Thursday, 12 November 2020

 


01. ఓం నమః శివాయ: “జగద్గురు బోధలు” (3)
శ్రీ కంచి పరమాచార్య వైభవం
🕉🌞🌏🌙🌟🚩

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం|
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం||

ఆర్ద్రాదర్శనము
ॐॐॐॐॐॐॐॐ

మౌళౌ గంగా శశాంకౌ కరచరణతలే శీత లాంగా భుజంగా
వామే భాగే దయార్ద్ర హిమగిరి దుహితా చందసం సర్వగాత్రే,
ఇత్థం శీతం స్రభూతం కసక సభా నాథ! సోఢుం క్వశక్తిః ?
చిత్తే నిర్వేదతప్తే యది భవతి న తే నిత్యవాసో మదీయే.


శివుడు చంద్రమౌళీశ్వరుడు. మఠములో ఉన్న అర్చనా మూర్తియున్నూ చంద్రమౌళీశ్వరుడే.
అయ్యా! నీమౌళిలో ఏమున్నవి? గంగ, చంద్రుడూ ఈరెండూ చలువచేసేవస్తువులే, నీచేతులకున్నూ, కాళ్ళకున్నూ తొడగికొన్న నగలో? అవిన్నీ అంటుకొంటే జివ్వు మనిపించే చల్లని పాములు. ఇవి చాల వన్నట్టు ఎడమతట్టున మాచల్ల తల్లి దయచేతనయిన తడిముద్ద ముంచుగొండ గారాబు కూతురు. అట్టి హైమవతి.


ఆర్ద్రాదర్శనం చిదంబరానికి విశేషం. ఆర్ద్రమంటే బాగా తడిసినదని అర్థం. ఆర్ద్రాదర్శనం జరిగేనాడు మంచు ఎక్కువగా పడుతుంది. నాడు పున్నమకూడాను. నక్షత్రం ఆర్ద్ర. చలి! చలి! చలి!


శివునకు ఆర్ద్ర ప్రీతిపాత్రమయితే పెరుమాళ్ళకు శ్రవణం అంటే మక్కువ. శ్రవణం శ్రవణం అంటూ పెరుమాళ్ళకు విశేషించి ఉత్సవాలు చేస్తారు. శివుడుమాత్రం ఆర్ద్రాప్రియుడు.

తెనుగువారివలెనే అరవలు సైతం నక్షత్రాలను అశ్వినీ భరణీ కృత్తిక ఈ మొదలుగా అంటారు. అరవంలో 'తిరు' అంటే శ్రేష్ఠం. తిరు శ్రీ కి పర్యాయంకూడా. కాని ఈ 'తిరు'ను నక్షత్రాలకు చేర్చి తిరుఅశ్వని తిరుభరణి అని వారనడంలేదు. శ్రవణం మళయాళీలకు 'ఓణం'. కాని అరవంలో శ్రవణానికీ ఆర్ద్రకు మాత్రం శ్రేష్ఠవాచకమయిన తిరు అనేశబ్దం చేర్చి తిరువాణం తిరువాదిరై అని అనడం వాడుక. ఇట్లా శివవిష్ణు ప్రీతిపాత్రాలయిన ఈ ఆర్ద్రాశ్రవణాలకు మాత్రం శ్రేష్ఠవాచకమయిన తిరుశబ్దం చేర్చడం వాడుక. తక్కినవానికి తిరు శబ్దం చేర్చరు.

ఓం నమః శివాయ: “జగద్గురు బోధలు” (3ఆ )
శ్రీ కంచి పరమాచార్య వైభవం

చెన్నపట్నానికి సమీపాన తిరువాన్మియూర్, తిరువళిక్కేణి, తిరువెట్రియార్ అనేవి ఉన్నవి. వీనికి తిరు శబ్దం మొదల ఉన్నది. అరవంలో కేణి అంటే కొలను. తిరువలిక్కేణిలో ఒక కొలను ఉండేదిట. దానిలో అల్లిపూలు పూచేవిట. అందుచేత దానికి తిరువల్లిక్కేణి. తిరువల్లికేణి అనే పేరు ఏర్పడింది. మదరాసులోనే తిరువెట్టీశ్వరన్ పేట అని మరొక ప్రదేశముంది. అచట తిరువెట్టీరుని ఆలయం ఉంది. అర్జునునకు పాశుపతం ఇచ్చే సందర్భంలో కిరాత వేషంలో వచ్చిన శివునకున్నూ తపస్సు చేసుకుంటున్న అర్జునునకున్నూ యుద్ధం జరిగి అర్జునుని వింటిదెబ్బలు తిని శివుడనుగ్రహించాడని పురాణం. అందుచేత ఇచటి దైవాన్ని తిరువెట్టీశ్వరన్ అని వ్యవహరిస్తారు. ఇట్లా స్వామితో సంబంధం కల పేర్లకు తిరుశబ్దం కలపడం ఒక వాడుక. ఇపుడు స్వామికి చెప్పినా చెప్పకపోయినా ఆసాములకు మాత్రం విరివిగా తిరుశబ్దం వ్యవహారంలోకి వచ్చింది.


