🌹. శ్రీమద్భగవద్గీత - 552 / Bhagavad-Gita - 552 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 19 🌴
19. తానహం ద్విషత: క్రూరాన్ సంసారేషు నరాధమాన్ |
క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు ||
🌷. తాత్పర్యం :
అసూయగలవారును, క్రూరులును అగు నరాదములను వివిధ ఆసురజన్మలనెడి సంసారసాగరమున నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను.
🌷. భాష్యము :
జీవుని ఒక ప్రత్యేక దేహమునందు ప్రవేశింపజేయుట యనునది శ్రీకృష్ణభగవానుని విశేష అధికారమని ఈ శ్లోకమున అతిస్పష్టముగ తెలుపబడినది. దానవప్రవృత్తి గలవాడు భగవానుని అధికారమును ఆంగీకరింపక తనకు తోచిన రీతిలో వర్తించినను, అతని తదుపరి జన్మము మాత్రము ఆ భగవానుని నిర్ణయముపైననే ఆధారపడియుండును.
అది ఎన్నడును అతనిపై ఆధారపడియుండదు. మరణము పిదప జీవుడు తల్లిగర్భములో ప్రవేశపెట్టబడుననియు, అచ్చట అతడు తగిన దేహమును భగవానుని దివ్యశక్తి యొక్క పర్యవేక్షణమున పొందుననియు శ్రీమద్భాగవతపు మూడవస్కంధమున తెలుపబడినది. కనుకనే భౌతికజగమున జంతువులు, కీటకములు, మనుష్యాది పలుజీవజాతులను మనము గాంచుచున్నాము. అవన్నియు శ్రీకృష్ణభగవానుని శక్తిచేతనే రూపొందినవి గాని యాదృచ్చికముగా కాదు.
ఇక ఆసురస్వభావుల విషయమున వారు సదా అసురయోనులందే ఉంచబడుదరనియు, తత్కారణముగా వారు ద్వేషులుగాను మరియు నరాధములుగాను కొనసాగుదురనియు ఇచ్చట తెలుపబడినది. అట్టి అసురస్వభావులు సదా కామపూర్ణులును, హింసాపూర్ణులును, ద్వేషులును, శుచిరహితులును అయియుందురు. అరణ్యములందు నివసించు పలురకములైన వేటగాళ్ళు అట్టి అసురజాతికి చెందినవారుగా పరిగణింపబడుదురు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 552 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 19 🌴
19. tān ahaṁ dviṣataḥ krūrān
saṁsāreṣu narādhamān
kṣipāmy ajasram aśubhān
āsurīṣv eva yoniṣu
🌷 Translation :
Those who are envious and mischievous, who are the lowest among men, I perpetually cast into the ocean of material existence, into various demoniac species of life.
🌹 Purport :
In this verse it is clearly indicated that the placing of a particular individual soul in a particular body is the prerogative of the supreme will.
The demoniac person may not agree to accept the supremacy of the Lord, and it is a fact that he may act according to his own whims, but his next birth will depend upon the decision of the Supreme Personality of Godhead and not on himself. In the Śrīmad-Bhāgavatam,
Third Canto, it is stated that an individual soul, after his death, is put into the womb of a mother where he gets a particular type of body under the supervision of superior power. Therefore in the material existence we find so many species of life – animals, insects, men, and so on. All are arranged by the superior power.
They are not accidental. As for the demoniac, it is clearly said here that they are perpetually put into the wombs of demons, and thus they continue to be envious, the lowest of mankind. Such demoniac species of men are held to be always full of lust, always violent and hateful and always unclean. The many kinds of hunters in the jungle are considered to belong to the demoniac species of life.
🌹 🌹 🌹 🌹 🌹
[6:24 am, 18/11/2020] On Sriram**: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 114, 115 / Vishnu Sahasranama Contemplation - 114, 115 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻114. రుద్రః, रुद्रः, Rudraḥ🌻
ఓం రుద్రాయ నమః | ॐ रुद्राय नमः | OM Rudrāya namaḥ
సంహారకాలే భవాన్ సంహరన్ సకలాః ప్రజాః సంహార ప్రళయకాలమున సమస్త జీవులను సంహరించువాడగుటచే రుద్రుడు. యో రోదయతి రుద్రస్స రుడం రాతీతి వా తథా అట్లు సంహరింపబడిన వారిని చూచి తత్సంబంధ జీవులు రోదించెదరు. అట్లు రోదింపజేయువాడు గనుక రుద్రుడు.
