*🌹 సిద్దేశ్వరయానం - 64 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*
*యోగేశ్వరి ఇలా తీర్థయాత్రలలో క్షేత్ర కేంద్రీకృత తపస్సులో దాదాపు 40 సంవత్సరాలు గడిచిపోయినవి. గురువర్యులు ఇచ్చిన వరంవల్ల వయసు పైనబడ్డా ముసలి తనం రాలేదు. తనసంచారంలో భాగంగా కాశీ, బృందావనం మాత్రం తరుచుగా వెళ్ళి అక్కడ ఎక్కువ కాలం గడిపేది. కాశీలోని శవశివకాళీ మందిరంలో ధ్యానం చేస్తున్నపుడు తానే కాళినన్న తాదాత్మ్య భావన కలిగేది. అక్కడికి దగ్గరలో ఉన్న తారాపీఠంలో గాని, వటుక భైరవ మందిరానికి దగ్గరగా ఉన్న కామాఖ్య కాళి ఆలయంలో కాని ధ్యానం చేస్తే, అరుణ సుందరి అయిన మూర్తిగా తారా లక్షణాలుకల కాళి కనిపించేది. అంతః ప్రేరణవల్ల మళ్ళీ వంగదేశం సంచారం చేస్తూ భిన్న ప్రదేశములలో తటస్థించిన ఇద్దరు యువకులకు తాంత్రిక సాధనలు కొన్ని అభ్యసింప చేసింది. వారికి చిన్న చిన్న శక్తులు కొన్ని లభించినవి. ఒక యువకుడు కావాలనుకొన్నపుడు తన శరీరంలోనుండి కాంతి పుంజాలను ఎంతదూరమైనా ప్రసరింపచేయ గలిగేవాడు. మరొక వ్యక్తికి అదృశ్యుడయ్యేశక్తి వచ్చింది. ఈ శక్తులను దుర్వినియోగం చేయవద్దని వారిని హెచ్చరించి తనదోవన తాను సంచారానికి బయలు దేరింది.*
*ఒకనాడు కలకత్తాలో గంగానది మీద పడవలో వెళ్ళి ఎదురుగా రాణీరాసమణీదేవి కట్టించిన దక్షిణేశ్వరకాళీ మందిరం వైపునడిచింది. అక్కడికి యాత్రికులుగా వచ్చిన సన్యాసులకు దేవాలయ అధికారులు వసతి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని విని ఉన్నది. గుడివైపు నడుస్తుండగా ఒక యువకుడు ఆమెను ఎదురుగా వచ్చి "మా మామయ్య మిమ్ములను తీసుకురమ్మన్నాడు. రండి". అని ఆహ్వానించాడు. అక్కడ ఆమెకు పరిచితులెవరూ లేరు. మీ మామయ్య ఎవరు? ఎందుకు పిలుస్తున్నాడని అడగకుండా, సరే,పద అని ఆతని వెంబడి నడిచింది. ఆ యువకుడు గుడి పూజారి అయిన గదాధరుని దగ్గరకు తీసుకువెళ్ళాడు.*
*గదాధరుని చూడగానే తను అతని కోసమే వచ్చానని స్ఫురణకల్గింది. "నాయనా! నీవు ఇక్కడ ఉన్నావా! నీ కోసమే వెతుకుతూ వస్తున్నాను" అన్నది. గదాధరుడు కూడా అలానా? తల్లీ చాలా సంతోషము రా. అని మర్యాద చేసి సుఖాసనాసీనురాలిని చేశాడు.బాగా పరిచయమున్న వ్యక్తి తో మాట్లాడుతున్నట్లుగా గదాధరుడు తాను చేస్తున్న కాళీసాధన గురించి చెప్పి, తన అనుభవాలను చెప్పటం మొదలుపెట్టాడు. గదాధరుని మేనల్లుడు, ఆమెను ఆహ్వానించి తీసుకు వచ్చిన హృదయ్ ఆ దృశ్యాన్ని దిగ్భ్రాంతితో చూస్తున్నాడు. వారిద్దరూ చిరకాల పరిచితులవలె మాట్లాడుకుంటున్నారు. వారికి పూర్వపరిచయం లేదని తనకు తెలుసు. అద్భుత సౌందర్యంతో దివ్యతేజస్సుతో కాషాయంబరధారిణి యైన ఈ సన్యాసిని ఎవరు? ఆమె తన మేనమామను, గుడిపూజారిని నాయనా ! అని చిన్న పిల్లవానిగా పిలిచి మాట్లాడుతున్నది. తన మామ కూడ ఆమెను 'అమ్మా' అని తల్లివలె మాట్లాడుతున్నాడు. చూడటానికి ఇద్దరూ సమవయస్కులుగా ఉన్నారు. అతడికి ఏమీ అర్ధంకాలేదు. మామ సూచనను అనుసరించి ఆమెకు వసతి మొదలైన సౌకర్యాలు ఏర్పాటు చేయటం కోసం అతడు అవతలికి వెళ్ళాడు. గుడికి దగ్గరలో ఉన్న పంచవటిలో తాను చేసిన సాధనలను పొందిన దర్శనాలను, అనుభవాలను ఆమెకు విశదీకరించి చెప్పి "అమ్మా! నీవు చాలాగొప్పదానవు, సిద్ధురాలివి. నాకు కలిగిన ఈ అనుభవాలను విన్నవారు చాలా మంది మనః కల్పిత భ్రాంతులని కొట్టి వేస్తున్నారు. మరి కొందరు నన్ను పిచ్చివానిగా జమకడుతున్నారు. వీనిలో ఏది నిజమో నీవు చెప్పు అమ్మా” అని పసివాని వలె ఆమెను గదాధరుడు అభ్యర్థించాడు.*
*యోగేశ్వరి "నాయనా! నీవు పొందిన దర్శనాలు అనుభవాలు అన్నీ సుసత్యాలు. జగన్మాత అయిన కాళి నీకు ప్రసాదించిన అనుగ్రహ చిహ్నాలు. వాటి సత్యాన్ని గురించి నీవు సందేహించవలసిన పనిలేదు. కాదనే వారి సంగతి ఇక నేను చూచుకొంటాను. నీవు నిశ్చింతగా ఉండు" అన్నది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
**🌹 సిద్దేశ్వరయానం - 65 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*
భైరవి బ్రాహ్మిణి కి దేవాలయంలో నివాసానికి ఒక గది ఏర్పాటు చేయబడింది. అక్కడ నుండి, ప్రతిరోజూ వారిద్దరూ ఏకాంతంగా కూర్చొని అనేక విషయాలు చర్చించేవారు. తరువాత గదాధరుని మేనల్లుడు చెప్పటం వల్లగాని, సామాజిక అవగాహన వల్లగాని ఇద్దరూ సమవయస్కులుగా కన్పిస్తున్నవారు. (నిజానికి భైరవీ బ్రాహ్మణి తనకంటే చాలా పెద్దదని గదాధరునికి తెలుసు. కానీ ఆమె 25సం|| సౌందర్యవతిగా కన్పించేది.) ఒకే చోట ఉండటంగాని ఎక్కువసేపు కలిసి ఉన్నట్లు కనపడటంగాని ఉచితంగాదని గుర్తించి, తెలిసిన, వేరేచోట ఆమెకు వసతి ఏర్పాటు చేశాడు. ఆమె ఏ మహత్తర కార్యక్రమం కోసం వచ్చిందో ఆ కార్యక్రమం ప్రారంభించబడింది. కలకత్తాలో ఎక్కడెక్కడో వెదికి అనేక వస్తువులు తీసుకువచ్చి గదాధరుని చేత చిత్ర విచిత్రమైన సాధనలు చేయించింది.ఈ విధంగా 64 రకములైన తాంత్రిక సాధనలలో, భైరవీ బ్రాహ్మణి గురుత్వంలో గదాధరుడు శిక్షణ పూర్తి చేశాడు.*
