Thursday, 12 November 2020

 [14:07, 18/11/2020] +91 94922 72764: సామాజిక ఆరోగ్యం కోసం 


పిల్లలపై అత్యంత ప్రభావం చూపేది కుటుంబం, కుటుంబ వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తన,వారి పెంపకం.

కానీ ఈ వాస్తవాన్ని అంగీకరించేందుకు, ఆ బాధ్యతను అంగీకరించేందుకు మనం సిద్ధంగా లేము.

 ఎందుకంటే... మన పిల్లలు తప్పుదారి పట్టడానికి మనమే కారణమని అంగీకరించలేము.

 తల్లిదండ్రులందరూ తప్పు చేశారనను, చేస్తున్నారనను. పెళ్లయ్యాక పిల్లలు పుట్టడం సహజంగా జరిగే చర్య. కానీ పిల్లల పెంపకం అంత సులువుగా, సహజంగా జరిగే చర్య కాదు. 

అదో సైన్స్, ఆర్ట్. ఏ వయసులో పిల్లలు ఎలా పెరుగుతారో, ఎలా ఆలోచిస్తారో, ఎలా స్పందిస్తారో తెలియకుండానే, తెలుసుకోకుండానే పిల్లల్ని పెంచేస్తున్నాం.

ఫలితమే ఇలాంటి సమస్యలు.

మరిఈతప్పులెవరివి?

ఉదయం లేచింది మొదలు మొబైల్ లేదా ల్యాప్ టాప్ పై గడిపే తండ్రి తన కూతురు మొబైల్ ఫోన్ కు అడిక్ట్ అయ్యొందంటూ కౌన్సెలింగ్ కు తీసుకువచ్చారు. ఆ మొబైల్ కొనిచ్చిందెవరు? ఎవర్ని చూసి ఆమె మొబైల్ వాడకం నేర్చుకుంది? నువ్వు చేస్తుంది ఏంటి డాడీ అని ఆ అమ్మాయి అడిగితే ఆ తండ్రి ఏం సమాధానం చెప్తాడు?

చదువుకోసం, బంగారు భవిష్యత్తు అందించేందుకు కొడుకుని చిన్నప్పటినుంచీ ఇంటికి దూరంగా రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో చదివించిన తల్లిదండ్రులు ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన కొడుకు తమను పట్టించుకోవడంలేదని బాధపడుతూ కౌన్సెలింగ్ కు వచ్చారు. బంధాలు, అనుబంధాలకు దూరంగా మార్కులు, ర్యాంకులకు దగ్గరగా పెంచి, ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం?

కెనడాలో స్థిరపడిన ఓ భారతీయ కుటుంబం తమ కూతురు ఆల్కహాల్ కు అడిక్ట్ అయ్యిందంటూ సంప్రదించారు. కానీ తాగడం తమ దగ్గరినుంచే నేర్చుకుందనే విషయం దాచిపెడతారు. ఎవర్ని మోసం చేసేందుకు?

విజయవాడకు చెందిన ఓ వ్యాపారకుటుంబం తమ కూతురికి రోజుకు మూడు వేలు... ఎస్, రోజుకు మూడువేలు పాకెట్ మనీ ఇచ్చారు. అంత పాకెట్ మనీ ఇవ్వడం గర్వంగా ఫీలయ్యారు. ఇప్పుడదే సమస్యగా మారింది. కౌన్సెలింగ్ కు వచ్చారు. కూతురుకి రోజుకు మూడువేలిచ్చిన తండ్రి నా ఫీజు మాత్రం వెయ్యి తగ్గించి ఇచ్చాడు. దేనికి డబ్బు ఖర్చు పెట్టాలో, ఎక్కడ పొదుపుగా ఉండాలో తల్లిదండ్రులకే తెలియకపోతే ఆ పిల్లకెలా తెలుస్తుంది?

సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఒంటరితనంతో బాధపడుతున్నానంటూ సంప్రదించాడు. తన కుటుంబ సభ్యులు తన సంపాదన కోసమే చూస్తున్నారు తప్ప తనను పట్టించుకోవడంలేదని ఏడ్చేశాడు.