దక్షిణదేశంలో ఏదయినా ఒక ఊరు వెలిస్తే అక్కడ ఒకశివాలయం విష్ణ్వాలయం కట్టడం బహుళంగా ఆచారంలో ఉంది. శివుని గుడిలో గర్భగృహంలో శివలింగంమీద ఒక ధారాపాత్ర వేలాడగటతారు. దాంట్లోంచి శివుని తలమీద అప్పసమూ జలధార పడుతూనేవుంటుంది. ఉత్తరదేశానికి వెళ్ళిచూస్తే ప్రతివాళ్లూ నదిలోనో చెరువులోనో స్నానంచేసి ఒక చిన్నపాత్రలో నీరు తెచ్చి శివాలయానికి వెళ్ళి శివలింగం మీద స్వహస్తంతో కుమ్మరించిపోతారు. దీనికి 'చడానా' అని అంటారు. ఉత్తరదేశంలో మరోవిశేషమేమంటే అంబికాలయం కాని రామాలయంకాని కాళికాలయంకాని ఏఆలయమయినా సరే మన ప్రాంతాలలో రావిచెట్లకింద నాగలింగ ప్రతిష్ఠ చేసిన రీతిగా ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేస్తారు. కొన్ని కాళికాలయాలలో ద్వాదశ పన్నెండు లింగాలు కనబడతై. శ్రీ శంకర భగవత్పాదులు ఈ ద్వాదశలింగాలనూ స్తోత్రం చేశారు. హిమాలయంలో కేదారం, సౌరాష్ట్రంలో సోమనాథం, వారణాసిలో విశ్వనాథం, గోదావరిలో త్ర్యంబకం.


మహాబలిపురంలో ఉన్నట్లు ఔరంగాబాదు సమీపంలో ఎల్లోరాగుహలు ఉన్నై. అచట కొండా కొండా తొలిచి కోవెలకట్టారు. దీనిని చూచినవారికి మహాబలిపురం పెద్దవింతగా కనిపించదు. తంజావూరు ఆలయప్రాకారంలాగా కొండనేమలిచి గుడిగా ప్రాకారంగాకూడా నిర్మాణంచేశారు. దానిని నిర్మించడానికి అరవదేశంనుంచే శిల్పులు వెళ్లారుట. ఆలా వెళ్ళినవారు పల్లవచోళులకాలంలో వెళ్ళి ఉంటారు. ఆలయంలో ఆ పెద్దశిల్పి ఒక సంస్కృతశ్లోకం చెక్కాడు. దానిభావం :


ఈ కోవెలను నిర్మించిన తరువాత నేను తిరిగి చూచుకొన్నాను. దీనిని నిర్మించింది నేనా? అని నాకు ఆశ్చర్యం కలుగుతూంది. ఎన్నిజన్మలెత్తినా ఇట్టి ఆలయాన్ని (ఇంకొక దానిని) నేను కూడా నిర్మించలేను. నాలోనుండి ఎవరు దీనిని నిర్మించారో నాకు ఏమీ తెలియడంలేదు. ఇట్టి ఆలయం ఇంతకుముందు కట్టిందిలేదు, ఇక ముందేవరున్నూ కట్టబోరుగూడా. 'మళ్ళాకట్టు' అంటే నేనుకూడా ఇట్టి ఆలయం కట్టలేను'.


ఇట్టి ఎల్లోరాలోనే నాగేశం. భీమేశ్వరంనర్మదాతీరంలో ఒకనగరం. బాణలింగం మహారాష్ట్రంలో ఉన్న ఓంకారం. శ్రీశైలం, రామేశ్వరం. ఇవి పన్నెండూ పన్నెండుక్షేత్రాలు. ఈ పన్నెండు క్షేత్రాలలోని జోతిర్లింగాలనూ శ్రీ శంకరాచార్యులవారు నాలుగుపాదాలు కల మూడు శ్లోకాలలో ఇట్లా స్తుతించారు.

02 ఓం నమః శివాయ: “జగద్గురు బోధలు” (3b )
శ్రీ కంచి పరమాచార్య వైభవం

సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లిఖార్జునమ్,
ఉజ్జయిన్యాం మహాకాల మోంకార మమలేశ్వరే.
పరల్యాం వైధ్యనాథం చ డాకిన్యాం భీమశంకరం,
సేతు మధ్యే తు రామేశం నాగేశం దారుకావనే.
వారాణస్యాం తు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే,
హిమాలయే తు కేదారం ఘుసృ (ధిష) ణేశం శివాలయే.

వీనినేకాక ప్రతిక్షేత్రంలోనూ ఉండే లింగాలను గూర్చిన్నీ వేరువేరుగా వ్రాశారు. పల్లవులకాలంలో కట్టిన కాంచీనగర దేవాలయంలో ప్రతిష్ఠించిన ద్వాదశలింగాలనూ చూడవచ్చు. మనప్రాంతంలో ఆవిధంగా ఎక్కడాలేదు. శివాలయం అంటే అభిషేకమే.


ఇత్థం శీతం ప్రభూతం తవ కనక సభానాథ సోఢుం క్వ శక్తిః ?

ప్రభూతమంటే ఎక్కువ. అపరకార్యాలలో అన్నం ఎక్కువగా వండి చేసే కర్మకు ప్రభూతబలి అని పేరు.

'అధికమయిన ప్రభూతమయిన చలిని-సోఢుర్సఓర్చు కోడానికి, కనక సభానాథుడవైన మహాప్రభూ! తవ్సనీకు. వ్వశక్త్సిఃశక్తియేదీ?


'ఇంతటి చలిని ఎవడున్నూ ఓర్చుకోలేడే! తలమీద గంగనేకాక చంద్రునికూడా పెట్టుకొని ఒంటిమీద చలికొట్టే పాములను చుట్టుకొని ఎడమతట్టున మంచుగొండ కూతురిని అతికించుకొని యీ యింత చలిని ఎలా నీవు ఓరుస్తున్నావయ్యా? అని కవి ప్రశ్నిస్తాడు.


