Tuesday, 3 November 2020

05-11-2020 (గురువారం )

ఓం శ్రీ రామ్ .. శ్రీ మాత్రే నమ:

ఈ నాటి పత్రికలో   *మజిలీల జీవితం (స్టోరీ), తేటగీతి  పద్యాలు,  శివోహం అంటే అర్ధం తెలుసా?  శ్రీ కృష్ణ కర్ణామృతం (3 ), సీస పద్యము   

సమ్మోహనాలు ... ప్రేమ 

రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  


చెలిమిలో నిజాయతి 

నిజయాతి లొ ఫలశృతి 

ఫలశృతి విశ్వాసాన్ని పొందుటె మోహనా  


చెడ్డ వానికి మంచి 

మంచి మాటతొ పెంచి 

పెంచిన ఫలంగా చెడ్డ తొలగు మోహనా

    

వినయం తో గౌరవము 

గౌరవము బతుకు తనము 

బతుకు ఫలంగా గొప్పతనమే మోహనా   


పట్టుదల విత్తనము 

విత్తన శక్తి ఫలము 

శక్తి ఫలము విజయముగా మారును మోహనా . 


కరుణతో బంధమును 

బంధమే బలముగను  

బలము ఫలము సమన్వ యాన్నిచ్చు మోహనా 


నిరహంకార కరుణ 

కరుణ నిత్య రక్షణ 

రక్షణ యే సుహృద్భావాన్నిచ్చు మోహనా  


నిష్కపట బతుకుయే  

బతుకు నిర్మలముయే 

నిర్మలము ఆత్మీయతను పంచు మోహనా 

  

ఓర్పు నీకు ఉంటే 

వుంటే  నీవెంటే 

నీవెంట ఫలంగా అభివృద్ధి మోహనా 


విశ్వాసం తోడుగ 

తోడుగా విజయముగ   

విజయ ఫలమే అద్భుతాలులే మోహనా  


ప్రేమతో బతికించు 

బతుకుతూ ప్రేమించు 

ప్రేమలో మాధుర్యాన్ని పొందు మోహనా 

 

--(())--


నేటి తేటగీతి పద్యాలు ... పూలు (05 -11 -2020 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ధైవమునకుపూలు సమర్పణ మది శాంతి 
దైవమునకు విచ్చిన పూలు శ్రేష్ఠ మవ్వు 
దైవమే భవిషత్తు తెల్పుచునె ఉండు     
దైవమే మనలో ఉండి తెలియ పఱుచుఁ   

నిత్య మూదరిద్రముకాగితముతొ పూలు 
చర్మము వ్యాదిగ్రస్తము ప్లాస్టిక్ పూలు   
పాడయిన పూలతో పూజ చేస్తె దేహ 
రోగము పెరిగి .గాయాలు నయము కావు

పురుగు లున్నట్టి పూల్లతో పూజ చేస్తె ..
పుండ్లలో పురు గులు ఎక్కు వ అవుతాయి.
వాసనతొ ఉన్న పూలతో పూజ చేస్తె ..
జీవితం సుఖమయ మగు నిత్య తృప్తి 
 .
పూల వాసన ఎవరైతె చూస్తె వాళ్ళు 
అస్తమారోగము తొ భాధ పడుట నిజము 
దైవ పూజకు మొగ్గలు  వాడు తారొ 
వారి చిన్న పిల్లలకు ఆరోగ్య ముచెడు 
 
దేవునికి కన కాంభరం పూల పూజ
వారి జీవితం లోప్రశాం తతత పోవు  .
విచ్చ నట్టిపూ లతొ పూజ చేస్తె బాధ
కనుక కనకాంబరంపూల పూజవద్దు .
 
