ప్రాంజలి ప్రభ 13--11--2020
*దీపావళి లక్ష్మీ పూజా విధానం.. వ్రత నియమాలు*
*విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీ పక్కనుండటమే అంటారు. భూదేవి కూడా ఆమె మరో అంశమని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మీగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు.
*త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు దేవేరి, భృగుమహర్షి కుమార్తె అయిన లక్ష్మీ దుర్వాసుని శాపంతో క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుందని నమ్ముతారు. ఋగ్వేద కాలంలో అదితి, రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అధర్వణ వేదం ‘సినీవాలి’ అనే దేవతను ‘విష్ణుపత్ని’గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు.
*లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె నిత్యానపాయిని ఎన్నడూ విడివడనిది అని అర్థం. లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు.
*పురాణాలు, ఇతిహాసాలలో లక్ష్మీ దేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే శ్రీమహావిష్ణువునకు లక్ష్మీదేవి తోడుగానే ఉందని, 'నిత్యానపాయిని' లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని కొందరు అంటారు. సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని జగన్మాత ప్రసాదించిందని దేవీ భాగవతంలో పేర్కొన్నారు.
*లక్ష్మీదేవి ఓసారి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది. అనంతరం విష్ణువుతో వివాహం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవిని 'భార్గవి' అని కూడా అంటారు.
*దీపం జ్యోతి పరబ్రహ్మమ్, దీపం సర్వతమోహరమ్, దీపేన సాధ్యతే సర్వమ్, సంధ్యా దీపం నమామ్యహమ్.. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. లోకకంటకుడైన నరకుడు విష్ణువు చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా భూదేవి వరం పొందుతుంది.
*దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. దీపం వెలిగించి ఈ కింది మంత్రంతో పూజ ప్రారంభించాలి.
*ప్రాణ ప్రతిష్ఠ*
*‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
*బెల్లం ముక్కను నివేదన చేస్తూ … ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
*అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి భోగం
జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానస్వస్తి
అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే
రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః
*పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్
బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా
దేవీబాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః
పై మంత్రాన్ని చదువుతూ ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి.
*కలశ స్థాపన*
*వేదిక మధ్యలో ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారం, వెండి, రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో మూడు భాగాలు నీటిని పోయాలి. కలశంలో మామిడి ఆకులను వేయాలి. వేదిక మీద పోసిన ధాన్యంలో తామర పువ్వును గీసి లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్లెంలో కొన్ని నాణేలను ఉంచాలి. తరువాత కలశాన్ని కుంకుమతో అలకరించి ఈ కింది మంత్రాన్ని చదువుకోవాలి.
*‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య’
*లక్ష్మీదేవి ఆధాంగ పూజ.*
చంచలాయై నమః- పాదౌ పూజయామి
చపలాయై నమః- జానునీ పూజయామి
*పీతాంబర ధరాయై నమః -ఊరూ పూజయామి
కమలవాసిన్యై నమః- కటిం పూజయామి
పద్మాలయాయై నమః- నాభిం పూజయామి
మదనమాత్రే నమః- స్తనౌ పుజయామి
లలితాయై నమః -భుజద్వయం పూజయామి
కంబ్కంఠ్యై నమః- కంఠం పూజయామి
సుముఖాయై నమః- ముఖం పూజయామి
శ్రియై నమః ఓష్ఠౌ పుఅజయామి
సునాసికాయై నమః నాసికం పూజయామి
సునేత్రాయై నమః ణెత్రే పూజయామి
రమాయై నమః కర్ణౌ పూజయామి
కమలాలయాయై నమః శిరః పూజయామి
ఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి
* ఈ కింది మంత్రాన్ని పఠిస్తూ దీపం వెలిగించాలి…
*ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ
ఘృతాక్తవర్తి సంయుక్తం అంధరాశి వినాశకం
దీపం దాస్యామి తే దేవి గృహణ ముదితాభవ
శ్రీలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి.
*లక్ష్మీ దేవికి తిలకాధారణ చేసి, విగ్రహం ముందు పూలు, కుంకుమ, పసుపు, గంధం, నైవేద్యం, పండ్లు, కొబ్బరి, మొదలైనవి సమర్పణలు ఉంచాలి. అలాగే బంగారు, వెండి ఆభరణాలు, ముత్యాలు, నాణేలను కూడా సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్దోదక స్నానం చేయాలి. ఆభరణం, ముత్యాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. విగ్రహాన్ని వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టాలి.
*లక్ష్మీదేవి అష్టోత్తరం.. పూలు, అంక్షితలతో పూజ.
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్దాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం పద్మాశన్యే నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః
ఓం ఆదిత్యై నమ:
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమ:
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధసముద్భవాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః
ఓం బుద్ద్యై నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమలాదరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధిన్యే నమః
ఓం సుప్రసన్నయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం దారిద్రనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాగ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం హరిణ్యై నమః
ఓం ధనధాన్యకర్త్యై నమః
ఓం సిద్ద్యై నమః
ఓం స్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై/మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
*అష్టోత్తరం పూర్తయిన తర్వాత కింది మంత్రాన్ని జపిస్తూ కుడివైపునకు మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి.
యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి
శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
*సాష్టాంగ నమస్కారం*
నమస్తే లోకజనని నమస్తే విష్ణు వల్లభే
పాహిమాం భక్తవరదే శ్రీలక్ష్మ్యైతే నమో నమః
శ్రీలక్ష్మీదేవ్యై నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి
*సంధ్యాసమయంలో ఆవు నెయ్యితో దీపాలను ఇంటిముందర వరస క్రమంలో వెలిగించాలి.
: కైవల్యాష్టకం అథవా కేవలాష్టకం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
1) మధురం మధురేభ్యోఽపి మంగలేభ్యోపి మంగలం !
పావనం పావనేభ్యోఽపి హరేర్నామైవ కేవలం !!
2) ఆబ్రహ్మస్తంబ పర్యంతం సర్వం మాయామయం జగత్ !!
సత్యం సత్యం పునః సత్యం హరేర్నామైవ కేవలం !!
3) స గురుః స పితా చాపి సా మాతా బాంధవోఽపి సః !
శిక్షయేచ్చేత్సదా స్మర్తుం హరేర్నామైవ కేవలం !!
4) నిఃశ్ర్వాసే న హి విశ్ర్వాసః కదా రుద్ధో భవిష్యతి !
కీర్తనీయమతో బాల్యాద్ధరేర్నామైవ కేవలం !!
5) హరిః సదా వసేత్తత్ర యత్ర భగవతా జనాః !
గాయంతి భక్తిభావేన హరేర్నామైవ కేవలం !!
6)అహో దుఃఖం మహాదుఃఖం దుఃఖద్ దుఃఖతరం యతః !
కాచార్థం విస్మృతం రత్నం హరేర్నామైవ కేవలం !!
7)దీయతాం దీయతాం కర్ణో నీయతాం నీయతాం వచః !
గీయతాం గీయతాం నిత్యం హరేర్నామైవ కేవలం !!