*ఈ దశలో ఒకరోజు సుదీర్ఘదేహం కలిగిన ఒక నగ్న సాధువు దక్షిణేశ్వరం వచ్చాడు. గడ్డము జటాజూటములు గల ఆ దిగంబర సాధువు, నాగ సంప్రదాయానికి చెందినవాడు. గదాధరునిలో ఒక ప్రత్యేకత ఏమిటంటే తాను ఎంత సిద్ధపురుషుడైన, కాళీదేవీ యొక్క దర్శనాలను, అనుభూతులను పొందినవాడైనా, తాంత్రికసాధనలో ఉత్తీర్ణుడైనా, ఏదో ఒక విద్యలో నిష్ణాతులైన వ్యక్తులు వస్తే వారి ద్వారా ఆ విద్యనేర్చుకొని ఆ మార్గం యొక్క స్వరూపస్వభావాలు తెలుసుకోవాలని అనుకొనేవాడు. ఇప్పుడు వచ్చిన ఈ'తోతాపురి' గదాధారుని యోగ్యతను గుర్తించి సన్యాసదీక్ష ఇవ్వాలని భావించాడు. అయితే ఆ విషయం గదాధరునితో చెప్పినపుడు "నాకు తల్లీ భార్య ఉన్నారు, నేను సన్యాసం తీసుకోవటానికి వారు ఇష్టపడరు" అని ఆతడన్నాడు.*
*"సన్యాసానికి వైరాగ్యం ప్రధానం, తల్లి అనుమతి, భార్య అనుమతి కావాలని అంటే వారితో అనుబంధాలు, ఇంకా ఉన్నవన్నమాట. వైరాగ్యం కలిగినవారికి ఎవరి అనుమతీ అవసరం లేదు" అనగా గదాధరుడు- ఆ నాగసాధువు దగ్గర సన్యాస స్వీకారం చేశాడు. అతనికి 'రామకృష్ణ' అన్న నూతన నామధేయం ఇవ్వబడింది. సన్యాస మార్గంలో 'పరమహంస' అన్నది అత్యున్నతస్థానం కనుక, రామకృష్ణుడు ఆ స్థాయికి ఎదిగిన వాడుగనుక, అనంతరకాలంలో ఆయన 'రామకృష్ణ పరమహంస'గా పిలువబడినాడు.*
*తోతాపురి సూచనల వల్ల ప్రేరణ వల్ల నిర్వికల్ప సమాధిలో నిర్విరామంగా 3 రోజుల పాటు ఉండటం తోతాపురికే దిగ్భ్రాంతి కల్గించింది. కొన్నాళ్ళుండి తన కర్తవ్యం పూర్తయినదని భావించిన తోతాపురి అక్కడ నుండి వెళ్ళి పోయినాడు.
దక్షిణేశ్వర కాళీ మందిర యజమాని మధురాబాబుకు రామకృష్ణుడంటే ఎనలేని గౌరవం. కాళీమాత యొక్క దివ్యమైన అనుబంధాన్ని పొందిన మహాభక్తుడని ఆయనను గూర్చిన ప్రగాఢమైన విశ్వాసం. ఒకరోజు భైరవీబ్రాహ్మణి అక్కడ ఉండగా మధురాబాబు అక్కడికి వచ్చాడు. ఆమెకు రామకృష్ణునికి, ఇద్దరికి నమస్కారము చేసినప్పుడు సంభాషణ వశాన ఆమె రామకృష్ణుడు అవతార పురుషుడని ప్రతిపాదించింది. ఆ మాటలు విని మధుబాబు "రామకృష్ణులవారు, మహనీయులనటంలోను, కాళీదేవి కరుణను పొందిన వారనటం లోనూ ఎటువంటి సందేహమూ లేదు కానీ, అవతారాల విషయానికివస్తే నాకు తెలిసిన కొద్ది పరిజ్ఞానంలో అవతారాలు 10 అని అందులో 9 అవతారాలు కృష్ణావతారంతో పూర్తయినవని పదియవ అవతారం కలియుగాంతంలో మాత్రమే వస్తుందని ప్రజలు చెప్పగా విన్నాను అన్నాడు.*
*దానికి భైరవబ్రాహ్మణి సమాధానం చెపుతూ “అవతారాలలో దశావతారాలు ముఖ్యమైనవి మాత్రమే, భాగవతంలో ఏకవింశతి అవతారాలు చెప్పబడినవి. మరికొన్నికూడా ఉండవచ్చు. రామకృష్ణుల వారికి కలిగిన అనుభవాలను వివిధ సాధనల వల్ల ఆయన పొందిన సిద్ధశక్తులను విశ్లేషించినపుడు ఆయన అవతార మని చెప్పక తప్పదు. అదీకాక మహాపురుషుడైన కృష్ణచైతన్య మహాప్రభువు మళ్ళీ అవతరిస్తాడని గౌడీయ సంప్రదాయంలో యోగులు చెపుతున్నారు. ఈ విషయం నేను వాదించి సప్రమాణంగా శాస్త్రబద్ధంగా నిరూపించి ఏ పండితుడినైనా ఒప్పిస్తాను. మీరు విద్వత్ సభ ఏర్పాటు చేయండి. మిగతావి నేను చూచుకుంటాను" అన్నది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 66 🌹*
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*
*మధురాబాబు కొద్ది రోజులలోనే పండితసభ ఏర్పాటు చేశాడు. 'అందులో జరిగిన రకరకాల వాద ప్రతివాదాలలో వచ్చిన విద్వాంసులు రెండురకాలుగాను తర్కించారు. భైరవీబ్రాహ్మణి తన వాగ్వైభవమువల్ల పాండిత్యమువల్ల రామకృష్ణ పరమహంస అవతారపురుషుడని శాస్త్రబద్ధంగా తర్కనైపుణ్యంతో వాదించింది. ఆమెనెవరూ కాదనలేకపోయినారు. ఆ విధంగా ఆ సభ ముగిసింది. దీనివల్ల రామకృష్ణుని కీర్తి మరింతగా కలకత్తా నగరం అంతా వ్యాపించింది. ఈ విధంగా కొంత కాలం గడిచిన తరువాత ఒకసారి అందరూ కలిసి రామకృష్ణులవారి స్వగ్రామానికి వెళ్ళారు. అక్కడ వైభవోపేతంగా కాళీ పూజలు ఏర్పాటు చేయబడ్డాయి.*
