చాణక్య నీతి..
శ్లోకం.
యస్మిన్ దేశే నసమ్మానో నవృత్తిర్నచబాంధవాః |
న చ విద్యా२२గమః కశ్చిత్ తం దేశం పరివర్జయేత్ ||
తాత్పర్యం :
ఏ ప్రదేశంలో ఆదరాభిమానములుండవో, జీవనము జరుగదో, బంధుబాంధవులుండరో, ఏదైన విద్యాప్రాప్తికలుగదో, అట్టి ప్రదేశమును విడిచిపెట్టవలెను.
కం.
ధనమున్నతావు విద్యయు
వినయము ఔదార్యమున్న విజ్ఞుడుగాడా
జనలోకము మెచ్చునతని
ఇనశశిలున్నంతవరకు ఈజగమందున్
గుడి - నా నుడి
పాటల కావడి ఆలయము
గంటల సావిడి ఆలయము
జాతుల, రీతుల భేదం తుడిచే
జన్మస్థలిరా ఆలయము
శుభోదయం - సోమనాధశాస్త్రి
ఆ.వె.
కనుల ముందు యున్న కట్టుపల్లి గురువె l
కలిసి పెంచు నతడె, కవుల కులము l
కరిమెడదొర యతడె, కలిదిండి నతడేను l
పద్య శైలి యందు పరుగు బెట్టు ll
- మల్లి సిరిపురం.
గార్ధభంబున కేల కస్తూరితిలకంబు? మర్కటంబునకేల మలయజంబు?
శార్ధూలమునకేల శర్కరాపూరంబు? సూకరంబుల కేల చూతఫలము?
మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి? గుడ్లగూబల కేల కుండలములు?
మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్? బకసంతతికి నేల పంజరంబు
ద్రోహచింతనఁ జేసెడి దుర్జనులకు
మధురమైనట్టి నీనామమంత్రమేల?
భూషణ వికాస శ్రీధర్మపురి నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర
నరసింహ శతకము - శేషప్పకవి
విధేయుడు - మోహన
చతుర్విధ కందములు-- చిత్ర కవిత్వము-1
ఇది యొక విచిత్రమైన కందపద్యం. చతుర్విధ కందమని దీని పేరు. ఉండే దొక్కటే కందపద్యం. దాని రెండవపాదం రెండవ మాటతోమొదలుపెట్టి , మరోపద్యం . మరలాదాని రెండవపాదం రెండవ పదంతో మరోపద్యం. అలాగే మరోమారు ఆవృత్తిని పొందుతుంది. ఆమాటలనే ఆపదాలనే తిప్పితిప్పి సరికొత్తపద్యాలవుతుంటాయి. గణాలుగానీ ,యతిప్రాసలు గానీ , యెక్కడా తప్పవు. పద్యానికి అర్ధమూ భావమూకూడా మారదు. ఈవిధంగా కూర్చిన కందపద్యానికి చతుర్విధ కందమనిపేరు.
ప్రస్తుతం ఇలాంటి ఒకకందాన్ని పరిశీలిద్దాం!
కం : " సుర రాజ విభవ, లక్షణ
భరితా, వనజాస్త్రరూప, వరక కవి వినుతా,
: హరిభక్తి యుక్త విలసత్
కరుణా ,దినకర సుతేజ గద్వాలనృపా!"
ఇదీ మొదటి పద్యం! దీనికి అర్ధం తెలిసికొందాం.
హేగద్వాలనృపా- ఓగద్వాల నేలే ప్రభూ! సురరాజ విభవ- దేవేంద్ర వైభవముగలవాడా! ; లక్షణ భరితా- శుభలక్షణసమన్వితా ; వనజాస్త్ర రూప- మన్మధరూపా ; వర కవి వినుతా- సత్కవులచే పొగడబడువాడా ; హరిభక్తితోను కరుణతోను
కూడినవాడా ; దినకర సుతేజ- సూర్యతేజమువంటి చక్కని పరాక్రమము గలవాడా ;
భావము: దేవేంద్ర వైభవముగలవాడా ! శుభ లక్షణ సమన్వితా! మన్మధరూపా! సత్కవులచే కీర్తిప బడువాడా! హరిభక్తితోను దయతోను నిండిన మనస్సుగలవాడా! సూర్య సమాన తేజా! మమ్మాదరింపుము.