8) తృణీకృత్య జగత్సర్వం రాజతే సకలోపరి …
🌻. మానసిక గోళము - మనోభువనము - 1 🌻
403. మనో భువనము
ఇది కేవలము భౌతిక, సూక్ష్మగోళముపై స్వతంత్రమైనది. దివ్యత్వము వలన స్వతంత్రముగా పోషింప బడుచున్నది.
404. వ్యక్తిగత మనస్సునకు, సామూహిక మనస్సునకు సార్వభౌమిక (విశ్వ) మనస్సునకు మానసిక గోళము నిలయము.
405. మానసికగోళము భౌతిక, సూక్ష్మగోళములను మొదటి నుండియు అభివ్యాప్తమై యున్నది.
406. మానసిక గోళము బుద్ధికి, ప్రజ్ఞకు, అంతర్దర్శనమునకు, ఆత్మప్రకాశమునకు సంబంధించినది.
407. మానసిక గోళము ఎన్నడును సత్యగోళమును స్పృశించలేదు. సత్యగోళము స్వయంరక్షకము స్వయం పోషకమైనది. శాశ్వతములో "అహం బ్రహ్మాస్మి" యనెడు భగవంతుని స్థితి యందు ఎరుక కలిగియున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[15:53, 07/11/2020] +91 92915 82862: 🕉🌞🌎🌙🌟🚩
Swami Vivekananda's wisdom for daily inspiration -
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి -
In the well-being of one's own nation is one's own well-being.
సమిష్టి కల్యాణాన్ని కాంక్షించడంలో వ్యక్తి స్వకీయ క్షేమమూ ఉంది.
🕉🌞🌎🌙🌟🚩
Inspiring Sayings of Swami Vivekananda / స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక వచనాలు.
What we want are some young men who will renounce everything and sacrifice their lives for the country's sake. We should first form their lives and then some real work can be expected.
తమ సర్వస్వాన్ని త్యాగం చేసి, దేశం కోసం తమ జీవితాలను ఆహుతిచేసే యువకులు కొందరు మనకు కావలసివున్నారు. మొదట మనం వారి జీవితాలను రూపుదిద్దాలి. తరువాత కొంత అసలైన పనిని ఆశించవచ్చు.
🕉🌞🌎🌙🌟🚩
[15:53, 07/11/2020] +91 92915 82862: భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩
వెండితెర మీద ఎన్నోరకమైన పాత్రలు ఎన్నో రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వెండి తెరతో సంబంధము పెట్టుకోరు. సన్నివేశముతో సంబంధము ఉంటుంది. ఈ వెండితెర ఉన్నంతసేపు ఎవరి ఆట అయినా. వెండితెర ఆపేస్తే అన్ని ఆటలు ఆగిపోతాయి. ఈ ఆటలు నవరస భరితముగా ఉంటాయి. ఇవన్నీ కాలము, దేశము, సన్నివేశమును బట్టి కలుగుతూ ఉంటాయి.
వీటిలో మునిగిపోతే ఉక్కిరిబిక్కిరి అయిపోతాము. మునిగి పోకుండా, కొంతభాగము చూసేవాడుగా, గమనించేవాడుగా తయారయితే నీవు యోగిగా తయారవుతావు.
🕉🌞🌎🌙🌟🚩
ఆచార్య సద్భోదన
విశ్వసించదగినది, ఆధారపడదగినది అయిన దానితో మన జీవితాల్ని మమేకం చెయ్యాలి. మహోన్నతమైన మన ఆత్మను దర్శించగలిగితే జీవితంలో ఎప్పటికీ ఘర్షణ ఉండదు. అనంత శక్తితో మనం తాదాత్య్మం చెందగలగాలి. ఉన్నతమైన జ్ఞానం ద్వారా మనంతట మనం స్వేచ్ఛను పొందుతాం. మనలోని బంధనాలు తొలగే కొలదీ ఉన్నత భావాలు వ్య…
[15:53, 07/11/2020] +91 92915 82862: 🧘దేవుడు ఎక్కడ ఉన్నాడు?/ఉంటాడు?💖
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
భారతీయ పురాణాలలో ఒక కథ ఉంది. దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన తరువాత, తనను ఎవరూ ఇబ్బంది పెట్టని విశ్రాంతి స్థలాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు నారదుని ( దేవదూత) ను సలహా కోరాడు. నారదుడు స్వర్గాన్ని సూచించాడు. దేవుడు ఇలా అన్నాడు, "నేను సృష్టించిన మానవులు చాలా తెలివైనవారు, వారు స్వర్గానికి రావడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు." అప్పుడు నారదుడు చంద్రుడిని సూచించాడు. "చంద్రుడు చాలా దగ్గరగా ఉన్నాడు" అని దేవుడు చెప్పాడు, "వారు సులభంగా చంద్రుని వద్దకు వస్తారు."
నిజంగా మంచి ప్రదేశం ఏమిటని నారదుడు మళ్ళీ ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు ప్రతి వ్యక్తి హృదయంలో నివసిస్తానని ప్రకటించాడు మరియు ఆ విధంగా వారు అతనిని ఎప్పటికీ కనుగొనలేరు. నారదుడు ఆశ్చర్యపోయాడు. మనిషి దగ్గరగా ఉంటే, దేవుడు చాలా దగ్గరగా ఉండే ప్రజల హృదయాల్లో ఎందుకు ఉండాలని కోరుకున్నాడు? కానీ ఇక్కడ ఉపాయం ఉంది. ప్రజలు తమలోని దైవం ఉనికిని మరచి పోతారు. భగవంతుడు తమతోనే ఉన్నాడని కూడా వారు మరచి పోతారు, వాటిని, వీటిని చూస్తున్నారు, వారు బయట అతని కోసం వెతుకు తున్నారు. ఒక పువ్వును చూస్తే, వారు ఒక పువ్వును మాత్రమే చూస్తారు కాని దానిలో దేవుని అందం కనిపించదు. ఒక పండును చూస్తే, అది దేవుని పండు అని వారు గ్రహించడంలో విఫలమవుతారు. మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. నిన్ను సృష్టించిన వాడు మీలో దాక్కుని మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు అతని వైపు తిరిగి చూస్తున్నారా? ప్రార్థన మరియు ధ్యానం దేవుని సన్నిధిలో జీవించడానికి మనకు సహాయ పడతాయి.మీ ప్రతి శ్వాసలోనూ, ఊపిరిలోను దేవుని సన్నిధిని అనుభవించండి, అనుభూతిని పొందండి.
🕉🌞🌍🌙🌟🚩
[15:53, 07/11/2020] +91 92915 82862: శ్రీరమణీయం - (703)
🕉🌞🌎🌙🌟🚩
"మౌనమే మన స్వస్థితి అనేది ఏ విధంగా అర్ధం చేసుకోవాలి !?"
