_*"మనసును ఆలోచనల రహితంగా చేసే ఉపాయం ఏమైనా ఉందా !?"*_
_*ఏదోక ఫలాన్ని ఆకాంక్షించకుండా మనసు ఆలోచన చేయదు. యోచన అంటే ఆలోచన. మన మనసు నిరంతరంగా ఏదో ఒక యోచన చేస్తూనే ఉంటుంది. యోచన స్వరూపం అర్థమైతే మనసు విధానం ఏమిటనేది అర్థమవుతుంది. ఎందుకంటే మనసు విధానమే యోచనగా ఉంది. నిద్రలో మినహాయించి యోచన లేకుండా మనసు ఉండదు. నిద్రలో మనస్సు ఎలా ఉందో మనకు తెలియదు. మెలకువగా ఉండగానే యోచనలు ఆగిన స్థితిని అనుభవించ గలిగితే అదే "ఆత్మదర్శనం". మనకు ఎలాగూ యోచనలు తప్పడంలేదు. కనుక అవి ఆపేందుకు ఉపకరించే యోచనలు చేయాలి. అలాంటి యోచనలే మంత్రం, భక్తి, ధ్యానం తదితర విధానాలు. ఈ మార్గాలన్నీ మనసును యోచనా రహిత స్థితికి చేరుస్తాయని భగవాన్ శ్రీరమణమహర్షి చెప్పారు. ప్రారంభంలో ఇవన్నీ యోచనలుగానే మొదలైనా శ్రద్ధగా కొనసాగిస్తే అవి ఏ యోచనలులేని ఆత్మస్థితికి చేరుస్తాయని మహర్షి బోధించారు !*_
*యోగాభ్యాసము*
*13. శిరస్సు, మెడ, వెన్ను సూటిగా ఊర్ధ్వముగా ఉండునట్లు కూర్చోవలెను. అట్లు కూర్చుండుటలో ఏ భాగమును బిగించరాదు. శరీర భాగముల బిగింపు అనగా మనస్సు బిగింపే. అట్లు కూర్చుండి, "నేను ఊర్ధ్వముగా ఉంటిని" అని స్మరింపవలెను. మానవుని వెన్నుముక ఊర్ధ్వము. అందు మూలాధారమున పృథివీ తత్వ ప్రజ్ఞ యున్నది. క్రమముగా ఊర్ధ్వమునకు జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను తత్వముల ప్రజ్ఞలు వెన్నుముకలో నుండి పనిచేయుచున్నవి. వానికి పైన భ్రూమధ్యమున మనస్సు అను తత్వ ప్రజ్ఞ పని చేయును. శీర్షముపైన సూర్యుని వెలుగులోనున్న తత్వ ప్రజ్ఞ పని చేయును. కనుక వెన్నెముక మానవునకు భూమి నుండి సూర్యునికి నిలువైన నిచ్చెన. దానిలో నుండి ఇన్ని తత్వముల ప్రజ్ఞలుగా 'నేను' పనిచేయుచుండును. ఈ ఊర్ధ్వ సాధనమున, అనగా ఊర్ధ్వత్వ సంస్మరణమున, "నేను" నందు ఇన్ని ప్రజ్ఞలు అఖండత్వ మంది యోగము ఏర్పడును.*
*సాధనలో దిక్కులు చూడరాదు. మనసుతో కూడా చూడరాదు. శ్వాసను స్మరించునపుడు నాసికాగ్రమును స్మరింపవలెను. అచటి నుండి శ్వాస లోనికి పోవుట, వచ్చుటలో ప్రాణాయామము ఏర్పడును. మనస్సు, శ్వాస యందు నిలుచుటలో ప్రత్యాహారము ఏర్పడును. మనస్సు, శ్వాసలు ఏకమగుటతో ధారణము ఏర్పడును. బాహ్యము, అంతరము అను ప్రజ్ఞలు కరిగి కలిసి పోవుటతో అంతర్యామిత్వం ఏర్పడును. ఇదియే ధ్యాన స్థితి. ఆ స్థితిలో సర్వ కార్యములు ఆచరింపబడుటలో సమాధి స్థితి ఏర్పడును.*
*
*"ఋభుగీత " (180)*_
_*13వ అధ్యాయము [చైతన్యమే నీవు]*_
_*నెమ్మదించిన మనసుకు ఆనందం అర్ధమౌతుంది !!*_
