ప్రాంజలి ప్రభ ,,, అంతర్జాల పత్రిక .. ప్రకృతి వనరులు
(ఆనందం ... ఆరోగ్యం ....ఆధ్యాత్మికం )
తేనె ..... 2001, పసుపు: 2002, ధనియాలు: 2003, సోంపు: 2004, అల్లం మరియూ శొంఠి: 2005, జీలకర్ర:2006, లవంగాలు:2007, ఏలకులు:2008, దాల్చిని చెక్క:2009, గసగసాలు: 2010,ఆవాలు: 2011,
తేనె ..... 2001
సేకరణ రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రకృతి ప్రసాదించిన అపురూప దివ్యౌషధం ఈ తేనె:
👉తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు ఉన్నాయి.
👉 థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్... లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి.
👉 ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి
👉కాలిన గాయాలకీ చర్మ క్యాన్సర్లకీ పుండ్లకీ హనీ పూస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి.
👉 ఇది 'యాంటీ మైక్రోబియల్' ఏజెంట్‌గా చక్కగా పనిచేస్తుంది.
👉చెడువాసనల్నీ వాపునీ మచ్చల్నీ కూడా మటుమాయం చేస్తుంది.
👉 స్థానికంగా దొరికే తేనెనే మీరు తీసుకుంటే ఆయా కాలాల్లో వచ్చే ఎలర్జీలన్నింటినీ తట్టుకునే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
👉 ఎందుకంటే ఎలర్జీలు సాధారణంగా పరాగరేణువులవల్లే వస్తాయి.
👉తేనెటీగలు మీ చుట్టుపక్కలున్న వెుక్కల నుంచే కదా తేనెను సేకరిస్తాయి కాబట్టి ఆ పరాగరేణువులు మీ శరీరంలో చేరి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నమాట.
👉ఊబకాయులు పరగడుపున రెండు టీస్పూన్ల నిమ్మరసంలో అరచెంచా తేనెను రంగరించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
👉తేనెలో ఔషధగుణాలున్న నూనెలు, ఫ్లేవోనాయిడ్‌లు, టెర్పీన్లు, పాలీఫినాల్‌లు ఉన్నాయి. ఇవి అనేక రకాల అల్సర్లను తగ్గిస్తాయి.
👉ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు- క్యాన్సర్, హృద్రోగాల్ని అడ్డుకుంటాయి.
👉మధుమేహ వ్యాధిగ్రస్తులు తేనెను మితంగా తీసుకుంటే బ్లడ్‌షుగర్ ఎంతమాత్రం పెరగదు.
👉తేనె రక్తప్రవాహంలో మెల్లమెల్లగా కలుస్తూ ఇన్సులిన్ తయారీని నిరోధిస్తుంది.
👉అజీర్తికీ విరేచనాలకీ తేనె దివ్యమైన మందు.
👉తేనె పంచదారకు మంచి ప్రత్యామ్నాయం. పండ్లరసాల్లో తేనె కలిపి తాగితే శక్తి పెరుగుతుంది. అలసట రాదు.
👉రోజు ఉదయాన్నే (పరగడుపున) స్పూన్ నిమ్మరసం, మిరియాల పొడి, తేనే వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు.
👉గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది.
👉తేనెను గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు.
👉ఉదయం పాలలో కలుపుకొని తాగితే బరువు పెరుగుతారు.
👉తేనె చాలా సులభంగా జీర్ణమై, ఇతర ఆహార పదార్థాలకంటే త్వరగా రక్తంలో కలుస్తుంది.
👉తేనె తింటే సున్నితమైన జీర్ణాశయం లోపలి పొరకు ఎలాంటి హాని కలగదు.
👉రక్తంలో కలిసిన తేనె మూత్రపిండాలు, ఇతర అంతర్భాగాలకు వినాశనకారి కాదు.
👉తేనె త్వరగా జీర్ణమై ఇతర ఆహారపదార్థాల కంటే ఎక్కువ శక్తి ఉత్పాదకతను కలిగి ఉంటుంది.
👉జుట్టుకు తేనె రాస్తే తెల్లబడుతుంది. కాబట్టి పొరబాటున కూడా రాయవద్దు...' అనేది మన పెద్దవాళ్ల హెచ్చరిక ఎంతమాత్రం నిజం కాదు, తేనెవల్ల పొడిబారిన జుట్టు మృదువుగా అవుతుంది.
👉చర్మంలోని తేమగుణాన్ని పెంపొందించే శక్తి తేనెకు ఉంది ఉంది.
👉పొడి జుట్టుకి తేనె, మందారం కలిపి మాస్క్ వేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.
👉తేనె లిప్‌బామ్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. పగిలిన పెదాల్ని సంరక్షిస్తుంది.
👉పాలు, తేనెల మిశ్రమాన్ని లేదా సెనగపిండిలో తెల్లసొన, తేనె కలిపి చర్మానికీ ముఖానికీ పట్టిస్తే అవి కాంతిమంతంగా మెరుస్తాయి.
👉మొటిమలు ఉన్న చోట తేనె రాసి ఒక అరగంట తర్వాత వెచ్చని నీటితో, తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తే మొటిమలు తగ్గుతాయి.
👉కృష్ణ వృత్తాలకి తేనెతో మసాజ్ చేసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి ఇలా ప్రతిరోజు చేస్తే కృష్ణ వృత్తాలు తగ్గుతాయి.
👉మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి.
👉తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు.
👉 అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు.
👉తేనెను మరిగించకూడదు. తేనె ఉష్ణ వీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు.
👉తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి.
👉మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ కలపకూడదు.
👉తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు.
👉తేనెను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచితే పంచదార స్పటికాలు తయారవుతాయి.
👉తేనెటీగలు రకరకాల పుల మకరందాలను పోగు చేసి తేనే రూపము లో మనకి అందిస్తున్నాయి .
👉తేనే లో ఉన్నా విటమిన్స్... శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిన్చును,
👉నిమ్మ రసము తో కలిపి దగ్గు , గొంతు నొప్పులకు బాగా పనిచేయును ,
👉యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నందున చర్మము పై పూసిన గాయాలు మానును .
👉రాత్రిళ్ళు పాలు తేనే కలుపుకొనే త్రాగితే చక్కటి నిద్ర వస్తుంది.
👉నిమ్మ రసం లో తేనే కలుపుకొని తీసుకుంటే కడుపు ఉబ్బరం , ఆయాసము తగ్గుతుంది .
👉రెండు చెంచాల తేనే లో కోడిగుడ్డు లోని తెల్లని సొన , కొంచెం శనగపిండి కలుపుకొని ముఖానికి మర్దన చేసుకుంటే చర్మపు కాంతి పెరుగుతుంది .
👉తేనే లో పసుపు , వేపాకు పొడి కలిపి రాస్తే పుండ్లు మానుతాయి .
👉 తేనె (15 భాగాలు), దాల్చిన చెక్క పొడి (1 భాగం) ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పూట 2వారాలపాటు ప్రయోగిస్తే మొటిమలు తగ్గుతాయి.
👉 2 చెంచాలు తేనెను కప్పు దాల్చిన చెక్క కషాయానికి కలిపి పుచ్చుకుంటే కీళ్లనొప్పిలో ఉపశమనం లభిస్తుంది.
👉 తేనెకు పసుపును చేర్చి బాగా కలిపి పై పూతగా ప్రయోగిస్తే అగ్నిదగ్ధ వ్రణాలు మచ్చపడకుండా ఇన్ఫెక్షన్ కి గురికాకుండా త్వరగా తగ్గుతాయి.
👉 తేనె (4 భాగాలు), పిప్పళ్ల పొడి (1 భాగం), మిరియం పొడి, లవంగాల పొడి, జీలకర్ర పొడి కలిపి గొంతు తగిలేలా పుక్కిట పడితే గొంతునొప్పి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
👉2 భాగాల తేనెకు 1 భాగం మీగడను, నాలుగైదు చుక్కలు రోజ్ వాటర్‌ని కలిపి పెదవుల మీద ప్రయోగిస్తే పెదవుల పగుళ్లు తగ్గి నున్నగా తయారవుతాయి.
తేనెకు జాజికాయ పొడిని కలిపి ఇస్తే పిల్లల్లో అతిసారం తగ్గుతుంది.
👉 2 చెంచాల తేనెను గ్లాసు నీళ్లకు చేర్చి వ్యాయామం ముందు తీసుకుంటే వ్యాయమ సమయంలో నిస్త్రాణ, నిస్సత్తువలు రాకుండా ఉంటాయి.
👉శృంగారానికి తేనె చాలా మంచి ఔషధం. టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి అవసరమయ్యే బీ విటమిన్ తేనె లో అధికంగా ఉంది.
👉 తేనె(3 భాగాలు), దాల్చిన పొడి (1 భాగం), ఆలివ్ నూనె (తగినంత) ఈ నిష్పత్తిలో కలిపి తలమీద ప్రయోగించి పావుగంట తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి.