మన ద్వారా సర్వకార్యాలు నిర్వర్తించే శక్తే మనసు. ఆ మనసును విషయాలతో నింపటం జీవనం అయితే, ఖాళీ చేసి దాన్ని స్వస్థితికి చేర్చటమే సాధన. కోరిక చేత వ్యక్తం కావటం, క్రొత్త విషయం తెలుసుకునేటప్పుడు ఖాళీగా ఉంచటం మనసు లక్షణాలు. మనలో ఏర్పడిన జ్ఞాపకాలు, ఆలోచనలు, ఊహలు కలిస్తే అది కోరిక అవుతుంది. దాని పర్యవసానంగా ఏదోక గుణంగా మనసు వ్యక్తమవుతుంది. ఆ గుణాలను తీసేస్తే అక్కడ ఉన్నది శుద్ధమనసే. అనేక గుణాలతోవున్న మనసు 'నేనెవరు' అన్న ప్రశ్నతో మౌనం ఆవహిస్తుంది. ఆ మౌనమే మనస్వస్థితి !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం }"
"మనసును ఖాళీచేసే మహామంత్రం -"నేనెవరు" !''- (అధ్యాయం -86)
🕉🌞🌎🌙🌟🚩
[15:53, 07/11/2020] +91 92915 82862: 🌷62-మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
🥀సన్యాసము - యోగము🥀
12. ఈ క్రమమున యోగి కర్మఫలమును విడిచి తనయందు తాను ఉండుటవలన శాంతి పొందుతున్నాడు. వాహనములో ప్రయాణము చేయు వాని పాదములకును చేసిన ప్రయాణంలోని మైళ్ళ దూరమునకు సంబంధమేమి? అట్లుకాక వాహనం ఆగినపుడెల్ల ఆత్రముతో ప్రయాణమును త్వరగా పూర్తి చేయనెంచి దిగి పరిగెత్తుతున్న వానికి పాదములకును మైళ్ళకును సంబంధం ఏర్పడును. అట్లే యోగి కాని వాడు చేయు పనులతో పనులకు సంబంధించిన ఆత్రుత, కార్యభంగమును అంటుకొనును.
13. సర్వకర్మలను మనసుతో సన్యసించి బుద్ధితో యోగము చేయవలెను. అట్టివాడు తన అవయవములు పని చేయుచుండగా తొమ్మిది ద్వారముల పట్టణము అను దేహమున కూర్చుండి చూచుచుండును. అతడు పనులు చేయడు. సరికదా ఇంద్రియములచే చేయించుట లేదు. ఇంద్రియములు అను కూలీలచే చేయించుటకు మనస్సు అను మేస్త్రి ఉన్నాడు కదా! తాను కల్పించుకొని వారిని అవస్థ పెట్టి రొస్టుపడుట ఎందులకు? (తొమ్మిది ద్వారముల పట్టణము అనగా నవరంధ్రములు గల శరీరము.)
14. నేను చూడు! జీవులలో నుండియే నా అస్తిత్వముచే ప్రభావితము చేసి మనోబుద్ధి, ఇంద్రియములచే పనులు చేయించుచున్నాను. ఆజ్ఞాపించుట లేదు గనుక నేను చేయించుటయు లేదు. లాభనష్టములు నావి కావు. దేహమున అవయవములు ఇంద్రియములు, మనసు నందు ఎవరి స్వభావముతో వాడు ప్రవర్తించుచున్నాడు. పుట్టినవాడు గాలి పీల్చక మానునా? ఆకలి ఎరిగినవాడు తినక మానునా? లోపల నున్న నాకేమి?
🕉🌞🌎🌙🌟🚩
[15:53, 07/11/2020] +91 92915 82862: "ఋభుగీత " (170)
🕉🌞🌎🌙🌟🚩
12వ అధ్యాయము [సర్వమూ బ్రహ్మమే ]
ఆధారమైనది తెలియడమే నిజమైన ఆరాధన !!
శరీరానికి వెన్నుపాము ఆధారం. వెన్నుపాము కుండలినికి సంకేతం. కుండలిని ఆదిశేషుడికి సంకేతం. ఆ ఆదిశేషుడిపై విష్ణువు శయనించడమంటే మనకేది ఆధారమో అది ఆయన ఆధీనంలో ఉందని అర్థం. ఆధారమైనది తెలియడమే నిజమైన ఆరాధన అవుతుంది. సద్భావము అంటే సత్-భావము. సత్యం ఎడల ఎరుక (అవగాహన) కలిగి ఉన్న భావం. సత్ అంటేనే ఆధారమైనది గురువు ఎప్పుడూ ఆ సత్- భావంలోనే ఉంటారు. కనుక గురువే బ్రహ్మం. అలాంటి సత్-భావాన్ని అనుసరించే శిష్యుడుకూడా బ్రహ్మమే. అదే శిష్యసద్భావము. అంటే కేవలం భావరహిత స్థితిలో ఉండిపోవడం కాదు. భావాన్ని అర్థంచేసుకొని సత్యం యొక్క ఎరుక కలిగి ఉండటమే శిష్యుడు అనుసరించాల్సిన సద్భావం !
🕉🌞🌎🌙🌟🚩
[15:53, 07/11/2020] +91 92915 82862: 84) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
తమేవైకం విజానీథ హ్యన్యా వాచో విముంచథ ౹ యచ్ఛేద్వఙ్మనసీ ప్రాజ్ఞ ఇత్యాద్యాః శ్రుతయః స్ఫుటాః ౹౹48౹౹
48.ఆత్మను ఒక దానిని మాత్రమే తెలిసికొనుము.ఇతర వాక్కులను పరిత్యజింపుము అని ముండకోపనిషత్తు 2.2.5,వాక్కును మనస్సునందు లయము చేయుము మొదలైనది కఠోపనిషత్తు 3.13,మొదలగు శ్రుతులు స్పష్టముగ ఉద్ఘోషిఃచుచున్నవి.ఇతర వాక్కులనగా అపరావిద్యయని
శ్రీ శంకరులు అభిప్రాయము.
శరీరము పడిపోక పూర్వమే ఈ ఆత్మను తెలిసికొనువాడు సంసార బంధమునుండి విముక్తుడగుచున్నాడు.అట్లు తెలిసికొనలేనిచో అతడు మరల శరీరమును ధరింపవలసివచ్చును.
పునర్జన్మను పొందవలసివచ్చును.
పరమేశ్వరుడైన బ్రహ్మ,బయటకు పోవు స్వభావముగల యింద్రియములను సృష్టించెను అందువలననే మానవుడు అంతరాత్మను చూడక,బైటి విషయములనే చూచుచున్నాడు.
కాని కొంతమంది ధీమంతులు ఆత్మాభిముఖముగా దృష్టిని లోనికి మరలించి యా ప్రత్యగాత్మను దర్శించుచున్నారు.
ఆత్మను ఒక దానిని మాత్రమే తెలిసికొనుము.ఇతరములను
(అపరావిద్య)మనస్సు నందు లయము చేయుము.
ఏ ఆత్మ చేత మనుష్యుడు శబ్ద స్పర్శ రూప రస గంధములను కామాదులను మున్నగు వానిని తేలిసికొను చున్నాడో అట్టి ఆత్మకు ఈ జగత్తులో తెలియనిదేమున్నది?
"ఇదియే అది".
సద్గురువును సమీపించి ఆత్మజ్ఞానము సంపాదించవలెను.ఆ మార్గము పదును గల కత్తి అంచులవలె చాలా నిశితమైనది.
