Thursday, 12 November 2020

కార్తీకపురాణం - 2 వ అధ్యాయం

🕉☘🕉☘🕉☘🕉☘🕉☘🕉

సోమవార వ్రత మహిమ

☘☘☘☘☘☘☘️☘☘

వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు ”జనకా ! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని , దాని మహత్యాన్ని గురించి చెబతాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.

”కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని , పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం చేసి , తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి , సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి , పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించాలి.నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత ,  తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి , సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే… కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసముంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను”* అని ఇలా చెప్పసాగాడు.

కుక్క కైలాసానికి వెళ్లుట…

”పూర్వ కాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్టురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్హణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు , శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని ‘అపర బ్రహ్మ’ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో , కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది. అత్తమామలను , భర్తను తిట్టడం , కొట్టడం , రక్కడం చేసేది. పురుషసాంగత్యంతో వ్యభిచారిణియై… తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు , బట్టలు , పువ్వులు , ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా… ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కలవారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ… కర్కశ అని పేరుపెట్టి ఎగతాళి చేసేవారు.


ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా… ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పడేసి, పైన చెత్తచెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురులేదని , అడ్డూఅదుపు ఉండదనే అహంకారం పెరిగి… ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి , నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలైంది. అంతటితో ఆగకుండా… కన్యలు , పెళ్లైన మహిళలకు దుర్బుద్దులు నేర్పి , పాడుచేసి , విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది.

ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసినపాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము , రక్తం కారుతూ , క్రమంగా కుష్టువ్యాధిబారిన పడింది. రోజురోజుకూ ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమెకోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామెవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి , పురుగులు పడి చనిపోయింది.

బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని , విటులతో సుఖించినందుకు ఇనుపస్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనపగదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు , అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో , చెవిలో పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంబీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకత్తే కాకుండా , ఇటు ఏడు తరాలు , అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచజన్మలు ఎత్తుతూ , క్రిమికీటకాలుగా పుట్టి.. చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది.

కుక్కజన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే.. తిట్టేవాడు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే… ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి , ఉపవాసము ఉండి , సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి , ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి , కాళ్లూచేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. అయితే… ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది.

వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపెంచిన బలియన్నం కావడం… కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసము ఉండడము , శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క ‘విప్రోత్తమా… నన్ను కాపాడుము’ అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. ‘రక్షించు… రక్షించు…’ అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు ‘ఎవరు నీవు ? నీ వృత్తాతమేమిటి ?’ అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. పదిహేను జన్మల క్రింద సద్భ్రాహ్మణుడి భార్యయైన తాను వ్యభిచారం చేసిన తీరు , భర్తను చంపడం , వృద్ధాప్యంలో కుష్టువ్యాధితో దినదినగండంగా బతికి , చనిపోయిన తీరును , నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ‘ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి , ఇక్కడ పెట్టిన బలిఅన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా…! నాకు మహోపకరాంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి , నాకు మోక్షం కలిగించు’    అని ప్రార్థించింది.     దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలాచేసిన వెంటనే… ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క జన్మను చాలించి , సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివసాన్నిథ్యాన్ని చేరుకుంది.”


ఇతి శ్రీ సాంద పురాణేతర్గత , వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయ అధ్యాయం సమాప్తం.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 [16/11, 16:36] +91 98494 71690: *🌹 . శ్రీ శివ మహా పురాణము - 273 🌹* 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


*🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴* 

64. అధ్యాయము - 19


*🌻. సతీకల్యాణము - శివలీల - 5 🌻*


హే శంభో! మనము త్రిమూర్తలము నీ స్వరూపులము గాన వేర్వేరు గాదు. మన స్వరూపము ఒక్కటి. ఈ తత్త్వమును నీవు విచారించుము (64). మిక్కిలి ప్రియుడగు విష్ణువు యొక్క ఆ మాటను విని అపుడా శంభుడు ఆత్మ స్వరూపమును ప్రకటింప చేయదలచి మరల ఆతనితో నిట్లనెను (65).