👉 3 భాగాల తేనెకు 1 భాగం దాల్చిన చెక్క పొడిని కలిపి పుచ్చుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
👉 3 భాగాల తేనెకు 1 భాగం దాల్చిన చెక్క పొడిని కలిపి చిగుళ్ల పైన ప్రయోగిస్తే వాపు తగ్గి దంతశూల నుంచి ఉపశమనం లభిస్తుంది.
👉 చెంచాడు దాల్చిన చెక్క పొడిని 2 గ్లాసుల నీళ్లకు చేర్చి అరగ్లాసు కషాయం మిగిలేంతవరకూ మరిగించాలి. దీనికి మూడు టీస్పూన్లు తేనెను కలిపి ఆహారానికి అరగంట ముందు రెండు పూటలా పుచ్చుకుంటూ ఉంటే స్థూలకాయంలో మంచి ఫలితం కనిపిస్తుంది.
👉 తేనెకు తగినంత పాల పొడి కలిపి ఫేస్‌మాస్క్ మాదిరిగా పెట్టుకుంటుంటే ముఖం మీద వున్న మంగు తొలగి కాంతివంతంగా తయారవుతుంది.
👉 తేనెను బాదం పప్పు పొడికి కలిపి పేస్టుగాచేసి ముఖం మీద ప్రయోగించి రుద్దుకోవాలి.
👉ఇది చక్కని స్క్రబ్‌గా పనిచేస్తుంది. చర్మంమీద పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
👉 వృద్ధాప్య సమస్యల్లో తేనె చక్కగా ఉపయోగపడుతుంది. తేనె జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని సేద తీరేలా చేస్తుంది. మెదడును నిశ్శబ్దపరుస్తుంది. చర్మాన్ని బిగువుగా చేస్తుంది. చిన్నపాటి నొప్పులను దూరంచేస్తుంది.
👉ఒక జగ్గులో 3 కప్పుల తేనెను, 2 కప్పుల సిడర్ వెనిగార్‌ని, 1 కప్పు నీళ్లను కలపాలి. దీనిని ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు చొప్పున తాగుతుంటే వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉంటుంది.
👉 ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉన్నవారు, హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవారు తేనెను వాడి ప్రయోజనం పొందవచ్చు.
👉తాజా ఆకుకూరల మీద తేనెను పరిచి తీసుకుంటుంటే హితకరంగా ఉంటుంది. రక్తహీనత క్రమంగా దూరమవుతుంది.
👉 1 లీటరు వేడి నీళ్లకు 1 కప్పు తేనెను, అరకప్పు నిమ్మ రసాన్ని చేర్చి నూలు గుడ్డను ముంచి నొప్పి, వాపు ఉన్నచోట కీలుమీద పరిస్తే కీళ్ళ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
👉 ఒక బాటిల్‌లో మూడువంతులు సిడర్ వెనిగార్‌ని నింపి, కప్పు తేనెను కలపాలి. బాగా గిలకొట్టాలి. దీనిని ఆహారం తర్వాత మౌత్‌వాష్‌గా పుక్కిట పట్టాలి. చివరగా నీళ్లతో పుక్కిలించాలి. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది.
👉 చిన్నపిల్లలు పక్క తడుపుతున్నప్పుడు రెండు టీ స్పూన్ల తేనెను పిల్లలకు రెండుపూటలా ఇస్తుండాలి.
👉 రెండు చెంచాలు తేనెను, కోడిగుడ్డు తెల్లసొనను, గోధుమ పిండిని కలిపి పేస్టుమాదిరిగా చేసి సెగ్గడ్డమీద పూసి పైన గుడ్డతో కట్టుకట్టాలి. ఇలా చేస్తే గడ్డ పగిలిపోతుంది.
👉 తేనెను వేడి పాలకు గాని, కాఫీకి గాని లేదా టీకి గాని కలిపి పుచ్చుకుంటే గొంతులో అసౌకర్యంగా ఊపిరితిత్తుల్లో పట్టేసినట్లు ఉండటం తగ్గుతుంది.
👉చెంచాడు అల్లం రసానికి చెంచాడు తేనెను కలిపి మూడు పూటలా పుచ్చుకుంటూ వుంటే దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది.
👉 స్టౌ వద్ద కాలిన గాయాలకు, వేడి నీళ్లుపడటంవల్ల కాలిన గాయాలకు తేనెను నేరుగా ప్రయోగించవచ్చు.
👉 మోచేతులు, పాదాల వంటి భాగాల్లో చర్మం పగిలి ఇబ్బందిని కలిగిస్తుంటే తేనె, నిమ్మరసం ఆలివ్ నూనె కలిపి పేస్టులా చేసి ప్రయోగించాలి.
👉 ఒక కప్పు వేడి పాలలో, చెంచా తేనె కలిపి పిల్లలతో తాగిస్తే అలసట దూరమై పుష్టిగా తయారవుతారు.
👉కడుపులో క్రిములను, పుండ్లను తగ్గించడానికి, రక్తలేమిని నివారించడానికి ఇది చక్కని ఔషధం.
👉రాత్రి పడుకునే ముందు తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది.
👉 రెండు చెంచాల తేనె, నాలుగు చెంచాల నిమ్మరసం, చిటికెడు ఉప్పు బాగా కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించాలి. ఇలా చేస్తే నోట్లో పొక్కులు, దుర్వాసన తగ్గుతాయి.
👉 పొద్దున్నే కాఫీ, టీలకు బదులుగా తేనె టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
👉 పరగడుపున కప్పు వేణ్నీళ్లలో చెంచా తేనె కలిపి మెల్లగా చప్పరిస్తూ తాగాలి. అజీర్తి సమస్యలకు ఇది చక్కని ఔషధం. రోజుకు రెండు మూడు సార్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది.
👉 కప్పు వేణ్నీళ్లలో కొంచెం నిమ్మరసం, చెంచా తేనెను బాగా కలపాలి. కాలేయ సమస్యలున్న వాళ్లు దీన్ని తాగితే మంచి ఫలితాలుంటాయి. ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. శరీరం మీద మచ్చలు చాలా తేలిగ్గా తగ్గుతాయి. పడుకునే ముందు తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏
--*())--
వంటగదే ఒక ఔషధ నిలయం.
👉మాములుగా వచ్చే జలుబూ జ్వరాల నుండి తీవ్రంగా వుండే ఆస్తమా, మధుమేహం వరకూ కూడా మన వంటిట్లో ఉన్న వస్తువులతో తగ్గించుకోవచ్చు. మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ వద్దకు వెళ్ళాలి.
1). పసుపు: 2002
👉పసుపుని పై పూతగా మరియూ లోపలికి కూడా తీసుకుంటారు.
👉నీళ్లతో కలిపి పాదాలకు పూయడం వలన ఫంగస్ వ్యాధులు, గజ్జి మరియూ ఇతర బాక్టీరియా వ్యాధులు తగ్గిపోతాయి. కాళ్ళ పగుళ్లు కూడా రాకుండా ఉంటాయి.
👉పసుపుని కొద్దిగా నూనెతో కలిపి కాలి వేళ్ళ మధ్య పూస్తే నీళ్లలో నానడం ద్వారా వచ్చే ఎలర్జీ తగ్గి పాదాలకి అందం కూడా వస్తుంది.
👉ముఖానికి పూస్తే నల్ల మచ్చలు, మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.
👉పసుపులో బెల్లం కలిపి తింటే కడుపులో మంట, అల్సర్లు తగ్గుతాయి.
👉పసుపు పూయడం వల్ల శరీరం మీద వచ్చే ఎర్రని దద్దుర్లు (rashes) తగ్గుతాయి.
👉 బాలింతలకు ఇస్తే పాలు బాగా పడుతాయి.
👉వేడి పాలలో ఒక గ్రాము పసుపు కలిపి ఇస్తే జలుబు, దగ్గు, తగ్గిపోతాయి.
👉5 గ్రాముల పసుపు, 5 గ్రాముల ఉసిరి పొడి కలిపి ఉదయం పరకడుపున తీసుకుంటే మధుమేహం క్రమేనా తగ్గుతుంది.
👉పసుపు నిత్యం తీసుకునే వారిలో జీర్ణవ్యవస్ధ కి సంబంధించిన క్యాన్సర్ లు రాకుండా ఉంటాయి.
👉అప్పుడే తగిలిన గాయాల మీద పసుపు వేస్తే చీము పట్టకుండా తొందరగా మానిపోతాయి.
👉పసుపు కేవలం ఒక ఔషదమే కాక గొప్ప సౌందర్య పోషకం కూడా.
2).ధనియాలు: 2003
👉కాచి చల్లార్చిన నీటిలో నాలుగో వంతు దంచిన పచ్చి దనియాలను రెండు గంటల పాటు నానబెట్టి అందులో చక్కెర కలిపి ఆ నీటిని త్రాగితే జ్వరం వెంటనే తగ్గుతుంది.
