళితే ఒక యోజనం దూరంలో ఆగస్త్య భగవానుని ఆశ్రమం ఉంటుంది.
రామా ! మీరు అక్కడికి వెళ్లాలని కోరికగా ఉంటే ఇప్పుడే ఈ క్షణమే బయలుదేరండి లేకపోతే చేరుకోలేరు ఆలస్యం అయిపోతుంది. ఆగస్త్య సోదరుని ఆశ్రమం రాకముందే చీకటి పడుతుంది. కనుక వెంటనే బయలుదేరాడు.
శ్రీరాముడు ఆ మహామునికి ఆనందంతో పాద నమస్కారాలు చేసుకొని , సీతా లక్ష్మణ సమేతుడై బయలుదేరాడు.
ఆ ప్రయాణంలో సీతారామలక్ష్మణులు క్రమముగా రమ్యమైన వనములను, మేఘ సమానమైన పర్వతములను, విశాలమైన సరస్సులను , ఆ మార్గమధ్యంలో ప్రవహిస్తున్న నదులను చూ చు చు ...... సుతీక్ష్ణ మహాముని చెప్పిన మార్గమందు సుఖంగా ప్రయాణం చేస్తుండగా చాలా సంతషించిన వాడై రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను ' ఫల భారము చేత, పుష్ప భారం చేత వంగిపోయిన ఈ వనమున కు సంబంధించి అనేక వృక్షములు మార్గంలో నాకు కనబడుతూ ఉండడం బట్టి ఇది తప్పక ఆగస్త్య సోదరుని ఆశ్రమమై ఉంటుంది.
ఈ వనం నుండి పండిన పిప్పిల్ల వెగటు వాసన హఠాత్తుగా గాలిచే ఎగురగొట్ట బడినదై వచ్చుచున్నది. అక్కడక్కడ ప్రోగుచేసి పెట్టిన కర్రలు కనబడుతున్నాయి.
మార్గ మందు తృంచబడిన వైడూర్య మాణిక్యాల వలే ఆకు పచ్చగా ఉన్న దర్భలు కనబడుచున్నవి. ఆశ్రమములో రగిల్చిన అగ్ని నుండి బయలుదేరిన ధూమముల అగ్ర భాగము ఇదిగో వన మధ్యమము నందు కనబడుచున్నది. ఇది నల్లని మేఘము వలె ఉన్నది కదా !
ద్విజులు పవిత్రమైన తీర్థంలో స్నానం చేసి దైవారాధన కై స్వయంగా కోసిన పుష్పాలను దేవతలకు అర్చన చేస్తున్నారు.
ఓ సౌమ్యుడైన లక్ష్మణ ! సుతీక్ష్ణ మహాముని చెప్పిన ప్రకారం ఇదియే అగస్త్య సోదరుని ఆశ్రమం.
అన్నట్లు లక్ష్మణ అగస్త్యుడు చాలా గొప్పవాడు ఆయన దివ్య కర్మలు చాలా గొప్పవి. ఆ పుణ్యాత్ముడు లోకహితం కోసం తపస్సు చేసి మృత్యు దేవతను ని గ్రహించాడు. ఈ దక్షిణ దిశను మునులకు సురక్షితంగా చేశాడు.
సోదరా ఒకప్పుడు ఈ ప్రాంతం మందు వాతాపి, ఇల్వలుడు అనే రాక్షస సోదరులు ఉండేవారట. వారు నరమాంసభక్షకులు.వారు మాంసమునందు ప్రీతి చేత వేలకొలది ఋషులను, బ్రాహ్మణులను చంపుతూ ఉండేవారు.
ఇల్వలుడు బ్రాహ్మణ వేషం ధరించి మంచి ప్రావీణ్యం తో సంస్కృత భాషలో మాట్లాడుతూ, జాలి లేని వాడై, శ్రాద్ధ కర్మమునందు భోక్తలుగా ద్విజులను ఆహ్వానించే వాడు.
అలా అ ఇల్వలుడు బ్రాహ్మణులను ఆహ్వానించి తన తమ్ముడైన వాతాపిని (అనగా వాడు మేక రూపం ధరించి ఉంటాడు) శ్రాద్ధ భోజనము గా వండి బ్రాహ్మణులకు తినిపించే వాడు. సంతర్పణ పూర్తి అయిన పిమ్మట , బిగ్గరగా ఆ ఇల్వలు డు తన తమ్ముని " ఓ వాతాపి బయటకు నిష్క్రమించుము " అని అరుస్తాడు.
వెంటనే వాతాపి " మే....మే "అని అరుచుకుంటూ బ్రాహ్మణుల యొక్క ఉదరము లను చీల్చుకుని బయటకు వచ్చేవాడు. ఇలా వారు బ్రాహ్మణులను చంపుతూ, వారి మాంసమును భుజించేవారు..
ఆ రాక్షస సోదరులు దేవతలచే కూడా జయింప బడని వారు. దేవతలందరూ కలిసి అగస్త్య భగవానుని వేడుకొనగా ఆగస్త్య భగవానుడు, ఆ వాతాపిని జీర్ణం చేసుకున్నాడు. తర్వాత ఈల్వలుని తీక్షణంగా చూసి భస్మం చేశాడు. ఓ సోదరా ! ఇలా ఆ రాక్షసుల బారినుండి మునులను ఈ భగవానుడు రక్షించినాడు ' అని రామచంద్రుడు లక్ష్మణునితో వివరించినాడు.
బోలో అగస్త్య భగవానునికి జై
శ్రీ రామచంద్ర ప్రభువు నకు జై సీతారామలక్ష్మణులకు జై జైజై
--(())--
వాల్మీకి రామాయణం అరణ్య కాండము పదకొండవ భాగం
(/////////////////////////////////////////)
🌷🙏🙏🙏🌷
ఆ రాత్రి గడచిన పిమ్మట సూర్యుడు ఉదయంచగానే...... శ్రీరాముడు ఆ మహర్షిని వినయం తో సమీపించి ఇట్లు వచించెను " ఓ మహా ముని మీకు మా ప్రణామములు . మీ ఆశ్రమమున ఒక రాత్రి హాయిగా గడిపి తిమి. పూజ్యులైన మీ అన్న గారిని దర్శింప బోవుచున్నాము దయతో అనుమతి ఇవ్వాలని ప్రార్థన. అగస్త్య సోదరుడు అనుమతించిన పిమ్మట శ్రీరాముడు తన వారితో గూడి ఆ ముని తెలిపిన మార్గమును దర్శించుచు ముందుకు సాగిపోయెను.