*పూజానంతరం సమారాధన జరిగింది. భోజనాలయిన తరువాత భైరవీబ్రాహ్మణి సేవాభావంతో ఎంగిలి విస్తళ్ళను ఎత్తివేసింది. అది చూచిన రామకృష్ణుల మేనల్లుడు హృదయ్ ఆమెను పెద్దగా అవమానకరంగా దూషించాడు. అక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యుల పెద్దలు ఆమె చేసిన పనిని గర్హించారు. ఆ సంఘటనంతా చూస్తూ కూడా రామకృష్ణులవారు ఏమీమాట్లాడలేదు. దానితో ఆయన జీవితంలో తన పాత్ర ముగిసిందని, తానిక నిష్క్రమించవలసిన సమయమాసన్నమైనదని గుర్తించింది. అది లోకసహజమే, కలకత్తా వెళ్ళిన తరువాత రామకృష్ణుల వారితో చెప్పి అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది. ఆయన కూడా ఉండమని ఏమీ బలవంతం చేయలేదు.*
*అక్కడి నుంచి మళ్ళీ కొద్ది సంవత్సరాల పాటు దేశసంచారం చేస్తూ కాశీకి వెళ్ళి తన చెల్లెలితో పాటు ఆమె కొన్న గృహములో ఉన్నది. అప్పుడప్పుడు త్రైలింగసామిని చూచి ఆయన ఆశీస్సులు తీసుకొంటూ జప ధ్యానములతో కాలం గడపసాగింది. ఇలా ఉండగా రామకృష్ణులవారు కాశీ వస్తున్నారన్న వార్తవచ్చింది. కొద్దిమందితో కలిసి రాగా, వారందరికి తమ ఇంటిలో వసతి ఏర్పాటు చేసింది. రామకృష్ణులు కొన్నాళ్ళు అక్కడ ఉండి, కాశీలో చూడవలసినవి చూచి తరువాత మళ్ళీ కలకత్తా వెళ్ళి పోయినాడు.*
*ఈ విధంగా మరికొంత కాలం గడచిన తరువాత కాళీభక్తు డెవరో వచ్చి దగ్గరలో ఉన్న ఒక ధర్మశాలలో బసచేశారని విని ఆసక్తి కొద్ది దర్శిద్దామని వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూస్తే అతడు సుమారు 30, 35 సంవత్సరాల యువకుడు చిన్న నల్లని గడ్డము కొద్దిగా ఉంగరాలు తిరిగి విరబోసిన కేశపాశములు చామనచాయ శరీరము, తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నాడు. లోపలికి వెళ్ళి ఆయనను దర్శించగానే, ఆయన కూర్చున్న చోటుకు వెనకాల నిలువెత్తు చిత్ర పటం ఆమెను ఆకర్షించింది. అందులోని కాళీదేవి అచ్చం అరణ్యాలలో తన గురువైన కాళీయోగి స్థాపించిన మూర్తివలె ఉన్నది. అయితే అక్కడిది విగ్రహం, ఇక్కడిది చిత్రము.*
*తను ఎన్నోచోట్ల కాళీదేవి విగ్రహాలను చూచింది. చిత్రకారులు చిత్రించిన చిత్రాలను చూచింది. కాశీలో శవశివకాళీ మందిరం, అక్కడికి దగ్గరలోని, తారాపీఠములోని కాళి అక్కడికి మరొక వైపున్న కరుణాకాళీ, దయాకాళి తన నెంతో ఆకర్షించినవి. అవి గొప్ప శక్తి కేంద్రాలు. త్రైలింగస్వామి పూజించిన మంగళాకాళి, కీనారాం అర్చించిన హింగుళాకాళి, ఈ కాళీమూర్తులు తనయందు అనుగ్రహం ఎప్పుడూ చూపిస్తునే ఉన్నారు. కానీ ఆమె పూజించిన కళింగారణ్యకాళీ చిత్రం చూడటం ఇదే మెదటిసారి. తన దేవత చిత్రాన్ని ఎవరు గీశారు? ఈయన దగ్గరకు ఎలా వచ్చింది? అందరూ స్వామి అని పిలుస్తున్న ఈ యువకుడు ఎవరు? ఇలా ఆలోచిస్తూ మూతలువడిన కన్నులు తెరిచే సరికి గదిలో ఆ స్వామి, తాను తప్ప ఎవరూలేరు. అందరూ బయటకు వెళ్ళి పోయినారు. సంధ్యా సమయం దాటి చిరుచీకట్లు చిమ్ముతూ, వెలిగించబడిన దీపాలకాంతిలో, ఆ తరుణస్వామి విచిత్ర వ్యక్తిగా భాసిస్తున్నాడు. ఆయనను, ఆ చిత్రంలోని కాళీదేవతను గురించి అడుగుదామని అనుకొంటుండగానే అత డిలా అన్నాడు.*
*యోగి: యోగీశ్వరీ! నీమనస్సులో కల్లోలిత మవుతున్న సందేహాలు నాకు తెలుసు. కాళీ చిత్రాన్ని గురించి తెలుసుకోవాలని అడుగ బోతున్నావు.*
*భైరవి: స్వామీ! నా పేరు మీకు ఎలా తెలుసు. నా మనసులోని ఆలోచనలు మీకు ఎలా తెలిసినవి?*
*యోగి: 50 ఏండ్ల క్రింద బృందావనంలో నా దగ్గరకు వచ్చినపుడు ఇదే ప్రశ్నవేశావు. అప్పుడు నేను, ఏది కావాలంటే అది తెలుసుకోగలను అని చెప్పాను *గుర్తుతెచ్చుకో.*
( విద్వత్కవిగా ప్రసిద్ధిచెంది ఏవో ఉద్యోగాలలో సద్యోగాలలో కొంత కాలం గడిపి దక్షిణదేశంలోని కుర్తాళ సిద్ధేశ్వరీపీఠాధిపతి దగ్గర సన్యాసం తీసుకొని తరువాత దానికి పీఠాధిపతినై ఉన్నసమయంలో ఇప్పటివలెనే మళ్ళీ అప్పుడు నా దగ్గరకు వస్తావు. అప్పటినీ వివరాలు అప్పుడు నీవు తెలుసుకోగలవు. ఇప్పటి వలెనే గుర్తు చేస్తాను. తపస్వినివై, యోగినివై, ప్రకాశింతువుగాక!)*
*యోగి: బృందావనం నుంచి బయలు దేరినపుడు నీకొక మాట చెప్పాను. చిన్నతనంలో బిడ్డను తల్లి చెయ్యిపట్టుకొని నడక నేర్పుతుంది. తరువాత తండ్రి చేయిపట్టుకొని విద్యాశాలకు తీసుకు వెడతాడు. వయసు వచ్చిన తరువాత భర్త, చెయ్యి పట్టుకునిజీవితంలో నడిపిస్తాడు. ఆనాడు నీవు రెండవదశలో ఉన్నావని చెప్పాను. రాబోయే జన్మలలో ఏదశలో నాదగ్గరకు వస్తావో! ఎలా వచ్చినా నిన్ను అనుగ్రహిస్తాను.*
*భైరవి: ధన్యురాలిని, అని స్వామి వారి పాదములకు నమస్కరించింది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🌹 సిద్దేశ్వరయానం - 67 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 అపర కుబేరుడు తిప్పయ శెట్టి - 1 🏵*