👉దప్పిక, మంట పూర్తిగా పోతుంది. చెమట బాగా పడుతుంది.
👉పారాసిటమోల్ టాబ్లెట్ కంటే చాలా త్వరగా పని చేస్తుంది.
👉కళ్ళ కలకలకు ఈ నీటిని వడగట్టి కళ్ళలో వేస్తే దురద, మంట మరియు ఎరుపు రంగు తగ్గిపోతాయి.
👉పచ్చి దనియాలను నూరి కడితే ఎలాంటి తలనొప్పి అయినా తగ్గిపోతుంది.
👉మూలవ్యాధి లో, చక్కెర కలిపిన పొడి లేక ధనియాల నీళ్లను ఇస్తే దురద, రక్తస్రావం తగ్గిపోతాయి.
👉మోతాదు: 5 నుండి 10 గ్రా పొడి కి 50 నుండి 100 మి లీ నీరు కలపాలి.
3). సోంపు:
👉సోంపు ని దంచి నీళ్లలో ఒక గంట నానబెట్టి ఆ తరవాత ఆ నీళ్ళని బాగా కలబెట్టి తాగితే కడుపు నొప్పి, గస్ట్రీక్ సమస్య తగ్గుతుంది.
👉
👉విరేచనం సాఫీగా అవుతుంది.
👉నులిపురుగులు కూడా పడి పోతాయి.
👉కఫం అడ్డగించి ఆయాసపడే వ్యక్తులకు ఇది వెంటనే శ్వాశ నాళాలను తెరిపించి శ్వాశ బాగా ఆడేటట్లు చేస్తుంది.
👉అతిసార వ్యాధి ఉన్నవారికి మెంతుల పొడితో కలిపి ఈ పొడిని ఇవ్వవచ్చు.
👉సోంపుకి కొన్ని నీళ్ళు కలిపి నూరి మెత్తని పేస్టులా చేసి ఎముకల నొప్పి ఎక్కడ ఉందో అక్కడ పట్టిస్తే ఎముకల నొప్పి తగ్గుతుంది.
👉మూత్రంలో వచ్చే మంటకు సోంపు చాలా బాగా పని చేస్తుంది.
3). అల్లం మరియూ శొంఠి: 2005
👉అజీర్ణ వ్యాధితో బాధపడేవారు భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను ఒక ఉప్పురయితో కలిపి నమిలి తింటే ఆకలి పెరుగుతుంది.
👉నాలుక, కంఠం శుభ్రపడి రుచి బాగా తెలుస్తుంది.
👉తేనెతో కలిపి అల్లం రసం తాగితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.
👉నీరుల్లితో కలిపి అల్లం రసం తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి.
👉ప్రయాణాల్లో వాంతులు వచ్చేవారు రెండు స్ఫూన్ల అల్లం రసం కానీ లేక ఒక స్పూన్ శొంఠి పొడి కానీ తీసుకుంటే 12గంటల వరకు వాంతులు రావు.
👉అమీబియాసిస్ వ్యాధికి శొంఠి చాలా మంచిది.
👉కీళ్ల నొప్పులకు శొంఠి పొడి రోజూ తీసుకుంటే వాపు తగ్గి కీళ్లు బాగా వంగుతాయు.
4). జీలకర్ర:2006
👉జీలకర్ర వాడటం వలన జీర్ణాశయంలో వచ్చే అల్సర్లు తగ్గుతాయి.
👉లివర్ పనిచేయడం మెరుగుపడుతుంది.
👉నెలల తరబడి బాధించే రక్త విరేచనాలు పూర్తిగా తగ్గిపోతాయి.
👉అతిసారంతో బాధపడే వారికి మజ్జిగ లేక పెరుగుతో కలిపి ఇస్తే గంటలో తగ్గిపోతాయి. మూత్రం కూడా సాఫీగా వస్తుంది.
👉బాలింతలకు పాలు బాగా పడుతాయి.
👉మూలవ్యాధితో ఉన్నవారికి రక్తస్రావం తగ్గుతుంది.
👉నిద్ర బాగా వస్తుంది.
👉శరీరంలో ఏ కండరము నొప్పి అయినా సరే కొన్ని గంటల్లో తగ్గిస్తుంది.
5). లవంగాలు:2007
👉ఇవి పళ్ళకి, కంఠానికి సంబంధించిన వ్యాధులలో చాలా బాగా పని చేస్తుంది.
👉చిగుళ్ల నుండి రక్తం కారే వారు ఒక లవంగం బుగ్గన పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే చిగుళ్ళు గట్టిపడుతాయి.
👉నోటి దుర్వాసన దూరం అవుతుంది.
👉పిప్పి పన్ను మొదటి దశలో లవంగాన్ని మెత్తటి పొడి చేసి పన్ను భాగంలో నింపి ఒక గంటసేపు అలాగే ఉంచగలిగితే వెంటనే పోటు తగ్గి దంతక్షయం కలుగకుండా ఉంటుంది.
👉వేడి నీళ్లలో నాలుగు లవంగాలు వేసి ఆ నీళ్లను ఒక్కో స్పూన్ తాగుతూ ఉంటే కలరా,అతిసారం వంటి వ్యాధుల కారణంగా వచ్చే దప్పిక తగ్గుతుంది.
👉అజీర్ణం, కడుపులో గ్యాస్ చేరడం వంటి సమస్యలకు లవంగాలు చూర్ణం (500mg) 10 నిమిషాలలో ఫలితం చూపుతుంది.
6). ఏలకులు:2008
👉అతిసారం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేని వారికి ఒక గ్లాస్ పాలలో రెండు గ్రాముల యాలకుల పొడిని కలిపి ఇస్తే బలం చేకూరుతుంది.
👉యాలకుల కి కిడ్నీల మీద పని చేసే ప్రభావం కలిగి ఉంటుంది.
👉ప్రతిరోజూ యాలకుల పొడిని తీసుకుంటే మూత్రం అధికంగా వచ్చి మూత్రంలో రాళ్లు పోతాయి.
👉గుండె దడ వచ్చే వ్యక్తుల్లో యాలకుల పొడి వలన గుండె దడ తగ్గుతుంది.
👉మాటమాటకి తల తిరిగే వ్యక్తులకు యాలకులను చక్కెర పొడి మరియూ నేతితో కలిపి తీసుకోవడం ద్వారా ఈ సమస్య పోతుంది.
8). దాల్చిని చెక్క:2009,
👉ఇది పళ్లకు, చిగుళ్ల కు సంబంధించిన సమస్యలకు బాగా పని చేస్తుంది.
👉దీని వలన ఆహారం జీర్ణం బాగా అవుతుంది.
👉తినే ఆహారంలో దాల్చిని చెక్క చేర్చడం వల్ల కాన్సర్, అల్సర్లు రాకుండా ఉంటాయి.
👉టైఫాయిడ్ జ్వరం ఉన్నపుడు ఈ పొడిని వేడి నీళ్లలో కాసేపు ఉంచి ఆ నీటిని వేడి చేసి ఇస్తే జ్వరం తగ్గుతుంది.
👉సూక్ష్మజీవుల వలన కలిగే విషప్రభావం తగ్గుతుంది.
👉రక్త స్రావం కాకుండా ఆపుతుంది.
👉చీటికీ మాటికీ నోటిలో పుండ్లు వచ్చే వారికి ఈ దాల్చిని చెక్క చూర్ణం చాలా మంచిగా పని చేస్తుంది.
10). గసగసాలు:2010,
👉వీటిని ఒక గ్లాస్ వేడి నీళ్లలో ఒక గంటసేపు ఉంచి ఆ తర్వాత తాగితే తలనొప్పి తగ్గుతుంది.
👉అలసట వల్ల కలిగిన వంటి నొప్పులు కూడా తగ్గుతాయి.
👉వీటి పొడి మజ్జిగలో కలిపి తాగితే నీళ్ల విరేచనాలు అరగంటలో తగ్గిపోతాయి.
👉అరగ్రాము పొడి పాలతో కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది.
👉గొంతు వాచి నొప్పిగా ఉన్నప్పుడు వీటి కషాయం తో పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుంది.
11). ఆవాలు: 2011,
👉ఆవాలను పొడి చేసి బెల్లంతో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి పిల్లలకు తినిపిస్తే రాత్రిళ్ళు పక్క తడిపే అలవాటు తగ్గుతుంది.
👉ఆవాల పొడిని నీళ్లతో కలిపి పైకి పూయడం వల్ల చర్మ రోగాలు పోతాయి.
👉ఆవాలను నిప్పులపై వేసి పొగ పట్టడం ద్వారా ఊపిరి తిత్తుల వ్యాధులు నయం అవుతాయి.
👉ఊళ్ళో ఆటలమ్మ వచ్చినపుడు ఈ పొగ వేయడం చాలా మంచిది.
