Sunday 8 November 2020

12--11--2020





 భాగవతం -- 21

పరీక్షిత్తు – కలి – ధర్మదేవత

పరీక్షన్మహారాజు సార్వభౌముడు అయ్యాడు. మహారాజు అయి దేశాన్నంతటినీ కూడా ఏంటో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. ధర్మరాజు పరిపాలించిన నాడు దేశం ఎంత శోభతో, ఎంత కళ్యాణ ప్రదంగా ఉన్నదో అంట ఆనందంగా ఉన్నది. ఎక్కడ చూసినా మూడు పువ్వులు ఆరుకాయలు. నెలకి మూడు వానలు! ఎక్కడా ధర్మమునకు లోపమన్నది లేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు. తన మేనమామగారయిన ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతిని వివాహం చేసుకున్నాడు. నలుగురు కుమారులు జన్మించారు. వారిలోని వాడే సర్పయాగం చేసిన జనమేజయుడు. తాను జయించని రాజ్యం లేదు. కురు, పాంచాల, కోసల, కాశి, మల్ల, అంగ, మగధ, మత్స్య, చేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర మొదలయిన రాష్త్రముల నన్నిటిని జయించాడు. ఏకచ్ఛత్రాధిపత్యంగా విశాలమయిన సామ్రాజ్యమును తన పతాకఛాయలలో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు.

పరీక్షిన్మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినా ఒక నియమం పాటించేవాడు. పరీక్షిత్తు యాగములు చేశాడు. పరీక్షిత్తు యాగం చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చునేవారు. ఆయన దేవతలను పిలుస్తుంటే దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చునేవారట! యాగం చెయ్యని వాళ్ళు కూడా ఆ యాగశాలలోకి వచ్చి కూర్చుని, దేవతలు అందరూ వచ్చి కూర్చుని హవిస్సు పుచ్చుకుని వెళ్ళడం చూసేవారు. అంట నిష్ఠాగరిష్ఠుడై యాగములు చేశాడు. ఆయన దిగ్విజయయాత్రకు వెడుతుంటే, శిబిరము వేసుకుని ఉంటే, ఆయా ఊళ్ళల్లో ఉన్న జానపదులు వచ్చి ‘మహానుభావా’ మీ పెదతాతగారయిన ధర్మరాజుగారు ఇలాగే దిగ్విజయ యాత్రకు వచ్చి శిబిరం వేసుకుని ఉంటే, తరువాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ, శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే తానొక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని, శిబిరం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. కృష్ణుడు మీ తాతలని అంతలా రక్షించాడు. అదే కృష్ణుడు సారధ్యం చేస్తుంటే పాండవ మధ్యముడయిన అర్జునుడు ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదంతో కృష్ణుడిని డొక్కలో చిన్నగా తన్నేవాడు. తన్నితే కృష్ణుడు వెనక్కి తిరిగి చూసి ఫల్గునా, రధం ఎటు తిప్పాలి’ అని అడిగేవాడు. అర్జునుని పిలిచి ‘బావా’ అని హాస్యం ఆడేవాడు. ‘శ్రీకృష్ణుడు నిజంగా పాండవులను ఎంత ఆడరించాడో! ఒక మహాశివరాత్రి నాడు అర్జునుడు పాలచెంబు పట్టుకుని గబగబా పరుగెడుతున్నాడు. అతనిని చూసి కృష్ణుడు బావా, ఎక్కడికి పరుగెడుతున్నావు?’ అని అడిగాడు. అపుడు అర్జునుడు ‘శివాలయానికి వెడుతున్నాను. ఈవేళ శివరాత్రి. అభిషేకం చెయ్యాలి’ అన్నాడు. అపుడు కృష్ణుడు శివాలయంలోనే ఉన్నాడని అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా’ అని పంచెను పైకి తీశాడు. శ్రీకృష్ణుని మోచిప్పలో శివలింగం కనపడింది. అంత శివకేశవ అభేదం! కృష్ణ భగవానుడి మోచిప్పను చూసి అర్జునుడు అభిషేకం చేశాడు. ‘నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో?” అంటూ శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి పొంగిపోతాడు. అంతటి మహాత్ముడు.