*శ్రీనాధుడు కంచిలో ఉండగా ఒకనాడు అవచి తిప్పయ్యశెట్టి కబురుచేశాడు. ఆ రోజుల్లో అతనిని మించిన వ్యాపారవేత్త లేడు. దేశవిదేశాలలో ఖండ ఖండాంతరాలలో ప్రసిద్ధి చెందిన వణిక్ ప్రముఖుడు. కవులను పండితులను ఎందరినో పోషించాడు. 'ధర్మద్రావిడ' అన్న బిరుదము ఆయనకుండేది. పాండ్య మహారాజు అతనితో కందుక క్రీడ చేసేవాడంటే అతనిస్థాయి ఊహించవచ్చు. కొండవీడు ప్రభువైన 'కుమారగిరిరెడ్డి' ఆందోళికా ఛత్రచామర తురంగాది రాజ చిహ్నములను బహుకరించాడు. అతనికి పెద్ద ఆస్థానమంటపం ఉండేది. దానిలో మాణిక్య సింహాసనాసీనుడై పరిచారికలు వింజామరలు వీస్తుండగా వేదపండితులాశీ ర్వదిస్తుండగా కొలువుతీరి ఒక మహారాజులాగా ప్రకాశించేవాడు.*
*అతనిని శ్రీనాధుడు 'త్రిపురారి యక్షరాజు' అని వర్ణించడం గమనించదగిన అంశం. యక్షరాజు అంటె 'కుబేరుడు'. శ్రీనాధకవీ! నాసంగతి నీకు తెలుసు. విశుద్ధమైన సంతానమును కన్నాను. ఎన్నో పురాణాలను విన్నాను.బహువత్సరములు సుఖముగా మన్నాను. సుకవికోటి నుతింపగా యశోధనము కొన్నాను.నా తల్లితండ్రుల ఉభయ గోత్రముల వారు శైవ, వైష్ణవ సమయదీక్షా విశేష మానసులు, నా వరకు చిన్నప్పటి నుండి మహేశ్వరాచారపరత అబ్బింది.*
*శ్లో॥ మహేశ్వరే వా జగతా మధీశ్వరే జనార్దనేవా జగదంత రాత్మని న వస్తు భేద ప్రతిపత్తిరస్తిమే తథాపి భక్తి స్తరుణేందు శేఖరే*
*నీవు ఆగమ జ్ఞాననిధివి. తత్త్వార్ధఖనివి. బహుపురాణవేత్తవు. బుద్ధిశాలివి. విశేషించినాకు బాలసఖుడవు. నాకు అంకితంగా ఒకశైవ ప్రబంధాన్ని రచించవలసినది'అని తిప్పయ్యశెట్టి అన్నాడు.*
*శ్రీనాధ : మిత్రమణీ ! మీరు ఇలా అడగడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటిదేదో జరుగుతుందని నాకు తెలుసు.*
*తిప్పయ్య: ఆశ్చర్యంగా ఉన్నది. నీవు ఎలా ఊహించగలిగావు?*
*శ్రీనాధ : మన ఊరిలోకి మహనీయుడైన కాళీసిద్ధుడు ఒకరు వచ్చారు. ఆయనను దర్శించాను. హిమాలయాలలో తపస్సు చేసి సిద్ధశక్తులు సంపాదించిన మహనీయుడతడు. ఆయన కోసం కాళీదేవి ప్రాణసహితమైన విగ్రహంగా అవతరించింది. ఆ విగ్రహాన్ని గూడా చూశాను. నాకు సంబంధించిన భూతకాల, వర్తమాన, భవిష్యద్విశేషాలను ఎన్నింటినో చెప్పాడు. నాతో జన్మాంతర బంధమున్నదని, అందుచేత అవ్యాజమైన అభిమానము నాయందు చూపించాడు. ఈ రోజు ఒక శుభకార్యానికి అంకురారోపణ జరుగుతుందని తెలియచేశాడు. ఆయన చెప్పిన విధంగానే జరిగింది.*
*తిప్పయ్యశెట్టి: అంతటి మహానుభావుడయితే నేను కూడా తప్పకుండా దర్శనం చేసుకొంటాను. వారిని మన ఆస్థానానికి ఆహ్వానిద్దాము.*
*శ్రీనాధ : అలా కాదు, వారున్నచోటికి వెళ్ళిదర్శనం చేసుకోవడమే ఉచితం.*
*తిప్పయ్యశెట్టి: అలా అయితే ఈ రోజు సాయంకాలం నన్ను అక్కడకు తీసుకొని వెళ్ళు. ఇద్దరం కలిసి వెళదాం.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 68 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 అపర కుబేరుడు తిప్పయ శెట్టి 🏵*
*తిప్పయ్య శెట్టి, శ్రీనాధ కవి ఆరోజు సాయంకాలం ఇద్దరూ కలిసి ఏకామ్రనాధుని ఆలయం దగ్గర ఒక ధర్మశాలలో విడిది చేసిన కాళీ సిద్ధుని దగ్గరకు ఇద్దరూ వెళ్ళారు. శ్రీనాథుడు ముందు లోపలికి వెళ్ళి కాళీసిద్ధునకు అవచితిప్పయ్యశెట్టి గురించి చెప్పాడు. "స్వామివారు ! ఈ కంచిలో అవచివారి కుటుంబం వ్యాపారరంగంలో సుప్రసిద్ధులు. వివేకనిరంజన రామనాధ యోగీశ్వరుని పాదసేవకుడయిన అవచిదేవయ్యశెట్టికి ముగ్గురు కుమారులు. వారు ద్వీపాంతరములతో ఎగుమతి దిగుమతులు చేసి అపార సంపదనార్జించినవారు. ఆ సంపదలకేమి గాని నిరంతర మహేశ్వరభక్తి పరాయణులు. ఎన్ని వందల వేలమంది వచ్చినా నిరంతరం పంచ భక్ష్య పరమాన్నములతో సమారాధనలు చేస్తుంటారు. దానధర్మములలో వారిని మించిన వారు లేరు. కొండవీటి ప్రభువైన కుమారగిరిరెడ్డి చేసే వసంతోత్సవాలను మొత్తం ఖర్చుపెట్టి వీరే నిర్వహిస్తుంటారు.*
*సీ|| పంజార కర్పూర పాదపంబులు తెచ్చె జలనోంగి బంగారు మొలక దెచ్చె సింహళంబున గంధ సింధురంబులు దెచ్చె హురుమంజిమలు తేజిహరులు దెచ్చె గోవసంశుద్ధ సంకుమద ద్రవము తెచ్చె యాంప గట్టాణి ముత్యాలు దెచ్చె భోట గస్తూరికాపుటంకములు దెచ్చె జీని చీనాంబర శ్రేణి దెచ్చె*
*తే॥ జగదగోపాలరాయ వేశ్యాభుజంగ పల్లవాదిత్య భూదాన పరశురామ కొమరగిరిరాజ దేవేంద్రు కూర్మిహితుడు జాణ జగజెట్టి దేవయచామిశెట్టి.*
*అటువంటి ఆ సోదరత్రయంలో అగ్రజుడైన తిప్పయశెట్టి శైవ ప్రబంధ మొకటి రచించి తన కంకితమీయమని తాంబూలం ఇచ్చాడు. నిన్న మీరు చెప్పింది అక్షరాలా నిజమయింది. ఆ తిప్పయశెట్టి మీ దర్శనానికి వచ్చాడు. మీ రనుమతిస్తే వారిని లోపలికి తీసుకువస్తాను” అన్నాడు. కాళీసిద్ధుడు అంగీకార సూచనగా తల ఊపాడు. తిప్పయశెట్టి లోపలకు వచ్చి విలువైన బంగారునాణెములు సుగంధ ద్రవ్యములు పాదకానుకగా సమర్పించి 'ఆశీర్వదించమ'ని ప్రార్థించాడు.*
