ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక కధలు (1001)
సేకరణ :రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
. ఈశ్వరుడే స్వయంగా రాసిన కవిత, మీరు చదివారా!? .
ధూర్జటి మహాకవి విరచిత “శ్రీకాళహస్తి మాహాత్మ్యం” లోని “నత్కీరుడి” కథ !
(ఇది ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి “పద్యకవితా పరిచయం” నుండి గ్రహింపబడినది.)
అనగనగా ఒక పాండ్య రాజు. కవి పిండిత పోషకుడు. ఆయన కొలువులో ఒక శంఖఫలకం ఉంది. పుష్పకవిమానం లాంటిది. అర్హుడైన కవి వస్తే ఎదిగి జాగా ఇస్తుంది. ఆ శంఖ ఫలకం మీద కూర్చోవడం అనే గౌరవం పొందిన ఒకానొక కవీశ్వరుడున్నాడు. నత్కీరుడు. ప్రతిదినం ఎవరో ఒకరు రావడం, కవిత్వం వినిపించడం నత్కీరాది కవీశ్వరులు తర్కించి నిగ్గు తేల్చడం, అర్హుడైతే రాజసత్కారం, అనర్హుడైతే వెనుదిరిగిపోవడం – ఇది ఆ కొలువులో జరుగుతూ ఉండే కథ.
ఆ రాజ్యంలో ఒక సారి కరువొచ్చింది. ఆ ఊళ్ళో ఒక శివాలయం, అందులో ఒక అర్చకుడు. కరువు తట్టుకోలేక గుడి విడిచి, ఊరు విడిచి వెళ్ళిపోదాం అనుకుంటూండగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక పద్యం అల్లి పూజారికిచ్చి, "దీన్ని రాజు గారివద్దకు తీసికెళ్ళు, ఆయన నీకు వెయ్యి మాడలిస్తాడు, నీ కరువు తీరుతుంది" అన్నాడు..
పూజారి అలాగే రాజకొలువుకి వెళ్ళి శివుడిచ్చిన పద్యం చదివాడు
. ""సిందుర రాజ గమనాధమ్మిల్ల బంధంబు సహజ గంధంబు"
అనేది ఆ పద్యానికి భావం. సిందురం అంటే ఏనుగు. గజరాజ గమనం కలిగిన ఆ స్త్రీ జుట్టుముడి (ధమ్మిల్ల బంధం) సహజ సువాసనతో అలరారుతోంది అని కవితా సారాంశం. పూజారి కొలువులో నత్కీరుడు ఉన్నాడు. ఆయన అభ్యంతరం చెప్పాడు. జడకి సహజ గంధం ఉంటుంది అని వర్ణిస్తే లోకం నవ్వదా? అన్నాడు.
తప్పిది, చెప్పరాదు, కవితా సమయంబున కొప్పుగాదు, నీ
విప్పగిదిన్ రచింప దగునే" యన విప్రుడు చిన్నవోయి "నా
కప్పరమేశ్వరుండు వసుధాథిపుపై రచియించి యిచ్చినా,
డొప్పును దప్పు నే నెఱుగ నుత్తములార!" యటంచు గ్రమ్మఱన్ "
ఓ విప్రకుమారా! ఇది తప్పు, ఇలా చెప్పరాదు. కవితా పద్ధతులకీ కవిసమయానికీ ఇది ఒప్పదు (ఒప్పుకాదు). నువ్వు ఈ పద్ధతిలో (ఈ పగిదిన్) రచించడం తగునా?" అని గద్దించేసరికి ఆ పూజారి చిన్నబోయి "ఓ ఉత్తములారా! ఈ పద్యాన్ని నాకు ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు. ఇందులోని ఒప్పూ తప్పూ నాకు తెలియవు" అని వెనుతిరిగిపోయాడు. శివాలయానికి వచ్చి శివుడితో విషయంతా చెప్పాడు. తన భక్తుడికి జరిగిన అవమానాన్ని శివుడు తీర్చాలనుకున్నాడు. మానవరూపంలో ఆ పూజారిని వెంటబెట్టుకుని రాజు సభకి వచ్చి అంటున్నాడు.
ఈ రాజన్యుని మీద నే గవిత సాహిత్య స్ఫురన్మాధురీ
చారు ప్రౌడిమ జెప్పి పంప, విని, మాత్సర్యంబు వాటించి, న త్కీరుం డూరకె తప్పు వట్టెనట - యేదీ! లక్షణంబో యలం
కారంబో, పదబంధమో, రసమొ? చక్కంజెప్పుడీ తప్పునన్
ఈ రాజుగారిమీద నేను కవిత చెప్పాను. సాహిత్య సంబంధమై ప్రకాశించే మాధుర్యంతో అందమైన (చారు) ప్రౌడిమతో చెప్పి పంపించాను. అది విని మాత్సర్యం వహించి (పాటించి) నత్కీరుడుట, ఎవడో! ఊరికే తప్పు పట్టాడట! ఏదీ చెప్పండి, నా కవితలో చందోవ్యాకరణ లక్షణం తప్పిందా? అలంకారంలో దోషం ఉందా? సమాసంలో (పదబంధం) పొరపాటు జరిగిందా? రసంలో ఔచిత్యం దెబ్బతిన్నదా? దేనికి సంబంధించి ఏది తప్పిందో (తప్పినన్) చక్కగా (వెంటనే - నేరుగా) చెప్పండి. అని శివుడు నిలదీసాడు.
