ఈ పత్రికలో నిలబడి నీళ్ళు, ధర్మసందేహాలు- సమాధానం, సిరులొసగే తేరళుందూరు ఆమరువియప్పర్, అమ్మతో మాట, నేటి కధ ఆముక్తమాల్యద!
నిలబడి నీళ్ళు త్రాగే వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి నిలబడి నీళ్ళు త్రాగే వారి మోకాళ్ళ నొప్పిని ప్రపంచంలో ఏ డాక్టర్ బాగు చేయలేడు. కాబట్టి కూర్చుని త్రాగండి
🅱️ ➕
వేగంగా తిరిగే ఫ్యాన్ గాలి క్రింద లేదా A. C.లో పడుకుంటే శరీరం పెరిగి లావై పోతారు.
🅱️ ➕
*70% నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్ళు చేసే మేలు ఏ పైన్ కిల్లర్ కూడా అంతగా చేయదు.
🅱️ ➕
*కుక్కర్లో పప్పు మెదుగు తుంది, ఉడకదు. అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తుంది.
🅱️ ➕
*అల్యుమినియం పాత్రల ప్రయోగం బ్రిటీష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలు అనారోగ్యం చేయటానికి చేసేవారు.
🅱️ ➕
*షర్బతు మరియు కొబ్బరి నీళ్ళు ఉదయం 11 గం. లోపు అమృతం వలె పనిచేస్తాయి.
🅱️ ➕
పక్షవాతం వచ్చిన వెంటనే రోగి ముక్కు👃లో దేశవాళి ఆవు నెయ్యి వేస్తే 15 నిమిషాల్లో బాగా అవుతారు
🅱️➕
*దేశవాళి ఆవు శరీరం పైన చేతి✋ తో నిమిరితే 10 రోజుల్లో బ్లడ్ ప్రెషర్ నయమౌ తుంది. పక్షవాతం రాదు.
🅱️➕
మంచి మాటలు, మంచివారికి, తమ ఇష్ట మిత్రులకు, బంధువులకు మరియు గ్రూపులో తప్పక షేర్ చేయండి. ఈ విధంగా నైనా మనం ఒకరి జీవితం రక్షించిన వారిమి అవుతాం.
😇 !!!!! ధన్యవాదములు !!!!!
ప్ర: లలితాదేవిని ఒక పటంలో ఒక సింహాసనం మీద శివునిపై కూర్చున్నట్లుగా ఆ ఆసనానికి నాలుగు కోళ్ళలో బ్రహ్మ, విష్ణువు, ఇంకా ఎవరో ఇద్దరు ఉన్నట్లుగా ఉంది. ఇందులో అంతరార్థం ఏమిటి?
జ: లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ పటానికి అంతరార్ధం కనబడుతుంది.
'పంచ బ్రహ్మాసనాసీనా', 'పంచప్రేతమంచాధీశాయినీ', 'పంచకృత్యపరాయణా'- అనే నామాలలో పై చిత్రణ ఉంది.
సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహం అనేవి పంచకృత్యాలు.
ఇవి ఒకే పరబ్రహ్మ తన శక్తివలన సాగించే పంచకృత్యాలు.
వాటి నిర్వహణకై ఆయన ధరించిన ఐదు బ్రహ్మల రూపాలు...
1. బ్రహ్మ , 2. విష్ణు, 3. రుద్ర , 4. మహేశ్వర, 5. సదాశివ.
వారిని అధిష్ఠించి ఉన్న శక్తి ఒక్కటే. ఆమె- పరాశక్తి లలితాంబిక.
"శివశ్శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభావితుం" - శక్తి లేనప్పుడు శివుడూ అశక్తుడే - అని ఆచార్యుల మాట. ఇరువురూ అవిభాజ్యులు.
ఈ పంచ కృత్యాలుగా పరబ్రహ్మశక్తి వ్యక్తమవుతుంది. అయిదు బ్రహ్మలుగానున్న పరబ్రహ్మ యొక్క అధిష్ఠాతృ శక్తి - అని తెలియజేసే దేవీ నామాలకు ఇచ్చిన చిత్రరూపమే మీరు చూసిన పటం.
--(())--
సిరులొసగే తేరళుందూరు ఆమరువియప్పర్
🔔🐄🔔
శ్రీ మహావిష్ణువు కృష్ణావతారందాల్చి గోవులను,గోకులాన్ని రక్షించినందున
ఆయనకి గోపాలుడు అనే పేరు కలిగిన విషయం అందరికీ తెలిసినదే.
కాని కృష్ణావతారానికి ముందే శ్రీమహావిష్ణువు గోపాలకునిగా జన్మించిన దివ్యస్ధలం ఒకటి వున్నది.
అదే తిరువళన్దూరు అనబడే తేరళన్దూర్.
ఒకసారి శివ కేశవులు ఇద్దరికి తమ లీలలను చూపించాలనే కోరిక పుట్టి గవ్వలాట ఆడారు. ఆ ఆటలో
గెలిచినదెవరు ,
ఓడినదెవరనే వాగ్వాదంతో తమ లీలా వినోదం మొదలెట్టారు.
పార్వతీ దేవిని తీర్పు చెప్పమన్నారు. పార్వతి సోదరప్రేమ కనపరుస్తూ
శ్రీ మహావిష్ణువు గెలిచినట్టు ప్రకటించింది.
తక్షణమే పరమశివుడు
కోపం నటించి
పార్వతి దేవిని గోవుగా జన్మించమని శాపం యిచ్చాడు.
పార్వతీ దేవి
భూలోకానికి వచ్చి గోవురూపం దాల్చింది.
ఈ పరిణామానికి దుఃఖించిన లక్ష్మి, సరస్వతులు కూడా
గోవుల రూపాలు ధరించి పార్వతికి తోడుగా భూలోకానికి వచ్చారు. తల్లి ని వదలలేకపోయిన పుత్రుడు
వినాయకుడు కూడా దూడ రూపంతో వారితో భూలోకానికి వెళ్ళాడు.
అనేక చందన వృక్షాలు గల ఒక వనంలో యీ పశువులు
మేస్తూవుండగా , శ్రీ మహావిష్ణువు
గోసంరక్షకునిగా యీ వనానికి వచ్చాడు.
అందువలన ఈ స్థలంలో వెలసిన నారాయణునికి
" గో చహర్.. ఆమరువియప్పర్ "అనే
నామం వచ్చింది.
ఆ సమయంలో ఊర్ధ్వ రధనుడు అనే రాజు తన రధంలో ఆకాశమార్గాన పయనించాడు. ఆ రధం యొక్క వేగ చలనం వలన గోవులకు తీవ్రమైన బాధ కలిగినందున కోపం వచ్చిన నారాయణుడు
తన పాదాలతో ఆ రధాన్ని భూమి లోపలకు త్రొక్కి వేశాడు. ఆవిధంగా రధం
త్రొక్కివేయబడిన ఊరు అయినందున తేరళుందూరు అనే పేరు ఆ ఊరికి కలిగిందని
స్ధలపురాణం తెలుపుతున్నది.
ఈ తేరళుందూరు ,నాగై జిల్లాలోని కుత్తాళమ్ సమీపానవున్నది.