ఇపుడీ పద్యమే మరో మూడు కందపద్యాలుగా మారబోతోంది. చూడండి!
2 కం: వనజాస్త్రరూప, వరకవి
వినుతా , హరిభక్తి యుక్త విలసత్కరుణా ,
దినకర సుతేజ , గద్వా
ల నృపా ,సురాజ విభవ లక్షణ భరితా!
3 కం: హరిభక్తియుక్త ,విలసత్
కరుణా , దికర సుతేజ , గద్వాల నృపా !
సుర రాజవిభవ, లక్షణ
భరితా , వనజాస్త్రరూప , వర కవి వినుతా!
పద్యా 4 కం: దినకర సుతేజ, గద్వా
లనృపా , సురాజ విభవ ,లక్షణ భరితా ,
వనజాస్త్ర రూప , వరకవి
వినుతా , హరిభక్తియుక్త , విలసత్కరుణా!
ఇలా ఒకే పద్యం అర్ధంగానీ ,గణాలుగానీ ,యతిప్రాసలు గానీ, మారకుండా చెప్పటం ఆశ్చర్యంగా లేదూ!
బద్వేటి వెంకట కృష్ణయ్య గారు అనే కవి , గద్వాలప్రభువైన శ్రీ సీతారామ భూపాలుని గూర్చి చెప్పన చతుర్విధ కందమిది.. సారస్వతంలో యిలాంటి విచిత్రాలు యెన్నో ఉన్నాయి. తెలిసికోవాలనే ఆశక్తి ఉంటే నాతో పయనం చేస్తూ ఉండండి.
స్వస్తి!
[14:31, 05/11/2020] +91 92915 82862: 🧘♀️బ్రహ్మము - జ్ఞానము🧘♂️
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
ఎవరి చేత ప్రేరేపింపబడి మనస్సు వస్తుప్రపంచము వైపు ఆకర్షింపబడుతున్నది? ఎవరి ఆజ్ఞకు లోబడి ప్రాణము నిలుస్తున్నది? ఎవరి వలన వాక్కు ప్రకటితమౌతున్నది? ఏ జ్ఞానము కళ్ళను, చెవులను ప్రేరేపిస్తున్నది? అన్న ప్రశ్నలు సాధకుడు తనకు తాను ప్రశ్నించుకోవాలి.
వీటికి సమాధానం కేనోపనిషత్తులో ఎంతో వివరంగా చెప్పబడింది!
చెవికి చెవిగా, మనస్సునకు మనస్సుగా, వాక్కనకు వాక్కుగా, ప్రాణమునకు ప్రాణముగా, నేత్రమునకు నేత్రముగా అయివున్న వస్తువు ఒకటుంది. దీనిని గ్రహించినవారు వస్తుప్రపంచము నుండి విముక్తినొంది అమృతతత్వమును పొందుతారు.
దానిని నేత్రములు చూడలేవు, వాక్కు వర్ణించలేదు. దానిని తెలుపుట కష్టము ఎందుకంటే అది తెలిసినదానికంటే, తెలియనిదానికంటే అతీతమైనది. దేనిని వాక్కు వ్యక్తపరచలేదో, దేనివలన వాక్కు వ్యక్తమగునో అదే బ్రహ్మము.
దేనిని గూర్చి మనస్సు మననము చేయలేదో, దేనివలన మనస్సు సంచరించుచున్నదో అదే బ్రహ్మము. దేనిని నేత్రములు దర్శించలేవో, దేనివలన నేత్రములు చూడగలుగుచున్నవో అదే బ్రహ్మము.
దేనిని చెవులు ఆలకించలేవో, దేనివలన చెవులు ఆలకించగలుగుతున్నవో అదే బ్రహ్మము. దేనిని ముక్కు శ్వాసించలేదో, దేనివలన ముక్కు శ్వాసించుచున్నదో అదే బ్రహ్మము.