తిరుపతి చెందిన ఓ తండ్రి అమెరికాలో చదువుతున్న కొడుక్కి కారు కొనిపెట్టాడో తండ్రి. అతను దారితప్పి ఇండియాకు వచ్చేశాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కౌన్సెలింగ్ కు తీసుకొచ్చారు. చదువుకునే కొడుక్కి కారు ఎందుకనే ప్రశ్న తండ్రికి రాలేదు. అవసరానికి (నీడ్) ఆడంబరానికి (వాంట్) మధ్య తేడా తెలీకుండా పెంచి ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం? కొడుక్కి కారు కొనిచ్చిన తండ్రి కౌన్సెలింగ్ ఫీజు దగ్గర మాత్రం కూరగాయల బేరాలాడటం కొసమెరుపు.

ఏం_నేర్పిస్తున్నాం?

⁉️ కొడుకు ప్రాజెక్టు వర్క్ కోసం ఆపీసు నుంచి ప్రింట్లు తీసుకొచ్చే తండ్రి పరోక్షంగా అతనికి ఏం నేర్పిస్తున్నాడు?

⁉️ నచ్చిన చీర కొనుక్కుని ఆ విషయం భర్తకు చెప్పొద్దని చెప్పే తల్లి ఆ కూతురుకి ఏం నేర్పిస్తుంది?

⁉️ పిల్లల ఎదురుగా భర్త లేదా భార్యతో గొడవపడటం ద్వారా మీరేం నేర్పిస్తున్నారు?

⁉️ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నవ్వుతూ ఆహ్వానించి, వారు వెళ్లిపోగానే విమర్శించే మీనుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారో తెలుసా?

⁉️ లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిని తల్లిపై బిడ్డలకు ఏం గౌరవం ఉంటుంది?

⁉️ పిల్లలు చదువుతుండగా మీరు టీవీ చూస్తుంటే వారిపట్ల మీకేం శ్రద్ధ ఉన్నట్లు?

⁉️ పిల్లల్ని కూర్చోబెట్టుకుని జబర్దస్త్ లాంటి షోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే విలువలు ఎక్కడినుంచి వస్తాయి?

⁉️ మార్కులు, ర్యాంకుల గురించి కాకుండా ఇతర విషయాల గురించి మీరెప్పుడైనా మాట్లాడారా? వారి ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకున్నారా? అసలు వారికిష్టమైన కోర్సు చదవనిచ్చారా?

⁉️ చదువుల పేరుతో లక్షలకు లక్షలు ఖర్చుచేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన తీరులో ఆలోచించడం నేర్పిస్తున్నారా? దానికోసం రూపాయైనా ఖర్చు చేస్తున్నారా?

⁉️ అసలు పిల్లల్ని ఎలా పెంచాలో మీకు తెలుసా? అందుకోసం కనీసం ఒక్క పుస్తకమైనా కొని చదివారా? ఒక్క వీడియో అయినా చూశారా? ఒక్క క్లాసయినా విన్నారా?

⁉️ అవసరానికి, ఆడంబరానికి మధ్య ఉన్న తేడా మీ పిల్లలకు తెలిసేలా చేశారా?

⁉️ సరదాకు, విచ్చలవిడితనానికి తేడా ఏమిటో వివరించారా?

⁉️ వారి జీవితానికి వారే బాధ్యులని ఎన్నడైనా చెప్పారా?

⁉️ మీ పిల్లలు చెడిపోవడానికి మీడియా, సోషల్ మీడియా, టెక్నాలజీనే కారణమని తిడుతూ మీరు మీ బాధ్యతనుంచి తప్పించుకుంటున్నారని ఎన్నడైనా గుర్తించారా?

మీ పిల్లలు మిమ్మల్ని నిరంతరం గమనిస్తుంటారని, మిమ్మల్నే అనుసరిస్తారని, వారిపై అన్నింటికంటే మీ ప్రభావమే ఎక్కువని తెలుసుకోండి.

అన్నిటికీ సమాజాన్ని తిట్టడం మానేసి మార్పు మీనుంచి, మీ ఇంటినుంచి మొదలుపెట్టండి.

: 🌹. గీతోపనిషత్తు  - 78 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 16. కర్తవ్యము  -  సత్వగుణమున నిలచిన వానికే సంకల్పములు యుండవు, కోరికలు యుండవు. కర్తవ్యములు మాత్రమే యుండును.  కర్తవ్యము మాత్రమే నిర్వర్తించువానికి, కర్మ దగ్ధమగు చుండును. 🍀


📚. 4. జ్ఞానయోగము  - 19  📚


యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః |

జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః || 19

కర్మ నిర్వహణమునందు వ్యక్తిగతమైన సంకల్పము, కోరిక యుండుట సామాన్యము. తననుండి ఆరంభము కాకయే తన వరకు కొన్ని కర్తవ్య కర్మలు వచ్చుచుండును. అవికాక తనవైన కోరికలు కొన్ని యుండును. పండితుడు అనగా తెలిసిన వాడని యర్థము. 