_*మోక్షం అంటే సుఖదుఃఖ స్పర్శలేని ఆనందం. ఆ ఆనందం మనకి కొత్తగా వచ్చేది కాదు. మనసు ఆనంద స్థితిలో ఉండటం మనకు నిత్యం అనుభవంలో ఉన్నదే. కానీ కోరికలతో పరుగులు పెట్టే మనసుకు వ్యావహారిక సత్యాల నడుమ అది తెలియడంలేదు. మనసుకు వేగాన్ని తగ్గిస్తే సంతోషదుఃఖాలకు అతీతంగా దానివద్దే ఉన్న ఆనందం అనుభవం అవుతుంది. మనసుకు వేగం కోరికలే. కోరికలంటే ఇష్టా ఇష్టాలే. ఇష్టాఇష్టాలు తగ్గేకొద్ది మనసు నెమ్మదిస్తుంది. నెమ్మదించిన మనసుకు ఆనందం అర్ధమై తానే సచ్చిదానంద స్వరూపమని, తెలుస్తుంది. అప్పుడు అన్నీ చిన్మాత్రమేనని అర్థమౌతాయి !*_
** గీతోపనిషత్తు - 77 🌹*
*🍀 15. బుద్ధిమంతుడు - కర్మ యందు గాని, అకర్మ యందు గాని దైవము బోధించినది యుక్త స్థితి, అనగా యోగస్థితి. దైవముతో స్మరణ మార్గమున యోజించి చేయుట ద్వారా, చేయకుండుట ద్వారా మోక్షస్థితి యందు నిలువవచ్చునని దైవము తెలిపిన రహస్యము. అట్లు చేయువాడు మనుష్యులలో బుద్ధిమంతుడు.🍀*
*📚. 4. జ్ఞానయోగము - 16, 17, 18 📚*
కిం కర్మ కి మకర్మేతి కవయ్కో వ్యత్ర మోహితాః |
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసే 2 శుభాత్ || 16
కర్మణో హ్యపి బోద్ధవ్యం బోధవ్యం చ వికర్మణః |
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణా గతిః || 17
కర్మణ్యకర్మ యః పశ్యే దకర్మణి చ కర్మ యః |
స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్న కర్మకృత్ || 18
కర్మ మెట్టిది? అకర్మ మెట్టిది? అను విషయమున పండితులు కూడ మోహము చెందుచున్నారు. అట్టి కర్మ రహస్యమును నేను నీకిపుడు తెలుపుచున్నాను. దీనిని తెలిసి నీవు బంధము నుండి విముక్తుడవు కాగలవు అని కూడ తెలిపినాడు.
చేయుట, చేయకుండుట అను విషయము చాల లోతైనది. వాస్తవికముగ ఎవ్వరును కర్మ విషయమున స్పష్టముగ వివరించి తెలియజెప్పలేరు. కర్మ స్వరూపమును వివరించుచు శ్రీకృష్ణుడిట్లను చున్నాడు. “చేయుటలో, చేయకుండుట యున్నది.
అదెట్లనిన, సంభాషించుచు నడచుచున్నపుడు, నడచినట్లు తెలియదు. సంభాషించుచు వాహనము నడుపునపుడు, వాహనము నడుపుచున్నా నన్న భావముండదు. ప్రయాణమున సంభాషణ జరుగు చున్నపుడు, ప్రయాణము సాగినట్లే తెలియదు.
ఇట్లు చేయుటలో చేయకపోవుట యున్నది. పై ఉదాహరణమునందు ఒక రహస్యము గోచరించు చున్నది. రసవత్తరమగు సంభాషణమున, నడక - ప్రయాణము జరుగుచున్నవి గాని, చేయుచున్నట్లనిపించవు. ఇచ్చట నడక ప్రయాణము, పరధ్యానముగ జరుగుచున్నవి.
అదే విధముగా పరమును (దైవమును) స్మరించుచూ పనులు జరిపినచో తాను దైవము నందుండుట, పనులు జరుగుట యుండును. భక్తులు మహత్కార్యము లన్నియు ఇట్లే నిర్వర్తించిరి. వారు దైవమున రుచిగొని యుండగ, పనులు జరిగినవి. ఇట్లు జరిగినపుడు కర్తృత్వ భావన కూడ యుండదు.