వారు ఆ వనము నందు విత్తక పెరిగే వరి మొదలగు ధాన్యపు పంటలను,భూరి వృక్షములను, పనస చెట్లను, తాటి చెట్లను,తినాసపు( తిమిశ) చెట్లను, పొగడచెట్లను,తాండ్ర చెట్లలను,కానుగ చెట్లను,చండ్ర చెట్లలను,తిమికి చెట్లను,మారేడు వృక్షాలను,ఇప్పచెట్లను..... వారు చూచిరి.
రాముడు అక్కడ వందలకొలది పుష్పించి ఫలభారంతో ఉన్న చెట్లను చూచెను. పుష్పించిన అగ్ర భాగములు కల లతలు ఆ చెట్లను చుట్టుకుని ఉండెను.వాటిని ఏనుగులు తొండంతో మర్ధించు చుండెను.
వృక్షముల యొక్క అగ్రభాగంలో కోతులు కూర్చుని వుండెను. చెట్లపై కూర్చుని ఉన్న పక్షుల గుంపులు గుంపులుగా ఎగురుతూ శబ్దములు చేయుచుండెను .
అప్పుడు పద్మములవంటి నేత్రములు గల శ్రీరాముడు ,రూప వైభవంతో విలసిల్లుతూ, తన వెనకనే వచ్చు వీరుడైన లక్ష్మణునితో ఇట్లు వచించెను" లక్ష్మణ ! ఇక్కడి చెట్లన్నీ పచ్చని ఆకులతో నిగనిగలాడుతూ ఉన్నవి జంతువులు పక్షులు సామరస్యంతో ప్రశాంతంగా ఉన్నవి, దీనిని బట్టి మహాత్ముడైన అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం సమీపములో ఉన్నదని గ్రహించవచ్చును.
ఏ ఋషీశ్వరుని ఆజ్ఞ చేత వింధ్య పర్వతం పెరుగుట మానివేసినదో..........
ఏ మహనీయుని పేరు చెప్తే రాక్షసులందరూ గజగజ లాడుతారో......
ఏ మహనీయుడు అయితే సముద్రుని ( సప్త సముద్రాలను) పుక్కిట పట్టి ఉండెనో......
అదిగో లక్ష్మణ ఆ మహనీయుడైన అగస్త్య భగవానుని ఆశ్రమం మనకు దర్శనమవుతూ వున్నది.
తన తపః ప్రభావం చేత వింధ్యపర్వతమును స్తంభింప చేసినందున ఆ మహర్షి ఆగస్త్య నామాలతో విఖ్యాతి చెందెను.
ఆయన ఆశ్రమం చేరిన వారియెక్క అందరి శ్రమలు తొలగించబడుతాయి. ఆయన ప్రభావం అంత గొప్పది.
ఆయనను ఆశ్రయించి ఎందరో తమ స్థూల దేహం విడిచి విమానాలపై స్వర్ణంను చేరిరి.
నిత్యం ఆయన దర్శించడానికి సర్వదేవతలు దిక్పాలకులు యక్షులు కిన్నెరులు కింపురుషులు గంధర్వులు సృష్టిలోని గొప్ప గొప్ప వారు ప్రతి ఒక్కరూ ఈయనను దర్శించుకుంటారు.
సర్వలోక పూజ్యుడైన ఈ సత్పురుషుడు అనుక్షణం లోక క్షేమం కొరకు పాటుపడుతుండును.
ఈయన కడకు విచ్చేసిన మనకు శ్రేయస్సును కూర్చి, అన్ని విధములుగా తోడ్పడగలరు.
సర్వ సమర్ధుడవైన ఓ లక్ష్మణా ! మనము అగస్త్య మహామునిని సేవించుచు మిగిలిన వనవాస కాలం ఈ ఆశ్రమము లోనే ఉందాము.
ఈ మహర్షి యొక్క ఆశ్రమంలో అసత్యవాదులకు చోటులేదు ఇచట దేవతలు యక్షులు నాగజాతి వారు గరుడ జాతి వారు పక్షి జాతి వారు ఆహార నియమాలను పాటించుచు ధర్మనిరతిచే నివసించుచుందురు.
ఈ ప్రదేశమున శ్రద్ధగా సేవలాచరించుచు ఆరాధించే వారికి దేవతలు వివిధములగు రాజ్య సంపదలను, యక్షత్వమును, అమరత్వము అనుగ్రహించెదురు.
లక్ష్మణా మనం ఆశ్రమ సమీపంలోకి వచ్చాము. ముందుగా నీవు ఆశ్రమంలోనికి వెళ్లి, నేను బ్రాతసతీసమేతుడనై వచ్చినట్లు తెలిపి..... ఆ మహర్షి యొక్క ఆజ్ఞ గైకొని రమ్ము.
శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు వెంటనే ఆశ్రమంలో ప్రవేశించి ఒక అగస్త్య శిష్యుని సమీపించి ఇట్లు వచించెను " ఓ మహాత్మా దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు ను మిగుల బలశాలి అయిన శ్రీరాముడు తన భార్యయగు సీతాదేవి తో కూడి అగస్త్యమహర్షిని దర్శించుటకై వచ్చాడు. నేను ఆ శ్రీ రామ సేవకుడను మరియు ఆయనకు ప్రియ భక్తుడిని.
అంతట ఆ తపోధనుడు ఆ లక్ష్మణ స్వామి యొక్క పలుకులు విని సరే మంచిది అని చెప్పి, ఈ సమాచారము తమ గురువులకు నివేదించు టకై గృహంలో ప్రవేశించి, అగస్త్యు శిష్యులలో ముఖ్యుడైన ఆ ఋషి అగ్నిగృహమున ప్రవేశించెను.
వెంటనే సాటిలేని తపఃశక్తి గల అగస్త్యమహర్షికి అంజలి ఘటించి అనంతరం అతడు లక్ష్మణుడు తెలిపిన రీతిగా రామ గమన వార్తను ఆయనకు" దశరథ మహారాజు కుమారుడు రామలక్ష్మణులు సీతాదేవితో గూడి మన ఆశ్రమమునకు విచ్చేసి ఉన్నారు శత్రుసంహారకులైన ఇరువురు రాజకుమారులు నిన్ను దర్శించి సేవించుటకై ఇక్కడికి వచ్చి మీ ఆజ్ఞ కై వేచి ఉన్నారు అని తెలిపెను.