తెలిసినవాడు అనగా జ్ఞాని. అతనికి కోరికలుండవు. వ్యక్తిగతములైన సంకల్పము లుండవు. రెండునూ లేక ఆచరణయే యుండును. ఇట్టివారినే పెద్దలు పండితులుగా గుర్తింతురు. రజోగుణ ప్రేరితునకు, తమోగుణ ప్రేరితునకు కోరికలు మెండుగ నుండును. తదనుగుణముగ సంకల్పములు వచ్చు చుండును. సత్వగుణమున నిలచిన వానికే సంకల్పములు యుండవు, కోరికలు యుండవు. కర్తవ్యములు మాత్రమే యుండును. 

కర్తవ్యము మాత్రమే నిర్వర్తించువానికి, కర్మ దగ్ధమగు చుండును. కోరికలున్నచోట ఫలాసక్తి యుండును. కర్మ ఫలానుభూతి మరల కర్మను కలిగించును. అవి సంకల్ప రూపమున జీవుని ప్రేరేపించును. సంకల్ప ప్రేరితుడై ఫలాసక్తితో మరల జీవుడు పనిచేయును.

ఇట్లు కోరికనుండి ఫలాసక్తి కారణముగా కర్మ పుట్టును. కర్మ కారణముగా కర్మఫలము కలుగును. కర్మఫలము నుండి నూతన సంకల్పము పుట్టును. జీవిత మంతయు “ఇది కావలెను, యిది వద్దు" అనుకొనుచు ఎడతెరపి లేక జీవించుట యుండును. అపుడు కర్మయందు చిక్కుపడును.

కర్మమంటక, అందు చిక్కుపడక, కర్మను నిర్వర్తించుటకు ఉపాయమే శ్లోకమున తెలుపబడినది. ఈ సుళువు తెలియుటకే శ్రీరాముని జీవితము, శ్రీకృష్ణుని జీవితము పఠించి, అవగాహన చేసుకొనవలెను. అందులకే రామాయణ, భారత, భాగవతములు. 


ఉదాహరణకు శ్రీరాముని జీవితమును పరిశీలింపుడు. అతడు తన కోరిక కారణముగ పుట్టలేదు. దశరథుని ప్రార్థనకు ప్రతిస్పందించి, జన్మించినాడు. వశిష్ఠుని వద్ద తండ్రి ఆజ్ఞగ విద్య నేర్చినాడు. విశ్వామిత్రునితో తండ్రి ఆజ్ఞగనే చనినాడు. తాటక సంహారము విశ్వామిత్రుని యాజ్ఞ. మిథిలానగర ప్రవేశము కూడ మహర్షి ఆదేశమే. విల్లు నెక్కు పెట్టుట మహర్షి ఆదేశము. సీతా పరిణయము జనకుని ప్రార్థన. పట్టాభిషేకము తండ్రి సంకల్పము. 


వనవాసము ప్రత్యక్షముగా సవతి తల్లి ఆజ్ఞ. పరోక్షముగా తండ్రిమాట. దండకవన ప్రవేశము ఋషుల కోరిక. ఖరదూషణ సంహారము రాక్షసుల ప్రేరణ. సుగ్రీవుని స్నేహము కబంధుని సూచన. రాక్షస సంహారము ఋషుల సూచన. సీతా లక్ష్మణులను రక్షించుకొనుట కర్తవ్యము. భరతుని అనుగ్రహించుట కర్తవ్యము. పట్టాభిషేకము భరతుని కోరిక. 


ఇట్లు జీవితమంతయు కర్తవ్యపరముగనే సాగినది గాని వ్యక్తిగతమగు కోరిక ఒక్కటియునూ లేదు. బంగారు లేడిని గూడ సీత కోరినదే గాని, తనది కాదు. జ్ఞానులెట్లు నడువవలెనో రాముని జీవితము సూటిగ తెలియజెప్పును. అట్టివారికి ఉన్న కర్మ దగ్ధమగును. కొత్త కర్మ పుట్టదు. 


దీనికి వలసిన సూత్రము కర్తవ్యాచరణము. అందు వ్యక్తిగతమగు కోరిక, సంకల్పము లేకుండుట. ఇట్లు జీవించుట అసామాన్యము. అట్లు జీవించి, యితరులకు మార్గదర్శకులై నిలచువారు ఆచార్యులు లేక సద్గురువులు లేక జ్ఞానులు. వారు జ్ఞానాగ్ని దగ్ధ కర్ములు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[19:02, 18/11/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 275 🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

65. అధ్యాయము - 20


🌻. సతి కైలాసమునకు పయనమగుట - 2 🌻


నీరేతస్సు నాల్గు బిందువులు భూమిపై పడినవి గాన, ఆకాశమునందు ప్రలయమును సృష్టించగల నాల్గు మేఘములు పుట్టును (22). వెంటనే అచట దేవతలు, ఋషులు చూచు చుండగా ఆ రేతస్సు నుండి నాల్గు మేఘములు పుట్టినవి (23). 


వత్సా! సంవర్తకము, ఆవర్తము, పుష్పకము, ద్రోణము అనే ఈ నాల్గు మహామేఘములు ప్రలయమును కలిగించును (24). ఓ మహర్షీ! అమంగళ గర్జనను చేయు ఆ మేఘములు అపుడు శివుని ఇచ్ఛచే కొద్ది జలమును వర్షించుచూ, గర్జించుచూ ఆకాశమునందు విస్తరించినవి (25).


ఆకాశమంతయూ పెద్దగా గర్జించుచున్న ఆ మేఘములచే కప్పివేయబడెను. అపుడు దాక్షాయణీ దేవి, మరియు శంకరుడు శాసింసగా వెంటనే పూర్ణమగు శాంతి నెలకొనెను (26). అపుడు నేను తొలగిన భయము కలవాడనైతిని. ఓ మహర్షీ! నేను శంకరుని ఆజ్ఞచే అపుడు మిగిలిన వివాహకర్మను పూర్తి చేయించితిని (27). 


సతీశివుల శిరస్సుపై, మరియు సర్వత్రా దేవగణములచే విడువ బడిన పుష్పవృష్టి కురిసెను. ఓ మహర్షీ! దేవతలందరు ఆనందించిరి (28). వారు వాద్యములను వాయించుచూ, పాటలను పాడిరి. భక్తితో కూడిన బ్రాహ్మణ శ్రేష్ఠులు వేదములను పఠించిరి (29).


ఓ నారదా! రంభాద్యప్సరసలు శ్రద్ధతో నాట్యము చేయుచుండగా దేవతల భార్యలు గొప్ప ఉత్సవమును చేసుకొనిరి (30). అపుడు యజ్ఞాది కర్మలకు ప్రభువగు పరమేశ్వరుడు ప్రసన్నుడై, లోకపు పోకడను ఆశ్రయించి ప్రీతితో అంజలి ఒగ్గి నాతో నిట్లనెను (31).


ఈశ్వరుడిట్లు పలికెను -


ఓ బ్రహ్మా! వివాహకర్మను అంతనూ ఆచార్యుడవగు నీవు చక్కగా నిర్వహించితివి. నేను ప్రసన్నుడనైతిని. నేను నీకు ఏ దక్షిణను ఈయవలెను? (32). నీవు దేవతలలో జ్యేష్ఠుడవు. దక్షిణను కోరుకొనుము. మహాత్మా! వెంటనే చెప్పుము. మిక్కిలి దుర్లభమైమ దక్షిణనైననూ ఈయగలను. నేను ఈయలేనిది లేనే లేదు (33).


బ్రహ్మ ఇట్లు పలికెను -


ఓ మహర్షీ! శంకరుని ఈ మాటలను విని, నేను దోసిలి యొగ్గి, అనేక పర్యాయములు ఈశునకు ప్రణమిల్లి, వినయముతో కూడిన మనస్సు గలవాడనై ఇట్లు పలికితిని (34). ఓ దేవదేవా! నీవు ప్రసన్నుడవైనచో, నేను వరమునకు అర్హుడనైన చో, ఓ మహేశ్వరా! నేను చెప్ప బోవు కార్యమును నీవు ప్రీతితో చేయుము (35). 


మహేశ్వరా! నీవు ఇదే రూపముతో ఈ వేది యందు ఇక్కడ సర్వదా ఉన్నవాడవై మానవుల పాపములను పోగొట్టి పవిత్రులను చేయుము (36). ఓ చంద్రశేఖరా! నేను ఈ వేదికకు దగ్గరలో నా ఆశ్రమమును నిర్మించుకొని నేను చేసిన ఈ పాపమును నివారించు కొనుటకై తపస్సు చేసెదను (37).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[19:02, 18/11/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 163 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. జాబాలిమహర్షి  - 3 🌻


19. పిప్పలాదమహర్షి, బ్రహ్మజ్ఞానీయిన జాబాలిని పరతత్వరహస్యాన్ని బోధించమని అడిగినప్పుడు ఆయనతో జాబాలి ఇలా చెప్పెను:


పిప్పలాదుడు: నీవు ఎవరివలన తెలుసుకున్నావు?

    

జాబాలి: సుబ్రహ్మణ్యస్వామి వలన తెలుసుకున్నాను.

    పిప్పలాదుడు: సుబ్రహ్మణ్యస్వామి ఎవరివలన తెలుసుకున్నాడు?

    

జాబాలి: ఈశ్వరుడు సర్వేశ్వరుడు అయిన ఈశానుడివలన తెలుసు కున్నాడు.

    

పిప్పలాదుడు: ఈశానుడి వలన ఏ విధంగా తెలుసుకున్నాడు?

    

జాబాలి: ఈశానోపాసనమువలన తెలుసుకున్నాడు.

    పిప్పలాదుడు: భగవన్! దయతో నాకు ఆ విషయాన్నంతా చెప్పు. అంటే నీకు ఎవరు చెప్పారో అదొక్కటే కాదు. వాళ్ళకు ఎవరు చెప్పారో అతడిగురించి కూడా చెప్పు. ఈశానుడిని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎలా ఆరాధించాడో చెప్పు.

    

జాబాలి: అట్లాగే! నీవడిగిన సకల విషయాలూ నివేదిస్తాను. పశుపతి అయిన ఈశ్వరుడు అహంకారముచేత వ్యాపించబడి ఉన్నాప్పుడు, అతడిని సంసారియైన జీవుడంటారు. ఈ జీవుడే పశువు. ఈ జీవులకు అధిపతి కాబట్టి ఈశ్వరుడిని పశుపతి అని అంటారు. 


సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అనబడేవి ఆయనయొక్క పంచకృత్యములనబడతవి. ఆ సర్వేశ్వరుడియందే అవి అన్నీ ఉన్నవి. అతడే సృష్టికర్త, లయకర్త. సర్వేశ్వరుడయిన ఆ ఈశ్వరుడినే పశుపతి అంటారు. జీవులందరికీ, అతడితో పోల్చినపుడు, పశువులనే నామం సార్థకమవుతుంది.

    

పిప్పలాదుడు: జీవులు పశువులెల్లా అవుతాయి. వానికి ఈశ్వరుడు పతి ఎట్లా అవుతాడు?

    

జాబాలి: గడ్డి తింటూ వివేకం లేక ఇతరుల చేత పనికి ప్రేరేపింపబడి అనేకమయిన కష్టాలను సహిస్తూ యజమాని చేతుల్లో పశువులు కట్టబడి (పాశబద్దులై) ఉండటంచేత పశువులనబడతవి. జీవులు సర్వేశ్వరుని మాయాజాలంచేత అట్లా ఉన్నవి. 


ఆ పశువుల యజమానివలె సర్వజ్ఞుడైన ఈశ్వరుడున్నాడు. జీవులకు ఆయనే పతి. పాబట్టే ఆయనను పశుపతి అంటారు. ఈ జీవులు పశువులనబడతవి.

    

పిప్పలాదుడు: విభూతి ఎట్లా ధరించాలి? అన్నీ వివరంగా తెలుపండి.

    

జాబాలి: ‘సద్యోజాతాది’ పంచబ్రహ్మ మంత్రములచేత భస్మమును గ్రహించి ‘అగినిరితి భస్మ’ అనే మంత్రం చేత భస్మమును అభిమంత్రించాలి. ‘మానస్తోకే తనయే’ అనే మంత్రంలో అందులో జలాన్ని కలపాలి. 


తరవాత శిరస్సు, లలాటము, వక్షము, భుజములు వీటియందు ‘త్య్రాయుషం జమదగ్నేః’ ‘త్య్రంబకం యజామహే’ అనే మంత్రములచేత అడ్డంగా మూడురేఖలు వచ్చేటట్లు విభూతి ధరించాలి. దీనిని శాంభవవ్రతము అని అంటారు. 


(శైవులందరూ కూడా జబాల్యుపనిషన్మార్గమును అనుసరిస్తారు. నిత్యమూ ఆయన చెప్పినట్లే చేస్తారు. వివిధ రుద్రాక్షధారణ అంతా కూడా అలాగే జరుగుతుంది. జాబాలి శైవ మతంలో ప్రమాణం.)


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[19:02, 18/11/2020] +91 98494 71690: 🌹. శివగీత  - 117  / The Siva-Gita - 117 🌹

 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ 


అధ్యాయము 15

🌻. భక్తి యోగము - 6 🌻


త్రేతాగ్నే స్ప్మార్తన హ్నేర్వా - శైవాగ్నే ర్వా సమాహితమ్,

భస్మాభి మంత్ర్య యో మాంతు - ప్రణ వేన ప్రపూజయేత్ 26

తస్మాత్పర తరో భక్తో - మనులోకే న విద్యతే,

శాలాగ్నే ర్దావ వహ్నేర్వా - భస్మానీ యాభి మంత్రితమ్ 27

యో విలిం పతి గాత్రాణి- సశూద్రోపి విముచ్యతే,

కుశపు ష్పైర్బిల్వదళై: - పుష్పైర్వా గిరి సంభవై: 28

యోమామర్చయతే నిత్యం - ప్రణ వేన ప్రియోహి సః,

పుష్పం ఫలం సమూలం వా -పత్రం సలీల మేవవా 29

యోదద్యా త్ప్రణ వైర్మహ్యం - తత్కోటి గునితం భవేత్,

అహింసా సత్య మస్తేయం - శౌచ మింద్రియ నిగ్రహ: 30


పాలు, నెయ్యి , తేనె, చెరుకు రసము ,మామిడి పండు రసము,  టెంకాయ నీరు, గంధము, వీటిలో దేనితో నైనను రుద్ర మంత్రములతో నన్ను అభిషేకించిన వాని కంటెను మరొకడు  నాకు ప్రియమైన వాడు లేడు.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹


🌹 The Siva-Gita - 117 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️  Ayala somayajula. 

📚. Prasad Bharadwaj


Chapter 15

🌻 Bhakthi Yoga  - 6 🌻


With the holy ash obtained from the sacrificial altar, one who worships me by uttering Pranava, there doesn't remain any second to such a devotee. Even a shudra gets liberated if he applies the holy ash obtained from the sacrificial house on his body. 


One who worships me with darbha grass, with Bilva leaves uttering Pranava he becomes my favorite one and his merits get multiplied by a factor of billion.


One who is serene, honest, truthful, loves all creatures, remains clean, is a conquerer of his senses, and studies the scriptures to attain knowledge; such a devotee becomes my loved devotee.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

[19:02, 18/11/2020] +91 98494 71690: 🌹 Seeds Of Consciousness - 227 🌹

✍️  Nisargadatta Maharaj 

 Nisargadatta Gita 

📚. Prasad Bharadwaj


🌻 76.  From non-being to being, how is it known?  By the knowledge 'I am'. Stay there in the 'I am', then you'll go back from being to non-being. 🌻


The way in is the way out, from the unmanifest to the manifest, from absence to presence, from non-being to being. How is this so? It is the knowledge 'I am', which, when it spontaneously appears, makes this possible. 


So the 'I am' is the connection or gateway in, thus it must also be the means on disconnection or the gateway out. But, for this reversal to occur you have to be in the 'I am', the feeling of the wordless 'I am' must completely engulf you, only then will you be free from its clutches and enter non-being.

🌹 🌹 🌹 🌹 🌹

[19:02, 18/11/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 102 🌹

✍️. శ్రీ బాలగోపాల్

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. మానసిక గోళము - మనోభువనము - 7 🌻


425. అయిదు, ఆరు భూమికల యందున్న (మహాపురుషుడు ) మరియు (సత్పురుషుడు ) మాత్రమే ఇతరులను తమ స్థాయికి తీసికొని పోగలరు. అట్టివారి అనుగ్రహమును పొందినవారు గొప్ప ప్రయోజకులు.


426. సూక్ష్మ ప్రపంచము నుండి నిస్సంగమును పొందిన వాడు సాధుపురుషుడు (వలీ) అగును. 


427. దర్శనము అయిదు, ఆరు భూమికలకు సంబంధించినది. 


428. అయిదవ భూమిక యందున్న వలీ (మహాపురుషుడు), సాధకునికి, తన కరుణాదృష్టిని అతనిపై సారించి, తద్వారా తనస్థితిని వానికిచ్చును.


429. భూమికలలో నున్న గురువులకు ప్రత్యక్షముగా భౌతిక సంపర్కము కావలయును.


430. మానసిక భూమికలలో ఈ మనస్సే, ఈశ్వరుడుగను జ్ఞానాపూర్వకముగను ఉపయోగ పడుచున్నప్పుడు, ప్రాణశక్తి, పరోక్షముగను స్పృహ లేకను ఉపయోగ పడుచుండును. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[19:02, 18/11/2020] +91 98494 71690: 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 66  / Sri Vishnu Sahasra Namavali - 66 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ 


🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷


అనూరాధ నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం


🌻 66. స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః |

విజితాత్మాఽవిధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్నసంశయః ‖ 66 ‖ 🌻


🍀  615) స్వక్ష: - 

చక్కని కన్నులు కలవాడు.


🍀 616) స్వంగ: - 

చక్కని అంగములు కలవాడు.


🍀 617) శతానంద: - 

అసంఖ్యాకమైన ఉపాధుల ద్వారా ఆనందించువాడు.


🍀 618) నంది: - 

పరమానంద స్వరూపుడు.


🍀 619) జ్యోతిర్గణేశ్వర: - 

జ్యోతిర్గణములకు ప్రభువు.


🍀 620) విజితాత్మ - 

మనస్సును జయించువాడు.


🍀 621) విధేయాత్మా - 

సదా భక్తులకు విధేయుడు.


🍀 622) సత్కీర్తి: - 

సత్యమైన యశస్సు గలవాడు.


🍀 623) ఛిన్నసంశయ: - 

సంశయములు లేనివాడు.


సశేషం.... 

🌹 🌹 🌹 🌹 🌹 


🌹 Vishnu Sahasra Namavali - 66 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj


🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷


Sloka for Anuradha 2nd Padam


*🌻 66. svakṣaḥ svaṅgaḥ śatānaṅdō naṅdirjyōtirgaṇeśvaraḥ |

vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṁśayaḥ || 66 ||    🌻*


🌻  615. Svakṣaḥ: 

One who's Akshas (eyes) are handsome like lotus flowers.


🌻 616. Svaṅgaḥ: 

One whose limbs are beautiful.


🌻 617. Śatānandaḥ: 

One who is non-dual and is of the nature of supreme bliss.


🌻 618. Nandiḥ: 

One who is of the nature of supreme Bliss.


🌻 619. Jyōtir-gaṇeśvaraḥ: One who is the Lord of the stars, that is, Jyotirgana.


🌻 620. Vijitātmā:  

One who has conquered the Atma that is the mind.


🌻 621. Vidheyātmā: 

One whose form or nature cannot be determined as 'only this'.


🌻 622. Satkīrtiḥ: One whose fame is of the nature of truth.


🌻 623. Chinna-saṁśayaḥ: 

One who has no doubts, as everything is clear to him like a fruit in the palm.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

ప్రాంజలి ప్రభ 

సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

శ్రీనాథ కవి సార్వభౌముడు: సంక్షిప్త కధ 


పల్నాట తనకు ప్రియమైనవి ఏమీ లేవంటూ వ్రాసిన ఈ పద్యం చూడండి...


" అంగడి యూరలేదు వరియన్నములేదు శుచిత్వమేమిలే

దంగన లిమ్పులేరు ప్రియమయిన వనంబులు లేవు, నీటికి

భంగాపడంగా బాల్పడు క్రుపావరు లేవ్వరులేరు దాతలె

న్నంగాను సున్నా, గాన బలనాటికి మాటికి బోవనేటికిన్?

రాసికుడుపోవాడు పాలనా- దేనగంగా రంభయైన నేకులేవడకున్

వసుధేసుడైన దున్నును- గుసుమాసృన్ డైన జొన్నకూడె కుడుచున్..."

ఇలా పల్నాటికి వీడ్కోలు పలికి, గోదావరీ తీరానికి వెళ్ళాడు.

ఆ ప్రాంతాన్ని ఇంత తేలిగ్గా చెప్పిన శ్రీనాథుడు.. చివరకు అక్కడి పల్నాటి వీరచరిత్రను గ్రంథంగా రాశారు. అదంతా ఆ చెన్నకేశవుడి మహిమే అని చెబుతారు. పల్నాటి మీద పలు మాటలు తూలినందుకు అక్కడి వీరుల చరిత్రను రాసి తన తప్పును దిద్దుకోమని చెన్నుడే... ఆ మహాకవికి చెప్పాడని నమ్మిక. నిజమే లేదంటే... ఆ ప్రాంతం మీద అంత హేళనగా పద్యాలు రాసిన మహాకవి... అక్కడి వీరుల చరిత్రను రాయడం విశేషమే మరి. పల్నాటి వీరచరిత్రను... మంజరీ ద్విపద కావ్యంగా రాశారు. ఇదే ఆయన చివరి రచన కూడా అని చెబుతారు.

శ్రీనాధ కవిసార్వభౌముడు అనగానే సంస్కృత పద భూయిష్టమైన శైలి మెదలక మానదు మన మనసులో.. కానీ తీయతీయని తెలుగుపదాలతోకరుణ రసం తొణికిసలాడే ఈ పద్యాన్ని చూద్దామా.. నైషధం లో తనని నలుడు పట్టుకున్నప్పుడు హంస నలుడితో ఇలాఅంటుంది


"తల్లిమదేకపుత్రక పెద్ద కన్నులు,


గానదిప్పుడు మూ(డుకాళ్ళముసలి

ఇల్లాలు గడు సాధ్వి ఏమియు నెరుగదు ,

పరమపాతివ్రత్యభవ్యచరిత

వెనకముందర లేరు నెనరైన చుట్టాలు ,

లేవడి యెంతేని జీవనంబు

గానక కన్న సంతానంబు శిశువులు

,జీవనస్థితి కేన తావలంబు

కృప దలంప(గదయ్య యో నృపవరేణ్య ,

యభయమీవయ్య యో తుహినాంశువంశ

కావగదవయ్య యర్దార్ది కల్పశాఖి

నిగ్రహింపకుమయ్య యోనిశధ రాజ!"

పద్యం చదువుతుండగానే మనకళ్ళెదుట చక్కని దృశ్యం రూపు కడుతుంది. ఒక్కడే కొడుకు మీద పంచప్రాణాలూ నిల్పుకున్న మూడుకాళ్ళ ముసలి తల్లి,వ్యవహార జ్ఞానం లేని అమాయకురాలు, ఉత్తమురాలు, పరమ పతివ్రత అయిన భార్య,లేక లేక కలిగిన పసిబిడ్దలు.. నిరాధారమైన ఒక సామాన్యుడి వ్యధ మెదులుతుంది.


ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


36.ముద్దు

జడ్జి : ఆతను మిమ్ము ఎక్కడ ముద్దు పెట్టుకున్నాడు

ఆమె: నా పెదవులపై, మరెక్కడా కాదు

జడ్జి : ఊహూ మీరు సరిగ్గా అర్ధం చేసుకోవటంలేదు

         మిమ్మలిని ముద్దుపెట్టుకోన్నప్పుడు మిరేక్కడున్నారు

ఆమె: ఆతని కౌగిల్లోనే ..............


37.మార్నింగ్ వాక్

డాక్టరుగారు మార్నింగ్  మాకుక్కతో వాక్ వెళుతుంటే కుక్క పరిగెడుతుంది

దానితో పాటు పరిగెత్తలేక పోతున్న ఎంచేయాలి

ఐతే కుక్కను ఇంట్లో ఉమ్చి మీ ఆవిడను తిసికేల్తే సరిపోతుంది  

మీ ఆవిడ దెబ్బకు తట్టుకోలేక కదా నీదగ్గరకు వచ్చి మీకు ఫిజి ఇచింది

 

38.నిజాయితీ

రైల్వ మంత్రి ఐ ఉండి  విమానంలో వచ్చారెందుకు  అన్నాడు విలేఖరి

ప్రమాదాలు జరుగుతున్నాయని భయ్యమా

సభకు ఆలస్యంగా వచ్చి మిమ్ము ఇబ్బంది  పెట్టడం ఇష్టం లేకమాత్రమే

అవును మీరు నిజాయితీగల రాజకీయుడవు  కదా   

 


No comments:

Post a Comment