ఈ ప్రశ్నకు స్వామి ఏమి బదులు చెపుతాడు? నిరుత్తరుడై ఆనందమూర్తియైనర్తకనిమగ్నుడై ఉంటాడు. అనృత్యం క్షణమాత్రం చూచిన కవికి బదులు దొరికింది,-


సరి. దీనికి నిన్ను ప్రశ్నించడం ఎందుకు? నీవు ఇలాంటి ఇంత చల్లదనమూ ఓర్చుకోడానికి మూలకారణం నావద్దనే ఉన్నది. నీవు అంతటనూ ఇంత ఎడము లేకుండా వెలసిన మహాప్రభువవు. నీవు లేనిచోటే లేదని అంటారు. ఎవరో స్వామి ఉన్నచోటు చూపమని ఒకరిని అడిగారట. అలా అడిగితే ఆయన స్వామి ఉన్నచోటు చూపుతా''నని అన్నాడుట. అట్లా నీవు సర్వాంతర్యామివై ఉన్నావు. నీవు నాహృదయమునందున్నూ ఉన్నావు. అందొక్క క్షణముంటే చాలు. ఎంతటి చలిన్నీ పరారు కావలసినదే. నా హృదయం అంత నిర్వేదంతో తుకతుకలాడి పోతుంది. అది తాపాలకు నెలవు. దుఃఖాలకు ఆలయము. నేను బహుజన్మలను చూచిన అనాదిని నీవున్నూ అనాదివే. నా హృదయంలో ఉంటే ఎంత శైత్యమయినా ఓర్చుకోగలవు, అని కవిబహుసుందరంగా చమత్కరించాడు.

జీవుల హృదయతాపాలను పోగొట్టే శక్తి ఒక్క పరమేశ్వరునకే ఉంది. మన హృదయతాపాలు పోకార్చడానికి ఆయనను చల్లని ప్రభువుగా భావించి శైత్యోపచారాలు చేయాలి. ఆయన హృదయంలో గనుక ఉంటేసర్వతాపాలూ పోతై. తాపంలో తలతలలాడే మన హృదయాలలో ఆదైవం వసించడానికి వారికి శైత్యోపచారాలుచేయడమే ఆర్ద్రాదర్శనతత్త్వం అని ఈశ్లోకంవల్ల తెలుస్తున్నది.

'వణకుతూ మాటలాడతా వేమయ్యా!' అని ఎవరైనా ప్రశ్నిస్తే వణికే ఆ మనిషి భయంతో మాటాడుతున్నాడని అర్థం. భయవిదారకుడు ఈశ్వరుడు. చల్లని ఆ ప్రభువును వేదనతో విలవిలలాడే హృదయాలలో ఒక్కక్షణం ధ్యానిస్తే చాలు, మన వేదనలన్నీ విడిపోయి హృదయం చల్లనౌతుంది.


🕉🌞🌏🌙🌟🚩

03. దక్షిణామూర్తి తత్వం  (2)

దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది.చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం.

బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. అయినా వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు.

స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. ఉత్తర భాగాన (అనగా ఎడమభాగాన) అమ్మవారి స్వరూపం లేని కేవల శివ స్వరూపం కనుక దానికి ‘దక్షిణామూర్తి’ అని పేరు. మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు. ఆ స్వామిని ప్రతిపాదించ మంత్రాలలో ఒక మంత్రానికి అధి దేవతామూర్తి మాత్రమే. అలాగే శ్రీ దత్తాత్రేయుడు, గురుదత్తుడు అనేవారు వేరేవేరే దేవతామూర్తులు కాదు. ఈ దత్తుడు త్రిమూర్త్యాత్మకుడు. సర్వసంప్రదాయ సమన్వయకర్త. ఇక దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరేనా అంటే, తత్త్వ దృష్టిలో ఖాయంగా ఒకరే. వ్యావహారిక దృష్టిలో, ఉపాసనా విధానంలో మాత్రం భిన్నులు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరా? వేరా? అంటే, ఏమి చెబుతామో, ఇక్కడా అలాగే చెప్పుకోవాలి. ఒక దృష్టితో భిన్నత్వం! మరో దృష్టితో ఏకత్వం!!

శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.

మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.

మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.

దక్షిణామూర్తి తత్వం  (2/a )

ఆ రూపాలు వరుసగా….

శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸ కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸ శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి.

ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర, అక్షమాల, వీణ, పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.

పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.

చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

దక్షిణామూర్తి స్తోత్రం (2/బి )

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్
యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతమునుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః
స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః పుమాన్
నిత్యాభతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం
నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్వాదిభో
తస్మై గిరిమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వశ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్

ఆధ్యాత్మిక కధలు (1)

04, నైవేద్యం ప్రత్యక్షంగా తినే శ్రీకృషుని దేవాలయము.... (1)

మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు. సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది.
📿 గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక కేరళ దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం.
📿 అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తారు.
📿 ఇక్కడి కృష్ణపరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు. ఇక్కడ అర్చకులు రోజుకు 7 సార్లు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండటం తరుచుగా గమనిస్తుంటారు. స్వామివారు స్వయంగా తింటారు అని ఇక్కడి భక్తుల విశ్వాసం. అదే విధంగా అందరూ చూస్తుండగానే ప్రసాదం మాయమవుతుంది.
📿 గుడి తెల్లవారుజావున 2 గంటలకు తెరుస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాలలో అభిషేకం, అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం, అలంకరణ చేస్తారు.
📿 నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైనా, ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు. అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటారు. ఏదేని కారణం చేత తాలం పనిచేయకపోయినా, తాలం పోయినా, గొడ్డలితో తాలాన్ని పగలకొట్టడం ఇక్కడి ఆనవాయితీ.
📿 కృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు. ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడూ ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడి నియమం. అందుకే అర్చక స్వాములు “ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోనివారు ఉన్నారా అని పెద్ధగా అరుస్తారు”.
📿 కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం చేత స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచులు క్రిందకు దిగడం మనం చూడవచ్చు. పూర్వం గ్రహణం సమయంలో ఆలయం మూయడం వలన ఇలాంటి అపసృతి చోటు చేసుకోవడం వలన, ఈ దేవాలయాన్ని గ్రహణం సమయంలోనే కాదు మరెప్పుడూ మూయరు .
📿 గ్రహ దోషాలు, గ్రహణ దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారాలలో నష్ట దోషాలు, వివాహ దోషాలు, బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణపరమాత్మను దర్శించి, పూజిస్తే దోషాలు నివారింపబడుతాయి. దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు కృష్ణభగవాణుడి సేవకులు కనుక ఇక్కడి కృష్ణభక్తులకు ఎటువంటి జాతక దోషాలు అంటవని స్వామిని భక్తితో కొలుస్తారు.
📿 సైంటిష్టులకు కూడా అంతుచిక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగాయి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంత కన్నా గొప్ప దేవాలయం ఎక్కడ ఉంటుంది! 🙏 


 సర్వంశ్రీకృష్ణార్పణమస్తు 🙏
05. గృహస్థాశ్రమ ధర్మములు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

గృహస్థుడు తన సమస్త భోగసామాగ్రిని కుక్కలు, నిమ్నజాతులవారు మొదలగు ప్రాణులకు యథాయోగ్యముగా పంచియిచ్చి, పిదప వాటిని తాను ఉపయోగింపవలెను. తనకు ఆత్మీయురాలైన భార్యకు కూడ అతిథులు మొదలగు వారి సేవలయందు నియమింపవలెను.

మానవుడు తన భార్యకొరకై తన ప్రాణములను గూడ త్యజించుటకు సిద్ధపడును. ఒక్కొక్కసారి తన తల్లిదండ్రులను, గురువునుగూడ ఆమె కొఱకై హతమార్చును. భార్యయందుగల తన వ్యామోహమును విడిచి పెట్టినవాడే, ఒటమినెరుగని భగవంతునిపైగూడ విజయమును సాధించును.

తుదకు క్రిములు, మలము, బూడిదరాశిగా మార్పును చెందునట్టి తుచ్ఛమగు ఈ శరీరమెక్కడ? ఆ శరీరమునందు ప్రీతిగల భార్య ఎక్కడ? ఆకాశమువలె వీటన్నిటికి అతీతమైన ఆత్మ ఎక్కడ? (ఆత్మ శరీరము కంటెను, ప్రేమాస్పదులగు భార్యాపుత్రులకంటెను, అతీతమైనది).

గృహస్థుడు తన ప్రారబ్ధము మేరకు ప్రాప్తించిన ఆహార పదార్థములను పంచయజ్ఞములకు వినియోగించిన పిదప, మిగిలిన దానితో తన జీవితమును గడపవలెను. అంతేకాని, ప్రాజ్ఞుడు దేనిపైననూ ఇదినాది అను భావము కలిగియుండరాదు. అప్పుడు అతనికి సత్పురుషులు పొందు పదవి లభింపగలదు.

గృహస్థుడు తన వర్ణాశ్రమ ధర్మముల ద్వారా ప్రాప్తించిన సంపదతో ప్రతిదినము దేవతలు, ఋషులు, మనుష్యులు, ప్రాణులు, పితృగణములు, ఇతర ప్రాణులు, మొదలగువాటిని తృప్తిపరచుటద్వారా ఆరాధింపవలెను. అట్లే తన ఆత్మను  గూడ సేవింపవలెను. తద్ద్వారా 

వేర్వేరు రూపములలో గల భగవంతుని ఆరాధించినట్లగును.
గృహస్థుడు తన యోగ్యతను అనుసరించి, యజ్ఞములను అవసరమగు వస్తువులను అన్నింటిని సమకూర్చుకొన గలిగినప్పుడే గొప్ప గొప్ప యజ్ఞములద్వారా, 
అగ్నిహోత్రాదుల ద్వారా భగవంతుని ఆరాధింపవలెను.

ధర్మరాజా! సకల యజ్ఞములకును భోక్త భగవంతుడే. కాని, బ్రాహ్మణుని ముఖముద్వారా అర్పింపబడిన హవిష్యాన్నముతో తృప్తిపడినంతగా, అగ్నిద్వారా సమర్పించిన హవిస్సుద్వారా ఆ పరమాత్మ తృప్తి చెందడు.

అందువలన బ్రాహ్మణులు, దేవతలు, మనుష్యులు మున్నగు ప్రాణులయందు అంతర్యామి రూపములో విరాజిల్లుచున్న భగవంతుని యథాయోగ్యముగా ఉపయుక్తములైన పదార్థముల ద్వారా పూజింపవలెను. వీరిలో బ్రాహ్మణులే ముఖ్యులు.

ధనికుడైన బ్రాహ్మణుడు తన యొద్దనున్న ద్రవ్యమును అనుసరించి, భాద్రపదమాసమునందలి, కృష్ణపక్షమున  తన తల్లిదండ్రులకును అట్లే, ఇతర బంధువులకును (అనగా పితామహ, మాతామహాదులకును)  మహాలయ శ్రార్ధమును ఆచరింపవలెను.