శంభువు ఇట్లు పలికెను -


హే విష్ణో! నీవు భక్తులందరిలో శ్రేష్ఠుడవు. బ్రహ్మ నాకు ఆత్మ ఎట్లు అగును? ఈతడు నా కంటె భిన్నముగా ఎదురుగ నిలబడి ప్రత్యక్షముగ కనబడు చున్నాడు గదా! (66).


విష్ణువు ఇట్లు పలికెను -


ఓ సదాశివా! బ్రహ్మ నీకంటె వేరుగాదు. నీవు ఆతని కంటె వేరు గాదు. మరియు, నేను నీకంటె వేరు గాదు. ఓ పరమేశ్వరా! నీవు నాకంటె వేరు గాదు (68). హేసర్వజ్ఞా!పరమేశా!సదాశివా!నీకంతయూ తెలియును. నీవు నా నోటిగుండా అందరికీ సర్వమును వినిపించ గోరుచున్నావు (69). 


ఈశా! నీ ఆజ్ఞచే శివతత్త్వమును నిలకడ అయిన మనస్సుతో చెప్పు చున్నాను. సర్వదేవతలు, మునులు, ఇతరులు వినెదరు గాక!(70). నీవు ప్రకృతి స్వరూపుడవు. ప్రకృతికి అతీతుడవు. లోకములో భిన్నముగా కనబడే సర్వము నీవే. కాని నీయందు భేదము లేదు. మనము త్రిమూర్తులము జ్యోతిర్మయుడగు శివుని అంశములైన దేవతలము (71).


నీవెవరు?నేనెవరు? బ్రహ్మ ఎవరు? పరమాత్మయగు నీ మూడు అంశములు సృష్టిస్థితిలయ నిర్వహణ కొరకై మూడు రూపములతో వేర్వేరుగా భాసించుచున్నవి (72). 


నీ స్వరూపమును నీవే విచారణ చేయుము. నీవు నీ లీలచే దేహమును ధరించి యున్నావు. అద్వయ బ్రహ్మవు నీవే. సగుణ బ్రహ్మవు నీవే. మేము ముగ్గురము నీ అంశలమై యున్నాము. (73). ఒకే దేహమునందు శిరస్సు, మెడ ఇత్యాది అంగములు వేర్వేరుగా నున్నవి. హే హరా! అటులనే మేము ముగ్గురము శివుని మూడు అంగములుగా నున్నాము (74). 


అగ్ని, మేఘము నీ నివాస స్థానములు. నీవు సనాతనుడవు. వికార రహితుడవు. అవ్యక్తుడవు. నీకు అనంతరూపములు గలవు. నీవు నిత్యుడవు. నీయందు దీర్ఘము మొదలగు విశేషణములు లేవు. నీవు శివుడవు. సర్వము నీ నుండియే ఉద్భవించినది (75).


బ్రహ్మ ఇట్లు పలికెను -


ఓ మహర్షీ! మహాదేవుడు అతని ఈ మటలను విని మిక్కిలి ప్రసన్నుడాయెను. మరియు ఆయన అపుడు నన్ను సంహరించలేదు (76).


శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండములో సతీవివాహ శివలీలా వర్ణనమనే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[16/11, 16:36] +91 98494 71690: *🌹. గీతోపనిషత్తు  - 76 🌹*

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ


*🍀 14. నిష్కామకర్మ  -  ఫలాసక్తి లేక కర్మము నాచరించుట వలన అనాది కాలము నుండి కొందరు జీవులు మోక్షమున స్థిరపడి యున్నారు.  నీవు కూడ “కర్మమునే చేయుము. ఫలముల నాశింపకుము”  - కామము లేక కర్మము నిర్వర్తించుట అనునది ప్రారంభమున కష్టముగ గోచరించినను, ఆరంభించినచో క్రమముగ సుళువు దొరుకగలదు.🍀*


*📚. 4. జ్ఞానయోగము  - 15  📚*


జ్ఞాత్వా కృతం కర్మ పూర్వై రపి ముముక్షుభిః |

కరు కర్మైవ తస్మాత్వం పూర్వై: పూర్వతరం కృతమ్ || 15


ముముక్షత్వము పొందిన జీవులందరును పూర్వమాచరించిన సూత్రము “కర్మము నిర్వర్తించుట, కర్మఫలము నాశింప కుండుట." ఫలాసక్తి లేక కర్మము నాచరించుట వలన అనాది కాలము నుండి కొందరు జీవులు మోక్షమున స్థిరపడి యున్నారు. 


కావున నీవు కూడ “కర్మమునే చేయుము. ఫలముల నాశింపకుము” అని తెలుపుటలో దైవము నిష్కామ కర్మ యోగము అనాది కాలము నుండియు గలదని, తానిపుడు క్రొత్తగ తెలుపుట లేదని తెలియ చెప్పుచున్నాడు. 


నిజమునకు సద్గురువు తాను క్రొత్తగ నేదో చెప్పుచున్నట్లు భ్రమను కలిగింపడు. పూర్వీకులనుసరించి, తరించిన మార్గమునే మరల మరల వివరించును. అందుచేత మోక్షాసక్తి గల అర్జునునకు, అనాదిగా మోక్షస్థితి యందు స్థిరపడిన జీవు లేమిచేసిరో కూడ తెలిపినాడు. 


నిజమునకు శ్రీకృష్ణు డాచరించినది, నిష్కామ కర్మమే. దాని నుపదేశించుటకు అతడే తగిన ఆచార్యుడు. కామము లేక కర్మము నిర్వర్తించుట అనునది ప్రారంభమున కష్టముగ గోచరించినను, ఆరంభించినచో క్రమముగ సుళువు దొరుకగలదు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[16/11, 16:36] +91 98494 71690: *🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 161 🌹*

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ


*🌻. జాబాలిమహర్షి  - 1 🌻*.


జ్ఞానం:

1. మహానదుల, మహాఋషుల జన్మవృత్తాంతములు చిత్రంగా ఉంటాయి. వాళ్ళను, “మీరెవరు? ఎక్కడుంటారు? మీ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? మీ పూర్వజన్మ వృత్తంతమేమిటి? మీ తల్లితండ్రులెవరు? మీ గురువెవరు?” అని అడిగితే, సరిఅయిన సమాధానాలు రాకపోవచ్చు. ఆ విషయాలు చెప్పటానికి అంత సులువుగా ఉండవు. క్లిష్టంగా ఉంటాయి. 

2. జాబాల అనే విపస్త్రీకి దేవతావర ప్రసాదంగా సన్యాత్వదశ యందు ఈ జాబాలి పుట్టాడని ఒక పురాణం చెపుతున్నది.

3. ఒక అనుభవానికి, ఆధ్యాత్మిక అనుభవానికి ప్రధానంగా ఉండవల్సిన స్థితి ఏమిటంటే, ముక్తికొరకై నిరీక్షణ. అవి ఎప్పుడూ ఉండవలసిందే! తపస్సు చేసే సమయంలో అనుభూతం కావలసిన ఆత్మజ్ఞానానుభూతి కొరకు నిష్క్రియుడై, నిరంజనుడై, నిర్మలచిత్తుడై ఏ ఉద్రేకమూలేక, ప్రకృతివలె తటస్థుడై ఉండాలి. దాని కొరకై ఇంద్రియములతోను, మనసుతోను చేసే ప్రయత్నము ఏదీ ఉండరాదు. 

4. కేవలం జపం గట్టిగా చేయగలగటం కాని, ధ్యానం పట్టుదలతో చేయటం గాని తపస్సు కానేరదు. కళ్ళుగట్టిగా ప్రయత్నపూర్వకంగా మూసుకుని, అంతరాత్మలో ఏదో ఉంది, దాన్ని చూద్దామనుకునే కోరిక గాని – అదంతా క్రియాశీలత్వము, రజోగుణము యొక్క స్వభావమే. అంతేగాని అది తపోస్వరూపంకాదు. 