:: శివ పురాణం - సంహిత 6, అధ్యాయం 9 ::
రు ర్ధుఃఖం దుఃఖ హేతుర్వా తద్(తం) ద్రావయతి యః ప్రభుః ।
రుద్ర ఇత్యుచ్యతే తస్మాచ్ఛివః పరమ కారణం ॥ 14 ॥
'రు' అనగా దుఃఖము లేదా దుఃఖమునకు కారణమగునది (అవిద్య) అని అర్థము. ఏ ప్రభువు (దానిని తరిమివేయ శక్తి సంపన్నుడో) దానిని తరిమివేయునో అట్టి సర్వకారణములకు కారణమగు (పరమకారణము) శివుడు ఆ హేతువుననే 'రుద్రః' అనబడుచున…
[6:24 am, 18/11/2020] On Sriram**: 🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 37 / Sri Devi Mahatyam - Durga Saptasati - 37 🌹
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 11
🌻. నారాయణీ స్తుతి - 1 🌻
1-2. ఋషి పలికెను : ఆ గొప్ప దానవచక్రవర్తి దేవిచే అక్కడ పరిమార్పబడినప్పుడు, ఇష్టార్థసిద్ధి పొందడం వల్ల దిక్కులను తేజరిల్లజేసే విధంగా దీపించే ముఖపద్మాలతో ఇంద్రాది దేవతలు అగ్ని దేవుణ్ణి ముందు ఉంచుకుని ఆమెను (కాత్యాయనిని) స్తుతించారు.
3. "శరణు జొచ్చినవారి దుఃఖాలను పోగొట్టే దేవీ, ప్రీతవగుము. ఎల్ల లోకాలకు తల్లీ! ప్రీతవగుము! విశ్వాన్ని పరిపాలించే దేవీ, ప్రీతవగుము. జగత్తును రక్షించు. చరాచర ప్రపంచమంతటికి ఓ దేవీ! నీవు పరిపాలకురాలవు.
4. "అతిక్రమింప నలవికాని శౌర్యం గల ఓ దేవీ! భూమిరూపంలో ఉండే నీవే ఈ జగత్తుకు ఆధార భూతురాలవు. నీటి రూపంలో ఉండే నీ చేత ఈ సర్వమూ తృప్తి చెందుతుంది.
5. "విష్ణుదేవుని శక్తివైన నీ పరాక్రమానికి మేర లేదు. జగత్తుకు మూలమైన ఆది మాయవు నీవు. నీచేత ఈ సర్వమూ (విశ్వం) భ్రాంతి (అజ్ఞానం) పొందింది. ప్రీతి చెందితే లోకంలో మోక్షానికి నీవు కారణభూతురాల వగుతావు.
6. "దేవీ! విద్యలన్ని నీ వివిధ అంశలు, అలాగే లోకంలో స్త్రీలు అందరూ (నీ) వివిధకళలు (అంశలు) కలిగి ఉంటారు. తల్లీ! ఈ జగత్తునంతా నీవే నిండి ఉన్నావు. స్తుతింపదగిన సర్వవస్తువుల యొక్క పరాపరోక్తి (ముఖ్యోక్తి, గౌణోక్తి రెండూ) రూపవైన నిన్ను స్తుతించడం ఎలా?
7. సర్వభూతస్వరూపిణివైన దేవి (పరంజ్యోతి)గా, భోగమోక్ష ప్రదాయినిగా ప్రశంసిచబడుతున్న నిన్ను ఎంత శ్రేష్ఠమైనవి అయినా కూడా ఏ మాటలు వర్ణించగలవు?