*కాళీసిద్ధుడు అతనిని చూచి ఇలా పలికాడు" తిప్పయశెట్టీ ! నీ కులగురువైన రామనాధ యోగీశ్వరులు నాకు బాగా ఆప్తుడు. పిల్లలమట్టి మహాప్రధాని పెద్దన్న బుధేంద్రుని దగ్గర శైవమార్గ సంపన్నతను పొందిన యోగ్యుడవు. ఇవ్వాళ ఈ దేశంలో అందరూ నిన్ను అపరకుబేరునిగా భావిస్తున్నారు. త్రిపురాంతక దేవుని సేవించడం వల్ల మీ వంశం శుభములతో వర్థిల్లుతున్నది. శ్రీమద్దక్షిణ కాశికాపుర మహాశ్రీ కాళహస్తీశ్వర ప్రేమాత్మోద్భవ కాలభైరవ కృపావర్ధితైశ్వర్యుడవు. కాలభైరవుని కృప నీయందు బాగా ఉన్నది. నీవు పూర్వజన్మలో కాశీలో చాలాకాలము ఉన్నావు. విశ్వేశ్వరుని గుడి ప్రక్కనే ఉన్న కుబేరేశ్వరాలయం దగ్గర నీ వసతి. రోజూ ఆ కుబేరేశ్వరుని సేవించేవాడవు. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న కాశీక్షేత్రపాలకు డయిన కాలభైరవ ఆలయానికి ప్రతిరోజు హారతి సమయానికి వెళ్ళేవాడవు. ఒక సిద్ధగురుడు నీకు కాలభైరవ మంత్రాన్ని ఉపదేశించాడు. నిష్ఠతో ఆ మంత్రజపం చేశావు. కాలభైరవుని అనుగ్రహము, కుబేరేశ్వరుని అనుగ్రహము నీకు లభించినవి. వాటి ఫలితంగా ఈ జన్మలో అనన్యమైన శివభక్తి కాళహస్తి లోని కాలభైరవ అనుగ్రహము, కుబేరుని కరుణ అనుగ్రహంతో నీవీ స్థితికి ఎదిగావు. ఇలా వేదధర్మరక్షకుడవై, కవిపోషకుడవై, దానధర్మములతో శివార్చనలతో జీవితాన్ని చరితార్థం చేసుకో. నిన్ను శ్రీనాధుడు 'త్రిపురారి యక్షరాజు' అన్నాడు గదా !*
*తిప్పయ్యశెట్టి : అవును స్వామి, ఆపద ప్రయోగం శ్రీనాధుని నోట నేను ప్రొద్దుననే విన్నాను. మీరు ఇలా చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉంది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 69 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 అపర కుబేరుడు తిప్పయ శెట్టి 🏵*
*శ్రీనాధుడు నిన్ను 'త్రిపురారి యక్షరాజు' అన్నాడు గదా !*
*తిప్పయ్యశెట్టి : అవును స్వామి. ఆపద ప్రయోగం శ్రీనాధుని నోట నేను ప్రొద్దుననే విన్నాను. మీరు ఇలా చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉంది.*
*కాళీసిద్ధుడు : ఇందులో ఆశ్చర్యమేమి లేదు. దేవతల కరుణ ఉంటే ఏదైనా సాధ్యమే. నీ భవిష్యత్తు ఇప్పటి కంటే గూడా ఇంకా బాగుంటుంది. నెమ్మది నెమ్మదిగా వ్యాపారాన్ని పిల్లల కప్పగించి ఎక్కువ కాలం శివధ్యానంలో గడుపు. నీకు మేలగుగాక ! శ్రీనాధకవీ! నేను చెప్పిన విషయాలు గుర్తున్నవి కదా ! జీవిత చరమదశలో నీకు కష్టాలు తప్పేటట్లు లేదు. అయినా శివుని ఆశ్రయించు. శుభమస్తు.*
*తిప్పయ్య శెట్టి - మహాత్మా ! ఒక అభ్యర్ధన. మహానీయులైన మీ వంటి వారు ఎప్పుడో కాని లభించరు. మీ దర్శనం వల్ల మేమంతా ధన్యులమైనా మని భావిస్తున్నాను. మీ సన్నిధిలో ఏదైనా యజ్ఞం చేయాలని అనిపిస్తున్నది. మీరు అనుగ్రహించి కొద్దిరోజులు కూడా ఉండి నాచేత యజ్ఞం చేయించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.*
*కాళీసిద్ధుడు : మంచిదే. నీవు సంపన్నుడవు. ఎంతటి యజ్ఞమైనా చేయించగలవు. కానీ ఈ దేశమంతా సుసంపన్నం కావాలి. శ్రీనాధుడు అప్పుడప్పుడు కొండవీటి ప్రాంతం వెళ్ళి వస్తుంటాడు. ఆ ప్రాంతంలోని పలనాటి సీమ ప్రజలు పంటలు సరిగా పండక పడే బాధలను చాలా పద్యాలలో వర్ణించాడని విన్నాను. దేశమంతా సుభిక్షం కావటానికి ఐశ్వర్యవంతంగా ఉండటానికి "కుబేర యజ్ఞం” చెయ్యి. కాలభైరవుని అనుగ్రహం వల్ల సిరిసంపదలను పొందినవాడవు నీవు. కనుక కాలభైరవుని విగ్రహాన్ని యజ్ఞశాలలో ప్రతిష్ఠించు. దానిముందు నర్మద బాణం పెట్టు. అతడు భైరవేశ్వరుడని పిలవబడతాడు. ఆ భైరవలింగము ముందు ప్రధాన యజ్ఞకుండం ఉండాలి. మొత్తం 108 కుండాలతో కుబేర యజ్ఞం చెయ్యి. మంత్రవేత్తలు, నిష్ణాతులు అయిన ఋత్విక్కులను ఏర్పాటు చెయ్యి. తొమ్మిది రోజులు ఈ యాగం జరగాలి. నీవు కోరినట్లు నేనుంటాను.*
*శ్రీనాధుడు : సిద్ధేశ్వరా ! ఇంతకు ముందు ఎవరైనా ఈ యాగం చేసారా?*
*కాళీ : ఏ యాగమైనా ఈ అనంతకాలంలో ఎవరో ఒకరు చేసే ఉంటారు. కాకుంటే ఇటీవలి కాలంలో దీని నెవ్వరూ తలపెట్టలేదు. ఇప్పుడు తిప్పయ్య శెట్టి చేస్తున్నట్లే దాదాపు అయిదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ యజ్ఞం సంకల్పించబడుతుంది. అప్పుడు కూడా నేనే దానిని జరిపిస్తాను. నన్ను సిద్ధేశ్వరా! అని సంబోధించావు. ఆ పిలుపు యాదృచ్ఛికం కాదు. అప్పుడు నా పేరు అదే అవుతుంది. సరి! ఇవన్నీ భవిష్యత్తుకు సంబంధించినవి. శ్రీనాధకవీ ! నీకు సంబంధించి నీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని రహస్యాలు చెప్పాను. జాగ్రత్త! తిప్పయసెట్టీ! ఇక యజ్ఞపు ఏర్పాట్లు చేయండి !*