***

: 🌹. శ్రీమద్భగవద్గీత - 429   / Bhagavad-Gita - 429 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 38 🌴

38. త్వమాదిదేవ: పురుష: పురాణ
స్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనన్తరూప ||

🌷. తాత్పర్యం : 
నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, విశ్వమునకు ఉత్కృష్టమైన ఆశ్రయము. నీవే సర్వమును ఎరిగినవాడవు, తెలియదగిన సర్వము నీవే. ప్రకృతి గుణములకు అతీతుడవైన నీవే దివ్యశరణ్యుడవు. ఓ అనంతరుపా! ఈ సమస్త విశ్వము నీచే ఆవరింపబడియున్నది. 

🌷. భాష్యము  : 
సమస్తము శ్రీకృష్ణభగవానునిపై ఆధారపడియుండుటచే అతడు పరమాధారమై యున్నాడు. 

“నిధానం” అనగా సమస్తము (చివరకు బ్రహ్మతేజస్సు సైతము) ఆ దేవదేవుడైన కృష్ణుని పైననే ఆధారపడియున్నదని భావము. ఈ జగమందు జరుగుచున్నదంతయు అతడు సంపూర్ణముగా నెరుగును. 

ఇక జ్ఞానమునకు అవధియన్నది ఉన్నచో అతడే సర్వజ్ఞానమునకు పరమావధి. కనుకనే తెలిసినవాడు మరియు తెలియదగినవాడు అతడే. సర్వవ్యాపియైనందున జ్ఞానధ్యేయమతడే. 

ఆధాత్మిక జగత్తులో అతడే కారణము కనుక దివ్యుడైనవాడతడే. ఆలాగుననే ఆధాత్మికజగమునందు ప్రధానపురుషుడు ఆ శ్రీకృష్ణభగవానుడే.
🌹 🌹 🌹 🌹 🌹


 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 217  / Sripada Srivallabha Charithamrutham - 217 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రీ రాజరాజేశ్వరీ దేవి 🌻

తరువాత మేము భాస్కరశాస్త్రిని రాజరాజేశ్వరీదేవి గురించి తెల్పమని ప్రార్థించాము. 

"రాజరాజేశ్వరిదేవి మన మనస్సుకు, ఇచ్ఛకు పైన ఉన్న విశాలమైన సీమలో ఆసీనురాలై ఉంటుంది. ఆలోచించే మన మనస్సు సాధారణంగా మేధాశక్తిగా మారు తుంది. ఆ మేధాశక్తిని వివేకవంతం చేయడానికి ఈ దేవి సహాయం చేస్తుంది. సాధారణంగా శక్తి, వివేకం కలిసి ఉండవు. 

కాని రాజరాజే శ్వరీదేవి శక్తితో కూడిన వివేకాన్ని, వివేకయు తమైన శక్తిని ప్రసాదిస్తుంది. రాజరాజేశ్వరీ శక్తిని పెంపొందించు కున్న సాధకులు తమ వివేకబలంతో విరోధి శక్తులను నిర్మూలించ గల్గుతారు. 

ఆమె దృష్టిలో అందరూ తన బిడ్డలే, అసురు లను, రాక్షసులను, పిశాచాలను కూడా తన బిడ్డలుగానే పరిగణి స్తుంది. ఆమె శక్తికి ఙ్ఞానమే కేంద్రం. అందువల్ల ఆమె అనుగ్రహం కలిగితే సత్యబోధ కలుగుతుంది. 

నేను శ్రీపాదుల దయకు పాత్రుడనైనందున నాకు రాజరాజేశ్వరీ దీక్షలో సఫలత ప్రాప్తించింది," అని దేవి గురించి వివరించి శ్రీపాదులు ఎలా పీఠికాపురంనుండి సంచారానికి బయలు దేరారో తరువాత చెప్తానని, మేమిద్దరం అక్కడకు చేరే ముందే శ్రీపాదులు రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిచ్చి తాను చేసిన పులిహోర కొద్దిగా స్వీకరించారని, శ్రీపాదులు సాక్షాత్తు మహాసరస్వతీ, మహాలక్ష్మి, మహాకాళీ, రాజరాజేశ్వరీ స్వరూపులని చెప్పి ఆ ప్రసాదాన్ని మాకు కూడా ఇచ్చారు. తరువాత మేము ముగ్గురం ధ్యానస్థులం అయ్యాము.

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
🌹 🌹 🌹 🌹 🌹


: 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 97 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 13 🌻

వాడు బాధపడ్తూనే మర్నాడు మళ్ళీ అంతే నంటారా? ఇంక లాభం లేదంటారా?" అని అడిగాడు. "లాభం లేదురా అప్పా మోక్షం రాదు. పోవలసినది బంధం తప్ప రావలసినది మోక్షం కాదు." 

మనం ఏ దరిద్రాలనయితే కొని తెచ్చిపెట్టుకున్నామో, అవి తొలగించుకొనుటే కావాలి కానీ, కొత్తగా వచ్చేదేమీ లేదు. ఇంతకు ముందున్న స్థితినే మోక్షం అని పిలుస్తున్నావు. 

దుఃఖం నీవు తెచ్చుకొని అంతకుముందున్న సవ్యస్థితిని సుఖమని పిలుస్తున్నావు. సుఖం రావాలి. సుఖం రావాలి అని కోరితే వచ్చేదేముంది? (దుఃఖం తప్ప) చోటులో ఇల్లు కట్టుకుని ఇంటిలో చోటు కోసం వెతుక్కుంటుంటే చోటు పరిమితంగానే ఉంటుంది. అంతకు ముందున్నది చోటు. మధ్యన మనం కట్టుకున్నది ఇల్లు. 

మోక్షం వచ్ఛేదేమీ లేదు బంధము పోవటమే కావలసిన స్థితి. మనం సాధన చేస్తున్నప్పుడు ప్రశాంత స్థితికొచ్చిన కొద్దీ వాతావరణము నందు మనస్సు వంగుతుంది. (వాతావరణమునకు మనస్సు లొంగుతుంది.) 

వాతావరణములోని విఘ్నములు తొలగుతాయి. మనకు ఎదుటివాడి వలన ఏం ప్రయోజనముందని అనుకొనిన (కోరిన) కొద్ధీ వాతావరణమునకు (పరిసరములకు) దాస్యం చేయుట సంభవించును. 

ఈ రెండూ ప్రస్తుతం ఉన్న భారతీయుడు తెలిసికొనవలెను. భారతదేశంలో ఉన్న ఎక్కువమందిమి విషాదయోగంలోనే ఉన్నాము. సాంఖ్య యోగం నుండి ప్రారంభించి మోక్ష సన్న్యాసయోగం దాకా రావాలి.
...✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
: 🌹. నారద భక్తి సూత్రాలు - 36 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 23

🌻 23. తద్విహీనం జారాణా మివ 🌻

            గోపికాంగనల ప్రేమ భగవంతుని మాహాత్మ్యం తెలియనిదైతే అది వ్యభిచారమే అవుతుందేమో ? అని సంశయం.

            ఒకవేళ గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను వారికంటే వేరుగా, కేవలం గొప్ప వాడిగా చూచినట్లైతే, ఆ శ్రీకృష్ణుని కీర్తిస్తూ, పూజిస్తూనే ఉండిపోయేవారు. వారి భక్తి అప్పుడు కాయిక, వాచిక భక్తి అయ్యుండేది. 

కాని ఆ గోపికాంగనలు శ్రీ కృష్ణుని హృదయాంతరంగలో పెట్టుకుని తన్మయులై ఉన్నారు కదా ! శరీరధారిగా అవతరించిన పరమాత్మను భగవంతుడిగా భావించి ఆలింగనం చేసుకుంటే అది జారత్వ మెలాగవుతుంది? 

అవతార్‌ మెహెర్‌ బాబాను భగవంతునిగా నమ్మిన స్త్రీ భక్తులు ఆయనను ఆలింగనం చేసుకోలేదా ? ఇరువురూ అజ్ఞానులైతే అది జారత్వ మౌతుంది గాని ఒకరు భగవంతుడైనప్పుడు రెండవ వాడైన అజ్ఞానిలో దివ్యత్వం ప్రకాశింప బడుతుంది. 

అప్పుడు ఆ భగవంతడు ఒక్కడే పురుషోత్తముడు ఇతరులు స్త్రీలైనా, పురుషులైనా సరే, అందరూ స్త్రీలతో సమానం.

   కనుక గోపికాంగనల భక్తిని కామంతో కూడినదిగా శంకించ నవసరం లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
: 🌹. శ్రీ దత్తాత్రేయ విరచిత  జీవన్ముక్తిగీత  - 6  / DATTATREYA JIVANMUKTA GITA - 6 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

21. సోఽహం స్థితం జ్ఞాన మిదం
సూత్రేషు మణివ త్పరమ్‌
సోఽహం బ్రహ్మ నిరాకారమ్‌
జీవన్ముక్త స్స ఉచ్యతే ll      

భావము: 
ఈ ‘సోఽహం’ అనెడి జ్ఞానము సూత్రము నందలి మణి వలె నిలిచియున్నది. ‘సోఽహం’ అనెడి బ్రహ్మ తత్త్వము ఆకారము లేనిదై యున్నది. ఈ విధముగా సత్యము నెరిగిన వాడే ‘జీవన్ముక్తుడు’.

22. మన ఏవ మనుష్యాణాం
భేదా భేదస్య కారణమ్‌
వికల్ప నైవ సంకల్పమ్‌
జీవన్ముక్త స్స ఉచ్యతే ll   

భావము: 
మనుష్యులలోని భేదాభేదములకు మనస్సే కారణముగా తెలియుచున్నది. అయితే ఎవరిలో సంకల్ప వికల్పాదులు అదృశ్య మగుచున్నవో అతడే ‘జీవన్ముక్తుడు’.

23. మన ఏవ విదుః ప్రాజ్ఞాః
సిద్ధ సిద్ధాన్త ఏవ చ
సదా దృఢం తదా మోక్ష
జీవన్ముక్త స్స ఉచ్యతే ll    

భావము: 
మనస్సు నిశ్చలముగా నుండుటయే మోక్షమని విజ్ఞులు, ప్రాజ్ఞులు సిద్ధాంతీకరించియున్నారు. ఈ సత్యమును తెలిసిన వాడే ‘జీవన్ముక్తుడు’.

24. యోగాభ్యాసీ మనశ్శ్రేష్ఠః
అంతస్త్యాగీ బహిర్జడః
అంతస్త్యాగీ బహిస్త్యాగీ
జీవన్ముక్త స్స ఉచ్యతే ll                    

భావము: 
యోగాభ్యాసి యైనవాడు, శ్రేష్ఠమైన మనస్సు గలిగినవాడు అంతస్త్యాగి యనబడును. అతడు బాహ్యమునకు జడుని వలె యుండును. వాస్తవానికి అతడు బాహ్యాభ్యంతరముల యందు త్యాగియై యున్నాడు. అతడే ‘జీవన్ముక్తుడు’.