8. సర్వజనుల హృదయాలలో బుద్ధిరూపంలో నిలిచి ఉంటూ, స్వర్గ సుఖాన్ని, మోక్షాన్ని ప్రసాదించే ఓ దేవీ! నారాయణీ! నీకు ప్రణామాలు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 37 🌹
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj
CHAPTER 11
🌻 Hymn to Narayani - 1 🌻
The Rishi said:
1-2. When the great lord of asuras was slain there by the Devi, Indra and other devas led by Agni, with their object fulfilled and their cheerful faces illumining the quarters, praised her, Katyayani:
The devas said:
3. 'O Devi, you who remove the sufferings of your suppliants, be gracious. Be propitious, O Mother of the whole world. Be gracious, O Mother of the universe. Protect the universe. You are, O Devi, the ruler of all that is moving and unmoving.
4. 'You are the sole substratum of the world, because you subsist in the form of the earth. By you, who exist in the shape of water, all this (universe) is gratified, O Devi of inviolable valour!
5. 'You are the power of Vishnu, and have endless valour. You are the primeval maya, which is the source of the universe; by you all this (universe) has been thrown into an illusion. O Devi. If you become gracious, you become the cause of final emancipation in this world.
6. 'All lords are your aspects O Devi; so are all women in the world, endowed with various attributes. By you alone, the Mother, this world is filled. What praise can there be for you who are of the nature of primary and secondary expression regarding (objects) worthy of praise?
7. 'When you have been lauded as the embodiment of all beings, the Devi (the effulgent one), and bestower of the enjoyment and liberation, what words, however excellent, can praise you?
8. 'Salutation be to you, O Devi Narayani, O you who abide as intelligence in the hearts of all creatures, and bestow enjoyment and liberation.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
[6:24 am, 18/11/2020] On Sriram**: 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 106 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -36 🌻
అధవా వివేకం ఇంకా కొద్దిగా స్థాయికి పడిపోయింది, అప్పుడేమి చేయాలట? ‘అధమాధమంచ తీర్ధాటనం’ - ఒక కాశీనో, ఒక రామేశ్వరమో. ప్రతి సంవత్సరము మానవులందరూ ఒక సంవత్సర చక్రభ్రమణం పెట్టుకోండి. ఆ సంవత్సర చక్రభ్రమణంలో ఎక్కడికో ఒక చోటుకి, దేవాలయ దర్శనం, లేదా ఒక క్షేత్ర దర్శనం, ఆరామ దర్శనం. మీరు ఏదైనా పెట్టుకోండి.
ఏ ప్రాంతానికి వెళ్తే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహనీయులను దర్శించేటటువంటి పనిగా పెట్టుకోండి. నిజానికి మహానుభావులను, మహనీయులను, మహర్షులను, సందర్శించుటం కొరకే ఈ తీర్ధాటనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనము ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్న, రామకృష్ణ మిషనో, ఒక చిన్మయా మిషనో, ఒక బ్రహ్మకుమారీ ఆశ్రమమో ఇట్లాంటి ఆశ్రమాలు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నా…
[6:24 am, 18/11/2020] On Sriram**: 🌹 Guru Geeta - Datta Vaakya - 126 🌹
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
118
Dileepa realized that the lion had great powers. He knew it was not an ordinary lion because it could speak human language. He was surprised to hear it speak. We discussed that the king replied humbly, “Lion king, it is true that this is your territory. It is also true that this divine cow is your prey. But, this divine cow is under my protection.
So, please let go of the cow and eat me instead. That will be just”. Saying so, he lowered his head to the lion. The cave glowed with divine light. Nandinidhenu looked very pleased .
She said, King, this is all my creation. I am happy with y…
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 110 / Sri Gajanan Maharaj Life History - 110 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 20వ అధ్యాయము - 5 🌻
ఆ భిక్షకుడే కనుక శ్రీమహారాజు అయితే తనకు తప్పకుండా వ్యాపారంలో, మంచి లాభాలు రావాలని అతను అనుకున్నాడు. అదే రోజున అతని దూదినింపిన బళ్ళు వార్ధాకు అమ్మకానికి తేబడ్డాయి. వాటికి మంచిధర వచ్చింది. అప్పడు యాదవ్ శ్రీగజానన్ మహారాజు తన దగ్గరకు ఆభిక్షకుని రూపంలో వచ్చినట్టు నమ్మాడు.. శ్రీమహారాజు తన భక్తులను సదా కాపాడుతారు.
