వాక్ సామర్ధ్యం
🍁🍁🍁🍁
వారధి నిర్మించి రామచంద్ర ప్రభువు వానర సేనతో లంకా నగరం చేరుకున్నారు.
యుద్ధ నీతి ననుసరించి శాంతి కోసం చివరి ప్రయత్నంగా అంగదుడిని రావణుని వద్దకి రాయబారిగా పంపారు.
యుద్ధం నివారించడానికి ప్రయత్నించమన్నారు.
అంగదుడు రావణ సభకి చేరుకున్నాడు.
అంగదుని తండ్రి వాలి రావణుని జయించినవాడు. అతన్ని ఓడించలేక అతనితో స్నేహం చేసుకున్నాడు రావణుడు.
అంతటి బలశాలిని ఒక్క బాణంతో సంహరించాడు రాముడు.
ఈ విషయం రావణుడికి తెలుసు.
తన తండ్రిని చంపిన రాముడి తరఫున దూతగా వచ్చిన అంగదుడిని మానసికంగా దెబ్బ తీయాలనుకొన్నాడు.
‘రావోయ్ అంగదా! నీ తండ్రి వాలి నాకు మంచి మిత్రుడు. ఆయన కుశలమేనా?’ అంటూ పలకరించాడు.
అప్పుడు తన తండ్రి రాముడి చేతిలో హతమయ్యాడని అంగదుడు చెప్పవలసి వస్తుంది.
ఆ తర్వాత అదే రాముడి తరఫున రాయబారానికి వచ్చావా? అంటూ అతనిని పరిహసించ వచ్చు.
ఎంతటి మనో స్థైర్యం కలవా డైనా దీనివల్ల బలహీన పడటం ఖాయం. అప్పుడు తను వచ్చిన పని సరిగా చెయ్యలేడు. ఇదీ రావణుని పన్నాగం.
కానీ రావణుని ప్రశ్నకి అంగదుడి సమాధానం చూడండి....
‘రావణా! ఇప్పుడు నా హిత వచనాలు వినకుంటే నువ్వే వెళ్లి నా తండ్రి క్షేమ సమాచారాలు స్వయంగా తెలుసుకోవచ్చు. ఆ పరిస్థితి రాకూడదనే నీ మంచి కోరి రామునితో శత్రుత్వం పెట్టుకొని చావు కొని తెచ్చుకోవద్దని చెప్పడానికి వచ్చాను’ అన్నాడు.
అతని పన్నాగాన్ని సమర్ధంగా తిప్పి కొట్టడమే కాకుండా అదే సమయంలో తను ఏమి చెప్ప్దదలుచుకోన్నాడో అది కూడా స్పష్టంగా చెప్పాడు అంగదుడు.
అతని ఈ జవాబు విని మనోస్థైర్యం కోల్పోవడం రావణుని వంతయ్యింది.
ఈ రోజు వ్యక్తిత్వ వికాసం కోసం చెప్పే పాఠాల్ని మించిన పాఠాలు మన పురాణాల్లో వున్నాయి.
అవి తెలుసుకుంటే మన విద్యార్ధులతో పోటీ పడటం ప్రపంచంలో ఎవ్వరి వల్లా కాదు.
🍁🍁🍁🍁
[17:33, 06భాగవతం -- 11
భగవంతుని అన్ని అవతారములూ గొప్పవే. అందునా కృష్నావతారము చాలా గొప్ప అవతారము. ’కృష్ణస్తు భగవాన్ స్వయం’ – అందుకే భాగవతమునకు ’జయ’ అని వింతయైన పేరు ఉంది. అందుకని భాగవతం చెబితే –
’నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్!
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్!!’ అంటూ ఉంటారు.
నరనారాయణులు కూడా నారదుని అవతారం తరువాత వచ్చిన అవతార పురుషులు. అందుకని ఈ నరనారాయణావతారములో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమునకంతటికి తపస్సు అంటే ఎలా ఉంటుందో, మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావులు. అటువంటి అవతార సంపత్తి కలిగిన ఈశ్వరుడు ఏ అవతారములో ఉన్నా ధర్మప్రభోదము చేస్తాడు.