కృష్ణుడు పాండవులను కంటికి రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడాడు. పరీక్షిత్తు ఆ కృష్ణ కథలు విని, తన తాతలు కృష్ణుడితో గడిపిన మర్యాదా పురస్కృతమైన విశేషములను విని, కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు, చీని చీనామ్బరములు తెప్పించి పాండవులతో కృష్ణుడు గడిపిన రోజులు గురించి చెప్పిన వాళ్ళందరికీ బహుమానములను ఇచ్చేవాడు. ఆ కృష్ణుని పాదములయందు నిరంతరమూ రమించి పోతూ ఉండేవాడు. అంతటి మహాత్ముడయిన పరీక్షిత్తు పరిపాలిస్తూ ఉండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందముతో ఉన్నది.

పరీక్షిన్మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్నాడు. అలా చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన చూశాడు. దీనిని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దీనిని మీరు కేవలము ఒక పురాణ కథగా చదివితే దానివలన ఎంత ప్రయోజనము వస్తుంది అంటే మనం చెప్పలేము. ఈ ఘట్టమును మీరు చాలా సునిశితంగా పరిశీలించాలి. భాగవతము భాగవతముగా మీకు అర్థం కావాలి అంటే ఇది చాలా కీలకమయిన ఘట్టం. ఒక మహాపురుష ప్రవేశం జరిగేముందు దాని వెనకాతల ఒక కీలకమయిన సందర్భం ఉంటుంది. ఇపుడు శుకుడు వచ్చి కోర్చోవలసిన సందర్భం వస్తోంది. అలా రావడానికి గాను దాని వెనక ఏదో మహత్తరమయిన సంఘటన జరుగుతోంది. మీరు ఆ కోణములో పరిశీలన చేయకపోతే భాగవతమును వ్యాసుడు అలా ప్రారంభం చేసిన రహస్యం మీకు అందదు. భాగవతమును విన్నంత మాత్రం చేత జీవితం మారిపోతుంది.

పరీక్షిన్మహారాజు దిగ్విజయ యాత్రలో తిరుగుతూ తిరుగుతూ ఒక ప్రదేశమునకు వచ్చాడు. అక్కడ ఒక ఆవు, ఎద్దు నిలబడి వున్నాయి. ఈ ఆవు పిల్లల పక్కన లేక పిల్లలు కనపడక, పిల్లల క్షేమవార్త తెలియక ఏడుస్తున్న తల్లి ఎలా ఉంటుందో అలా ఉంది. ఇటువంటి ఉపమానమును తండ్రికి వెయ్యరు. తల్లికి మాత్రమే వేస్తారు. అమ్మ అనే మాట చాలా గొప్పది. మాతృత్వంలో ఉన్న ప్రేమ అంతటినీ తీసుకువచ్చి మీరు ఒక ముద్దగా పెడితే ఆ ముద్దను మీరు చూడాలి అనుకుంటే, ఆ ముద్దయే భూమి. భూమి అమ్మ. ఇందుకే భూమి గురించి ఎక్కడయినా చెప్పవలసి వస్తే ఋషులు పొంగిపోతారు. వాల్మీకి మహర్షి అయితే ‘క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షీ’ అంటారు. అమ్మకి ఉండే గొప్ప లక్షణము ఓర్పు. అమ్మకి ఒర్చగలిగిన గుణం ఉంటుంది. కలియుగ ప్రారంభంలో ఇవాళ భూమి దానిని కోల్పోయింది. అందుకని బిడ్డ కనపడని ఆవు ఏడ్చినట్లు ఆవిడ ఏడుస్తోంది. ఇది కలియుగానికి ప్రారంభం. అమ్మ ఏడుపుతో కలియుగం ప్రారంభమయింది. దీనిని మీరు గుర్తుపట్టాలి. ఆవు అలా ఏడుస్తుంటే పక్కన ఒక ఎద్దు వచ్చి నిలబడి ఉన్నది. ఆ ఎద్దు ఒక కాలితోనే ఉంది. ఎద్దుకు నాలుగు కాళ్ళూ లేవు. ఒక కాలిమీద ఎద్దు నిలబడగలదా? ఒక కాలితో ఉన్న ఎద్దు భూమిమీద డేకుతూ ఉంటుంది. నిలబడినట్లు కనపడుతుంది అంతే. అలా నిలబదినట్లుగా ఆన్న ఎద్దు తన మూడుకాళ్ళు పోయాయని ఏడవడం లేదు – ఆవు ఏడవడం చూసి ఆశ్చర్యపోయింది. ఇదీ మీరు గుర్తుపట్టవలసిన రహస్యం. ఆవు ఎందుకు ఏడుస్తోంది అని గోమాత వంక తిరిగి అంది – ‘నీవు ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా’ అని అడిగింది. ‘మంగళప్రదురాలా’ అంటే ‘శుభం ఇవ్వడం మాత్రమే తెలిసివున్నదానా’ అని అర్థం.

మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమిని గునపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెడతారు. శంకుస్థాపన చేస్తే ఆవిడ ఇల్లు కట్టుకోమంతుంది. మనం అన్నం తినడానికి నాగలిపట్టి అమ్మ గుండెలమీద గాట్లు పెడతాం. అమ్మ పంటలు పండించి మనకి కడుపు నిండేటట్లుగా అన్నం పెడుతోంది. మీరు ఎంత బాధ పెట్టినా కన్నులవెంట నీరు పెట్టుకోవడం ఆమెకు తెలియదు. మీరు బ్రతకడానికి ఇవ్వడం ఆవిడకు తెలుసు. ఇపుడు ఆ గోవు ఏడుస్తుంటే ఎద్దు అడిగింది. ‘నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమి బాధ కలిగింది? నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివి కదా!’ అడిగితె భూమి అంది ‘నేను దేనికి ఎదుస్తున్నానో తెలుసా? నాకు ఏదో బాధ కలిగిందని ఏడవడం లేదు. కృత యుగమయినా, మరొకటి అయినా నా బాధ ఎప్పుడూ అలానే ఉంటుంది.’ ఇక్కడ గోవు బాధ పడుతోంది. కలియుగ ప్రారంభంలో ఎందుకు గోవు అలా ఏడుస్తున్నాడో ఇప్పుడు చెప్తున్నారు. ఆవు ఎద్దుతో చెప్తోంది ‘కలి ప్రవేశించాడయ్యా – నేను ఏడుస్తున్నా నంటావేమిటి? నీకు మూడు కాళ్ళు లేని తనమును చూసి నేను ఏడుస్తున్నాను’ అంది. ఆయనకీ మూడు కాళ్ళు లేకపోతే ఈవిడ ఏడవడం ఎందుకు? ఆవిడ అంది –

కలి బలవంతంగా రాలేదు. ఈశ్వరుడు అనుగ్రహించాడు. కలియుగం అంటే అతను రావాలి. ఆటను రావడానికి కాలము దారిని ఇచ్చింది కాలము ఈశ్వరరూపం. ఆ కలి లోపలి అడుగు పెట్టి పాదములు ఇంకా పూన్చుకోలేదు – పరిస్థితి మారిపోయింది. పూర్వము నీకు నాలుగు పాదములు ఉండేవి. ఇప్పుడు నీకు ఒక పాదమే ఉన్నది. మూడు పాదములు లేవు. కలిపురుషుడు వచ్చేయడం వలన నీకు మూడు పాదములు పోయాయి’ అంది.