👉ఆవనూనెతో కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
✍️పైన తెలిపిన అంశాల కన్నా ఇంకా ఎక్కువగా మేలు చేసే గొప్ప గుణాలు కలిగి ఉన్నాయి. మీకు అవగాహన కలిపించడం కోసం ఇక్కడ కొన్ని ముఖ్యమైన గుణాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఇంతకు ముందు పెట్టిన పోస్టులలో మరికొన్ని ముఖ్యమైన వంటగదిలోని ఔషధాల గురించి వివరించడం జరిగింది. వాటిని కూడా ఒకసారి చూడండి.
🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏
🌹💐ప్రతిరోజు ఆరోగ్య నియమాలు మరియు సూచనలు ఉచితంగా పొందుటకు ఈ క్రింద ఇవ్వబడిన మా పేజీ ని లైక్ చేసి ఫాలో అవ్వండి.🌹
---(())--
వాము తో వంద ప్రయోజనాలు :
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః
వాము లేదా ఓమను సంస్కృతంలో దీప్యక అని, హిందీలో అజ్వైన్ అని అంటారు.ఇది సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ పువ్వులనుంచే విత్తులు వస్తాయి. వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఈరోజు అరిగినట్లు లేదే అనగానే, 'కాసింత వాము వేడినీటితో కలిపి నమలవే. సమస్య తగ్గిపోతుంది' అనే అమ్మమ్మల మాటలు గుర్తుండేవుంటాయి.
వాము ఈజిప్టుకు చెందిన సుగంధ ద్రవ్యం, కానీ ఇది భారత ఉపఖండంలో అత్యంత సాధారణ మసాలా దినుసులలో ఒకటిగా మారింది. వాము యొక్క చేదు రుచి సాధారణంగా థైమ్ (ఒక రకమైన వాము జాతికి చెందిన మొక్క)తో పోల్చబడుతుంది. ఈ రెండు మూలికలు థైమోల్ అని పిలువబడే ఒక రసాయన పదార్ధాన్నికలిగి ఉంటాయి. మీరు రెండు మూలికలను పోల్చి చూస్తే, వాము యొక్క సువాసన థైమ్ కంటే చాలా ఎక్కువ మీరు కనుగొంటారు. ఏమైనప్పటికీ, ఈ రెండు మూలికలు వంటగదిలోకి చేరాయి.
ఒకవేళ మీకు సొంతంగా గృహ నివారణలను తయారుచెయ్యడం ఇష్టం ఐతే, ఇప్పటికే మీకు వాముకు ఇంపైన రుచి మాత్రమే కాక,చాలా ఔషధ గుణాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. సాంప్రదాయకంగా, వాము గ్యాస్, ఆమ్లత్వం (acidity), మరియు కడుపు నొప్పి వంటి అత్యంత సాధారణ జీర్ణాశయ సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వాము నీరు ఒక తెలిసిన స్తన్యవృద్ధ్యౌషధము (galactagogue) (పాలు ఇచ్చే తల్లులలో పాల స్రావం మెరుగుపరుస్తుంది) మరియు బరువు తగ్గడానికి ప్రసిద్ధి చెందిన చిట్కా.
వాము మొక్క ఒక వార్షిక మొక్క, అంటే దీనిని ప్రతి సంవత్సరం తిరిగి భూమిలో నాటాలి. ఈ మొక్క యొక్క సగటు ఎత్తు 60 నుండి 90 మీటర్లు.వాము మొక్క కొమ్మల మీద పొడవైన గీతలు వుంటాయి మరియు వాము ఆకులు ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటాయి. వాము పుష్పాలు చిన్నగా, తెల్లగా ఉండి శాఖల కొనపై సమూహాలుగా పెరుగుతాయి.
వాము గింజలు ఆకుపచ్చ నుండి గోధుమ రంగులో ఉంటాయి మరియు వాటి పైభాగం మీద స్పష్టమైన గీతలు కలిగి ఉంటాయి.
మీకు తెలుసా ?
కొన్ని జానపద సంప్రదాయాలలో వామును కుడా ఉంచుకోవడం వల్ల జీవితంలో అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు.
వాము గురించి కొన్ని ప్రాధిమిక నిజాలు:
శాస్త్రీయ నామము: ట్రేకీస్పెర్ముమ్ ఎమ్మీ (Trachyspermum ammi)
కుటుంబం: ఏపియసి
సాధారణ నామం: వాము, కెరొమ్ సీడ్స్
సంసృత నామం: అజమోదా,యామిని
వినియోగించే భాగాలు: విత్తనాలు
స్థానిక ప్రాంతము మరియు భౌగోళిక విస్టీర్ణం: వాము ఈజిప్ట్ కు చెందినది కానీ ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, ఇరాక్ మరియు ఇరాన్ దేశాలలో కూడా లభిస్తుంది. భారత దేశంలో వామును ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, రాజస్థాన్,మహారాష్ట్ర రాష్ట్రాలలో పెంచుతారు.
శక్తి శాస్త్రం: వేడి
వాము భారతీయులకు తెలిసిన గొప్ప ఓషధి. సాధారణంగా మనం వామును చక్రాలు(జంతికలు, మురుకులు) చేసినపుడు వాడుతుంటాం. పూర్వంనుండీ వాడుతున్నారని వాడటమే తప్ప ఇందులోని సుగుణాలు చాలామందికి తెలీవు. వాము జీర్ణశక్తికి మంచిదని మాత్రం చాలామందికి తెలుసు. వాము జీలకర్రలా అనిపించినా చిన్నగా వుంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా వుంటుంది. రూపంలో చిన్నదైనా చేసే మేలులో పెద్ద స్థానాన్నే ఆక్రమించింది.' మరి వాములో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం..
సాంప్రదాయ మరియు జానపద ఔషధంలలో వాము అనేక విధాలుగా ఉపయోగిస్తారు. దురదృష్టవశాత్తు, మానవులపై వాము యొక్క ఆరోగ్య ప్రయోజనాలు చాలావరకు శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు.
అయినప్పటికీ, చాలా ప్రీ-క్లినికల్ ట్రయల్స్ ఆయుర్వేద మరియు జానపద వాదనలను నిర్ధారించాయి. వాము గురించి మనకు తెలిసిన వాటిని అన్వేషిద్దాం.
కడుపు కోసం వాము:
వాముకు కడుపును శాంతపరచే ప్రభావం ఉంటుంది మరియు కడుపు నొప్పి, గ్యాస్, అపానవాయువు, ఉబ్బరం మరియు అజీర్ణం వంటి అనేక కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం,కడుపులో జీర్ణ ఎంజైమ్స్ యొక్క స్రావాన్ని మెరుగుపరచి వాము అతిసారం మరియు మలబద్ధకం నిర్వహణలో కూడా ప్రభావవంతమైనదిగా ఉంటుంది.
బరువు తగ్గుదల మరియు కొలెస్ట్రాల్ నిర్వహణ కోసం వాము: జీర్ణ సమస్యలను తగ్గించడం ద్వారా, వామును నీటితో తీసుకున్నప్పుడు బరువు తగ్గడానికి మరియు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
మహిళలకు వాము: వాములో మహిళల కోసం అనేక ప్రయోజనాలున్నాయి. దాని స్పామోడిక్ వ్యతిరేక (anti-spasmodic) ఎఫెక్ట్స్ ఋతుచక్ర నొప్పి మరియు తిమ్మిరి నుండి ఉపశమనం పొందటానికి సహాయపడతాయి. చనుబాలులిచ్చు తల్లులలో, పాలను మెరుగుపర్చడానికి వాము సహాయపడుతుంది. కానీ, గర్భధారణ సమయంలో ఈ మూలికను ఉపయోగించే ముందు జాగ్రత్త తీసుకోవాలి.
వాము ఒక యాంటీమైక్రోబయాల్, యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీగా చెప్పవచ్చు: విస్తృత శ్రేణి సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా వాము పనిచేస్తుందని రుజువు చేయబడింది, అందుచే కడుపులో పురుగుల చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించటానికి సహాయపడతాయి, దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మం మరియు జుట్టు యొక్క ఆరోగ్యానికి ఉత్తమమైనవి.
శ్వాసకోశ ఆరోగ్యానికి వాము: అజ్వైన్ విత్తనాలు సాధారణ జలుబు, దగ్గు మరియు ఉబ్బసం యొక్క నిర్వహణలో ఉపయోగపడతాయి.
జలుబు, మైగ్రెయిన్ తలనొప్పికి
జలుబు, మైగ్రెయిన్ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది.
జ్వరం :
వాము, ధనియాలు, జీలకర్ర - ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
వాంతులు :
వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
అజీర్ణం :
వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.
దంత వ్యాధులు :
వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయలతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.
గొంతులో బాధ :
వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి.
మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది.
వామును వివిధ రూపాలలో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది.
వాము ఆస్తమా తగ్గిస్తుంది
ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది.