ఆత్మ శబ్ద స్పర్శరూప రసగంధములు లేనిదియు అవ్యయమైనదియు,ఆద్యంతములు లేనిదియు,నిత్యమైనదియు, మహత్తుకు పరమైనదియు అయివున్నది.
అట్టి ఆత్మను తెలిసికొనినవాడు మృత్యుముఖము నుండి పూర్తిగ విడువడును.
🕉🌞🌏🌙🌟🚩
[15:53, 07/11/2020] +91 92915 82862: 84) కఠోపనిషత్తు
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
ఆ అక్షర స్థితి తెలిసినటువంటి వారు. వారు క్షర పురుష స్థితికి పడిపోయినటువంటి మన లాంటి కలియుగ పురుషులు కాదు. ఈ కలియుగంలో శరీరం నేననేటటువంటి అభిమానబలం బలపడి పోవటం వలన, తాదాత్మ్యతా బలం బలపడిపోవటం వలన, కేవలం శరీర భావం మాత్రమే మిగిలి వుండటం వలన, క్షర పురుష స్థితికి దిగజారి పోయినటువంటి బౌద్ధిక మనస్తత్వము ఉండటం చేత వీళ్ళు క్రమానుగతిలో క్రింద నుండి పైకి తెలుసుకోవలసినటువంటి అగత్యం ఏర్పడి అక్షర పురుష స్థితికి ఎదగడానికి నానా తంటాలు పడుతువున్నారు. బ్రహ్మనిష్టులవడానికి, బ్రహ్మఙానం పొందడానికి జీవితకాలం సరిపోవడం లేదు.
కానీ సృష్టి యొక్క ఆరంభ దశ కాలంలో ప్రతి ఒక్కరూ బ్రహ్మ జ్ఞానం తో ఉండటం చేత, వారి లక్ష్యం పరమాత్మే అయి ఉన్నది. కాబట్టి వేదములుద్భవించినటువంటి కాలంలో, అందరూ కూడ బ్రహ్మజ్ఞానులే. అందువలన వారి యొక్క లక్ష్యం ఏమిటంటే పరమాత్మ. వారి లక్ష్యం ఏమిటంటే బయలు.
వారి లక్ష్యం ఏమిటంటే తత్ స్థితి. ఆ రకంగా వాళ్ళు ఎవరైతే నిర్ణయాత్మకంగా, పరమాత్మ స్థితిని లక్ష్యించినటువంటి వారు వున్నారో, జన్మరాహిత్య స్థితిని సాధించినటువంటి వారు వున్నారో. అందుకనే తత్త్వశాస్త్రములన్నీ కూడ పరబ్రహ్మ నిర్ణయాన్ని, తదుపరి జన్మ రాహిత్యాన్ని లక్ష్యించే విధానాన్నే బోధిస్తూఉన్నాయి.
ఉపనిషత్తులుగాని, లేదా వేదాంత విద్య గాని, బ్రహ్మ సూత్రాలు గాని ఇవన్నీ కూడ బ్రహ్మనిష్ఠని బలపరచి, అక్కణ్ణించి పరిణామము చెందేటటువంటి, చిట్టచివరి దివ్య యానాన్ని అందించేటటువంటి మార్గ దర్శక సూత్రాలుగా మనకు అందించారు.
అందువలనే ఈ హిరణ్మయకోశము, ఈ హిరణ్య గర్భస్థితి దివ్య యానమునకు ఆధార భూతమైనటువంటి స్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పక హిరణ్య గర్భస్థితిని అందుకోవలసిన అవసరం ఉన్నది సాధకులందరికి కూడా. ఋషులైపోతారు అన్నమాట..
ఎవరైతే ఈ హిరణ్యగర్భస్థితిని తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడ బ్రహ్మనిష్ఠులై మహర్షులౌతారు. ఎందువల్లంటే ఈ హిరణ్మయకోశమే సర్వసృష్టికి ఆధారభూతమైనటువంటి స్థితి.
ఇక్కణ్ణుండి ఏం చెబుతున్నారు?- యజ్ఞంలో అంటే ఋత్త్విక్కులు యజ్ఞం చేసేటప్పుడు అరణిని మధిస్తారు. అంటే మన అగ్గిపుల్లల అగ్గిపెట్టె ద్వారా వచ్చినటువంటి అగ్ని పనికి రాదు అన్నమాట.
అది స్వాభావికమైనటువంటి సృష్టిలో అగ్ని ఎలా అయితే సాధ్యమై ఉన్నదో, దానిని స్వీకరించాలి అనేటటువంటి నియమం ఉందన్నమాట. అందువలన అరణిని మధిస్తూ ఉంటారు.
ఎక్కడైనా యజ్ఞం చేసే చోట మొట్టమొదట అంకురారోహణ తరువాత అక్కడ అరణిని మధిస్తూ ఉంటారు. అరణి అంటే అర్ధం ఏమిటంటే రావి, జువ్వి అనేటటువంటి కఱ్ఱలుంటాయి. ఈ రావి, జువ్వి అనే కర్రలు ఒకదానిపై ఒకటి పెట్టి, వాటిని పైన పెట్టి, మధిస్తారన్నమాట.
ఆ పైనించి ఒక కఱ్ఱ ఉంటుంది, క్రింద ఒక కఱ్ఱ లో ఒక రంధ్రం లాంటిది ఉంటుంది. దాంట్లో, వడ్రంగి బర్మా తిప్పినట్లుగా, అది బాగా బలవత్తరంగా తిప్పుతారు.
ఆ రాపిడి వలన ఈ కఱ్ఱ కఱ్ఱ రాపిడి వలన, రెండు కఱ్ఱలలో కూడ ఆంతర్భూతమై ఉన్నటువంటి అగ్ని ఉత్పన్నమౌతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి అగ్నిని జాగ్రత్తగా ఆ దూది ద్వారా మండించి, ఆ దూది ద్వారా మండినటువంటి అగ్ని ని ఇతరితర హవ్య ద్రవ్యాలను మండింపచేసి, అట్టి అగ్నిని తీసుకు వచ్చి, యజ్ఞాన్ని ప్రారంభిస్తారు.
🕉🌞🌏🌙🌟🚩
[15:53, 07/11/2020] +91 92915 82862: అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
రేకు: 22-5
సంపుటము: 5-125
రేకు రాగము: ఆహిరి
గానం. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు
రాగం. మోహన.
మూసిన ముత్యానకేలే మొరగులు |
ఆశల చిత్తాలకేలే అలవోకలు ||
కందులేని మోముకేలే కస్తూరి |
చిందు నీ కొప్పున కేలే చేమంతులు |
మందయానమున కేలే మట్టెల మోతలు |
గంధమేలే పై కమ్మని నీమేనికి ||
ముద్దుల మాటల కేలే ముదములు నీ |
అద్దపు చెక్కుల కేలే అరవిరి |
వొద్దిక కూటమి కేలే వూర్పులు నీకు |
అద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి ||
🕉🌞🌎🌙🌟🚩
భావము:-
ఒక చెలి అలమేలుమంగ ను ఆటపట్టిస్తూ అంటున్నది..
అలమేలుమంగా ! ఇప్పటిదాకా పెట్టెలో మూసిన తళుకు తగ్గని ముత్యాలు నువ్వు ధరించావన్న విషయం నాకు తెలుసులే. వాటికేదో తళుకులు పెడుతున్నట్లు గా మోసాలెందుకే ? స్వామి కోసం ఆశలు పడే నీ మనస్సుకు అల్పమైన తేలిక విషయాలేందుకే ?
1. ఎటువంటి దోషం లేని నీ ముఖంలో ఆ కస్తూరి మచ్చలు ఎందుకే ? అటు ఇటు కదిలే ఆ కొప్పు మీద ఆ చేమంతుల ఆభరణాలు ఎందుకే ? అందంగా మెల్లమెల్లగా నడిచే నీకు నలుగురికి తెలిసేటట్లు ఆ మెట్టెల మోతలు ఎందుకే ? సహజంగానే నీ ఒళ్ళంతా గుమాయిస్తోంది. ఇంకా నీ శరీరం మీద గంధాలేందుకే ?
2. స్వామి ఏవో ముద్దుల మాటలు చెప్పినట్లు వున్నారు. అంత సంతోషాలేమిటే ? అవునే ! అసలు కథ ఏంటో చెప్పు ! నీ అద్దాలలాంటి చెక్కిళ్ళ మీద సగము వికసించిన పువ్వులు అక్కడక్కడా ఉన్నాయి. ఏం జరిగింది ? అయ్యవారేదో ప్రేమతో స్నేహపు మాటలు నాలుగు మాట్లాడి ఉంటారు. అంతమాత్రాన ఏం ఉద్రేకం వచ్చిందే ? ఆవేశాలతో కూడిన ఆ ఉఛ్వాస నిశ్వాసాలేమిటే ? అసలే నువ్వు అందగత్తెవి. మా వేంకటేశ్వరునితో సుఖాలు అనుభవించిన తరువాత నీకు అద్దం ఎందుకే ?
మొరగులు = మోసాలు
కందు = దోషం
చిందు = నాట్యం
చేమంతులు = స్త్రీలు తలమీద పెట్టుకునే ఆభరణాలు
ముదములు = సంతోషాలు
అరవిరి = సగము వికసించిన పువ్వు
ఒద్దిక = స్నేహం
ఊర్పు = ఊపిరి
🕉🌞🌎🌙🌟🚩
[15:53, 07/11/2020] +91 92915 82862: *||శ్రీమన్నారాయణీయము||
షష్ఠ స్కంధము/ 22వ దశకము - అజామిళోపాఖ్యానము వర్ణనము-9-శ్లోకం:-*
🕉🌞🌎🌙🌟🚩
వృణాముబుద్యాపి ముకుందకీర్తనం దహత్యఘౌఘాన్ మహి౾ మాస్య తా దృశః।
యథాగ్నిరేధాంసి యథౌషధం గదానితి ప్రభో! త్వత్పురుషా బభాషిరే ।।
భావము:-
"అగ్ని కట్టెను దహించునట్లును, ఔషధము రోగమును హరించునట్లును - నరునిచే చేయబడిన 'ముకుందకీర్తన' సమస్త పాపములను హరించును. హరినామ మహిమ అట్టిది" - అని ప్రభూ! నీ పార్షదులు తెలిపిరి.
వ్యాఖ్య:-
దైవ నామ స్మరణ విషయంలో పోతన భాగవతం ద్వితీయ స్కంధం మొదట్లో శుక మునీంద్రులు వివరిస్తూ "ఓ పరీక్షిత్తు మహారాజా! ఇప్పుడు నీవడిగిన (ముక్తి మార్గం గురించిన) ప్రశ్న చాలా సమంజసమైనది. దీనిని ఆత్మతత్త్వం తెలిసిన వాళ్లు మెచ్చుకుంటారు. ఇది సమస్త శుభాలను సమకూరుస్తుంది.
లోకంలో వినదగిన విషయాలు వేలకొలది ఉన్నాయి. అందులో ఇతి అతి ముఖ్యమైంది. గొప్పది యిది. సంసారంలో మునిగి తేలుతున్న గృహస్థులకు ఆత్మతత్త్వం కొంచెము కూడా తెలియదు. వాళ్లకు స్ర్తీ సంగమం, నిద్రలతో రేయి అంతా గడచిపోతుంది. పగలంతా కుటుంబ వ్యవహారాలతో సరిపోతుంది. పశువులూ, భార్యాబిడ్డలూ, చుట్టాలూ, శరీరమూ ఇత్యాది పరివార మంతటినీ నిజమని నమ్ముకొని సాగిస్తూ, కడకు వాళ్లు కన్నుమూసి కాటిపాలవుతారు. అంత్యకాల దుర్దశ తెలిసినా తెలియనట్లే ఉండిపోతారు.
కనుక, రాజేంద్రా! మోక్షమార్గంలో పయనించే వాడికి సమస్తానికి ఆత్మయైన వాడు, మహావైభవం కలవాడు, జగదీశ్వరుడు అయిన విష్ణువే భావించడానికీ, సేవించడానికీ, వర్ణించటానికీ, ఆకర్ణించడానికీ తగినవాడు.
లోకులందరికి సాంఖ్యయోగం మేలు చేకూరుస్తుంది. ఏ యోగం వల్లనైనా లేక ధర్మాచరణతో నైనా సరే అవసానకాలంలో హరిని చింతించాలి. జన్మ మెత్తినందుకు ఓ నరవరా! ప్రయోజనం అలా హరిని చింతించటమే.
మహారాజా! నిర్మలబుద్ధి గల మహనీయులు విధి నిషేధాలు విడనాడి గుణరహితమైన పరబ్రహ్మమును ఆశ్రయించి మనస్సులో సదా మాధవుని గుణాలను మననం చేస్తుంటారు.
నా తండ్రి యైన వ్యాసభగవానుడు ద్వాపరయుగంలో వేదతుల్యమైన భాగవతం నా చేత చదివించాడు. నేను పరబ్రహ్మమందు లగ్న చిత్తుడనై భగవంతుని అవతార లీలలు నన్నాకర్షించడంవల్ల దీనిని పఠించాను.
నీవు పంకజాక్షుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తుడివి. అందువల్ల నీకు భాగవతతత్త్వం తెలియపరుస్తాను. మహారాజా! వినవయ్యా! భాగవత శ్రవణం వల్ల విష్ణువును సేవించాలనే బుద్ధి విశాల మవుతుంది. మోక్షం కాంక్షించువాడికి ముక్తి లభిస్తుంది. జన్మము, జర, మరణాది సంసార భయాలన్నీ సమసిపోతాయి. వాసుదేవ నామ సంకీర్తనలే యోగిసత్తములకు ఉత్తమ వ్రతాలు.
విష్ణుదేవుని తెలుసుకోకుండా మత్తెక్కి సంసారములో సంవత్సరాల తరబడి పొరలాడుతూ సతమత మవుతుండే అవివేకి ముక్తి కెలా పోగలడు. వాడు సంసారబంధం నుండి ఎన్నటికీ బయటపడలేడు. ఇది నిజం. ఓ రాజా! ఒక్క క్షణమైనా హరినామం స్మరిస్తే చాలు. అది ముక్తిని ప్రసాదిస్తుంది.
🕉🌞🌎🌙🌟🚩
[15:53, 07/11/2020] +91 92915 82862: 17-11-గీతా మకరందము.
శ్రద్ధాత్రయ విభాగయోగము
🕉🌞🌎🌙🌟🚩
అవతారిక - ఇక యజ్ఞములను గూర్చి చెప్పబోవుచు మొట్టమొదట సాత్త్విక యజ్ఞము యొక్క లక్షణములను వివరించుచున్నారు–
అఫలాకాంక్షిభిర్యజ్ఞో
విధిదృష్టో య ఇజ్యతే |
యష్టవ్యమేవేతి మనః
సమాధాయ స సాత్త్వికః ||
తాత్పర్యము:- " ఇది చేయదగినదియే” యని మనస్సును సమాధానపఱచి శాస్త్రసమ్మతమగు ఏ యజ్ఞము ఫలాపేక్షలేనివారిచేత చేయబడుచున్నదో అది సాత్త్వికయజ్ఞమనబడును.
వ్యాఖ్య:- ప్రతివాడును తానుచేయు కార్యము శాస్త్రసమ్మతమైనదో, కాదో బాగుగ విచారించుకొని శాస్త్రవిరుద్ధమైనదానిని త్యజించివేసి శాస్త్రసమ్మతమైన దానినే గ్రహించవలెను. కనుకనే "విధిదృష్టః” అని చెప్పబడినది.
మఱియు “ఇది చేయదగినది" యను కర్తవ్యబుద్ధి అద్దానియందు లెస్సగనుంచుకొని ఫలాపేక్షలేక అద్దాని నాచరించవలెను. అపుడది సాత్త్వికకార్యమై చెన్నొందును. ఇచట యజ్ఞమని చెప్పబడినదాని యర్థము పశుహింసాదులతో గూడిన యాగములనికాదు. భగవద్ధ్యానము, పరోపకారము, దైవసంబంధమైన కార్యములు మున్నగునవి, లేక ఏ సత్కార్యమైనను - అనియే యగును.
"మనః సమాధాయ” - అని చెప్పబడినందువలన, ప్రతివారును తాము కార్యమును ప్రారంభించుటకు ముందుగా మనస్సును బాగుగ కుదుటపఱచుకొని సంశయములకు తావీయక నిశ్చయబుద్ధితో నద్దాని నుపక్రమించవలెనని తెలియుచున్నది.
మనస్సును సమాధానపఱచక, నిశ్చలపఱచక, ఆరంభింపబడు ఏ కార్యమున్ను చక్కగ జరుగదు. కావున చేయబోవు కార్యముయొక్క బాగోగులను బాగుగ నిర్ణయించుకొని శాస్త్రాదులద్వారా, ఆప్తవాక్యములద్వారా నిశ్చయమునకువచ్చి మనస్సును స్థిరపఱచుకొని నిష్కామబుద్ధితో అట్టి శాస్త్రసమ్మతకార్యము నాచరించినచో అద్భుతఫలితముల నొసంగగలదు. అదియే సాత్త్వికకార్యము, సాత్త్వికయజ్ఞము నగును.
ప్రశ్న:- సాత్త్వికయజ్ఞ మెట్టిది?
ఉత్తరము:- (1) శాస్త్రోక్తమైనదియు,
(2) ఫలాపేక్ష రహితముగ చేయబడునదియు,
(3) ఇదిచేయదగినది - అని మనస్సును సమాధానపఱచుకొని మనుజునిచే నాచరింపబడునదియు సాత్త్వికయజ్ఞ మనబడును.
🕉🌞🌎🌙🌟🚩
Only admins can send messages
[12:55, 11/11/2020] +91 92915 82862: 88) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
కామ్యాది దోషదృష్ట్యాద్యాః కామాది త్యాగహేతవః. ౹ ప్రసిద్ధో మోక్షశాస్త్రేషు తానన్విష్య సుఖీ భవ ౹౹58౹౹
58. కామము మొదలైన దోషములను పరిత్యజించుటకు వానియందలి బంధహేతుత్వము, తేజోహాని,క్షణికత్వము మొదలగు దోషములను గూర్చి విచారించుట మొదలగు ఉపాయములు మోక్షశాస్త్రములందు చెప్పబడినవి. వానిని అన్వేషించి అవలంబించి సుఖముగ ఉండును.
త్యజ్యతామేవ కామాది ల్మనోరాజ్యే తు కా క్షతిః ౹ అశేషదోషబీజత్వాత్ క్షతిర్భగవతేరితా ౹౹59౹౹
59.(ఆక్షేపము:)కామాదిదోషములు పరిత్యజింపబడుగాక.వానిని గూర్చి ఊహించుచు పగటికలల కనుటయందేమి హాని కలదు?
(సమాధానము:)అట్లాలోచించుట అశేషములైన యనర్థములకు మూలమని కృష్ణభగవానుడు చెప్పెను.
*ధ్యాయతో విషయాన్పుంసః సంఙ్గస్తే
షూప జాయతే ౹ సజ్గాత్సంజాయతే కామః కామాత్క్రోధోభి జాయతే ౹౹60౹౹*
60. కామ్యవిషయములను గూర్చి ఆలోచించు మానవులకు వాని యందు ఆసక్తి కలుగును.ఆసక్తి వలన అవి కావలెననే కాంక్ష ఉదయించును.ఈ కాంక్ష తీరుటకు ఆటంకము కలిగినచో క్రోధముప్పతిల్లును.
(భగవద్గీత 2.62)
క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్ స్మృతి విభ్రమః ౹ స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ౹౹60౹౹
60. క్రోధము వలన మనస్సునందు మూఢత కలుగును.దాని వలన గురుశాస్త్రోపదేశములు మరచిపోవును.అవి జ్ఞాపకమునకు రావు.దీని వలన యుక్తాయుక్త వివేకము నశించును.తత్ఫలితంగ సర్వనాశనము కలుగును.(ఈ శ్లోకము చాల మూలప్రతులందు అలభ్యము.)
రాగద్వేషాదులతో దూషితమగు చిత్తమే సంసారము. దృశ్యములేనేలేదు అను బోధతో రాగ ద్వేషాదులు నశించును.
దృశ్యము లేనేలేదు అను బోధయే సత్యమైన(బోధ)జ్ఞానము.అదియే కేవలభావము.
నేను,నీవు,జగత్తు,ఈ దృశ్యభ్రమ శమింపగా దృశ్యమంతయు అసత్తు కాగా మిగిలియున్న స్థితియే కైవల్యము.ఆత్మస్థితి.
మనస్సుతో భావింపబడినవాడై జీవుడు దేహవాసన కలిగి యుండును దేహవాసన పోయినపుడు ఆ పిమ్మట అతడు దేహధర్మములతో అంటుకొనడు.
మనస్సు ఒక కల్పము యొక్క మహాకాలమును ఒక్క క్షణముగా చేయును.ఒక్క క్షణమును ఒక్క కల్పకాలము అనుభవింపజేయును.
సంసారమంతయు మనో వికాసము మాత్రమే అని నిశ్చయము.
దుష్ప్రవర్తనను విడిచి పెట్టని వాడు, అశాంత మనస్కుడు, సమాధానము లేనివాడు,
కేవల ప్రజ్ఞాబలముతో ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు.
క్రోధము వలన గురుశాస్తోపదేశములు మరుపుకు వచ్చి మూఢత ఆవహించును.యుక్తాయుక్త వివేకము నశించి సర్వనాశనము కలుగును.
"మమ-నమమ" ఈ రెండు పదములు బంధమునకు మోక్షమునకు కారణములై యున్నవి.
"మమ" అనుకొని జీవుడు బద్ధుడగును.
"నమమ" అనుకొని ముక్తుడగును.
మనోవ్యాధికి చికిత్స ఏయే వస్తువులు ప్రియమైనవో ఆయా వస్తువులను త్యజించుచు పోయినచో మోక్షము లభించును.
అసంకల్పమను శస్త్రముతో ఈ చిత్తమును ఛేదించవలెను.అప్పుడే సర్వరూపమగు,సర్వగతమగు,
శాంతమయమగు పరబ్రహ్మము ప్రాప్తించును.
చేతనా చేతనాత్మకమగు ఈ జగత్తు "జీవేశ్వరాది" రూపమున ప్రకాశించుచున్నది.ఈ క్షణాది ప్రవేశాంతమగు ఈ సృష్టి ఈశ్వరకల్పితమై యున్నది.
జాగ్రదవస్థ నుండి మోక్షము వచ్చు వరకున్న
ద్వంద్వరహితమై,
నిర్గుణమై,
సత్యమై చిద్ఘనమైనట్టి బ్రహ్మానందమును, తన ఆత్మరూపముగ తెలిసికొనిన మానవుడు ఇంక ఎప్పుడును భయపడడు.
చక్కని ఆత్మ విచారముతో మనస్సు అమనస్సు కావలెను.అదియే మనస్సు అంతర్ధానమైన స్థితి,అమనస్కము.
"అవిద్యానాశము".
ఇదియే "బ్రహ్మపదము".
🕉🌞🌏🌙🌟🚩
[12:55, 11/11/2020] +91 92915 82862: 88) కఠోపనిషత్తు
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
కాబట్టి “నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే” అనే సూత్రమును అనుసరించి ఏకాక్షరమైనటువంటి ప్రణవాతీతమైనటువంటి స్థితిని తెలుసుకోవాలి అంటే , నీవు తప్పక మౌనవ్యాఖ్యను ఆశ్రయించాలి అనేటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు.
అటువంటి నిర్గుణ పరబ్రహ్మము యొక్క వాస్తవ రూపమును తెలుసుకోవాలి అంటే తప్పక హిరణ్యగర్భ, విరాట్ రూపముల ద్వారానే నీవు తెలుసుకోగలుగుతావు. ఆ అనుభూతి ద్వారా, ఆ నిర్ణయం ద్వారా నీవు దానిని గ్రహించగలుగుతావు అని మరొకసారి తెలియజేస్తున్నారు. ఈ రకంగా నచికేతునికి యమధర్మరాజు బోధిస్తూఉన్నారు.
నచికేతా! ఎవని నుండి సూర్యుడు ఉదయించుచున్నాడో, ఎవని యందు అస్తమించుచున్నాడో, ఎవని నతిక్రమించుటకు దేవతలు కూడ సమర్ధులుకారో అతనిని బ్రహ్మమని తెలుసుకొనుము. ఇచట ఏది కలదో, అచటను అదియే కలదు. అచట ఏది కలదో ఇచటను అదియే కలదు. ఎవరు ఈ విషయమున అనేకముగా చూచుచున్నారో వారు మరల జనన మరణ రూప సంసారమును పొందుచున్నారు.
జనన మరణ చక్రం ఎలా జరుగుతుందో కూడ ఇక్కడ బోధిస్తున్నారు. ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు ప్రకాశిస్తూఉన్నాడో, ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు అస్తమిస్తూ విరమిస్తాడో ఆ స్థానం పేరు బ్రహ్మము.
అందుకే సూర్యుడును ప్రత్యక్ష సాక్షియని, కర్మసాక్షియని, కర్తవ్యసాక్షియని, త్రిమూర్త్యాత్మకమని, త్రిశక్త్యాత్మకమని, బ్రహ్మమని పిలవబడుతూ ఉన్నది. ఏ బ్రాహ్మీభూత శక్తి చేత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ సూర్యస్థాన నిర్ణయం హిరణ్మయకోశ స్థానము కూడ అయి ఉన్నది. కాబట్టి అది బ్రహ్మము, అలా తెలుసుకోవాలి.
అలా తెలుసుకున్న తరువాత ఆ హిరణ్మయ స్థానం లో ఎలా అయితే సర్వజీవులు విరమిస్తూ, మరల సృష్టి పునః ప్రాదుర్భవించే కాలంలో ఎలా అయితే మరల పునఃసృష్టి జరుగుతుందో, అక్కడ సృష్టి యొక్క క్రమవిధానం ఎలా ఉన్నదో, ఇక్కడ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి కూడ భూమి మీద జరిగేటటువంటి సృష్టికూడ అలాగే ఉన్నది. అక్కడ సూక్ష్మమైనటువంటి లోకాదుల సృష్టి ఎలా ఉన్నదో, ఇక్కడ స్థూలమైనటువంటి జీవుల సృష్టి కూడ అదే తీరుగా ఉన్నది.
కాబట్టి అక్కడ ఏది కలదో ఇక్కడ కూడ అదే కలదు. ఇక్కడ ఏది కలదో అక్కడ కూడ అదే ఉంది. అనగా ఆత్మనిష్టులు, బ్రహ్మనిష్టులు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారికి ఆ స్థితి నుంచి చూడటం చేత, అక్కడా, ఇక్కడా ఉన్నటువంటి ఏకాత్మతా భావన ఉన్నది. ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులు అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతూ ఉంటారు. జ్ఞాత, కూటస్థుడు బింబ ప్రతిబింబ సమానులు అనే నిర్ణయాన్ని పొందుతూఉంటారు.
దైవం బింబము, జీవుడు ప్రతి బింబము. ఈశ్వరుడు బింబము, జీవుడు ప్రతిబింబము. కాబట్టి ప్రతిబింబాన్ని బాధిస్తే ప్రయోజనం లేదు కదా! కాబట్టి భౌతికంగా, స్థూలంగా ఉన్నటువంటి దాని యందు నువ్వు ఎంత ప్రభావశీలంగా ఉన్నప్పటికీ సూక్ష్మమైన, అతి సూక్ష్మమైన, సూక్ష్మతరమైన, సూక్ష్మతమమై, ఈ భౌతికతలో గ్రాహ్యము కానటువంటి స్థితిలో ఉన్నటువంటి శబ్ద, రూప, గుణ రహితమైనటువంటి, ఆధారభూతమైన
టువంటి, సర్వాధిష్టానమైనటువంటి, సర్వులకు ఆశ్రయమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో, ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో దానిని ఈ ఆంతరిక యజ్ఞ పద్ధతిగా, జ్ఞానయజ్ఞ పద్ధతిగా, తనను తాను లేకుండా చేసుకునే పద్ధతిగా, తనను తాను పోగొట్టుకునే టటువంటి పద్ధతిలో ‘నాహం’ గా మారేటటువంటి పద్ధతిగానే దీనిని తెలుసుకోవాలి.
