Monday 2 November 2020

03-11-2020... అట్లతద్ది

 






సమ్మోహనాలు.. మహిలోన

రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


అనురాగ పలుకులను

పలుకే హృదయాలను

హృదయ స్పందనలు మనసు చేరె మహిలోన


అమ్మ యే అక్షరము 

అక్షర వాక్కు ఫలము

ఫలమే హృదయ స్పందనప్రేమ మహిలోన


ఉనికి ఉత్సాహ ముయె

ఉత్సాహ ప్రేమయె

ప్రేమతో అమ్మ కృప యేలుటే మహిలోన


ఊపిరి భర్త కిచ్చి

భర్తకు బిడ్డనిచ్చి

బిడ్డల కోసము తల్లి భాధయు మహిలోన


ధ్యాస ఆత్మీయత గ

ఆత్మీయత కళలుగ

కళలు చూపుచూ తల్లిప్రేమ మహిలోన


తలపుల పలకరింపు 

పలుకుల వినయసొంపు

వినయ విధేయతను చూపు తల్లి మహిలోన


తెలుపు తన్మయ తలపు

తలపుల భర్త వలపు

వలపు తీర్చియు సౌఖ్య మిచ్చేను మహిలోన


స్వచ్ఛంద సంరక్ష

సంరక్ష గ నిరీక్ష

నిరీక్ష తో భర్త మేలు కోరు మహిలోన


ఒడుదుడుకులు ఎన్నున్న

ఎన్నున్న తరుణమున్న

తరుణాన సంతస పరుచు తల్లి మహిలోన


చిరునగవు చూపుచూ

చూపు వ్యక్త పరచూ

వ్యక్త పరిచే మనసున్న తల్లి మహిలోన

***((())****

౦ 3 -11 -2012 నేను మొదట పోష్టు చేసినది 

ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 

సేకరణ రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

దివ్య పత్రికలో  నేటి సమాచారముల

శ్రీ నా మరామాయణము,

శ్రీ నామరామాయాణము

బాలకాండ 

 

శుద్ధ బ్రహ్మాపరాత్పర  రామ !                                           

శుద్ధ  బ్రహ్మ స్వరూపులను, పరాత్పరులును  ఆయిన రామా !

కాలాత్మక పరమేశ్వర రామ !                                       

కాలరూపులును, పరమేశ్వరుడును ఆయిన రామా !


శేషతల్ప సుఖనిద్రిత రామ !                                                      

శేష శయ్యపై సుఖముగా నిద్రించు రామా !

బ్రహ్మాద్యమర ప్రార్ధిత రామ                                               

 బ్రహ్మాదేవుడు మొదలైన దేవేతలచే ప్రార్ధిమ్పబడు రామా !

భక్తబృంద పరిపాలన రామ 

భక్తులను పాలించే రామా !

ముక్తిప్రదసురమిని నుతరామ

సర్వులకు యుక్తిని ప్రసాందించే రామా ! 

చండ కిరణ కులమండన రామ!                                                  

 సూర్య కులమును ప్రకాశింప జేయు రామా !

శ్రీమద్దశరథ నందన రామ !                                                 

శ్రీమంతుడగు  దశరధుని కుమారుడగు రామా !

కౌసల్యా సుఖ వర్ధన రామ !                                               

కౌసల్య  యొక్క  సుఖమును పెంపొందించు   రామా ! 

 విశ్వామిత్ర ప్రియధన రామ !                                           

విశ్వామిత్రునకు ప్రియధనమగు రామా ! 

ఘోరతాటకా ఘాతక రామ !                                                

భయంకర రూపిణియగు తాటకను సంహరించిన రామా!

మారీచాది  నిపాతక రామ!                                                     

మారీచాది  రాక్షసులను మట్టుపెట్టిన రామా!

కౌశికముఖ సంరక్షక రామ !                                                

విశ్వామిత్రుని యాగమును రక్షించిన రామా !

శ్రీమదహల్యోద్ధారక రామ !                                                       

శ్రీమతియగు అహల్యను ఉద్ధరించిన రామా !

గౌతమముని సంపూజిత రామ !                                              

 గౌతమ మునీస్వరునిచేలెస్సగా పూజింపబడిన రామా !

సురమునివర గణసంస్తుత  రామ !                                       

దేవతలు మునీస్వరులుచే స్తుతిమ్పబడిన రామా !

నావికధావితమృదుపద రామ !                                           

నావికునిచే కడుగాబడిన మృదువైనపాదములుగల రామా!

మిధిలాపుర జనమోదక రామ !                             

మిధిలాపుర జనులకు  సంతోషమును కలుగజేసినరామా                  

విదేహకమానస రంజక రామ !                                                  

జనకుని మనస్సును రంజింపజేసిన రామా !

త్రయంబక కార్ముక భంజక రామ !                                                  

శివధనుస్సును విరచిన రామా !

సీతార్పిత వరమాలిక రామ !                                                      

సీతచే వేయబడిన శ్రేష్టమగు పుష్పమాల గల రామా !

కృత వైవాహిక కౌతుక రామ !                                                        

సీతను వివాహమాడిన రామా !  

భార్గవదర్ప వినాశక రామ !                                                

పరశురాముని దర్పమును అణచిన రామా !

శ్రీమదయోధ్యా పాలక రామ !                                                

అయోధ్యా వాసులకు అనందమును కలుగ జేసిన రామా! 


అయోధ్య కాండము 


అగణిత గుణగణ  భూషిత  రామ !                                                 

అనేక సుగుణములచే  శోభించు రామా !

అవనీతనయా కామిత రామ !                                                    

సితదేవిచే ప్రేమిమ్చబడిన రామా!

రాకా చంద్ర సమానన  రామ !                                         

పున్నమిచెంద్రని వంటి ముఖముగల రామా!

పితృవాక్య శ్రితకానన  రామ !                                                   

పితృ వాక్య్యమును అనుసరించి అడవులకుకేగిన రామా!

ప్రియగుహ వినివేదిత పద రామ !                              

 ప్రియగుహునిచేనమస్క్రింపబడిన పాదములుగల రామా!

తత్ క్షాలిత నిజమృదుపదరామ !                                          

గుహునిచే కడుగాబడిన మృదువై న పాదములు గలరామా!   

భరద్వాజ ముఖానందన రామ !                                              

భరద్వాజుని ఆనందపరచిన రామా!

చిత్రకూటాద్రి నికేతన రామ !                                           

చిత్రకూటపర్వతము పై నివసించిన రామా!

దశరథ సంతత చింతిత రామ !                                              

దశరదునిచే సదా చిన్తింపబడిన రామా!

కైకేయీ తనయార్ధిత రామ !                                                     

భరతునిచే ప్రార్ధించిన రామా!

విరచిత నిజపితృకర్మక రామ !                                          

మరణించిన దశరదునకు పితృ కర్మల నాచరించిన  రామా!