బ్రహ్మమంటే ఏమిటో నాకు తెలుసు అని ఎవరైనా భావిస్తే, వారు తెలుసుకున్నది చాలా స్వల్పం మాత్రమే. అంటే ఆత్మస్వరూపము తెలిసినదానికంటే, తెలియనిదానికంటే అతీతమైంది.
ఆత్మ/బ్రహ్మము శాశ్వతమైనది, చైతన్యవంతమైనది, సర్వవ్యాపకమైనది, సాక్షీభూతమైనది, అన్ని జీవులలో నెలకొనివుంటుంది కాబట్టీ జ్ఞానంతో దాన్ని తెలుసు కోవచ్చు.
జీవుని జ్ఞానానికి ఆధారంగా, సాక్షిగా ఈ ఆత్మచైతన్యస్ఫూర్తి ఎల్లప్పుడూ వెన్నంటివుంటుంది. అది సత్యము.
ప్రతివిషయాన్ని సూక్ష్మబుద్ధితో/జ్ఞానంతో ఎవడు దర్శిస్తాడో అతడు అమృతత్వమును పొందుతాడు. ఆత్మద్వారానే జీవుడు వీర్యవంతుడవుతాడు. జ్ఞానము ద్వారానే జీవుడు అమరుడవుతాడు.
జీవుడు దీనిని ఈ జన్మలోనే గనుక తెలుసుకుంటే, సత్యము అవగతమౌతుంది. తెలుసుకోలేకపోతే లోకంతో బంధం ఏర్పడుతుంది.
మరల ఈ లోకంలో జన్మించవలసి వస్తుంది. కావునా జ్ఞానవంతులు సర్వభూతములలో ఒకే ఆత్మను దర్శించి, బంధరహితులై, లోకంనుండి పూర్తిగా విముక్తిని పొంది జీవన్ముక్తులవుతున్నారు.
🕉🌞🌍🌙🌟🚩
[14:31, 05/11/2020] +91 92915 82862: 83) కఠోపనిషత్తు
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
అలా ఉన్నట్టి గర్భిణీ స్త్రీ తన గర్భమందున్నటువంటి జీవులను జఠరాగ్ని యొక్క ఆధారముగా పోషిస్తూఉంటుంది. ఎందుకంటే ఆవిడ తినేటటువంటి ఆహారం చేతనే లోపల ఉన్నటువంటి శిశువులు పోషించబడతూ ఉంటాయి. అలాగే హిరణ్యగర్భుని యొక్క అగ్ని తత్వ ప్రభావం చేతనే ఆ లోపల ఉన్నటువంటి జీవులన్నీ పోషింపబడుతూ ఉంటాయి. సమస్త జీవులను తన లోపలికి ప్రళయకాలంలో సంగ్రహించి, వాటిని కొద్ది కాలం తన వద్దనే వుంచుకొని, తిరోధాన అనుగ్రహము అనేటటువంటి పద్ధతిగా వాటిని కొంతకాలం తనలో ఉంచుకొని, మరల సృష్టి ప్రారంభకాలంలో వాటిని యధాతథముగా ‘యుగవత్‘ సృష్టిగా విడుదల చేశాడు.
అంటే సృష్టి ద్వివిధంబులు. క్రమసృష్టి, యుగవత్ సృష్టి. యుగవత్ సృష్టి అనే దానికి నాంది పలుకుతున్నారు గర్భిణీ స్త్రీ అని చెప్పడం ద్వారా. అంటే అర్ధం ఏమిటి? అంటే మానవులు మానవులనే కంటున్నారు. ఏ జాతికి, ఏ రకమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు, ఆ రకమైన వారికే జన్మనిస్తున్నారు కదా! ఇది సృష్టి ధర్మం కదా! అట్లే 84 లక్షల జీవరాసులకు సంబంధించినటువంటి మూల స్థానములు, ఆధారబీజములు ఈ హిరణ్య గర్భ స్థానంలో ఉన్నాయి.