’కృష్ణావతారం పరిపూర్ణమయిన అవతారం. అందుకే మనం ’కృష్ణం వందే జగద్గురుమ్’ అంటాము. జగద్గురువయిన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుడిని నమ్ముకున్న వాడికి రక్షన కలగకపోవడం అన్నది ఉండదు. అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానమును పోగొడతాడు. ఈశ్వరుడై మీకష్టాన్ని పోగొడతాడు. తండ్రియై మిమ్మల్ని కాపాడతాడు. తల్లియై మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారం పరిపూర్ణమయిన కృష్ణావతారం. కృష్ణావతారమునకు సంబంధించిన ఒక విశేషమును మీకు చెపుతాను వినండి’ అన్నాడు సూతుడు శౌనకాది మహర్షులతో.
అశ్వత్థామ పరాభవము
పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తరువాత ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇంకా శిబిరములలో అందరు పడుకొని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి నిద్రపోతోంది. కుంతీదేవి నిద్రపోతోంది. కౌరవులు అందరూ మరణించారు. భీముడిచేత తొడలు విరగగొట్టబడిన దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒకచోట కుప్పకూలిపోయి మరణము కోసమని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. దుర్యోధనుని సైన్యమునకు అంతటికీ కలిగిన ఆపద, దుర్యోధనునికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమయిన బాధ, ఆవేశము కలిగాయి. కలిగి చేయరాని పని ఒకటి చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఉపపాండవులను సంహరిస్తానన్నాడు.
ఉపపాండవులు అంటే పాండవులయిన ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులకి ద్రౌపదియందు జన్మించిన కుమారులు. వారు అయిదుగురు. ఆ అయిదుగురు కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ అలిసిపోయి బాగా నిద్దర్లో ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ వారి శిబిరంలో ప్రవేశించాడు. ప్రవేశించి నిద్రపోతున్న ఉపపాండవుల కుత్తుకలు కోసేసి అయిదుగురిని చంపేశాడు. అలా చంపిన పిదప నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ’నీ ప్రాణోత్క్రమము జరిగిపోయే వేళ నీకొక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉపపాండవులను సంహరించాను. ఇప్పుడు ఉపపాండవులకు వంశము లేదు. పాండవుల తరువాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలోమరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల వంశము అంతరించిపోయింది. ఇది నీకు నేను ఇచ్చిన గొప్ప కానుక. ఆ అయిదుగురిని చంపేశాను’ అని చెప్పాడు.
తెల్లవారింది మరణించి ఉన్న కుమారులను ద్రౌపదీదేవి చూసింది. గుండెలు బాదుకొని ఏడుస్తోంది. ఏడుస్తుంటే అవతలివైపు మిగిలిన యోధుడు, ఇటువంటి పనిని చెయ్యగలిగిన వాడెవడో గుర్తుపట్టాడు అర్జునుడు. గుర్తుపట్టి ఒకమాట అన్నాడు – ’నేలమీదపడి పొర్లిగుండెలు బాదుకొని ఉపపాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపదీ! ఏ నీచుడు నీ కడుపున పుట్టిన అయిదుగురి పిల్లల శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుని శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదములముందు ఉంచుతాను. నీకుడికాలితోనో, ఎడమకాలితోనో ఆ శిరస్సును ఒక తన్ను తన్ని నీపగ తీర్చుకో’ అన్నాడు.