*తిప్పయసెట్టి, శ్రీనాధుడు : స్వామీ! మీ ఆజ్ఞ. మీరు చెప్పిన విధంగా చేస్తాము. సెలవు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
*🌹 సిద్దేశ్వరయానం - 70 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 19వ శతాబ్దం - గుహలో కాళి 🏵*
*తీర్థ యాత్రకు బయలుదేరి పాంధులతో కలిసి ఆంధ్ర ప్రాంతం నుండి ఓడ్ర దేశంలోకి ప్రవేశించాము. రైలు వేగంగా కదలిపోతున్నది. ఒక అడవిలోకి ప్రవేశించిన తరువాత ఎందుకో గమనం మందగించి నెమ్మదిగా సాగుతూ కాసేపటికి బండి ఆగిపోయింది. గంట, రెండు గంటలు, మూడు గంటలు గడిచినవి. ఈ లోపు ప్రయాణికులు గార్డు దగ్గరికి కొందరు, ఇంజను దగ్గరకు కొందరు వెళ్ళి కనుక్కుంటే త్రోవలో కొంత దూరాన పట్టాలు బాగుచేస్తున్నారు. త్వరలో సందేశం వస్తుంది బయలుదేరుతాము అని సమాధానం వచ్చింది. నాకెందుకో మనస్సులో ఇక్కడ దిగు దిగు -రైలులో వెళ్ళవద్దు. అని సందేశం వస్తున్నట్లు అనిపించింది. చాలామంది క్రింద దిగి మాట్లాడుకుంటున్నారు. కొందరు దూరంగా ఉన్న చెట్ల దగ్గరకు వెళ్ళి నీడలో విశ్రాంతి తీసుకొంటున్నారు. నేనూ దిగి దూరంగా ఒక రావిచెట్టు కింద కూర్చున్నాను.*
*శ్లో॥ మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శ్శివరూపాయ వృక్షరాజాయతే నమః*
*అశ్వత్థ వృక్షం మొదలు బ్రహ్మస్వరూపం, మధ్య విష్ణు స్వరూపం. కొమ్మల చివరలు పైన శివరూపం. అటువంటి దేవతా వృక్షానికి నమస్కారం అనుకొంటూ ఉన్నాను. సాయంసంధ్య దాటి కొంచెం చీకటిపడుతున్న సమయానికి రైలు కూత వేసి బయలుదేరింది. గార్డు విజిల్ వేశాడు. అందరూ గబగబా రైలెక్కారు. నేను ఉండిపోయినాను. నేను తమతో రాకపోతే ఈ ప్రయాణీకుడు ఏమైపోయినాడో పట్టించుకొనే వారు నా ఆప్తులు- బంధువులు - రైలులో ఎవరూ లేరు. నేను ఎప్పుడూ ఒంటరివాడినే. ఇప్పుడూ ఒంటరివాడినే. నాలో నేనే నవ్వుకొన్నాను. ఈ ప్రపంచంలో ఎవరికెవరు ? ఒంటరిగా రావటం ఒంటరిగా పోవటం. మధ్యలో భార్యా - బిడ్డలు - చుట్టాలు - స్నేహితులు నదీ ప్రవాహంలో కలుస్తూ విడిపోతూ ఉండే కట్టెల వంటి వారు. జీవితం ఎంత చిత్రమైనది! ఆ రాత్రి ఆ చెట్టు క్రిందనే శయనించి ప్రొద్దుననే లేచి చూచి నెమ్మదిగా దగ్గరనే ఉన్న ఒక సరస్సులో స్నానం ముగించుకొని రైలు వెళ్ళిన త్రోవ ప్రక్క నడవటం మొదలుపెట్టాను.*
*మధ్యాహ్నం దాకా నడిచిన తర్వాత ఒక చోట దిగుడుబావి. పండ్లచెట్లు కనిపించినవి. ఆగి నాలుగు పండ్లు కోసుకొని తిని కాసిని మంచినీళ్ళు తాగి విశ్రాంతి తీసుకొన్నాను. ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ లేచి బయలుదేరుతుంటే ఒక కోయవాడు కనిపించి ఎక్కడకు వెళుతున్నారని అడిగాడు. భువనేశ్వర్ వెళ్తున్నానని చెప్పాను. అతడు " ఈ బండ్లదోవన నడుస్తూ పోతే చాలా రోజులు పడుతుంది. అడవిలో దగ్గర దోవ ఉంది. కాలిబాట. నేనూ అటే వెళుతున్నాను. మీరు వస్తే మిమ్మూ తీసుకెళ్తాను. ఇక్కడి మార్గాలన్ని నాకు బాగా తెలిసినవి" అన్నాడు. అతనిని చూస్తే మనిషి మంచి వాడిలానే ఉన్నాడు. ఒక వేళ కాదు - అయితే ఏమిటి? నా దగ్గర ఏముంది? నా గమ్యస్థానం అంత వేగంగా చేరుకోవలసిన పనేమీ లేదు. తొందరగా చేరినా మంచిదే చేరకపోయినా మంచిదే. ఎవరో ఒకరు తోడు దొరికారు. అనుకొని అలాగే కలసి వెళదామన్నాను. కొంతదూరం ప్రధాన మార్గంలో నడిచి తర్వాత అడవిలో ప్రవేశించాము. మధ్యాహ్నం, రాత్రి పూట ఆగటం పండ్ల చెట్లున్న చోట్లు నీళ్ళు దొరికే చోట్లు మాకు విశ్రమస్థానాలు. అవి ఆ కోయవానికి తెలుసు. ఇలా కొద్దిరోజుల ప్రయాణం సాగింది.*
*ఒక చోటుకు వెళ్ళేసరికి కనుచూపు మేర మోకాలి లోతు నీళ్ళు. త్రోవ కనపడటం లేదు. ఆ కోయవాడు "బాబుగారూ! దోవ ఇటే కానీ ఇప్పుడు పోవటానికి వీలు లేదు. ఎక్కడ ఎంత లోతు నీళ్ళుంటవో, ఎక్కడైనా ఊబి ఉంటుందో ప్రమాదం. ఎన్ని రోజులు ఇలా ఉంటుందో చెప్పలేము. ఇటీవల కురిసిన వానల వల్ల ఇలా జరిగింది. ఇప్పుడేమి చెయ్యాలో తోచటం లేదు" అన్నాడు. నేను "ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కు పోవాలనిపించటం లేదు. ఈ నీటి ప్రక్కనే నడుచుకుంటూ వెళ్లాము. అమ్మవారు సహాయం చేస్తుంది” అని ముందుకు దోవదీశాను. ఇప్పుడు నేను తెలియని మార్గదర్శిని. అలా వెళ్ళగా వెళ్ళగా అడవిలో ఒక కొలను. అక్కడికి