భరతార్పిత నిజపాదుక రామ !                                              

భరతునకు పాదుకలు నొసంగిన రామా!


అరణ్యకాండము 


దండక వనజన పావన రామ !                                               

దండకారణ్య వాసులను పావనమోనర్చిన రామా! 

దుష్ట విరాధ  వినాశన రామ !                                               

దుష్టుడగు విరాదుని సంహరించిన రామా !

శరభంగ సుతీక్ష్నార్చిత  రామ !                                

శరభంగుడుసుతీక్ష్నుడు,అను మహనీయులచెపూజీమ్పబడినరామా !

అగస్త్యా నుగ్రహ  వర్ధిత  రామ !                                                  

అగస్త్యుని అనుగ్రహమును బడసిన రామా !

గ్రద్ద్రాధిప సంపేవిత రామ !                                                       

 గ్రద్ద్ర రాజు జటాయువుచే  సేవిమ్పబడిన రామా !

పంచవటీ తట సుస్థిత రామ !                                                  

పంచవటీ తీరమున నివసించిన రామా i

శూర్పణ ఖార్తి  విధాయక రామ !                                            

శూర్పణను రక్షించిన రామా !

ఖరదూషణ ముఖ సూదక  రామ !                                       

ఖరదూషణాది రాక్షసులను సంహరించిన రామా!  

సీతా ప్రియ హరిణానుగ రామ !                                                

సీతాకు  ప్రియమై న బంగారులేడిని వెన్నంటిన  రామా !

మారీచార్తి కృతాశుగ రామ !                                                  

మారీచుని శిక్షించిన బాణముగల రామా!

వినష్ట  సీతా న్వేషణ రామ !                                                    

సీత కొరకు అన్వేశిక్షించిన రామా !

గృధ్రాధి పగతి దాయక రామ !                                                

జటాయువు నకు సద్గతి నొసంగిన రామా!

శబరీదత్త  ఫలాశన రామ !                                                           

శబరి ఓ సంగిన ఫలములను భుజించిన రామా !   

కభంధ  బాహుచ్చేదన  రామ !                                               

కభంధుని బాహువులు ఛేదించిన  రామా !


కిష్కిందా కాండము 

 

హనుమత్సేవిత  నిజపద రామ !                                      

హనుమంతునిచే సేవిమ్పబడిన పాదములుగల  రామా !

నత సుగ్రీవాభీష్టద  రామ !                                                 

వినీతుడగు సుగ్రీవుని అభీష్టమును నెరవేర్చిన   రామా !

గర్విత వాలి సంహారక రామ !                                                

గర్వించిన  వాలిని  సంహారించిన  రామా !

వానరదూత ప్రేషక  రామ !                                               

వానరదూతను పంపిన రామా !

హితకర లక్ష్మణ సంయుత రామ !                                       

హితకరుడగు లక్ష్మణునితో కూడియున్న రామా !


సుందర కాండము 


కపివర సంతత  సంస్మృత రామ!                                          

కపిశ్రేష్టులచే  సదా సంస్మరింపబడిన రామా!

తద్గత విఘ్న ధ్వంసక రామ !                                           

కపిసమూహము యోక్క విఘ్నములను కాపాడిన రామా!

సీత ప్రాణా ధారక రామ !                                                          

సీతయౌక్క ప్రాణములను కాపాడిన రామా !

దుష్ట దశానన ధూషి త రామ !                                             

దుష్టుడగు రావణునిచే పరుషముగామాట్లాడబడిన రామా!

శిష్ట హనుమద్బూషిత రామ !                                                  

శిష్టుడగు హనుమంతునిచే స్తుతిమ్పబడిన రామా!     

సీతోదిత కాకావన రామ !                                                       

సీత తెలిసినట్టి  కాకాసురుని రక్షించిన రామా ! 

కృత చూడామణి  దర్శన  రామ !                                                  

సితచే ఒసంగాబడిన చూడామణిని దర్శించిన రామా!

కపివర వచనాశ్వాసిత రామ !                                            

హనుమంతుని వాక్యములచే ఆశ్వాసమును బొందిన రామా!


యుద్ధకాండము 


రావణ  నిధన ప్రస్థిత రామ !                                                    

రావణుని సంహరించుటకు భద్ధకంకను డైన రామా!

వానర సైన్య  సమావృత రామ !                                                 

వానర సైన్యముతో కూడియున్న రామా!

శోషిత  సరిధీశార్ధిత రామ !                                                 

సముద్రునిచే ప్రార్ధిమ్పబడిన రామా!

విభీషణా భయ దాయక రామ !                                           

విభీషనునకు అభయ మోసంగిన రామా!

పర్వతసేతు నిబంధక రామ !                                           

పర్వతములలో సేతువును నిర్మించిన రామా!

కుంభకర్ణ శిరశ్చే దక రామ !                                             

కుంభకకర్ణుని శిరస్సును చ్ఛేదించిన రామా!

రాక్షస సంఘ విమర్ధక రామ !                                                

రాక్షస సమూహమును మర్దించిన రామా!

అహి మహి రావణ మారణ  రామ !                                              

ఆహి మహి రావణులను శిక్షించిన  రామ!

సంహృత దశముఖ రావణ  రామ !                                         

దశముఖ రావణుని  హతమార్చిన  రామా!

విధి భవ ముఖసుర సంస్తుత  రామ !                                 

బ్రహ్మా ,శివుడు మొదలైన దేవతులచే సుతిమ్పబడిన రామా! 

ఖస్థిత దశరథ వీక్షిత రామ !                                                 

ఆకాశమున దశ రధుని   వీక్షిమ్చిన రామా!

సీతాదర్శన మోదిత  రామ !                                             

సీతాదర్శనముచే ఆనందమును పొందిన రామా!

అభిషిక్త  విభీషణ నుత రామ !                                            

పట్టభిషక్తుడేన విభీషనునిచే స్తుతింపబడిన  రామా!

పుష్పక యానారోహణ రామ !                                    

 పుస్పకవిమానమును అధిరోహించిన రామా!

భారద్వాజాభి నిషేవణ రామ !                                            

భారద్వా జాది  మహర్షులను సేవించిన  రామా!

భరత ప్రాణ  ప్రియకర రామ !                                                  

భరతుని ప్రాణమును కాపాడిన రామా!

సాకేతపురీ  భూషణ  రామ !                                          

సాకేతపురమునకు భూషణుడైన  రామ!

సమస్త  జనసమ్మానిత రామ !                                              

జనులన్దరిచే సన్మా నిమ్పబడిన రామా! 

రత్నలస త్ఫీటస్ధిత రామ !                                               

రత్నములుచే శో భించు పీటమున ఆసీనుడైన రామా!

పట్టాభిషేకాలంకృత రామ !                                            

పట్టాభిషేకముచే అలంకృత మైన రామా!

పార్ధివకుల సమ్మానిత రామ !                                            

రాజులచే సంన్మానిమ్పబడిన రామా !

