Thursday 12 November 2020

16-11-

 _*కార్తీకపురాణం - 1 వ అధ్యాయం*_

*కార్తీక మాసం మహత్యం*

ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… *”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను , వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత , కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..”* అని కోరారు.

శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… *”ఓ మునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు , పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో , పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి”* అని చెప్పసాగాడు.

పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో *”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి , మానవులంతా కులమత తారతమ్యం లేకుండా , వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి”* అని కోరింది.

అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు *”దేవీ ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….”* అని ఆ దిశగా చూపించాడు.

మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి , ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు *”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను , నా శరీరం , నా దేశం , ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి ?”* అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు *”జనక మహారాజ ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన , సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను”* అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.

దీనికి జనకుడు *”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ , ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ? ఈ నెల గొప్పదనమేమిటి ? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా ?”* అని ప్రార్థించారు.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి *”రాజ ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ , పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….”* అని చెప్పసాగాడు.

*కార్తీక వ్రతవిధానం*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*”ఓ జనక మహారాజా ! ఎవరైనా , ఏ వయసువారైనా పేద - ధనిక , తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి , కాలకృత్యాలు తీర్చుకుని , స్నానమాచరించి , దానధర్మాలు , దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన , శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి”* అని వివరించారు.

వ్రతవిధానం గురించి చెబుతూ… *”ఓ రాజా ! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి , కాలకృత్యాలు తీర్చుకుని , నదికిపోయి , స్నానమాచరించి గంగకు , శ్రీమన్నారయణ , పరమేశ్వరులకు , బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి , సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి , పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా , గోదావరి , కృష్ణ , కావేరీ , తుంగభద్ర , యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని , శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి , నిత్యధూప , దీప , నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి , భగవంతునికి సమర్పించి , తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి , వారికి ప్రసాదం పెట్టి , తన ఇంటివద్దగానీ , దేవాలయంలోగానీ , రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి , శివాలయంలోగానీ , విష్ణు ఆలయంలోగానీ , తులసికోట వద్దగానీ , దీపారాధన చేసి , శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి , స్వామికి నివేదించాలి. అందరికీ పంచి , తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు , మగవారు గతంలో , గతజన్మలో చేసిన పాపాలు , ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు , వీలు పడనివారు వ్రతాన్ని చూసినా , వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.

*ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం.*


🕉🌞🌎🌙🌟🚩

[16/11, 06:35] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 550  / Bhagavad-Gita - 550 🌹*

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 17  🌴*


17.  ఆత్మసమ్భావితా: స్తబ్ధా ధనమానమదాన్వితా: |

యజన్తే నామయఙ్ఞైస్తే దమ్భేనావిధిపూర్వకమ్ ||


🌷. తాత్పర్యం : 

ధనము మరియు మిథ్యాహంకారములచే మోహితులై కృతార్థులమని భావించుచు, సదా గర్వితులై వారు కొన్నిమార్లు విధి, నియమములను పాటింపకనే దంభముతో నామకార్థము యజ్ఞముల నొనరింతురు


🌷. భాష్యము  :


🌹 🌹 🌹 🌹 🌹


[16/11, 06:35] +91 98494 71690: *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 110, 111 / Vishnu Sahasranama Contemplation - 110, 111 🌹*

📚. ప్రసాద్ భరద్వాజ 


*🌻110. అమోఘః, अमोघः, Amoghaḥ🌻*


*ఓం అమోఘాయ నమః | ॐ अमोघाय नमः | OM Amoghāya namaḥ*


మోఘః న భవతి మోఘము అనగా వ్యర్థము. మోఘము కాని వాడు అమోఘః. పూజించబడువాడును, స్తుతించబడువాడును, లెస్సగా స్మరించబడువాడును అగుచు, పూజించిన, స్తుతించిన, సంస్మరించిన వారికి సర్వ ఫలములు ఇచ్చును. భక్తుల పూజను, స్తుతిని, సంస్మరణమును వ్యర్థము కానీయడు కావున అమోఘుడు.


లేదా సత్యః (సంకల్పః) యస్య సః సత్యమగు సంకల్పము ఎవనికి కలదో అట్టి వాడూ అమోఘుడు.