వేదాంత కేసరి యగు శ్రీ దత్తాత్రేయులు రచించిన “జీవన్ముక్తగీత” సమాప్తము
ఓం తత్‌ సత్‌
ఓం శాంతిః శాంతిః శాంతిః
🌹 🌹 🌹 🌹 🌹

: 🌹. శివగీత  - 2 / The Siva-Gita - 2 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
🌻. భక్తి నిరూపణ యోగము  - 1 🌻

సూత ఉవాచ :
01. అధాత స్సం ప్రవక్ష్యామి - శుద్ధ కైవల్య ముక్తిదమ్,
అనుగ్రహాన్మ హేశస్య- భవ దుఃఖ స్య భేషజమ్ 1

శ్రీ శౌనకాది మహర్షుల గూర్చి సూతుం డిట్లు వాక్రుచ్చెను:

ఓయీ ముని పుంగవులారా! శ్రీ పరమాత్మ పరశివ మూర్తి యొక్క  అనుగ్రహము వలన, పరమ పునీతమగు, సంసార మనెడు ఔషధ ప్రాయమైన బ్రహ్మ స్వరూప కైవల్యమును మోక్ష ప్రదమగు జ్ఞానమును  నేను మీకు బోధించు చున్నాను.

02. న కర్మణా మనుష్టానై - ర్న దానై స్వపపాసివా,
కైవల్యం లభతే మర్త్య ! - కింతు జ్ఞానేన కేవలమ్ .2

ఎటువంటి పుణ్య కర్మల ననుష్టిం చుట వలనను,  ఎలాంటి తపో నుష్టాన ముల జేయుట వలనను  కైవల్య పద ప్రాప్తిని పొందలేడు. ఐతే కేవల మొక దివ్య జ్ఞానము వలననే కైవల్య ప్రాప్తి కలుగును .

03. రామాయ దండకారణ్యే - పార్వతీ పతినా పురా ,
యాప్రోక్తా శివ గీతాఖ్యా - గుహ్యా ద్గుహ్యాత మాపిసా 3

04. యస్యా శ్శ్రవణ మాత్రేణ - నృణాం ముక్తి ర్ద్రువా భవేత్,
పురా సనత్కుమారాయి - స్కందే నాభి హిఆ హి సా 4 

పూర్వ కాలమున దండ కారణ్యములో శ్రీరామునకు శంకరుని  చేత ఏదైతే ప్రధమమున బోధించ బడినదో, ఏదైతే పరమ గోప్యంబగు నదియు , దేనినీ ఆలించుట చేతనే మానవులకు  నిత్య (శాశ్వత) కైవల్యము లభించునో అట్టి శివ గీతను సనత్కుమారునకు షణ్ముఖ స్వామి బోధించెను.

05. సనత్కుమార : ప్రోవాచ - వ్యాసాయ ఋషి సత్తమా ,
మహ్యం కృపాతి రేకేణ - ప్రదదౌ బాధ రాయణః 5

తరువాత నా సనత్కుమారుడు వ్యాసునకు బోధించిన వాడయ్యెను. అట్టి వ్యాస మహర్షి నా యందు అనుగ్రహము కలవాడై  నాకు బోధించి యున్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

: 🕉🔯 ఓం   నమో వేంకటేశాయ 🕉🔯
*రోజుకో అన్నమయ్య  సంకీర్తన *
ఎదుట నున్నాఁడు వీఁడె యీ బాలుఁడు...
రేకు            : 370-1
సంపుటము: 11
సంకీర్తన      : 415
రాగము      : సాళంగం
తాళం         : ఆది
గానం : శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు

పల్లవి
ఎదుట నున్నాఁడు వీఁడె యీ బాలుఁడు
మదిఁ దెలియ మమ్మ యే మరులో కాని

చరణం 1
పరమపురుషుఁ డట పసులఁ గాచె నట
సరవు లెంచిన విన సంగతా యిది
హరియే తా నటముద్దు లందరికిఁ జేసె నట
యిర వాయ నమ్మ సుద్దు లేఁటివో కాని

చరణం 2
వేదాల కొడయఁ డట వెన్నలు దొంగిలె నట
నాదించి విన్నవారికి నమ్మికా యిది
ఆదిమూల మితఁ డటా ఆడికెల చాఁత లట
కా దమ్మ యీసుద్దు లెట్టికతలో కాని

చరణం 3
అల బ్రహ్మతండ్రియట యశోదకు బిడ్డఁడట
కొలఁ దొకరికిఁ జెప్ప గూడునా యిది
తెలిపి శ్రీవెంకటాద్రిదేవుఁడై నిలిచె నట
కల దమ్మ తన కెంత కరుణో కాని

🕉🔯 ఓం   నమో వేంకటేశాయ 🕉🔯
🔺 శ్రీ ఆది శంకరాచార్య       _విరచిత __
💎 వివేక చూడామణి.
స్వామీ చిన్మయానందుల వ్యాఖ్యానం.
ఆడియో నం.157

💎💥💎💥💎💥💎
: తోటకాచార్య విరచిత / తోటకాష్టకమ్
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి                                  🕉🌞🌏🌙🌟🚩
శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్|| నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్||


1) విదితాఖిల శాస్త్ర సుధాజలధే మహితోపనిత్కథితార్థనిధే|
హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణమ్||

సకలశాస్త్ర సుధాబ్ధిని చిలికి తదంతర్గమైన మకరందమాధుర్యాన్నితాను గ్రహించి ఇతరులందరికీ పంచాలని అహర్నిశలు పరితపించిన ఓ శంకరా! భావితరాలని ఉద్ధరించాలన్న ఏకైక కారణంచేత వేదాంతోపవనాల్లో నిక్షిప్తమైన ఉపనిషత్తులలో దాగున్న నిధులని శేకరించి భాష్యాలుగా ప్రకటించి పంచిపెట్టినట్టి ఓ శంకరా! నా మదిలో విమలమైన నీ చరణాలని స్థాపించి అనునిత్యము పూజించుకుంటాను. ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.