విభీషణార్పిత తరంగక  రామ !                                           

విభీషణునిచే అర్పిమ్పబడిన భక్తి  ప్రపత్తుగల రామా!

కీశ కులానుగ్రహకర రామ !                                    

వానరసమూహమునకు అనుగ్రహించిన రామా!

సకల జీవ సంరక్షక రామ !                                                       

సమస్త  జీవులకును  సంరక్షకుడ వై న రామా!

సమస్త లోకోద్దారక రామ !                                                          

సమస్త లోకములకు  ఆ ధారభుతుడ వైన రామా!


ఉత్తరకాండము 


అగణిత మునిగణ సంస్తుత రామ!                                             

వచ్చిన మునులచే లేస్సంగ్ స్తుతిమ్పబడిన  రామా!

విశ్రుత దశ కంఠో ద్భవ రామ !                                                  

రావణ సంహరముచే  గొ ప్ప కీ ర్తిని బడసిన రామా!

సీతా లింగన నిర్వృత రామ !                                         

సీతాలింగనముచే  సుఖమును పొందిన రామా!

నీతి సురక్షిత జనపద రామ !                                                      

నీతి  నియమములు గలిగిన  జనులతో గూడిన  రామా!

విపిన త్యాజిత జనకజ రామ !                                                        

సీత ను అడవికి పంపిన రామా!

కారిత లవణా సుర వధ రామ !                                

సత్రుఘ్ననిద్వార లవణాసురుని సంహారమునకు కారణమై న రామ!

స్వర్గత శంబుక సంస్తుత రామ !                                          

సంబుకునిచే సంసుతిమ్పబడిన రామా !

స్వతనయ కుసలవ వందిత రామ !                                    

కుమారులగుకుశ లవులనుగాంచిసంతసించిన రామా!

అశ్వమేథ కృతు దీక్షత రామ !                                              

అశ్వమేథ యాగ నిర్వహణమునకు దీ క్ష వహించిన రామా!

కాలావేదిత  సురపద రామ !                                    

కాలునిచే తెలుపబడిన బ్రహ్మాధామ గమన వృత్తాంత్త ముగల రామా!

అయోధ్యక జనముక్తిద రామ !                                              

అయోధ్యా  పురవాసులకు ముక్తినోసంగిన రామా!

విధిముఖ విభుధా నందక రామ !                                     

బ్రహ్మా దేవునాకు ,దేవతులకు ఆనందము కలిగించిన రామా!

తేజోమయ నిజరూపక రామ !                                            

తేజోవంత మై న బ్రాహ్మ స్వరూపమును  పొందిన రామా !

సంస్కృతి  భంద విమోచక రామ !                                               

సంసార భంద విమోచాకులగు రామా!

ధర్మ స్థాపన  తత్పర రామ !                                                     

ధర్మ స్థాపన తత్పరులగు రామా!

భక్తి  పరాయణ ముక్తిద  రామ !                                          

భక్తిపరాయణులకు మోక్షమోసంగునట్టి రామా!

సర్వచరాచర పాలక రామ !                                                     

సమస్త  చరాచర ప్రానికోట్లను పాలించురామా!

సర్వభవామయ వారక రామ !                                       

సంసారరోగమును పరిపూర్ణముగా నివారించు రామా!

వైకుంఠాలయ సంస్థిత  రామ !                                                

వై కుంట నివాసమున వేల యు నట్టి  రామా!

నిత్యనంద  పద స్థిత రామ !                                                  

నిత్యానంద బ్రహ్మా పదమున విలసిల్లు  రామా!


రామ రామ జయ రాజ రామ !                                                 

రామా రామా రాజాధిరాజగు రామా జయమగుగాక!

రామ రామ జయ సీతా రామ!                                                 

రామ రామ  సీతారామా జయమగుగాక! 


శ్రీ రామ మంగళ హారతి

రామచంద్రాయ జనకర్రాజమనోహరాయ 

మామకా భీష్టదాయ మహితమంగళమ్ 

సీతా మనోహరులను,  భక్తుల అభిష్టములను నెరవేర్చువారును అగు శ్రీ రామచెంద్రు నకు మంగళమగుగాక!

కౌసలేయాయ మందహాస దాస పోషణాయ

వాసవాది వినుత సద్వరద  మంగళంకోసలదేశాధిపతియు, మందహాసము కులవారును, భక్తులను పోపోషించువారును దేవేం ద్రాదులచే స్తుతింపబడువారును, ఉత్తమవరముల  నొసంగువారును అగు శ్రీ రామచెంద్రునకు మంగళమగుగాక! 

పుండరీ కాక్షాయ పూ ర్ణ చంద్రాననాయ

అండజాత  వాహనాయ అతుల మంగళమ్.కమునేత్రులను,పూర్ణచంద్రుని వంటి   సుందరముఖము కలవారును, గరుడ వాహనులను అగు విష్ణు రూపులయ్న శ్రీ రామచెంద్రునకు మంగళమగుగాక!


--(())-- ...


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

అట్లతద్ది ముఖ్యమైన సమయాలు

సూర్యోదయం నవంబర్ 03, 2020 6:37 ఉదయం
సూర్యాస్తమయం నవంబర్ 03, 2020 5:43 అపరాహ్నం
తదియ తిథి ప్రారంభమైంది నవంబర్ 03, 2020 1:14 ఉదయం
తదియ తిథి ముగుస్తుంది నవంబర్ 04, 2020 3:24 ఉదయం

సౌభాగ్య‌దాయిని ‘అట్ల‌త‌ద్ది’
అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. ఉండ్రాళ్ళ తద్ది మాదిరే ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు , ముత్తయిదువులు గోరింటాకు అందంగా అలంకరించుకుంటారు. మరునాడు వేకువ జామునే లేచి తలస్నానం చేసి , పూజా మందిరంలో పీఠమును పనుపు , కుంకుమతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు. దానిపై తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గౌరీ దేవిని పూజిస్తారు. గంధం , పసుపు , పువ్వులతో పూజిస్తారు. ఆ తర్వాత దేవికి అట్లు , ఇతర పదార్థాలు నైవేద్యంగా పెడతారు. అనంతరం శక్తి కొద్దీ ముగ్గురుకానీ , ఐదుగురు కానీ ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వటం ఆనవాయితీ. ఇలా చేసినందువల్ల గౌరీదేవి అనుగ్రహంతో సుఖాలు , సౌభాగ్యం కలకాలం నిలవడంతో పాటు పుణ్యం వస్తుందని చెబుతారు. ఇది అట్లతద్దె జరుపుకోవటంలో ముఖ్య ఉద్దేశ్యం. అట్లతద్దినాడు తెల్లవారు జామున పిల్లలు అన్నం , గోంగూర పచ్చడి , పెరుగుతో కడుపునిండా తింటారు. అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌ , ముద్ద పప్పోయ్‌ మూడట్లోయ్‌ అంటూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో  కలిసి ఆటలు ఆడతారు. ఉయ్యాలలూగుతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. పెద్దలు మాత్రం పగలంతా ఉపవసించి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత మళ్ళీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి ఆరగిస్తారు.