మరల పునః సృష్టి కాలంలో 84 లక్షల జీవరాసులు విడుదల చేయబడ్డాయి. అపుడేమైందట?- జీవరాసులంతా ఒకే సారి ఉద్భవించాయి. మీ డార్విన్ థీరీ ఇక్కడ పోయిందన్నమాట. అంటే క్రమశః అమీబా నుండి మానవుడు పుట్టి, వరుసగా అన్ని జన్మలు ఎత్తుకుంటూ, అన్ని జన్మలు పోగొట్టుకుంటూ ఎప్పటికో పరిణామ కాలంలో మానవుడు వచ్చాడు. పరిణామ కాలంలో కోతి నుండి మానవుడు వచ్చాడు. “అలా రాలేదు” అంటుంది బ్రహ్మాండ పురాణం. ఈ హిరణ్యగర్భుడు విడుదల చేసేటప్పుడు ఏక కాలంలో అందర్నీ విడుదల చేసాడు.
గర్భిణీ స్త్రీ ఎట్లా అయితే తన రూపము కలిగినటువంటి శిశువులను తానెలా కన్నదో, అట్లే ఆ దైవీ సృష్టి కూడా దైవీ మానవుడు కూడ అదే కాలంలో ఉద్భవించాడు. ఆ సృష్టి యొక్క ప్రారంభ దశనే హృద్దైవ (హృదయ) కాలమని అన్నారు. కాబట్టి అక్కడ ఉన్న మానవులంతా ఎవరు అంటే దైవీ మానవులు. అందరికీ దైవత్వం సాధ్యమై ఉన్నటువంటి వారు. అందరికీ తమ గర్భ స్థానము అయినటువంటి, తమ ఆధారమైన స్థానము అయినటువంటి హిరణ్మయకోశమే, హిరణ్యగర్భుడే, అక్షరుడే ఆధారమైనటువంటి వాడు.
🕉🌞🌏🌙🌟🚩
[14:31, 05/11/2020] +91 92915 82862: 83) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః ౹ నానుధ్యాయా ద్బహూఞ్ఛబ్దాన్వాచో విగ్లాపంనం హి తత్ ౹౹47౹౹
47.ప్రత్యగాత్మయే బ్రహ్మమని సాక్షాత్కరించుకొనిన ధీరుడు తన ప్రజ్ఞను బ్రహ్మమునందు ఏకము చేసి ఉంచుకొనవలెను.మనస్సును అనేక శబ్దములచే నింపరాదు.ఏలన అది మనస్సును పీడించును.
(బృహ 4.4.21:వివేకచూడామణి 321-325.)
దేహాంద్రియాది సముదాయములయిన "నేను","వీడు","వీని పుత్రుడు", "నాక్షేత్రము","నాధనము",
"నేను సుఖము గలవాడను",
నేను దుఃఖము గలవాడను అనెడి భిన్నభావనలచే(శబ్దములచే)
మనస్సును నింపరాదు.ఏలన అవి మనస్సును పీడించును.
శంఖము పూరింపబడినప్పుడు బాహ్య శబ్దములు తెలిసికొనుటకు వీలుకాదు.శంఖము యొక్క శబ్దమే తెలియును.ఆప్రకారముగా ఆత్మ స్వరూపమును తెలిసికొనుటచే దానికంటె అన్యమగు విశేషమేదియును లేకపోవుట వలన సర్వము బ్రహ్మ స్వరూపమగుచున్నది.
వీణ వాయించుచుండగా బాహ్యశబ్దములను తెలిసికొనుటకు వీలుకాదు.వీణావాద్యధ్వని మాత్రమే తెలియుచున్నది.
ఆ ప్రకారముగానే స్థితి కాలమందు పరబ్రహ్మము సామాన్య వస్తువులకు వేరుకాక పోవుట వలన సర్వము పరబ్రహ్మ మాత్రముగానే తెలిసికొనుటకు వీలగుచున్నది.
ఏ ప్రకారముగా నదీ వాపీ తటాకాదులయందున్న సమస్త జలములకును సముద్రమే ఏక స్వరూపముగా నిలయమగుచున్నదో,ఈ రీతిగానే మృదు కఠినాది సమస్త స్పర్శలకు త్వక్కును,మధురామ్లాది సమస్తరసములకు జిహ్వయును, సమస్త గంధములకు
నాసికయును,
సమస్త రూపములకు నేత్రమును, అన్ని శబ్దములకు శ్రోత్రమును, సంకల్పములన్నింటికి మనస్సును, విద్యలన్నింటికి హృదయమును, కర్మలన్నింటికి హస్తములును, ఆనందములన్నింటికి యోనియును,విసర్గములన్నింటికి పాయువును, మార్గము లన్నింటికి పాదములును,వేదములన్నింటికి వాక్కును,వేఱుకాక పోవుటవలన ఆ విషయములు తామేయగుచున్నవి.
ఈ రీతిగా సర్వేంద్రియములును తమ విషయములన్నిటితోను క్రమముగా ప్రళయమును పొంది మనో మాత్రమగు చున్నవి.మనస్సు విజ్ఞానమాత్రమగు చున్నది.
ఆ విజ్ఞాన స్వరూపము నీటియందున్న ఉప్పుగడ్డ రీతిగ నిరుపాధిక మగుట వలన,ప్రజ్ఞాన ఘనస్వరూపమగు పరమాత్మయందు విలీనమగుచున్నవి.
దేహేంద్రియ విషయాకారములుగా పరిణమించిన భూతముల నుండి అజ్ఞానముచే నామరూపములు పుట్టి మరల ఆత్మయందే లీనమగుచున్నవి.
శాస్త్రోచార్యోపదేశమైన బ్రహ్మవిద్యచేత,అజ్ఞానముచే వచ్చిన ఆ జీవభావము నశించుచున్నది.
ఇట్లు అజ్ఞానము నశించిన పిమ్మట జీవాత్మ,బ్రహ్మజ్ఞానముచేత స్వచ్ఛమైనదియు ప్రజ్ఞాన ఘనస్వరూపమునగు పరమాత్మయయే యగుచున్నాడు.
🕉🌞🌏🌙🌟🚩
[15:31, 05/11/2020] +91 95058 13235: 5.11.2020 మధ్యాహ్న సందేశము
పలువురు మిత్రుల కోరికపై మరల పంపడమైనది
🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🙏
శ్రీ పద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
ప్రథమ అధ్యాయము - ప్రథమ భాగము
దేవర్షి నారదుడు భక్తిదేవిని కలియుట
సచ్చిదానందరూపుడు, ఈ విశాల విశ్వముయొక్క సృష్టి,స్థితి,సంహారములకు కారణమైనవాడు, ఆధ్యాత్మికము, ఆధిదైవికము, ఆధిభౌతికములు అనెడి మూడు దుఃఖములను (తాపత్రయములను) నశింపచేయువాడగు శ్రీకృష్ణభగవానునకు మేము నమస్కరించెదము.
సకలప్రాణులయొక్క ఆత్మస్వరూపుడైన, సమస్తకర్మలకు అతీతుడైన శ్రీశుకదేవుడు సర్వమునూ విడిచిపెట్టి వెళ్ళిపోవుచుండగా చూచిన వేదవ్యాసుడు కుమారుని యెడబాటునకు తట్టుకొనలేక "పుత్రా! పుత్రా! అని ఎలుగెత్తి పిలువసాగెను. అంతట శుకుని ఆత్మరూపములేయగు వృక్షములు అతనికి బదులుగా ప్రతిధ్వనించుచుండెను. అట్టి మునియగు శ్రీశుకమహాత్మునకు నేను నమస్కరించు చున్నాను. నైమిశారణ్యమునందు ఒకసారి మహాబుద్ధిమంతుడగు సూతముని సుఖాసీనుడై యుండెను. అప్పుడు భగవత్కథామృతము యొక్క రసమును పానము చేయుటలో గొప్ప నేర్పరియైన శౌనకుడు సూతమునికి నమస్కరించి ఇట్లు ప్రశ్నించెను.
