ఈ పత్రికలో సీస పద్యం, శ్రీ కంచి పరమాచార్య వైభవం, లొళ్లి గోల ప్రేమ నిర్వికల్ప సమాధి గురించి, నవ గ్రహముల జననము, నేటి తేటగీతి పద్యాలు ... చూపు
మల్లాప్రగడ హితబోధ (2)
కాలము నాది ఆకలియె
ఆశయ మేది లేనిదియే
చీకటి వెల్గు కానిదియు
కష్టము నష్ట పోనిదియే
ప్రేమను కోరు ప్రేమయులె
ప్రేమను పొందు బోధలులే
ప్రేరణ నాది కామకుని
వాదము నాది వామనునే
సాధ్యము నాది సాధువుని
ఆశపరంగ ఆయువునే ... ... ...
తామర కన్న తోడువులె
మల్లెల కన్న వాసనలే
జాబిలి కన్న వెన్నెలలె
మాటల కన్న మన్ననలే
తండ్రికి బిడ్డ సేవకుడే ... ... ...
సర్వసుఖాల సారముయే
సర్వభయాల భారముయు
సర్వమదీయ సాధనయే
సర్వవిధాల సోధనయు
తల్లికి బిడ్డ పోషణయే ... ... ...
పుత్తడి పంచు సౌమ్యముగ
పృథ్వి ప్రెమించు ప్రేమముగా
విద్య నెర్పుము పాఠ్యముగ
అగ్ని నిల్చును ఊర్ధముగా
తల్లియుతండ్రి భాద్యత యె ... ... ...
విద్యకు విద్య వైద్యములే
మాయకు దారి మత్తులుగ
సత్వర సేవ సత్యము గా
UIIUI - UIII - - UIIUI - UIIU
--((**))--
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు ఎం ఖర్మ, ముచ్చటగా 33 రాజధానులైనా చెయ్యొచ్చు ..
ఒక్కొక్క ప్రాంతము ప్రసిద్ధి ఆధారముగా 33 రాజధానులు చేస్తే చాలా బాగుంటుంది ఏవేవో కొన్ని పేర్లతో .... ఇప్పుడున్నది ఒకటే రాజధాని అదే "అమరావతి "
**************
ఆధ్యాత్మిక రాజధానిగా "తిరుపతి"
అందాల రాజధానిగా "అరకు"
మామిడికాయల రాజధానిగా "నూజివీడు"
కొబ్బరి కాయల రాజధానిగా "అమలాపురం"
పూతరేకుల రాజధానిగా "ఆత్రేయపురం"
కాజాల రాజధానిగా " కాకినాడ"
మడత కాజాల రాజధానిగా "తాపేశ్వరం"
తొక్కుడు లడ్డు రాజధానిగా "బందరు"
మిరపకారం రాజధానిగా "గుంటూరు"
విద్యా రాజధానిగా "విజయవాడ"
బొమ్మల రాజధానిగా "కొండపల్లి"
గిత్తల రాజధానిగా "ఒంగోలు"
కిడ్నీ వ్యాధుల రాజధానిగా "ఉద్ధానం"
జీడిపప్పు రాజధానిగా "పలాస"
కోడి పందాల రాజధానిగా " భీమవరం"
ఎడ్ల పందాల రాజధానిగా "గుడివాడ"
కరవు రాజధానిగా "అనంతపురం"
తుఫాన్ల రాజధానిగా "దివిసీమ"
క్రీస్తు రాజధానిగా "ఇడుపులపాయ"
విమానాశ్రయ రాజధానిగా "గన్నవరం"
రోజ్ మిల్క్ రాజధానిగా "రాజమహేంద్రవరం"
అరటిపళ్ల రాజధానిగా "రావులపాలెం"
హార్బర్ రాజధానిగా "విశాఖపట్నం"
నాటకాల రాజధానిగా "చిలకలూరిపేట"
ఫ్యాక్షన్ రాజధానిగా " కడప "
బెట్టింగ్ రాజధానిగా "నెల్లూరు"
కళల రాజధానిగా "కూచిపూడి"
వస్త్ర వ్యాపార రాజధానిగా "చీరాల"
చేపల రాజధానిగా "సూర్యలంక"
బెల్లం రాజధానిగా "అనకాపల్లి".