:: ఛాందోగ్యోపనిషత్ - అష్టమ ప్రపాఠకః, సప్తమః ఖండః ::


య ఆత్మాఽపహతపాప్మా విజరో విమృత్యుర్విశోకో విజిఘత్సోఽపిపాస స్సత్య కామ స్సత్యసఙ్కల్ప స్సోఽన్వేష్ట వ్యస్స విజిజ్ఞాసితవ్య స్స సర్వాంశ్చ లోకా నా ప్నోతి సర్వాంశ్చ కామా న్య స్తమాత్మాన మనువిద్య విజానాతీతి హ ప్రజాపతి రువాచ ॥ 1 ॥


ఆత్మ పాపరహితమైనది, ముసలితనము లేనిది, మరణము లేనిది, దుఃఖము లేనిది, ఆకలి దప్పికలు లేనిది. ఆయాత్మ సత్యకామమును, సత్య సంకల్పమును అయియున్నది. ఇట్టి ఆత్మను శ్రద్ధగా వెదకి తెలిసికొనవలెను. ఈ రీతిగా తెలిసికొన్నవాడు అన్ని లోకములను, అన్ని కోరికలను పొందుచున్నాడని ప్రజాపతి చెప్పెను.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 111 / Vishnu Sahasranama Contemplation - 111🌹*

📚. ప్రసాద్ భరద్వాజ 


*🌻111. పుణ్డరీకాక్షః, पुण्डरीकाक्षः, Puṇḍarīkākṣaḥ🌻*


*ఓం పుణ్డరీకాక్షాయ నమః | ॐ पुण्डरीकाक्षाय नमः | OM Puṇḍarīkākṣāya namaḥ*


పుండరీకం హృదయ మధ్యస్థం అశ్నుతే ఇతి హృదయ మధ్యస్థమగు పుండరీకమును అనగా పద్మమును చేరియుండువాడు. ఏ కమలము పుర మధ్యమునందు కలదో అనగా ఈ శరీరమనే పురముయొక్క మధ్యమునందున్న హృదయమును - పరమాత్ముడు ఉపాస్యుడుగా చేరియున్నాడని శ్రుతి తెలియజేయుచున్నది 'యత్పుండరీకం పురమధ్యసంస్థం'. కావున ఆ హృదయ పద్మమునందు 'ఉపలక్షితుడు' సన్నిధి చేసినవాడుగా 'గుర్తించబడువాడు' అని అర్థము. లేదా పుండరీకే ఇవ పుండరీకాకారే ఉభే అక్షిణీ యస్య పుండరీకములు అనగా పద్మముల ఆకారము వంటి ఆకారము కల రెండు కన్నులు ఎవనికి కలవో అట్టివాడు.


:: ముణ్డకోపనిషత్ - తృతీయముణ్డకే, ప్రథమః ఖణ్డః ::

ఏషోఽణురాత్మా చేతసా వేదితవ్యోయస్మిన్ ప్రాణః పఞ్చధా సంవివేశ ।

ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా ॥ 9 ॥


ప్రాణము, ఏ దేహమునందు ఐదు ప్రాణములుగా (ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన) ప్రవేశించెనో, ఆ శరీరమునందలి హృదయము నందు అతి సూక్ష్మమైన ఈ ఆత్మ, చిత్తముచేత తెలిసికొనదగినది. పరిశుద్ధమైన చిత్తమునందు, ఈ ఆత్మ ప్రకటమగును. ప్రజలయొక్క చిత్తమంతయు, ప్రాణేంద్రియాదులతో ఈ ఆత్మ వ్యాపకముగా నున్నది.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

[16/11, 06:35] +91 98494 71690: *🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 104 🌹*


*🌻.   ఆత్మను తెలుసుకొను విధము -34 🌻*


ఈ గోళకములు ప్రత్యక్షానుభూతికి కారణమవుతున్నాయి, పనిముట్లవుతున్నాయి. అయితే, ప్రత్యక్షానుభూతి మాత్రమే సత్యమా అంటే, వాటి వెనుక ఉన్న ఇంద్రియం పనిచేయకపోయినట్లైతే నీకు ఆ ప్రత్యక్షానుభూతి కలగడం లేదు. ఊహించడం ద్వారా ఊహిస్తు ఉన్నావు. ఊహద్వారా తెలుసుకునేటటువంటి పరిజ్ఞానానికి, అనుభూతికి, పరోక్షానుభూతి అని పేరు. 