ఇప్పుడు కావర్ అనుభవం వినండి ...... భవ్ రాజారాం కావర్ ఖాంగాంలో వైద్యుడు, అతనికి తెల్టరా బదిలీ అయింది. తెల్టరాలో పనిలో చేరేముందు, అతను తన కుటుంబంతోపాటు షేగాం దర్శనానికి వచ్చాడు. షేగాంలో ఒక ఎడ్లబండిని తెల్లరా వెళ్ళేందుకు అద్దెకు తీసుకున్నాడు. అతను సాయంత్రం బయలుదేరబోతూ ఉంటే, రేపు ప్రసాదం తీసుకున్నాకా మీరు షేగాంనుండి వెళ్ళాలని నావినంతి.
ఇంతకు ముందు ఎప్పుడూ మీరు షేగాంనుండి భోజనం చెయ్యకుండా వెళ్ళలేదు. మరి ఈరోజు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ? పైగా ఈరోజు వ్యాతిపతి, ప్రయాణానికి అశుభమయిన రోజు అని బాలాభవ్ అన్నాడు. కావర్ పాక్షికంగా అంగీకరించాడు. తనురాత్రి భోజనం చెయ్యగానే వెంటనే బయలుదేరతాను అన్నాడు. ఆప్రకారంగా కుటుంబంతో కలిసి బయలుదేరాడు.
అ రోజు చిక్కటి చీకటి రాత్రి. ఆ చీకటి అంధకారంలో తెల్టరా దారితప్పి ఒకసన్నటి దారిన చుట్టూ అడవిలా ఎదురుగా పెద్ద సరస్సు ఎదురయింది. బండి ఆగింది. దారి అడుగుదామన్నా చుట్టుప్రక్కల ఎవరూ లేరు. మనం తప్పుదారిన ఉన్నాంఅని బండివాడు అన్నాడు. కావర్ ఆశ్చర్యపోయాడు. బండిదిగి అతను నిజంగానే తెల్టరా వెళ్ళవలసిన దారి తప్పడం చూసాడు.
కావర్ ఈ తప్పుకు బండివాడిని దూషించాడు. దానికి, నన్ను ఎందుకు దూషిస్తున్నారు, నేను తరచు ప్రయాణికులను తెల్టరా తీసుకు వెళుతూ ఉంటాను. నాకు తెలిసినంతవరకు నేను సరిఅయిన దారినే అనుసరించాను, ఎడ్లుకూడా ఎటూ తిరగకుండా తిన్నగా నడిచాయి. ఈ సరస్సు చూసిన తరయవాతనే అవి ఆగాయి, ఇది ఖచ్చితంగా తెల్టరా దారి కాదు అని బండివాడు అన్నాడు.
అప్పడు కావర్ దీనికి కారణం అర్ధం చేసుకున్నాడు. బాలాభవ్ ప్రార్ధన లక్ష్యపెట్టకుండా, ప్రసాదం తీసుకోకుండా షేగాం వదిలి రావడంవల్ల ఈపని శ్రీమహారాజుదే అని అతను అనుకున్నాడు. చేతులు కట్టుకుని, ఆ అడవిలో తనను కాపాడవలసిందిగా శ్రీమహారాజును ప్రార్ధించాడు. వెంటనే ఎడ్ల గంటలమోత వినిపించింది. అది అతని ధైర్యం తిరిగి పుంజుకునేలా చేసింది. బండి వాడిని ఆ శబ్దంవస్తున్న దిశలో నడవమని సూచిస్తాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Gajanan Maharaj Life History - 111 🌹
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
🌻 Chapter 20 - part 5 🌻
Before joining his duty at Telhara, he, along with his family, came to Shegaon for Maharaj’s Darshan. At Shegaon he hired one bullock cart for going to Telhara, and when he was about to start in the evening, Balabhau said to him, It is my request that you should leave Shegaon only after taking prasad tomorrow.