అది మామూలు ఎద్దు కాదు. ఆ ఎద్దు ధర్మమూ. ధర్మమునకు, భూమికి ఎంత దగ్గర సంబంధమో చూడండి. ధర్మమునకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనే నాలుగు పాదములు ఉండేవి. ఈ నాలుగు పాదములతో ధర్మం నడుస్తుంది. అది ఇలా నడిచే నాలుగు పాదములు కలిగిన ధర్మమనబడే వృషభము. అందుకే శంకరుడు వృషభమును ఎక్కుతాడని అంటారు. అనగా ఆయన ధర్మమును అధిరోహించి నడుస్తారని భావము. ఆవు చెపుతున్న మాటలను చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ‘నేను దేవతలా గురించి ఏడుస్తున్నాను. హవిస్సులు పొందని దేవతలు తయారవుతారు’ అంది. రాబోయే కాలములో యజ్ఞయాగాదులను విమర్శించే వాళ్ళు ఎక్కువయిపోతారు. యజ్ఞయాగాది క్రతువులు ఒక్క మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటాయి. ఇంకెక్కడా లేవు. యజ్ఞం చేయడం, అగ్నిహోత్రంలో హవిస్సు వెయ్యడం మున్నగు కార్యక్రమములు జరగవు. మీరు మరల సంపదను పొందడానికి అగ్నిహోతము ద్వారా దేవతలకు హవిస్సులు ఇస్తే, ప్రీతిచెండిన దేవతలు మరల వర్షమును కురిపించి మనకు సంపదలను ఇస్తారు. మీరు తిరిగి వారిపట్ల కృతజ్ఞతను ప్రకటించనప్పుడు దేవతల ఆగ్రహమునకు గురి అవుతారు. కలియుగంలో దేవతలకు హవిస్సులు ఇవ్వబడవు. ‘హవిస్సులు ఇవ్వని మనుష్యులకు శుభమును మేము చేయము’ అని దేవతలు శుభములను చేయరు.

॥ శ్రీ సూర్య స్తోత్రమ్ ॥

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

దేవా ఊచుః

1) నమస్తే ఋక్స్వరూపాయ సామరూపాయ తే నమః ।

 యజుఃస్వరూపరూపాయ సామ్నాన్ధామవతే నమః ॥

 2) జ్ఞానైకధామ భూతాయ నిర్ధూత తమసే నమః ।

 శుద్ధజ్యోతిఃస్వరూపాయ విశుద్ధా యామలాత్మనే ॥

3) వరిష్ఠాయ వరేణ్యాయ పరస్మై పరమాత్మనే ।

 నమోఽఖిలజగద్వ్యాపిస్వరూపాయాత్మమూర్తయే ॥ 

 4) ఇదం స్తోత్రవరం రమ్యం శ్రోతవ్యం శ్రద్ధయా నరైః ।

శిష్యో భూత్వా సమాధిస్థో దత్త్వా దేయం గురోరపి ॥ 

5) న శూన్యభూతైః శ్రోతవ్యమేతత్తు సఫలం భవేత్ ।

సర్వ కారణ భూతాయ నిష్ఠాయై జ్ఞాన చేతసామ్ ॥ 

6) నమః సూర్య స్వరూపాయ ప్రకాశాత్మ స్వరూపిణే ।

భాస్కరాయ నమస్తుభ్యం తథా దినకృతే నమః ॥

 7)శర్వరీహేతవే చైవ సన్ధ్యాజ్యోత్స్నా కృతే నమః ।

 త్వం సర్వమే తద్భగవన్ జగదుద్భ్రమతా త్వయా ॥

8) భ్రమత్యా విద్ధమఖిలం బ్రహ్మాణ్డం సచరాచరమ్ ।

 త్వదంశుభిరిదం స్పృష్టం సర్వం సఞ్జాయతే శుచి ॥

 9) క్రియతే త్వత్కరైః స్పర్శాజ్జలాదీనాం పవిత్రతా ।

హోమదానాదికో ధర్మో నోపకారాయ జాయతే ॥

 10) తావద్యావన్న సంయోగి జగదేతత్ త్వదంశుభిః ।

ఋచస్తే సకలా హ్యేతా యజూంష్యేతాని చాన్యతః ॥

 11) సకలాని చ సామాని నిపతన్తి త్వదడ్గతః ।

 ఋఙ్మయస్త్వం జగన్నాథ ! త్వమేవ చ యజుర్మయః ॥

12) యతః సామమయశ్చైవ తతో నాథ ! త్రయీమయః ।

 త్వమేవ బ్రహ్మణో రూపం పరఞ్చా పరమేవ చ ॥ 

13) మూర్తామూర్త స్తథా సూక్ష్మః స్థూలరూపస్తథా స్థితః ।

 నిమేషకాష్ఠాదిమయః కాలరూపః క్షయాత్మకః ।

 ప్రసీద స్వేచ్ఛయా రూపం స్వతేజః శమనం కురు ॥

!! ఇతి శ్రీమార్కణ్డేయ పురాణే సావర్ణికే మన్వన్తరే వైవస్వతోత్పత్తిర్నామాష్టసప్తతితమోఽధ్యాయాన్తర్గతా సూర్యస్తుతిః సమాప్తా !!

🕉🌞🌏🌙🌟🚩

   

 ✍️గాల్ బ్లాడర్ (పసరతిత్తి) లో రాళ్లు:

👉గాల్ బ్లాడర్  (పసరతిత్తి) రాళ్లనే గాల్‌ స్టోన్స్‌ అని అంటారు.

👉 స్థూలకాయం, కొలెస్ట్రాల్‌ ఎక్కువున్న ఆహారం తీసుకోవడమే దీనికి కారణం. 

✍️పసరతిత్తి వ్యాధికి కారణాలు:

👉స్థూలకాయం. 

👉మధుమేహం. 

👉గర్భ నిరోధక మాత్రలు వాడే వారిలో. 

👉సిరోసిస్‌ లివర్‌. 

👉ఎక్కువ కొలెస్ట్రాల్‌ వున్న వారిలో. 

👉పాలిఅన్‌ స్యాచురేటెడ్‌ కొవ్వు కల్గిన ఆహారం తీసున్నవారిలో 

👉పసరతిత్తి (గాల్‌ బ్లాడర్‌) బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వుంటే వస్తాయి. 

👉మహిళల్లో నలభై వయస్సు, లావుగా ఉన్నవారిలో నాల్గు రెట్లు ఎక్కువగా కన్పిస్తుంది. 

👉గర్భవతుల్లో కూడా ఈ వ్యాధి వస్తుంది.

✍️లక్షణాలు:

👉చాలా మందిలో ఈ రాళ్ల వల్ల ఏ లక్షణాలు కనిపించవు.

👉 కొంత మందిలో మాత్రం ఉదరం పైభాగం కుడి పక్కన మెలిపెట్టినట్టు వస్తుంది. 

👉భోజనం చేసిన 30 నిమిషాల నుండి గంటన్నర తర్వాత మొదలవుతుంది. 

👉ఈ నొప్పి కుడి భుజానికి వీపునకు, పొట్ట దిగువ భాగానికి పాకుతుంది. 

👉మరికొందరిలో వయనం వచ్చినట్టు వుండడం, వాంతులవడం, చలితో కూడిన జ్వరంతోపాటు పసరికలొస్తాయి.

👉కొందరిలో పసరతిత్తి వాహికల్లో అడ్డుఏర్పడినప్పుడు అకస్మాత్తుగా తిత్తి వాచినప్పుడు, విపరీతమైన నొప్పి చలితో కూడిన జ్వరం వస్తుంది. 

👉దీన్ని ‘అక్యూట్‌ కోలిసిస్టెటిస్‌’గా గమనించాలి. 

👉రోగిని పరీక్షిస్తే కడుపుపై భాగంలో, కుడిపైపు నొక్కితే విపరీతమైన నొప్పి కలుగుతుంది. 

👉వ్యాధి తీవ్రతను బట్టి కొన్ని విపరీత లక్షణాలు ఈ విధంగా వుంటాయి. 

👉పచ్చకామెర్లు ఎక్కువగా వుండడం.

👉సెప్టిసీమియా.

👉పసరతిత్తిలో చీము నిండి పగలడం.

👉తర్వాత షాక్‌లో వెళ్లడం జరుగుతుంది.

✍️వ్యాధినిర్ధారణ:

👉రక్తంలో బిలురూబిన్‌ ఎక్కువగా వుంటుంది. 

👉సాధారణ (కడుపు) ఎక్స్‌రే, ఓరల్‌ కోలిసిస్టోగ్రఫీ, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ద్వారా గుర్తించవచ్చు.

✍️తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

👉లక్షణాలు ఎక్కువున్నప్పుడు బాగా విశ్రాంతి అవసరం.

👉 సాత్విక ఆహారం తీసుకోవాలి. 

👉లావుగా వుంటే బరువు తగ్గించుకోవాలి. 

👉గుడ్డు, వేయించిన పదార్థాలు, వెన్నె సంబంధిత పదార్థాలు, పందిమాంసం కూడా బాగా తగ్గించాలి. 

👉వెచ్చని నీళ్లు వాటర్‌ బ్యాగ్‌లో వుంచి కడుపు మీద వుంచాలి. 