ఆ పరోక్షానుభూతి, ఈ ప్రత్యక్షానుభూతి రెండూ కలిసి సరియైనటువంటి జ్ఞానంగా ఏర్పడింది. స్వస్వరూప జ్ఞానంగా ఏర్పడింది. అప్పడు అది అపరోక్షానుభూతి. ఈ రకముగా ఎవరైతే ఇంద్రియాలు, గోళకాలు వీటిని పనిముట్లుగా ఎవరైతే చూచారో, ఎవరైతే మెదడు కూడా ఒక పనిముట్టే, దానికి ఏమీ పెద్ద విశేషమేమీ లేదు. మెదడులో ఉండే నాడీ కేంద్రములు కూడా నీకు పనిముట్లే. 


కాబట్టి, మీ మనసుకి ఇవన్నీ పనిముట్లు. ఒక్క మనసే కన్నౌతోంది, ఒక్క మనసే నోరౌతోంది, ఒక్క మనసే ముక్కౌతోంది, ఒక్క మనసే చెవౌతోంది, ఒక్క మనసే అన్ని ఇంద్రియాల రూపాలు ధరిస్తోంది. కాబట్టి, ఇంద్రియాలు ఎన్ని అంటే, ‘ఏకో ఇంద్రియః’ - ఒకటే ఇంద్రియం. అదేమిటి? మనసు.

        కానీ, మనస్సు స్వయంగా పని చేస్తుందా? దాని కంటే సూక్ష్మ తరమైనటువంటిది ఏదైనా ఉందా? అని అడిగితే ఏం జరిగిందట? ఈ ఇంద్రియాలకు, ఆ మనసుకు మధ్యలో ఏమి ఉందట? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలతో కూడినటువంటి జ్ఞానం... శబ్దాది తన్మాత్రలు. 


ఆ ఇంద్రియాలలో పనిచేస్తున్నటువంటి శబ్ద లక్షణము, స్పర్శ లక్షణము, రూప లక్షణము, రస లక్షణము. ఈ లక్షణాలు ఆ నాడీ కేంద్రాలలో ఇమిడి ఉంటాయి. అవి పని చేస్తూ, ప్రేరణ పొందుతూ, ప్రేరణ ఇస్తూ, అనుభూతి ఇస్తూ, సంవేదనలు ఇస్తూ ఉన్నాయి కాబట్టి, ఆ నాడీ కేంద్రాలు నీకు పని చేస్తున్నట్లుగా తోస్తున్నాయి. 


దానికంటే సూక్ష్మమైనది మనస్సు. ఇప్పుడు ఆ శబ్దాది విషయజ్ఞానము పని చేసేటట్లుగా, విషయెన్ద్రియాలు పనిచేసేట్టుగా వుంచేటటువంటి వ్యవస్థ మనస్సు. ఆ మనస్సు కంటే సూక్ష్మమైనటువంటిది బుద్ధి. “నిర్ణయాత్మకో బుద్ధిః, వివేచనాత్మకో మనః” - ఏవైతే విచారణ చేయడానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయో పరిశీలన చేసి, ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను, మీ ముందు ఉంచగలిగేటటువంటి శక్తి మనసుకు ఉంది.


        ఏమండీ! నేను అర్జెంటుగా తిరుమల తిరుపతికి దేవస్థానమునకు వెళ్ళి, వేంకటేశ్వరస్వామి దర్శనం చేయాలి అనుకున్నావు. రోజూ పొద్దున్నే వేంకటేశ్వర సుప్రభాతం వింటూ, వేంకటేశ్వరుని ఇలవేల్పుగా అర్చించేటటువంటి వారికి, నిజదేవతా దర్శనం విధిగా, ఆ వేంకటేశ్వరుని తిరుమల తిరుపతి దర్శించాలి అనే కాంక్ష కలిగింది. 


కాంక్ష ఏ స్థానంలో కలిగింది ఇప్పుడు. కోరిక మనస్సులో కలిగింది. కలుగగానే మనస్సు ఏం చేసింది? ఎన్నిరకాలుగా నీవు ఆ కోరికను తీర్చుకోవడానికి గల అవకాశాలన్నిటినీ, నీ కళ్ళముందు ఉంచింది. నీ మనోఫలకం మీద ఉంచింది. 