అట్ల తద్ది కథ

అట్లతద్దికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక రాజు కూతురు , మంత్రి కూతురు , సేనాపతి కూతురు , పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి , మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లెలి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.
ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదిగో చంద్రోదయమైంది. అమ్మా కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో’ అన్నాడు. రాజ కుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడషోపచారాలతో ఉమాదేవిని పూజించిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. అందుకే ఈ వ్రతానికి ‘చంద్రోదయ ఉమావ్రతం’ అని పేరు వచ్చింది. అయితే రాజకుమారి సోదరుని మాటలు నమ్మి వ్రత భంగం చేసింది. ఇది జరిగిన కొద్ది కాలానికి రాకుమారికి పెళ్లయింది.

కొంతమంది దుష్టుల మోసం వల్ల ఆమెకు ముసలి భర్త లభించాడు. ఆమె ఎంతో బాధపడింది. వ్రతం చేస్తే మంచి భర్త రావాలి గాని ఇలా ఎందుకు జరిగిందని వాపోయింది. పార్వతీ పరమేశ్వరులను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది. వారు ఆమె సోదరుడు ఆమెపై ప్రేమతో చేసినదంతా చెప్పారు. అయితే మర్నాడు ఆశ్వయుజ బహుళ తదియ అని ఆ రోజు చంద్రోదయ ఉమా వ్రతం చేస్తే ఆమె సమస్య తీరుతుందని చెప్పారు. ఆమె యధావిధిగా పూజ చేసి అక్షతలు భర్త మీద చల్లగానే ఆయన యవ్వనవంతుడయ్యాడు. కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సౌభాగ్యంతో తులతూగుతారు.

అట్లతద్ది అంతరార్థం

త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి     వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం.

ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం.
రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది.

ఆశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమయినది. పిల్లలు , పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈరోజున తెల్లవారు జామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీదేవి పూజ చేసి , ఆమెకు 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు , 11 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకుని , శిరస్సుపై అక్షతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం , 11 తాంబూలం వేసుకోవడం , 11 ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు. కనుకనే ఈ పండుగకు ‘అట్లతద్ది’ అనే పేరు వచ్చింది. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి , ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి.

సృష్టి స్థితి లయలకు కారకులయిన బ్రహ్మ , విష్ణు , పరమేశ్వరుల భార్యలు సరస్వతి , లక్ష్మి , పార్వతులకు నెల పొడవునా ఉత్సాహంగా పూజలు జరిపే మాసం ఆశ్వీయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం. కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా , పాడినా వాళ్లంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెబుతున్నాయి పురాణాలు.

--(())--

* UK ANNOUNCED ONE MONTH LOCKDOWN, FRANCE 2 WEEKS.*
GERMANY FOR 4 WEEKS
ITALY ALSO TO FOLLOW SHORTLY...
ALL THESE COUNTRIES CONFIRMED SECOND WAVE IS MORE DEADLIER...
IN INDIA WE ARE HEADING TO THE COUNTRY’S MOST CELEBRATED FESTIVAL DIWALI... TAKE UTMOST CARE AND MANTAIN ALL PRECAUTIONS.
PLEASE ALSO BECOME COMMUNICATORS OF THE ALERT AMONG ALL FRIENDS AND RELATIVES... SAVE INDIA FROM SECOND WAVE...
WE WILL NOT BE ABLE TO TAKE THE 2ND PHASE OF LOCKDOWN...

*Yes, history tells us 
Second wave is more dangerous as was the case in 1917 to 1919 with Spanish Flu. Crores of people died.*
Protect yourself and your family.

--(())--

03-11-2020
నాలో నేను ... ప్రాంజలి ప్రభ (6 )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
         
పసితనం జ్ఞప్తి లేదును నిలయ మందు 
బాల్య ములొ ఆట పాటలు నేర్చినాను 
యవ్వనములోన ఆకర్షణ లకు లొంగి 
ఏది తెలుసుకో లేనట్టి వయసు దుడుకు 

నిన్ను తలవని మనసుతో జీవితమ్ము 
యవ్వన దుడుకు పెళ్ళికి దారితీసె 
పెళ్లితో మొదలయ్యేను సుతులు పెరిగె 
నిన్ను తలవని బుద్ధిని కరుణ చూపు 

చెప్పిన పలుకు నిలుపుకో హాయి గుండు 
నేను మానవతాధర్మ ములను  నిలిపి 
ఉన్న దానితో సంసార సుఖము పంచి 
వృత్తి ధర్మాన్ని అనుకరించి దయ చూపు 
 
బిడ్డలుగ తల్లి తండ్రుల సేవచేసి 
ఎట్టి బాధ కలుగకుండ చూసి యుండి 
అవసరసహకా రముచేసి సహకరించి 
కన్న వారిపే రుప్రతిష్టలను చూసె 

అమ్మ అనుటలో ఆప్యాయత కని పించు 
నాన్న అనుటలో నమ్మకము కనిపించు 
తాత అనుటలో తన్మయత్వమని పించు 
బామ్మ అనుటలో అభిమాన దయయు పంచు 
 
అత్త అనుటలో ఆదరణ అనిపించుఁ 
మామ అనుటలో మమకార ముకని పించు 
అన్న అనుటలో అభయము వెంట ఉండు 
చెల్లి అనుటలో చేయూత వెంట ఉండు 

అక్క అనుటలో అనురాగ ము కనిపించు 
బావ అనుటలో  ప్రేమత్వము కనిపించు 
మరదలు అనుట మర్యాదలు కనిపించు 
మరిది అనుటలో మానవత్వముయు చూపు 
    
విద్య చోరులు దోచుకో లేని దగును 
విద్య రాజ్యాల  పాలన చూపు దగును 
విద్య పంచుకో లేనిస్థిర మగు ఆస్తి 
విద్య ప్రయాణ బరువుగ ఉండ నిదియు 

విద్య క్రమక్రమముగాను పెరుగు ధనము 
విద్య పంచిన కొద్దియు పెరుగు ధనము 
విద్య తరిగేది కాఁదుపెరుగుచు ఉండు 
విద్య నాటికీ నేటికీ బలము పెంచు      

--(())--
 

ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక కధలు 101 

* ఎవరు గొప్ప *

       *ఒకరోజు సముద్రానికి, ఉప్పు రాశికి పెద్ద తగవు వచ్చింది. సముద్రానికి ఎదురుగా ఉప్పు రాశి ఉంది. ఆ ఉప్పు రాశుల కోసం వ్యాపారులు వచ్చి అక్కడున్న వాళ్లతో బేరమాడుతున్నారు... బాగా చీకటి పడింది. 