ఇక్కడ సెంగమలవల్లీ తాయారు సమేతంగా
శ్రీ ఆమరువియప్పరు
కొలువై వున్నాడు.
ఈ ఆలయంలో ప్రముఖ ఆళ్వారులెందరో మంగళాశాసనాలు చేశారు.
108 వైష్ణవ దివ్యదేశాలలో 10 వ దివ్యదేశంగా, తిరుమంగై ఆళ్వారు ఇక్కడి తాయారుని కీర్తిస్తూ 42 పాశురాలను
అనుగ్రహించారు.
" తిరు" అంటే లక్ష్మీదేవి.
లక్ష్మీదేవి నివసించి అనుగ్రహం కటాక్షించిన స్ధలమవడం వలన యీ
స్ధలానికి తిరువళుందూరు అనే పేరు వచ్చింది.
తమిళ భాషలో రామాయణకావ్యాన్ని
వ్రాసిన కంబరు మహా కవియొక్క జన్మస్థలం
కూడా ఈ తిరువళన్దూరే.
దైవాంశ కలిగిన పశువులకు బాధ కలిగించిన ఊర్ధ్వరధనుడికి గో హత్యాదోషం కలిగినది.
దోష విముక్తికై , తాయారుని, గోచహర్ పెరుమాళ్ ని ప్రార్ధించి
1000 బిందెల వెన్నతో పూజించాడు.
దేవతలకే రాజైన యీ పెరుమాళ్ ని దేవాధిరాజన్ అని పిలుస్తారు.
ఈ ఐహీకానికి జ్ఞాపక చిహ్నంగా పుష్యమాసంలోని అమావాస్యనాడు , భాద్రపదమాస శనివారంనాడు వెన్న సమర్పించే
ఆచారమును ఇంకా ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ ఆలయంలోని స్వామి దర్శనానికి వచ్చిన తిరుమంగైఆళ్వారు , ఆలయ సమీపాన వున్న వారితో " స్వామి, వారి పేరు ఏమిటని అడుగగా
వారు ' దేవాధిరాజన్' అని సమాధానం
చెప్పారు .దేవాధిరాజన్ అంటే దేవేంద్రుని ఆలయమా ..అని స్వామిని దర్శించకుండా మధ్యలోనే
తిరిగి వెళ్ళిపోదామని ఆళ్వారు నిశ్చయించుకున్నారు.
కాని ఆయన అక్కడ నుండి ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేక పోయారు. తమ కాళ్ళు సంకెళ్ళతో బంధించబడినట్లు అక్కడే వుండిపోయారు.
తదుపరి , ఇదంతా పెరుమాళ్ లీలా వినోదంగా గ్రహించి
"జన్మించగానే
తమ తల్లి తండ్రుల కాలి సంకెలలను విడగొట్టిన
పెరుమాళ్ ని దర్శించకుండా , మనసారా స్తుతించకుండా వెళ్ళిపోవడం అనుచితమని
భావించి , తిరుమంగైయాళ్వారు
పెరుమాళ్ మీద స్తోత్రపాఠలు చెప్పారు.
ఈ సంఘటన జరిగినదనడానికి నిదర్శనంగా ఆలయానికి ఎదురుగా ఆళ్వారు కాళ్ళకు సంకెలలు వేసిన
ప్రాంతంలో తిరుమంగైయాళ్వారు కి
ప్రత్యేక సన్నిధి వున్నది.
ఈనాటికీ మూలవిరాట్ పూజలు జరిగిన తరువాత ఆళ్వారుకి పూజలు జరుపుతారు.
13 అడుగుల ఎత్తున ఆశ్చర్యం కలిగించే సౌందర్యంతో పూర్తిగా సాలగ్రామ విగ్రహంగా
యీ గోచహర్ పెరుమాళ్
కొలువై వున్నాడు.
గర్భగుడిలో లోహంతో చేయబడిన ఒక పెద్ద గోవు ,దూడలతో సహా దర్శనమిస్తున్నాడు.
ఆ మూల విగ్రహం ప్రక్కన ప్రహ్లాదుడు, కావేరీ నదీమతల్లి, మార్కండేయ మహర్షి, గరుడాళ్వార్
విగ్రహాలను దర్శిస్తాము.
ఇతర ఆలయాలలో మహావిష్ణువు కి ఎదురుగా దర్శన మిచ్చే
గరుడాళ్వారు , ఈ ఆలయంలో మహావిష్ణువు కి దగ్గరగా వుండడం విశేషం. ఇంద్రుడు సమర్పించిన ఇంద్ర విమానం మరో విశేషం.
మార్కండేయుడు తన ఆయుర్దాయం కోసం వేడుకొన్న ఆలయం.
సెంగమల తాయారు
వార్షికోత్సవాలను ప్రత్యేకంగా
జరపడం విశేషం.ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.
తమ తమ ఉద్యోగాలలో ఉన్నత పదవులు ఆశించే వారు, సిరిసంపదలు
కోరుకునేవారు ఈ ఆలయంలో ప్రార్ధనలు జరిపి తమ
వాంఛితాలు నెరవేర్చుకుంటారు. సెంగమలతాయారుని పూజించిన పోయిన సిరిసంపదలు తిరిగి దొరుకుతాయని భక్తులు
ధృఢంగా నమ్ముతారు.ॐ
--(())--
అమ్మతో మాట
ఏంటమ్మా ఇది..
ఎప్పుడూ ఆ ఆదిశంకరుడు, కాళిదాసు, మూకశంకరులేనా!
కొంచెం మావైపు కూడా చూడొచ్చు కదా!
“ఏమిట్రా నీ గోల! నేను మీవైపు చూడకుండానే మీరంతా పెద్దాళ్ళైపోతున్నార్రా!” అని ఉరమకు.
చూడటం అంటే అలా ఇలా చూడమని కాదు.
పామరుడిని మహాకవిని చేయడానికీ, మూగవాడితో అయిదొందల పద్యాలు చెప్పించడానికీ, నువ్వొక చూపు చూశావే! అదీ, ఆ చూపూ చూడాలి.
అమ్మా! అవడానికి అక్షరాలను పుట్టించింది మీ ఆయనే అయినా, నీ చూపు పడకపోతే అవి కదలనే కదలవేంటమ్మా!
ఆమాట కొస్తే, సర్వేశ్వరుడైన నీ మగడే, నీ అనుమతి లేనిదే ఏ పనీ చేయడు.
అప్పట్లో హాలాహలం పుట్టి లోకాలను దహించి వేస్తుంటే..
పాపం ఆ దేవతలంతా మీ ఇంటిముందు బారులు తీరి.. “కుయ్యో! మొర్రో! విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు” అని ఏడుపులు, పెడబొబ్బలూ పెడుతుంటే..,
అప్పుడు కూడా అంతటి ఆ భోళాశంకరుడూ, వెళ్ళిరానా? అన్నట్టు నీవైపు చూశాడు.
“పాపం మీ అన్నయ్య ఒక్కడే అక్కడ కష్టపడుతున్నాడు. నేను వెళ్ళి ఈ హాలాహలం సంగతేదో చూస్తే, అతను పొంగిపోతాడు” అంటూ నీ పుట్టింటి వారి మాటలు చెప్పి మరీ, నిన్ను ఒప్పించి బయల్దేరాల్సి వచ్చింది.