రామలక్ష్మణులను మహాసాధ్వి సీతాదేవి తన ఆశ్రమమునకు వచ్చినట్టువిని అతనితో " నా అదృష్టం పండి ఇంత కాలమునకు నేడు శ్రీరాముడు నన్ను చూడగా వచ్చినాడు. నేను నా నిండు మనసుతో ఆయనకై నిరీక్షించున్నాను. వెంటనే సీతాదేవిని లక్ష్మణుని నా కొరకు తీసుకుని రా.
వారిని ఇంతవరకు ఎందుకు ప్రవేశపెట్టలేదు. ధర్మజ్ఞుడు మహాత్ముడు అయినా అగస్త్యముని ఇట్లు వచింపగా.... శిష్యుడు అంజలి ఘటించి అట్లేయని పలికెను. ఆ శిష్యుడు తత్తర పడుచు లక్ష్మణుని చేరి శ్రీరాముల వారు ఎక్కడ ?! అని అడిగెను.
--(())--
శ్రీ వాల్మీకి రామాయణము అరణ్యకాండ 12వ భాగం
శ్రీరామ అగస్త్య సంవాదం
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
🌷🙏🙏🙏🌷
అటు పిమ్మట లక్ష్మణుడు అగస్త్య శిష్యునితో కలసి ఆ శ్రమ ద్వారం వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న రామున్ని, జనక రాజపుత్రి ఆయిన సీతను చూచెను... శిష్యుడు సవినయముగా అగస్త్యుడు చెప్పిన మాటలు రామునికి చెప్పి సత్కారమునకు తగిన రాముని బాగుగా సత్కరించి.... న్యాయాను సారముగా ఆశ్రమంలోనికి ప్రవేశపెట్టెను.
రాముడు ఆ ఆశ్రమము నందు బ్రహ్మ అగ్ని విష్ణువు ఇంద్రుడు వివస్వంతుడు సోముడు కుబేరుడు ధాత విధాత వాయువు నాగరాజు మహాత్ముడైన ఆదిశేషుడు గాయత్రీ వసువులు పాశం హస్తమునందు గల మహాత్ముడైన వరుణుడు కుమారస్వామి యమధర్మరాజు వీరి స్థానంలను చూచు చు వెళ్ళెను.
పిమ్మట అగస్త్య డు శిష్యగణ పరివృతుడై శీఘ్రముగా రామునకు ఎదురుగా వచ్చెను. రాముడు ప్రజ్వలిస్తున్న...ఆ మునుల ముందుట నున్న ఆ మునిని చూచుచు వీరుడైన రాముడు... లక్ష్మిని వృద్ధి పెంపొందించు లక్ష్మణునితో ఇట్లు పలికెను
" లక్ష్మణ ఇదిగో పూజ్యుడైన అగస్త్యమహాముని బయటకు వచ్చు చున్నాడు తేజో విశేషమును బట్టి అతడు తపస్సులకు నిధి అని భావించుచున్నాను" సూర్యుని వంటి తేజస్సుగల మహామునిని గూర్చి లక్ష్మణునితో ఇట్లు పలికి చాలా సంతోషంతో ఆ మహాముని యొక్క పాదములను గ్రహించెను.
అప్పుడు సీతా లక్ష్మణ సమేతుడు.... ధర్మాత్ముడు.... సకల జన మనోభి రాముడు.... రాముడు అగస్త్యునకు అభివాదం చేసి అంజలి ఘటించి నిలిచెను...
అగస్త్యుడు రామునకు ఆసనము ఉదకము సమర్పించి .....
సగౌరవంగా అతనిని కుశల ప్రశ్నలు వేసి కూర్చుండుము అని పలికెను. అగస్త్యుడు అగ్ని హోమములు ముగించుకుని అర్ఘ్యప్రధానాదుల చేత అతిధులను పూజించి....
వారికి వానప్రస్థ ధర్మానుసారముగా భోజనము పెట్టెను .....
ధర్మములు తెలిసిన అగస్త్యుడు తాను ముందు కూర్చుని తన ప్రక్కనే అంజలి ఘటించి కూర్చుని ఉన్న ధర్మ కోవిదుడైన రామునితో ఇట్లు పలికెను " ముందుగా అగ్ని హోమం( వైశ్వదేవము ) చేసి పిమ్మట అతిథులను పూజించవలెను . అట్లు కాక మరొక విధంగా చేసిన ముని పరలోకములో అసత్య సాక్షము చెప్పిన వారికిమలె తన మాంసంను తాను భుజించవలసి వస్తుంది.
రామా నాకు తెలుసు నీవు సకల లోకములకు రాజువు.... ధర్మాచరణశీలుడవు.... మహారథుడవు.... గౌరవింప తగిన వాడవు....
అట్టి నీవు ప్రియ అతిథిగా వచ్చావు. ఈ విధంగా పలికి రామునకు ఫలములు మూలములు పుష్పములు ఇతర వస్తువులు సమర్పించి.... తన కోరిక తీరినట్లుగా... మరల ఇట్లు పలికెను " బంగారం తో అలంకరించిన దివ్యమైన ఈ గొప్ప ధనస్సు ఇది విష్ణుదేవుని. దీనిని విశ్వకర్మ నిర్మించెను.
సూర్యుని వంటి ఉత్తమమైన బాణము ఇది అమోఘమైనది. దీనిని బ్రహ్మ ఇచ్చెను.
మండుచున్న అగ్ని వలె వాడి అయిన బాణములతో నిండిన... ఈ అక్షయ తూణీరము....
బంగారు వరలో వున్న, ఈ సువర్ణ అలంకృతమైన ఖడ్గమును దేవేంద్రుడు నాకు ఇచ్చెను.
రామా ! పూర్వము విష్ణువు ఈ ధనస్సు చేత యుద్ధంలో గొప్ప అసురులను చంపి..... దేవతలకు ప్రకాశించుచున్న (రాజ్యము)లక్ష్మిని తిరిగి సంపాదించిపెట్టెను.
ఆశ్రితులను కాపాడు రా మా ! ఇంద్రుడు వజ్రాయుధమును ధరించినట్లు.... ధనస్సును ఈ అమ్ముల పొదలను... బాణములను... ఖడ్గం ను...విజయ నిమిత్తమై స్వీకరించుము.