5. స్వయంప్రకాశమయినది ఆత్మ. దానికి అడ్డువాచేది మన అవిద్యేకాని, దానిలో ఇవాళ కొత్తగా ఏ ప్రకాశమూ రావలసిన ఆవశ్యకత లేదు. 

6. ఈ సంసారంమీద భయం, దీనియందు విరాగము, విరక్తి, తక్షణమైనటువంటి మోక్షాపేక్ష, సంసారభీతి – ఇవన్నీ లభించిన తరువాత సాధన, తపస్సు, అనుభవము అంటే ఏమిటంటే; నిష్క్రియత్వమే, అంటే ఏమీ చేయకుండా ఉండటమే. అలా ఉండటమే సాధన చేయటమని అర్థం గాని, ఏదో చేయటం అనేది సాధనకాదు. 

7. తీవ్రంగా కష్టపడుతున్నాడా అంటే ఏమీలేదు. నిష్క్రియుడని అర్థం. తీవ్రత అంటే ఏమిటి? ఎవరు పిలిచినా పలుకలేదు. రాళ్ళతో కొట్టినా లేవలేదు. మీద మట్టిపోస్తే ఏమీ అనలేదు. కోపగించలేదు. కొడితేకూడా దెబ్బలుతింటూ అలాగే ఉంటాడు. దేని ధ్యాస యందున్నాడో ఎవరికీ తెలియదు. దానినే నిష్క్రియత్వం అనవచ్చు. రమణ మహర్షికూడా అంతే.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శివగీత  - 115 *

*🌻. భక్తి యోగము - 4 🌻*


మేద సాపిహితం కోశం - బ్రహ్మణో యత్పరం మతమ్,

చతస్త్ర స్త్రస్య మాత్రాస్స్యు - రకారో కారకౌ తధా,

మకార శ్చావ న సానేర్ధ -మాత్రేతి పరి కీర్తతా 16

పూర్వత్ర భూశ్చ ఋగ్వేదో - బ్రహ్మాష్టవ సవస్తద్రూ,

గార్హ పత్యశ్చ గాయత్రీ -గంగా ప్రాత స్సన స్తదా 17

ద్వితీయ తుభువో విష్ణూ - రుద్రో నుష్టుభ్య జు స్తదా,

యమునా దక్షిణాగ్నిశ్చ - మాధ్యంది న సవ స్మృతః 18

త్రుతీయాచ సువస్సామా - న్యాది త్యశ్చ మహేశ్వరః,

అగని రాహవ నీయశ్చ - జగతీచ సరస్వతీ 19

తృతీయం సవనం ప్రోక్తం - మధర్వత్వేన యన్మతమ్,

చతుర్ధి యావసానేర్ధ - మాత్రా సా సోమలోకగా 20

అధర్వాంగి రసస్సంవ -ర్తోకోగ్ని శ్చ మహాం స్తదా,

విరాట్సభ్యావ సధ్యౌచ -శత్రుద్రి రయజ్ఞ పుచ్చకః 21

దివ్య జ్ఞానముతో జుట్టబడిన పరబ్రహ్మ కోశమున పెరుగునట్టి ఆ ప్రణవమునకు నాలుగు మాత్రలు .అకార ,ఉకార,  మకారములు -ఈ మూడును ఆవ సానంబున అర్ధ మాత్రయును  (ఇది ఆగమ రీత్యా చెప్పబడి నది వ్యాకరణ రీత్యా కాదు ) మొదటి మాత్రకు భూమి ఋగ్వేదము బ్రహ్మ అష్ట వసువులు  గార్హ పత్య వహి గాయత్రి గంగ పాత్ర : స్సవనము  ఇవి దేవతలు, మాత్రకు భవర్లోకము. 

విష్ణువు రుద్రుడు అనుష్టుప్ ఛందస్సుయజుర్వేద ము  యమునానది, దక్షి ణాగ్ని మద్యం దిన సవనము  దేవతలు .మూడవ  మాత్రకుసువర్లోము సామవేదము, 

సూర్యుడు, మహేశ్వరుడు,   ఆహవనీ యాగి జగతీ ఛందస్సు  సరస్వతీ సాయం సవనము దేవతలు నాలుగవ అర్ధ మాత్రకు  సంవర్త కాగ్ని, అధర్వణ వేదము ,అధార్వాం గీరసులు,  విరాట్ సభ్యావ సద్యులు శతుద్రి యజ్ఞ పుచ్చుడను దేవతలు.

***


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 100 🌹*

*🌻. మానసిక గోళము - మనోభువనము - 5 🌻*

417. ఆత్మ యొక్క చైతన్యము, మానసిక సంస్కారముల యందు చిక్కుబడి మానసిక శరీరము ద్వారా ఆ సంస్కారముల అనుభవమును పొంది తీరును.

418. మనస్సు యొక్క భౌతిక లక్షణములు:-

వాంఛలు, మానాసికోద్వేగములు, తలంపులు.

419. మనసుయొక్క ప్రబల లక్షణములు :- వాంఛలు

420. మనోమాయ ప్రపంచమందలి మానసిక చైతన్యముగల ఆత్మలు, సూక్ష్మ ప్రపంచము యొక్క అద్భుత శక్తులందు ఎరుక లేకుందురు. ఆకారణము చేత శక్తులను ప్రదర్శించలేరు.

421. ఆధ్యాత్మిక మార్గములో అయిదవ భూమిక వరకు బుద్ధి కౌశలము చేతను, అంతర జ్ఞానముల యదార్థత వల్లను, భగవంతుడు ఉన్నాడని తెలిసికొందురు. వీరి ఆత్మ విశ్వాసము సరయిన జ్ఞానముపై ఆధారపడి యున్నది.

సశేషం...

[16/11, 16:36] +91 98494 71690: *🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 64  / Sri Vishnu Sahasra Namavali - 64 🌹*

*నామము - భావము*

📚. ప్రసాద్ భరద్వాజ 


*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*


*విశాఖ నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*


*🌻 64. శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః |*

*గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ‖ 63 ‖  🌻*


*🌻 64. అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః |*

*శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ‖ 64 ‖ 🌻*


24. మత్తు

ఏమిటండి మా ఆయన ఉన్నప్పుడు రావద్దని చెప్పాగా

మీ అయ్యాన బలహీనత నాకు తెలుసుగా అందుకే వచ్చా

నాకు తెలియని బలహీనత ఏది

ఇదిగో ఈ పూతరేకులు అంటే మీ ఆయనకు ఇష్టo కదా

అవును

అందులో కాస్త మత్తు కలిపా అంతే .............

 

25. మంచిది కాదు

మీ స్నేహితుడు చేసుకొనే అమ్మాయి మంచిది కాదు అన్నది  భార్య భర్తతో

అలా నమ్మకముగా ఎలా చెప్ప గలుగుతావు,

కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు, మీ ఇష్టం మీ స్నేహితుడు ఇష్టం

ఈ పెళ్లి ఆపండి, ఆపక పెళ్లి చేసుకోమనండి నాకెందుకు

ఎందుకు ఆపాలి వాడేమన్న" నా పెళ్లి " అపాడా ...........................


26. అభ్యంతరమా

ఓక లావు పాటి ఆడావిడ ఒక సినమాకు వచ్చి టిక్కెట్టు కొని

గేట్ కీపర్ ఇచ్చింది మీరే రెండు టిక్కెట్లు కొనబోయారా అన్నాడు

నాపక్కన ఎవరోస్తే వారిని నావల్లో కుర్చోపెట్టుకుంటా

నికేమన్న అభ్యంతరమా..............    



No comments:

Post a Comment