నీ మనోవీధిలో అటూ ఇటూ పరిగెడుతూ, ఆలోచనలన్నీ ఏర్పడ్డాయి. అలా వెళ్ళవచ్చు, ఇలా వెళ్ళవచ్చు, అలా క్యూ లో వెళ్ళవచ్చు, ఇలా క్యూ లో వెళ్ళవచ్చు, అన్ని గంటలు పడుతుంది, ఇన్ని గంటలు పడుతుంది, అంత సమయం పడుతుంది, ఇంత సమయం పడుతుంది, అంత కష్టం అవుతుంది, ఇంత కష్టం అవుతుంది, నడిచి వెళ్ళవచ్చు, ట్రెయిన్‌ లో వెళ్ళవచ్చు, బస్సులో వెళ్ళవచ్చు, ఎగిరి వెళ్ళవచ్చు, విమానంలో వెళ్ళవచ్చు, ఈ రకంగా ఇవన్నీ చెప్తుంది. కానీ, మనోనేత్రం ద్వారా ఆంతరిక దర్శనం ద్వారా నీ హృదయస్థానంలోనే నీవు వేంకటేశ్వర దర్శనాన్ని పొందవచ్చు అనేటటువంటి అంశాన్ని మాత్రం అది స్ఫురింపజేయదు. 


ఎందుకని అంటే, దానికి ఎప్పుడూ బయటకు తిరిగి పనిచేయడం ప్రవృత్తి మార్గం మాత్రమే ఈ మనోఫలకం మీద పనిచేస్తుంది. వీరు నివృత్తి మార్గంలోకి రావాలంటే, మనసు కంటే సూక్ష్మమైనటువంటి బుద్ధి స్థితిలోకి రావాలి. అప్పుడేమయ్యారు? ఇవన్నీ ఎందుకు? సరియైనటువంటి ధ్యాన మగ్నత చెందినట్లయితే ఆ గాఢమైన ధ్యానస్థితిలో నా హృదయంలో నేను భగవంతుణ్ణి దర్శించగలుగుతాను. 


అక్కడ వేంకటేశ్వరుడేంటి? “సర్వదేవతాం సుప్రష్ఠితం” - ఆ హృదయస్థానంలో ముప్ఫైమూడు కోట్ల మంది దేవతలున్నారు. నువ్వు ఎవ్వరిని ఆరాధిస్తే, ఆ ఆరాధనా ఫలం చేత, ఆ భక్తి విశ్వాసాల చేత, ఆ ధ్యాన బలం చేత, నీవు వారి దర్శనాన్ని అక్కడ పొందవచ్చు. స్వస్వరూప జ్ఞానం అనేటటువంటి ఆత్మసాక్షాత్కార జ్ఞానంలో ఈ బలం ఉన్నది.


కాబట్టి, ఎవరికి వారు వారి ఇష్ట దేవతా ఆరాధన చేసినప్పటికి, ఆయా ఇష్ట దేవతలు అందరూ కూడా ఆత్మయందు అంశీభూతములుగా ఉన్నారు. అటువంటి ప్రత్యగాత్మ యొక్క స్థితిని పొందాలి అనేటటువంటి లక్ష్యాన్ని మానవుడు స్వీకరించాలి. అప్పుడు ఏమైంది అంటే, ఉత్తమం తత్త్వ చింతాచ, మధ్యమం మంత్ర చింతాచ, అధమం శాస్త్ర చింతాచ, అధమాధమం తీర్ధాటనం.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 108 /  Sri Gajanan Maharaj Life History - 108 🌹*

*🌻. 20వ అధ్యాయము - 3 🌻*

ఆ ముని ఈవిషయాలన్నీ గుర్తుచేయడం లక్ష్మణును కలవరపెట్టి ఈ మనిషి ఎవరా అని అతను ఆలోచనలో పడ్డాడు. లక్ష్మణ వినయంగా అతనికి వంగి నమస్కారం చేసాడు. అతను అకస్మాత్తుగా అదృశ్యం అయ్యారు. లక్ష్మణ ఇంటికి తిరిగివచ్చి తనయొక్క సాధారణ నడవడి ప్రారంభించి, ప్రతిసంవత్సరం పుణ్యతిధి జరపడం మొదలు పెట్టాడు. 


శ్రీ మహారాజు అవధూత జైరాంఖేడ్కరును మునివస్త్రాలలో రోహిత్ గ్రామందగ్గర కలిసారు. ప్రభుత్వ రెవిన్యు అధికారి అయిన మాధవ మార్తాండ జోషీ ఒకసారి కాలంబ కాసుర్ గ్రామ భూమి సర్వేకి వచ్చాడు. అతను శ్రీగజానన్ మహారాజు భక్తుడు అవడంవల్ల, ఆరోజు గురువారం అవడంవల్ల సాయంత్రం దర్శనంకోసం షేగాం వెళ్ళలని అతనికి అనిపించింది. అందువల్ల అతను తన గుమాస్తా కుతుబుద్దీన్ను షేగాం వెళ్ళేందుకు ఎడ్లబండి తయారు చెయ్యమని చెప్పాడు. 