సూతమునీంద్రా! అజ్ఞానాంధకారమును నశింపజేయుటకు కోటిసూర్య ప్రభలతో సమానమైనది నీ జ్ఞానము. మా చెవులకు అమృతస్వరూపమైనది, సారభూతమైనదియగు కథను మాకు వినిపింపుము
భక్తి, జ్ఞాన, వైరాగ్యముల వలన లభించిన వివేకము ఎట్లు వృద్ధి చెందును? భక్తజనులు మాయామోహములను తిరస్కరించి ఎట్లు నిశ్చింతగా నుండగలిగెదరు? కలికాలము మిగుల భయంకరమైనది. అందు జీవులు సాధారణముగా అసురీస్వభావమును కలిగియుందురు. అనేక విధములగు బాధలకు గురియై అలమటించు చుందురు. అట్టి జీవులను దైవశక్తిసంపన్నులను చేయుటకు సర్వశ్రేష్ఠమైన ఉపాయమేమి కలదు? అన్నిటికంటె మిగుల శ్రేయోదాయకమైనది, పవిత్రమొనరించు వాటిలోకెల్ల ఉత్తమమైనది, ఈ కాలమునందు శ్రీకృష్ణభగవానుని కరుణ పొందుటకు తోడ్పడునట్టిది యగు ఒక శాశ్వతమైన సాధనమును మాకు ఉపదేశింపుము. చింతామణి కేవలము లౌకిక సుఖములను ఇవ్వగలదు. కల్పవృక్షము అత్యధికమైన స్వర్గ సంపదలను అందింపగలదు. కాని గురుదేవులు మాత్రము ప్రసన్నులై యోగులకు కూడ దుర్లభమైన పరబ్రహ్మ పరమాత్మయొక్క నిత్యవైకుంఠధామమును ప్రసాదించెదరు.
సూతముని ఇట్లు పలికెను: శౌనక మహర్షీ! నీ హృదయమునందు భగవద్భక్తి నిండియున్నది. కావున, నేను బాగుగా యోచించి మీకు జనన-మరణ రూపమగు సంసారభయమను పారద్రోలునట్టి సకలసిద్ధాంతముల సారమును వినిపించెదను. భక్తిప్రవాహమును వేగవంతమొనర్చునట్టిది, పరమాత్ముడైన శ్రీకృష్ణుని ప్రసన్నుని చేసుకొనుటకు ప్రధాన కారణమైనట్టిదియునగు ముఖ్యసాధనమును మీకు తెలిపెదను. దానిని మీరు సావధానముగ వినుడు. కాలము సర్పము వంటిది. దాని నోటికి ఆహారమయ్యెదమను భయముతో కలియగమునందలి జీవులు అలమటించెదరు. అట్టివారల భయమును నశింపచేయుట కొరకే శ్రీమద్భాగవత శాస్త్రమును శ్రీశుకమహర్షి ప్రవచించెను. మనస్సును పవిత్రమొనరించుటకు భాగవతమును మించిన సాధనము వేరేదియును లేదు. ఇట్టి శాస్త్రము మానవులకు జన్మజన్మాంతర పుణ్యఫలము వలననే లభించును. శుకమహర్షి పరీక్షిన్మహారాజునకు ఈ కథను వినిపించుటకుగాను సభాస్థలియందు ఆసీనుడై యుండెను. అప్పుడు అచ్చటికి దేవతలు అమృతకలశమును తీసికొన వచ్చిరి. దేవతలు తమ కార్యములను సాధించు కొనుటయందు మిక్కిలి నేర్పరులు. వారందరు శ్రీశుకునకు నమస్కరించి "అయ్యా! తమరు ఈ అమృతకలశమును స్వీకరించి దీనికి బదులుగ మాకు శ్రీభాగవత కథామృతకలశమను అనుగ్రహింపడ" ని ప్రార్ధించిరి. ఈ విధముగ పరస్పరము మార్చుకొనిన పిమ్మట పరీక్షిన్మహారాజు అమృతమును త్రాగున గాక! మేమందరము శ్రీమద్భాగవతామృతమును పానము చేసెదము గాక అని దేవతలు ప్రార్ధించిరి.
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి భాగము రేపు మధ్యాహ్మము....
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
వీలయినంత మందికి పంపమని విజ్ఞప్తి🙏🙏🙏💐🌹
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
Only admins can send messages
No comments:
Post a Comment