అలా కాకుండా జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, జగత్తు వేరే అనేటటువంటి ద్వైత పద్ధతిని ఆశ్రయించినట్లైతే, ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనే త్రయంలో చిక్కుకున్నవాడవై మరల జనన మరణ రూప భ్రాంతి కలుగుతుంది.
సదా జనన మరణ చక్రంలోనే పరిభ్రమిస్తూ ఉంటావు. కాబట్టి ఈ ద్వైత భ్రాంతిని విడువాలి. కాబట్టి పంచ భ్రమలలో మొట్టమొదటి భ్రమ అయినట్టి “జీవేశ్వరో భిన్నః”- జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే అనే భ్రాంతిని వదలమని ఉపదేశిస్తూ ఉన్నారు.
🕉🌞🌏🌙🌟🚩
[12:58, 11/11/2020] +91 92915 82862: అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
రేకు: 1316-2
సంపుటము: 23-92.
ఏడనుండి వచ్చినాఁడే యీడకుఁ దాను
వీడెమిచ్చీఁ జూడవే వేసాలవాఁడు!!
॥పల్లవి॥
వెలలేనివలపుల వేడుకకాఁడు
కలికితనాలమంచిగయ్యాళివాఁడు
చలమరిసరసాలజాజరకాఁడు
చెలువుఁడు వీఁడుగదె శ్రీవేంకటేశుఁడు!!
॥ఏడ॥
కొనబుతనాలతోడికోడెకాఁడు
వినుపునవ్వులునవ్వేనీటులవాఁడు
వొనరినవరముల వుదారికాఁడు
చెనకులవాఁడుగదే శ్రీవేంకటేశుఁడు!!
॥ఏడ॥
గొల్లెతలమానములుకొల్లకాఁడు
పిల్లదొరులూఁదేటిపిన్నవాఁడు
యెల్లగా నలమేల్మంగనేలినవాఁడు
చెల్లుబడి వీఁ(వాఁ?) డుగదె శ్రీవేంకటేశుఁడు !!
॥ఏడ॥
🕉🌞🌎🌙🌟🚩
కీర్తనలో అర్ధాలు:
--------------------------
కలికితనాల = నేర్పరితనము
చలమరి = మాత్సర్యశీలుడు
కొనబుతనాల = విలాసము
నినుపు = సమృద్ధి
వుదారికాఁడు = ఉదారవంతుడు
వొనరిన = ఒనగూడెడి
పిల్లదొరులూఁ = పిల్లనగ్రోవి
*****
భావామృతం
-----------------------
తాను ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చినాడే ఈ వేషాలవాడికి తాంబూలము ఇచ్చి చూడండి. ఏ విలువకు తులతూగని వలపుల వేడుకకాడు నేర్పరితనములో మంచి దిట్టవలెనున్నాడు. సరసముగా వసంతోత్సవాలలో కూడా వీడు గొప్ప పట్టుదలకలవానిలా అనిపిస్తున్నాడు. ఇతనే శ్రీవేంకటేశుడు. ఈ కోడెగానికి విలాసము ఎక్కువ. నిండు నవ్వులునవ్వే నీటుగాడు. ఒనగూడెడి వరములు ఇవ్వడంలో ఉదారవంతుడు. శ్రీవేంకటేశుడు విపరీతంగా నొక్కులు నొక్కుతాడు. గొల్లభామల మానములు దోచుకున్న కొల్లకాడు. పిల్లనగ్రోవి వాయించడంలో పిల్లవాడు. అలమేల్మంగను ఏలుకొనే వాడు ఈ శ్రీవేంకటేశుడు గొప్ప చెల్లుబడి గల వాడు అంటు అన్నమయ్య కీర్తించాడు.
🕉🌞🌎🌙🌟🚩
[13:01, 11/11/2020] +91 92915 82862: 17-15-గీతా మకరందము.
శ్రద్ధాత్రయ విభాగయోగము
🕉🌞🌎🌙🌟🚩
అవతారిక - వాచికతపస్సును గూర్చి చెప్పుచున్నారు -
అనుద్వేగకరం వాక్యం
సత్యం ప్రియహితం చ యత్ |
స్వాధ్యాయాభ్యసనం చైవ
వాఙ్మయం తప ఉచ్యతే ||
తాత్పర్యము:- ఇతరుల మనస్సునకు బాధగలిగింపనిదియు, సత్యమైనదియు, ప్రియమైనదియు, మేలు గలిగించునదియునగు వాక్యమును, వేదాదులయొక్క అధ్యయనమును అభ్యసించుట* (వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతము, భాగవతము, రామాయణము, యోగవాసిష్ఠము మున్నగువానిని అధ్యయనముచేయుట, ప్రణవాది మంత్రములను జపించుట) వాచిక తపస్సని చెప్పబడుచున్నది.
వ్యాఖ్య:- “అనుద్వేగకరం వాక్యమ్" - ఉచ్చరింపబడు వాక్యము పరుల మనస్సునకు నొప్పిగలుగజేయరాదు. మఱియు అది సత్యమై (యథార్థమై) యుండవలెను. సత్యవాక్కు అయినప్పటికిని దానిని పరుషముగ, అప్రియముగ పలుకరాదు. ఇతరులకు ప్రియముగ హితముగ నుండవలెను.
"స్వాధ్యాయాభ్యసనమ్" - ‘అభ్యసనమ్' అని చెప్పినందువలన అట్టి స్వాధ్యాయమును లెస్సగ అభ్యాసము చేయవలెనని, ప్రతిరోజు దానిని సాధించవలెనని స్పష్టమగుచున్నది.
"ధ్యానము గదా ప్రధానము, శాస్త్రాభ్యాసమెందులకు?' అని పలుకువారి కిచట చక్కని సమాధానమును భగవాను డొసంగిరి. ధ్యానమే ముఖ్యమైనప్పటికిని విరామ సమయములందు శాస్త్రాదులను పరిశీలించుట, అధ్యయనము చేయుట, నిప్పుకు గాలితోడైనట్లు, అతని ధ్యానాదులకు చాల సహాయకారిగానుండునని యెఱుంగవలెను. ఇట్టి అధ్యయనము చేతను, ప్రణవాదిమంత్రముల జపముచేతను, సత్యవాక్కుచేతను వాక్ - శుద్ధియు కలుగగలదు.
ప్రశ్న:- వాచికతపస్సు అనగా నేమి?
ఉత్తరము:- (1) పరులకు నొప్పిగలుగజేయనిదియు, సత్యమైనదియు, ప్రియముగను, హితముగ నుండునదియునగు వాక్కున్ను,
(2) వేదాదుల అధ్యయనమున్ను వాచికతపస్సని చెప్పబడును.
~~~
*వేదాన్త శతరుద్రీయ ప్రణవాది జపం బుధాః
సత్త్వశుద్ధికరం పుంసాం స్వాధ్యాయం పరిచక్షతే.
🕉🌞🌎🌙🌟🚩
Only admins can send messages
No comments:
Post a Comment