వాము గుండెవ్యాధులు నివారిస్తుంది.
గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
వాము కీళ్ళ నొప్పులను తగ్గించడంలో దానికదే సాటి
రెగ్యులర్ డైట్ లో వామును మరియు వామునూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
కడుపులో వచ్చే గడబిడలను
ఆల్కహాలు తాగిన తర్వాత కడుపులో వచ్చే గడబిడలను, వికారాన్ని నియంత్రించేందుకు వాము తినవచ్చు. ఆకలి పెంచుతుంది.
బహిష్టు నొప్పులకు వాము
బహిష్టు నొప్పులకు వాడితే మంచి ఫలితం వుంటుంది. వేయించిన వామును పాలతో తీసుకోవాలి.
ఎసిడిటీ తగ్గుతుంది
వేయించిన వాము, జీలకర్ర నీటిలో మరిగించి తాగితే ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది.
చలికాలం జలుబు, దగ్గులు తగ్గుతాయి.
చలికాలం జలుబు, దగ్గులు తగ్గుతాయి. కొద్దిగా నోటిలో వేసుకొని వేడి నీటితో కలిపి నమలాలి.
గర్భవతులు రెగ్యులర్ గా తింటే..?
గర్భవతులు రెగ్యులర్ గా తింటే రక్తాన్ని శుభ్రపరచటమే కాక శరీరంలోని రక్తప్రసరణ సరిగా సాగేలా సహకరిస్తుంది.
ఇవన్నీ వాము తినటం వలన వచ్చే ఆరోగ్య లాభాలు. వీటిని పప్పులు, కూరలు, రొట్టెలు, పరోటాలు లేదా వేయించిన పకోడిలలో కూడా వేసి రుచిని ఆరోగ్యాన్ని కలిగించవచ్చు.
జీర్ణక్రియ కోసం వాము -
రెండు వేర్వేరు ఇన్ వివో (in vivo) అధ్యయనాల (అంటే జంతు అధ్యయనాలు) ప్రకారం, వాము గ్యాస్ట్రిక్ యాసిడ్ స్రవించడాన్ని పెంచుతుంది మరియు కడుపు. ప్రేగులలో ఆహారం యొక్క ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. అదనంగా, వాము తీసుకోవడం పిత్త నాళిక స్రావాల్ని మరియు జీర్ణ ఎంజైమ్లు స్రవించడాన్ని పెంచుతుంది అని నివేదించబడింది. అందువల్ల, జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపర్చడానికి వాముకు ఖచ్చితమైన సామర్ధ్యం ఉంది. క్లినికల్ అధ్యయనాల లేకపోవడం వలన, మానవులపై వాము యొక్క సామర్ధత నిర్ధారించడం చాలా కష్టం.
వాయువు కోసం వాము -
సాంప్రదాయ మరియు జానపద ఔషధం వామును గ్యాస్ మరియు అపానవాయువుకు వ్యతిరేకంగా పనిచేసే ఒక అద్భుతమైన నివారణగా గుర్తించింది. గ్యాస్ నివారణ కోసం 500 గ్రాముల వాము కు 60 గ్రాముల రాతి ఉప్పు, నల్ల ఉప్పు, మరియు సాధారణ ఉప్పును 1: 1: 1 నిష్పత్తితో జోడించడం ద్వారా ఒక సాంప్రదాయక మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఈ మిశ్రమం యొక్క ఒక చెంచాను గోరు వెచ్చని నీటిలో కలిపి గ్యాస్, వాంతులు, మరియు వికారం యొక్క లక్షణాలు నుండి ఉపశమనం పొందడానికి తీసుకుంటారు. ఆయుర్వేద వైద్యుల ప్రకారం, వాము ఒక్కటి కూడా సులభంగా ప్రేగుల వాయువును తగ్గిస్తుంది.
కడుపు నొప్పి కోసం వాము
వాము కడుపు నొప్పి మరియు బిగుతుగా ఉన్న భావనకు అత్యంత సాధారణంగా ఉపయోగించే నివారణలలో ఒకటి. ఆయుర్వేద వైద్యులు కడుపు నొప్పుల ఉపశమనం కోసం వాము, అల్లం మిశ్రమాన్ని సూచిస్తారు. ఇటీవలి అధ్యయనాలు వాము కాల్షియం ఛానల్స్ ను అడ్డుకోవడం ద్వారా పనిచేస్తుందని సూచిస్తుంది, ఇది కడుపు బిగుతును తగ్గిస్తుందని స్పస్టమైంది. అంతే కాక, వాము యొక్క ఈ లక్షణం అతిసారం యొక్క లక్షణాలను తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది.
అతిసారం కోసం వాము -
ఇన్ వివో (in vivo) అధ్యయనాల్లో వాము యొక్క ఆల్కహాలిక్ సారాలకు అతిసార వ్యతిరేక చర్యలు (anti diarrheal activity) ఉన్నాయని సూచించబడింది. ఈ అతిసార వ్యతిరేక చర్యలు వాములో ఉన్న సపోరోన్స్ (saponins). ఫ్లేవానాయిడ్లు (flavonoids), స్టెరాల్స్ (sterols) మరియు టానిన్లు (tanins) వంటి జీవసంబంధమైన సమ్మేళనాల వలన అని సూచించబడింది. అయినప్పటికీ, మానవ అధ్యయనాల లేకపోవడం వలన, వాము యొక్క అతిసార వ్యతిరేక సామర్ధతను నిర్ధారించడం కష్టం.
మలబద్దనికి వాము -
వాము యొక్క భేదసూత్ర లక్షణాలపై ప్రత్యేక అధ్యయనాలు లేనప్పటికీ, మలబద్ధకంను నివారించడానికి ఇది చాలా ముఖ్యమైన నివారణాల్లో ఒకటిగా ఉంది. ఆహరం జీర్ణశయాంతర ప్రేగుమార్గం ద్వారా ప్రయాణించే సమయాన్ని వాము తగ్గిస్తుందని అది జీర్ణ క్రియను మెరుగు పరుస్తుందని కొన్ని ప్రయోగశాల ఆధారిత అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ రెండు లక్షణాలు వామును మలబద్దకాన్ని తగ్గించే నివారిణి గా చేసాయి. కానీ, ఖచ్చితమైన మలబద్ధక నివారణిగా దాని సామర్థ్యం నిర్ధారించ బడలేదు. మలబద్ధకం కోసం వాము యొక్క ఉపయోగాలు గురించి మరింత తెలుసుకోవాలంటే మీ ఆయుర్వేద వ్యైద్యునితో మాట్లాడటం మంచిది.
బరువు తగ్గడం కోసం వాము -
ఆయుర్వేద వైద్యుల ప్రకారం,వాము ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసి, గ్యాస్ మరియు అపానవాయువు వంటి జీర్ణ రుగ్మతలను తగ్గిస్తుంది. వాము యొక్క ఈ మూడు లక్షణాలను మీ బరువును తగ్గించడానికి సహాయపడవచ్చు. కానీ, అది ఆకలిని కూడా పెంచుతుంది. ఈ ఆకలిని పెంచే లక్షణం వాము యొక్క బరువును తగ్గించే ప్రయోజనానికి వ్యతిరేకంగా ఉంది. శరీర బరువును కోల్పోవడంలో వామును తింటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని జంతు అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ, మానవ అధ్యయనాలు లేనప్పుడు, ఏ రూపంలో అయినా వామును తీసుకునే ముందు మీ వైద్యునితో మాట్లాడటం మంచిది.
గర్భధారణ సమయంలో వాము -
వాము జానపద వైద్యంలో అగ్రశ్రేణి శస్త్రచికిత్సలలో ఒకటిగా జాబితా చేయబడింది. భారతదేశంలో జరిపిన ప్రజల ఆధారిత అధ్యయనంలో, గర్భస్రావం (abortion) కోసం సుమారు 155 మంది మహిళలు వామును ఉపయోగించారని అంగీకరించారు. ఐతే, ఈ మూలికలో గర్భస్రావాన్నీ ప్రేరేపించదానికి 100% సామర్ధ్యం లేదు, కానీ గర్భధారణ సమయంలో వాము యొక్క వినియోగం పుట్టిన పిల్లలలో లోపాలకు కారణంగా గుర్తించబడింది. జంతువుల మీద జరిపిన ప్రయోగాలలో వాము యొక్క ఎదిగే పిండములో శారీరక వికలములు కలుగజేసే కారణం (teratogenic action) ఆధారంగా పిండం కోసం వాము విషతుల్యమైనదని తెలుస్తుంది.
పాలు ఇచ్చే తల్లుల కోసం వాము -
వామును పాలు ఇచ్చే తల్లులు క్షీర గ్రంధుల నుండి పాల ప్రవాహాన్ని పెంచడానికి పారంపర్యంగా ఉపయోగిస్తున్నారు. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు జరిపిన జంతు అధ్యయనాలు వాము నీరు సమర్థవంతమైన స్తన్యవృద్ధ్యౌషధము (galactagogue) అని తెలిపాయి. అంతే కాక వాములో కొన్ని ఫైటోఎస్ట్రోజెన్లు (మొక్క-ఆధారిత ఈస్ట్రోజెన్) ఉన్నాయని అవి పాలు ఇచ్చే తల్లుల శరీర ఈస్ట్రోజెన్ తో కలుస్తాయని తెలిపారు. పాలు ఇచ్చే తల్లులు ఏ రూపంలో అయినా వామును తీసుకొనే ముందు వైద్యునితో మాట్లాడడం మంచిది.
దగ్గు కోసం వాము -
ప్రీ క్లినికల్ అధ్యయనాలు వామును ఒక శక్తివంతమైన యాంటీటస్సివ్ (దగ్గు నుంచి ఉపశమనం) అని సూచించాయి. వాము యొక్క ఈ యాంటీటస్సివ్ ప్రభావం వాము సారాలను అధిక మోతాదులో ఇచ్చినప్పుడు మరింత ప్రాముఖ్యంగా తెలిసింది. అంతేకాకుండా, వాము సమర్థవంతమైన యాంటిస్పాంస్మోడిక్ (antispasmodic)గా కూడా నివేదించబడింది. కాబట్టి, ఇది గొంతు కండరాలను విశ్రాంత పరచడం ద్వారా దగ్గు తగ్గుదలకు సహాయపడుతుంది. కానీ, క్లినికల్ ట్రయల్స్ లేకపోవాడం వల్ల, వాము తీసుకునే ముందు మీ వైద్యునితో మాట్లాడటం చాలా మంచిది.
ఉబ్బసం కోసం వాము -
ఇరాన్లో జరిపిన క్లినికల్ అధ్యయనం ప్రకారం,వాము ఒక సమర్థవంతమైన శ్వాస నాళాలను వదులు (బ్రోన్కైడైలేటరీ) చేయు మూలిక అని తెలిసింది.ఈ అధ్యయనంలో,కొంత మంది ఆస్తమా రోగుల బృందానికి వాము యొక్క రెండు వేర్వేరు మోతాదులను లేదా ఒక సాధారణ ఆస్తమా ఔషధం ఇవ్వబడింది. మరొక సమూహనికి మందులు ఏమి ఇవ్వబడలేదు. సమయం ముగిసిన తరువాత, వాము బ్రాంచోడైలేటర్ చర్యను కలిగి ఉంది అని,అది ఒక వాణిజ్య ఔషధానికి సమానమైనది తెలిసింది.అందువల్ల, ఆస్తమా లక్షణాల కోసం వాము ఉపయోగకరమని చెప్పవచ్చు.వామును తీసుకునే ముందు మీ వైద్యున్నీ సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.
జలుబు కోసం వాము -
ఆయుర్వేద వైద్యులు ప్రకారం, వాము పిత్తను తీవ్రతరం చేస్తుంది, అంటే శరీరానికి శక్తిమంతమైన వేడిని ఇస్తుంది. అందువలన ఇది జలుబు యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడవచ్చు. అయితే, వాము ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
జుట్టు కోసం వాము -
ఈ రోజుల్లో ఉన్న పని మరియు ఒత్తిడితో కూడిన జీవనశైలిలో, జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేకమైన సమయాన్ని తీసుకోవడం చాలా కష్టం. సౌందర్యసాధనాలు మరియు కండీషనర్లలో ఉపయోగించిన రసాయనాలు మీ జుట్టును మెరిసేలా చెయ్యవచు కానీ ఇన్ఫెక్షన్లు మరియు చర్మ సమస్యలు వచ్చినప్పుడు అవి ఉపయోగకరమైనవి కావు. దానికి తోడు, పెరుగుతున్న కాలుష్యం వల్ల సాధారణ వ్యాధులు మరియు అంటువ్యాధులను నివారించడం దాదాపు అసాధ్యం అవుతుంది.
పరిశోధకులు ప్రకారం, ముఖ్యంగా ఉష్ణమండల వేడి మరియు తేమ ప్రదేశాలలో ఉండే వారిలో జుట్టులో ఫంగస్ మరియు జుట్టు చర్మ వ్యాధులు, త్వరగా వ్యాపిస్తాయి. దానికి తోడు, ఔషధ-నిరోధక సూక్ష్మజీవుల (drug-resistant microbes) పెరుగుదల అనేది, సాధారణ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొవడాన్ని కూడా కష్టంగా చేసింది.
వాముకు ఆస్పెజిలస్ (Aspergillus) మరియు సాధారణ చర్మ, జుట్టు ఫంగస్ అయిన ట్రైకోఫైటన్ రూర్టమ్ (Trichophyton rubrum) కు వ్యతిరేకంగా బలమైన యాంటీ ఫంగల్ చర్యలు ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అటువంటి ఒక అధ్యయనం వామును ఒక యాంటి ఫంగల్ ఔషధ కలయికతో ఉపయోగించి, ఈ ఫంగస్ పెరుగుదలలో గణనీయమైన తగ్గింపు ఉందని గమనించింది
అదనంగా, వాము ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్, కాబట్టి మీ జుట్టు మెరిసేలా చేసి మరియు అతినీలలోహిత కిరణాల (ultraviolet rays) వల్ల జరిగే నష్టం నుంచి కాపాడుతుంది.
శిశువుల కోసం వాము నీరు -
వాము నీరు శిశువుల్లో వాయువుతో నిండిన పొట్ట మరియు జలుబు లక్షణాల నుంచి ఉపశమనం కలిగించే ఒక ప్రసిద్దమైన పరిష్కారం. దినిని ఆయుర్వేదంలో ఒక వేడిని కలిగించే మూలికగా భావిస్తారు మరియు ఇన్ వివో (in vivo) అధ్యయనాలు గ్యాస్ మరియు అపానవాయువు ఉపశమనంలో వాము యొక్క సామర్థ్యాన్ని సూచించాయి. కానీ శిశువులు మరియు పిల్లలలో వాము యొక్క సరైన మోతాదును సూచించడానికి ఇప్పటివరకు క్లినికల్ ట్రయల్స్ అందుబాటులో లేవు. కాబట్టి, మీ బిడ్డ కోసం వాము నీరు యొక్క సరైన మోతాదు గురించి మీ ఆయుర్వేద వైద్యుడిని అడగటం మంచిది.
రక్తాన్ని పల్చబర్చే వాము -
ప్రయోగశాల మరియు జంతు ఆధారిత అధ్యయనాలు వాముకు సహజంగా రక్తాన్ని పలుచబార్చే గుణం ఉందని సూచిస్తున్నాయి.ఇన్ వివో అధ్యయనాల ప్రకారం,వాము యొక్క ఈ చర్య అత్యంత సాధారణ ప్రతిస్కందన (anti coagulant) ఔషధం అయిన, వార్ఫరిన్ (warfarin)కు సమానంగా ఉంటుంది. కానీ,మానవుల గడ్డకట్టే కారకాల (clotting factors)పై వాము యొక్క ఈ ప్రభావాలు ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. కాబట్టి, ఈ ప్రయోజనం గురించి మరింత తెలుసుకోవాలంటే మీ వైద్యునితో మాట్లాడటం మంచిది.
వాము యొక్క యాంటీఆక్సిడెంట్ సంభావ్యత -
వాము యొక్క యాంటీఆక్సిడెంట్ సంభావ్యతను పరీక్షించడానికి అనేక పరిశోధనలు చేయబడ్డాయి. మరియు అన్ని లాబ్ అధ్యయనాలు వాము ఒక గొప్ప యాంటీఆక్సిడెంట్ సంభావ్యత కలిగి ఉందని సూచిస్తున్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ గ్రీన్ ఫార్మసీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, వాము నుంచి తయారు చేయబడిన నూనె ఒక అద్భుతమైన ప్రతిక్షకారిణి (యాంటీఆక్సిడెంట్). ఫార్మకోగ్నోసీ (pharmacognacy) మరియు ఫైటోకెమిస్ట్రీ (phytochemistry) ప్రచురించిన మరొక అధ్యయనం గడ్డ కట్టిన వాము తాజా వాముతో పోలిస్తే మరింత శక్తివంతమైన ప్రతిక్షకారిని అని సూచించింది. ఈ మూలిక యొక్క యాంటీఆక్సిడెంట్ సంభావ్యత దాని విత్తనాలలోని ఫినాలిక్స్ పదార్దాల వలన సూచించబడింది.
కీళ్లవాపు కోసం వాము -
ఇన్ విట్రో అధ్యయనాల ప్రకారం,వాము మరియు ఆల్కహాల్ వాము సారాలు బలమైన యాంటీఇన్ఫ్లమేటరీ ప్రభావాలను చూపిస్తాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ప్రధాన కారణాల్లో ఒకటి. ఈ కారకాన్ని దృష్టిలో ఉంచుకుని, వాము యొక్క యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఆర్థరైటిస్ యొక్క జంతు నమూనాలపై పరీక్షించబడ్డాయి అప్పుడు ఆర్థెటిస్ లక్షణాలను తగ్గించడంలో వాము కొన్ని ఉపయోగకరమైన ప్రభావాలను కలిగి ఉందని కనుగొనబడింది. అయినప్పటికీ, మనుషులపై దుష్ప్రభావాలు ఉండవని చెప్పలేము.