మహాతేజ శ్శాలి, పూజ్యుడు అయిన అగస్త్యుడు ఇట్లు పలికి..... శ్రేష్టమైన ఆయుధము లన్నింటిని రామునకు ఇచ్చి.... మరుల ఇట్లు పలికెను
" రామా నేను చాలా సంతోషించు చున్నాను.... నీకు మంగళమగు గాక. లక్ష్మణ సంతోషించు చున్నాను. మీరు ఇద్దరూ సీతా సహితులై నాకు అభివాదము చేయుటకు వచ్చినారు. చాలా దూరం నడుచుటవలన అలసి ఉన్నారు. జనకుని కూతురు నీతో నడచి అలసి పోయి.... విశ్రాంతి కోరు చున్నదని తెలియుచున్నది.
సుకుమారు రాలు... దుఃఖము చేత ఎన్నడు బాధపడని ది అయినా ఈ సీత ...భర్త పై ఉన్న స్నేహాతిశయముచే ఇతరులు ఎవరు చేయలేని కార్యము చేసినది.
స్త్రీల యొక్క సహజ స్వభావం ఏమిటంటే రామా... భర్తను సుఖములలో అనుసరించెదరు కానీ కష్టములలో వారు అనుసరించారు. వదలి వేయుదురు.ఇది వారి సహజ గుణం. ఇది సృష్ట్యాది నుండి జరుగుతున్న తతంగం.
జ్ఞాన మూర్తి అయినా జనకమహారాజు పెంపకంలో పెరిగిన ఈ చిన్నారి.... మిగుల ఉత్తమురాలు.... దోషముల తో నిండిన ఈ వనానికి..... నీ కొరకు వచ్చినది. కనుక ఈమెకు ఎటువంటి బాధలు లేకుండా జాగ్రత్తగా చూసుకో.
తేజ స్వరూపుడైన ఆ మహర్షిని చూచి రాముడు అంజలి ఘటించి మహాత్మ ! మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చేత మేమంతా ధన్యులం అయినాము. నాదొక చిన్న విన్నపం మేము ఈ అరణ్యవాసం పూర్తి చేయడానికి గాను జలసమృద్ధి గల , ఫల సమృద్ధి తో అనువుగా ఉన్నటువంటి ప్రదేశమును సూచించుడు మే మచ్చట ఉండగలము " అని కోరెను.
ఇలా రాముడు కోరగా మహాత్ముడైన ఆ మహర్షి మునుముందు రాముడు చేయగల కార్యములను గ్రహించి నిశ్చయ బుద్ధితో ఈ విధముగా చెప్పెను" నాయన రామచంద్ర నీవు కోరినట్లుగా అనువైన ప్రదేశం ఇచ్చటికి రెండు యోజనముల దూరములో ఉన్నది దానిని పంచవటి అని పిలిచేదరు మీకు అది సౌకర్యంగా ఉండును నీవు సీతా లక్ష్మణ సమేతుడై ఆశ్రమము నిర్మించుకొని తండ్రి ఆజ్ఞానుసారము నీ జీవితం గడుపు.
దశరథమహారాజు నీకు ఆదేశించిన 14 సంవత్సరముల వనవాస కాలంలో చాలా వరకు గడచిపోయినది. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకుని కోసల రాజ్యంను సుఖంగా పాలించ గలవు నిజంగా నీ తండ్రి అయిన దశరథుడు మిగుల ధన్యుడు ఎందుకనగా పూరుడు తన తండ్రి అయినా యయాతిని వలె జ్యేష్ఠ పుత్రుడైన నీవు నీ తండ్రి అయిన దశరథ మహారాజును ఉద్ధరించితివి.
రామ ! నీ తండ్రి అయిన దశరథుడు నాకు మిత్రుడు అవడం వలన, నా తపః ప్రభావం చేత నీ యొక్క ఈ వృత్తాంతం నేను పూర్తిగా ఎరుగుదును. నా తపశ్శక్తి చేత నీ హృదయం యందలి అభిప్రాయం నేను తెలుసు కొంటిని.
నీవు పంచవటిలో ఉండుట యుక్తమని నేను భావిస్తున్నాను. ప్రదేశం మిక్కిలి తగినంతగా ఎంతో మనోహరంగా ఉండును. అక్కడ సీతాదేవి హాయిగా ఉండగలదు.
ఇది ఇక్కడికి ఎంతో దూరంలో కూడా లేదు. గోదావరి నదీ తీరమున ఆ ప్రదేశం కందమూలాలతో, పుష్పఫల సంపన్నమై ఉన్నది.
ఇది వివిధ పక్షులకు ఆలవాలం. చిత్రవిచిత్రమైన ఆ పంచవటి జన సంచారం లేక ప్రశాంతంగా ఉండును మనోజ్ఞమైన ఆ ప్రదేశంలో సీతాదేవి వివరించుటకు మిగుల అనువైనది అని తెలియజేసెను.
సీతారామలక్ష్మణులు ఆ రాత్రికి, ఆ మహర్షి సాన్నిహిత్యంలో విశ్రాంతి తీసుకుని..... మరుసటి ఉదయం ఆ మహర్షి ఆజ్ఞ తీసుకొని వారు పంచవటికి బయలుదేరిరి....
--(())--
శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండ 13 వ భాగము
శ్రీ రామా జటాయువు సమాగమం
(/////////////////////////////////////////)
🌷🙏🙏🙏🌷
రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్నాడు . ఇంతలో చూడగానే భీతిని గొలుపు ఒక భయంకరమైన గ్రద్ద ను వారు చూచిరి . ఆ పక్షిని వారు మారురూపంలో ఉన్న రాక్షసుడు అని గ్రహించి "ఎవరు నీవు " అని ప్రశ్నించిరి.
అందులకు బదులుగా ఆ ఖగము
" నాయనా రామా నన్ను నీ తండ్రి దశరథ మహారాజు యొక్క స్నేహితునిగా ఎరుగుము" అని సుమధురంగా పలికెను.
ఆ మాటలు వినగానే రాముని హృదయమంతా మధుర భావన తో నిండిపోయిను. ఆయన కళ్ళల్లో కన్నీరు తొనికిసలాడెను. అప్పుడు రాముడు ప్రేమతో రెండు చేతులెత్తి ఆ పక్షికి నమస్కరించెను.
అప్పుడు రాముడు " మహాత్మా మీ గురించి తెలుసుకొన గోరుతున్నాను దయచేసి తెలుపుడు" అని పలికెను.