👉వాంతులు విరేచనాలు వుంటే నోటి ద్వారా ఏమి ఇవ్వకుండా నరాల ద్వారా గ్లూకోజ్‌ ఎక్కించాలి.

✍️గాల్ బ్లాడర్ లో రాళ్ళ సమస్యతో బాధపడుతున్న మిత్రులు ఎవరైనా ఉంటే వారికి మా వద్ద అద్భుతమైన ఫలితాలను ఇచ్చే మందులు కలవు. ఇప్పటికే చాలా మంది మిత్రులు మా మందులను వాడి శాశ్వత పరిస్కారం పొంది వున్నారు. ఆలస్యం చేసి సమస్యను పెద్దది చేసుకుని ప్రాణం మీదికి తీసుకుని రాకుండా సమస్య యొక్క తీవ్రత చిన్నగా వున్నపుడే దానికి సంభందించిన మంచి ఆయుర్వేద మందులను వాడటం ద్వారా శాశ్వత పరిస్కారం పొందవచ్చు. 

 ✍️స్థూలకాయం (అధిక బరువు):

👉స్థూలకాయం పెరగడానికి కారణాలలో ప్రధానమైనది గ్రామీణ జీవనం నుంచి నగర జీవితానికి పరివర్తన చెందడం, వ్యక్తులకు భౌతిక వ్యాయామం లేకపోవడం.

👉స్థూలకాయాన్ని మందులు లేకుండానే తగ్గించవచ్చు. అయితే దాని వ్యాప్తి గురించి, రావడానికి కారణాలు, జీవితంపై దాని ప్రభావం, సామాజిక, మానసిక ప్రభావాలు, మరణానికి చేరువ చేసే దాని సామర్ధ్యం గురించి సరైన అవగాహన ఉండాలి.

👉అధిక బరువును కలిగి ఉండటం అంటే స్ర్తీ అయినా పురుషుడైనా వారి వయసుకు, ఎత్తు కు తగ్గట్టుగా ఉండవలసిన బరువుకన్నా అధికంగా ఉండడం.

👉 అధిక బరువు అనేది సాధారణంగా స్థూలకాయం వల్లే వచ్చినా అసహజ రీతిలో కండరాలు పెరగడం లేదా ద్రవా లు నిలిచిపోవడం వల్ల కూడా రావచ్చు.


👉 కొవ్వు కణాలు విస్తరించినా లేదా కొవ్వుగల కణజాలం అసహజంగా పెరిగినా లేదా వాటి సంఖ్య రెట్టింపు అయినా లేదా ఈ రెండు చోటు చేసుకోవడాన్ని స్థూలకాయంగా అభివర్ణించవచ్చు. దీనిని ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌’ (బిఎంఐ) ద్వారా తెలుసుకోవచ్చు. 


👉సాధారణంగా పురుషులలో 30 కన్నా స్ర్తీలలో 28.6 కన్నా బిఎంఐ అధికంగా ఉన్నప్పుడు స్థూలకాయ సూచనలు ఉన్నట్టే.


👉ఒక వ్యక్తి అధిక బరువును కలిగి ఉన్నాడా అనేది నిర్ధారించేందుకు ఉపయోగించే గణనే బాడీ మాస్‌ ఇండెక్స్‌. 


✍️కారణాలు:


👉భౌతిక శ్రమ లేక పోవడం.

👉 ఎక్కువగా తినడం.

👉స్వీట్లు. 

👉రిఫైన్డ్‌ పదార్ధాలు తీసుకోవడం. 

👉 డ్రింక్స్‌ను తీసుకోవడం. 

👉 చిల్డ్‌ ఫుడ్స్‌.

👉 నూనె పదార్ధాలు.

👉 వేపుళ్ళు వగైరా. 

👉కొత్త బియ్యం, పప్పులు. 

👉 తాజా వైన్ & ఆల్కహాల్

👉 పాలపదార్ధాలు. 

👉 బేకరీ ఉత్పత్తులు. 

👉 మాంసాహారం.

👉పగటి పూట నిద్రించడం.

👉సౌకర్యవంతమైన పడక.  

👉చైతన్యం లేకపోవడం.

👉 ఆహారంలో ఉండే కేలరీలు, అవి తీసుకునే విషయంలో అజ్ఞానం.


✍️స్థూలకాయాన్ని నియంత్రించేం దుకు ఆయుర్వేద చిట్కాలు:


👉అతి నిద్రను నివారించాలి


👉పాలు, పెరుగు, నూనె పదార్ధాలు, ఫాస్ట్‌ ఫుడ్స్‌ తీసుకోవడం మానేయాలి


👉భోజనం చేసిన వెంటనే నీరు తాగడం మానాలి


👉పెరుగు మీద తేట, పల్చటి మజ్జిగ స్థూలకాయాన్ని నియంత్రించడంలో సాయపడతాయి.


👉పళ్ళు, పండ్ల రసాలు ఎక్కువ తీసుకోవాలి. పుచ్చకాయ ఎంతో మంచిది.


👉ఆకు కూరలు అధికంగా తీసుకోవాలి


👉పాలు తీసుకోవాలనుకునే పక్షంలో టోన్డ్‌ మిల్క్‌ తీసుకోవాలి


👉గోరువెచ్చటి నీరు తాగుతుండాలి.


👉వెన్న, చీజ్‌ వంటి పదార్ధాలు తీసుకోవడం మానేయాలి.


👉మాంసాహారానికి దూరంగా ఉండాలి


👉అన్నం, ఆలు గడ్డ సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాల


👉రోజూ క్యారెట్‌ జ్యూస్‌ తాగడం మంచిది


👉శొంఠి, దాల్చిన చెక్క, మిరియాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి


👉పుదీన చాలా మంచిది. రోజూ పుదీన ఆకు ఆహారంలో తీసుకోవాలి.


👉ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలి.


👉కాబేజీని పచ్చిగానైనా, వండినదైనా ఎక్కువగా తీసుకోవాలి.


👉కూరగాయల సలాడ్లను తీసుకోవడం మంచిది.


👉ఒక భాగం గోధుమలు, 1/10 భాగాలు సెనగలు, 1/10 భాగం సో యాపిండి, 1/10 బార్లీ, 1/10 జొన్న పిండి కలిపి చపాతీలు చేసి తీసుకోవాలి. ఇది శరీరానికీ బలాన్నీ ఇస్తుంది. బరువు అతిగా పెరగకుండా నిరోధిస్తుంది.


👉స్థూలకాయానికి అతి మంచి వం టింటి చిట్కా తేనె. ఒక టేబుల్‌ స్పూన్‌ తాజా తేనెను ఒక టీ స్పూన్‌ నిమ్మరసం ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపున తీసుకోవాలి. రోజులో అనేకసార్లు దీనిని తీసుకోవచ్చు.


👉అన్నింటిలోకీ నడక ఉత్తమ వ్యాయామం. దానితో ప్రారంభించి రన్నిం గ్‌, స్విమ్మింగ్‌, రోయింగ్‌ చేయవచ్చు.


👉చక్కెర, మైదా పదార్ధాలను సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి.


👉భోజనానికి మధ్యలో చిరుతిళ్ళు, టీవీ చూస్తూ తినడం మానుకోవాలి.


👉బేకరీ ఉత్పత్తులను సాధ్యమైనంత వరకూ తీసుకోరాదు.


👉ఆల్కహాల్‌ను, పెప్సీ, కోలా, కోక్‌ వంటి ఎయిరేటెడ్‌ డ్రింకులను తీసుకోవడం మానేయాలి.


✍️ఎలాంటి ఆహారం తీసుకోవాలి:


👉వెల్లుల్లి

👉అల్లం

👉పసుపు

👉గుగ్గులు

👉కరక్కాయ

👉కొత్తిమీర

👉త్రికటు

👉ఉసిరికాయ

👉శొంఠి

👉ఆవాలు

👉జీలకర్ర

👉మిరియాలు.

👉మామిడి

👉అనాస

👉బొప్పాయ

👉పుచ్చకాయ

👉ఓట్‌మీల్‌

👉ద్రాక్షలు

👉దంపుడు బియ్యం

👉పచ్చటి కూరగాయలు


✍️చేయవలసిన వ్యాయామాలు:


👉రోజుకి 45 నిమిషాల పాటు బ్రిస్క్‌ వాకింగ్‌.


👉ఎయిరోబిక్స్‌


👉సైక్లింగ్‌


👉స్విమ్మింగ్‌


👉యోగ మొదలైనవి.


✍️సాధారణంగా ఉపయోగించే మందులు:


👉కాంచనార గుగ్గులు


👉శిలాజీత్‌


👉చంద్రప్రభా వటి


👉లోహ భస్మ


👉త్రిఫల మొదలైనవి.


✍️ ఊబకాయం  సమస్యతో బాధపడుతున్న మిత్రులు ఎవరైనా ఉంటే వారికి ఇదే మా విన్నపం. మా వద్ద అద్భుతమైన ఫలితాలను ఇచ్చే మందులు కలవు. ఇప్పటికే చాలా మంది మిత్రులు మా మందులను వాడి ఈ ఊబకాయం సమస్య నుండి శాశ్వత పరిస్కారం పొంది వున్నారు. ఆలస్యం చేసి సమస్యను పెద్దది చేసుకుని ప్రాణం మీదికి తీసుకుని రాకుండా సమస్య యొక్క తీవ్రత చిన్నగా వున్నపుడే దానికి సంభందించిన మంచి ఆయుర్వేద మందులను వాడటం ద్వారా శాశ్వత పరిస్కారం పొందవచ్చు. అవసరం ఉన్న మిత్రులు మందులు కోసం మాకు వాట్సప్ చేయవచ్చు. అతి తక్కువ ధరలకే మందులు లభించును. మా వాట్సప్ నెంబర్ : 9705569901.  


🙏ముఖ్య విన్నపం: 

ప్రతి ఒక్కరు  ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏


🌹💐ప్రతిరోజు ఆరోగ్య నియమాలు మరియు సూచనలు ఉచితంగా పొందుటకు ఈ క్రింద ఇవ్వబడిన మా పేజీ ని లైక్ చేసి ఫాలో అవ్వండి.🌹


   లలితా సహస్రనామ భాష్యము

145వ నామ మంత్రము


ఓం నిర్వికారాయై నమః


మహదహంకారములు, పంచతన్మాత్రలు, భూతపంచకము, ప్రాణపంచకము, ఇంద్రియపంచకము, మనస్సు వీటిద్వారా మార్పుచెందని నిర్వికార స్వరూపురాలైన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్వికారా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిర్వికారాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో  ఉపాసించు సాధకుడు భౌతిక పరమైన సుఖములకు అతీతముగా   జీవనము కొనసాగించుచూ పరమేశ్వరీ ఆరాధనలో తరించును.


జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. భౌతిక శరీరధారికి ఉండు వికారములేవియు ఉండవు. అందుచే ఆ తల్లిని నిర్వికారా అను నామముతో స్తుతించుదుము.


సప్త తత్త్వాలు - మహత్తు, అహంకారం,  పంచతన్మాత్రలు (1. రూపము, 2. రసము, 3. గంధము, 4. స్పర్శ, 5. శబ్దము) మరియు పంచభూతములు (పృథివి, 2. జలము, 3. తేజస్సు, 4. వాయువు, 5. ఆకాశము),  పంచప్రాణములు (1. ప్రాణము - హృదయమునందు ఉండునది, 2. అపానము -  గుదమున నుండునది, 3. సమానము -నాభి మండలమున నుండునది,  4. ఉదానము - కంఠమున నుండునది, 5. వ్యానము - శరీరమంతయు వ్యాపించియుండునది), ఇంద్రియ పంచకము (1. చక్షుస్సు, 2. శ్రోత్రము, 3. ఘ్రాణము, 4. జిహ్వ, 5. కాయము), మనస్సు వీటిచే  మార్పుచెందని నిర్వికార స్వరూపురాలు జగన్మాత. 


శరీరానికి గల ఆరు అహంకారములు (జన్మ, స్థితి, వృద్ధి, విపరిణామము, క్షయము, నాశనము) వీటిచే మార్పుచెందని నిర్వికార స్వరూపురాలు.


ఇంకను బాల్యము, యౌవనము, కౌమారము, వార్ధక్యము - ఈ అవస్థలు లేని నిర్వికార స్వరూపురాలు జగన్మాత.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిర్వికారాయై నమః అని అనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



No comments:

Post a Comment