-(())--

*మజిలీల జీవితం (స్టోరీ)

గతంలో మనమందరం ఎవరమొ,  ఇప్పుడు కష్ట పడే పరిస్థితి ఉండుట కష్టముగా ఉన్నదను కోమంటారా అని ఒక వృద్ధుడిని ఓకే విలేఖరి అడిగాడు. అట్లా అనుకున్నవారు ఈ ప్రపంచములో బ్రతుకుట అనర్హులు, నాదృష్టిలో నేనన్నది మీరు ఈ వయసులో కుడా కష్టపడుట గురుంచి, అది నా కర్ద మైయింది, కానీ వయసు మీరినది అని ఊరికే కూర్చుంటే అనారోగ్యులుగా మారుటకు చేతులారా ఆహ్వానించిన వారు అవుతారు, ఎవరైనా వయసులో పడ్డ ఆకష్టాన్ని, చేసిన మంచి పనులను నలుగురితో వయసుని బట్టి  పంచు కుంటూ  ఉండటమే నిజమైన జీవితము అని నా భావన, ఆకలి తీర్చుకొనుకు వేరొకరిని ఇబ్బంది పెట్టకుండా, గుండెపోటు రాకుండా కష్టానికి తగ్గ ఫలితము తెచ్చుకోవటమే జీవితము కదా

అవు నను కోండి మీరు రోజూ ఆకలి కోసం మండు టెండలో నుంచోవటం అవసరమా అందులో కా ళ్ళకు చెప్పులు లేకుండా, తలపై గొడుగు లేకుండా కళ్ళకు జోడు లేకుండా ఉండి  కష్టపడటం అవసరమా

నా భార్య వృద్ధురాలు, ఆమెకు కళ్ళు కూడా సరిగా కనబడవు, నాకు పుట్టిన కొడుకులు, కూతుర్లు ఎవరి దారి వారు చూసుకున్నారు, కానీ నాతో జీవితము పంచుకున్న నా శ్రీమతిని నేను తప్పక కాపాడు కోవాలి, వయసులో ఉన్నప్పుడు ఒకరికొకరం కష్టపడి పనిచేసు కున్నాము, ఆ కష్టమే నా పిల్లల భవిషత్తుకు మార్గం చూపినాము, రెక్కలు వచ్చిన పక్షులను ఆపలేముకదా, అవి ప్రపంచాన్ని అనుభవాలన్నీ తెలుసు కోవాలి కదా బాబు

అవునండి మీరు చెప్పినది నిజమే నాకష్టం వేరొకరికి రావద్దని ఆ దేవుడ్ని కోరు కుంటాను.
అవును బాబు ఇప్పటి నా వయసులో ఎటువంటి పని ఇచ్చే వారు లేరు, నాభార్యను ముందు బ్రతి కించు కోవాలి అందుకనే ప్రధాన వీధిలో ఉన్న ఒక హోటల్ ముందు నుంచోటానికి ఒప్పు కున్నాను అది కూడా 12 గంటలనుండి మూడు గంటల వరకు " భోజనం తయారు " అనే బోర్డు పట్టుకొని నుంచోని ఉంటే భోజనం ప్యాకెట్టు అన్నా దొరుకు తున్నది, మా ఇద్దరి కడుపు నిండి పోతున్నది.

అట్లా వీధిలో నుంచోవటం కష్టముగా లేదా. ఎందుకు లేదు మనసులో దృఢసంకల్పం, ఓర్పు ఉంటే ఎంతటి కష్టమైనా భరించ గలిగే శక్తి ఆభగవంతుడే నాకు ఇచ్చాడు.

ఒకరోజు నేను ఎండలోనుంచున్నప్పుడు నాకాళ్ళు బొబ్బ లెక్కాయి, తల మీద సూరీడు విలయ తాండవం చేస్తున్నాడు, అట్టి సమయములో నాకు విపరీతమైన దాహము వేసినది, దాహం తీర్చు కోవటానికి కూడా కదల కూడదు అది మేము పెట్టుకున్న నిభందన, అప్పడే దేవుల్లాగా కొందరు విద్యార్థులు కనిపించారు వారు హోటల్లో కి వచ్చి మంచినీరు బాటిల్సుతో మోహము కడుక్కొని, వంటి మీద పోసుకొని, త్రాగి నంత వరకు త్రాగి ఒకతను నా మొఖానా ఒక బాటిల్ విసిరాడు, ఆత్రుతతోఁ పట్టి త్రాగాలని అనుకున్నా, చేతికి చిక్కక అది క్రింద పడింది, చివరకు బాటిల్లో ఉన్న ఆ నాలుగు చుక్కలే నా ప్రాణాన్ని రాక్షించాయి.

అప్పుడే నాకు తెలిసిన బంధువులు వచ్చారు, వారితో పలకరించుట కుదరలేదు, వారు నా పరిస్థిని చూసి పలకరించుటకు సహకరించలేదు అప్పుడు నా పరిస్థితి భాదను పంచుకొనే స్థితి లేదు, చెప్పుకొనే పరిస్థితి లేదు, అప్పుడని పించింది గుర్తింపుకు విలువలేని చోట ఉండుట మంచిదేనా అని ఆలోచించాను, కానీ బ్రతుకు కోసం కొన్ని నిజాలు దాచాలని గుర్తుకు వచ్చి అల్లా ఉండి పోయాను.

ఇలా కొన్ని రోజులు సాగుతున్నాయి ఒకరోజు నేను నుంచొని ఉండే చోట హోటల్ మూసివేశారు ఎప్పుడేమి చేయాలో నాకు తోచలేదు నా అలవాటు మానుకోవటం ఎందుకని ఆరోజు ఒక బల్లమీ  ద, ఇక్కడ మంచినీరు ఉచితముగా దొరుకును అని తెల్ల సుద్దతో వ్రాసి పట్టుకొని నుంచొని ఉన్నా, చాలామంది వచ్చి ఆగి మంచి నీరు త్రాగి నాకు డబ్బులు ఇవ్వ చూపారు, వారి వద్ద నేను ఎటు వంటి డబ్బు తీసు కోలేదు కానీ ఒక పాప చిన్న చాక్లెట్ ఇచ్చింది అది తీసుకు వచ్చి నాభార్యకు ఇచ్చాను ఇది నా ఈనాటి అహ్హరం అని చెప్పను. నవ్వుతూ నోటితో సగము కొరుక్కొని మిగతా సగము నాకు పంచింది సంతోషములో కష్టములో సమానముగా పంచుకో గలగాము.
ఈ జీవితమునకు ఇంకా ఎన్ని మజిలీలో బాబు

నాకధకు ముగింపు ఎప్పుడో, మీరే ఊహించండి, మాస్వేశ్చకు అడ్డు మాత్రం రాకండి .   


--(())--

🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
          .
50,000 వేల తిరు నామాల తో అరుదైన వేంకటేశ్వరుని రూపం - Ashok remedies- Astrology tips and Astrology reports in Telugu, English, Tamil , Hindi

నమో నమో తిరుమల తిరుపతి వెంకటేశా (1 )
ప్రాంజలి ప్రభ తేటగీతి  పద్యాలు
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ

వేంకటేశ్వర మేలుకో తెల్ల వారె
సుప్రజా రామ తూర్పున వెలుగు వచ్చె
నిత్య కర్తవ్య దైవఆహ్నికాలు చేయ
లెమ్ము కౌసల్య పుత్ర శోభ కలి గింపు...... 1

వందనమ్ము శ్రీ వెంకట రమణ లక్ష్మి
వల్ల భాప్రసన్న వదనా సర్వ రక్ష
పద్మములువంటి కన్నుల శ్రీ మతీతొ
కలసి ముచ్చట్లు జరిపియు ఏలుకోవ...... 2

వేంకటేశ్వర నికి చెందిన భార్యగా
బీబి  నాంచారి భక్తితో లీన మయ్యె
ముస్లిమా హిందువా అని భెదమేది
లేదు నిష్ట కలియుగ దైవసతి భక్తి........ 3

గురువు బోధాంమృతపు శక్తి యుక్తి ముక్తి
విద్యార్థి చైతన్యపు పరి శోధనలు సాక్షి
ఆత్మబంధువు సేవలు పొందు తీరు
రాకపోకలు లేని స్థితి గతి తెల్పు........... 4

ఎవ్వ రైనా త లఁచినఫు డే ప్రసన్ను 
డైకొలిచిన వారికి  కూరిమి కలి గించి
వేద మంత్రములను వింటు పరవశమ్ము
పొంది ఆపదలు మాపుము వేంకటేశ  ...... 5
    
ఋతువులు కదిలినా ఋష్య మూక పర్వ 
తమ్ము పైఉన్న  ఋక్షరాజు డే సహాయ  
మిచ్చి ఉన్నను రుణగ్రస్తు డేఅనకయు  
ఋషుల మంత్ర పఠనములు వేంకటేశ  ...... 6

ఉవ్వి లూరేటి మనసును పొంద లేదు
వయసు ఉరవడి నుండియు రక్ష కల్పు   
వాదనను చేయ లేను తృప్తి కల్గ చేయు
శ్రీనివాస ఫలమును కోర ఆశ లేదు      .............  7  

--(())--

నాలో నేను ...తేటగీతి పద్యాలు 
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  


మనిషి మనసుని బట్టియు అడుగు వేయు
అమ్మ  మనకు చెట్టువలెను  ఉండ మంది
మనిషికి మనసు భావపు పుట్ట వుంది
పుట్ట లోఏమి ఉన్నను మనిషి ఓర్చు

జంతువులు లాగ ఉండేటి మృగపు మనిషి
మాట రానట్టి మృగములా మనిషి ఉండె
మృగము ఆకలి కేచంపి తినుచు ఉండు
మనిషి మృగములా స్త్రీ లను పాడు చేయు

భావము విరుధ్ధ సంఘట నములు చూపు
భావ ముపకార అపకార చేయు చుండు
భాగ్యము కొరకు మనసును దోచు చుండు
భాద్యతంతయు గాలికి వదలి వేయు

జీవి బతుకులు కావడి కుండ లగును 
భౌతి కములు సుఖము దుఃఖములును కావు 
వెలుపల కనిపించేటి వస్తువులు ఔను
లోపల వెలుపలనవుండు యోగమందు 
    
జీవి చేతన మైనట్టి వస్తువున్ను 
వస్తువు కు అర్ధ మున్నది సచేతనము 
స్థిరము వస్తువు అనుటయు భ్రమలు తెలుపు 
ప్రాణ మున్నను లేకను అస్థిరమ్ము 

--(())--

శివోహం అంటే అర్ధం తెలుసా? 

        మనం మానవులం.. ఎన్నో కర్మలు చేస్తాం. ఇలాంటి మనం శివుడు ఎలా అవుతాం? శివోహం అని ఎందుకు అంటున్నాం? మనం శివుడిగా మారాలి అంటే మనం తెలుసు కోవలసినది ఏమిటి? మన గ్రూప్ లో ఉన్న సభ్యులు అందరికి తప్పక తెలియాల్సిన విషయం ఇది. 

          ఆది శంకరాచార్యుల వారి సాహిత్యమును స్తోత్ర (భక్తి) సాహిత్యము, వైరాగ్య ప్రకరణములు అని రెండుగా విభజించవచ్చు... ఆది శంకరాచార్య విరచిత నిర్వాణషట్కం వైరాగ్య ప్రకరణముల కోవలోనిది. నిర్వాణషట్కం భారతీయ వేదాంత మార్గంలో ఉన్నతమైన రచన. నిజానికి ఎంతో దీర్ఘమైన వ్యాఖ్యానము, వివరణ అవసరము. కాని, ఇక్కడ క్లుప్తముగా మాత్రమే చర్చ ప్రస్తుతానికి! ఆధునిక పోటీ పరీక్షలలో సమాధానం సరిగా తెలియనప్పుడు, సరైనవి కాని సమాధానములను వరుసగా ఇది కాదు, ఇది కాదు అని.. చివరికి సరి ఐన లేదా సరి ఐనట్లు అనిపించిన సమాధానము ను చేరుకొనే పద్ధతి ఒకటి ఉంది. భగవంతుని రూపమును, తత్త్వమును తెలిసికొనడం అసాధ్యం కనుక, ఏది భగవంతుడో తెలియనప్పుడు, ఏది భగవంతుని తత్త్వమో తెలియనప్పుడు ఏది భగవంతుని తత్త్వము కాదో తెలిసికొనడం తేలిక కనుక 'ఇది కాదు' 'ఇది కాదు'అని తీసి వేస్తూ చివరికి మిగిలిన వర్ణనకు, వ్యాఖ్యానమునకూ అందని తత్త్వమేదో అదే పరమాత్మ తత్త్వము అని తెలిసికొనడాన్ని వేదాంతం.

      ''నేతి... నేతి'' అంటే, 'న ఇతి', 'న ఇతి', అంటే, 'ఇది కాదు' 'ఇది కాదు'.. అని చెప్పింది! 'మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం' మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగువిధములైన అంతఃకరణ ప్రవృత్తులు వున్నాయి. మనసు అన్నింటికీ అధిపతి. లేని దాన్ని ఉన్నట్లుగా, తనది కాని దాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైన దానిని శాశ్వతమన్నట్లుగా మరులు గొల్పుతుంది,  వుసి గొల్పుతుంది, పురి కొల్పుతుంది, భ్రమింప జేస్తుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది. ఆకాశానికెత్తేస్తుంది. కడకు పాతాళానికి తొక్కేస్తుంది.

        మనిషికి మనస్సే అన్నింటికి మూల కారణం, ప్రేరణ, ఉత్ప్రేరకం, వినాశకరం. 

        నాది, నాది కాదు - అనేదే బంధానికి, మోక్షానికి కారణాలు. నాది అనేది, నాకు మాత్రమే అనే విచిత్ర బంధం. ఇతరులగురించి ఆలోచింపజేయదు. ఎవరికి చెందకూడదు అంటుంది. పూర్తి స్వార్థం. ఇది వినాశనానికి దారితీస్తుంది. 

       నేను అనేది సాత్వికం. నేను కూడా అనేది రాజసిక అహంకారం. నేను మాత్రమే అనేది తామశిక అహంకారం. 

       నేను ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎక్కడ నుండి ఎక్కడికి అనే అన్వేషణ సాత్వికం. మనిషిని ఉన్నతస్థితికి చేర్చుతుంది. నేను కూడా అనేది రాజసికమైనది. నాకు ఒక ఉనికి, నాకు శక్తి ఉంది అని సాధనకు ఉపయోగిస్తుంది. ఈ రెండూ మంచివే, అవసరమే.

        నేనుమాత్రమే, నాకు మాత్రమే అనే తామసిక ప్రవృత్తి కల్గిన వారికి, వారిని వారి ద్వారా నే సర్వ నాశనం చేస్తుంది. 

      దీనికంతా మనస్సే కారణం.    

      కనుకనే మనస్సును బుద్ధికి స్వాధీనం చేసి, బుద్ధి ద్వారా కల్గిన విచక్షణ తో మంచి చెడులు తెలుసుకొని, మంచిని గ్రహించి, చెడును పారద్రోలాలి. కనుక బుద్ధి పరమాత్మ తత్వం. 

      బుద్ధికి మనస్సును అప్పచెప్పి జీవిత ప్రయాణం చేస్తే, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దారి తప్పవు. మంచి కర్మలు మిగులుతాయి. అప్పుడు మానవుడు శివుడవుతాడు. 

శ్రీ కృష్ణ కర్ణామృతం (3 )

చాతుర్త్యైక నిధానసీమ చెపలా పాంగ్ చ్చటామంథరం 
లావణ్యామృత వీచి లాలిత దృశం లక్ష్మి కటాక్షదృతమ్ 

భావము :-   గొప్ప నైపుణ్యం ములకు కారణములై,.... చలించు చున్న క్రీగంటి కాంతుల చే శోభించు వాడును ....దివ్య ప్రకాశము లనే అమృత వీచికల చేత కదులుతున్న నేత్రములు గలవాడు ను,.... సైకత శ్రేణులలో వివరించుటకు అనురాగ శక్తులు గలవాడు ను.....మన్మధుని  పుట్టుకకు కారణమైన వాడు ను,......సమస్త సౌందర్య రాశి యును, శ్రీదేవి కటాక్ష వీక్షణముల చేత ఆధరింపబడే వాడును అగు నల్లని బాలుడి ని మేము సేవింతుము  
 .


సీస పద్యము 
రచయిత  మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

అనురాగ లక్ష్యముతో గొప్ప నైపుణ్య 
మంతయు తెల్పుచు ఉన్న కృష్ణ 
కదులు నేత్రములు కలిగి దివ్యాతి 
దివ్యమై నట్టి కాంతులను కలిగి     
మన్మధ జన్మకారకుడు సమస్త శక్తి 
సౌందర్య రాశియు ధైర్య లక్ష్మి 
శ్రీదేవి తొ కటాక్ష విక్షణ ములచేత  
ఆధరింప బడేటి జలజ నయన 

తేటగీతి 

దివ్యనేత్రములు కలిగి దెరుచునంత
గానపడుచుండు నాకు నిత్యంబు విశ్వ 
మేలు మాజ్యోతి కాంచితి కరుణ తోడ
నన్ను రక్షించు శ్రీకృష్ణ సన్ను తింతు 

--(())--  

No comments:

Post a Comment