     *  ఉప్పు రాశి హేళనగా ' సముద్రం! నువ్వు చూడ్డానికి పెద్ద జల రాశి కానీ ఏం లాభం ...? నీ నీటి చుక్క తాగడానికి కూడా పనికిరాదు. నేను లేకపోతే ఏ వంటకీ రుచుండదు...శుభకార్యాల్లోనూ నా పేరు మార్మోగుతుంటుంది అంది గర్వంగా..

     *  సముద్రం నవ్వి 'నా నీటి తోనే నువ్వు తయారయ్యావు, నీ ఉనికిని మరచిపోయి, నా నుంచి వేరయ్యే సరికి అహంకారం పెరిగింది?" ఆంది

     * ఉప్పు రాశి గట్టిగా నవ్వి 'నీ నుంచి వచ్చినా నీ కన్నా నేనే గొప్ప.. ,చెట్టు నుంచి వచ్చిన పండుని ఇష్టపడతారు కానీ, చెట్టుని ఇష్టపడరుగా!' అంది. 

     * ఉప్పు రాశి అతి తెలివి, మాట తీరు చూసి సముద్రం ఆశ్చర్యపోయింది. ఎందుకీ వాదన అని మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనం చూసి ఉప్పు రాశి మరింతగా రెచ్చిపోయింది .

     * నేను నిత్యం అందరికి ఉపయోగ పడుతున్నాను...  నువ్వు దేనికి ఉపయోగపడవు... పైగా అమావాస్య, పౌర్ణమికి అల్లకల్లోలంగా కనిపిస్తావు... అందరికీ భయం కలిగిస్తావు నీకన్నా నేనే గొప్పదాన్ని' అంది ఉప్పు రాశి..

     *  సముద్రానికి నవ్వొచ్చింది.. అప్పుడాయన "ఓ చిన్న.. బాగా ఆలోచించు. పూర్వం ఈ జనమంతా ఓడ, స్టీమర్ ఎక్కి నా మీదుగా ప్రయాణించి పరాయి దేశం వెళ్లేవారు. లక్షల రకాల సముద్ర జీవులు నాలోనే నివశిస్తున్నాయి.  మానవులు తినే చేపలన్నీ నా నీళ్ల లోనే ఉంటాయి. ఇప్పుడు చెప్పు నాలో ఎలాంటి గొప్పతనం లేదంటావా?" అంది... ఈసారి మరింత బిగ్గరగా నవ్వింది ఉప్పురాశి.

      * 'నీవన్నీ పాతకాలం నాటి కబుర్లు, అవెవరూ వినరు... ఇప్పటి జనమంతా హాయిగా విమానాల మీద పరాయి దేశాలు పోతున్నారు... చేపల్లాంటివి మానేసి, ఆకుకూరలు తింటున్నారు' అంది.

     * ఉప్పురాశితో వాదించడం అనవసరo ఆ ఆనుకుంది సముద్రం... మౌనంగా ఉప్పురాశి  వైపు చూడసాగింది..

    *  సరిగ్గా అప్పుడే పెద్ద వర్షం మొదలైంది... ఆ వర్షం కుంభవృష్టిగా మారింది... సముద్రపు కెరటాలు ఎగసిపడి ఒడ్డుని చేరుకోడం మొదలు పెట్టాయి. ఆ వర్షానికి ఉప్పురాశి విలవిల్లాడుతూ కరిగిపోయి సముద్రంలో కలిసిపోయింది.

    *  కాసేపటికి ఉప్పురాశి జాడ కనిపించక సముద్రం తనలో తాను నవ్వుకుంది... 

   *** అహంకారం ఉన్నవాళ్ళు ఎప్పటికైనా ఆణగారిపోతారు... ఎవరికైనా వినయ విధేయతలు ముఖ్యం అనుకొంటూ మౌనంగా ఉండిపోయింది.***

ఓం శ్రీ రామ్ .... శ్రీ మాత్రే నమ:

సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ (వాట్సాప్ ) 

--(())--

ఒక చిన్న కధ ... 102  

 ఫిలాసఫీ ని బోధించే ఒక ప్రొఫెసర్ గారు తన తరగతిలో బల్ల మీద కొన్ని వస్తువులతో నిలుచుని ఉన్నాడు.
 విద్యార్థులు మౌనంగా, ఆయన చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నారు.

కొన్ని క్షణాల తర్వాత, ప్రొఫెసర్ తను తెచ్చిన వస్తువుల్లోంచి ఓ పెద్ద ఖాళీ గాజు జాడీని, కొన్ని గోల్ఫ్ బంతులని బయటకి తీసారు. గోల్ఫ్ బంతులని ఒక్కొక్కటిగా జాడీలోకి జారవిడిచారు. క్లాసంతా నిశ్శబ్దం.

జాడీ నిండిందా ?
 అని విద్యార్థులని అడిగారు ప్రొఫెసర్.

పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు.

అప్పుడు ప్రొఫెసర్ తను తెచ్చిన గులకరాళ్ళ కవరు విప్పి, వాటిని కూడా జాడీలో జారవిడిచారు. జాడీని కొద్దిగా కదిలించారు. గులక రాళ్ళన్ని గోల్ఫ్ బంతుల మధ్యకి, అట్టడుగుకి చొచ్చుకుపోయాయి.

క్లాసంతా నిశ్శబ్దం.

జాడీ నిండిందా ?
అని విద్యార్థులని అడిగారు ప్రొఫెసర్.
పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు.

తర్వాత ప్రొఫెసర్ తనతో తెచ్చుకున్న ఒక చిన్న పొట్లంలోంచి ఇసుకని తీసి జాడీలో ఒంపారు.అది జాడీలోకి నిరాటంకంగా జారిపోయింది.
క్లాసంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.

జాడీ నిండిందా ?
 అని విద్యార్థుల్ని ప్రొఫెసర్ అడిగారు.

"నిండింది! నిండింది!" అంటూ విద్యార్థులు ఒకే గొంతుతో అరిచారు.

అప్పుడు ప్రొఫెసర్ అప్పటి దాకా మూత పెట్టి ఉన్న రెండు కాఫీ కప్పులని దగ్గరికి తీసుకున్నారు. వాటి మీది మూతలను తీసి, కాఫీని జాడీలోకి వొంపారు. ఇసుక రేణువుల మధ్య ఉండే ఖాళీ స్థలంలోకి కాఫీ సులువుగా జారుకుంది.

ఈ చర్యకి విద్యార్థులు విరగబడి నవ్వారు.

కాసేపటికి నవ్వులు ఆగాయి. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఇలా అన్నారు --

ఈ జాడీ మీ జీవితాన్ని ప్రతిబింబిస్తోందని గ్రహించండి!

గోల్ఫ్ బంతులు ముఖ్యమైనవి!