Before this, you never went from here without taking any food. Why are you behaving like this today? Moreover today is 'Vyatipat', an inauspicious day for travel. Kavar agreed partially. He said that he would start immediately after taking meals at night.
Accordingly he left with his family after eating dinner. It was a pitch dark night. It so happened that, in the darkness, he missed the road to Telhara and strayed on a narrow path with jungle all around and a big lake in front. The cart stopped. There was nobody nearabout from whom they could enquire their location.
The cartman said that they were on the wrong path. Kavar was surprised. He got down and saw that they had really missed the road to Telhara. Kavar abused the cartman for his mistake. Thereupon the cart man said, Why are you abusing me? I frequently take the passengers to Telhara and, as far as I think, I followed the right path, the bullocks too walked straight without turning anywhere.
They stopped only when they saw this lake. This is surely is not the road to Telhara. Then Kavar understood the reason of all that was happening. He thought it to be the act of Shri Gajanan Maharaj , as he had left Shegaon without taking prasad in the morning and, that too, by ignoring the request of Balabhau. With fold…
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 94, 95 / Sri Lalitha Chaitanya Vijnanam - 94, 95 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ‖ 37 ‖
🌻 94. కౌళినీ 🌻
శివశక్తి సామరస్యమే కౌళము. అట్టి కౌళము గలది శ్రీదేవియని ఈ నామము తెలుపుచున్నది.
కుళ మనగా శక్తి యని, అకుళము అనగా శివుడని, కూళాకుళ సంబంధమే కౌళమని తంత్రశాస్త్రము తెలుపుచున్నది. అమ్మ శివశక్తియే. శివుని వ్యక్తరూపమే అమ్మ. దైవము సాక్షాత్కరింపవలె నన్నచో రూపమును ధరించవలెను. కనపడుట కిదియే మార్గము. రూపము స్థూలమైనను, సూక్ష్మమైనను, సూక్ష్మకరమైనను, సూక్ష్మతమమైనను అమ్మయే. అమ్మలేక, దేవుడు కనపడడు. కేనోపనిషత్తు ఈ రహస్యమునే బోధించు చున్నది.
శివుడు లేక పరదైవము లేక పరబ్రహ్మము అవికారము,
అలక్షణము, అప్రతర్క్యము, అవిశ్లేయము, అనూహ్యము, అతీతము, అపరిమితము, అగోచరము. అట్టి తత్త్వము వ్యక్తమగుటయే వెలుగు. ఆ వెలుగే అమ్మ.
వెలిగినచో కనపడును. వెలుగక ముందు కనపడదు.
కనపడనిది కనిపించుటయే అమ్మ ఆవిర్భావము. వెలుగుటకు కారణము వెలుగున కాధారముగ నున్న తత్త్వము. విద్యుత్తు కనపడదు కాని దాని వెలుగు కనపడుచున్నది కదా! దాని శక్తి తెలియుచున్నది కదా! అట్లు పరతత్త్వము యొక్క వెలుగు, శక్తి అమ్మగ ప్రకటిత మగుచున్నది. విద్యుత్తు లేనిదే వెలుగు లేదు. అట్లే శివుడు లేనిదే శక్తి లేదు.
వెలుగునందు, శక్తినందు విద్యుత్తు వున్నది కదా! అట్లే అమ్మ యందు అయ్య వున్నాడు. అమ్మ కనపడితే అయ్య అనుగ్రహించినట్లే. అయ్య రూపమే అమ్మ. శివరూపమే శివా. పై కారణముగనే పంచాక్షరీ మంత్రము అమ్మ నుద్దేశించి ఈయబడినదని తెలియవలెను. 'ఓం నమః శివాయ'. 'శివా' శబ్దము అమ్మ నుద్దేశించినది.
శివుడు కనపడుట యనగా శివారూప సాక్షాత్కారమే. ఇది వారి సామరస్యము. ఆకుళుడైన శివుడు కుళయైన అమ్మ కలిసి కౌళముగ సృష్టి జరుగుచున్నది. జరిపించునది 'కౌళినీ' యగు అమ్మ. శివ సహకారముతో, శివ సంకల్పముగ శివశక్తియై నిలచి జీవుల ననుగ్రహించుచున్న తల్లియే జగన్మాత శ్రీదేవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 94 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻Kaulinī कौलिनी (94) 🌻
She is the core of kaula worship. Kaula worship is a tantric worship under śākta method (methods of worshipping Śaktī is called śākta worship). Since She is the centre of this worship She is called kaulīnī.
