17. నిత్య తృప్తి - తృప్తి యున్నచోట ఎవరిని, దేనిని ఆశించుట యుండదు. కర్తవ్యము మేర జీవించుట యుండును. ఆశ్రయించుట యుండును. కేవలము తృప్తితో నిర్వర్తించు కర్తవ్యమే తృప్తి నిచ్చును. ఇందు మూడంశములు ముఖ్యము. 1. నిత్యతృప్తి, 2. నిరాశ్రయత, 3. కర్మఫల సంగత్యాగము. 🍀
📚. 4. జ్ఞానయోగము - 20 📚
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృవ్ర నిరాశ్రయః |
కర్మణ్యభిప్రవృత్తో నైవ కించి త్కరోతి సః || 20
కర్మలయందు ప్రవర్తించుచు, అవి చేయని వానివలె నుండు రహస్యము దైవ మీ శ్లోకమున బోధించు చున్నాడు. కోరిక కర్మఫలాసక్తిని కలిగించును. దానివలన మరల సంకల్పములు పుట్టును. ఈ చక్రమునుండి బయట పడుటకు ముందు శ్లోకమున కర్తవ్యకర్మ ఎట్లు నిర్వర్తించుకొనవలెనో చెప్ప బడినది.
ఈ శ్లోకమున తృప్తియను మరియొక గుణమును ఉపాసించ వలసినదిగా దైవము తెలుపుచున్నాడు.
తృప్తి యున్నచోట ఎవరిని, దేనిని ఆశించుట యుండదు. కర్తవ్యము మేర జీవించుట యుండును. దేనిని ఆశించనపుడు, ఎవరినీ ఆశ్రయింప పనిలేదు. తృప్తి కారణముగా ఆశించుట యుండదు. దాని కారణముగా ఆశ్రయించుట యుండును. కేవలము తృప్తితో నిర్వర్తించు కర్తవ్యమే తృప్తి నిచ్చును.
ఇట్టివాడు చేయు పనివలన కలుగు ఫలములయందు కూడ సంగము విడచినచో చేయకముందెట్లుండెనో, చేయుచున్నప్పుడు కూడ అట్లే యుండును. అట్టి వానిని కర్మఫలములు అంటవు. ఆగామి కర్మలు పుట్టవు. సంచిత, ప్రారబ్దములు క్రమముగా నశించును. ఇందు మూడంశములు ముఖ్యము.
1. నిత్యతృప్తి, 2. నిరాశ్రయత, 3. కర్మఫల సంగత్యాగము.
. శ్రీ శివ మహా పురాణము - 276 🌹
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
65. అధ్యాయము - 20
🌻. సతి కైలాసమునకు పయనమగుట - 3 🌻
ఈ లోకమునందు ఏ మానవుడైతే చైత్ర శుక్ల త్రయోదశీ, ఉత్తరా నక్షత్ర యుక్త ఆదివారము లయందు నిన్ను భక్తితో దర్శించునో (38), వాని పాపములు ఆ క్షణమునందే వినాశమును పొందుగాక! ఓ హరా! వానికి పుణ్యము విస్తారముగా వర్థిల్లి, రోగములు పూర్తిగా నశించుగాక! (39).
ఏ దురదృష్ట వంతురాలగు స్త్రీ వంధ్య గాని, అంధురాలు గాని, కురూపిగాని అయి ఉండునో, ఆమె కూడా నీ దర్శనమాత్రము చేతనే నిశ్చయముగా దోషములు లేనిది అగును (40). ఈ నా మాటలను విని శివుడు తన మనస్సులో మిక్కిలి ఆనందించి, ప్రసన్నమగు మనస్సుతో 'తథాస్తు' అని పలికెను (41).
శివుడిట్లు పలికెను -
ఓ బ్రహ్మా! నీ మాటచే సర్వలోకములకు హితమును చేయుటకై నేను నా పత్ని యగు సతీ దేవితో గూడి ఆ వేదియందు స్థిరముగా నుండగలను (42).
బ్రహ్మ ఇట్లు పలికెను -
భగవాన్ వృషభధ్వజుడు అచట ఇట్లు పలికి, భార్యతో గూడి వేది మధ్య యందున్న వాడై, తన అంశముతో మూర్తిని నిర్మించి అచటనే నివసించి యుండెను (43). తరువాత తనవారి యందు ప్రేమ కలిగిన శంకర పరమేశ్వరుడు దక్షుని పిలిపించెను. ఆయన తన భార్యయగు సతీదేవితో గూడి బయలు దేరనిచ్చగించెను (44).
ఆ సమయములో పండితుడగు దక్షుడు వినయముతో వంగి దోసిలి యొగ్గి నమస్కరించి వృషభ ధ్వజుని ఆనందముతో స్తుతించెను (45). అపుడు విష్ణువు మొదలగు దేవతలు, మునులు, మరియు గణములు శివునకు నమస్కిరించి, అనేక భంగుల స్తుతించి, ఆనందముతో జయజయ ధ్వానములను చేసిరి (46).
శంభుడు దక్షుని ఆజ్ఞను పొంది, సతీదేవిని ఆనందముతో వృషభముపై కూర్చుండ బెట్టి, తాను కూడా దానిపై అధిష్టించి, ఆ ప్రభువు హిమవత్పర్వతముపై నున్న తన ఆశ్రమమునకు బయలుదేరెను (47). అపుడు అందమైన దంతములు, సుందరమగు చిరునవ్వు గల ఆ సతీదేవి వృషభముపై శంకరుని ప్రక్కన చంద్రునితో మచ్చవలె ప్రకాశించెను (48).
విష్ణువు మొదలగు దేవతలు, మరీచి మొదలగు ఋషులు, దక్షుడు మొదలగు వారందరు మోహితులైరి. మిగిలిన జనులు కదలకుండ నుండిరి (49). కొందరు వాద్యములను వాయించుచూ, మరి కొందరు ఆనందముతో మంగళకరము, శుద్ధము అగు శివుని కీర్తిని గానము చేయుచూ, శివుని వెనుక వెళ్లిరి (50).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 164 🌹
🌻. జాబాలిమహర్షి - 4 🌻
20. గోసేవ వలన ఎంత పాపం చేసిన వాడికయినా, ఎంత పుణ్యం లేని వాడికయినా కూడా సత్సంతానం కలుగుతుంది. ఎందుకంటే గోవు శరీరంలో దేవతలుంటారు. ప్రతిదినము గోవుకు గడ్డిపెట్టి దానికి సేవ చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. సంతానాన్ని ఇస్తారు.
21. “ఋతుమతి అయిన కుమార్తె అవివాహితగా ఉండటము, పశువుల కొట్టంలో ఆవు ఆకలితో ఉండటము, నిర్మాల్యం తీయనటువంటి దేవతార్చ్నము – ఈ మూడు కార్యాలూ పుణ్యమ్నశించడానికి హేతువులు. కాబట్టి శుభ్రం చేసి దేవతార్చన చేయాలి.
22. గోవుల ఆకలి తీర్చటము, దేవతార్చన చేయటము ఒకటే నన్నమాట. గడ్డితినే ఆవుకు అడ్డంవచ్చి ఈ గడ్డి నాది అని దెబ్బలాడతాడు ఒకడు. తన పెరట్లో గడ్డి తింటుంటే ఆవును కొట్టాడంటే, ఆ గడ్డి తనదేనని అన్నట్లే కదా! అంటే అది తాను తినాలి వెంటనే! ఎంత తప్పు అది! కాబట్టి అది మహా పాపం అని చెప్పాడాయన. “గడ్డితినే ఆవును అడ్డగించినవాడు పితృదేవతలను బాధించినట్లే. ఆవును కాళ్ళతో తన్నరాదు. ఆటివాడు యమలోకానికి వెళతాడు” అని చెప్పాడు జాబాలిమహర్షి.
23. భారతదేశంలో ధర్మం పూర్తిగా నాశనం అయిపోయిపోతోంది. గోవధ, పశువధ, భయంకరమయిన జీవహింస జరుగుతున్నటువంటి నేటి భారతదేసంలో భారతీయులు ఇంకా కొంతైనా సుఖంగా ఉన్నారంటే, మహర్షులు ఎప్పుడో చేసినటువంటి పుణ్యమే కారణం తప్ప మరేమీకాదు. లేకపోతే ఈ పాపానికి అన్నవస్త్రాదులకు కూడా మనం అర్హులం కాదు.
24. ఈ దేశంలో ఇప్పుడు మనను నరకానికి పంపగలిగినంతటి మహాశక్తివంతమయిన పాపం జరుగుతున్నది. కాని ఇంత క్షేమంగా ఉండటానికిమాత్రం మహర్షుల ఆశీర్వచనము, దయ మాత్రమే కారణము. మన తండ్రుల దయ మనమీద ఉందికాబట్టే బాహా ఉన్నాం ఇంకా! భారతదేశంలో నేడు జరుగుతున్న హింస అపారంగా ఉంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
శివగీత - 118 / The Siva-Gita - 118 🌹
అధ్యాయము 15
🌻. భక్తి యోగము - 7 🌻
సూర్యాభి ముఖముగా పైకెత్తిన రెండు బాహులు గలవాడై నీటిలో నిలిచి సూర్య బింబస్తునిగా నన్ను ధ్యానించి అధర్వాం గి రసమును జపించువాడు నిజ గృహము లోనికి యజమానుడు ప్రవేశించునట్లుగా నాయందాతడు ప్రవేశించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[18:03, 19/11/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 103 🌹
🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 8 🌻
మహాపురుషుడు (వలీ 5 భూమిక) సత్పురుషుడు (పీర్ 6 భూమిక) వాస్తవముగా చమత్కారములు చేయరు. ఒకవేళ చమత్కారములు చేసినట్లు కనిపించినచూ, ఆధ్తాత్మిక, ఆధిభౌతిక ప్రయూజనములను ఆశించువారి ఆలోచనలపై, అనుభూతులపై గల మానసిక ప్రభావముపై ఆధారపడి యుండి అట్లు కాన్పించును.
432. ఆరవ భూమిక :-
(అంతఃకరణము లేక హృదయము) మానసిక చైతన్యము కలవాడై మానవులలో నున్న భగవంతుడు క్రమక్రమంగా అంతకంతకూ అంతర్ముఖుడై మనస్సుకు అధికారి యగును. అప్పుడతను మనస్సుయొక్క మూర్తిమత్వము, మనఃస్వరూపుడు పూర్తిగా మానసిక శరీరమునందు స్పృహ కలవాడై యావత్తు మనోమయ ప్రపంచానుభవములను పొందును.
ఇచ్చట భగవంతుని ఆదిమూలస్థితి ముఖాముఖీ కన్నులారా చూడగల్గును. అనగా భాగద్దర్శనము ప్రాప్తించును (బ్రహ్మ సాక్షాత్కారము) ప్రాప్తించును.
Notes:-సాక్షాత్కారము అక్షము = కన్ను సః+అక్షము = సాక్షాము, కన్నుటూ కూడినట్లు. సాక్షం కరూతీతి సాక్షాత్కారః = కంటికి ప్రత్యక్షమగునది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
ప్రాంజలి ప్రభ
సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
శ్రీనాథ కవి సార్వభౌముడు: సంక్షిప్త కధ
సీ. వేదండ వదన శుండాదండ గండూష
కాండ సిక్తాప్సరో మండలములు
గంధర్వ కన్యకా కనక సౌగంధిక
మాలికా లగ్న షాణ్మాతురములు
నందీశ్వర క్షిప్త నారంగ ఫలపాక
తరళ విద్యాద్ధరీ స్తన భరములు
గరుడ లీలావతీ కస్తూరికా పంక
పిహిత నిశ్శేషాంగ భృంగిరిటులు
తే. వీరభద్ర వికీర్ణ కర్పూర చూర్ణ
ధవళితాకాశ చర వనితా ముఖములు
శాంభవీ శంభు మధుకేళి సంభ్రమములు
పొదలి వాసించుఁ గాత నా హృదయ వీధి
పై పద్యం కవిసార్వభౌముడైన శ్రీనాధుని హరవిలాస కావ్యం లోనిది. కావ్య ప్రారంభంలో, ఇష్ట దేవతా ప్రార్థన చేసే సందర్భంలో శివపార్వతులను సంభావిస్తూ రాసిన పద్యం. ఏ కవి అయినా దైవప్రార్థన చేసేటప్పుడు ఒక నమస్కారం పెట్టి ఊరుకోడు. ఆ దేవుడి ప్రభావాన్నీ, లీలలనూ ఉత్ప్రేక్షలతోనో, రూపకాలతోనో చమత్కారంగా వర్ణించి – అలాంటి దేవుడు నా కృతిభర్తనూ నన్నూ కాపాడుగాక అని వేడుకోవడం పరిపాటి. అలాంటిదే ఈ పద్యమున్నూ. ఇందులో కేవలం శివపార్వతులనే గాక శైవలోకం లోని ఇతర ప్రధాన పెత్తందార్లనూ, వారి చేష్ఠావిన్యాసాలనూ వివరిస్తూ పద్యాన్ని నడిపించాడు కవి. మొత్తం మీద ఒక సందర్భాన్నీ, సంఘటననూ ఈ దేవదేవులూ, వారి పరివారమూ ఎలా నిర్వహించుకున్నారో, ఆ సంబరాన్ని తెలిపేది ఈ పద్యం.
సందర్భం మధుకేళి. అంటే వసంతోత్సవం. హోలీ పండగన్నమాట. రంగులు పులుముకోవడం, పిచికారీలతో రంగునీళ్ళు చిలకరించుకోవడం ఈ పండగలోని ప్రధాన కార్యక్రమం. ఇలాంటి సందర్భాల్లో చిన్నా పెద్దా తేడాల్లేకుండా, ఉల్లాసంగా అందరూ కలిసిపోవడం ఆనవాయితీ. అంతే కాదు, మర్యాద కోసం మనసులోనే దాచి వుంచుకొని బైటికి తెలుపుకోలేని కోరికలనూ, ఆశలనూ కొంచెం బయట పెట్టుకునే అవకాశం లభించేది ఇలాంటి సందర్భాల్లోనే. ఈ ఉల్లాసాన్నంతా ఈ పద్యంలో చూపించాడు శ్రీనాధుడు.
హరచూడా హరిణాంక వక్రతయు, కాలాంతః స్ఫురచ్చండికా
పరుషోద్గాఢ పయోధరస్ఫుట తటీ పర్యంత కాఠిన్యమున్,
సరసత్వంబును, సంభవించెననగా సత్కావ్యముల్ దిక్కులన్
చిరకాలంబు నటించుచుండు, కవిరాజీగేహ రంగంబులన్! (భీమ 1-11)
(ఆహా! ఎంత అద్భుతమైన కల్పన! ఒక వంక హరచూడా హరిణాంకుడి వక్రత, మరో వంక ప్రళయకాల భీభత్సపు మహోత్సాహంతో బిగువెక్కిన చండికా పయోధరాల కాఠిన్యం ఎలా కలిపాడండీ ఈ రెండిటినీ!)
వక్రత కాఠిన్యం సరసత అనేవి తన కవితా గుణాలుగా శ్రీనాథుడు పేర్కొన్నాడు.
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
42. రైలుఆట
భర్త ఇంటికి వచ్చేటప్పటి కల్ల కొడుకు సిగిరెట్ త్రాగుతున్నాడు
కోపంతో భార్యను పిలిచి పిల్లవాడు ఏమ్చేస్తున్నడో చూడనవసరములెదా నీకు
ఏమ్చేసాడండి వాడు సిగిరేట్ త్రాగుతున్నాడు నా ముందే
ఎందు కండి అంత కోపం మీరు త్రాగినప్పుడు నేనేమన్నాన
పిల్లవాడు రైలు ఆట ఆడుతానంటే నేనే సిగిరేట్ అంటించి ఇచ్ఛా ..........
పొగ ఎలా వదులు తున్నాడో ..........................
43. డ్రేవింగ్
ఇక్కడ కారుడ్రేవింగ్ నేర్పెదెవరండి
నేనేనండి అంటూ కుంటు తూ వచ్చాడు ఒకతను
ఏమిటి కాళ్ళకు చేతులకు కట్లు, ఆ ఏమ్లేదండి
కారుడ్రేవింగ్ నేర్పుతున్నప్పుడు ఆక్సిడెంటు అయింది అంతే
నడిపెవారికి ఏమినా జరిగిందా,
ఏమీ జరగలేదు ఆటను పరలోకం పోయాడు, నేను దెబ్బలతో
బయటపడ్డా అంతే, మీకు డ్రేవింగ్ నేర్పమంటారా ................
ఎప్పుడో ఒకసారి జరిగిందని ఎప్పుదూ జరుగుతుందా ..........
44. పార్టీ
అమ్మ అయ్య మీరు ఈ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి
మెన్న వేరే గుర్తు ఛెప్పావుగదా, అవును అప్పుడు ఆ పార్టీలో ఉన్నాను
ఆ పార్టీ వారు నాకు టికెట్టు ఇవ్వలేదు, వట్టి మోసగాళ్ళు
వాళ్లకు ఓటు వెయ్యవద్దు, నేను మీ కులపోడ్ని మరువద్దు .........
No comments:
Post a Comment