  దేవుడు, కుటుంబం, మీ పిల్లలు, మీ అరోగ్యం, స్నేహితులు, ఇంకా మీకు అత్యంత ప్రీతిపాత్రమైన అంశాలు!
మీ సిరిసంపదలన్నీ పోయినా, ఇవి మీతో ఉంటే మీ జీవితం పరిపూర్ణంగా ఉన్నట్లే !.

గులక రాళ్ళు
 మీ ఉద్యోగం, సొంతిల్లు, కారు వంటివి !

ఇసుక - అన్ని చోట్ల ఉండే చిన్నా , చితక విషయాలు!
.
మీరు జాడీని ముందుగా ఇసుకతో నింపేస్తే, గోల్ఫ్ బంతులకి, గులక రాళ్ళకి అందులో చోటుండదు!

జీవితంలో కూడ ఇంతే!

మనం ఎప్పుడూ అంతగా ప్రాధాన్యత లేని చిన్న చిన్న విషయాలకి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ, అసలైన, ముఖ్యమైనవాటిని విస్మరిస్తూంటాం.

మీకూ, మీ వాళ్లకు సంతోషం కలిగించే వాటిపైనే దృష్టి నిలపండి.

మీ పిల్లలతో హాయిగా ఆడుకోండి.

మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

అప్పుడప్పుడు మీ జీవిత భాగస్వామిని బయటకి డిన్నర్‌కి తీసుకెళ్ళండి.

మీరు 18 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నారో, అంతే ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపండి.

ఇంటిని శుభ్రం చేసుకోడానికి, నిరూపయోగమైన వాటిని వదుల్చుకోడానికి ఎప్పుడూ సమయం ఉంటుంది
.
గోల్ఫ్ బంతుల వంటి ముఖ్యమైన అంశాలపై ముందు దృష్టి పెట్టండి.

 ప్రాధాన్యతలు నిర్ణయించుకోండి.

 మిగిలేదంతా ఇసుకే" –

క్లాసంతా నిశ్శబ్దం

ఇంతలో ఒక కుర్రాడు తనకో సందేహమన్నట్లు చెయ్యి ఎత్తాడు.

 "మరి కాఫీ దేనికి ప్రతిరూపం?"
 అని అడిగాడు.

"శభాష్, ఈ ప్రశ్న అడిగినందుకు నాకు సంతోషంగా ఉంది.

"మీ జీవితం దేనితో నిండిపోయినా,
 ఒక మంచి మిత్రుడితో ఓ కప్పు కాఫీకి ఎప్పుడూ అ
వకాశం ఉంటుంది"

 అంటూ ప్రొఫెసర్ క్లాస్ ముగించి వెళ్ళిపోయారు.

(అందరి ఆనందం ... ఆరోగ్యం .. ఆద్యాత్మికం మలక్ష్యం )

--(())--


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 150 🌹

🌷. సద్గురు శివానంద 🌷/📚. ప్రసాద్ భరద్వాజ/ మల్లాప్రగడ శ్రీదేవి రామ కృష్ణ 

🌻. నారద మహర్షి  - 24 🌻

171. ఒకసారి నారదమహర్షి ధర్మరాజు చేసే రాజసూయయాగానికి వెళ్ళాడు. ఆ రాజసూయయాగంలో శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి నిందించాడు. అప్పుడు శ్రీకృష్ణుడి చేతిలో వధించబడ్డ శిశుపాలుడి నుంచి ఒక తేజస్సు వెళ్ళి శ్రీకృష్ణుడిలో ప్రవేశించింది. 

172. ధర్మరాజు నారదుడితో, “ఇదేమిటయ్యా? వీడు ఇంత దుర్మార్గుడు, ఆయనలో ప్రవేశించాడు. వీడు ఏ నరకానికో పోతాడూ అనుకున్నాను నేను. ఈ విషయంలో ధర్మబోధచేయవలసింది” అని అన్నాడు. 

173. ఆయనతో నారదుడు, “అది అంతే! అది శాసనం. అలాగే జరుగుతుంది! ఎందుచేతనంటే క్రొధంతోకాని, స్నేహంతోకాని, భయంతోకాని, కోరికతోకాని, బాంధవ్యంతోకాని, విరోధంతోకాని – వీటిలో ఏ గుణంతోనైనా ఏకాగ్రంగా హరిని ధ్యానం చేసేవాడు ఆయనలో కలిసిపోతాడు. అదే రహస్యం.

174.  కాసేపు భక్తి, కాసేపు రక్తి ఉండేవాడు ఎటూపోడు!” అని అన్నాడు. “కామోత్పన్నంచేత గోపికలు ఆయనలో కలిసిపోయారు. భయంతో కంసుడు ఆయనలో కలిసిపోయాడు. విరోధంతో కలిసిపోయాడు శిశుపాలుడు. సంబంధులై కృష్ణుడిపై ప్రేమతో సోదరులు అందరూ ఆయనలో కలిసిపోయారు. భక్తితో మేము విష్ణువులోకి వెళతాము” అని చెప్పాడు నారదుడు.

175. నారదుడు ధర్మరాజుకి వర్ణాశ్రమధర్మాలన్నీ బోధించాడు. సత్యము, దయ, ఉపవాసాలు, తపస్సు మొదలయినవి. ఉపవాసము అంటే రెండురోజులు ఏమీ తినకుండా ఉండటము, ఆ మర్నాడేమో ఒక్కసారి తినడం కాదు. సదోపవాసి, నిత్యోపవాసి అనేది ఒకటుంది. ఎప్పుడూ మితంగా తినేవాడు సదోపవాసి. అతడికి ఏకాదశీ ఒక్కటే, పౌణమీ ఒక్కటే. ఎప్పుడూ మితంగా తినాలి. అది ఉత్కృష్టమైన వృతమని చెప్తారు. శౌచము, 

176. సదసద్వివేకము, మనోనియమము, బాహ్యమయిన ఇంద్రియజయము మొదలయిన లక్షణాలు కలిగి ఉండాలి. జపమంటే, ఏదో కోరికలను ఆశ్రయించి ఒక లక్ష జపము చేయటము కాదు. 

177. యథోచితజపం అంటే, ఇష్టదైవాన్ని ఎప్పుడూ సంతుష్టితో సుష్టుగా ప్రార్థించటం అని అర్థం. దానివల్ల ఫలం తక్కువేమీ రాదు. బ్రాహ్మణుడు తపోదాన యజ్ఞాదులవలన ఏ ఫలాన్ని పొందుతాడో, అటువంటి ఫలాన్నే ఆయన అనుగ్రహంచేత ఇట్టి జపం చేసిన వాడు కూడా పొందగలడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 . శ్రీ శివ మహా పురాణము - 262 🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి/ 📚. ప్రసాద్ భరద్వాజ/ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

62. అధ్యాయము - 17

🌻.సతీ వరప్రాప్తి - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఈ విధముగా దేవతలు శివుని గొప్ప స్తోత్రములతో స్తుతించిరి. శివుని నుండి ఆ సతీదేవి వరమును పొందెను. ఈ వృత్తాంతమును శ్రద్ధతో వినుము  (1). 