2) కరుణావరుణాలయ పాలయ మాం భవసారదుఃఖ విదూన హృదమ్|
రచయాఖిదర్శన తత్త్వవిదం భవశంకర దేశ…

: 🕉🌞🌎🌙🌟🚩

Swami Vivekananda's Wisdom for Daily Inspiration - July 16.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూలై 16.

Be not in despair; the way is very difficult, like walking on the edge of a razor; yet despair not, arise, awake, and find the ideal, the goal.

మార్గం, పదునైన కత్తి అంచులా నిశితమై, ఎన్నో అవరోధాలతో కూడుకొని ఉంది. అయినా నిస్పృహ చెందకండి. లేవండి, మేల్కొనండి. గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి.

🕉🌞🌎🌙🌟🚩
: 🕉🌞🌎🌙🌟🚩

సాక్షిగా తన జీవితాన్ని తాను చూడగలిగితే చాలు., అంతకు మించిన ఆధ్యాత్మికత లేదు.

⚡️✨⚡️✨⚡️✨

బోధను గ్రహించి బోధకుణ్ణి వదిలేయాలి. చెప్పినవాడు 'మాయం' కావడమే, చెప్పిన బోధ సఫలం అయినట్లు లెక్క.

⚡️✨⚡️✨⚡️✨

మాకు సంస్కృతం తెలియదు, మాకు శాస్త్ర పరిచయం లేదు.

మా అనుభవమే మాకు శాస్త్రం, మా అనుభవమే మాకు ప్రమాణం.

⚡️✨⚡️✨⚡️✨

రామకృష్ణ:- ముక్తికి సిద్ధులు ఆటంకమా?

సద్గురు:- నామ రూపాలు లేని 'తాను', నామరూపాలు కలిగిన 'రామకృష్ణ' గా ఉండడమే తొలి సిద్ధి.

"రామకృష్ణయే" ప్రధాన ఆటంకం ముక్తి కి.

⚡️✨⚡️✨⚡️✨

సత్యాన్ని తెలుసుకో అంటే :--

హేమ 'సత్యాన్ని' తెలుసుకోమని కాదు,'హేమయే అబద్దం' అనే సత్యాన్ని తెలుసుకో అని.

⚡️✨⚡️✨⚡️✨

 'కలలో మెలకువ'గా ఉన్నాము ఇప్పుడు.

 'మెలకువలో కల'గా ఉండాలి ఎప్పుడు.

⚡️✨⚡️✨⚡️✨

రమేష్:- కర్త ఈశ్వరుడే, మరి నేనేమీ చేయడం లేదా?

సద్గురు:-రాజాస్థానంలో పనిచేసే రాజోద్యోగి స్వయంగా తానే అన్ని పనులను నిర్వహిస్తున్నట్టు కనబడిన, ఆ నిర్వహణలో అంతర్లీనంగా రాజ ఉత్తర్వు ఉంటుంది.  అట్లే జీవుల సంకల్పములతో కూడిన సకల కర్మలు కూడా 'పరా'ధీనములే సందేహము లేదు.

--(())--

బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి...ధర్మరాజు ఇలా అడిగాడు.. 24=06=2021

పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము పొందవచ్చునా ! అని తన సందేహం వెలిబుచ్చాడు. 

భీష్ముడు ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభం.ఎన్నోజన్మలు ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు. 

ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు. 

దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో  అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది. 

గాడిద మాటలను అర్ధము చేసుకున్న విప్రకుమారుడు ఆ గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది. లేకుంటే అలా ఎందుకు అంటుంది? అనుకున్నాడు. విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు. 

గాడిద విప్రకుమారా ! నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు అని చెప్పింది. ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో  తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడను కాను. 

ఆ గార్ధభము ఏదో శాపవశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది. లేకున్న ఈ నా జన్మరహస్యము ఎలా తెలుస్తుంది?. తండ్రీ ! నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు.

మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై కుమారా ! నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు ? నీ కోరిక ఏమిటి  అని అడిగాడు. మతంగుడు దేవా ! నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి అని అడిగాడు. 

ఇంద్రుడు కుమారా ! బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో అని అన్నాడు. మతంగుడు అయ్యా ! నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి. నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు. 

ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. 

ఇంద్రుడు కుమారా ! నీ పట్టు విడువక ఉన్నావు! శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా ! 

ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు. 
దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శూద్రుడు వైశ్యుడు కాలేడు. 
దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు. 
దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు. 
దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు. 

అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సరాల తపస్సుకు వస్తుందా ! చెప్పు అన్నాడు. ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టుకొనుట కష్టము.

 ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కాని బ్రాహ్మణజన్మ ఎత్తలేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు ఔతాడు. 

తిరిగి బ్రాహ్మణజన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణజన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు. నీ కిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు అన్నాడు. 

మారుమాటాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యేవరకు తపస్సు చేసాడు. 

అతడి శరీరము శిధిలమై పడిపోతుండగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు? చక్కగా వేరు వరములు అడిగి సుఖపడు అన్నాడు. 

మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు నీవు చంఢదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల. పూజలందుకుని వారి వలన నీ కోరికలు ఈడేర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు. 
కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు.

అటువంటి ఉత్కృష్టమైన, పరమ పవిత్రమైన బ్రాహ్మణ జన్మను కాపాడుకోవలసిన అవసరం మన బ్రాహ్మణులదే.


No comments:

Post a Comment