నులి పురుగులకు వాము -
వాము జీర్ణశయ ప్రేగులలో పురుగులకు వ్యతిరేకంగా పనిచేసే అత్యున్నత ఆయుర్వేద మందులలో ఒకటి. నులి పురుగుల చికిత్స కోసం ఆయుర్వేద వైద్యులు అజ్వాన్ సత్ (వాము సారం)ను సూచిస్తారు.అజ్వాన్ సత్ ముఖ్యంగా కొంకి పురుగుల ఇన్ఫెక్షన్లలో ప్రభావవంతమైనదని ఇది సూచించబడింది.
ఆయుర్వేదం యొక్క ఈ వాదనను పరీక్షించడానికి అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి మరియు దాదాపు అన్ని లాబ్ అధ్యయనాలు వాము యొక్క జీర్ణాశయ పురుగులను చంపే లక్షణాలను నిర్ధారించాయి. ప్రయోగశాల ఆధారిత అధ్యయనాలు వాము రింగ్వార్మ్ ఇన్ఫెక్షన్లపై కుడా చాలా సమర్థవంతమైనదని పేర్కొన్నాయి.
ఒక అధ్యయనం, వాము శరీరంలో కొన్ని కణాంతర (intercellular) సిగ్నలింగ్ను అడ్డుకోవడం ద్వారా నులి పురుగులను చంపడానికి సహాయపడుతుందని తెలిపింది.మరిన్ని, అధ్యయనాలు వామును అద్భుతమైన కోలినెర్జిక్ (cholinergic)గా చెప్తాయి, అవి ప్రేగులలోని సక్రమమైన కదలికను పెంచుతాయి, తద్వారా జీర్ణాశయాల నుండి వేగవంతమైన మరియు సులభంగా పురుగులను బయటకు పంపేస్తాయి.
కొలెస్ట్రాల్ కొరకు వాము -
వాము ఒక బలమైన హైపోలియోపిడెమిక్ (శరీర చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది) అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. జంతు ఆధారిత అధ్యయనం ప్రకారం, శరీరంలో వాము మరియు దాని మీథనాలిక్ సారాల వినియోగం ఎక్కువ సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ మరియు ఇతర ట్రైగ్లిజెరైడ్లను తగ్గిస్తుందని గమనించబడింది. కానీ క్లినికల్ సమస్యలలో దాని చర్య మరియు మోతాదు గురించి ఖచ్చితమైన అధ్యయనం చేయలేదు. అందువల్ల, వామును తక్కువ మోతాదులో తీసుకొవాడం ఉత్తమం.
ఋతుక్రమ సంబంధ నొప్పులకు వాము -
ఋతుక్రమ సమయంలో నొప్పి కొంతమంది మహిళలకు ఒక సమస్యాత్మకమైన మరియు పునరావృతమయ్యే సమస్య. ఇది వారి నెలవారీ ఋతుక్రమం ముందు లేదా ఆ సమయంలో పొత్తికడుపులో నొప్పితో బాధను కలిగి ఉంటుంది. ఫైబ్రాయిడ్లు మరియు PCOS వంటి పరిస్థితులు ఈ సమస్యకు కారణం కావచ్చు, వ్యాయామం లేదా కొంతమంది మహిళల శరీర నిర్మాణం సరిగా లేకపోవటం వలన తరచుగా కండరాల నొప్పి కలుగుతుంది. ప్రీక్లినికల్ అధ్యయనాలు వామును ఒక శక్తి వంతమైన ఆంటీస్పాస్మోడిక్ (antispasmodic) (ఇలుకు (ఇరుకు)ను వ్యతిరేకించేది) ప్రయోజనాలు ఉన్నాయని తెలిపాయి. వాము తినడం వల్ల కడుపులో కండరాల ఇలుకు (ఇరుకు) పట్టడం నుంచి ఉపశమనం కలిగించి మరియు ఋతు నొప్పులను తగ్గిస్తాయి.ఈ విషయం మీద ఇప్పటికీ క్లినికల్ అధ్యయనాలు జరుగుతున్నాయి. కాబట్టి, ఋతుస్రావ సమయంలో వాము లాభాలు మరియు మోతాదు గురించి మీ వైద్యున్ని అడిగి తెలుసుకోవడం ఉత్తమం.
వామును ఎలా ఉపయోగించాలి ?
వామును విస్తృతంగా వివిధ రకాల వంటకాల్లో ఒక మసాలా దినుసు రూపంలో ఉపయోగిస్తారు. ఈ మసాలా దినుసును ప్రపంచమంతా ఘాటైన రుచి కోసం వేయించి లేదా ఎండబెట్టి ఉపయోగిస్తారు. వామును మీకు నమలడం నచ్చకపోతే వాము పొడి రూపంలో ప్రత్యామ్నాయంగా కూడా ఉంటుంది.
వాము నూనె మరియు టూత్ పేస్టు మరియు సుగంధ నూనెలు వంటి ఇతర ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా మీరు మీ ఆహారంలో వామును జోడించవచ్చు. దీనితో పాటు బిస్కెట్లు,చిరుతిళ్ళు. రొట్టె మరియు సూప్ వంటి వివిధ రకాల ఆహారాలలో చిరుచెదు కోసం కూడా వామును ఉపయోగిస్తారు.
వాము నూనెను దాని వైద్య ప్రయోజనాలు వల్ల పరిమళవైద్యం (aromatherapy)లో గొప్పగా వినియోగిస్తారు.
అంతేకాకుండా,బజారులో వాణిజ్యపరంగా వాము మాత్రలు మరియు గుళికలు కూడా అందుబాటులో ఉన్నాయి.
వాము టీ చేయడం ఎలా?
వాము నుంచి తయారయ్యే అత్యంత సాధారణమైన ఆరోగ్యన్నీ పెంచే వంటకం వాము టీ. ఇంటిలో వాము టీ చేసే సాధారణ పద్దతిని చూద్దాం:
ఒక కప్పులో కొంచెం వాముని తీసుకోండి.
ఒక పాత్రలో నీరు మరిగించి,ఆ నీటిని వాము కప్పులో వెయ్యండి.
దానిని 5 నిమిషాలు అలా ఉంచండి. నీరు బంగారు గోధుమ రంగులోకి మారడం మొదలవుతుంది.
5-6 నిముషాల తర్వాత మీకు ఎంత చిక్కగా కావాలో చూసుకొని మాములు నీరు కలుపుకోండి.
మీరు వేడిగా లేదా చల్లగా తాగావచ్చు.
మీరు దానిలో చక్కెరను కలుపుకోకపోవడం ఉత్తమం. ఒకవేళ టీ ని తియ్యగా చేయాలనుకుంటే, కొంచెం తేనెను జోడించవచ్చు. తేనె జోడించడం వలన టీ యాంటీ బాక్టీరియల్ మరియు బరువు నష్టం లాభాలతో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
రోజుకు ఎంత వాము తీసుకోవాలి -
సాధారణంగా రోజుకు 2 గ్రాముల వామును తీసుకోవడం వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కానీ మీరు ఆరోగ్య ప్రయోజనాల కోసం వామును తీసుకోవాలనుకుంటే, వైద్యున్ని విచారించడం మేలు.
వాము దుష్ప్రభావాలు :
వాము ఒక గర్భస్రావ కారకం. కాబట్టి, గర్భిణీ స్త్రీలు ఈ మూలికను నివారించాలని చెప్తారు.
ఆయుర్వేదం ప్రకారం, వాము శరీరం మీద వేడి ప్రభావాన్ని కలిగి ఉంది. కాబట్టి, మీరు వేడి శరీరం కలవారు ఐతే, వామును తక్కువగా వినియోగించడం ఉత్తమం.
పిల్లలు కోసం వాము యొక్క సరైన మోతాదు గురించి తెలియదు. కాబట్టి, మీ బిడ్డ కోసం వాము యొక్క సరైన మోతాదును నిర్ణయించడానికి మీ వైద్యుడిని అడగటం ఉత్తమం.
వాము రక్తాన్ని పల్చబరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు ఒకవేళ శస్త్రచికిత్స చేయించుకోవాలనుకుంటే లేదా రక్తానికి సంభందించిన మందులు వాడుతుంటే, వామును తినకూడదు.
వాములో ప్రధాన థైమోల్ అను రసాయన పదార్దాన్ని కలిగి ఉంటుంది. థైమోల్ కొంతమందిలో తేలికపాటి చర్మ దద్దురుని కలిగిస్తుంది.అంతేకాక, థైమోల్ యొక్క అధిక వినియోగం కూడా కొంతమందిలో మైకము, వికారం మరియు వాంతులు వంటి పరిస్థితులకు కారణమవుతుంది. కాబట్టి, అధిక మొత్తంలో వామును తీసుకోకపోవడమే మంచిది.
సేకరణ
[09:55, 23/09/2020] +91 97055 69901: వ్యాయామం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..
✍️ఆరోగ్యమే కదా మహాభాగ్యము.
👉మనిషికి ఎంత సంపద ఉన్నా, ఎంత హోదాలో ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు.
👉ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు.
👉మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము వర్తిస్తుంది.
👉ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
👉జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి.
👉బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము.
👉వ్యాయామం వలన శరీరంలో కలిగే నొప్పుల నుండి విముక్తి లభిస్తుంది.
✍️కొన్ని ముఖ్యమైన వ్యాయామాలు:
1). 👉కాళ్ళు భుజాలు కొంచెందూరంగా ఉంచి గోడకు ఆనుకొని నిల్చోండి.
👉నెమ్మదిగా నెమ్మదిగా గోడకుర్చీ వేసినట్లు కనిపించే విధంగా మోకాళ్ళను నడుముకి 98 డిగ్రీలు ముందుకు ఉండేట్లు క్రిందకు నడుముని జార్చండి.
👉నడుము ముందుకు రాకూడదు. గోడను తాకే ఉ…
+91 91604 80356 left
+91 93921 98773 left
+91 90146 60043 joined via an invite link
+91 93472 56782 left
[08:17, 26/09/2020] +91 97055 69901: ✍️రక్తపోటు సమస్య - నివారణ మార్గాలు.
👉గుండె అనుక్షణము సంకోచ, వ్యాకోచాలు చేస్తూ రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంటుంది. 👉ఇలా సంకోచించినప్పుడు (కుంచించుకొన్నప్పుడు) రక్తం గుండె నుండి రక్త నాళాల లోనికి వేగంగా వత్తిడితో ప్రవహిస్తుంది.
👉ఈ వత్తిడిని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ (Systolic Blood pressure) అని అంటారు.
👉గుండె మరల వ్యాకోచించి సాధారణ స్ధితికి వచ్చినప్ఫుడు, రక్తనాళాలలో వున్న వత్తిడిని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటారు.
👉 ఈ రక్త పోటును గాజు గొట్టములోని పాదరసపు మిల్లీ మీటర్లలో కొలుస్తారు.
👉సాధారణంగా ఆరోగ్యవంతుల రక్త పోటు సిస్టోలిక్ ప్రెషర్ 90 నుండి 120 మి.మీ గాను, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 60 నుండి 80 మి.మీ గాను నమోదు కావచ్చు.
👉అయితే ఈ బి.పి మనిషి నుండి
మనిషికి వయస్సు పెరుగుతున్నకొద్దీ మార్పు చెందుతుంటుంది.
👉అలాగే సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంటుంది.
👉మానసిక వత్తిడులు కూడా బి.పి ని ప్రభావితం చేస్తాయి.
✍️అధిక రక్తపోటు:
👉అసాధారణంగా రక్త పోటు 130/90 మి.మీ, అంతకన్నా అధికంగా వున్నప్ఫుడు ఎక్కువ రక్తపోటు (హైపర్ టెన్షన్) అని అంటారు.
👉120/80 నుండి 139/89 మి.మీ స్ధాయిని అధిక రక్తపోటు ముందు స్ధాయిగాను, 140/90 మి.మీ.స్ధాయిని అధిక రక్త పోటుగాను గుర్తించాలి.
✍️అధిక రక్తపోటు - అనర్ధాలు :
👉అధిక శాతం గుండె జబ్బులకు - అధిక రక్తపోటు ప్రధాన కారణం.
👉మూత్రపిండాల వ్యాధులు.
👉కంటి జబ్బులు.
👉మెదడుకు సంబంధించిన రక్త నాళాల జబ్బులు.
👉పక్షవాతము.
👉గుండె రక్తనాళాల జబ్బులు.
👉విపరీతమైన తలనొప్పులు.
✍️లక్షణాలు: -
👉తలనొప్పి.
👉తల తిరుగుతున్నట్లు, తూలుతున్నట్లు అనిపించడం.
👉కూర్చున్న స్ధితి నుండి నిలుచోగానే కళ్ళు బైర్లు కమ్మడం.
👉సాధారణంగా శ్వాస తీసుకోలేకపోవడం
✍️తీసుకోవలసిన జాగ్రత్తలు : -
👉40 సంవత్సరాలు పైబడి వున్న వారు ప్రతి సంవత్సరం పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
👉కుటుంబంలో ఎవరికైనా అధిక రక్తపోటు వున్నా ఆరోగ్య పరీక్షలు కనీసం సంవత్సరానికి ఒక సారి చేయించుకోవాలి.
👉మధుమేహ వ్యాధి (Diabetes)తో బాధపడుతున్న వారు రక్తములో అధిక స్ధాయిలో కొవ్వు పదార్ధాలు (Cholesterol) వున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
👉అమితంగా అలసిపోయే విధమైన, అధికంగా వత్తిడి కలిగే కార్యక్రమాలు తక్కువగా చేయాలి.
👉తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
✍️లో - బిపి:
👉సాధారణంగా ఉండవలసిన రక్త పోటు (బి.పి) కన్నా తక్కువ స్ధాయిలో బి.పి ఉండటాన్ని లోబిపి అంటారు.
👉వైద్య పరిభాషలో దీనినే హైపోటెన్షన్ అని అంటారు.
👉దీని వలన ప్రధాన అవయవాలైన గుండె, మెదడు, మూత్రపిండాలకు,ప్రాణ వాయువు (ఆక్సిజన్), ఆహార సరఫరా తగు పాళ్ళలో జరగదు.
👉సాధారణంగా కొందరిలో 90/60 మి.మీ. ఉన్నప్పటికి ఆరోగ్యంగానే వుంటారు.
👉కాని బి.పి.సుమారు 160/90 ఉండి, 110/70 కి తగ్గితే అది లోబిపి గా పరిగణించాలి.
👉బిపి రీడింగ్ లో తేడా 40 మి.మీ. కు మించింది అంటే అది లోబిపి గా పరిగణించాలి.
✍️లోబిపి లక్షణాలు : -
👉నీరసం,అలసట.
👉మానసికంగా కృంగిపోవుట.
👉సరిగా నిద్ర లేక పోవుట.
👉తలనొప్పి.
👉గుండె వేగంగా పని చేయుట.
👉నాడి అధికంగా వుండుట.
👉కళ్ళు బైర్లు కమ్ముట.
👉కళ్ళు తిరుగుట.
👉శరీరం పాలి పోవుట.
👉అరికాళ్ళు, అరిచేతులు చల్లగా వుండి చెమటలు పట్టుట.
👉ఛాతి నొప్పి.
👉కొన్ని సందర్భాలలో గుండె పోటు వచ్చే అవకాశం వుంటుంది.
👉మూత్ర పిండాలు సరిగా పనిచేయక పోవడం వలన యూరియా,క్రియాటినిక్ లాంటి పదార్ధాలు రక్తములో అధికమై ప్రాణాపాయం కలిగిస్తాయి.
👉ప్రమాదకరమైన లోబిపి లో షాక్ వచ్చి ప్రాణాపాయం కావచ్చు.
✍️నివారణ కోసం చేయాల్సిన నియమాలు:
👉మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే మీరు పాటించే జీవనశైలి మార్పులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
👉మీ బరువును గమనించండి
మీ శరీరబరువు వైపు ధ్యాస ఉంచి తగిన జాగ్రత్తలు పాటించాలి.బరువు పెరగడం వలన రక్తపోటూ పెరుగుతుంది, అలాగే బరువు తగ్గితే రక్తపోటు కూడా తగ్గుతుంది.
👉ఊబకాయం అనేది పెరిగిన రక్తపోటు మరింత విపరీతమయ్యేందుకు ఓ ప్రమాద కారకంగా ఉంటుంది.
👉మీరు మీ ఎత్తు మరియు వయస్సుకు తగిన బరువును కల్గి ఉండేందుకు ప్రయత్నం చేయాలి.
✍️నిత్య వ్యాయామం:
👉అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి మీ రోజువారీ దినచర్యలో వ్యాయామం తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది.
👉వారానికి కనీసం 5 రోజులు 30 నిమిషాల నడక వంటి చర్యలు మీ రక్తపోటును నియంత్రించడంలో మీకు సహాయపడతాయి.
👉ఇతర వ్యాయామాలైన ఈత, నృత్యం, జాగింగ్, పరుగు మొదలైనవాటిని మీ రోజువారీ కార్యకలాపాలలో భాగంగా చేసుకోవచ్చు. కాకపోతే డాక్టర్ గారి సలహాలతో చేయడం మంచిది.
👉…
No comments:
Post a Comment