పసుపు రాజధానిగా దుగ్గిరాల
ఆంధ్ర కవిత్వ రాజధానిగా తెనాలి
మిత్రమా.. తేటగీతి.... తృప్తి...5--11--2020
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
వేడుకకు రేడు వలపన్ని నాడు ఇలలొ
ఇలలొ ఆడించు వాడును ఒకడు ఉండె
వాడు వీడునూ అందుబా టుగను లేరు
అంది నట్టిదాన్నియు పొంది తృప్తి పడుము
ఆడి ఆడక ఉండిన ఆడు వారు
వారి మాటలు చేష్టలు ఉడుకు తీరు
తీర్చు బుధ్ధియు ఉన్నను కాల మడ్డు
అంది నట్టిదాన్నియు పొంది తృప్తి పడుము
ఆడకయు తప్పదు సమయ పాలన మ్ము
ఆడుటయు నేర్పరి తనము చూపుచుండి
చులక నవ్వక మగవాడి తెలివి పెంచు
అంది నట్టి దాన్ని యు పొంది తృప్తి నడుము
నీది కాని దానికొరకు వెంట పడకు
నీది అయినను అదినీది కాదు కొంత
వరకు ఉపయోగ పడిన ను తీర్పు బట్టి
అంది నట్టి దాన్ని యు పొంది తృప్తి నడుము
ఆడు ఆడించు మాటలు నేర్పు చూపు
చూపులు వలలో చిక్కక ఆశ పడక
జీవ తానుభవము తెల్పి నిజము పలికి
అంది నట్టి దాన్ని యు పొంది తృప్తి నడుము
సీస పద్యం .... దైవాన్ని
రచన మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
భక్తుల హృదయాన ... భాధ్యతతో నుండు
వేదపఠనము తో .. వైద్య మవ్వు
నిర్మల చిత్తము ... నన్నునే నట్టుండు
ప్రసన్న వదనము ... ప్రభలు అవ్వు
సంసార బంధము ... సాద్రుస్వ భావుడు
పరమాత్మ రూపము ..నేను అవ్వు
సర్వము సాక్షిగ ...సహకార సాధువై
లోకాల్ని ఏలేటి .. లహరి నేనె
తేటగీతి
శాంతి లేనట్టి మనిషిలో ప్రశ్న నేనె
నిశ్చల మనసు లేనట్టి రోగి నేనె
జ్ఞాన మన్నది లేనట్టి మనిషి నేనె
అయిన అందర్ని ఒకటిగా చేయు నేనె
--(())--
“జగద్గురు బోధలు”
శ్రీ కంచి పరమాచార్య వైభవం
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం|
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం||
ఏది నిజమైన ఈశ్వరారాధన?
ॐॐॐॐॐॐॐॐ
పురాతనకాలమునుండి పుణ్యక్షేత్రములం దీశ్వరుని అనేకవిధాల అర్చిస్తున్నాము. వేంకటేశ్వరస్వామి హుండీలో భక్తులర్పించే ధనం మరి యే స్వామికీ లేదు. భుజాలపై కావిళ్ళతో వెళ్ళి భక్తులు పళనిస్వామిని సేవించుకుంటారు. కాశి నుండితెచ్చిన గంగాతీర్థముతో రామేశ్వరమున లింగాభిషేకం చేస్తారు. అంబళపురంలో స్వామికి పాయసం నివేదించి, భక్తుల కా ప్రసాదాన్ని పంచిపెడతారు. వైకంలో మహాదేవునకు ప్రీతిగా అన్నసంతర్పణంచేస్తారు.
వైకాట్టుఅష్టమీ పుణ్యదినాన మలబారులో గృహస్థులందరు మహాదేవ ప్రీతికై అన్నసంతర్పణలు జరుపుతారు. కేరళ భూమిలోనే మరియొక క్షేత్రములో స్వామికి తెప్పతిరునాళ్ళచే ప్రీతిఘటించుతారు. ఉప్పుటేటిలో అలా నౌకాలీల జరుపుతూ, తెడ్లువేయుటే తాళముగా స్వామిపై పాటలుపాడుతారు. తిరుపతిలోవలెనే ఎటుమానూరులోనూ స్వామికి కానుకలర్పిస్తారు. తిరుప్పలయారులో శ్రీరామునకు తుపాకీమందు ప్రేలుస్తామని భక్తులు మ్రొక్కుకుంటారు. భక్తులొక్కక్కరే ప్రేల్చే ప్రేల్పులతో ఆ పగలంతా ప్రతిధ్వనించిపోతుంది. తిరచూరులో శివలింగానికి చేసిన ఘృతాభిషేకం ఏండ్లతరబడి అలా పేరుకపోతుంది. భాగవత పురాణాన్ని సంగ్రహిస్తూ నారాయణభట్టకవి రచించిన నారాయణీయమనే గ్రంథాన్ని గురువాయూరులో స్వామి చెంత పారాయణం చేస్తారు.
ఇన్ని విధాలజరిగే ఈశ్వరసేవవల్ల మనం గ్రహించవలసిదేమిటంటే మనకు ప్రీతికరమయిన పదార్థమును భక్తితో స్వామి పాదాలచెంత నివేదిస్తే ఈశ్వరాను గ్రహంవల్ల మనకు మేలు సమకూరుతుందని, స్వధర్మానుష్ఠానం చేస్తూ మనసారా తన్ను భజించేవారి నీశ్వరుడు రక్షిస్తాడు. ''ఉద్యోగినం పురుష సింహ ముపైతి లక్ష్మీః'' అన్నారు గనుక, పురుష కారంఉండి తీరాలి. నిజమే కాని. భగవదనుగ్రహం దానికంటె గొప్పది. ఒక్కొక్క ఆలయమందు ఒక్కొక్క విధముగా ఈశ్వరాను గ్రహాన్ని అర్థిస్తాము. స్వభావస్వధర్మములందు కలిగే ప్రమాదమే మృత్యుహేతువని సనత్సుజాతీయం చెప్పుతున్నది.
కనుక స్వభావానుగుణమైన స్వధర్మాచరణమందుఏమరుపాటుతగదు. 'స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః' అని చెప్పబడింది కాబట్టి మానవుడు స్వధర్మాచరణంవల్లనే ఈశ్వరు నారాధించి కృతార్ధుడవుతాడని గ్రహించాలి. శ్రీ భగవత్పాదులు ఉపదేశపంచక మందు-
''వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం''
అన్నారు కనుక నిత్యం వేదాధ్యయనంచేస్తూ వేదవిహిత కర్మల నాచరించడం వల్లనే ఈశ్వరునకు ప్రీతి కలుగుతుంది.
''తేన ఈశస్య విధీయతా మపచితిః''
ఆచార్యులవారు అన్వయమార్గాన చెప్పిన విషయాన్నే అన్వయార్ ''వేదపారాయణము ఒక్కనాటికినీ మానకుము'' అని వ్యతిరేకమార్గాన బోధించారు.
ఈశ్వరారాధనమంటే స్వామిగుళ్ళో దీప ధూపాదులు సమర్పించుటే కాదు, స్వధర్మాన్ని ఆచరిస్తూ. దాని ఫలాన్ని ఈశ్వరున కర్పించడమే నిజమయిన ఆరాధనం. మనజీవితంలో ఒక్కొక్క దినం గడవగానే ఇలా ప్రశ్నించుకోవాలి. ఈశ్వరునకు నేడు నేనేమి అర్పించాను? స్వధర్మాన్ని ఈనాడు నే నాచరించానా? మనస్సు నివ్వాళ నిగ్రహించుకొన్నానా? నావల్ల నేడేమైనా ప్రమాదం జరిగిందా? ''నప్రమదితవ్యం'' అనే వేధవిధిని అనువర్తించానా? ''కామ్యేమతి స్త్యజ్యతాం'' అనే ఆచార్యులవారి ఉపదేశాన్ని పాటించానా? ఇలాఏనాటి కానాడు ఆత్మపరీక్ష చేసుకుంటూ క్రమంగా చిత్తశుద్ధిని సాధించాలి, అట్టి చిత్తశుద్ధితో మనం చేసే కర్మల ఫలమంతటినీ ఈశ్వర పాదాలచెంత నివేదించాలి. ఎన్ని క్షేత్రాలు సేవించినా, ఎన్ని శాస్త్రాలు పఠించినా ఇదేమనం తెలుసుకోవలసింది.
''విశ్వ ప్రేమకు బాహ్యరూపం అహింస''
తోడి మానవులనే కాదు. పశుపక్ష్యాదులను కూడా మనం ప్రేమించాలి. ప్రేమలేని బ్రతుకు ఎడారివంటిది. సర్వభూతములయందు ప్రేమచే నిండినవానిని దుఃఖములు బాధించవు. పసివాళ్ళలో ప్రేమ పొంగిపోర్లుతూవుంటుంది. వయస్సు వచ్చినకొద్దీ ఆ ప్రేమ తరిగిపోతుంది. ప్రేమఅంటే బిడ్డల ఎడ తల్లికుండే ప్రేమ ''కపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి'' అన్నారు భగవత్పాదులు. లోకంలో కుపుత్రులుంటారు గానీ, కుమాత ఉండదట. తన సౌఖ్యంకంటె బిడ్డసౌఖ్యమునే ప్రధానముగా ఎంచుకుంటుంది. తల్లి, భూతజాలముపట్ల అటువంటి ప్రేమతో వాటికి సౌకర్యం కల్పిస్తూ ఉండాలి మనం.
మొదలనేది ఉన్నప్పుడు తుది అనేది వుండనేవుంటుంది కనుక ఈప్రేమకుగూడా దుఃఖాంతం తప్పదు. మనం ప్రేమించిన జీవి మరణిస్తే మనకు దుఃఖంతప్పదు. అట్లని ప్రేమించటం మానుకుంటామా? ప్రేమను త్రుంచివేస్తామా! అలా చేయనక్కరలేదు. నాశములేని ప్రేమను అలవర్చుకోవాలి మనం. అది ఎలాగంటే అనంతుడు, అనశ్వరుడు అయిన భగవంతుని ప్రేమించాలి. భూమిపై పుట్టినవన్నీ గిట్టుతవి. ఈశ్వరుడొక్కడే శాశ్వతుడు. తక్కిన సమస్తము ఈశ్వరునివలన పుట్టి. జీవించి, మరణముచే ఈశ్వరునే పొందుచున్నవి. కనుక ఈశ్వరభక్తి యుక్తులమై, సమస్తమును ఈశ్వరుడుగచూడగలిగితే వానిపై ఈశ్వర ప్రేమవంటిప్రేమయే కుదురుతుంది. భూతజాలమంతా ఈశ్వర స్వరూపమేననీ, అతని చిచ్ఛక్తులే అంతటా ఆవరించి యున్నవనీ, కానినాడే ప్రాణియుకదలలేదనీమనం గురుతుంచుకుంటే సమస్తమును ఈశ్వర మయంగా తెలుసుకోగలుగుతాము.
ప్రకాశరహితమైన ఆకాశంపై సూర్యకాంతి పడినంతనే అది చీకటి కోనలకు వెలుగునిస్తుంది. అట్లే సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు అయిన భగవంతుని వల్లనే వస్తుజాతమునకు ఎరుక లభిస్తున్నది.
కాబట్టి మనకు కనిపించే అన్నింటినీ, అవి అదృశ్యమైనప్పుడుగూడా ఈశ్వరుని గాంచి మనం ప్రేమింపగలిగితే, ఆ ప్రేమ మనహృదయములనుండి ఏనాటికీ చెరిగిపోదు.
మనోవాక్కాయములచే అహింస నాచరించుటే ఈ విశ్వప్రేమకు బాహ్యరూపమని చెప్పాలి. అవశ్యాచరణీయమయిన ఈ అహింసకూడా అన్ని వేళల, అన్నిచోట్ల, అన్నిటి యెడల పనికిరాదు. గాంధీజీవంటి అహింసావ్రతుడు గూడ ఆబెయ్యకు బాధావిముక్తి కొరకు హింస నవలంబింప వలసి వచ్చింది. గాంధీజీని చంపినవానికి గాంధి అనుయాయులు మరణదండనం విధించవలసివచ్చింది. కుడిచెంపపై కొట్టినవానికి ఎడమచెంపనుగూడ అందింపుడని ఏసుక్రీస్తు తమశిష్యుల కుపదేశించారు. పడమటి దేశాల్లో ఆమహనీయుని అనుయాయులే నేడు రెండు యుద్ధప్రళయములు తెచ్చిపెట్టి అంతటితో తృప్తి చెందక ఒండొరులతో పోటీలుపడి ఇంకా ఘోరతరమయిన మారణాస్త్రాలు సృష్టిస్తూ సర్వనాశనానికి ఆయత్తులవుతున్నారు. వైదికములయిన యజ్ఞాలలో పశుహింసకూడదని ధ్వజమెత్తిన బుద్ధదేవునిమతస్థులే నేడు మాంసాశనులై జీవహింస కొడిగట్టుతున్నారు. దీనినిబట్టి చూడగా, అహింస ఉత్తమ ధర్మమైనప్పటికీ సర్వేసర్వత్రా అది ఆచరణీయం కాదని తేలుతున్నది.
హిందువులలో పూర్వాచారపరులు శాకాహారులే అగుట ప్రశసింపదగింది. వంగీయులు సాధారణంగా మత్స్యభుక్త్కులయినప్పటికీ అచటి పూర్వసువాసినులు శాకభక్షణమే చేస్తారు. ఏకాదశినాడు వారు ఒక్క నీటిబొట్టుకూడా పుచ్చుకోరు. దక్షిణ దేశంలోచాలమంది శాకభక్షణానికేఅలపడ్డారు. ఇచట మాంసభక్షకులుకూడా పండుగ పబ్బములందు శాకభక్షణమే చేస్తారనేది గమనించదగినది. జంతువులను హింసివలసివస్తుంది. కనుక మాంసభక్షణం నిషిద్ధమయింది. మరిశాకములను తరగటంకూడా హింసయేకదా? గింజలను తినేవారు కూడా వాటికి గర్భదళనం చేస్తున్నారు. కాబట్టి అదీ హింస క్రిందికే వస్తుంది. కనుకనే జీవహింస తగదనేవారు పండిరాలిన ఆకులనూ, పండ్లనుమాత్రమే భుజించుట వ్రతంగా పెట్టుకున్నారు. పూర్వం మనఋషులు ఫలవర్ణములను, దూడ కుడువగా మిగిలిన ఆవు పాలను మాత్రమే భుజించేవారు. అట్టి సాత్వికాహారంవల్ల కామవిజయం సులభంగా లభిస్తుంది. నేడు కుటుంబనియంత్రణకొరకు చెప్పే ఉపాయాలలోకూడా ఏదో విధమైనహింసతప్పదు. కనుక, వీటికంటే కామవిజయంకోసం యత్నించటమే మేలు.
ఫలవర్ణభక్షణం ఎవరో నియమాత్ములకేతప్ప అందరికీ సాధ్యంకాదు. తక్కినవారు సాధ్యమైనంతవరకుతక్కువహింసతో గడుపుకోవాలి. అహింసకోసం అందరూ యత్నించవలసిందే కాని, కొందరుమాత్రమే అందు కృతకృత్యులు కాగలరు. బుద్ధుడు, ఏసుక్రీస్తు, గాంధి ఈ మువ్వురు అధికారభేదం పాటింపక, అందరికీ అహింస నుపదేశించారు. హిందూధర్మం అట్లుకాక, అధికారభేదాన్ని విచారించి, సంసారాది బంధములు త్రెంచుకొన్న సన్యాసులకే దాన్ని విధించింది. గృహస్తులకు సాంఘికములైన మరియాదలు, అవసరములు ఉంటవి కనుక వారికి అహింసావ్రతం పూర్తిగా చెల్లనేరదు. హిందూమతం వారి వారి స్థితిగతులను విచారించి ధర్మోపదేశం చేస్తుంది. కనుకనే కృష్ణభగవానులు అర్జునుణ్ణి ఒక అవసరమందుయుద్ధం చేయవలసిందన్నారు. మరియొక అవసరమందు అహింసనాచ రింపలసిందన్నారు. ధర్మాధికారిదోషులకు మరణదండనాదికం విధించేటప్పుడు అది హింసగా ఎంచుకొనడు. మనకు ప్రీతిపాత్రులైనవారికైనా పిచ్చియెత్తితే సంకేళ్ళు వేస్తాము. బుద్దుడు, క్రీస్తు, గాంధి, ఈ అధికార తారతమ్యం విచారింపక అందరికీ అహింస నుపదేసించుటవల్లనే వారి యత్నములు ఫలించినవి కావు. అధికారభేదము ననుసరించి ధర్మాచరణం చేస్తూవుంటే పరమధర్మానికి హాని కలుగదు. అనవరమైన దోషములకు తావుండదు. అపరిహార్యములైన దోషములు కూడ చాలావరకు పరిహృతములవుతవి.
--(())--
ప్రాంజలి ప్రభ కవిత .. లొళ్లి గోల ప్రేమ
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
నయనాల కదలిక కనక వర్షం
పెదాల పదనిస అనంత హర్షం
నరాల కధలిక ప్రకృతి వర్షం
మాయల బతుకుకు ఒక శీర్షం
కదా బావా
పరువాల కులుకుకు కాసుల వర్షం
చిరుహాసా వలపుకు అనంత హర్షం
వరాల కదలిక జీవికి వర్షం
వేషపు నటనకు ఒక శీర్షమ్
మరదలా
ఈ 'ఊహ' నీది, నీ 'మనసు' నాది
ఈ ' నిషా' నీది, నీ 'వయసు' నాది
ఈ ' సిరి' నీది, నీ 'యశస్సు' నాది
ఈ 'భాష' నీది , నీ 'భారం ' నాది
కదా బావా
ఈ ఆట నీది , నీ వలపు నాది
ఈ పాట నీది , నీ మెరుపు నాది
ఈ కోట నీది , నీ కొలువు నాది
ఈ మాట నీది , నీ పలుకు నాది
కదా మరదలా
"రేపు " నీ మీద నా ప్రేమ
--(())--
నిర్వికల్ప సమాధి గురించి
ఇది ఒక సర్వోచ్ఛమైన అవస్థా రహిత అవస్థ. ఇచ్చట ఏ విధమైన సంకల్పములు, వికల్పములు, జ్ఞానము, అజ్ఞానము , విజ్ఞానము ఉండవు. మనో అవస్థ పూర్తిగా నష్టపోయిన పిదప ఈ అవస్థా రహిత అవస్థ ప్రాప్తం అగును. ఈ అవస్థ నుండి , ఆ యోగ భగవానుడు... నిమ్న అవస్థ అయిన సవికల్ప సమాధి స్థితికి వచ్చిన తర్వాతనే, తాను అంతకుముందు కలిగిన అనుభవమును గూర్చి తెలుసుకొనును.
నిర్వికల్ప సమాధి మాటలకు అతీతమైనది. శబ్దములతో వర్ణించుటకు వీలుకానిది. అదొక శూన్యావస్థ. అవాఙ్మానస గోచరం.
ఇటువంటి శూన్యావస్థలోనే ఈ ప్రపంచము ఉత్పన్నమగును. ఇచట శూన్యము అనగా సంపూర్ణము.
"పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే | పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ||......"
కోట్లలో ఒకానొక శ్రేష్ట యోగి ఎవరో ఈ శూన్య అవస్థ యొక్క అనుభూతి రహితమైన అనుభూతిని గూర్చి తెలుసుకొనును.
కారణమేమంటే అచ్చట అనుభూతి పొందడానికి కర్త ఉండడు. గోచరించేది ఏదియు లేదు. అనుభూతి పొందడానికి ఏది ఉండదు. ఎవరూ ఉండరు. అవస్థ కానీ అవస్థ. అవాఙ్మానస గోచరావస్త.
అటువంటి పరమ యోగి, శరీరంతో జీవించి ఉన్ననూ.... ముక్తుడే. ఆయనకు తనదంటూ ఏది ఉండదు. వారు విశ్వంతో ఉండి, విశ్వానికి అతీతంగా కూడా ఉండగలరు.
నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః | యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ ||
(భగవద్గీత)
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్ధ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాస్యామంత కాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ||
(భగవద్గీత)
ఈ పరమ శూన్యావస్థలో....
మాయ, మోహము, ద్వంద్వము, వైరము ,సుఖం, ఆనందం,దుఃఖము ఏమీ ఉండవు.
భట్టాచార్య
ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
సర్వేజనాసుఖినోభవంతు
నేటి తేటగీతి పద్యాలు ... చూపు
రచయిత :మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కనకపు నయనా లు కదలి కామ్య చూపు
పెదవులు కదలి ఆహ్లాద కామ్య చూపు
ప్రకృతి కదలి క నయనాలు చేరి చూపు
మాయ మర్మము తెలియక పిచ్చి చూపు
కులుకుతు పరువాల కనుల కైపు చూపు
వలపుల చిరుహాస తలపు మోహ చూపు
కదలిక వరాల వంపుల కదలి చూపు
నటన నడమంత్ర సిరులతో ఆశ చూపు
ఉహల మలుపు ఉయ్యాల ఊపు చూపు
తలపుల నిషాతొ వయ్యారి మత్తు చూపు
సిరుల తో కళ్ళు నెత్తిపై కెక్కి చూపు
మేలి ముసుగుతో ఓరగా కంటి చూపు
వయసు ఉడుకు పెదవికొర్కి తెల్పు చూపు
వయసు తెల్పక చిన్నారి చేష్ట చూపు
మనసు ఆశయ సాధన కొరకు చూపు
మనసు శోధన ఆరాట ఆత్ర చూపు
--(())--
pranajli prabha... sekarana
1) సూర్యుడు : శ్రీ కశ్యప బుషికి దక్షుని పుత్రికయగు అదితికిని "వివస్వంతుడు (సూర్యుడు)" జన్మెంచెను(ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ద సప్తమి)కశ్యపుని కొడుకు కనుక "కాశ్యపుడు" అని
అదితి కొడుకు కనుక "ఆదిత్యుడు" అని
అండమున మృతము లేనివాడు కనుక "మార్తాండుడు" అని నామములు వచ్చెనుసూర్యునకు సంజ్ఞాదేవికిని "వైవస్వతుడు" "యముడు" "యమున" లు జన్మించెను
సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా వెల్లి పుట్టింటికి వెల్లిపోయెను
తరువాత ఛాయకు "శని" భగవానుడు జన్మించెనుయముడు ధర్మరాజు అను నామముతో పితృలోకపాలకుడయ్యెను శని గ్రహ పదవిని పొందెను
వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు
2) చంద్రుడు : అత్రి మహర్షి అనసూయల సంతానం
అత్రి మహర్షి తపస్సు చేయుచుండగా అతని వీర్యము భూమిపై పడెను సోమరూపైన వీర్యమును బ్రహ్మ లోక హితార్థమై తన రథమెక్కించుకొని భూమి చుట్టు ఇరవైఒక్క మారలు ప్రదక్షిణలు గావించెను ఆయన తేజస్సుచే జగదాధారభూతములైన సర్వౌషదులు మొలకెత్తెను(నందన నామ సంవత్సర కార్తీక శుద్ద చతుర్థశి)సోముని బ్రహ్మ భూమికి రాజును చేసెను
3) కుజుడు : శివుని నిండి వెలువడిన తేజము పార్వతీ దేవి గ్రహించి గర్భవతి అవగా ఆమే అఆ తేజమును భరింపలేక భూదేవికి ఇచ్చెను ఆమే ఆ తేజమును ధరింపగా "కుజుడు"(అంగారకుడు) జన్మించెను(అక్షయ నామ సంవత్సరం వైశాఖ బహుళ విదియ)రుద్రుని తేజము విష్ణువు సంరక్షణ భూదేవి ఓర్పు లభించినవాడు కనుక గ్రహమండలమున స్థానమునొందెను
4) బుధుడు : సోమునకును రోహిని తారకు బుదుడు జన్మించెను(సౌమ్య నామ సంవత్సరం భాద్రపద శుద్ద ఏకాదశి)బుదునికి వైరజకిని పురూరవుడు జన్మించెను
5) బృహస్పతి : సురూప ఆంగీరసులకు "బృహస్పతి" జన్మించెను(సౌమ్య నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ద ద్వాదశి)ఇతని భార్య "తారాదేవి"
ఇతడిని దేవతలకు గురువుని చేసెను కనుక ఇతడిని
6) శుక్రుడు : భృగు ప్రజాపతికిని ఉషనలకు సంతానం
"ఉశనుడు" జన్మించెను(మన్మథ నామ సంవత్సరం శ్రావణ శుద్ద దశమి)కుచేలుని ధనమును హరించుటచే పరమేశ్వరుడు కోపించి అతడిని చంపుటకు రాగా ఉశనుడు తన యోగ శక్తితో శివుని ఉదరమున ప్రవేశించెను
పరమేశ్వరుడు అతడినొ శిశ్నము ద్వార బయటకు విడిచెను అతడు శుక్రము రూపమున విసర్జింపబడెను కనుక అతడిని "శుక్రుడు" అనెదరుఅత్యంత మహా మంత్ర శక్తిని పోందినవాడు కనుక రాక్షసులు శుక్రుడిని వారి గురువుగా పొందిరి
నాటి నుండి "శుక్రచార్యునిగా" పెరుపొందెను
గ్రహమండలమున స్థానంపొందెను
7) శని : సూర్యునికి ఛాయ దేవికిని కలిగిన సంతానమే "శని" ఇతని వృత్తాంతంము సూర్యుని వృత్తాంతమునందు చెప్పబడెను(వికారి నామ సంవత్సరం మార్గశిర కృష్ణ నవమి)ఇతడు మానవ జీవితాలలో అత్యంత ప్రభావము చూపువాడు
త్రిమూర్తుల సైతం ముప్పుతిప్పలు పెట్టినటువంటివాడు
గ్రహమండలమున స్థానం పొందెను
8) రాహువు : కశ్యప మహర్షికి సింహికకును "రాహువు" జన్మించెను
ఇతడు రాక్షల లక్షణములు కలవాడు కనుక రాక్షసునిగా పరిగణిస్తారు(రాక్షస నామ సంవత్సరం కృష్ణ చతుర్థశి)క్షీర సాగర మథనంలొ లబించిన అమృతాన్ని మహావిష్ణువు "మోహిని"అను రూపముతో పంచుతున్నపుడు రాహువు దేవతల రూపం దాల్చి అమృతమును గ్రహించెను సూర్యచంద్రులు చూసి విష్ణువుకి చెప్పగా తన చక్రముతో రాహువు తల ఖండించెను అమృత ప్రభావంతో తల మొండెము జీవముతో ఉండుటచేత పాము శరీరం అతకబడింది
9) కేతువు : విష్ణువుచే ఖండింపబడిన రాహువు శరీరముకు పాము తల తగిలించి కేతువు అని నామం పెట్టిరి
ఇతని భార్య పేరు చిత్రలేఖరాహు కేతువులు ఇరువురు గ్రహమండలమున ఛాయగ్రహములుగా గుర్తింపునొందిరి...
నవ గ్రహ దేవతల జన్మ వృత్తాంతములు చదివిన ఆపదలు తొలిగి మహా యశస్సు పొందెదరు
ఆయుష్యు ఆరోగ్యం సంకల్ప సాఫల్యము కలుగును
నవ గ్రహముల అనుగ్రహము కలిగి సర్వత్రా శుభమగును.
(అని బ్రహ్మ పురాణమందు చెప్పబడెను).
No comments:
Post a Comment