మనుషులు వచ్చిన జాడలు కనిపిస్తున్నవి. వాటిని పట్టుకొని వెళుతున్నాము. సాయంకాలం కావచ్చింది దారి కాస్త పెద్దదైంది. మరి కొన్ని కాలిబాటలు దీనిలో వచ్చి కలిసినవి. బండ్లు ప్రయాణం చేసే దోవలోకి చేరాము. ఎక్కువ దూరం పోకముందే ఒక తోట కనిపిస్తున్నది. మనుషులు గోచరిస్తున్నారు. ఒక కొండగుట్ట మరీ ఎత్తు లేదు. అక్కడి నుండి కొ దరు ఎదురు వచ్చారు. పూర్ణకుంభంతో స్వాగతం చెప్పి కంఠంలో పూలదండ వేశారు. కోయవాడు దిగ్భ్రాంతితో చూస్తున్నాడు. వారంతా నా పాదములకు నమస్కారం చేశారు. "స్వామీ! మీరాక కోసం ఎదురు చూస్తున్నాము" అంటూ వారిలో పెద్దాయన అరవై సంవత్సరాల వానివలె ఉన్నాడు. ఆయనతో ముప్ఫైయేండ్ల యువకుడు, మధ్యవయస్కులు కొందరు. స్త్రీలు - వినయంతో రావలసినదిగా ప్రార్థించారు. ముందుకు వెళ్ళిన తర్వాత పాణిపాద ప్రక్షాళనం చేసి ఆ కొండగుట్టలోని ఒక గుహలోకి ప్రవేశించాము.*
*అది పెద్ద గుహ. అందులో కాళీదేవి యొక్క విగ్రహం అద్భుతంగా అలరారుతున్నది. ఆ పెద్దాయన అమ్మవారికి హారతి యిచ్చి విధేయతతో నన్ను అచట సింహాసనం మీద ఆసీనుని చేసి విన్నవించాడు. "గురుదేవా! మీరిక్కడకు వస్తున్నారని అమ్మవారు తెలియజేశారు. ఈ గుహమీది. ఈ దేవి మీతో హిమాలయాల నుండి వచ్చినది. కాళీసిద్ధునిగా మూడు వందల సంవత్సరాలు జీవించి శరీరాన్ని విడిచి వెడుతూ నాకిక్కడి బాధ్యతలు అప్పగించారు. గత రెండు వందల సంవత్సరాలుగా నేనిక్కడ సేవచేస్తున్నాను. మా అబ్బాయి ఇప్పుడే తపస్సులో కొంత పురోగమిస్తున్నాడు. ఇక ఈ క్షణం నుండి మేమంతా మీ అజ్ఞాబద్ధులము. మీతో వచ్చిన ఈ కోయవాడు నిమిత్తమాత్రుడు. వానికి సుఖంగా జీవించటానికి కావలసినంత ధనమిచ్చి పంపిస్తున్నాము".*
*కాళీదేవిని చూస్తున్నాను. తప్పిపోయిన బిడ్డ తిరిగివస్తే తల్లి ఎలా ఉంటుందో అలా ఉన్నది కాళీమాత. ఆమె కన్నులలో ప్రేమ, కరుణ, జాలి అన్నీ భాసిస్తున్నవి. కాసేపటికి అందరూ బయటికి వెళ్ళిపోయినారు. మిగిలింది అమ్మ - నేను.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
ప్రాంజలి ప్రభ
సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
శ్రీనాథ కవి సార్వభౌముడు: సంక్షిప్త కధ
రండు ననుఁగూడి యోపరివ్రాట్టులార!
వత్సలత గల్గి మీరేల వత్తురయ్య!
పరమ నిర్భాగ్యుఁడైన నాపజ్జఁబట్టి
కటకటా! సౌఖ్యజలరాశిఁ గాశిఁబాసి.
ఆగస్త్యముని కాశీనగరాన్నివదలి వెళ్ళేసందర్భంలో శ్రీనాధుని "కాశీఖండము" నుండి.
నీకతంబునఁ గాదె లోకభీకరులైన, త్రిపుర దానవుల మర్ధింపఁ గలిగె
నీకతంబునఁ గాదె కాకోల విషవహ్ని, యలవోకయును బోలె నార్ప గలిగె
నీకతంబునఁ గాదె నిరవగ్రహస్ఫూర్తి, నంధకాదుల గర్వ మడఁపఁగలిగె
నీకతంబునఁ గాదె నేఁడు వారాణసీ, సంగమోత్సవ కేళి సలుపఁ గలిగె
నాత్మజుఁడవన్న మిత్త్రుండ వన్న భటుఁడ
వన్న సచివుండవన్న నాకెన్న నీవ
నిన్ను నెబ్భంగి వర్ణింప నేరవచ్చు?
కంఠపీఠాగ్ర కరైరాజ! డుంఠిరాజ!
శ్రీనాథ మహాకవి "కాశీఖండము" నుండి.
__(())__
కమలలోచన మనుజుఁ డొక్కటిఁదలంప
దైవమొక్కటిఁ దలఁచు టెంతయు నిజంబు
కాశిఁ బెడఁ బాయనని యేను గదలకుండఁ
గాశిఁ బెడఁబాపె దైవంబు కరుణలేక
శ్రీనాథ మహాకవి "కాశీఖండము" నుండి
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
53. షేవింగ్
ఏమిటిరా మొఖమంతా గాటులు
ఏమిలేదు నేను షేవింగ్ చేసుకొనేటప్పుడు
ఇంట్లో సమస్సలు అన్ని చెపుతుంది మా ఆవిడ
అంటే తలకా తిరిగిపోతుంది గాటులు రాక ఎమివస్థాయి
54. అంతా శూన్యం
పెద్ద విషయాలను ఆలోచించాలని అనుకోకు
ఆలోచన రావటమే పెద్ద విషయం
ఆలోచనవస్తే అంతా శూన్యం
55. రైట్
టీచెర్: ఏ ప్రస్నకు సమాధానము రైట్ గా వ్రాయలేదు ఎందుకు రాము
రాము: ఐతే ఆప్రస్నకు లెఫ్ట్ వ్రాస్తాను ఇవ్వండి
నేటి ఛందస్సు కవిత (2 ) భందముఖే
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కాలము ఏది అందముకు
గాళము ఏది పొందుటకు
గొళ్ళెము ఏది బీగముకు
గంధము ఏది భందముఖే
ఆకలి యేది పంతముకు
వాకిలి ఏది పోరులకు
రోకలి ఏది పోటుటకు
తాకిడి ఏది భందముఖే
ఆశయ మేది ఆకలికి
శాసన మేది పోషణకి
మాటయు ఏది పొంతనకి
కాలము ఏది భందముఖే
తాపము లేదు మౌనముకు
వాటము లేదు వంతెనకు
వాదము లేదు పంతముకు
భేదము లేదు భందముఖే
సాధన లేదు బాధ్యతకు
శోధన లేదు వేదనకు
వాదన లేదు వైద్యముకు
ఛేదన లేదు భందముఖే
సమ్మతి పొందు తప్పదులె
నమ్మిన చేదు ఒప్పునులె
కమ్మిన ఆశ ముప్పునులె
వద్దన లేను భందముఖే
నాలో నేను ... తేటగీత పద్యాలు (2 )
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నేనెవరు అనే ప్రశ్నను వేసు కుంటె