అపుడు సతీదేవి ఆశ్వయుజ శుక్ల అష్టమి నాడు మరల ఉపవసించి సర్వేశ్వరుని భక్తితో పూజించెను (2). ఈ తీరున నందా వ్రతము పూర్తి అయెను. నవమినాడు పగటి సమయమునందు ఆమె ధ్యానమునందు నిమగ్నురాలై యుండగా శివుడు ప్రత్యక్షమయ్యెను (3). ఆయన సర్వావయములయందు సుందరుడు. తెల్లని వాడు. అయిదు మోముల వాడు. ముక్కంటి . నుదుటిపై చంద్రుని ధరించియుండెను. ప్రసన్నమైన మనస్సు గలవాడు. తెల్లని కంఠము (నీలభాగము తక్క) గలవాడు. నాల్గు భుజములు కలవాడు (4).

త్రిశూలమును బ్రహ్మకపాలమును వరముద్రను అభయముద్రను చేతులయందు ధరించెను. ఆయన భస్మచే తెల్లగా ప్రకాశించుచుండెను. ఆయన శిరస్సుపై మందాకిని విలసిల్లు చుండెను.ఆయన సర్వాంగ సుందరుడు (5). ఆయన లావణ్యమునకు పెన్నిధి. కోటి చంద్రులతో సమానముగా ప్రకాశించెను. కోటి మన్మథులతో సమమగు కాంతిని గలిగి యుండెను.ఆయన ఆకారము యువతులకు అన్ని విధములుగా ప్రీతిపాత్రమగును (6). 

సతీదేవి ఈ విధముగా నన్ను శివప్రభువును ప్రత్యక్షముగా గాంచి సిగ్గుతో వంగిన ముఖముగలదై ఆయన పాదములకు సమస్కరించెను (7). అపుడు మహాదేవుడు తపస్సునకు ఫలముగా ఆమెను భార్యగా స్వీకరించగోరి, మహావ్రతము ననుష్ఠించుచున్న సతీదేవితో నిట్లనెను (8).

మహాదేవుడు ఇట్లు పలికెను -

ఓ దక్షపుత్రీ! నీవు మంచి వ్రతమును చేసితివి. నీ యీ వ్రతముచే నేను సంతసించితిని. నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము. ఇచ్చెదను (9).

బ్రహ్మ ఇట్లు పలికెను -

జగత్ర్ప భువగు మహాదేవునకు ఆమె మనస్సులో భావము తెలిసినదే. కాని ఆమె మాటను విను కోరికతో వరమును కోరుకొనుము అని పలికెను (10). కాని ఆమె లజ్జచే హృదయములోని మాటను చెప్పలేకపోయెను. ఆమె అభిష్టము లజ్జచే కప్పివేయబడెను (11).

ఆమె శివుని ప్రియమైన పలుకులను విని అతిశయించిన ప్రేమలో మునిగిపోయెను. భక్తవత్సలుడగు శంకరుడా విషయమునెరింగి మిక్కిలి ప్రసన్నుడాయెను (12). అంతర్యామి, సత్పురుషులకు శరణ్యుడు అగు శంభుడు సతీదేవి యొక్క భక్తికి వశుడై వెంటనే 'వరము నడుగుము, వరము నడుగుము' అని మరల పలికెను (13). 

అపుడామె తన సిగ్గును నియంత్రించుకొని, 'వరముల నిచ్చువాడా! నివారింపశక్యము కాని వరమును నీకు ఇష్టమైన దానిని ఇమ్ము' అని పలుకగా (14), అపుడు భక్తవత్సలుడగు వృషభధ్వజుడు వాక్యము పూర్తి యగువరకు వేచి యుండలేదు. నీవు నా భార్యవు కమ్ము అని ఆయన ఆమెతో పలికెను (15).

అభీష్ట ఫలమును ప్రదానము చేసే శివుని ఈ మాటను విని, తన మనస్సులో నున్న కోరిక తీరుటచే మిక్కిలి ఆనందించినదై సతీదేవి మిన్నకుండెను (16). ప్రేమతో కూడియున్న శివుని యెదుట నిలబడి సుందరమగు చిరునవ్వుగల ఆ సతి శివుని కామమును వృద్ధి పొందించే హావ భావములను ప్రకటించెను (17). 

అపుడు భావములతో కూడి శృంగారరసము వెంటనే వారి హృదయములలో ప్రవేశించెను. పైగా చెప్పిన తీరున హావభావములు సుందరముగా ప్రకటమయ్యెను (18). ఓ దేవర్షీ! లోకలీలలను అనుకరించే వారిద్దరిలో శృంగార ప్రవేశము వలన చిత్రాచంద్రమసులయందు వలె వారిద్దరి యందు వర్ణింపశక్యము కాని శోభ కన్పట్టెను (19).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

ముకుందమాల    కులశేఖర హృదయం

  సేకరణ /రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

           🌷🌷🌷🌷🌷

                 🙏🙏🙏

శ్రీవల్లభేతి వరదేతిదయాపరేతి

భక్తప్రియేతి భవలుణ్ఠన కోవిదేతి!

నాథేతి నాగాశయనేతి జగన్నివాసే

త్యాలాపనం ప్రతిపదం కురు మే ముకున్ద!! 1

ఓ శ్రీ కృష్ణా! శ్రీ వల్లభా!వరదా!దయాపరా!భక్తప్రియా!భవ బంధాలను త్రెంపివైచే కోవిదుడా!నాథా!నాగశయనా!జగన్నివాసా!ఎల్లప్పుడూ నీ నామాలను ఆలపించేటట్లుగా చేయి స్వామీ!

జయతు జయతు దేవో దేవకీనందనోయం

జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీప:

జయతు జయతు మేఘశ్యామల: కోమలాంగో

జయతు జయతు పృధ్వీభారనాశో ముకుంద:

దేవకీ కుమారుడైన దేవదేవుని కి జయము జయము! వృష్ణి వంశ ప్రదీపుడైన శ్రీ కృష్ణునికి జయము కలుగుగాక! మేఘశ్యామలుడు,కోమలాంగుడూ అయిన కృష్ణ భగవాను నికి జయము జయము! భూమాత భారాన్ని తగ్గించడా నికి అవతరించిన ముకుందు నికి జయము జయము!

ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియం తమర్ధం

అవిస్మృతిస్త్వచ్చరణారవిందే

భవేభవే మేస్తుభవత్ప్రసాదాత్

-ముకుందమాల స్తోత్రం 3

(శ్రీకులశేఖర మహారాజు – మొదటి శ్లోకంలో కృష్ణుని పిలిచి, రెండో శ్లోకంలో ఎదుట నిలచిన కృష్ణునకు జయము పలికిరి. ఈ శ్లోకం నుండి శ్రీకులశేఖరులు స్తోత్రము చేయుచున్నారు. ఈ శ్లోకం “ముకుంద”తో ప్రారంభమగుట వలన “ముకుందమాల” అను పేరు ఈ స్తోత్రమునకు వచ్చినది. ఇందులో ముకుంద దశాక్షరీమంత్రము నిక్షిప్తమై ఉన్నాడని పెద్దలు చెప్పుదురు.)

ఓ ముకుందా! నీకు శిరసు వంచి నమస్కరిస్తూ యాచిస్తున్నాను.నా మీద దయవుంచి నా ఈ చిన్న విన్నపాన్ని అలకించు.నేను ఎన్ని జన్మలనెత్తినా నీ పాదారవిందాలపై నా మనస్సు నిలిచి ఉండేటట్లు నన్ను అనుగ్రహించు

నాహం వందే తవ చరణయోర్ద్వంద్వహేతో:

కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం

రమ్యా రామా మృదుతనులతా నందనే నాపి రంతుం

భావే భావే హృదయభవనే భావయేయం భవంతం

-ముకుందమాల స్తోత్రం 4

ఓ కృష్ణా! ద్వంద్వాతీతస్థితిని అందవలెనని కాని, కుంభీపాక నరకమును తప్పించుకొన వలెనని కాని, లావణ్యవతు లగు అప్సరసలను స్వర్గము లో అనుభవింపవలెనని కాని, నేను నీ పాదారవిందములకు నమస్కరించుటలేదు. ఎట్టి దేహము ఇచ్చినను సరే, నాకు అభ్యంతరము లేదు. కానీ సర్వదా మనసులో నిన్నే స్మరించునట్లు ఉండవలెనని యే నమస్కరించుచున్నాను

నాస్ధా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే

యద్యద్ భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం

ఏతత్ ప్రార్ధ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి

త్వత్పాదాంబోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు

ఓ కృష్ణా! ధర్మమును ఆర్జించ వలెనని గాని, అర్థమును కూడబెట్టవలెనని గాని, కామములను అనుభవించ వలెనని గాని నాకు కోరిక లేదు. నా పూర్వకర్మములను అనుసరించి ఏది ఎలా జరగ వలెనో అలాగే జరుగునుగాక. ఈ జన్మయందు గాని, జన్మాంతరమందు గాని, నీ పాదారవిందములయందు గాని, నాకు నిశ్చలమగు భక్తి కలుగవలెననునది ఒక్కటియే అభిమతమగు కోరిక. (జన్మరాహిత్యము లేదా మోక్షము కంటే కూడా, కృష్ణ భక్తినే ముఖ్యముగా ప్రార్థించు చున్నారు కులశేఖరులు. నాలుగు పురుషార్థముల కంటే కూడా భగవంతుని యందు ప్రేమయే పరమ పురుషార్థమ ని వారి ఆశయము)

దివి వా భువి వా మమాస్తు వాసో నరకే వా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి

– ముకుందమాల స్తోత్రం -6

(వెనుకటి శ్లోకంలో భగవంతుని తలచుట కంటే ఇతరములైన ఫలములను వేటినీ తాను కోరనని(కాంక్షించనని) చెప్పిన కులశేఖరులు ఈ శ్లోకంలో, ఈ ప్రదేశముననే ఉండవలెనను కోరిక కూడా నాకు లేదు అనుచున్నారు.)

ఓ నరకాంతక! కృష్ణా! స్వర్గము నందున్నను, లేదా ఈ భూమి యందే ఉన్నను నాకేమీ బాధ లేదు. కానీ శరత్కాల పద్మ సుందరములగు నీ చరణార విందములనే మరణ

సమయ మున కూడా ధ్యానించుచుందును.

చింతయామి హరిమేవ సంతతం మంద మంద హసితాననాంబుజం

నందగోప తనయం పరాత్పరం

నారదాది మునిబృంద వందితం

– ముకుందమాల స్తోత్రం 7

నారదాదిమునీశ్వరులచే సేవింపబడుచుండు వానిని, పరాత్పరుని, నందగోపకుమారుని, నవ్వు రాజిల్లెడి మోమువానిని, కృష్ణుని ఎల్లప్పుడూ నేను ధ్యానించు చుందును.

(నాల్గవ శ్లోకం నుండి ఇంత వరకు అనన్య ప్రయోజనము గా సర్వదేశ సర్వకాల సర్వా వస్థల యందు అవిచ్ఛన్నము గా ఆటంకములు లేక హరి స్మరణమే తనకు కావలెనని కులశేఖరులు కోరినారు. ఆ కోరికను అనుసరించి లభించి న హరిని అనుభవించి తృప్తి తో ఈ శ్లోకమును చెప్పుచున్నారు)

కరచరణ సరోజే కాంతి మన్నేత్రమీనే శ్రమ ముషి భుజవీచివ్యాకులేగాధమార్గే

హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం భవమరు పరిఖిన్న: ఖేదమద్యత్యజామి

– ముకుందమాల స్తోత్రం 8

నేను ఈ సంసారము అనెడి ఎడారిలో ప్రయాణము చేసి, చేసి బడలిక చెంది, నేడు ఈ హరి సరస్సును చేరితిని. ఆహా! ఎంత సుందరమూ ఈ సరస్సు! ఆ హరి కరచరణము లే మిలమిలలాడు చేపలు. భుజములే అందు కదలాడు కెరటములు. అది శ్రమలనన్ని టిని హరించును. ఆ రేవులు అవగాహనము (స్నానము) చేయుటకు అనుకూలముగా లోతు కలవై ఉండును. అందులోకి పోయి, ఆ తేజస్సు అనెడి జలమును కడుపు నిండుగా త్రాగి, నా బడలికను తీర్చుకొనుచున్నాను.

సరసిజనయనే సశంఖచక్రే

మురభిధి మా విరమస్వ చిత్త రంతుం సుఖతరమపరం న జాతు జానే హరిచరణ స్మరణామృతేన తుల్యం

– ముకుందమాల స్తోత్రం 9

ఓ మనస్సా! శ్వేత తామరలలాంటి నయనాలు కలిగి శంఖ చక్రాలను ధరించి దివ్య మంగళ స్వరూపుడైన శ్రీ కృష్ణ భగవానుని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు. ఎప్పటికీ ఆయన స్మరణ మానవద్దు. శ్రీహరి పాదపద్మాలను స్మరించడం అనే అమృతానికి సమానమైన సుఖం మరొకటి లేదు కదా!

మిత్రులందరి కి హృదయ పూర్వక శుభ సాయంత్రం వందనములు నాకు సమయం లేనందున మిమ్మల్ని సరిగా కలుసుకోవడం లేదు నన్ను క్షమించగలరు

ఇట్లు మీ మిత్రుడు 


--(())--


No comments:

Post a Comment