పిమ్మట అర్జునుడు కృష్ణభగవానుని సారధిగా పెట్టుకొని అశ్వత్థామని వెంబడించాడు. అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తన ప్రాణోత్క్రమణం అయిపోతుంది. తనను చంపేస్తాడన్న భయంతో పరుగెడుతున్నాడు. ఇలా పరుగెడుతుంటే పోతనగారు ఒక అందమయిన ఉపమానం వేశారు. తన కుమార్తె వెంటపడిన బ్రహ్మదేవుణ్ణి నిగ్రహించడానికి వెనక తరుముకు వస్తున్నట్టి పరమశివుని చేతినుంచి పారిపోతున్న చతుర్ముఖ బ్రహ్మలా పరుగెడుతున్నాడు అన్నారు. ఎందుకు అంటే అశ్వత్థామ బ్రాహ్మణ కుమారుడు. ద్రోణసుతుడు. పరుగెడుతున్న దగ్గరికి అర్జునుని రథం సమీపిస్తోంది. అశ్వత్థామ ఇక పరుగెత్తలేకపోయాడు. వెనకనుంచి అర్జునుని రథం వచ్చేస్తోంది. కృష్ణుడు సారధ్యం చేస్తున్నాడు. ’ఈ రథమే, ఈ సారధ్యమే, ఈ కవ్వడే, ఈ సవ్యసాచే, ఈ కిరీటే, ఈ ధనంజయుడే, పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యమును మట్టుపెట్టాడు. కాబట్టి నన్ను చంపేస్తాడు’ అని ఉపసంహారము తెలియని బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. లోకమంతా చనిపోయినా ఫరవాలేదు – తానుమాత్రం బ్రతికి ఉంటే చాలు అనుకున్నాడు. ఇది బ్రాహ్మణునకు ఉండకూడని బుద్ధి. అది పొగలు గ్రక్కుతూ గొప్ప తేజస్సుతో అర్జునుడి మీదికి వస్తోంది.
అర్జునుడు వెనక్కితిరిగి కృష్ణుడివంక చూశాడు. ’మహానుభావా, ఎవరు సారధ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో, ఏ మహానుభావుడు సంసార సముద్రమునందు పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన దివ్యమయిన నౌకయో, ఎవరి అనుగ్రహం కలగడం చేత మాయ అనబడే అవనిక తొలగిపోతుందో, ఎవరి అనుగ్రహం కలగడం చేత పామరుడయినవాడు కూడా జ్ఞానమును పొంది తిరిగి జన్మఎత్తడో, అటువంటి నీ అనుగ్రహం వల్ల నేను ఇన్నిటిని సాధించగలిగాను. లోకములన్నిటిని నిండిపోయి సంక్షుభితం చేస్తున్న ఈ తేజస్సు ఏమిటో నాకు తెలియజేయవలసింది’ అని అడిగాడు.
అడిగితే అప్పుడు కృష్ణభగవానుడు చెప్పాడు – ’ఉపసంహారము తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. ఇపుడు ఆ బ్రహ్మాస్త్రమును నిగ్రహించడానికి నీవు కూడా బ్రహ్మాస్త్రమునే ప్రయోగించాలి. విడిచిపెట్టు’ అన్నాడు. వెంటనే అర్జునుడు ఆచమనం చేసి అభిమంత్రించి కృష్ణభగవానుడు ఉన్న రథమునకు ప్రదక్షిణం చేసివచ్చి బ్రహ్మాస్త్రమును విడిచిపెట్టాడు. ఇపుడు రెండు బ్రహ్మాస్త్రములు ఒకదానికొకటి ఎదురువచ్చాయి. లోకములన్నీ తల్లడిల్లిపోయాయి. ప్రళయమే వచ్చేసిందనుకొని దేవతలు, ఋషులు పరుగులు తీస్తున్నారు. లోకములో ఉన్న ప్రాణులన్నీ కూడ ఉత్కంఠను పొందాయి. అందరు హడలిపోతున్నారు. లోకములనన్నిటినీ రక్షించే స్వభావం ఉన్న కృష్ణపరమాత్మను ఆ రోజు లోకం ప్రార్థించలేదు. కాని ఆయన అన్నాడు – ’ధూర్తుడయిన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము మీదకి నువ్వు కూడా బ్రహ్మాస్త్రమును ప్రయోగించావు. వానికి ఉపసంహారము తెలియదు. నిష్కారణముగా లోకులు బాధపడకూడదు. రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహారము చేసెయ్యి’ అన్నాడు. రెండు బ్రహ్మాస్త్రములను అర్జునుడు ఉపసంహారం చేసేశాడు.
11/2020] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు - 69 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 7. రక్షణ - అవతరించుటకు కాలధర్మము నిష్పత్తి చెందుటయే కారణము. అపుడు జరుగునవి మూడు కార్యములు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపనము. అవతరించనపుడు కూడ సాధు జనులకు రక్షణ యున్నది. అపుడు దైవము తాత్కాలికముగ జీవులలో ప్రవేశించి, శిష్టరక్షణ చేసి అంతర్జాన మగుచుండును. 🍀
📚. 4. జ్ఞానయోగము - 8 📚
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || 8
“సాధుజనులను పరిరక్షించుటకు, దుష్కృత్యములు చేయువారిని నిర్మూలించుటకు, ధర్మ సంస్థాపనము చేయుటకు ప్రతి యుగమునందు నేనవతరించు చున్నాను" అని భగవానుడు పలికెను.