నేను శాశ్విత ముక్తుడు అనియు అన్న
ఉనికి ఏమిటో తెలియని మనసు ఖాళి
అప్పుడు మనసు తేలిక ఊహ లల్లు
మనము దేనిని అనుకుంటె అదియె గుర్తు
రామ అనుకుంటె రాముడు గుర్తు కొచ్చు
కృష్ణ అనుకుంటె గీతయు గుర్తు కొచ్చు
సృష్టి లోని త త్వాలకు ఇదియె గుర్తు
నియమితము గాను ఆహారములను తీస్కొ
నియమ అభ్యాస ముమనిషి శుద్ధియగును
ప్రాణ వృత్తి ప్రవృత్తియు కదిలి ఉంచు
బుద్ది వలననే పాపక్షాళనము జరుగు
భార్య భర్తకు వండి పెట్టినను తృప్తి
భర్త ఆర్జన చేసియు తృప్తి నిచ్చు
సంపదయు మనుషుల బుద్ధి మారకుండు
లోక మాయకు శ్రేయస్సు లొంగి ఉండు
--(())--
నాలో నేను .. ప్రాంజలి ప్రభ (4 )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సప్త వర్ణ సుశోభితం జీవితమ్ము
చేతి రేఖలు మారుట సహజ మేను
మనసు సౌందర్యము ను పంచు భావ ముండె
మది వివవశమౌ రీతిన బతుకు సాగె
ప్రకృతి ఒడిలోన నలిగియు ఉన్న నేను
కళలు బతికించు మార్గము తెలవ కున్న
సందడియు చేయు చున్నను ఫలిత మేది
పచ్చ పచ్చని చెట్లను పెంచు చున్న
మాయ తెలిసిన భయమేది ఉండకుండు
తెలిసి తెలియని వానికి ఉండు చుండు
లేని దాన్ని ఊహించు ట మాయ తెలుపు
మాయవల్లే గురువుల తో పనియు జరుగు
నీరు కదులుచు సంద్రము చేరు చుండు
వేరు భూమిన నీటిని త్రాగుచుండు
వారు నీటిని అమ్మిన బాధ పొందు
బుద్ధి నిలకడ నీరులా కదులు చుండు
అలల నురుగులా అజ్ఞాన ముండ కుండు
అన్య ఆలోచన అజ్ఞాన మువ్వు చుండు
ఏక మవుబుద్ధి జ్ఞానము పెంచు చుండు
వేరు వృక్షము గామారి గాలి పంచు
ఎదురు వచ్చు ప్రత్యక్ష కనులు కలుగు
ఎవరు పరోక్ష వాక్కులు వినుట వద్దు
దర్శనములేని అపరోక్ష మేను మేలు
నేను పరోక్ష ప్రత్యక్ష మధ్య నలుగు
ఒకరి కొకరుగా విలువలు పంచు కుంటు
ఒకరి వెంట తోడుగ నుండి కష్ట నష్ట
ములను సంతృప్తి గా అనుభ వించు చుండు
ఆడియె భారత సంతతి గొప్ప తనము
ఎవరికి ఎవరు తోడు అనక యె అలసి
కలసి మెలసియు ఒక్కరుగాను ఉండి
ఒడిదు డుకుల నుజయించి నిర్మలమ్ము
గాను సంతసములు తెల్పు సహన జీవి
నాలో నేను ... ప్రాంజలి ప్రభ (5 )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ధర్మ మునగాను మనసును ఇచ్చి ఉండి
ధర్మ సాక్షికి ప్రేమను పంచు చుండి
కన్య దానము కర్మను సరియు చేసి
ఇరువు రిని ఏక పరుచుట ధర్మ మౌను
భార్య భర్తను, భర్త భార్యను కలియుట
సహజ ధర్మము, విడవని భంద మున్ను
నమ్మకముగాను ఓదార్పు గాను ఉండి
సుఖము అందించి పొందుట ధర్మ మౌను
మిత్రుని కలసి సహనము చూపు చుండి
సానుకూలము చేయూత నిచ్చి యుండి
కష్ట నష్టములకు సహకార ముండి
విడువలేని భందముగాను చెలిమి ఉండు
పురుష అహమును వదలియుఁ నిత్య కర్మ
సత్పురుషుని స్వధర్మాను సరిగ ఉండి
బుద్ధి కుశలత భార్యను గౌరవించి
ఓర్పు ఓదార్పు చూపేటి చెలిమి ఉంచు
చదువు కున్నట్టి సాహిత్య సామ రస్య
ధోరణిగ సకలము విద్య బోధ చేసి
ధరణి తలముపై ధర్మము తెలియ బరచి
గురువు బాధ్యత దేశము నందు ఉండు
నాలో నేను ... ప్రాంజలి ప్రభ (6 )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పసితనం జ్ఞప్తి లేదును నిలయ మందు
బాల్య ములొ ఆట పాటలు నేర్చినాను
యవ్వనములోన ఆకర్షణ లకు లొంగి
ఏది తెలుసుకో లేనట్టి వయసు దుడుకు
నిన్ను తలవని మనసుతో జీవితమ్ము
యవ్వన దుడుకు పెళ్ళికి దారితీసె
పెళ్లితో మొదలయ్యేను సుతులు పెరిగె
నిన్ను తలవని బుద్ధిని కరుణ చూపు
చెప్పిన పలుకు నిలుపుకో హాయి గుండు
నేను మానవతాధర్మ ములను నిలిపి
ఉన్న దానితో సంసార సుఖము పంచి
వృత్తి ధర్మాన్ని అనుకరించి దయ చూపు
బిడ్డలుగ తల్లి తండ్రుల సేవచేసి
ఎట్టి బాధ కలుగకుండ చూసి యుండి
అవసరసహకా రముచేసి సహకరించి
కన్న వారిపే రుప్రతిష్టలను చూసె
అమ్మ అనుటలో ఆప్యాయత కని పించు
నాన్న అనుటలో నమ్మకము కనిపించు
తాత అనుటలో తన్మయత్వమని పించు
బామ్మ అనుటలో అభిమాన దయయు పంచు
అత్తను అనుట ఆదరణ మనసే అనిపించుఁ
మామను మనుట లోననే మమకార ముకని పించు
అన్న అనుటలో అభయము ఆదర్శ మనుటయేను
చెల్లికి చేయూత ఇచ్చుట అనుటలో చులకనొద్దు
అక్కను అనుట లోననే అనురాగ మనిపించు
బావలో భావ మనుటలో ప్రేమత్వ ము కనిపించు
మరదలు అనుట మర్యాదలు కనిపించు
మరిది అనుటలో మానవత్వముయు చూపు
విద్య చోరులు దోచుకో లేని దగును
విద్య రాజ్యాల పాలన చూపు దగును
విద్య పంచుకో లేనిస్థిర మగు ఆస్తి
విద్య ప్రయాణ బరువుగ ఉండ నిదియు
విద్య క్రమక్రమముగాను పెరుగు ధనము
విద్య పంచిన కొద్దియు పెరుగు ధనము
విద్య తరిగేది కాఁదుపెరుగుచు ఉండు
విద్య నాటికీ నేటికీ బలము పెంచు
--(())--
No comments:
Post a Comment