నత్కీరుడు మునపటిలాగే "కేశపాశాలకి సహజ గంధం ఎక్కడినుంచి వస్తుంది. ఇది లోక విరుద్ధం, కవి సమయ విరుద్ధం" పొమ్మన్నాడు. అప్పుడు శివుడు "పార్వతీదేవి పొడవైన కేశబంధం సహజ గంధంతోనే ఉంటుంది. కాబట్టి నేను రాసినది సరియే" అన్నాడు. నక్కీరుడు "ఆ సంగతి మాకేమి తెలుసు? ఈ లోకంలో ఉండే కాంతలకు అది వర్తించదు" అని బదులు పలికాడు. "లూలా మాలపు మాటలు చాలు" అన్నాడు. (అంటే అర్థం పర్థం లేని మాటలు; నువ్వు అదేదో చూసి వచ్చినట్లు మాట్లాడున్నావేమిటీ, వెళ్ళు! అనే వెక్కిరింత). అప్పుడు శివుడు తన నిజరూపం చూపించాడు.
అయినా సరే నత్కీరుడు అవినయంగా మాట్లాడాడు. తల చుట్టువాఱ గన్నులు గలిగిన బద్యంబు దప్పు గాదన వశమే వలదిచ్చట నీ మాయా విలసనములు పనికి రావు విడువు" మటన్నన్ నీకు నుదిటి మీదనే కాదు తలచుట్టూరా కన్నులు ఉన్నా సరే, వాటిని కూడా చూపించినా సరే, నువ్వు రాసిన ఈ పద్యాన్ని తప్పు కాదు అనడం ఎవడి వల్లా కాదు. తప్పు తప్పే. అంచేత - వద్దు. నీ మాయా విలాసాలూ, గారడీ ప్రదర్శనలూ, ఇక్కడ పనికి రావు. చూపించకు. వాటిని వదిలేసెయ్ - అన్నాడు. శపియించెన్ బ్రతిభాషల గుపితుండై రుద్రు డతని "గుష్ఠు వ్యాధిం దపియింపుము" మనుచు దానికి నపరిమిత భయమ్ము నంది, యతడిట్లనియెన్ వెంటనే శివుడు శపించాడు. నత్కీరుడి మారు సమాధానికి (ప్రతిభాషలన్) కోపం వచ్చి శపించాడు.
నత్కీరుడి ప్రతిపాదనలో దోషం లేదు కానీ, ప్రతిభాషణలో దోషం ఉంది. అహంకారం ఉంది. సామాన్యుల అహంకారంవల్ల సమాజానికి కీడు ఆట్టే ఉండదు. కానీ నత్కీరుడిలాంటి మహోన్నతులకు ఇంత అహంకారం ఉంటే లోకానికి కీడు కూడా మహోద్ధృతంగానే ఉంటుంది. అందుకని కాబోలు తీవ్రమైన శాపమే ఇచ్చాడు "కుష్ఠువ్యాదితో తపింతువుగాక" అనేసాడు.
ఇప్పటికి నత్కీరుడి కళ్ళు తెరుచుకున్నాయి. అహంకారపు పొరలూ, మోహపు తెరలూ విడిపోయాయి. అపరిమితంగా భయపడిపోయాడు. స్వామీ! ద్రోహము జేసితిం, దెలుపవే శాపాంత ముద్యత్కృపా ధామా! నా" కనుచున్ బదాబ్జములమీదం బడ్డ, నా భక్త ర క్షామందారుడు శాంతి బొంది, యనియెం "గైలాస శైలంబు గం టే మానుం బద" మన్న నందులకు దా డెందంబునం గుందుచున్ ఓ స్వామీ! ద్రోహం చేసాను క్షమించు. ఓ కృపాధామా (దయాలవాలా!) శాపవిమోచన మార్గం ఏమిటో (శాపాంతంబు) తెలుపుమా నాకు - అంటూ పాదపద్మాల మీద పడ్డాడు.
శివుడు భోళా శంకరుడు. భక్తరక్షణకు కల్పవృక్షం (మందారం). వేంటనే శాంతించాడు. "కైలాసాన్ని దర్శించినట్టయితే నీ కుష్ఠురోగం మానిపోతుంది. అదే శాప విమోచన. బయలుదేరు (పద)!" అన్నాడు. పాపం నత్కీరుడు హృదయంలో పరితపించాడు. ఈ కవితాభిమానము వహించితి నేటికిన్? శంఖ పీఠిపై ఈ కవులున్నయట్లు వసియింపక దేవునితోడ నేల చా ర్వాక మొనర్చితిం? గడు భరంబగు కుష్ఠ రుజా విషాద మే నే కరణిన్ ధరించు? నిక నెన్నడు చూచెద వెండి గుబ్బలిన్! చార్వాకము = అప్రామాణికమైన మొండివాదన. ఏ కరణిన్ - ఏ విధంగా. వెండి గుబ్బలి - వెండికొండ. ఎన్ని మహానదుల్, వనములెన్ని, గిరీంద్రములెన్ని, బోయ వీ ళ్ళెన్ని, మృగంబు లెన్ని, జన హీనములైన పథంబులెన్ని, నే నిన్నియు దాటి, యే కరణి నీశ్వరు శైలము చూడ బోయెదన్! గన్నది కాదు విన్నయది కాని, సదాశివ! యేమి సేయుదున్ ! ఈశ్వరనివాసమైన కైలాసాన్ని ఎలా వెళ్ళి చూడటం! ఎప్పుడూ ఎవ్వరూ వెళ్ళింది కాదు. చూసింది కాదు. కాకపోతే విన్నాం. ఉత్తర దిక్కున ఉంది అనీ, అదే శివుడికి ఆవాసమూ అనీ, పెద్దలు చెప్పగా విన్నదే కానీ, కన్నది కాదు. ఓ సదాశివా! (ఎల్లవేళలా శుభప్రదుడా!) ఏమి చెయ్యను స్వామీ! దారిలో ఎదురయ్యే అడవులూ, కూరమృగాలూ, రాక్షసులూ, మధ్యలో జనులు ఉండని (జనహీన) ప్రదేశాలెన్నో! దగ్గరవుతున్న కొద్దీ పెను మంచు వానలూ, కాళ్ళకి గాయాలు చేసే రాళ్ళూ రప్పలూ - ఆ దారుల్లో ప్రయాణం చెయ్యడం శక్యమా! ఎలాగ, స్వామీ! అనుచు జింతా పరంపర లనెడు వర్ష ముడిగి, నత్కీరు డను మేఘు డుత్తరంబు నడచె, సంతోషమున దక్షిణమున నున్న కవుల ముఖ పంకజములు వికాస మొంద తన చింతాక్రాంతమైన అలోచనా పరంపరలు అనే వర్షధారల్ని చాలించుకుని (ఉడిగి), నత్కీరుడు అనే మేఘుడు ఉత్తర దిశకు నడిచాడు.