సాధుజనులనగా సన్మార్గమున నడచు వినయవంతులు. వీరియందు అహింస, ఋజు ప్రవర్తనము, దొంగబుద్ధి లేకుండుట, కాని వాని కాశపడకుండుట, శుచి, శౌచము, సంతోషము, జ్ఞానాసక్తి, ఈశ్వరునికి సమర్పణ చెంది జీవించుట సహజముగ నుండును. అట్టివారు సాధువులు. వారిని భగవంతుడు పరిరక్షించును. పరి అను పదము కారణముగ సర్వకాలముల యందు అని అర్థము. ఇట్టి వారిని అధర్మము హింసించ లేదు.
దండకవనమున గల ఋషులలో అగస్త్యాది ఋషులను అధర్మము తాకలేదు. ఇతర తపస్వి జనులను, మునులను తాకినది. ఇందలి రహస్యమును తెలియవలెను. అగస్త్యాది ఋషులకు పరిరక్షణమున్నది. ఇతరులకు రక్షణము కలుగుచు, కలుగక యుండును.
కారణము వారి యందలి సత్వగుణము యొక్క స్థితి. సత్వగుణము కూడ త్రిగుణములలో నొకటియే. కావున ఆసురీ తత్వమగు రజస్తమస్సులు తాకును. ముముక్షుజనులు సత్యాతీతమగు నిత్య సత్వమందుందురు. అట్టి వారిని రజస్సు, తమస్సులు స్పృశించలేవు. భగవంతుడు పరిరక్షణ చేయును. ఇందు తెలుపబడిన పరిరక్షణ ఎల్లప్పుడు నుండును. ధర్మాధర్మముల పాళ్ళు తప్పినపుడు దానికి కారణమగు దుర్మార్గులను శిక్షించి, సత్వగుణులను కాపాడును.
అవతరించుటకు కాలధర్మము నిష్పత్తి చెందుటయే కారణము. అపుడు జరుగునవి మూడు కార్యములు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపనము. అవతరించనపుడు కూడ సాధు జనులకు రక్షణ యున్నది. అపుడు దైవము తాత్కాలికముగ జీవులలో ప్రవేశించి, శిష్టరక్షణ చేసి అంతర్జాన మగుచుండును.
ఉదాహరణకు సత్పురుషుడొకడు, కర్మవశాత్తు అపాయమునకు గురియై మార్గ మధ్యమున స్పృహతప్పి పడియున్నప్పుడు ఆ మార్గమున బోవు జీవులలో ధర్మము ప్రవేశించి, వానిని గొనిపోయి సురక్షితముగ ఒక వైద్యాలయములో ప్రవేశింప జేయుదురు.
అట్లే దొంగ యొకడు సత్పురుషుని ధనము దొంగిలించుకొని పారిపోవు చున్నప్పుడు పలువురి రూపమున దైవమే దొంగను పట్టి, దండించి, ధనమును సత్పురుషున కిచ్చును. సృష్టి అంతయు వాసుదేవరూపమే గనుక వాసుదేవుడెప్పుడును ఇట్లు జీవులను రక్షించుచునే యుండును. ఇట్టి రక్షణ కవతార మక్కరలేదు.