As She is worshiped everywhere (omnipresence), She is called as kaulīnī (as per triad – worshipper, worshipped and worship). Tantra śāstra define Śaktī as kulā and Śiva as akula. The union of Śiva and Śaktī is called as kaula and She is called kuṇḍalinī.
This union takes place in sahasrāra. There is a reference in some tantra texts to one more thousand petal lotus, just below the thousand petal lotus, is the sahasrāra. In the centre of the second sahasrāra, Kula Devi is worshiped and in the petals kula Śaktīs are worshiped.
Kaulīni also means this kula Devi, the goddess of one’s lineage. One of the Vāc-Devi-s, the authors of this Sahasranāma is known as Kaulīnī. The external worship of cakra-s, possibly meaning that Śrī Cakra is also called kaulīnī.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 95 / Sri Lalitha Chaitanya Vijnanam - 95 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ‖ 37 ‖
🌻 95. 'కులయోగినీ 🌻
హృదయాకాశమున శ్రీదేవి పాదపద్మములతో అనుసంధానము చెంది పూజాదులను చేయుట కుళమని, అట్టి విధానమున యోగము చెందుట కుళయోగమని, దాని ననుగ్రహించినది శ్రీదేవి యని అర్థము. అమ్మ చైతన్య స్వరూపిణి.
మనయందు కూడ సుషుమ్న మార్గమున నిలచియున్న చైతన్యము శ్రీదేవియై ఆమె సాన్నిధ్యమును పొందుటయే యోగము. అట్టి యోగము నిర్వర్తించుకొనుటకు అమ్మ రూపమును గాని, శ్రీచక్రమునుగాని హృదయాకాశమున దర్శించి ఆరాధించుట కౌళమార్గము.
బాహ్య పూజలకు ముందుగాని తరువాత గాని ఈ విధముగ హృత్ పద్మమున అమ్మ ఆసీనురాలై యున్నట్లు భావించి అంతరంగమున ధ్యానించవలెను, అచటనే పూజింపవలెను.
ఆకాశము పంచభూతములలో అత్యంత పవిత్రము. అది వెలుగుతో కూడినది. అట్టి ఆకాశమును దర్శించి అందు శ్రీదేవి రూపమునుగాని, శ్రీచక్రమునుగాని భావన చేత రూపొందించి, స్థాపించి పూజింపవలెను.
అందులకే సహస్ర నామ పారాయణము ముందు ధ్యానశ్లోక మీయబడినది. అందు అమ్మరూపము వర్ణింపబడినది. "అరుణాం కరుణా తరంగితాక్షీం.....” అను ధ్యానశ్లోకము అమ్మ రూపమును ఆవిష్కరించగలదు.
ఆమె మనోహర యగుటచే అంతరంగమున మనసు హరింపబడి, బుద్ధిలోకమున ధ్యానము, పారాయణము నిలువగలదు. పై విధమైన అంతరంగ ఆరాధనమున హృదయపద్మము ద్వారా సుషుమ్నను చేరవచ్చు లేదా మన చుట్టును గల నీలాకాశమున శ్రీచక్రమును గాని, అమ్మ రూపమును గాని మానసికముగ, రూపొందించుకొని ధ్యానించుట, పూజించుట చేయవచ్చును. ఇది బాహ్యారాధనము.
కుళయోగము కులమధ్యమున నిర్వర్తించుకొనుట భగవద్గీత యందు బోధించియున్నారు. హృదయ పద్మమున నిర్వర్తించుట ఉపనిషత్తులందు తెలుపబడినది. మూలాధారమున నిర్వర్తించుట సద్గురు సాన్నిధ్యమున మాత్రమే వీలగునని పెద్దల అభిప్రాయము.
సహస్రారము దిగువ నుండి మూలాధార కేంద్రము వరకు గల షట్చక్రములను కలుపు సుషుమ్న నాళము అంతయూ కుళమే. జీవ లక్షణమును బట్టి, గురూపదేశమును, నిర్దేశమును బట్టి ఈ నాళమున ఏ కేంద్రము ద్వారా నైనను యోగింపవచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 95 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Kulayoginī कुलयोगिनी (95) 🌻
Kaulā means mental worship. Here it means offering mental worship to Her in the six cakra-s. Mental worship can be performed only through yoga.
Kula means mūlādhārā cakra and akula means sahasrāra. The link between these can be established only by yogic methods. That is why she is called as Kulayoginī.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
సేకరణ ప్రాంజలి ప్రభ
శిష్టత - మార్గ శిర మాసం
ధ్యానము
మానవుడు నిత్యమూ తన మనసులో స్మరించవలసింది - ధ్యానించవలసింది ఏమిటని ప్రశ్న. కళ్లు మూసినా తెరచినా కనిపించేది మనకీ ప్రపంచమే. కాబట్టి అందులో విషయాలే మనసుకు వస్తుంటాయి. వీటిని గుర్చే ఆలోచిస్తుంటాము. అందులోనూ మనకు కొన్ని ఇష్టమైనవైతే కొన్ని ఇష్టం లేనివి. ఇష్టం లేని వాటిని పరిహరిస్తూ ఇష్టమున్న వాటిని గురించే ధ్యానిస్తుంటాము. ఇదే సహజంగా ప్రతి మానవుడు చేస్తున్న పని. పగలంతా మెలుకువగా ఉన్నంత వరకూ ఇదే. రాత్రి స్వప్నంలోనే మనమేదీ ఆలోచించనిది. ఆలోచించకున్నా ఈ ఆలోచనల సంస్కారాలే అక్కడా పనిచేస్తూ మనలను వెంటాడుతుంటాయి. మొత్తంమీద ప్రాపంచిక విషయాలతోనే నిండి నిత్యమూ సతమతవుతూంటాయి మానవుడి మనోవ్యాపారలన్నీ.
అయితే ఈ ఆలోచనల వల్ల ఏమైనా సుఖమా శాంతా అని చూస్తే ఏదీ లేదు. లేదని పెద్దలు చెప్పటమే గాదు. ఆబాలగోపాలమూ అందరికీ అనుభవసిధ్ధమే. శాంతి సౌఖ్యాలకు నోచుకోనప్పుడీ ఆలోచనలెన్నిపెట్టుకొని ఏమి ప్రయోజనం. మానవుడెప్పుడూ కోరుకొనేది అవి రెండే గదా. మరి ఎలా సిధ్ధిస్తాయవి. దేనివల్ల సిధ్ధిస్తాయి. ప్రాపంచికం వల్ల కాదని ఎప్పుడన్నామో ఇక పారమార్ధికం వల్లనే కావాలది. ఇది ఈ ప్రాపంచక పదార్ధాలన్నింటినీ వ్యాపించిన ఒక మహాచైతన్యం. నిరాకారమైన దానివల్లనే ఈ ఆకారలన్నీ ఏర్పడుతున్నాయి. నిశ్చలమైన దాని వల్లనే ఇవన్నీ ఇలా చలిస్తున్నాయి. సర్వవ్యాపకమైన దాని భంగిమలే ఈ పరిమితమైన విశేషాలన్నీ. కాబట్టి దాన్ని గురించే ఎప్పుడూ మనం ధ్యానించవలసింది. ఆత్మ చైతన్యంతో సంబంధమే నిజమైన జీవితం మానవుడికి. అనాత్మ ప్రపంచ సాంగత్యమే మరణం. ఆత్మ ధ్యానంలో ఉన్న మానవుడు మిగతా మానవుల మధ్య మృతకళేబరాల మధ్య ఒక కాటి కాపరిలాగా జీవుస్తుంటాడని వాక్రుచ్చారు పెద్దలు.
అయితే ఏమిటీ ఆత్మ ధ్యానము. అది ఎలా చేయాలని ప్రశ్న. నాలుగు భూమికలున్నా యిందులో. మొదటిది నోటితో ఏదో జపిస్తూ కీర్తిస్తూ కూచోటం. ఇది నోటి వరకే. మనసు మీద పని చేయదు దాని ప్రభావం. మనసు ఏ భావమూ లేక స్తబ్ధంగానే ఉండిపోతుంది. అయితే ఎంతవరకంటే పిచ్చి పిచ్చి ప్రసంగాలతో కాలం వృధా పుచ్చక దైవప్రార్ధన చేస్తూ పోవటం కొంచెం మేలు. పోతే రెండవది నోటితో అనే దాని భావం మనసులో ప్రవేశించటం. అంటే శబ్దాన్ని దాటి అర్ధం దగ్గరికి వచ్చామన్నమాట. కాని అంతవరకే అది. మనసులో ప్రవేశించినా నిలకడగా ఉండదది. మెరుపులాగా వస్తూపోతూ ఉంటుంది. పోతే మూడవది పరమాత్మ రూపం బాగా మనసులో నాటుకొని కదలకుండా నిలచి ఉండటం. ఎంతగా నిలుస్తుందంటే మిగతా ప్రాపంచిక విషయాల మీదికి మరలా దాన్ని త్రిప్పాలంటే బలవంతంగానే త్రిప్పాల్సివస్తుంది. రెండవదానికిది కేవలం ప్రతి ద్వంద్వి అయిన భూమిక.
పోతే ఇక నాలుగవది ఆఖరిది ఏమంటే మనసులో భగవద్రూపాన్ని గూర్చిన ఆలోచన గాదు. భగవత్తత్వమే నిలచి ఉండాలి. ప్రపంచమూ - భగవంతుడూ - దాన్ని గూర్చిన ఆలోచనా - అన్నీ కలసి భగవత్స్వరూపంగానే అనుభవానికి రావాలి సాధకుడికి. అది కూడా తనకు భిన్నంగా కాక తన ఆత్మ స్వరూపంగానే సాక్షాత్కరించాలి. నేనొక ధ్యాతను - నాకొక ధ్యేయమైన పదార్ధముంది - దాన్ని గూర్చే ధ్యానిస్తున్నాననే భావమే ఉండదప్పుడు. ధ్యాతా నారాయణః ధ్యానం నారాయణః -- అన్నట్టు అంతా ఆత్మ స్వరూపమే. ఇదే ధ్యానానికి పరాకాష్ఠ.
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
66. మేజర్
డాక్టర్ : మీ అబ్బాయికి మేజర్ ఆపరేషన్ చెయ్యాలి
లక్షరూపాయలు ఖర్చు అవుతుంది
తండ్రి : మా అబ్బాయి మైనరు కదండి, మేజర్ ఆపరేషన్ ఎందు కండి
67. మహోపకారం
టీచర్: పిల్లలతో మీనాన్న మీకు చేసిన మహోపకారం ఏమిటి
చెప్పు "రాము"
మా అమ్మతో కాపురం చెయ్యటం ..........
మా అమ్మను నన్ను ప్రేమగా చూడటం ........
68. సృష్టి
అమ్మాయిలు తల్లి లాగ వంట చేస్తున్నారు, తండ్రిలాగా ఉద్యో గములు చేస్తున్నారు, త్రాగు బోతులుగా మారి రోడ్డుమీద పడుతున్నారు, క్లబ్ ల వెంట తిరుగుతున్నారు,
అవసరానికి, ఆశకు, వళ్ళు అమ్ముకొని బ్రతుకుతున్నారు అన్నాడు "సుబ్బు"
మగవాడు ఇంటికి కాపలాగా, పిల్లలకు అన్నం తినిపించి స్కూ లుకు తీసికెళ్ళి
తీసుకు రావటం, అమ్మలక్కలతో ముచ్చట్లు చెప్పటం ఇదేగా పని అన్నాడు రాము
ఏది ఎమైన ఒకరికొకరు సహకరించు కొనుచు బ్రతుకే బ్రతుకు కాని ఆ పిల్లలను కనేది మాత్రము ఆడదే అదే దేవుని సృష్టి కదా .....................
No comments:
Post a Comment