మరి నువ్వు భర్తను కొంగున ముడేసుకున్న “స్వాధీనవల్లభ” వు కదా!
పుట్టింటివాళ్ళ పేరు చెబితే పొంగిపోతావన్న మాట నిజమే కానీ, వాళ్ళైనా మీ ఆయన గురించి, ఒక చిన్నమాట తప్పుగా అన్నా, కళ్ళెర్ర జేస్తావు. అసలే నువ్వు సదాశివపతివ్రతవు.
కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరవు.
మీ నాన్న దక్షుడు నీ మగని కోసం నానా మాటలు అంటే, ఆ తరువాత ఏం జరిగిందో మాకు తెలియనిదా!
మీ ఆయనకు కూడా నీవంటే ఎంత ప్రేమో కదా! నువ్వు నవ్వితే ఉబ్బితబ్బిబ్బైపోతాడు ఆ కామారి.
మరి “మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా” అని ఊరికే అన్నారా ఆ వసిన్యాది దేవతలు.
నీ నవ్వులో ఉన్న మధురిమముందు ఆ చదువుల తల్లి వీణానాదమే వెలవెల బోయిందటగా. “నిజసల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ” అని వాళ్ళువీళ్ళూ చెప్పుకుంటుంటే ఈ విషయం తెలిసింది.
మా ఆది శంకరులు కూడా సౌందర్య లహరిలో “విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతేః.. ” అంటూ మొదలయ్యే ఓ శ్లోకంలో ఈ విషయాన్నే చెప్పారు.
సరస్వతీ దేవి నీ దగ్గర కూర్చొని, మీ ఆయన లీలలను తన వీణ కచ్ఛపిపై గానం చేస్తోందట. నువ్వేమో పొంగిపోయి, “భలే పాడుతున్నావ్!” అన్నావట. అసలు నీ మాటలలో ఉన్న మాధుర్యం ముందు నా వీణానాదం మరీ తీసికట్టుగా ఉందనుకుంటూ, ఆవిడా గభాలున ఆ వీణను మూటకట్టేసిందట.
ఇక్కడ ఇంకొక విషయం.. మీ ఆయనన్నా, మీ ఆయనను కీర్తించేవారన్నా నీకు ఎంతిష్టమో కదా!
“ఓ మహా కామేశ మహిషీ” అని పిలిస్తే చాలు పొంగిపోతావ్. అవున్లే అసలు ఉన్నదంటూ మీ ఇద్దరే కదా!
ఈ సృష్టి మొత్తం లయం చేసేసి, నీ మగడు ఆనంద తాడవం చేస్తుంటే.. అసలు పోలికే లేనంత అందమైన చుబుకం గల “అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా” వైన నువ్వు, నీ పల్లవముల వంటి అందమైన చేతులను అలా ఆ చుబుకం కింద పెట్టుకుని, ఆ తాండవాన్ని చూసి పరవశించిపోతూ.. “మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి”గా ఉన్నావు.
నువ్వసలే “లాస్యప్రియ”వు కూడానాయే.
ఎంతటి “మహాలావణ్య శేవధి”వి. “ఆబ్రహ్మకీటజనని”వి అయినా,
నీకు మీ ఆయన తొడమీద కూర్చుని, “శివకామేశ్వరాంకస్థా” అని అనిపించుకోవడమే ఇష్టం.
అందుకే మా కాళిదాసు
"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ” అంటూ మీ ఇద్దరి అభేదాన్ని చూపిస్తూ, నమస్కరించుకున్నాడు.
అసలు మా కాళిదాసు నీపై వ్రాసిన “దేవీ అశ్వధాటి” స్తోత్రం చదివితే తెలుస్తుందమ్మా! మా కవుల కవిత్వంలోని సొగసు.
సంగీతం ఏమాత్రం రానివాడికి కూడా తనకు సంగీతం వచ్చేసునేమో అన్న భ్రమకలిగించేంత అందంగా ఉంటుందా శ్లోకాల నడక.
చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ
కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా
పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతా
ఘోటీఖురా దధికధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతామ్
ఆహా! మొదటి శ్లోకమే ఎంత అందంగా ఉందో చూశావా?
ఇలాంటివి 13 శ్లోకాలున్నాయి ఆ స్తోత్రంలో. ఈ శ్లోకాలలో కూడా ఒకచోట నీకు మీ ఆయన మీద ఉన్న ప్రేమను రసవత్తరంగా చెప్పాడు కాళిదాసు.
“శంభా వుదార పరిరంభాంకుర త్పులక దంభానురాగ పిశునా..” అంటాడు.
మీ ఆయన నిన్ను గాఢంగా ఆలిగనం చేసుకున్నప్పుడు నీకు కలిగే పులకరింతలు నీకా పరమేశ్వరునిపై ఉన్న అపారమైన అనురాగానికి సూచికలట.
మీ ఆయన కోసమే చెప్పుకుంటూ కూర్చుంటే నీకూ, నాకూ ఇద్దరికీ ఇక ఈ లోకం పట్టదు.
కనుక కాసేపు వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం.
అమ్మా! అసలు మీ అన్న దశావతారాలను అలా నీ చేతివేళ్ళ గోళ్ళలో నుండి అలా ఎలా పుట్టించేశావమ్మా! చిత్రం కాకపోతేను.
“కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః” అన్న మాట తలచుకుంటేనే భలేగా ఉంటుంది. ఇక్కడే ఇంకొక్క విషయం చెప్పాలి. మళ్ళీ మరచిపోతానేమో!
“సాగరమేఖలా” అనే నీ పేరు కూడా నాకెంత ఇష్టమో!
సముద్రాన్నే వడ్డాణంగా పెట్టుకున్న దానివంటకదా! ఎంత బావుంటుందో తెలుసా ఈ మాట.
ఈ నీ నామాన్నే మా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు
“తేనెలతేటల మాటలతో, మన దేశ మాతనే కొలిచెదమా..” అనే ఓ చక్కని గీతంలో అందంగా వాడారు.
“సాగర మేఖల చుట్టుకొని - సురగంగ చీరగా మలచుకొని” అంటూ నీ నామాన్ని దేశమాతకు అన్వయిస్తూ వ్రాశారు.
అసలు మా సినీ కవులు కూడా నీమీద పాట రాయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెలరేగిపోతారు.
ముందుగా మాత్రం నేను మా మల్లాది రామకృష్ణశాస్త్రి గారినే చెబుతాను.
“లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ
మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ
సుమరదన విధువదన.. దేవి…” అంటూ ఆయన వ్రాస్తే,
ఆ సాహిత్యానికి మా ఘంటశాల వేంకటేశ్వర్రావు గారు బాణీ కట్టారు.
మల్లాది వారి సూచన మేరకు, ఈ పాటలో
సరస్వతీ దేవి కోసం వచ్చినప్పుడు సరస్వతి రాగంలో,
శ్రీదేవి కోసం వచ్చినప్పుడు శ్రీరాగంలో,
లలితాదేవి కోసం వచ్చినప్పుడు లలితరాగంలో స్వరరచన చేశారు మా ఘంటశాల.