పై తెలిపిన అపాయములు దుష్టులకు జరిగినచో అట్టి సహాయము లభించదు. పై కారణముగ సత్ప్రవర్తన కలిగియున్న వారికి రక్షణ ఎప్పుడును కలుగును. అవతారము మాత్రము ధర్మగ్లాని కారణముగనే దిగివచ్చునని తెలియవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[17:33, 06/11/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 266 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
62. అధ్యాయము - 17
🌻. సతీ కల్యాణము -1 🌻
నారదుడిట్లు పలికెను -
నీవు రుద్రుని వద్దకు వెళ్లిన తరువాత ఏమి వృత్తాంతము జరిగినది? తండ్రీ! హరుడు స్వయముగా ఏమి చేసినాడు?(1)
బ్రహ్మఇట్లు పలికెను -
తరువాత నేను ప్రసన్నుడనై పరమేశ్వరుడగు శివుని దోడ్కొని వచ్చుటకై, హిమవత్పర్వము నందున్న ఆ మహాదేవుని వద్దకు వెళ్లితిని (2). సృష్టి కర్తనగు నేను వచ్చుచుండుటను గాంచి ఆ వృషభధ్వజుడు తన మనస్సులో సతీ దేవిని పొందే విషయములో అనేక సంశయములకు దావిచ్చెను (3). అపుడు హరుడు ప్రాకృత జనుని వలె లోకపు తీరును పాటించే లీలను చే గొన్నవాడై సతీదేవియందలి ప్రేమతో, నన్ను ఉద్దేశించి ప్రీతిపూర్వకముగా వెంటనే ఇట్లు పలికెను (4).
ఈశ్వరుడిట్లు పలికెను -
దేవతలలో పెద్దవైన ఓ బ్రహ్మా! నా మనస్సు వియోగ దుఃఖముచే బ్రద్దలు కాకముందే చెప్పుము. నీ కుమారుడు సతీ విషయములో ఏమి చేయును?(5).
హే సురజ్యేష్ఠా! ఈ సతీవియోగము తన్మూలకమగు జ్వరము అధికముగా పెరుగుచున్నదై నన్ను చాల హింసించుచున్నది. ఇట్టి దుఃఖము ఇతర ప్రాణులను వీడి నన్ను పట్టుకున్నది (6).
హే బ్రహ్మన్! నేను నిరంతరము సతినే ధ్యానించుచున్నాను. నేనేమి చేయవలయునో చెప్పుము. చేసెదను. నేనామెకు దూరము గాకుండా వెంటనే ఆమెను పొందే విధానమును ఆచరింపుము (7).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ నారదమహర్షీ! ఈ తీరున లోక ప్రవృత్తితో నిండియున్న రుద్రుని మాటను విని నేనా శివుని ఓదార్చుచూ ఇట్లు పలికితిని (8).
హే వృషభధ్వజా! సతి విషయములోనా కుమారుడు చెప్పిన మాటల నాలకింపుము. నీకు సాధ్యము కానిది లేదు. ఈ కార్యము సిద్ధించిన దని నిశ్చయించుము (9).
నా కుమార్తె శివుని కొరకై తనువును దాల్చినది. ఆమెను ఆయనకు సమర్పించవలెను. ఈ కార్యము నాకు అభిష్టము. నీ ఆదేశము చే అది మరింత అభిష్టమగు చున్నది (10).
నా కుమార్తె దీని కొరకై స్వయముగా శంభుని ఆరాధించి యున్నది.ఆ శివుడు కూడా నన్ను సతి కొరకు ప్రార్థించుచున్నాడు. కాన ఆమెను శివునికిచ్చి వివాహమును చేయవలెను (11).
హే బ్రహ్మన్! శంభుడు శుభలగ్నములో సుమహూర్తములో కన్యా భిక్ష కొరకు నా వద్దకు వచ్చు గాక! నేను నా కుమార్తెను ఇచ్చి వివాహమును చేయగలను(12).
హే వృషభధ్వజా!దక్షడు నాతో ఇట్లు పలికినాడు. కాన నీవు శుభముహూర్తములో ఆతని గృహమునకు వెళ్లి ఆమెను తీసుకురమ్ము(13). ఈ నా మాటను విని భక్తవత్సలుడగు రుద్రుడు లోకప్రవృత్తి నాశ్రయించి నవ్వెను. ఓ మహర్షీ! ఆయన నాతో ఇట్లనెను (14).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[17:33, 06/11/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 154 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 28 🌻
197. దురాత్ములు, పాపం చేస్తున్న వాళ్ళు కూడా కొందరు, చిరంజీవులుగా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు పుణ్యం చాలా ఉంటుంది. అది పూర్వపుణ్యం.
198. ఇప్పుడు చేసేదే పాపం, వాడి చిట్టాలో ఉన్న అపరిమితమయిన పుణ్యం క్షయిస్తే తప్ప వాడిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఆ పుణ్యంకూడా పోవాలంటే వాడిచేత ఏదో తక్షణమైన మహాపాపం ఒకటి చేయించాలి.
199. అట్టి పాపం చేసినపుడు పూర్వపుణ్యం వెంటనే ఖర్చయేటటువంటి పాపచిమితన వాడిలో ప్రవేశపెట్టి, వాడిచేత ఏదో పెద్దపాపం చేయించి వాడిపుణ్యం ఖర్చు పెట్టించి, వాడిని చంపించి లోకోపకారం చేస్తారు నారదమహర్షి వంటి కర్మతత్త్వవిదులు.
200. “ఈ లోకంలో మనుష్యుడు జీవితకాలంలో, ఎప్పుడైనా ఒక్కమారైనా ముక్తిని కోరకపోతే, ఆ మునుష్యుడు ప్రతీజన్మలోకూడా ముక్తికి దూరమైపోతూ ఉంటాడు. ‘నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా!’ అని ముక్తికోరకపోతే, అది ఏ నాటికీ లభించదు.
201. ‘నేను పుణ్యాలు చేస్తూనే ఉన్నాను, యజ్ఞాలు చేస్తున్నాను. నాకు ప్రతీజన్మలోనూ ఆయుర్దాయం బాగానే ఉంది. సుఖంగానే ఉన్నాను. నాకు ముక్తెందుకు?’ అని ఎవరైనా అనుకుంటే పొరపాటే.
202. వాడు ఆ ముక్తికి మరింతగా దూరమైపోతూనే ఉంటాడు. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఏ కొంచమైనా కోరిక ఉండితీరాలి. అలా ముక్తియందు కోరికలేనివాళ్ళకు, ఆ కోరికను వాళ్ళ హృదయాల్లో కలుగజేయవలసిన ధర్మం బ్రహ్మణులదే సుమా! ఎప్పుడో వినగవినగా ముక్తియందు వాళ్ళకు కాంక్ష కలుగవచ్చు.
203. అయినా ఆ వెంటనే వాళ్ళు అందుకు ఉద్యుక్తులు కాకపోవచ్చు. ఆ భావనలో ప్రవేశించకపోవచ్చు. ఎప్పుడో ఒక్కక్షణం, అపరిమితమైన దుఃఖం కలిగినప్పుడు, లేదా ఇతరుల దుఃఖాన్ని చూచినప్పుడు, ‘ఈ జన్మకు ముక్తి ముఖ్యంకదా, దానికంటే గొప్పవస్తువు లేదు’ అనే ఒకభావం నువ్వు కలిగించాలి. అది నీ ధర్మం” అని శుకుడికి బోధచేసాడు నారదమహర్షి.
204. తీసుకోవటం అనేది సంసారంలో మోక్షానికి వ్యతిరేకదిశలో వెళ్ళే మార్గం. మోక్షానికి సమీపవర్తి కాదు. ‘సర్వారంభ పరిత్యాగం’ అనేది సులభమైన మాటకాదు. భగవద్గీతలో భగవంతుడు వాడిన మాట అది.
205. సర్వారంగ పరిత్యాగం అంటే, ఏ కార్యక్రమమూ ఆరంభించని సోమరితనం అని అర్థం కాదు. ఫలమందు అనాసక్తి, తానుకర్తగా ఆరంభించనివాడని అర్థం. అట్టివాడు ఉత్కృష్టమైన జ్ఞానస్థితికి వెళతాడు. ఎందుకంటే, నేను చేస్తున్నాననే భావన పుణ్యాన్నో, పాపాన్నో ఇస్తుంది.