రాముని పలుకులు విని ఆ గ్రద్ధ తన వంశం గూర్చియు, తనను గురించి ప్రసంగ వశమున సకల ప్రాణులు గూర్చి ఆయనకు ఇట్లు వచించెను.
రాఘవా ! విభిన్న రూపాలతో విలసిల్లు ఈ జీవరాశులన్ని కూడా ప్రజాపతుల నుండి ఉత్పన్నమైనవి. అనగా ఈ జీవరాసుల మధ్యన బాంధవ్యము ఉన్నదని గ్రహించము.
పూర్వకాలమునగల ప్రజాపతుల నందరిని గూర్చి ప్రారంభం నుండి తెలిపెదను సావధానంగా వినుము.
1. కర్దముడు
2.విక్రీతుడు
3.శేషుడు
4 సంశ్రయుడు
5 స్థాణువు
6 మరీచి
7 అత్రి
8 మహా బలశాలి అయిన క్రతువు 9 పులస్త్యుడు
10 అంగిరసుడు
11. ప్రచేతసుడు
12 పులహుడు
13 దక్షుడు
14 వివశ్వంతుడు
15 మహా తపశ్శాలి అరిష్టనేమి అనే నామాంతరం గల కశ్యపుడు
ఈ ప్రజాపతు లలో కశ్యపుడు చివరివాడు.
చక్కని పేరు ప్రతిష్ఠలు గల ఓ రామ! దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు 60 మంది . వారు మిగుల విఖ్యాతి కన్నవారు వారిలో 1 అదితి 2 దితి 3 ధనువు 4 కాళిక 5 తామ్ర 6 క్రోధావస 7 మనువు
8 అనల అనూ ఎనిమిది మంది సుందరీ మణులను కశ్యపుడు వివాహమాడెను.
కశ్యపుడు మిగుల సంతోషించిన వాడై తన ఎనిమిది మంది భార్యలతో " నాతో సమానులైన ముల్లోకములను యేల కలిగినట్టి పుత్రులను పొందుదురు గాక " అని పలికెను.
మిగుల బాహుబలము గల పురుషోత్తముడైన రామా! అదితి దితి ధనువు కాలిక అను నలుగురు కశ్యపుని మాటపై మనసు నిలిపిరి. మిగిలిన నలుగురు ఆయన వచనములను పట్టించుకున లేదు. ఈ తేడా వలన సృష్టిలో వివిధమైనటువంటి విపరీత రూపములు గల జీవరాసులు ఏర్పడినవి.
ఓ అరి సూదన ! అదితి యందు ద్వాదశ ఆదిత్యులు , అష్టవసువులు ఏకాదశ రుద్రులు ఇరువురు అశ్వినీదేవతలు ఇలా మొత్తం 33 మంది దేవతలు జన్మించింరి.
నాయనా! రామా ! దితి యందు జన్మించిన వారు దైత్యులు. వారు మిగుల ప్రసిద్ధులు. పూర్వము వనములతోను, పర్వతములతో ను, సముద్రముల తోను సుసంపన్నమైన ఈ వసుంధర పై దేవతలకు , దైత్యులకు సమాన అధికారం ఉండెను.
దనువు నందు పుట్టిన వాడు అశ్వ గ్రీవుడు.
ఇక కాళిక యందు పుట్టిన వారు నరకుడు కాలకుడు .
ఇక కశ్యప ప్రజాపతి మాట వినని మిగతా నలుగురి యందు వివిధ రూపములు గల పిల్లలు పుట్టిరి.
1. తాంమ్ర యుందు క్రౌంచి, భాసి,శుకి,శ్యేని,ద్రతరాష్ఠి, అను ఐదు మంది కుమార్తెలు జన్మించిరి.
వారు లోక ప్రసిద్ధికెక్కిరి.
వారిలో .....
క్రౌంచి గుడ్లగూబలకు,
భాసి నీటి కాకులకు ను,కోల్లకును
శ్యేని చక్కని తేజస్సు గల డేగలకు, గ్రద్ద లకు
జన్మలిచ్చిరి.
ఓ రామ ! సావధానముగా వినుము ధృతరాష్టి యందు
హంసలు కల సంహాలు చక్ర వాకములు జన్మించెను.
శుకి యందు నత....
ఆ నత యందు వినత జన్మించెను.
2. క్రోధవశ యందు....
మృగి.. మృగమంద ...హరి భద్రమద.. మాతంగి... శార్దూలి
శ్వేత ...సురభి... సర్వ శుభలక్షణ సురస..... కద్రువ అను పది మంది జన్మించిరి.
ఓ పురుషోత్తమ ! మృగము లన్నియును మృగి యొక్క సంతానం
మృగ మంద యందు ఎలుగుబంట్లు, సవరపు ముఖములు , చమరీ మృగములు
హరి యందు సింహము లు, మిగుల వేగం గల వానరములు పుట్టెను
భద్రమద యందు ఇరావతి అను సుత కలిగెను.ఈ ఇరావతి సంతానమే గజ యూధములకు ప్రభువైన "ఐరావతం
ఓ రామా ఇక మాతంగి యందు ఏనుగులు జన్మించెను.
శార్ధూలి యందు కొండముచ్చులు పెద్ద పులులు జన్మించెను.
శ్వేత అనునామె దిగ్గజాలకు జన్మనిచ్చిను.
ఓ రామా! శ్రద్ధగావినుము సురభి కి రోహిణి గంధర్వి అనుఇరువురు కుమార్తెలు గలిగిరి .వారు చక్కని పేరు ప్రతిష్టలను సంపాదించిరి.
గోవు లన్నియును రోహిణి యొక్క సంతానం . అశ్వము లన్నియును గంధర్వి యొక్క సంతానం.
సురస యందు నాగులు.....కద్రువ యందు... సర్పము లు జన్మించెను.
3. నాయన రామా ఇక మనువు యందు కశ్యపునికి పుట్టినవారు మానవులు.
4. సీతాపతి రామా ! మధురము లైన వృక్షములన్నియు కశ్యపుని వలన పుట్టిన అనల యొక్క సంతానం
బాగుగా విను దశరధనందన ! మహాత్మ రాలైన నాగమాత సురస యొక్క సోదరి కద్రువ. .. ఈ కద్రువ కుమారుడు ఆదిశేషుడు ఆయన తన వేయి పడగల పై ఈ భూ భారాన్ని మోస్తున్నాడు.
శుకి యొక్క మనమరాలు వినత ఈ వినతకు... అనూరుడు, గరుడుడు అను ఇరువురు పుత్రులు కలిగిరి .నేను మా అన్న అయిన సంపాతి..... ఆ అనూరుని కుమారులము.
నా పేరు జటాయువు.
నా తల్లి పేరు శ్యేని. అనగా నేను శ్యేనిఅనూరుల కుమారుడను.
రామా ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సమస్త జీవ సమూహం మొత్తము బంధుత్వం లతో నిండి ఉన్నది ఎవరు కూడా పరాయి వారు కాదు పక్షి రూపంలో ఉన్న నేను నీ తండ్రికి బంధువై ఉన్నాను.
రామా నీకు ఇష్టమైతే మీకు సహాయకుడ నై సేవ చేసెదను. అను గ్రహించవలసింది గా మనవి.
ఈ విధముగా ఆ జటాయువు పలుకగా.....
ఆనందభాష్పాలతో రాముడు ఆ పక్షిరాజు ను కౌగిలించుకొనెను.
--(())--
మిత్రులందరికీ శుభ శుభోదయం ఇట్లు మీ మిత్రుడు
వాల్మీకి రామాయణము అయోధ్య కాండము మూడో భాగము
"""""""""""""""""""""""""""''"'''''''"'''''''''''''''''"""
తండ్రిని ఆ స్థితిలో చూడగానే రాముడికి పామును తొక్కినట్టుగా భయం కలి గింది. అతను కళవళపడి కైకేయితో, "అమ్మా, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? తండ్రిగారు ఇలా కలవరపడగటానికి కారణమేమిటి? ఆయనను ఇలా ఎన్నడూ చూడలేదు. నాకేమో ఆందోళనగా ఉన్నది," అన్నాడు.కైకేయి కొంచెంకూడా బిడియం లేకుండా, "రాజుగారికి కోపమూ లేదు, తాప మూ లేదు. ఆయనకు ఒక కోరిక ఉన్నది. అది నీకు చెప్పటానికి జంకుతు న్నాడు. ఒకప్పుడీయన గారు నాకు ఒక వర మిస్తానన్నాడు. ఎందుకన్నానా అని ఇప్పుడు చెప్పరాని బాధతో కుళ్ళుతున్నాడు. ధర్మం జరగటం ప్రధానం కద. నీ తండ్రి ఆడినమాట తప్పకుండా చూసేభారం నీ మీద ఉన్నది. మంచో, చెడో ఆయన కోరిక తీర్చుతానని నీవు ముందు నాకు మాట ఇస్తే అసలు సంగతి చెబుతాను. ఆ సంగతి ఆయన నోటంట రాదు, అందుచేత నేనే చెప్పాలి మరి," అన్నది.
"అదేమిటమ్మా? నన్నలా శంకించవచ్చా? నా గురించి నీకు తెలియనిదే మున్నది? నాయనగారు కోరితే నిప్పులో దూకనా? ఆయన కోరిక ఏమితో చెప్పు, తప్పక చేస్తాను. నెను ఆడి తప్పను," అన్నాడు రాముడు. కైక రాముడితో దేవసుర యుద్ధం నాటి విషయాలుచెప్పి, ఆయన ఆ సమ యంలో ఇస్తానన్న వరం ప్రకారం రాముడు పధ్నాలుగేళ్ళు అరణ్యవసానికి పోవలసి ఉంటుందని చెప్పింది.
"ఈ పట్టాభిషేక యత్నం వృథాపోదులే. భరతుడు పట్టాభిషేకం చేసుకుని భుమి నాలుగు చెరగులూ పాలిస్తాడు. నీవు నారబట్టలూ, జడలూ ధరించి పధ్నాలుగేళ్ళూ అరణ్యవాసం వెళ్ళీనట్టయితే నీ తండ్రికి ఆడి తప్పాడన్న అపఖ్యాతి చుట్టుకోకుండ పోతుంది," అన్నదామె.
ఇంత దారుణమైనమాట, ఇంత పరుషంగా చెవిని పడినప్పుడు మరొకడైతే ఎంతో కలవరపడి, మధనపడి, కైకేయి మొహం చూడడానికి కూడా సిగ్గుపడి ఉండును. కాని రాముడటువంటి వికారలేమీ లేకుండా, "అమ్మా, అలాగే కాని, నేను నారబట్టలు కట్టి అరణ్యానికి పోతాను. భరతుడి కోసం వెంటనే కబురు పంపండి. తండ్రి గారి ప్రతిజ్ఞా, నీ కోరికా ఇదే అయినప్పుడు నేను భరతుడికి రాజ్యం ఇవ్వనంటానా? భరతుడికి పట్టంకట్టనిశ్చయించానని తండ్రిగారు నాతో అనకపోవటమే నన్ను బాధిస్తున్నది," అన్నాడు. ఈ మాటలకు కైకేయి సంతో షీంచి, "మరేం లేదులే. ఆయనమాట దక్కిస్తావో, దక్కించవో అనే జంకుచేతనే ఆయన నీతో ఈ సంగతి చెప్పలేదు. నువ్వు మాత్రం జాగుచేయక అడవికి బయలుదేరు. నీవు వెళ్ళెదాకా మీ తండ్రిగారు స్నాన భోజనాదులు చెయ్య డు," అన్నది.
కైకేయి అన్న ఈ మాటలకు దశరథుడు లోలోపల కుమిలిమూర్చపోయాడు. రాముడాయనను మెల్లగా లేవదీసి కూచోబెట్టి కైకేయితో, "అమ్మా, నాకు లోపల నిజంగా రాజ్యకాంక్షా, ధనకాంక్షాలేవు. నే నింకేమైనా చేయవలసినది ఉంటే చెప్పు. నీవు రాజు గారిని కోరిన వరాలు చాలా అల్పమైనవి. నీవు నిజం గా కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నావు," అన్నాడు.
దశరథుడు బావురుమని ఏడ్చి స్పృహతప్పి పడిపోయాడు. రాముడు తండ్రికీ, కైకేయికీ ప్రదక్షిణ నమస్కారంచేసి అంతఃపురం నుంచి బయటికి వచ్చి తన చెలికాళ్ళ కేసిచూసి, పట్టాభిషేక సంబారాలకు ప్రదక్షిణం చేసి బయలుదెరాడు. లక్ష్మణుడు ఆపుకోరాని దుఃఖంతోనూ, ఆగ్రహంతోనూ పెనుగులాడుతూ అన్న ను వెంబడించాడు. రాముడు రధమెక్కలేదు. ఛత్రచామరాలు నిషేధించాడు. సర్వసంగ పరిత్యాగం చేసిన యోగియొక్క మనస్థితి తెచ్చి పెట్టుకుని, ఈ దుర్వార్త చెప్పటానికి కౌసల్య మందిరానికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే దశరథుడి అంతఃపుర స్త్రీలు గొల్లున ఏడవటం వినపడింది.
రామలక్ష్మణులు కౌసల్య నగరుకు వచ్చెసరికి అక్కడ ఎవరికీ జరగ బోయేది తెలియదు. రాముడు మొదటి ప్రాకర ద్వారంనుంచి లోపలికి పోతూంటే, అక్కడ ఉండిన ఒక వృద్దుడూ, మరికొందరూ లేచి నిలబడి విజయధ్వానాలు చేశారు. రెండవ ప్రాకారం వద్ద ఉండే వృద్ధ బ్రాహ్మాణులకు నమస్కరించి, రాముడు మూడో ప్రాకారం చేరాడు. అక్కడి కావలివాళ్ళంతా స్త్రీలు. రామలక్ష్మణులను చూడగానే వారిలో కొందరు కౌసల్యతో రామలక్ష్మణుల రాక చెప్పటానికి పరిగెత్తారు. మిగిలినవాళ్ళు, "మహారాజుకు జయం కలగాలి!" అని అన్నారు.
రాముడు వచ్చేసరికి కౌకల్య అగ్నిలో హొమం చేస్తున్నది. ఆమె రాముడి కెదురు వచ్చి, కౌగలించుకుని, శిరస్సు ముద్దుపెట్టుకుని, "నాయనా, భోజనం చేద్దువుగాని పద!" అన్నది. తల్లికి ఈ విషాదవార్త ఎలా తెలపాలో తెలియక తికమకపడుతూ రాముడు, "అమ్మా, నీకింకా తెలియదులాగుంది. అంతారారుమారై పోయింది. నేను పధ్నాలుగేళ్ళు మునిలాగా, కందమూల ఫలాలు తింటూ దండకారణ్యంలో ఉండబోతున్నాను. నేను కూచునేది సింహాసణం మీద కాదు, దర్భల చాపమీద. నాన్న గారు భరతుడికి పట్టంగట్టబోతున్నారు, " అన్నాడు.
ఈ మాట విని కౌసల్య మొదలు నరికిన అరటి చెట్టులాగా పడిపోయి నేలపై దుఃఖంతో పొర్లింది. రాముడామెను లేవదీసి కూచోబెట్టి దుమ్మాంతా దులిపాడు. కౌసల్య రాముడితో, "నాయనా, నా జన్మకు సుఖంలేదు కాబోలు. నిన్ను కని ఈ బాధ భరించే కన్న గొడ్రాలుగానే ఉండిపోయినట్టయితే, పిల్లలు లేరన్న చింత ఒక్కటే బాధించేది. ఎన్నడూ నేను సుఖపడి ఎరగను; నీవు రాజువైతే సుఖపడదామనుకుంటున్నాను. కావటానికి నేను రాజుగారి పెద్ద భార్యనే కాని, సవతుల చేత పడరాని మాటలన్నీ పడ్డాను. ఏమంటే నా భర్తకు నేనంటే లక్ష్యంలేదు, నాకు స్వాతంత్ర్యమూ లేదు. ఇక నేను కైకేయి పరిచారికలకంటే హీనంగా బతకాలి. నీవు పుట్టిన ఈ పది హేడేళ్ళూ నీ వెప్పుడు రాజువవుతావా అని ఎదురు చూస్తూ వచ్చాను. ఆ ఆశ కూడా పోయింది. నాకు చావు వచ్చినా బాగుండును, కాని అది కావాలన్నప్పుడు రాదు. నాయనా, నేను కూడా నీ వెంటనే అడవులకు వస్తాను," అన్నది.
కౌసల్య మాటలు వింటుం టే లక్ష్మణుడికి ఒక ఆలో చన వచ్చింది. అతడు కౌసల్యతో, "అమ్మా, ఆ కైకేయి మాట విని అన్న అడవికి పోవటం నాకు సవ్యంగా కనపడలేదు. రాజు ముసలివాడు, ఆయన మనసు దుర్బలమైనది. ఆయన అన్యాయమైన పని చెయ్యామంటే కొడుకులమైన మేము చేయాలని ఎక్కడ ఉంది?" అని, రాముడితో, "అన్నా, రాజు నిన్ను అడవికి పొమ్మన్న మాట అందరికీ తెలి యక ముందే మనం మన శౌర్యంతో రాజ్యాన్ని వశపరుచు కుందాం
మన తండ్రి కూడా మనకు పగవాడే అయినాడు. వయోభారం కారణంగా న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నాడు. మా అందరిలోనూ పెద్దవాడవు. ఈ రాజ్యం నీది? రాజు మాత్రం దీన్ని మరొక రికి ఎలా ఇస్తాడు? నీవేమి అపచారం చేశావని నిన్ను అడవులకు పంపుతా డు? నిన్ను అడవులకు పంపేటంత శక్తిమంతుడా ఈ రాజు? ఇదుగో నావిల్లు! నేను యుద్దానికి సిద్దంగా ఉన్నాను," అన్నాడు పట్టరాని ఆవేశంతో. కౌసల్య రాముడితో, "నాయనా, లక్ష్మణుడు చెప్పినట్టు చెయ్యి. అందులో ఎలాంటి తప్పూ లేదు. నీవు నీ తండ్రి మాటే వినాలని ఏమున్నది? నేను తల్లిని కానా ? నీవు అడవుల పాలు కావటానికి నేను ఒప్పను. ఓకవేళ వెళ్ళావో ఉపవాసాలు చేసి ప్రాణాలు విడుస్తాను. ఆ పాపం నీకు చుట్టుకుంటుంది," అన్నది.