కుతుబుద్దీన్ వినయంగా, వాతావరణం మబ్బుగా ఉందనీ, మాన్ నది మట్టినీళ్ళతో పొంగుతోందని అన్నాడు. అతని అభ్యర్ధన విస్మరించి, జోషీ బండిలోకి ఎక్కి కుతుబుద్దీన్ ను షేగాం నడిపించమని అన్నాడు. ఆబండి నదిలో దిగాక, వాళ్ళు అది దాటకముందే, ఆబండిలోకి అకస్మాత్తుగా నీళ్ళు తోసుకువచ్చాయి. మెరుపులతో తుఫాను ప్రారంం అయి మాన్ నది వరదతో పొంగింది. పెద్దవాన, తుఫానువల్ల చెట్లు, రైతుల గుడిసెలు పెకళించ బడ్డాయి. కుతుబుద్దీన్ భయపడి అటువంటి పరిస్థితులలో తమచావు తధ్యం అని అన్నాడు. 


జోషీ కూడా భయపడి తమను ఈ వినాశనం నుండి కాపాడవలసిందిగా శ్రీ మహారాజను ప్రార్ధించాడు. చేతులు కట్టుకుని ఓగజాననా దయచేసి మమ్మల్ని రక్షించండి. మీరుతప్ప వేరే ఎవరూ మమ్మల్ని రక్షించలేరు. మునీశ్వరులు తమచేతులతోనే ఒక మునుగుతున్న ఓడను రక్షించారని పురాణాలలో చెప్పబడింది. మీరుకూడా ఒకగొప్ప యోగి, దయచేసి వచ్చి మమ్మల్ని ఈ వరదలనుండి రక్షించండి అని అన్నాడు. 


బండిలోకి నీళ్ళు చొరబడేటప్పటికి, ఎడ్లుకూడా భయపడ్డాయి, జోషీ తనగుమాస్తాను ఆకళ్ళాలు వదలి శ్రీమహారాజును సహాయతకోసం ప్రార్ధించమని అన్నాడు. అప్పడు అతను శ్రీమహారాజుతో, ఓశక్తివంతమైన మహారాజ్ మాజీవితాలు మీచేతిలో ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అన్నాడు. 


అలా అంటూ ఆఎడ్ల కళ్ళాలు విడిచిపెట్టి, ఇద్దరూ కళ్ళుమూసుకున్నారు. అప్పడు ఒక అద్భుతం ఒరిగింది. ఆబండి క్షేమంగా నదిని దాటి అవతల గట్టుమీద నిలబడింది. అదిచూసి వారిద్దరూ, శ్రీమహారాజు శక్తికి ఆనందించారు. ఆవిధంగా వాళ్ళు ఆవరదతో పొంగుతున్న నదినుండి కాపాడబడ్డారు. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


21.చెప్పులు :

భార్య: భర్తతో ఆ తెగిపొయిన చెప్పులతో వస్తున్నరేమిటండి  గుడికి

తెలివిలేని భార్య్యతో చేస్తున్న కాపురం అన్నాడు భర్త

నాకు తెలివిలేదు చెప్పండి

ఏ ముంది ఈ చెప్పులు గుడిలో వదిలేసి కొత్త చెప్పులు తెచ్చుకోవడమే కళ్ళతో

నేను ఎదీ ఈ కళ్ళతో  చూడలేకపోతున్నాను అన్నాడు రాము

ఎందుకు అట్లా అంటావు కంటి డాక్టర్ దగ్గర చుపించు కోకూడదు

అన్నాడు సోము

కళ్ళు బాగా ఉన్నాయి

మరేంటి జబ్బు

ఎదుటివారి బాగు చూడలేక పోతున్న ఈ కళ్ళతో

 

22. ఫోన్ కాల్స్

నాకు ఫోన్ కాల్స్ ఒక్క నిముషముకన్న ఎక్కువకాదు

ఆ రహస్యం ఏదో నాకు చెప్పు

ఆ ఏముంది నాకు కావలసిన నెంబరు చేసి ఈ నెంబరుకు

మీరు ఫోన్ చేయండి అని చెప్పేస్తా అంతే  ......... 


23. ప్రతిరోజూ

ప్రతి రోజూ మనం  నవ్వు కుంటు  ఉండాలి  భార్య భర్తతో

ఏముంది ప్రత్యేకత అన్నడు భర్త భార్యతో 

దు:ఖం, కోరిక, లేని రోజు  అనేది ఉండదు కాబట్టి .......

 


No comments:

Post a Comment