206. అందుకే మోక్షేఛ్ఛఉన్నవాడికి, మనస్సులో నిస్సంగుడివై ఉండమని బోధించడమే సరియైనది అని చెప్పాడు నారదుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[17:33, 06/11/2020] +91 98494 71690: 🌹. శివగీత - 108 / The Siva-Gita - 108 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 14
🌻. పంచ కోశో పాసన - 4 🌻
సాతు జ్ఞానేంద్రి యైస్సార్ధం - విజ్ఞాన మయ కోశతః,
ఇహ కర్త్రుత్వాభి మానీస - ఏవతు ణ సంశయః 16
ఇహ ముత్ర గతిస్తస్య - జీవో వ్యావహారికః,
వ్యోమాది సాత్త్వికం శేభ్యో- జాయంతే దింద్రి యాణితు 17
వ్యోమ్న శ్శ్రోత్రం భ్రువో ఘ్రాణం - జలాజ్జి హ్వాధ తేజసః,
చక్షుర్వా యోస్త్వ గుత్పన్నా - తేషాం భౌతిక తాతతః 18
వ్యోమాదీనం సమస్తానాం - సాత్వికాం శేభ్య ఏవతు,
జాయతే బుద్ది మనసీ - బుద్ధి: స్యాన్నిశ్చ యాత్మికా 19
వాక్పాణి పాద పాయూ పస్థాని - కర్మేంద్రి యాణి తు,
వ్యోమాదీ నిరజోం శేభ్యో - వ్యస్తే భ్యస్తాన్య నుక్రమాత్ 20
ఈ లోకమున సర్వ కార్యము లందును నేనే చేయుచున్నాను అను కర్త్రుత్వాభిమానము ఐహిక, సారత్రిక గతులు, సత్కార్మా చరణము మొదలగునవి యన్నియు నా విజ్ఞాన కోశాంతర్గ తతునకే వర్తించును. వీడే జీవుడని వ్యవహరింప బడుచున్నాడు.
పంచ ఆహా భూతంబుల సాత్విక భాగముల నుండి జ్ఞానేంద్రియములు పుట్టు చున్నవి. ఆకాశము నుండి శ్రోత్రేంద్రియము భూమి నుండి జ్ఞానేంద్రియము, జలము నుండి జిహ్వేంద్రియము, తేజస్సు నుండి చక్షరింద్రియము, వాయువు నుండి త్వగింద్రియములు పుట్టుచున్నవి.
పంచ భూతముల నుండి పుట్టినవి కనుకనే పాంచ భౌతికములని పేర్లున్నవి. (వ్యవహరించ నగును)
ఈ పంచ మహా భూతముల యొక్క సాత్విక భాగముల నుండే బుద్ది మనస్సు పుట్టినవి. అందు బుద్ది నిశ్చయాత్మకము. మనస్సు సంశాయాత్మకము, ఇట్టి పంచ మహా భూతములు వ్యస్తము లైన రజోంశముల నుండి వేర్వేరుగా పాణి , పాయువు, ఉపస్థ యను కర్మేంద్రియములు ఉద్భవించినవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 108 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 14
🌻 Panchakoshopasana - 4 🌻
The feeling of ''I'm the one who is the cause of all the karmas of this universe ', Aihika (this world's), Paratrika (of heaven), good deeds etc. everything belongs to the Vijnanakosamayam.
He is being called as Jiva. Jnanendriyas (sense organs) are generated from the Satvika (pure) portions of the panchamahabhutas (five divine elements). Srotrendriyam was generated from sky.
From earth came Jnanendriyam, from water came the Jihvendriyam, from fire came Chakshuendriyam, from Air came twakendriyam. Because these have taken birth from Panchabhutas, they are called as Paanchabhoutikam.
Again from the Satwik nature of these panchabhutas Buddhi (intellect) and manas (mind) have taken birth.
In that the Buddhi is the one which makes teh decisions (nishchayatmakam). Manas is fickle (Sanshayatmakam). from the Rajas quality of the Panchabhutas Pani, Padam, Vayu, Upastha etc. karmendriyas (motor organs) got generated.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
[17:33, 06/11/2020] +91 98494 71690: 🌹 Seeds Of Consciousness - 217 🌹
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
🌻 66. Who has the knowledge 'I am'? Somebody in you knows the knowledge 'I am', 'you are'. Who is it? 🌻
As you stay focused on the 'I am,' the question "Who is watching the 'I am'?" will occur to you. There has to be something in you that knows the 'I am' or that 'you are'.
How come 'you were not' and now 'you are'?
This transition from 'I am not' to 'I am', how did it occur? Was there any volition in it or did it occur spontaneously? Who is it that knows this appearance and disappearance of 'I am'?
🌹 🌹 🌹 🌹 🌹
[17:33, 06/11/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 93 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 15 🌻
393. సృష్టిలో చిన్నదిగాని గొప్పదిగాని ఏమి జరిగినను అది భగవత్సంకల్పము ప్రకారమే జరుగును.
394. సూక్ష్మలోక మందలి నాల్గవ భూమిక యందలి అనంత ప్రాణము, భౌతిక ప్రపంచమందలి అణుశక్తి వంటిది మాత్రముకాదు. సమస్తజీవనాధారమగు శ్వాస సంభందమైన ప్రాణము.
ఈ అనంత ప్రాణశక్తి సమస్త వస్తువులు సజీవములగుటకు కారణాభ్యతమగును. ఈ భూమికయందు మానవస్థితిలోనున్న భగవంతుడు ధూళినుండి సజీవ వస్తువులను సృజించగలడు.
ఈ ప్రాణసతి ఎంత అనంతమై యునప్పటికీ, భగవంతుని అనంతశక్తితో సరికాదు. భగవంతుని అంతాసక్తి ప్రకృతిలో అనంత ప్రాణశక్తిగా రూపాంతరమందిన అనంతశక్తియొక్క పరిమిత లక్షణము.
395. సూక్ష్మలోక మందలి నాల్గవ భూమిక యొక్క చైతన్యము కలిగిన మానవ స్థితిలోనున్న భగవంతుడు అనంత ప్రాణశక్తిభాండారమునకు అధిపతి. మనోమయ ప్రపంచముయొక్క మానసికలక్షణములైన తీవ్ర వాంఛలను, తీవ్ర వికారములను, తీవ్రభావములను తీర్చుకొనుటకు ఉద్యుక్తుడైయుండును. తీవ్రవాంఛలచే దహింపబడుచుండును. తన అధీనమందున్న అనంత ప్రాణశక్తిని ప్రయోగించుటకు కుతూహులుడై యుండును. ఊత్కృష్ట స్థాయిలో మానసికతలము నుండి వాంఛలుదయించు చుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[17:33, 06/11/2020] +91 98494 71690: 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 56 / Sri Vishnu Sahasra Namavali - 56 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷
🌻 56. అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః |
ఆనందోఽనందనోనందః సత్యధర్మా త్రివిక్రమః ‖ 56 ‖ 🌻
చిత్త నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం
🍀 521) అజ: -
పుట్టుకలేనివాడు.
🍀 522) మహార్హ: -
విశేష పూజకు అర్హుడైనవాడు.
🍀 523) స్వాభావ్య: -
నిరంతరము స్వరూపజ్ఞానముతో విరాజిల్లువాడు.
🍀 524) జితమిత్ర: -
శత్రువులను జయించినవాడు.
🍀 525) ప్రమోదన: -
సదా ఆనందమునందుండువాడు.
🍀 526) ఆనంద: -
ఆనందమే తన స్వరూపముగా గలవాడు.
🍀 527) నందన: -
సర్వులకు ఆనందము నొసగువాడు.
🍀 528) నంద: -
విషయ సంబంధమైన సుఖమునకు దూరుడు.
🍀 529) సత్యధర్మా -
సత్య, ధర్మ స్వరూపుడు.
🍀 530) త్రివిక్రమ: -
మూడడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Vishnu Sahasra Namavali - 56 🌹
Name - Meaning
📚 Prasad Bharadwaj
🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷
🌻 56. ajō mahārhaḥ svābhāvyō jitāmitraḥ pramōdanaḥ |
ānandō nandanō nandaḥ satyadharmā trivikramaḥ || 56 || 🌻
🌻 521. Ajaḥ:
'A' means Mahavishnu. So the word means one who is born of Vishnu i.e. Kama Deva.
🌻 522. Mahārhaḥ:
One who is fit for worship.
🌻 523. Svābhāvyaḥ:
Being eternally perfect He is naturally without a beginning.
🌻 524. Jitāmitraḥ:
One who has conquered the inner enemies like attachment, anger, etc. as also external enemies like Ravana, Kumbhakarna etc.
🌻 525. Pramōdanaḥ:
One who is always joyous as He is absorbed in immortal Bliss.
🌻 526. Ānandaḥ:
One whose form is Ananda or Bliss.
🌻 527. Nandanaḥ:
One who gives delight.
🌻 528. Nandaḥ:
One endowed with all perfections.
🌻 529. Satyadharmā:
One whose knowledge and other attributes are true.
🌻 530. Trivikramaḥ:
One whose three strides covered the whole world.
Continues...
🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment