ప్రాంజలి ప్రభ
సమ్మోహనాలు ... మాత కాళికే
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఫెళఫెళ ధ్వని మిన్ను
మిన్నుచూచే కన్ను
కన్నుతో మన్నును తాకె మాత కాళికే
ధూళి ఎగసె పడుచూ
పడుచు వర్ణ మగుచూ
వర్ణాల దేహముగా మాతయు కాళికే
కాలుడే కనుపించె
కనిపించె భయముంచె
భయమును పెంచె రక్క సులపైన మాత కాళికే
కరుడిగట్టె హృదయము
హృదయమగ్ని గుండము
అగ్ని గుండం గాను మారేను కాళికే
ఈర్ష్య ద్వేషము తో
ద్వేషము కోపము తో
కోపమె రక్తపు టేరులు పారె కాళికే
వర్గ వైషమ్యాలు
వైషమ్య భావాలు
భావం లావా ప్రవాహంలా కాళికే
శూలమును ఝళిపించి
ఝళిపించి రక్షించి
రక్షించుఁ రక్కసుల నుండియే కాళికే
వణకిరి సురు లందరు
లందరు ఛిన్దేరు
చిందిన రక్కసులను చంపెను కాళికే
మదపూరిత మహిషునె
మహిషుని సమరం ననె
సమరమున వదించె రక్కసులను కాళికె
నమ్మిన వారి సేవ
సేవ అవినా భావ
భావ పరంపరులుగా రక్షగ కాళికే
సమ్మోహనాలు -- తప్పదు గ
రచాయట: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
బాధలకు పరిమితము
పరిమితపు జోవనము
జీవన సమరంలో బాధల్ని తప్పదు గ
ఆశలతో జీవము
జీవముకు ఆశయము
ఆశయము కొరకు నిత్య భాదలు తప్పఁవు గ
వయసు ఉత్సాహము
ఉత్సాహమ్ము ఫలము
ఫలము పొందాలన్న బాధలే తప్పవు గ
జోరు ఉన్న సమయము
సమయపు సందర్భము
సంధర్బ మాటల తో బాధలు తప్పవు గ
జీవమ్ము మారినా
మారిన హృదయానా
హృదయ స్వార్ధ పోకడ భాదలు తప్పవు గ
సమర్ధత చూపినా
చూపిన హృదయానా
హృదయ అనుమాన సాక్షి భాదలు తప్పవు గ
ఆనందపు అంచులే
అంచుల ఆత్రుతలే
ఆత్రుత తో మతిమరుపు భాదలు తప్పవు గ
పడి పడి నవ్వుతున్న
నవ్వుతు బతుకుతున్న
బతుకు బండికి ఏడుపు భాదలు తప్పవు గ
కాలము తడబడితే
తడబడు బతుకైతే
బతుకు ముగిసిపోయే భాదలే తప్పవు గ
కావ్యము తడబడినా
తడబడు కవికైనా
కవి ఆలోచనలా గె భాదలు తప్పవు గ
--(())--
ప్రాంజలి ప్రభ
సమ్మోహనాలు...రూపాయి
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
301. రూపాయి లభ్యమగు
లభ్యంతో ఆశగు
ఆశతొ మనిషి పతనమగు చుండు ఈశ్వరా
3౦2 రూపాయి పాపాయె
పాపాయె ముద్దాయె
మద్దు చేయక మూలదాచు మనిషి ఈశ్వరా
303. రూపాయి తో ప్రేమ
ప్రేమ ఊసుల భామ
భామలకు ఖర్చు కానరానిది ఈశ్వరా
304. రూపాయి ల ఆటే
ఆట హరి చంద్రాట
చంద్రుని నిజాయితీ మాటలు ఈశ్వరా
305. రూపాయి తో రూపము
రూపము తోను అహము
అహము నెత్తి నెక్కి తాండవమ్ము ఈశ్వరా
306. రూపాయి పతనమ్ము
పతనమ్ము భారమ్ము
భారమ్ము మనిషి ప్రగతి అడ్డు ఈశ్వరా
307. రూపాయి స్నేహము
స్నేహము కలకాలము
కాలము తో బతుకు మనిషిగతియె ఈశ్వరా
308. రూపాయి రాజీగ
రాజీయె దానంగ
దానమే బతుకు సంతసమ్మే ఈశ్వరా
309. రూపాయి మోక్షమ్ము
మోక్షమ్ము దైవమ్ము
దైవమ్ము ధర్మమ్ముతోడుగా ఈశ్వరా
310. రూపాయి తో కలత
కలత తెచ్చే యువత
యువత పెడదారిగా రూపాయి ఈశ్వరా
***(())***
నా ఫేస్బుక్ రద్దు చేసినందుకు బాధలేదు
తప్పులుంటే డిలీట్ చేయండి తప్పుకాకపోతే పబ్లిక్ పోస్టు చేయండి
ఇదే ప్రాంజలి ప్రభ విన్నపము
సమ్మోహనాలు ..మనిషిగా
రచాయిట: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
311 . సుఖాలతొ మనవిరా
మనవి కోలాటరా
కోలాట ఆటలతొ మనిషిగా జీవితం
312 . సంతసము ఏలురా
ఏలు కలియుగమురా
కలియుగ సుఖదు:ఖపు మనిషిగా జీవితం
313 . పక్క చూపు వద్దులె
వద్దు కధలు వద్దులె
వద్దు పుణ్య పాపల మనిషిగా జీవితం
314 .పరువాన్ని నేనిత్తు
నేనిత్తు సుఖమిత్తు
సుఖ భాధలను పొందు మనిషిగా జీవితం
315 . వలపునే అందిస్తు
అందిస్తు ముద్దిస్తు
ముద్దిస్తు మనశిస్తు మనిషిగా జీవితం
316 . లోకాన్ని చూడాలి
చూడాలి నీ ఆలి
ఆలి ని గౌరవించె మనిషిగా జీవితం
317 . లోకులను గమనించు
గమనించి బతికించు
బతికించి పోషించు మనిషిగా జీవితం
318 కలవ రింపు భయము .
భయము తీర్చు సమము
సమము కలపియు చూడు మనిషిగా జీవితం
319 . కనులలొ ముందు ఉండు
ఉండుము హృదయ మందు
హృదయమును పంచుటే మనిషిగా జీవితం
320 . కనువిందు చేస్తుండు
చేస్తుండు సుఖముండు
సుఖముండు ఎప్పుడూ మనిషిగా జీవితం
--(())--
No comments:
Post a Comment