అనగా తాను చేయుచున్నానను భావన యుండదు. అతడు దైవముతో యుక్తుడగుటచే, అతని నుండి కర్మలు జరిగినవి. "యుక్తః కర్మకృత్" అని పలుకుటలో, నా స్మరణమున నిలిచి కర్మ లాచరింపుము. అపుడు చేయుటలో చేయని స్థితి అనుభూతమగును.
అట్లే చేయకుండుటలో చేయుట యున్నది. ఏమీ చేయకుండ కూర్చున్న వానియందు కూడ మనసు ఆలోచన చేయుచునే యుండును. అట్లు చేయకపోవుటలో చేయుట యున్నది. ఆ చేయుట మానసికము. మునుల తపస్సు యిట్లే సాగుచుండును.
వారేమియు చేయుచున్నట్లు గోచరింపదు. కాని వారి తపశ్శక్తి లోకములను కూడ చలింపచేయ గలదు. ధ్యాన యోగులు చేయక చేయుదురు. కర్మయోగులు చేయుచు చేయరు.
చేయక చేసిన జ్ఞానయోగులు ఇటీవలి కాలమున శ్రీ అరవింద యోగీంద్రులు, మాస్టర్ సి.వి.వి., రమణమహర్షి, రామకృష్ణ పరమహంస, షిరిడీ సాయిబాబా. చేయుచు చేయని వారు మదర్ (శ్రీమాత, పాండిచేరి), మాస్టర్ ఇ.కె., వివేకానంద స్వామి, శ్రీ సత్య సాయిబాబా, పై రహస్యము తెలిసి యుద్ధము చేయుచు చేయనివాడుగ నీవుండుమని అర్జునునికి తెలిపెను. యుద్ధము చేయక చేయు వానిగ శ్రీకృష్ణుడు నిలచెను.
కర్మ యందుగాని, అకర్మ యందుగాని దైవము బోధించినది యుక్త స్థితి, అనగా యోగస్థితి. దైవముతో స్మరణ మార్గమున యోజించి చేయుట ద్వారా, చేయకుండుట ద్వారా మోక్షస్థితి యందు నిలువవచ్చునని దైవము తెలిపిన రహస్యము. అట్లు చేయువాడు మనుష్యులలో బుద్ధిమంతుడు.
సశేషం....
. శ్రీ శివ మహా పురాణము - 274 🌹*
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
65. అధ్యాయము - 20
*🌻. సతి కైలాసమునకు పయనమగుట - 1 🌻*
నారుదుడిట్లు పలికెను -
ఓ బ్రహ్మా! విధీ! మహాత్మా! శివభక్తశ్రేష్ఠా! ప్రభూ! అద్భుతము, మంగళములకు పెన్నిధియగు శంభుని చరితమును వినిపించితివి (1). తండ్రీ! తరువాత ఏమైనది? సర్వపాప సమూహములను నశింపజేయు సతీ చంద్రశేఖరుల దివ్యచరితమును చెప్పుము (2).
బ్రహ్మ ఇట్లు పలికెను -
భక్తులయందు దయను చూపే శంకరుడు నన్ను వధించే యత్నమునుండి నివృత్తుడు కాగా, సర్వులు భయమును వీడి సుఖమును, ప్రసన్నతను పొందిరి (3).వారందరు శిరసా ప్రణమిల్లి దోసిలి యొగ్గి శంకరుని భక్తితో స్తుతించి ఉత్సాహముతో జయధ్వానమును చేసిరి (4).
ఓ మహర్షీ! అదే సమయములో నేను భయమును వీడి ప్రసన్నమగు మనస్సుతో భక్తితో వివిధ మంగళ స్తోత్రములతో శంకరుని స్తుతించితిని (5). అపుడు అనేక లీలలను ప్రదర్శించే శంభు ప్రభుడు సంతసించెను. ఓ మహర్షీ! అపుడాయన అందరు వినుచుండగా నాతో ఇట్లనెను (6).
రుద్రుడిట్లు పలికెను -
ఓ వత్సా! బ్రహ్మా! నేను ప్రసన్నుడనైతిని. నీవు ఇపుడు భయమును విడవాడి, చేతితో నీతలను పట్టు కొనుము. నీవు సంశయమును వీడి నా ఆజ్ఞను పాలింపుము (7).
బ్రహ్మ ఇట్లు పలికెను -
అనేక లీలలను ప్రదర్శించే శంభుప్రభుని ఈమాటను విని, నేను నా శిరస్సును సృశించుచూ, అటులనే ఉండి వృషభధ్వజుని నమస్కరించితిని (8). నేను ఎంతలో నా శిరస్సును నా చేతితో స్పృశించితినో, అంతలో అచట వృషవాహనుడగు శివుని రూపము ఉండెను (9).
నేను అపుడు సిగ్గుచే ముడుచుకున్న అవయవములు గలవాడనై తలవంచి నిలబడితిని. అచట అంతటా ఉన్న ఇంద్రాది దేవతలందరు స్పష్టముగా చూచినారు (10). తరువాత నేను సిగ్గుతో నిండిన వాడనై మహేశ్వరునకు ప్రణమిల్లి, చక్కనిస్తోత్రమును చేసి, 'క్షమించుము క్షమించుము' అని పలికితిని (11).
హే ప్రభో! ఈ పాపము క్షాళితమయ్యే ప్రాయశ్చిత్తమును చెప్పుము. ఈ నా పాపము తొలగి పోవుట కొరకై, ఇంద్రియనిగ్రహమును, వివేకబుద్ధిని ప్రసాదించుము (12). భక్తవత్సలుడగు సర్వేశ్వరునితో నేను ఇట్లు పలికి నమస్కరించగా, ఆ శంభుడు మిక్కిలి ప్రసన్నుడై ఇట్లు పలికెను (13).
శంభుడు ఇట్లు పలికెను -
నేను శిరస్సును అధిష్ఠించియున్న ఈ రూపముతోనే, నీవు ప్రసన్నమగు మనస్సు గలవాడవై, నన్ను ఆరాధించుటలో నిమగ్నమై తపస్సును చేయుము (14). లోకములో సర్వత్రా నీకు రుద్ర శిరస్కుడు అను పేరు ప్రసిద్ధి గాంచ గలదు. తేజశ్శాలులగు బ్రాహ్మణులకు సర్వకార్యములను నీవు సిద్ధింపచేయ గలవు (15).
నీకు జరిగిన ఈ వీర్యపతనము మానవుల లక్షణమై యున్నది. కాన నీవు నముష్యుడవై భూలోకములో సంచరించుము (16). నీవు భూలోకములో సంచరించుచుండగా నిన్ను ఎవరు చూచెదరో, వారు 'ఇది యేమి? బ్రహ్మ శిరస్సుపై శివుడు ఉన్నాడు' అని పలికెదరు (17).
ఈ నీ వృత్తాంతమునంతనూ ఉత్సుకతో ఎవరు విందురో, వారు పరదారయందలి రాగము అనే దోషమునుండి విముక్తులై శీఘ్రముగా మోక్షమును పొందగలరు (18). జనులు ఎంత అధికముగా నీవు చేసిన పనిని చెప్పుకొనెదరో, అంత అధికముగా నీ పాపము తొలగి శుద్ధిని పొందగలవు (19).
ఓ బ్రహ్మా! నేను నీకు చెప్పే ప్రాయశ్చిత్తమిదియే. జనులు నీ గురించి పరిహాసమును చేయుట, లోకములో నీపై తీవ్రమగు జుగుప్స అనునవి నీకు ప్రాయశ్చిత్తము (20). ఈ వేది మధ్యలో కామార్తుడవగు నీ వీర్యము స్ఖలించుటను నేను గమనించితిని. ఈ వీర్యము ధరింపయోగ్యము కాజాలదు (21).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 162 🌹*
*🌻. జాబాలిమహర్షి - 2 🌻*
8. ఏకాంతం అంటే ఎవరూలేనిచోటికి పారిపోవటం కాదు.అందరి మధ్యన ఉండి తనొక్కడే అక్కడౌన్నట్లు భావించటమే ఏకాంతం. ఏకాంతం అనే దానికోసం ఎక్కడికీ వెళ్ళకూడదు. మౌనం అంటే, తాను మాట్లాడకుండా, ఏదీవినకుండా ఉండటమే మౌనం.
మౌనితో, ఏకాంతంగా ఉండేవాడితో ప్రకృతి – వాయువు, పంచభూతములు మాట్లాడుతాయి.
9. ఎట్లా అంటే, వాటికి ఒక భాష ఉంటుంది. సద్వస్తువునుగురించిన విషయం అవి చెప్పగలుగుతాయి. పంచభూతాలు శాశ్వతంగా ఉన్నాయి. జీవులే వచ్చి పోతున్నవి. అనేకమయిన జీవుల యొక్క రాకపోకలను అవి చూస్తున్నాయి.
10. ఈ పంచభూతాలు – భూమి, వాయువు, వృక్షాలు మొదలయినవన్నీ చూస్తున్నాయి. ఈ సృష్టిలో పుట్టిపెరిగి నశించే లక్షణాలు కలిగిన ఈ వృక్ష సంపదకు మూలం బీజములు. అవన్నీ భూమిలో ఉన్నాయి. వాటిని చూస్తున్నాయి. అగ్నిహోత్రుడు, ఆకాశం, నక్షత్రాలుకూడ చూస్తున్నాయి. వాటికి ఈ జీవులయొక్క రాకపోకల విషయం బాగా లెలుసు. వాటిని కూడా గురువుగా భావించి ఆశ్రయించవచ్చు. వాటిని స్మరిస్తూ ఏకాంతంలో ఉంటే, అవికూడా చెప్పగలవు.
11. గురువు ఎక్కడో ఉన్నాడు అనుకోనక్కరలేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతి-వాయువు, అగ్ని, సూర్యచంద్రులు, పంచభూతములు అవన్నీ గురువే! శాశ్వతమై నిత్యమై, అనేకజీవుల గమాగమనములను చూస్తూఉండి, వారి సుఖదుఃఖాలను కేవలం సాక్షిగా చుస్తూ, అవిమాత్రం సుఖదుఃఖాలను అనుభవించకుండా చైతన్యస్వరూపులై; మన మనుగడకు, ప్రాణానికి, తిండికి, బట్టకు, పెరగటానికి కారణభూతమ్యిన పోషకద్రవ్యములుగా ఉన్నాయి.
12. అవి నిర్జీవంగా ఉన్నవా, అచేతనంగా ఉన్నవా, అజ్ఞానంలో ఉన్నవా? అవి అసత్పదార్థములా? అని ఆలోచిస్తే; కాదని, వాటిలో జ్ఞానబోధకమైన అంశం తప్పకుండా ఉంది అని తెలుస్తుంది. వినేందుకు మనం సంసిద్ధంగా ఉండాలి అంటే! ఏమీ చెయ్యనక్కరలేదు. అంటే నిష్క్రియుడై ఉండాలి.
సశేషం....
. శివగీత - 116 / The Siva-Gita - 116 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
ప్రధమా రక్త వర్ణాస్యా -ద్ద్వితియా భాస్వ రామతా,
తృతీయా విద్యుదా భాసా - చతుర్ధి శుక్ల వర్ణ నీ 22
జాతంచ జాయ మానంచ - తదోం కారే ప్రతిష్టి తిమ్,
విశ్వం భూతం భువనం - విచిత్రం బహుదా తధా 23
జాతం చ జాయ మానం య - త్తత్ర్వం రుద్ర ఉచ్యతే,
తస్మిన్నేన పునః ప్రాణా- స్సర్వ మోంకార ఉచ్చతే. 24
ప్రవి లీనం తదోం కారే - పరం బ్రహ్మ సనాతనమ్,
తస్మాదోం కార జాపీయ - స్సముక్తో నాత్ర సంశయః 25
మాత్రల రంగులిలా ఉండునని యాదేశించు చున్నాడు. అందు ప్రధమ మాత్ర రంగు ఎరుపు గాను, రెండవ మాత్ర రంగు భాస్వర వర్ణము గాను, మూడవ మాత్ర రంగు ఎరుపు కాంతిగాను, నాలుగవ మాత్ర రంగు మక్ల రంగు గాను ఉండును.
అనేక విధముల చిత్రమగు నట్టియు పుట్టినదియు, పుట్ట బోవునదియు నగు ప్రపంచము ఓంకారము నందు ప్రతిష్టించ బడెను.
పుట్టినది పుట్టబోవునది యు నగునీ సమస్తమును రుద్రుడే. ఆయన లోనే ఈ ప్రాణము లున్నవి. సమస్తము రుద్రాభిన్నమగు నోంకారమే యని నిరూపించబడి యున్నది .
దీనివలన నోం కార శివుల కభేదము గనే చెప్పబడినది. ఈ ఓంకారమున సనాతనమగు బ్రహ్మము లీనమై యుండుట వలన ప్రణవమును జపించువాడు ముక్తి నొందుటలో సందేహము లేదు.