ఇలాంటి పాట వింటూ నాలాంటి పామరుడే పులకించిపోతుంటే..
“కావ్యాలాప వినోదిని”వి,
“రసజ్ఞ”వు. “కావ్యకాళా” రూపిణివి అయిన నీవెంత మురిసిపోతుంటావో కదా!
ఆయనే వ్రాసిన “శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా” పాట కూడా మరో మేలిమి ముత్యం!
“జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ” అంటూ..
“అనేకకోటిబ్రహ్మాండజనని” వైన నిన్ను కీర్తిస్తూ..
“మనసే నీ వశమై స్మరణే జీవనమై
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి” అంటూ మా అందరి తరపునా ఆయనే ప్రార్థించేశారు.
ఇక సముద్రాలగారి “జననీ శివకామినీ..”, పింగళిగారి “శివశంకరీ..” పాటలు కూడా మమ్మల్ని ఆనందడోలికల్లో మునకలేయించేవే.
మా వేటూరి గారి సంగతైతే చెప్పనక్కరనే లేదు.
“అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ” అంటూ మొదలయ్యే ఆ పాట, కాళిదాసు కవిత్వంలా సొగసుగా పరుగులు తీస్తుంది.
“శుభగాత్రి గిరిరాజపుత్రి
అభినేత్రి శర్వార్ధ గాత్రి
సర్వార్థ సంధాత్రి
జగదేక జనయిత్రి” ఇలా అద్భుతంతా సాగిపోతుందా పాట.
మీ ఆయన అయిన శర్వునిలో నీవు సగభాగం కాబట్టి శర్వార్ధ గాత్రి అన్నారు. గాత్రము అంటే శరీరం అనే అర్థం ఉంది కదా! అలానే సర్వ కార్యసిద్ధిని ఇచ్చుదానవు కనుక సర్వార్థ సంధాత్రి అన్నారు. అసలు శర్వార్థ, సర్వార్థ అనే పదాలు వినడానికి కొంచెం ఒకేలా ఉన్నా, ఎంతటి భేదం ఉందో కదా వాటి మధ్య. అదీ మరి మా వేటూరంటే!
అదీ నీ కరుణ ప్రసరించిన వారి కవిత్వమంటే.
ఈరోజు నీతో ఇలా ఏవోవో చెప్పేస్తున్నాను.
అప్పట్లో శివరాత్రికి మీ ఆయనకోసం,
శ్రీరామనవమికి మీ అన్నయ్యకోసం రెండుత్తరాలు వ్రాశాను.
వాళ్ళకు వ్రాసి, మీ అందరికీ తల్లినైన నాకు మాత్రం వ్రాయవా అంటావమోనని ఈ మాటలన్నీ అరచి మరీ చెబుతున్నాను. వింటున్నావు కదా!
ఇక్కడ వంటింట్లో పని చేసుకుంటున్న మా అమ్మకు ఏదో ఒకటి చెబుతూ,
మధ్యమధ్యలో “ఇదిగో అమ్మా, వింటున్నావా? ఓ అమ్మా!!” అని అరుస్తుంటాను.
మా అమ్మేమో, ఊ! చెప్పరా” అంటుంది తన పని తాను చేసుకుంటూనే. కాకపోతే ఆవిడకు ఇక్కడ ఒకింటి పనే కాబట్టి ఇబ్బంది లేదు.
కానీ నీ సంగతి అలా కాదు కదా!
అనంతకోటి బ్రహ్మాండాలన్నింటినీ పరిపాలించే తల్లివి.
లోకాలన్నీ తన బొజ్జలో దాచుకున్న ఆ పరమశివుని భార్యవు. “సదాశివకుటుంబిని”వి.
అందుకే, కోట్లాదిమంది పిలుపులలో నా పిలుపెక్కడ వినబడదో అన్న భయం చేత, ఇంకాస్త గట్టిగా అరచి చెబుతున్నాను.
ఇదిగో అమ్మా! ఇటూ.. ఈవైపు.. నావైపు చూడు! నేనూ..
స్వస్తి!
ఈచిన్ని కధానిక ...
ఒక్కసారి చదివి చూడండి...!
***(())***
నేటి కధ ఆముక్తమాల్యద!
➖➖➖✍️️
పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతు వున్నాడు. గెలిచినరాజు ఆఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా..., అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన! యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలోతెలియక ఆరాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రతిస్తే ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు... ఓడి పోయిన రాజేనని తేలింది.
ధర్మసంకటం నుంచి గట్టెక్కించగల వాడు ఆయనేనని నిశ్చయమైంది.
గెలిచినరాజు ఏమాత్రం సందేహించ కుండా ఓడినరాజు వద్దకువెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు.
ఆయనా ఏ శషభిషలకూ.... తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం...ముందు కొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.
ఆఇద్దరురాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్నిత్యజించారు. వారి కథే...శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన.. ‘ఆముక్తమాల్యద’ లోని... ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం!
సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు... భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో, ఈ ఉదాహరణచూస్తే ఇట్టే అర్థమౌతుంది.
ఈకథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు. కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.
తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి... గురుదక్షిణగా... ఏది కావాలన్నా... ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం!
ఓడిన రాజుకు ఓర్మి ఎంతప్రధానమో గెలిచిన రాజుకు సంయమనం..., ధర్మ సంప్రదాయపరిరక్షణ అంతే అవసరం.
ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న- ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలని అడిగినా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడ తాడు.
ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుం టుంది. రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదని అంటాడు!
తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.
ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు'రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు! వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకో కూడదు! కష్టపడి సాధిస్తేనే..., వాటి విలువ తెలుస్తుంది! నా కంటే బల వంతుడి చేతిలో ఓడి పోయాను.
అందులో సిగ్గు పడాల్సింది ఏమి వుంటుంది? తిరిగి పుంజుకొని ధర్మ మార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. అది ఒప్పు తుంది గాని, దొడ్డిదారిన పొందితే... పాపమవుతుంది!’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!
ఇలాంటి కథల్ని మన పిల్లలకు... పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, ఆపిల్లల బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయ పడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి బాగా అలవరుస్తాయి.
ఆముక్తమాల్యదలోని 'ఖాండిక్య- కేశిధ్వజోపాఖ్యానం' - ఆ కావ్యానికి... గుండెకాయ వంటిదని ఎంతో ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి? ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం.
గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవ కాశాల తిరస్కరణలో... ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- మన భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది!
లోకంలో ఇలాంటి కథలు ఒళ్లు మరిపించడమే కాదు, కళ్లు తెరుచు కొనేలా చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు, ఎంతో ఆలంబన!✍️
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు
🍀🌺🍀🌺🍀 🌺🍀🌺🍀🌺🍀
[06:13, 05/11/2020] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 537 / Bhagavad-Gita - 537 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 4 🌴
04. దమ్భో దర్పో(భిమానశ్చ క్రోధ: పారుష్యమేవ చ |
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సమ్పదమాసురీమ్ ||
🌷. తాత్పర్యం :
ఓ పార్థా! గర్వము, పొగరు, దురహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానములనెడి లక్షణములు ఆసురస్వభావము కలిగినవారికి చెందినవి.
🌷. భాష్యము :
నరకమునకు రాజమార్గము ఈ శ్లోకమున వివరింపబడినది. దానవప్రవృత్తి గలవారు తాము నియమములను పాటింపకున్నను ధర్మప్రవర్తనమును, ఆధ్యాత్మికజ్ఞాన పురోగతియును ప్రదర్శనమును మాత్రము గావింతురు.
ఏదియో ఒక విద్యను లేదా అధికధనమును కలిగియున్న కారణమున వారు పొగరును, గర్వమును కలిగియుందురు. ఇతరులచే పూజింపబడవలెననియు భావింతురు. గౌరవింపబడుటకు అర్హులు కాకున్నను ఇతరులచే గౌరవము నొందగోరుదురు. అల్ప విషయముల గూర్చియు వారు క్రోధముచెంది పరుషముగా మాట్లాడుదురు. మృదువుగా వారెన్నడును పలుకరు.
ఏది చేయదగినదో ఏది చేయరానిదో వారెరుగలేరు. ఎవ్వరి ప్రామాణికత్వమును స్వీకరింపక వారు ప్రతిదియు తమ కోరిక ననుసరించి చపలముగా నొనర్తురు. ఈ ఆసురీలక్షణములను వారు తల్లిగర్భమున ఉన్న సమయము నుండియే గ్రహించియుందురు. పెరిగి పెద్దయైన కొలది వారు ఆ అశుభగుణములను ప్రదర్శించుట నారంభింతురు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 537 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 04 🌴
04. dambho darpo ’bhimānaś ca
krodhaḥ pāruṣyam eva ca
ajñānaṁ cābhijātasya
pārtha sampadam āsurīm
🌷 Translation :
Pride, arrogance, conceit, anger, harshness and ignorance – these qualities belong to those of demoniac nature, O son of Pṛthā.
🌹 Purport :
In this verse, the royal road to hell is described. The demoniac want to make a show of religion and advancement in spiritual science, although they do not follow the principles.
They are always arrogant or proud in possessing some type of education or so much wealth. They desire to be worshiped by others, and demand respectability, although they do not command respect. Over trifles they become very angry and speak harshly, not gently.
They do not know what should be done and what should not be done. They do everything whimsically, according to their own desire, and they do not recognize any authority. These demoniac qualities are taken on by them from the beginning of their bodies in the wombs of their mothers, and as they grow they manifest all these inauspicious qualities.
🌹 🌹 🌹 🌹 🌹
[06:13, 05/11/2020] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 90, 91 / Vishnu Sahasranama Contemplation - 90, 91 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 90. అహః, अहः, Ahaḥ 🌻
ఓం అహ్నే నమః | ॐ अह्ने नमः | OM Ahne namaḥ
అహః ప్రకాశ రూపత్వాద్ బ్రహ్మైవేతి సునిశ్చితః ప్రకాశవంతమగు (పగటి) కాలమునకు 'అహః' అని వ్యవహారము. పరమాత్ముడు స్వయముగా ప్రకాశస్వరూపుడును సర్వ ప్రకాశుడును కావున విష్ణుడు 'అహః' అని వ్యవహరించబడును.
:: భగవద్గీత - క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము ::
యథాప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః ।
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ॥ 34 ॥
ఓ అర్జునా! సూర్యుడొక్కడే ఈ సమస్తలోకమును ఎట్లు ప్రకాశింపజేయుచున్నాడో, అట్లే క్షేత్రజ్ఞుడగు పరమాత్మ ఈ సమస్త క్షేత్రమును ప్రకాశింపజేయుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 90🌹
📚. Prasad Bharadwaj
🌻 90. Ahaḥ 🌻
OM…
[06:13, 05/11/2020] +91 98494 71690: 🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 25 / Sri Devi Mahatyam - Durga Saptasati - 25 🌹
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 7
🌻. చండముండ వధ - 1 🌻
1-2. ఋషి పలికెను :
అంతట అతనిచేత ఆజ్ఞాపింపబడినవారై అసురులు చతురంగబల సమేతులై, ఆయుధాలు పైకెత్తి, చండముండులు ముందు నడుస్తూ బయలుదేరారు.
3. ఆ పర్వతరాజంపై ఒక గొప్ప బంగరు శిఖరంపై సింహంపై కూర్చుని చిరునగవుతో ఉన్న దేవిని వారు చూసారు.
4. ఆమెను చూసినప్పుడు కొందరు ఉత్సాహపూరితులై ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇతరులు వంపబడిన ధనుస్సులతో, ధరింపబడిన ఖడ్గాలతో ఆమెను సమీపించారు.
5. అంతట అంబిక ఆ శత్రువులపై ప్రచండ రోషపూరితయయ్యెను. ఆమె ముఖం సిరా వలె నల్లనయ్యింది.
6. బొమముడిపాటుతో భయంకరంగా ఉన్న ఆమె నొసటి నుండి హఠాత్తుగా ఘోర ముఖంతో, ఖడ్గపాశాయుధాలను ధరించి కాళికాశక్తి వెలువడింది.
7-9. విచిత్రమైన పుట్టెతలతో ఉన్న దండం దాల్చి, పుప్లైలపేరు ఆభరణంగా ధరించి, పెద్దపులిచర్మాన్ని కట్టుకొని, కండలు శుష్కించడంతో మిక్కిలి భీషణమై కనబడుతూ, తెరుచుకొని ఉన్న నోటితో, భయానకంగా వ్రేలాడు నాలుకతో, లోతుకుపోయిన ఎఱ్ఱని కన్నులతో, దిక్కులు పిక్కటిల్లే గర్జిరావాలతో ఆమె ఆ సైన్యంలోని మహాసురులపై రభసంగా పడి చంపి, ఆ సురవైరి బలాలను భక్షించివేసింది.
10. ఏనుగులను, వాటి వెంబడి వారితో, మానటీండ్రతో, స్వారి చేసే యోధులతో, ఘంటలతో సహా ఒక్క చేతితో లాగి పట్టుకొని నోట్లోకి విసరి వేసుకుంటూ ఉంది.
11. అలాగే తురగబలాన్ని, గుర్రలతో, రథంతో, సారథితో సహా నోటిలో వేసుకొని అత్యంత భయంకరంగా పళ్ళతో నమలివేసూ ఉంది.
12. ఒకణ్ణి జుట్టుపట్టి, మరొకణ్ణి మెడపట్టి లాగుకొంది. ఒకణ్ణి కాలితో తొక్కి, మరొకణ్ణి బొమ్ముతో నెట్టి సుగుజేసింది.
13. ఆ అసురులు ప్రయోగించిన శస్త్రాలను, మహాస్త్రాలను నోటితో పట్టుకొని రోషంతో పళ్ళతో నమలివేసింది.
14. దుష్టులు బలిష్ఠులు అయిన ఆ రక్కసుల సైన్యాన్నంతా, కొందరిని భక్షించి, మరికొందరిని కొట్టి, నాశమొనర్చింది.
15. కొందరు ఖడ్గంతో నరకబడ్డారు; కొందరు ఆమె ఖట్వాంగం (పుట్టెతల బెత్తం)తో కొట్టబడ్డారు. కొందరు ఆమె పంటిమొనలతో నమిలి వేయబడి నశించారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 25 🌹
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj
CHAPTER 7:
🌻 The slaying of Chanda and Munda - 1 🌻
The Rishi said:
1-2. Then at his command the asuras, fully armed, and with Chanda and Munda at their head, marched in fourfold array.
3. They saw the Devi, smiling gently, seated upon the lion on a huge golden peak of the great mountain.
4. On seeing her, some of them excited themselves and made an effort to capture her, and others approached her, with their bows bent and swords drawn.
5. Thereupon Ambika became terribly angry with those foes, and in her anger her countenance then became dark as ink.
6. Out from the surface of her forehead, fierce with frown, issued suddenly Kali of terrible countenance, armed with a sword and noose.
7-9. Bearing the strange skull-topped staff, decorated with a garland of skull, clad in a tiger's skin, very appalling owing to her emaciated flesh, with gaping mouth, fearful with her tongue lolling out, having deep-sunk reddish eyes and filling the regions of the sky with her roars, and falling upon impetuously and slaughtering the great asuras in that army, she devoured those hosts of the foes of the devas.
10. Snatching the elephants with one hand she flung them into her mouth together with their rear men and drivers and their warrior-riders and bells.
11. Taking likewise into her mouth the cavalry with the horses, and chariot with its driver, she ground them most frightfully with her teeth.
12. She seized one by the hair and another by the neck; one she crushed by the weight of the foot, and another of her body.
13. And she caught with her mouth the weapons and the great arms shot by those asuras and crunched them up with her teeth in her fury.
14. She destroyed all that host of mighty and evil-natured asuras, devoured some and battered others.
15. Some were killed with her word, some were beaten with her skull-topped staff, and other asuras met their death being ground with the edge of her teeth.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
[06:13, 05/11/2020] +91 98494 71690: 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 94 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -24 🌻
ఈ రకంగా ఒకదానికంటే మరొకటి సూక్ష్మమైనటువంటిది. ఈ విధానాన్ని మనకి ఇప్పుడు చక్కగా బోధిస్తున్నారు. ఈ నేత్ర గోళకమునకు అంతరంగముగా నేత్రేంద్రియమున్నది.
అది సూక్ష్మ్ం అన్నమాట! అటులనే ఆ నరాల వ్యవస్థ కంటే, ఇంద్రియముల కంటే, వానికి కారణమైనటువంటి, శబ్దాది తన్మాత్రలు సూక్ష్మంగా ఉంటాయి. అంటే, అర్థం ఏమిటట? ఈ నెర్వ్ సెంటర్‌ని పని చేయించడానికి, కావాల్సినటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైనటువంటి జ్ఞానం ఇది చాలా ముఖ్యం.
మాట్లాడలేనివాళ్ళకి నాలుక లేదనా? నాలుక ఉంది, మాట్లాడగలిగే శక్తి లేదు. మాట్లాడగలిగే శక్తి ఎందుకు లేదు అంటే, మాట్లాడించేటటువంటి నెర్వ్ సెంటర్, ఉత్ప్రేరకముగా పనిచేయడం లేదు. ప్రేరణకు గురవ్వడం లేదు. దాంట్లోనుంచి వ్యక్తం కావల్సినటువంటివి, వ్యక్తం కావడం లేదు. అది వెనక్కి తీసుకోబడిందన్నమాట. అది ఎక్కడికి తీసుకోబడింది అంటే, అవ్యక్తంలోకి తీసుకోబడింది.
కాబట్టి, మనకున్నటువంటి జ్ఞానేంద్రియం అని చెప్పడానికి కారణము ఏమిటంటే, ఆ వెనుకనున్నటువంటి ఇంద్రియాన్ని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైన జ్ఞానం పనిచేస్తుంది. అవి స్వయంగా పనిచేయడంలేదు. మెదడులో న్యూరాన్ సెంటర్లని పనిచేయించడానికి కావాల్సిన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం పనిచేయకపోతే అవి ఉన్నా ప్రయోజనం శూన్యమే. కాబట్టి, జ్ఞానము ఉండాలి. ఆయా వ్యవస్థా ఉండాలి. వ్యవస్థ పనితీరును వ్యక్తం చేయడానికి, కావల్సిన గోళకాలు ఉండాలి. ఇంకేం ఉండాలి?
శబ్దాది తన్మాత్మలకన్న మనస్సు సూక్ష్మమైనటువంటిది. అయ్యా! ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉంది. కానీ, దానిని పనిచేయించేటటువంటి మనస్సు అనే ఇంద్రియం సూక్ష్మమైన ఇంద్రియం పనిచేయడం లేదు అన్నాం అనుకోండి? అప్పుడేమయ్యింది? మానసిక వికలాంగులను చూశాం అనుకోండి, వాళ్ళకు అన్నీ ఉన్నాయి.
ఏం లేవు? అన్ని గోళకాలు ఉన్నాయి. అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. అన్ని వ్యవస్థలు ఉన్నాయి. అన్నీ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైన జ్ఞానము ఉన్నది. కానీ, సమన్వయ కర్త అయినటువంటి మనస్సు పనిచేయడం లేదు.
ఈ నాలుగు వ్యవస్థలని పనిచేయించేటటువంటి సమన్వయ కర్త, అనుసంధాన కర్త అయినటువంటి మనస్సు అంటే వ్యానవాయువు యొక్క ప్రభావం సరిగ్గా లేదన్నమాట. ఆ ఒక్కటి లోపించింది. ఎప్పుడైతే మనోవ్యాపారం స్తంభించి పోయిందో అప్పుడు ఏమైంది? అది అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది. కిందికి దిగి రాదన్నమాట. అప్పుడు ఇంద్రియ వికాసం కలగడం లేదు. అప్పుడు ఇంద్రియ గోళకాల వికాసం కలగడం లేదు. బుద్ధి వికాసం కలగడం లేదు.
ఏ రకమైనటువంటి వ్యాపారము, వారు చేయగలిగేటటువంటి సమర్థత లేకుండా పోయింది. కాబట్టి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు సంబంధించిన నాలెడ్జ్ ‘జ్ఞానం’ ఉండడం అవసరమే! కానీ, ఈ నాల్గింటిని, ఈ జ్ఞానాన్ని, ఆ లోపలున్న వ్యవస్థని, ఆ లోపలున్నటువంటి ఇంద్రియాలని, ఆ లోపలున్నటువంటి గోళకాలని, ఒక దానిని ఒక దానితో అనుసంధాన పరిచేటటువంటి మనస్సు అత్యంత సూక్ష్మమైనటువంటిది వీటన్నింటి కంటే!
కానీ, ఈ మనస్సు అనేటటువంటి సూక్ష్మము కన్నా, బుద్ధి సూక్ష్మమైనటువంటిది. ఇది ఏమిటండీ? అంటే, “నిశ్చయాత్మకో బుద్ధిః, వివేచనాత్మనో మనః” ఇది సూత్రం. అంటే అర్థం ఏమిటి? అటు వెళ్దామా? ఇటు వెళ్దామా? నువ్వు అటూ వెళ్ళచ్చు, ఇటూ వెళ్ళచ్చు.
రకరకాల ఆప్షన్లు ఇస్తుంది. మనకు ఏదైనా ఒక ఆలోచన పుట్టగానే, ఆ ఆలోచనని నెరవేర్చుకోవడానికి కావల్సినటువంటి అవకాశములు ఎన్ని వున్నాయి అనేటటువంటిది నీ మనస్సు ఒకదాని తర్వాత ఒక్కటి, ఒకదాని తర్వాత ఒకటి తరంగముల వలె నీ ముందు ఉంచుతూ ఉంటుంది.
మనం ఏ పనినైనా చేయాలి అనంటే, ఎన్ని రకాలుగా ఆ పనిని నెరవేర్చుకోవచ్చో, రకరకాల [abcdef] ఆప్షన్‌లన్నీ లెక్క వేస్తూ ఉంటుంది. కానీ, ‘వివేచనాత్మకో మనః’ - అయితే వివేచన చేశాం. చేస్తే ఏమైంది? ఏదో ఒక నిశ్చయం చేయాలిగా పని చేయాలి అంటే, ‘ఒకటి తినాలి’ - ఏం తినాలి?-
బీరకాయి తినచ్చు, వంకాయి తినచ్చు, కాకరకాయి తినచ్చు, ఉల్లిపాయి తినచ్చు, కానీ టమాటో తినచ్చు. ఎదురుగుండా ఆప్షన్స్ చాలా ఉన్నాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[06:13, 05/11/2020] +91 98494 71690: 🌹 Guru Geeta - Datta Vaakya - 113 🌹
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
106
Datta Guru blessed a disciple called Pingala Naga. Let’s learn the story. Pingala Naga was a great scholar and an ardent devotee of Siva. He heard about the greatness of Lord Datta and wanted to learn more from him about Lord Siva. He wanted to see Lord Datta.
When he went to Lord Datta, the situation there was very strange. Of course, the Lord knows ahead of time about the disciples coming to him. The tests for those disciples are automatically set. The tests were very strange, there were things that should not be seen, things that should not be heard and could not be understood.
Lord Datta was performing a yagna (ancient ritual of offering herbal prepa…
[06:13, 05/11/2020] +91 98494 71690: 🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 98 / Sri Gajanan Maharaj Life History - 98 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 19వ అధ్యాయము - 6 🌻
చాందూరు తాలూకాలో వార్ఖడేకు చెందిన యోగి అడకుజి, మురహకు చెందిన యోగి జింగాజి మరియు నాగపూరు తాజుద్దీన్ బాబా భక్తిమార్గం అనుసరించారు. ఈయోగులందరూ వేరువేరు ప్రవర్తనలు కలిగి ఉన్నా, దేవునిలో ఒకటవడానికి అధికారం సంపాదించారు.
ఏమార్గం అనేది విషయంకాదు, చిట్టచివరి లక్ష్యంచేరడం ప్రాముఖ్యం. పవిత్రులయిన మనుషులకు మోక్షమార్గానికి దారి చూపడానికి మేము ఈయోగి సోదరులం ఈప్రపంచంలోకి వచ్చాం.ఎవరి ఇష్టంవచ్చిన మార్గం వాళ్ళు ఎన్నుకుని చివరికి మోక్షంపొందాలి. ఇక ఎక్కువ ఏమీ అడగకు, అంతేకాక ఈవిషయాలగురించి కూడా ఎవరికీ చెప్పకు. నన్ను ఇలా పిచ్చివాడి వేషంలో శాంతిగా కూర్చోనివ్వు.
ఎవరికయితే నామీద నమ్మకం ఉందో, నేను ఎవరిని ప్రేమిస్తున్నానో వాళ్ళ కోరికలు మాత్రమే తీరుతాయి. నాకు మిగిలిన వాళ్ళ అవసరంలేదు. బ్రహ్మజ్ఞానం పశ్చాత్తాప పడేవాళ్ళకు చెప్పాలేతప్ప, నమ్మకంలేని వాళ్ళకికాదు. భగవంతుని కలవడానికి మనమార్గం మీద దృఢంగా ఉండాలి, అని శ్రీమహారాజు విశదీకరించారు.
ఈ విధంగా ఉపదేశంవిన్న బాలాభన్ ప్రేమతో ఉప్పొంగిపోయి, ఆనందభాష్పాలతో కళ్ళు కళకళలాడాయి. వర్ననాతీతమయిన రీతిలో అతని మొత్తం శరీరంఅంతా అమిత ఆనందంతో కంపించింది. మానవోద్ధారణ కోసం అవతారం ఎత్తిన షేగాం యొక్క ఈమహాయోగికి బాలాభవ్ అభివందనలు చేసాడు.
సాలూబాయి శ్రీమహారాజు యొక్క నిజమయిన భక్తురాలు. ఒకసారి శ్రీమహారాజు ఆమెతో సాలూ పిండి, పప్పు దినుసులు తీసుకుని రాత్రిపగలు వంటచేస్తూ ఉండు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తినిపిస్తూ ఉండు. ఇలా చెయ్యడంవల్ల నీవు నారాయణుడిచేత ప్రేమించబడతావు అని అన్నారు. ఆ వైజాపూరుకు చెందిన సాలూబాయి ఇప్పటికీ షేగాంలో జీవించిఉంది.
ప్రహ్లాదబువా జోషికి ఒకసారి శ్రీమహారాజు ఆశీర్వాదాలు పొందేందుకు అవకాశం వచ్చింది కానీ దురదృష్ట వశాత్తూ దానిని పోగొట్టుకున్నాడు. థాంగాం దగ్గర జాలంబ్లో తులసీరాం అనే అతను ఉండేవాడు. అతని కుమారుడు ఆత్మారాం చాలా తెలివైనవాడు. ఇతనికి వేదాలంటే ప్రత్యేకమయిన ఇష్టత కలిగి, వాటి అధ్యయనం కోసం కాశీ వెళ్ళాడు. రోజూ భగీరధి నదిలో స్నానంచెయ్యడం, భిక్షాటనచేసి వచ్చిన ఆహారం తీసుకోవడం మరియు వేదాభ్యాసానికి గురువు దగ్గరకు వెళ్ళడం ఇతని దినచర్య. దీనికి విరుద్ధంగా, చదువుకి బదులు ఇతరత్రములైన ఆనందోల్లాసాలలో సమయం వృధా చెయ్యడం అనేది ఇప్పటి విద్యార్ధుల ప్రవర్తన. ఇటువంటి ప్రవర్తనవలన వాళ్ళు ఏమయినా జ్ఞానం పొందగలరా ?
ఆత్మారాం ఆవిధమైన వాడుకాదు. తన బాధ్యత బాగా తెలిసినవాడు. తన అభ్యాసం పూర్తిచేసిన తరువాత ఇంటికి వచ్చి, మొదట తిన్నగా శ్రీమహారాజుకు అభివాదనలు తెలియ పరిచేందుకు షేగాం వెళ్ళాడు. ఆత్మారాంకు ఇప్పుడు వేదాలు తెలుసు, కానీ శ్రీమహారాజు జ్ఞానంతో వెలిగే సూర్యుడు. ఆత్మారాంతోపాటు వేద పఠనం చేసి, అవసరం అయినచోట సరిదిద్దారు. శ్రీమహారాజు ఈవిధంగా వేదాలు పఠించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Gajanan Maharaj Life History - 98 🌹
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
*🌻 Chapter 19 - part 6 🌻
Adkuji, the saint of Varkhed in Chandur Tahsil, saint Zingaji of Murha and Tajuddin Baba of Nagpur followed the ‘Bhakti Marga’. All these saints had different behaviours, but attained the authority to become one with the God. It is not the path that matters, but the ultimate reaching of the goal is important. We, all brother saints, have come to this world to guide the pious men to the path leading to Moksha.
They may follow the path of their liking and attain Moksha. Now don't ask me anything more, nor tell anything of this to others. Let me sit peacefully under the guise of madness. Only those, who have faith in me, and whom I love will get their desires fulfilled. I don't need the others. ‘Brahma gyan’ (the knowledge of Supreme Reality) should be told to the repentants, and not to non-believers.
To meet the God, we must be firm on our path. Hearing this advice, Balabhau was overwhelmed by love; his eyes brimmed with tears of joy. All his body shivered with extreme bliss, beyond the power of words to describe. Balabhau quietly paid respect to the great saint of Shegaon whose incarnation was for the sole purpose of salvation of humanity. Salubai was a sincere devotee of Shri Gajanan Maharaj .
Once Shri Gajanan Mah…
[06:13, 05/11/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 72, 73 / Sri Lalitha Chaitanya Vijnanam - 72, 73 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ‖ 28 ‖
72. 'భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా'
భండ సైన్యమును వధించుట కుద్యుక్తమైన శక్తుల విక్రమమును చూచి హర్షించుదానా అని అర్థము.
భండు డనగ జీవుడు. జీవునియందు ద్వైత వృత్తులుండును. అవియే ద్వంద్వములు. ఈ ద్వైత వృత్తులను ఆధారముగ జీవుడు సృష్టి యందు జీవనము సాగించుచుండును. రాత్రి పగలు, మంచి - చెడు, సుగుణము-దుర్గుణము, కుడి ఎడమ, ఉత్తమము-నీచము, సరి-బేసి, ఆడ-మగ, సుఖము-దుఃఖము, లాభము-నష్టము, జయము - అపజయము. ఇట్లు ద్వంద్వములు మహా సైన్యమువలె యుండి జీవుని బంధించి వేయును. జీవితము అటునిటు లాగబడుచు సాగుచుండును.
ద్వంద్వములు నశించిననేగాని, జీవునికి శాంతి లేదు. అతని యందు కూడ జీవాత్మ భావము-దేహాత్మ భావము, బుద్ధి-మనస్సు, అంతఃకరణములు - బహిఃకరణములు, పశుప్రవృత్తి-పతిప్రవృత్తిగా ద్వందములు భాసించు చుండును.
వీనిని నశింపచేయవలె నన్నచో భక్తి, జ్ఞానము, వైరాగ్యము, యోగము అను విద్యలను ఆశ్రయించవలెను. అట్లాశ్రయించినచో క్రమశః జీవుడు ద్వంద్వములను దాటగలడు. ఈ విద్యలు జీవుని ద్వంద్వములను
దాటించుచుండగ అమ్మ చూచి ఆనందించునట.
అందుచేత ద్వంద్వములను నశింపచేయు శక్తులున్నచో అమ్మకానందము. ద్వైత శక్తులకు మనస్సు కారణము. అద్వైత శక్తులకు జ్ఞానము కారణము. జ్ఞాన శక్తులే అమ్మకు ఆనంద దాయకములు. జ్ఞానము పొందుతున్న జీవులను చూచి వృద్ధిచెందుచున్న పిల్లలవలె భావించుచు అమ్మ హర్షించును. ఈ అద్వైత శక్తులను 'నకులి' శక్తులందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 72 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 72. Bhaṇḍasainya- vadhodhyukta- śakthivikrama-harṣitā भण्डसैन्य-वधोध्युक्त-शक्थिविक्रम-हर्षिता (72) 🌻
When Her śaktī-s (army) destroyed the army of the demon Bhaṇḍasurā, She was delighted.
Bhaṇḍa also means ignorant soul afflicted with duality, sainya (army) also refers to duality (identifying the self as different from the Brahman), and vadha means destruction. Lalitai is delighted when one destroys duality.
When duality is removed, it is an indication of the removal of the veil of māyā. The duality can be removed only by internal exploration with the help of mind.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 73 / Sri Lalitha Chaitanya Vijnanam - 73 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ‖ 28 ‖
🌻 73. 'నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సకా' 🌻
నిత్యాదేవి యొక్క పరాక్రమ ఆటోపమును చూచుటకు అత్యంత ఉత్సాహముతో కూడినదానా ! నిత్యాదేవి చతుర్దశి తిథి దేవతగ తెలిపితిమి. అటుపైనది పౌర్ణమియే. పౌర్ణమి తిథియనగా పూర్ణత్వమే లేక శ్రీ దేవియే. అమావాస్య నుండి చతుర్దశి వరకు చంద్రకాంతి పెరుగుచు నుండగ, పూర్ణిమ యగు అమ్మవారు, ఆ పెరుగుదలను ఉత్సాహముతో గమనించుచు నిరీక్షించి యుండును.
పదునైదు తిథులకు గల కాంతులు, పదిహేను సేనలుగ తంత్రరాజము నందు పేర్కొనిరి. ఈ సేనలు విస్తారమగు పరాక్రమము కలవిగ అందు తెలుపబడినవి. ఈ సేనలకన్నిటికిని నిత్యాదేవి నాయిక. ఈ సేనల శక్తులన్నియు ఆత్మశక్తులు. ఆత్మశక్తులు వృద్ధి పొందుచుండగ జీవుడు దైవమునకు చేరువగు చున్నాడు. అట్టి ఆత్మశక్తుల కోలాహలమును అమ్మ ప్రోత్సహించు చుండును. ఉత్సుకతతో వాని వృద్ధిని గమనించుచుండును.
నిత్య యను దేవత, సృష్టియందలి నిత్యత్వమునకు సంకేతము. అనిత్యమగు విషయముల యందు అనురక్తిని నిత్యవిషయైక జ్ఞానము ద్వారా నశింపచేసుకొన వచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 73 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 73. Nityā- pārākramāṭopa- nirīkṣaṇa- samutsukā नित्या-पाराक्रमाटोप-निरीक्षण-समुत्सुका (73) 🌻
Nitya means tithi nitya devi-s (refer nāma 71). Lalitai was happy on observing the valour of these fifteen tithi nityā devi-s during the war.
When duality is destroyed and the veil of māyā is removed, the knowledge of Brahman continues to increase over a period of time.
Spiritual progress achieved cannot be reversed that easily (though it can be reversed in exceptional circumstances). This is the secretive meaning of this nāma.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment