Tuesday 3 November 2020

04-11-2020 (బుధవారం )

ఓం శ్రీ రామ్.. శ్రీ మాత్రేనమ:

 


నేటి  ప్రభలో  శ్రీ వర్ణమాలా స్తోత్రమ్, నేటి హాస్య కధ .. 🌸 కనపడుట లేదు 🌸: ఉందిలే మంచి కాలం .తేటగీతి పద్యాలు.తాత - మనుమడు కధ, భయంకరమైన కధ  నారద మహర్షి  - 25 సీరియల్,  శ్రీ కృష్ణ కర్ణామృతం (2 ), థైరాయిడ్ సమస్య :కొంత వివరము 


శ్రీ వర్ణమాలా స్తోత్రమ్

ఓంశ్రీమాత్రే నమః... 

ప్రాంజలి ప్రభ /సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


అధ్బుత విగ్రహ అమరాదీశ్వర అగణిత గుణ గణ అమృత శివ

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ

ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ

ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ

ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ

ఉరగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ

ఊర్జిత దానవ నాశ పరాత్పర ఆర్జిత పాప వినాశ శివ

ఋగ్వేద శ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్ని త్రినేత్ర శివ

ఋప మనాది ప్రపంచ విలక్షణ తాప నివారణ తత్త్వ శివ

లింగ స్వరూప సర్వ బుధ ప్రియ మంగళ మూర్తి మహేశ శివ!!


లూతాదీశ్వర రూప ప్రియ శివ వేదాంత ప్రియ వేద్య శివ

ఎకానేక స్వరూప విశ్వేశ్వర యోగి హృది ప్రియ వాస శివ

ఐశ్వర్యా శ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశ శివ

ఓంకార ప్రియ ఉరగ విభూషణ హ్రీంకారాది మహేశ శివ

ఔర సలాలిత అంత కనాశన గౌరీ సమేత మహేశ శివ

అంబర వాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ

ఆహార ప్రియ ఆది గిరీశ్వర భోగాది ప్రియ పూర్ణ శివ

కమలాస్యార్చిత కైలాస ప్రియ కరుణా సాగర కాంతి శివ

గంగా గిరి సుత వల్లభ గుణ హిత శంకర సర్వ జనేశ శివ

ఖడ్గ శైల మృదుడ క్కాద్యా యుధ విక్రమ రూప విశ్వేశ శివ!!


ఘాతుక బంజన పాతక నాశన గౌరీ సమేత గిరీశ శివ

జజశ్రిత శ్రుతి మౌళి విభూషణ వేద స్వరూప విశ్వేశ శివ

చండ వినాశన సకల జన ప్రియ మండలా దీశ మహేశ శివ

చత్ర కిరీట సుకుండల శోభిత పుత్ర ప్రియ భువనేశ శివ

జన్మ జరా మృతి నాశన కల్మష రహిత తాప వినాశ శివ

ఝంకారా శ్రయ బృంగి రిటి ప్రియ ఓం కారేశ మహేశ శివ

జ్ఞానా జ్ఞానా వినాశక నిర్మల దీన జన ప్రియ దీప్త శివ

టంకాద్యాయుధ ధారణ సత్వర హ్రీంకాది సురేశ శివ

రంక స్వరూప సహకారోత్తమ వాగీశ్వర వరదేవ శివ

డంబ వినాశన డిండి మ భూషణ అంబర వాస చిదీశ శివ!!


డం డం డమరుక ధరణీ నిశ్చల డుండి వినాయక సేవ్య శివ

ణలిన విలోచన నటన మనోహర అళి కుల భూషణ అమృత శివ

తత్వమ సీత్యాది వాక్య స్వరూపక నిత్యానంద మహేశ శివ

స్థావర జంగమ భువన విలక్షణ భావుక మునివర సేవ్య శివ

దుఃఖ వినాశక దళిత మనోన్మన చందన లేపిత చరణ శివ

ధరణీ ధర శుభ దవళ మనోన్మన చందన లేపిత చరణ శివ

నానా మణి గణ భూషణ నిర్గుణ నట జన సుప్రియ నాట్య శివ

పన్నగ భూషణ పార్వతి నాయక పరమానంద పరేశ శివ

ఫాల విలోచన భాను కోటి ప్రభ హాలా హల ధర అమృత శివ

బంధ వినాశన బృహదీశామర స్కందాది ప్రియ కనక శివ

భస్మ విలోపన భవ భయ నాశన విస్మయ రూప విశ్వేస శివ!!


మన్మధ నాశన మధుపాన ప్రియ మందర పర్వత వాస శివ

యతి జన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణ్యాది సురేశ శివ

రామేశ్వర రమణీయ ముఖాంభుజ సోమ శేఖర సుకృతి శివ

లంకాదీశ్వర సుర గణ సేవిత లావణ్యా మృత లసిత శివ

వరదా భయకర వాసుకి భూషణ వన మాలాది విభూష శివ

శాంతి స్వరూప జగత్త్రయ చిన్మయ కాంతి మతి ప్రియ కనక శివ

షణ్ముఖ జనక సురేంద్ర ముని ప్రియ షాడ్గుణ్యాది సమేత శివ

సంసారార్ణవ నాశన శాశ్వత సాధు హృది ప్రియ వాస శివ

హర పురుషోత్తమ అద్వైతామృత పూర్ణ మురారి సుసేవ్య శివ

ళాళిత భక్త జనేశ నిజేశ్వర కాళీ నటేశ్వర కామ శివ

క్షర రూపాది ప్రియాన్విత సుందర సాక్షి జగత్రయ స్వామి శివ

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ!!

 --(())--

: ఉందిలే మంచి కాలం .తేటగీతి పద్యాలు.. ప్రాంజలి ప్రభ

రచయిత.మల్లిప్రగడ శ్రీదేవి రామకృష్ణ


ఉందిలేమంచి కాలము ముందు ముందు

తొంద రొద్దులే జరగేది జరగు చుండు

మేలు చేయులక్ష్యమువద ల వలదెపుడు

రోజు లన్నియు మనకొర కుండు చుండు


సారమా నిస్సారమా అనుకొని ఉంటె

శుబ్ర మైన ఆహారము కుళ్ళు చుండు

ప్రతిది సుబ్రపరచి వండి తింటె మంచి

మంచి మాటలు మనసున శుబ్ర మవ్వు


పనులు లేవనీ అనుకుంటె బతక లేవు

బతుకు కొరకునీలోశక్తి ఉంది చూడు

వంశ పరమైన వృత్తిని నమ్మి బతుకు

అదియే నిన్ను నీకల కుటుంబమ్ము నమ్ము


వలస వెళ్లెపక్షుల వంటి వారు మనము

మనకు బతుకుతెరువు ఎక్కడో తెలియదు

బిడ్డ లొకచోట తల్లితండ్రు లొకచొట

సుఖము సంసారము ఇదియు మంచి రోజు


 బడులు తెరిచేను రోగము దారి ఇదియు

పుస్తకములు లేని చదువు లొచ్చి ఉండె

కళ్ల జోడులు వచ్చేటి మార్గ మవ్వు

పొంట నింపని ధనముతో విద్య  బతుకు


నడకలకు దారి తగ్గియు సెల్లు చిక్కు

చూడ కూడని చూస్తున్న వయసు ఇదియు

పిల్ల ఏడుపు మానుట సెల్లు చూపు

ఇదియు చదువున్న లోకాల చదువు బతుకు

--(())--

భయంకరమైన కధ (ఒంటరిగా రాత్రిపూట చదవవద్దు )👻👽


ఒక ముసలి వాడు వర్షంలో గొడుగేసుకుని ఒక పుస్తకము అమ్ముతున్నాడు.

ఒక యువకుడు అతని దగ్గరకి వచ్చి " ఎంత పుస్తకం ? " అన్నాడు.

ముసలివాడు : " మూడు వేలు. కానీ ఈ పుస్తకం చదివే ధైర్యం నీకు ఉన్నట్లు కనబడటం లేదు. నీకు నేను ఈ పుస్తకం అమ్మను.

యువకుడు : నాకు చాలా ధైర్యం. ఆ పుస్తకం గంటలో చదివేస్తాను.

ముసలివాడు : అయితే. నేను నీకు ఆ పుస్తకం ఒక షరతు మీద అమ్ముతాను. ఒక వంద డిస్కౌంట్ కూడా ఇస్తాను.

యువకుడు : ఏమిటా షరతు?

ముసలివాడు : నువ్వు జన్మలో లాస్ట్ పేజ్ చదవనని ఒట్టు వెయ్యాలి. ఎందుకంటే అది చదివి నువ్వు తట్టుకోలేవు. లెక్కలేనన్ని సమస్యలు వచ్చి పడతాయి. చచ్చిపొవాలనిపిస్తుంది

యువకుడు : ఒకే! ఒట్టు చివరి పేజీ చదవనులే. ఇదిగో డిస్కౌంట్ పోను 2900. పుస్తకం ఇయ్యి.

ముసలివాడు పుస్తకం ఇచ్చి ఒట్టు గురించి మళ్ళీ జ్ఞాపకం చేశాడు. అలాగేనని పుస్తకం ఇంటికి వెళ్ళి భయం భయంగా మొత్తం గబగబా చదివేశాడు. చివరి పేజీ వచ్చేసరికి "ఒట్టు" జ్ఞాపకం వచ్చి ఆ పేజీ తిప్పలేదు. ఓ వారం రోజులు అతి కష్టం మీద ఓపిక పట్టాడు. ఇఖ తట్టుకోలేక పుస్తకం చివరి పేజీ తెరచి చూశాడు. మూర్చపోయాడు.

.

.

 పుస్తకం ధర:ఉచితం😜

 

--(())_-


భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 151 🌹

🌷. సద్గురు శివానంద 🌷 📚. ప్రసాద్ భరద్వాజ/ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

🌻. నారద మహర్షి  - 25 🌻

ఆ తరువాత ధర్మరాజు స్వర్గానికి వెళ్ళినప్పుడు, ఆయనకు మిత్రులకంటే శత్రువులే ముందర కనబడ్డారు. అప్పుడు నారదుని స్మరించగానే, ఆయ్న ప్రత్యక్షమై, “ఓ ధర్మరాజా! నువ్వు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. ఇక్కడ వారు నీకు శత్రువులుకారు. ఇక్కడ దుఃఖపడ్డావంటే అది నీ అజ్ఞానమే. ఇది ఇంకా నీలో ఉండటంచేతనే వీళ్ళు నీకిలా కనబడుతున్నారు. 

భూలోకంలో ఉన్న శత్రుభావం ఆ శరీరాలు పోగానే పోతుంది. ఆ శరీరాలకు, ఆ అహంకారాలు మాత్రమే శత్రువులుకాని, జీవాత్మకు శతృత్వం ఉండదు. అది అక్కడతోతే నశిస్తుంది” అన్నాడు.

రామాయణంలోకూడా రాముడు ఈ మాటను లక్షమణుడికి చెప్పాడు. రావణుడు మృతుడైన తరువాత, రాముడు లక్ష్మణుడితో, “లక్ష్మణా! ఆయన శరీరాన్ని సగౌరవంగా లంకకు పంపించే ఏర్పాట్లు చెయ్యి. ఆయన గొప్ప పండితుడు, బరాహ్మణుడు. వేదవేదాగములు చదువుకున్నవాడు. మహాతపస్వి. సాక్షాత్తు ఈశ్వరుణ్ణి మెప్పించి ప్రసన్నుణ్ణీ చేసుకుని దర్శనం చేసుకున్న మహా వరప్రసాది. ఆయాన్ సామాన్యుడు కాడు. మనకంటే అనేక విధాల పూజ్యుడు” అన్నాడు. 

అప్పుడు లక్ష్మణుడు ఆయనతో, “శ్రీరామచంద్ర ప్రభూ! ఆయన శరీరాన్ని సగౌరవంగా లంకకౌ పంపించమన్నావు! ఆయన మనకు శత్రువు. మనను అవమానించి బాధించాడు కదా! అటువంటివాడిని నేను ఎలా సగౌరవంగా పంపుతాను?” అన్నాడు. 

అందుకు రాముడు, “శత్రుత్వాలు మృత్యువు తోటే పోతాయి. శత్రుత్వం ఇద్దరిమధ్యన ఉన్నప్పుడు, ఇద్దరూ మృతి చెందితేనే శతృత్వంపోతుందని అనుకోరాదు. వాళ్ళలో ఒక్కళ్ళు చనిపోయినా  శతృత్వం పోయినట్లే! ఆ ఇద్దరిలో బ్రతికిఉన్నవాడి మనస్సులో పోయిన వాడి యడల శతృత్వం ఉండకూడదు. 

శతృవు నశించిన తరువాత, శతృత్వం నీ ఒక్కడి హృదయంలోనే ఉండటంచేత అది నీకే నరకహేతువు అవుతుంది. ద్వేషించతగిన వస్తువు నశించింది. ద్వేషం ఆ తరువాతకూడా ఇంకా అతడిలో ఉంటే, అది నరకహేతువు. 

కాబట్టి ఆ దృష్టితో చూస్తే రావణడు మనకు శత్రువు కానేరడు. ఆయన ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 

🌹 🌹

✍️థైరాయిడ్ సమస్య :కొంత వివరము 

👉థైరాయిడ్ గ్రంధి సీతాకోక చిలుక ఆకారంలో వుండే చిన్న గ్రంధి. 

👉ఇది గొంతు ముందు భాగములో వుంటుంది. 

👉ఈ గ్రంధి ఉత్పత్తి చేయు హార్మోనుల ప్రభావము వలన శరీరములో వున్న వివిధ కణాలు అవసరమైన శక్తిని ఉపయోగించుకొని విధి నిర్వహణ చేసుకొనుటకు తోడ్పడతాయి.

✍️థైరాయిడ్ వ్యాధి అనగానేమి?

👉థైరాయిడ్ గ్రంధి అధికంగా హార్మోన్లు ఉత్పత్తి చేస్తే, కణాలు అధిక శక్తిని వేగంగా ఉపయోగించుకొనేలా చేస్తుంది.

👉థైరాయిడ్ గ్రంధి తక్కువ స్ధాయిలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తే, శరీరములోని జీవకణాలు తక్కువ స్ధాయిలో శక్తిని ఉపయోగించి కణాలను విధి నిర్వహణ చేయునట్లు తోడ్పడతాయి.

✍️ఏ వయస్సు వారిలో థైరాయిడ్ వ్యాధులు వస్తాయి?

👉అన్ని వయస్సుల వారికి థైరాయిడ్ వ్యాధులు వస్తాయి.

👉5 నుండి 8 పాళ్ళు స్త్రీలలో అధికంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయి.

✍️ లక్షణాలు:

👉ములం వాపు. 👉చర్మము పొడి బారడం. 👉శబ్దములో మార్పు. 👉శరీరము బరువు అధికమగుట. 👉కీళ్ళ వాపులు, నొప్పులు. 👉నెలసరి రుతుక్రమములో మార్పులు.
👉మానసిక రుగ్మతలు. 👉థైరాయిడ్ గ్రంధి పెద్దది అగుట. 👉శ్వాసకు సంబంధించిన, బి.పి కి సంబంధించిన వ్యాధులు రావడం. 👉మలబద్దకం. 👉చిన్న పిల్లలలో సాధారణ ఎదుగుదల లేకపోవడం. 👉యుక్త వయస్సు పిల్లలలో నెలసరి ప్రారంభం ఆలస్యం కావడం. 👉మానసిక ఎదుగుదలతో పాటు ఆహారములో అయోడిన్ శాతం తక్కువగా వుండుట, థైరాయిడ్ హార్మోను ఉత్పత్తికి ఆహారములోని అయోడిన్ తోడ్పడుతుంది.

✍️థైరాయిడ్ అధిక స్ధాయిలో పనిచేయుట

✍️కారణాలు: -

👉థైరాయిడ్ గ్రంధి అధికంగా పనిచేస్తూ - ఎక్కువస్ధాయిలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

👉థైరాయిడ్ గ్రంధికి ఇన్ ఫెక్షన్ వచ్చి నొప్పితో కూడిన గడ్డ కావచ్చు.

👉ఒక్కొక్క సందర్భములో నొప్పి లేని గడ్డగా కనబడుతుంది.

👉నొప్పి లేని థైరాయిడ్ గ్రంధి అధిక శాతం స్త్రీలలో వస్తుంది.

👉అయోడిన్ శాతం ఎక్కువగా కొన్ని మందుల ద్వారా రావచ్చును.

✍️లక్షణాలు: -

👉చికాకు, విసుగుదల. 👉కండరాల నీరసం. 👉అప్పుడప్పుడు కండరాలు వణకడం.
👉నెలసరిలు అధికంగా వుండడం, నెలలో ఎక్కువసార్లు ఋతుక్రమాలు. 👉నిద్ర సమస్యలు. 👉థైరాయిడ్ గ్రంధి పెద్దది కావడం. 👉కంటి జబ్బులు, గ్రేవ్స్ కంటి వ్యాధి వేడిని భరించలేకపోవడం. ✍️తీసుకోవలసిన జాగ్రత్తలు: 👉థైరాయిడ్ జబ్బును వీలైనంత త్వరగా గుర్తించగలగాలి.

👉అయోడిన్ ఉప్పును ఆహారంలో తీసుకోవడం మంచిది.

👉వ్యాధి నిర్ధారణ చేసిన తరువాత జీవిత కాల వైద్యం అవసరం కావచ్చు.

👉డాక్టరును సంప్రదించి పూర్తి స్ధాయి పరీక్షలు చేయించుకొని వైద్య సలహా పొందాలి.
 ఆలస్యం చేసి సమస్యను పెద్దది చేసుకుని ప్రాణం మీదికి తెచ్చుకొని బాధపడి బాధపెట్టకండి . ఆలస్యం అమృతం విషం 
వెంటనే మందులు వాడండి  

--(())--

శ్రీ కృష్ణ కర్ణామృతం (2 )
                    13
ప్రణయ పరిణతాభ్యాం ప్రభావాలంభనాభ్యాం
 ప్రతి పద లలితాబ్యాం ప్రత్యహం నూతనాభ్యాం
 ప్రతిముహు రధికాభ్యాం  ప్రస్పుర లోచనాభ్యాం
ప్రభవతు హృదయే నః ప్రాణనాథః కిశోరః  !! 
                     14
మాధుర్య వారిది మదాంబు  తరంగ భంగీ
 శృంగార సంకలిత శీత కిషోర వేషం 
ఆమందహాస లలితానన చంద్రబింబం ఆనంద సంప్లవ మమప్లవతాం మనో మే  !!
                  15
అవ్యాజ మంజుల ముఖాంబుజ ముగ్ధభావైః 
ఆస్వాద్యమాన నిజవేణు  వినోద నాదమ్ 
 ఆక్రీడతా మరుణ పాద సరోరుహాభ్యాం
ఆర్థ్రే  మదీయ హృదయే భువనార్ధ్ర మోజః  !!
భావము :- ప్రేమ చేత పండినవి. సౌందర్యములకు ఆలంబన మైనవి. అడుగడుగున ఆనందం ఒలికించునవి. నిత్య నూతనమైనవి. ప్రతిక్షణం సుఖము వృద్ధి చేయునవి, అయిన మనోహర నేత్రములతో శోభిల్లు ప్రాణనాధు డైన  బాలకృష్ణుడు , మా హృదయమున నిలచు గాక .
సౌందర్య సాగరం నుండి లేచిన మదించిన కెరటాల రూపమైన , శృంగారం తో కూడిన చల్లని బాలుని ఆకారం కలది , అతిశయించిన ఆనందం వలన కలిగిన చిరునగవు చేత మంజుల మైన చంద్రబింబం వంటి ముఖము కలది అయినా శ్రీ కృష్ణానంద ప్రవాహమున నా మనసు తేలియాడు గాక.
సహజ సుందరమైన ముఖారవిందం యొక్క మనోహర భావముల ద్వారా తన వేణుగాన వినోదమును ఆస్వాదించుచు సకల లోకములను చల్లబరిచే శ్రీకృష్ణ తేజో రూపము ఎర్రనైన తన పాదపద్మములు నా హృదయమున విహరించు గాక
           🌼🙏🙏🙏🌼



No comments:

Post a Comment