[17/11, 17:32] +91 98494 71690: *🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 101 🌹*
*🌻. మానసిక గోళము - మనోభువనము - 6 🌻*
422. మానవుని ఆధ్యాత్మిక వికాశము:-
అనుభూతి ఐక్యము:-
మనోమయ భూమికలైన 5వ భూమిక యందున్న వారిపై ఉదయించును. ఇచ్చట ఆత్మ, సరాసరి భగవంతుని దివ్యత్వ ప్రసారముచే ప్రకాశింపబడుచున్నానని కనుగొనును. ఎఱుకతోగాని ఎరుకలేకగాని భౌతిక, సూక్ష్మగోళములలో నున్నవారికి ఇతోధికమైన సహాయము చేయుదురు.
423. అభావరుప అస్తిత్వము:-
మనోమయ ప్రపంచములో అనేకత్వమందు ఏకత్వస్థితి ప్రారంభమగును.
424. మనోమయ భూమిక ;-
(అస్తిత్వము గాని అస్తిత్వము) ఉనికి గాని ఉనికి భగవంతుని జ్ఞానావస్థానము నుండి దీని ఉనికి ఏర్పడుచున్నది. అంతర్జ్ఞానము యొక్క ప్రతిబింబము. దీనిలో సృష్టియొక్క వివరములన్నియు ఉండును ఇచ్చట భగవంతునికి-సృష్టికి గల సంబంధము ప్రియతముడు-ప్రేమికుడు సంబంధము వంటిది ఇది మానవుని సత్యస్థితి. ఈ దశలో భగవంతుని యందు గల భావము అనుభూతి ఐక్యమే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీనాథ కవి సార్వభౌముడు: సంక్షిప్త కధ
శాంతి నిప్పుచ్చరంబు మచ్చరము ఘనము
కూపమండూకములుబోలె గొంచె మెరిగి
పండితంమన్యులైన వైతండికులకు. (భీమ ఖండం -1 -13 )
తనకు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్ని శపించబోతాడు వ్యాసుడు. అతడిని శర్వాణి వారించే పద్యాలు...
భిక్ష లేదని ఇంత కోపింతురయ్య
కాశికాపట్టణముమీద గాని నేయ !
నీమనశ్శుద్ది తెలియంగ నీలకంఠు
డింత చేసేనుగాక కూడేమి బ్రాతి? (భీమ ఖండం 2-114 )
శివుడు నిన్ను శోధించడానికి భిక్ష పుట్టకుండా చేసాడని చెప్పేసింది.
తెలుగు భాష గొప్పతనాన్ని మొదట చాటిన వాడు శ్రీనాధుడే ! క్రీడాభిరామం లోని ఈ పద్యం చూడండి...
జనని సంస్కృతంబు సకల భాషలకును - దేశభాషలందు దెనుగులెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద - మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే ?
కంజీవరం వెళ్ళినప్పుడు అక్కడి తమిళుల విందులో శ్రీనాధుడి తిప్పలు అంతా ఇంతా కావు.
తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు జారు
చెవులలొ బొగవెళ్ళి చిమ్మిరేగ
బలు తెరంగుల తోడ బచ్చళ్ళు చవి గొన్న
బ్రహ్మ రంధ్రము దాక బారు నావ
యవిసాకు వేచిన నార్నెల్లు పసి లేదు
పరిమళ మెంచిన బండ్లు సొగచు
వేపాకు నెండించి వేసిన పొళ్ళను
గంచాన గాంచిన గ్రక్కువచ్చు
నఱవ వారింటి విందెల్ల నాగడంబు
చెప్పవత్తురు తమ తీరు సిగ్గు లేక
చూడవలసిన ద్రావిళ్ళ కీడు మేళ్ళు...
అసలే భోజన ప్రియుడైన శ్రీనాధుడు అలవాటు లేని తమిళుల భోజనముతో ఎలాటి అవస్థలు పడ్డాడో కదా. ఆంధ్రుల భోజనములో పప్పు ప్రధానము. తమిళులకు చారు ముఖ్యం. అలవాటు లేని చారు అదీగాక మిరియపు చారు మొదటనే వడ్డించేసరికి కవి సార్వభౌముడికి చిర్రెత్తింది.
బుడతకీచువారు(పోర్చుగీసువారు) మన దేశానికి రాకముందు మనకు మిరపకాయలు లేవు. కారానికి మిరియాలే వాడేవారు. మనకు పోర్చుగీసు వారివల్లనే మిరపకాయలు లభించాయి. మిరియాలకు బదులుగా కారానికి వాడేవి కాబట్టి వీటిని(మిర్యపుకాయలు) మిరపకాయలు అని పిలుస్తారు.