రాముడు తల్లితో, "నేను నాన్నగారి మాట అబద్దం చేయలేను, జవదాటలేను. పితృవాక్యం పాలించటానికి ఎందరో ఎన్నెన్నో కార్యాలు చేశారు. కండుడు అనే ముని గోవధ చేశాడు. పరసురాముడు కన్న తల్లినే చంపాడు. మనమూల పురుషుడైన సగరుడి కొడుకులు తండ్రి ఆజ్ఞపై పాతాళానికి పోయి, అరవైవేల మందీ ఒక్క సారిగా మరణించారు. అమ్మా, నేను నిన్ను ధిక్కరించటానికి అరణ్యానికి పోతున్నానా?" అని , లక్ష్మణుడితో, "లక్ష్మణా, నీకు నాపైగల ప్రేమా, నీ పౌరుషమూ నేనెరగనా? అన్నిటికన్నా ధర్మం గొప్పది. దానిని మనం నిలబెట్టాలి. అందుచేత నా బుద్ధిని నను సవరించే నీవు కూడా ఆలోచించు," అన్నాడు గంభీరంగా.
తల్లిని సమాధాన పరచటానికి రాముడు ఎన్నో దర్మాలు చెప్పాడు. కౌసల్య వృద్ధుడైన భర్తను విడిచి తన వెంట రావటం భావ్యం కాదన్నాడు. అతను లక్షమణుడితో కూడా, "ఇది దైవ నిర్ణయం. కాకపోతే, నే నంటే అంత ప్రేమగా ఉండే కైకేయి నన్ను అడవులకు పొమ్మంటుందా? పట్టభిషేకం నిలిచి పోయిందంటే నీ కింత బాధగా ఉన్నదే, పట్టభిషేకం జరుగుతున్నదని తెలిసి ఆమె ఎంత బాధ పడిందో? నేను ఇంతవరకు తండ్రిగారి మనసుగాని, అమె మనసుగాని నొప్పించినట్టు నాకు జ్ఞపకం లేదు. ఇప్పుడాపని చేయలేను," అన్నాడు.
రాముడు తండ్రి అజ్ఞ పాలించటానికి గాను అడవికి వెళ్ళే దృఢనిశ్చయం చేసుకున్నాడని గ్రహించి, కౌసల్య అతని క్షేమం కోసం బ్రాహ్మణులచేత హొమం చేయించి, ఆశీర్వదించి పంపింది.
రాముడు సీతయొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అతనికి సీతను చూడగానే కన్నీరు ఆగలేదు. పట్టాభిషేకం చేసుకునే ఉత్సాహం లేకపోగా, తల వంచి కన్నీరు కార్చుతూ, వెంట ఎవరూ లేకుండావచ్చే భర్తను చూసి సీత కూడా కంపించీంది. ఆమె అతని దిగులుకు కారణమడిగింది. జరిగినదంతా చెప్పి రాముడామెతో, "అనుకున్నవి జరిగి తీరాలని, అనుకోనివి జరగకూడదనీ చెప్పలెముకదా? విధినిర్ణయానుసారం ఏది జరిగినా ధర్మాన్ని వీడకూడదు. నేను అడవుల నుంచి తిరిగి వచ్చేవరకూ నీవు భరతుడి వద్ద ఉండి అతను చెప్పినట్టు నడచుకో . అతని ఎదట నన్నేప్పుడూ పొగడకు. బంధుత్వం తప్పిస్తే, భరతుడు నిన్ను పోషించవలసిన కారణం మరొకటి లేదు. అందుచేత నీవు అతను సంతోషించేట్టు మసలుకో. వృద్దులైన నా తల్లిదండ్రులను కనిపెట్టి ఉండు," అని చెప్పాడు.
ఈ మాటలు విని సీత, ప్రణయంతో కూడిన కోపంతో, "ఇవేం మాటలు?నన్ను తేలికజేసి పరాజకాలాడుతున్నావా? ఆడదానికి భర్తే కదా గతి! నిన్ను వనవా సం వెళ్ళమంటే నన్ను వెళ్ళమన్నట్టు కాదా? నీవు అడవిలో సంచరించటమే జరిగితే, ముళ్ళన్నీ నా కాళ్ళతో తొక్కి నీకు దారి చేస్తూ నేను ముందు నడవ నా? నీ వంటి పరాక్రమవంతుడి వెంట ఉండగా నాకు అరణ్యభయం ఉండబోదు. అడవిలోని వారందరిని కాపాడగల వాడివి నన్ను కాపాడలేక పోవు. అడవిలో నేను, అది కావాలి, ఇది కావాలి అని అడగబోను. నీవు లక్షచెప్పినా సరే నా మనసు మారదు, " అన్నది.
సీత తన వెంట అడవులకు వచ్చి కష్టాలు పడటం రాముడికి కొంచెం కూడా ఇష్టం లేదు. ఆ కష్టాలను వివరించి చెప్పాడు. కాని సీత వాటిని లక్ష్య పెట్టలేదు. "నిన్ను చూసి సాముద్రికవేత్తలు వనవాసయోగం ఉన్నదని చెప్పినట్టే, నన్ను చూసి కూడా జ్యోతిష్కులు నాకు వనవాసయోగం ఉన్నదని చెప్పారు. అందు చేత నేను నీ వెంట అరన్యానికి వచ్చి తీరుతాను," అన్నది. అప్పటికి రాముడు ఆమెను తీసుకుపోవటానికి సమ్మతించలెదు. సీతకు కోపమూ, దుఃఖమూ ముంచుకు వచ్చాయి."అయ్యో, మా నాన్న జనకమహారాజు, ఈ సంగతి తెలిస్తే ఏమనుకుంటాడు? నేనేం తప్పు చేశానని నన్ను విడిచి పెట్టి పోవాలనుకుం టున్నావు? నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు కదా! నేను నిన్ను విడిచిపెట్టి వంశానికి కళంకం తీసుకురావాలా? నీ వున్న చోటే నాకు స్వర్గమని చెప్పానే!" అంటూ భోరున ఏడ్చింది.
రాముడామెను రెండు చేతులా దగ్గిరికి తీసుకుని , సముదాయించి, తన వెంట తీసుకుపోతానని మాట ఇస్తూ, " వనవాసానికి సిద్దంకా! నీవద్ద ఉన్నదంతా దానం చెసెయ్యి. నీ వస్తుసామగ్రి యావత్తూ ముందు పనివాళ్ళ కిచ్చి, మిగిలి నది బ్రహ్మణులకియ్యి. సన్యాసులకు భోజనం పెట్టించు, యాచకులకు దానాలు చేయించూ," అన్నాడు ఎంతో ఆప్యాయంగా . సీత పరమానందంతో వెంటనే ఆ పనులన్నీ సాగించింది.
--(())--
విధేయుడు >>>>> ప్రాంజలి ప్రభ ''''' మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
No comments:
Post a Comment