సన్నన్నం తినే అతనికి ఆ ప్రాంతం లోని జొన్న కూడు రుచించలేదు. దానికి తోడు, చింత కూర, బచ్చలి కూర కలిపి వండిన ఉడుకు పులుసు ఒకటి! ఆ చేదు శ్రీనాధుడు భరించలేకపోయాడు. తానేమిటి, తనను పుట్టించిన జేజమ్మ కూడా తినలేడు...శ్రీనాధుడు శ్రీకృష్ణుడిని ఇలా సవాలు చేసాడు.
" ఫుల్లసరోజనేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావినా
నల్ల దావాగ్ని మ్రింగితి నటంచును నిక్కేదవేల?
పల్లవయుక్తమౌ నుడుకు బచ్చలిశాకము జోన్నకూటితో
మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీపస గానవాచ్చేడిన్ "
భావము: చిన్న నాడు పూతన ఇచ్చిన విషపు చేదు పాలు తాగానని గర్వంగా చెప్పు కుంటావే ... కృష్ణా, బచ్చలి ఆకులతో చేసిన ఈ జొన్న కూడు ఒక్క ముద్ద దిగ మింగి చూడు, నీ సత్తా తెలుస్తుంది.
భోజన, నిద్రా, మైథునాల్లో ఎలాటి లోపం కలిగినా భరించలేడు శ్రీనాథుడు. ఈ పద్యం చూడండి -
గొంగడి మేలు పచ్చడము కుంపటి నల్లులు కుక్కిమంచమున్
జెంగట వాయుతైలము లజీర్ణపు మందులు నుల్లిపాయలున్
ముంగిట వంటకట్టియల మోపులు దోమలు చీముపోతులున్
రంగ వివేకి కీ మసర రాజ్యము కాపుర మెంత రోతయో
అంగడి యూర లేదు వరి యన్నము లేదు శుచిత్వ మేమి లే
దంగన లింపు లేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై
భంగపడంగ బాల్పడు కృపాపరు లెవ్వరు లేరు దాత లె
న్నంగను సున్న గాన బలనాటికి మాటికి బోవ నేటికిన్
తేలాకాయెను బోనము
పాలాయెను మంచినీళ్ళు పడియుండుటకున్
నేలా కరవాయె నిసీ
కాలిన గురిజాల నిష్ట కామేశ శివా"
**************
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
33.మాఆయ్య గారు
గ్రామం బాగు పడటానికి కారణం మాఆయ్య గారు
గ్రామంలో సారాయి, బ్రాంది షాపులు పెట్టింది మాఆయ్య గారు
విద్యాలయాలు, దేవాలయాలు కట్టించింది మాఆయ్య గారు
పేకాట, అర్ధనగ్న నృత్యాలతో క్లబ్బులునడుపుతున్నది మాఆయ్య గారు
ముఖ్యమంత్రి, రాష్ట్రపతి వచ్చినా చ్చేస్తారు విందు మాఆయ్య గారు
అంతదాకా ఎందుకు భర్తలు దుబాయిలో ఉన్న వారిని తల్లులు చ్చేసేది మాఆయ్య గారు
34. అమ్మతోడు
ఒక అమ్మాయి అబ్బాయి పోయి దగ్గరకు నీవు చాల అందముగా వున్నావు అన్నాడు
వేరే అమ్మాయితో కుడా ఇట్లాగే అని ఉంటావు
అమ్మతోడు వేరోకరివంక కన్నెత్తి చూడలేదు
కేవలం బోగం కొంపకు పోయినఫ్ఫూడూ అని వుంటా
.........
35. కుక్క
రోడ్డుమీద కుక్కలు ఊంటాయి జాగ్రత్త అన్నాడు తండ్రి కూతురితో :
కుక్కలు ఇళ్ళలో కదా వుండేది, మరి కట్టేసి ఉమ్చుతారుకదా
అవి వేరు, కొన్ని చిత్రకార్తి కుక్కలు ఊంటాయి, అదిగో అటు చూడు
ఒక ఆడకుక్క వెంబడి ఎన్ని మగ కుక్కలు వెంబడి బడ్డాయో
ఈ లోకంలో ఎందుకు పుట్టిమ్చాడు నాన్న ....ఆ.........
No comments:
Post a Comment