ఇక దక్షిణ దిక్కున నత్కీరుడు లేడు. వర్షాకాలం వెళ్ళిపోయి, శరత్కాలం వస్తే ఎంత తెరిపిగా ఉంటుందో - అంత తెరిపిగా ఉంది దక్షిణ దేశం. దక్కిణ దిక్కున ఉన్న కవుల ముఖ పద్మాలు సంతోషంతో వికసించాయట. శరదృతువులో పంకజాలు వికాసం పొందినంత ఆనందం దక్షిణాపథ కవుల ముఖాల్లో కనబడుతోంది. నత్కీరుడు వెళ్ళిపోయాడంటే - పీడ విరగడయ్యిందిరా, భగవంతుడా అని తక్కిన కవులంతా సంతోషించారని.
ఇది ఆ కవుల మాత్సర్యాన్ని తెలీజేయడంకన్నా నత్కీరుడి అహంకారాన్నీ దౌష్ట్యాన్నీ తెలియజెబుతోంది. వాళ్ళని అంతగా ఏడిపించుకుతన్నాడన్నమాట. ఇది నత్కీరుడి సహజ లక్షణమన్నమాట. అదే దూకుడు శివుడిమీదా చూపించాడు. ఫలితం అనుభవించాడు. నానా కష్టాలు పడి వెళుతోంటే, కుమార స్వామి ప్రత్యక్షమై "శివుడు కైలాసం చూడ మన్నాడే కానీ ఉత్తర దిశా కైలాసం అనలేదు కదా. అంచేత దక్షిణ కైలాసం చూచినా చాలు. కుష్ఠురోగం మానిపోతుంది" అని చెబుతాడు.
శ్రీకాళహస్తి దక్షిణ కైలాసం. దాని సందర్శించి నత్కీరుడు శాపవిముక్తుడయ్యాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పటికి నత్కీరుడి అహంకారం పటాపంచలు అయ్యింది. ఙ్ఞానోదయంతో అడిగాడు - ఈ సంసారము, దుఃఖా వాసానందంబు, దీని వర్జింపంగా నే సుఖము గలుగు దయ న న్నా సుఖమున గూర్పవే ! కృతార్థుడ నగుదున్ ప్పుడు శ్రీకాళహస్తి పుర దైవం సంతోషించి ఆ కవికి సాయుజ్యం అనుగ్రహించాడు.
--(())--
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక కధలు (1002)
సేకరణ :రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🌼🌿విష్ణుపాదుని దివ్యకథ🌼🌿
గోవింద అంటే స్తుతింపబడినవాడు అని అర్ధం. ఈ సృష్టి మొత్తంలో శ్రీమన్నారాయణుల వారికంటే స్తుతించదగినవాడు ఎవరుంటారు. అందుకే సమస్త ప్రాణికోటి నిత్యం ఆ స్వామినే కీర్తిస్తుంటారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ ఆ పరబ్రహ్మమూర్తిని స్తుతిస్తే కలిగే దివ్యానుభూతులని, దివ్యభోగ భాగ్యాలను వివరిస్తున్నాయి.
తిరుమల కొండలలో ఈ గోవిందనామమే నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. స్వామి దర్శనార్థం వచ్చే భక్తులందరి గోవిందనామ స్మరణతో ఈ కొండలన్నీ ప్రతిధ్వనిస్తుంటాయి.
పూర్వకాలంలో ఒకనాడు శ్రీనివాసుని ఆనందనిలయంలో ఉన్న హుండీ ప్రక్కనే ఉన్న ఇనుప కడ్డీలపై ఒక చిలుక వచ్చి వాలింది. అది ఎటూ కదలక భక్తులను చూస్తూ అక్కడే ఉంది. ఆ భక్తులు స్వామి దర్శనం చేసుకుని హుండీలో కానుకలు సమర్పించుకుని అటు తరువాత ప్రక్కనే ఉన్న ఆ చిలుకను చేతితో నెమ్మదిగా నిమరసాగారు. అలా ప్రతిభక్తుడు ఒక్క క్షణం చిలుకవద్దనే నిల్చుని ఆప్యాయంగా ఆ చిలుకను నిమురుతున్నాడు. ఆ చిలుకకు ఒకే కన్ను ఉండటం భక్తులలో కొందరు గమనించారు. రెండవ వైపు కన్ను మూసుకునే ఉన్నది. ఆ ఒంటికన్ను చిలుకను చూసి జాలిపడి ఒక భక్తుడు నెమ్మదిగా దానిని నిమరగా బహుశా అలా చేస్తే మంచిది కాబోలు అనుకుని ప్రతి భక్తుడు అదే పని చేయసాగాడు.
ఆలయంలోని అర్చకులకు ఈ విషయం తెలిసింది. వారు ఈ చిలుకను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఇంతమంది భక్తులు దానిని ముట్టుకుంటున్నా అది అసలు ఎటూ ఎగరటం లేదు ఎందుకని. వారెవరికి అర్ధం కాలేదు.
అలా వారం రోజులు గడిచాయి. ఆ చిలుక మాత్రం అక్కడనుండి కదలలేదు. రాత్రి చీకటి పడిన తరువాత బహుశా ఏ పండో తినడానికి ఎగిరి వెళుతోంది. తిరిగి ఉదయానికల్లా మళ్ళీ అక్కడకే వచ్చి అదేచోట నిలుస్తోంది.
ఒకనాడు తిరుమలకు స్వామి దర్శనార్ధమై ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎంతో మహిమ గలవాడని అతనికి పక్షుల భాషలు కూడా తెలుసునని భక్తులు చెప్పుకున్నారు. ఇది విన్న అర్చకులు ఆలయంలోని చిలుక గురించి చెప్పారు.
అప్పుడు ఆ సాధువు స్వామిని దర్శించుకొన్న తరువాత హుండీ దగ్గరకు వచ్చి పక్కనే ఉన్న ఆ చిలుకను అందరిలానే తాను కూడా చేతితో నెమ్మదిగా నిమిరాడు. వెంటనే ఆ చిలుక రెండవ కన్ను తెరుచు కున్నది...
అప్పుడు ఆ చిలుక ఆ సాధువుతో ఇలా అన్నది. స్వామీ! తమరు మహానుభావులలాగా ఉన్నారు. నేనిక్కడ ఇలా ఎందుకు వాలానో చెప్తాను వినండి.
కిందటి జన్మలో నేను విష్ణుపాదుడనే బ్రాహ్మణుడను. ఎన్నో పాపకార్యాలు చేయడం వలన ఈ జన్మలో ఇలా పక్షిరూపం ధరించాను. అది కూడా పుట్టు గుడ్డిగా జన్మించాను. కంటికి ఏమీ కనపడక ఆ చెట్టుపై, ఈ చెట్టుపై వాలుతూ దొరికిన ఫలాలను తింటూ కాలం గడిపాను. అలా ఎక్కడెక్కడో ఎగురుతూ ఈ కొండపైకి చేరాను. వారం రోజులక్రితం ఈ ఆలయసమీపంలోనికి వచ్చాను.
ఇది ఆలయం అని నాకు తెలియదు. ఏదో అలా ఎగురుతూ వచ్చి ఇక్కడ వాలాను. అప్పుడు ఒక భక్తుడు నాపై చెయ్యివేసి నెమ్మదిగా నిమిరి వెళ్లిపోయాడు. అంతే! క్షణంలో నాకు ఆ భక్తుడు నిమిరినవైపు కంటిచూపు వచ్చింది. నేనున్న ప్రదేశం సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుని ఆలయంగా గ్రహించాను. నన్ను ఆవిధంగా నిమిరిన ఆ భక్తుడు ఏ అహంకారం లేక స్వామినే సర్వంగా భావించి, ఆరాధించేవాడు. సర్వకాల సర్వావస్థలయందు ఆ స్వామినే స్మరిస్తూ ఏపని చేసినా అది శ్రీ వేంకటేశ్వర ప్రీత్యర్థంగా భావించి చేసేవాడు.
రోజూ ఉదయాన లేవగానే, తిరిగి రాత్రి పడుకునేటప్పుడు ఆ స్వామి పాదాలనే స్మరించేవాడు. ఎవ్వరినీ తరచు మాటలతో నిందింపడు. ఎటువంటి చెడు ఆలోచనలూ చేయదు. దేనికీ తొణకడు. అంతటి అసమాన్య భక్తుని స్పర్శ తగలడంతో నాకు కంటిచూపు వచ్చింది. నా రెండవ వైపు కూడా నిమిరితే రెండవ కన్ను కూడా వస్తుందని ఎంతో ఆశతో అతనికై చూశాను. కానీ ఆ భక్తుడు మళ్ళీ కనపడలేదు అని అన్నది.
ఆ చిలుక ఆ సాధువుతో ఇంకా ఇలా చెప్పసాగింది. 'ఈ ఆలయంలో
రోజూ ఎందరో భక్తులు స్వామి దర్శనార్ధమై రావటం గమనిస్తున్నాను. _ వీరిలో
ఒక్కరైనా అంతటి పుణ్యాత్ములు ఉండకపోతారా అని చూస్తున్నాను. అందువలననే
ఎటూ ఎగరకుండా రోజంతా ఇక్కదే ఉంటున్నాను. అంతటి నిస్వార్థ భక్తుడికోసం
వారం రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఎన్నో వేలమంది ఇప్పటిదాకా నన్ను
స్పృశించి వెళ్లారు. కానీ నా రెండవకంటి చూపు రాలేదు. ఇంకా ఎన్నాళ్ళిలా
వేచి ఉండాలా, ఎప్పటికి అంతటి భక్తుడు వస్తాడా అని అనుకుంటున్నాను ...ఇన్నాళ్ళకి నా భాగ్యం కొద్దీ మీరు వచ్చారు... అని
అన్నది. ఆ చిలుక చెప్పినదంతా విని ఆ సాధువు ఆశ్చర్యపడి అక్కడ ఉన్న అర్చకులందరికీ ఈ విషయం చెప్పాడు.
తిరుమల వచ్చేవారిలో చాలామంది విహారానికి వచ్చినట్లు వస్తారు. వచ్చినవారిలో కూడా చాలామంది అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టరు. రెండుసార్లు దర్శించుకున్నానని, మూడు సార్లు దర్శించుకున్నానని గొప్పలుగాచెప్తారు. తోటి భక్తులతో సౌమ్యంగా ఉండరు.
ఆ స్వామికి కావలసింది అచంచలభక్తి. _ అంతేకానీ, హంగు, ఆర్భాటాలు కావు.
ఎవరైతే ఆ స్వామిని సర్వస్వంగా భావిస్తారో, ఎవరైతే నిత్యం ప్రసన్నవదనంతో ఉంటూ తోటివారిలో ఆ స్వామినే చూస్తూ గడుపుతారు. వారికి ఆ శ్రీనివాసుడు సులభంగా ప్రసన్నమౌతాడు.
ఎవరైతే ధర్మబద్ధ జీవితం సాగిస్తూ ఉంటారో వారి బాధ్యత తానే వహిస్తానంటాడు ఆ స్వామి. కర్మలు సంచిత, ఆగామి, ప్రారబ్ధం అనే మూడుగా ఉంటాయి. శ్రీనివాసుని అనుగ్రహం కలిగితే మనం పూర్వజన్మలలో చేసిన సంచిత కర్మలన్నీ పూర్తిగా దహింపబదడతాయి. వచ్చే జన్మలో అనుభవానికి వచ్చే ఆగామి కర్మఫలాన్ని మనకు ఏమాత్రం అంటకుండా దూదిపింజలకంటే తేలికగా ఉందేలా అనుగ్రహిస్తాడు.
అంతేకాదు మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఘోర, ప్రారబ్ధ కర్మఫలాలను కూదా దివ్య సుఖ ప్రారబ్ధంగా మార్చేది ఆ అమృతమూర్తి ఒక్కడే. ఓ శ్రీ వేంకటేశ్వరా! నీవేమా కల్పతరువు, నీవే మా ఆప్తుడవు, నీవే మా సర్వస్వమూ. .నీకివే మా నమస్కారములు. ఓ జగన్నాథా! నీకివే మా ప్రణామములు. ఓ జగద్రక్షకా నీకివే మా నమస్కారములు.
శ్రీయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినామ్
శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్
శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు...
సేకరణ; రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
--(())--
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక కధలు (1003)
సేకరణ :రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
*నాలుగో పాదం! (కథ)*
*రచన: జయంతి ప్రకాశ శర్మ*
*రాజమండ్రిలో ఓ మిత్రుడి అమ్మాయి పెళ్ళికి వెళ్లాలని, ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లో నేను మా ఆవిడ బయలుదేరాం.*
*రైలు తుని స్టేషన్లో ఆగినప్పుడు గుర్తుకు వచ్చింది, ఉదయం బయలు దేరే హడావిడిలో కాఫీ తాగనే లేదని! ప్లాట్ ఫారం మీద వెళ్తున్న కాఫీ వాడ్ని పిలిచి, రెండు కాఫీలు తీసుకుని మా ఆవిడకి ఓ కప్పు అందించాను. కాఫీ ఓ గుక్క చప్పరించి 'బావుం దోయ్.. ఎంతా?' అంటూ జేబులో పర్స్ తీసి చూస్తే అన్నీ రెండు వందల రూపాయల నోట్లే!*
*'ఇరవై రూపాయలు సార్!' అన్న వాడి సమాధానం వింటూ, వాడి చేతిలో ఓ నోటు పెట్టాను.*
*'చిల్లర లేదా సార్?' అంటూ ఆ కాఫీవాడు చేతిలో ఉన్న ప్లాస్క్ కింద పెట్టి, జేబులో చెయ్యి పెట్టాడు. అప్పటికే రైలు బయలు దేరింది. వాడు చిల్లర తీసేలోగా, రైలు స్పీడు అందుకుని ప్లాట్‌ఫారమ్ దాటేసింది.*
*అందులోనూ మాది ఇంజన్ పక్క కంపార్ట్ మెంట్ అవటంతో వాడికి పరిగెత్తే అవకాశం కూడా లేదు. పాపం కాస్త దూరం పరిగెత్తినా, ప్రయోజనం లేక పోయింది.*
*చిల్లర ఉందో లేదో చూసుకోకుండా కాఫీ తాగడం నా బుద్ది పొరపాటే అనిపించింది.*
*"అదిగో. ఆ తెలివితేటలే వద్దంటాను! ముందు చిల్లర తీసుకుని, తర్వాతే నోటు ఇవ్వాలి. వయసొచ్చింది, ఏం లాభం?" పక్కనే కూర్చున్న మా ఆవిడ అవకాశం వచ్చిందని పెనాల్టీ కార్నర్ కొట్టేసింది.*
*ఎందుకో.. నాకా మాటలు రుచించ లేదు.*
*"సరే, వాడు చిల్లర ఇచ్చిన తర్వాత, మనం నోటు వాడి చేతిలో పెట్టే లోగా రైలు కదిలి పోతే... అప్పుడో?" నా చర్యని సమర్ధించు కుంటూ అన్నాను.*
*"వాడికేం నష్టం ఉండదు. మీలాంటి వాళ్ళని ఉదయం నుంచి ఓ పది మందిని చూసుకుంటారుగా, చివరికి లాభాల్లోనే ఉంటాడు!" మా ఆవిడ ఖాళీ కాఫీ గ్లాసుని ఠపీమని కిటికీ లోంచి బయటకు పారేస్తూ అంది.*
*"అయినా మాత్రం మనిషి మీద నమ్మకం ఉంచాలి.*
*పాపం.. ట్రైయిన్ బయలు దేరి పోతే వాడేం చేస్తాడు? మన డబ్బులతోనే వాడికి జీవితం అయిపోతుందా!"*
*అలా వాడిని వెనకేసుకుని రావడం మా ఆవిడకి బొత్తిగా నచ్చలేదు.*
*"వాళ్ళు ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూం టారు. మీలాంటి మాలోకాలు ఓ నాలుగు తగిలితే చాలు, ఆ రోజు గడిచి పోతుంది!" అంటూ చురచురా చూసింది.*
*నేనేం మాట్లాడలేదు.*
*"అయినా వాడు మీలా సుభాషితాలు చదవ లేదు లేండి!" అంటూ, ఆవిడ చుట్టూ చూసి ఇంకేం మాట్లాడ లేదు. అప్పటికే అక్కడ అందరి చూపులూ మావేపే ఉన్నాయి.*
*రైలు బాగా స్పీడ్ అందుకుంది. అన్నవరం స్టేషన్ కూడా దాటేసింది. డబ్బులు తిరిగి వస్తాయనే ఆశ నాలో కూడా సన్నగిల్లింది.*
*మనుషుల మీద నమ్మకం, జాలి ఉండవలసి వాటి కన్నా ఎక్కువగా నాలో ఉన్నాయనే నిశ్చితమైన అభిప్రాయం మా ఆవిడలో ఉంది. చాలా విషయాలలో, చాలా సార్లు నేను తన ముందు ఓడి పోవడం, చీవాట్లు తినడం అలవాటై పోయింది. కాని, ఆవిడ నమ్మకం అన్ని విషయాలకి ఆపాదించడం కరెక్ట్ కాదు అని నమ్మేవాడిని నేను.*
*మనుషుల్లో మంచితనం చూడాలి. వారిలో చెడు ఉంటే, అది వారు పెరిగిన వాతావరణం, పరిస్థితులే కారణం అనేది నా నమ్మకం!*
*మంచి, చెడు పక్క పక్కనే ఉంటాయి, అవకాశాన్ని బట్టి మనిషి వాటిని వాడుకుంటా డని ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అందుకేనేమో, చాలా సార్లు ఓడి పోయినా సరే, నా అభిప్రాయాల మీద నమ్మకం సడల లేదు. ధర్మం కనీసం నాలుగో పాదం మీదైనా ఉందనే ప్రగాఢమైన విశ్వాసం నాలో ఉంది.*
*"పోనీలెద్దూ, పేద వాళ్ళు! మన డబ్బులతో వాళ్ళు మేడలు మీద్దెలు కట్టెస్తారా?" అని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసాను.*
*ఆవిడ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి, నాకు మర్యాద ఇచ్చింది. ఇక ఆ సంభాషణ పొడిగించాలని అనిపించలేదు.*
*నిలబడి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులతో రైలు పెట్టె రద్దీగా ఉంది. బయట పరిగెడుతున్న పొలాల్ని చూస్తూ కూర్చున్నాను.*
*అప్పటికే తోటి ప్రయాణీ కులు వారి వారి ఆలోచన కోణాల్లో నన్ను చూస్తు న్నారు. కొందరు నన్నో వెర్రి వాడిగా చూస్తుంటే, మరి కొందరు జాలిగా చూస్తు న్నారు.* *'ఉచిత వినోదం, కాలక్షేపం బావుందిలే!' అని కొందరు ముసి ముసి నవ్వులు చిందిస్తుంటే, 'ఏం జరుగు తుందని' ఎదురు చూసే వాళ్లు కూడా లేక పోలేదు.*
*రైలు పిఠాపురం దరి దాపుల్లో ఉంది. నెమ్మదిగా అందరి చూపుల కోణాల్లోంచి బయట పడ్డాను.*
*"సార్. రెండు కాఫీలు తాగి, రెండు వందల రూపాయల నోటు మీరే కదా ఇచ్చారు?" ఆ మాట వినేసరికి ఇటు చూసాను. జనాన్ని తప్పించుకుంటూ ఓ పదిహేను సంవత్సరాల కుర్రాడు, మా సీటు ముందుకి వచ్చి అడిగాడు.*
*ఒక్కసారిగా ఆనందం వేసింది. కాని ఆ కుర్రాడ్ని చూడగానే, మాకు కాఫీ ఇచ్చిన వ్యక్తిలా అనిపించ లేదు. అతను మధ్య వయసులో ఉన్నట్టు, లీలగా గుర్తుంది.*
*"అవును బాబూ. నేనే ఇచ్చాను. చిల్లర తీసుకునే లోపే, రైలు బయలు దేరింది. కాని నీ దగ్గర మేం కాఫీ తీసు కోలేదే!"* *నిజాయితీగా అన్నాను.*
*"అవును సార్, కాని తుని స్టేషన్లో కాఫీలు తాగింది మీరే కదా సార్?"* *మరొకసారి అదే ప్రశ్న అడిగాడు.*
*"అబద్దాలు ఆడవలసిన అవసరం నాకు లేదయ్యా! కావలిస్తే, ఇదిగో ఇక్కడున్న వాళ్ళని అడుగు!"*
*"అబ్బే. అదేం లేద్సర్! నేను పొరపాటు చేయ కూడదు కదా, అందుకే మరో సారి అడిగాను!" అంటూ, జేబులో నుంచి డబ్బులు తీసి, నాకు రావలసిన నూట ఎనభై రూపాయలు చేతిలో పెట్టాడు.*
*"నువ్వూ..."*
*"వాళ్ళబ్బాయినండీ!'*
*ఆ కుర్రాడి వైపు ఆశ్చర్యంగా చూసాను. నా మనసులోని సంశయం కూడా అర్ధమయి నట్టుంది..*
*"రోజూ ఒకటో రెండో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి. తునిలో రైలు ఎక్కువ సేపు ఉండదు కదండి! ఆ కంగారులో చాలమంది నోటు ఇచ్చి, చిల్లర తీసుకునే లోపు రైలు కదిలి పోతుంది. అందుకే, నేను రైలు ఎక్కి రడీగా ఉంటానండి. మా నాన్న 'ఫలానా వాళ్ళకి మనం చిల్లర ఇవ్వాలని, వాళ్ళ సీటు నెంబరు, కంపార్టుమెంటు నెంబరు పోన్లో చెపుతారండి.* *వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నేను సామర్లకోటలో స్టేషన్లో దిగి, ఇంకో బండి ఎక్కి వెనక్కి వెళ్ళి పోతానండి.* *అందుకోసం కొంత చిల్లర నా దగ్గర ఉంచుతారండి మా అయ్య!"* *ఆ మాటలు వింటూనే చాలా ఆనందం వేసింది.*
*నాకు నోటంట మాటలు రావడానికి చాలాసేపు పట్టింది.*
*"చదువుకుంటున్నావా?" అడిగాను.*
*"టెన్త్ క్లాసు చదువు తున్నాను సార్! ఉదయం మా అన్నయ్య, మా అయ్యకి సాయం చేస్తాడండి, మధ్యాహ్నం నేనుంటా నండి!"*
*ఆ మాటలు వింటూంటే, వాడి తండ్రితో మాట్లాడాలని పించింది.*
*"ఒక్కసారి మీ నాన్న ఫోన్ నెంబరు ఇవ్వగలవా?" అంటూ అడిగాను.*
*నా ఫోన్నుంచే, అతనికి ఫోన్ చేసాను.*
*"తునిలో కాఫీ తాగి, నేనిచ్చిన రెండు వందల నోటుకి మిగిలిన చిల్లర మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. నిజానికి మిమ్మల్ని అభినందించాలని ఫోన్ చేసాను. మీ పిల్లలకి చదువుతో పాటు, అంత కంటే ముఖ్యమైన నీతి నిజాయితీలను నేర్పు తున్నారు. చాలా సంతోషం!" అతడ్ని అభినందిస్తూ అన్నాను.*
*"పెద్దవారు, ఇలా ఫోన్ చేసి మరీ చెప్పటం చాలా సంతోషం బాబూ. నేను ఆ రోజుల్లో ఐదో క్లాసు వరకు చదువు కున్నాను. అప్పట్లో నీతి నిజాయితీల మీద చిన్న చిన్న కథలు చెప్పే వారు, పుస్తకాల్లో కూడా అలాంటివే ఉండేవి. వాటి వలననే మంచి చెడు తెలుసు కున్నాను. అవే బాబూ, ఇప్పటికీ మా జీవితాన్ని ఇబ్బందు ల్లేకుండా నడుపు తున్నాయి!"*
*ఫోన్లో మాటలు వింటూంటే చాల ఆశ్చర్యం వేసింది. అతని మాటలతో ఆలోచ నల్లో పడిపోయాను.*
*" అయితే ఒక్క విషయం బాబూ!" అన్న ఫోన్లో అతని మాటలకి ఒక్కసారి "చెప్పండి!"అంటూ మళ్ళీ అతని మాటల మీద దృష్టి సారించాను.*
*"మరి అలాంటి మంచిని నేర్పే చదువులని పక్కన పడేసి, చిన్నప్పట్నుంచి ఆవకాయ అన్నం పెడుతున్నారయ్యా! మా పిల్లలు ఇంట్లో చదువుతుంటే విన్నానయ్యా, నీతి కథల్లేవు, వేమన పద్యాలు లేవు, చిన్నయ్యగారి పాఠాలు అసలలాంటి వేవీ లేవు! అందుకే బాబూ, కొంచెం వాళ్ళకి నీతి నిజాయితీలని నేర్పడానికి వాళ్ళకి ఇలాంటి పనులు అప్పగిస్తూ ఉంటాను. పుస్తకాల్లో లేని మంచిని, నాకు తెలిసిన రీతిలో నా పిల్లలకి నేను నేర్పుకుంటు న్నాను. అంతే బాబూ!" అతని మాటలకి ఉక్కిరి బిక్కిరి అయిపోయి, మరోసారి అభినందించి, అబ్బాయి బుజం తట్టాను.*
*ఆ అబ్బాయి ఇచ్చిన నూట ఎనభై రూపాయలు జేబులో పెట్టుకుంటూంటే నా మొహంలో వెలుగుని అలాగే చూస్తుండి పోయింది మా ఆవిడ. నా సంతోషం తిరిగొచ్చిన డబ్బు వల్ల కాదని ఆవిడకీ తెలుసు.*
*‘నిజమే.. ఇంకా ధర్మం నాలుగో పాదం మీదనైనా ఉన్నట్టే ఉంది!’ ఆ అబ్బాయి వెళుతున్న దిశకేసి చూపు మరలుస్తూ మా ఆవిడ అన్న మాటలు విని ఆ కాఫీ వాడికి మనసులోనే చేతులు జోడించి నమస్కరించాను!*
--(())--
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక కధలు (1004)
సేకరణ :రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🌷చండీ హోమం విశిష్టత🌷
దసరా ఉత్సవాల సమయమిది. దుర్గమ్మను ప్రపంచ వ్యాప్తంగా భక్తులు పూజిస్తున్న పవిత్ర తరుణమిది. ఈ సమయంలో ఛండీ హోమం అత్యంత శక్తివంతమైనది. ఇది చేస్తే... మాత యొక్క ప్రచండ శక్తి. ఒక్క భూగ్రహమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆది శక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, క్రియా శక్తి, కుండలినీ శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం.
లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆదితత్త్వాన్ని స్త్రీమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య. అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతోపాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి.
🌷చండీ హోమంలో ఉన్న మంత్రాలు ఎంతో శక్తివంతమైనవి...🌷
చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే, ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, అర్థశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. బ్రాహ్మీ, నందజా, రక్తదంతికా, శాకంబరీ, దుర్గా, భీమా, భ్రామరీ అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కనక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది.
దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా, 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో మూడు అధ్యాయాలు, మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శుంభనిశుంభుల వధతోపాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు. పూజ, పారాయణ, హోమం. ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణలో దశాంశం హోమం, దశాంశం తర్పణం ఇస్తారు. చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత (పది వేలు) చండీ యాగం, నియుత (లక్ష) చండీ యాగం, ప్రయుత (పది లక్షలు) చండీ యాగం
🌷చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు:🌷
ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది. కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫల సాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.
వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట. ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, మను చండి(చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. ఇక, శత చండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. కోరికలు నెరవేరతాయి. లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే నియుత చండి అంటారు. ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు.
వీటిలో చండీ హోమం, నవ చండీ, శత చండీ యాగాలను తరచుగా, సహస్ర చండీ యాగాలను అరుదుగా చేస్తుంటారు. అయుత చండీ యాగాలను చేయడం చాలా అరుదు. చండీ యాగాల ఫలితం అనూహ్యంగా ఉంటుంది.
🌷🙏శ్రీ మాత్రే నమః🙏🌷
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక కధలు (1005)
సేకరణ :రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
చిరిగిన పంచి చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీలపై కూర్చోవడం చూసి, ఒక వెయిటర్ రెండు గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు - మీ కోసం ఏమి తీసుకురావాలి?
ఆ వ్యక్తి ఇలా అన్నాడు- " జిల్లాలో పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే, నగరంలోని అతిపెద్ద హోటల్‌లో #దోశ తినిపిస్తాను, అని మా అమ్మాయికి వాగ్దానం చేశాను."
మా అమ్మాయి వాగ్దానాన్ని నెరవేర్చింది. దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి. "వెయిటర్ అడిగాడు-" మీ కోసం ఏమి తీసుకురావాలి? "అతను అన్నాడు-" నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బే ఉంది. నాకు వొద్దు ..."మొత్తం విషయం విన్న తర్వాత వెయిటర్ యజమాని వద్దకు వెళ్లి మొత్తం కథ చెప్పాడు- "నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను . ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసివేయవచ్చు." అప్పుడు యజమాని అన్నాడు- "ఈ రోజు మనం హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వాళ్లకి పార్టీ ఇద్దాం అన్నాడు ... ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు 😊
హోటల్ వాళ్ళు ఒక టేబుల్‌ను చక్కగా అలంకరించారు... ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు...అ యజమాని వాళ్లకి మూడు దోశలు తో పాటు పొరుగువారికి స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ప్యాక్ చేశాడు... చాలా గౌరవం ఇచ్చిన అతను,అతని కుమార్తె కళ్ళలో ఆనందంతో కన్నీళ్లతో తన ఇంటికి వెళ్ళారు...
సమయం గడిచిపోయింది ...
ఒక రోజు ఆ అమ్మాయే I.A.S. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికే కలెక్టర్‌గా వచ్చింది.ఆమె ముందు ఒక అటెండర్ ని అదే హోటల్‌కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పారని తెలియజేయమంది ... హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్‌ను బాగా అలంకరించాడు.ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది...
అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లిదండ్రులతో నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమె గౌరవార్థం నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించి ఆర్డర్ కోసం అభ్యర్థించారు. ముందుకు వెళుతున్నప్పుడు, ఆమె ఇలా చెప్పింది- "మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు. , ఎవరి తండ్రికి మరొక దోశ తినటానికి డబ్బు లేదో నేను ఆ అమ్మాయినే. అప్పుడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు🙏, నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా పొరుగువారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేశారు..
ఈ రోజు నేను మీ ఇద్దరి మంచితనం తో కలెక్టర్ అయ్యాను...మీ ఇద్దరినీ నేను ఎప్పుడూ అనుకూలంగా గుర్తుంచుకుంటాను... ఈ రోజు ఈ పార్టీ నా తరపున ... ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను.... అలా అని అందరి ముందు వాళ్ళని సత్కరించింది తను..👏👏
నీతి -
ఏదైనా పేదల పేదరికాన్ని ఎగతాళి చేయకుండా, వాళ్ళలో ఉన్న ప్రతిభను గౌరవించండి...
--(())--
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక కధలు (1006)
సేకరణ :రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
👏 👏 అరవై సామెతలతో ఓ అందమైన కధ - మీ కోసమే . 👏👏
"కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది.." అంటూ గొణుగుతూ.. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన భర్త కాంతారావు గారికి కాఫీ తెచ్చి ఇచ్చింది సుమతి.. " ఏంటోయ్ నీలో నువ్వే గొణుక్కుంటున్నావు.. ఏంటో.. అర్ధమయేటట్లు చెప్పొచ్చు కదా! " అన్నారు ఆయన..
"ఏం చెప్పమంటారు.. " చిలక్కి చెప్పినట్లు చెప్పాను" మీకు.. విన్నారా.. మీ అక్కగారి" నోట్లో నువ్వు గింజ దాగదు " అని.. నామాట వినకుండా.. ఆవిడ చెవిలో ఊదారు.. ఆవిడ సంగతి తెలిసిందే గా
"తిరిగే కాలూ.. తిట్టే నోరూ ఊరుకోదని" మనమ్మాయికి కుజ దోషం వుందని ఆవిడ ఊరంతా టాంటాం చేస్తోంది. ఒకరిని అనుకుని ఏం లాభం.." మన బంగారు మంచిదవాలి కానీ".. ఇక దీనికి పెళ్ళి అయినట్టే.." అంది సుమతి.
"ఔనా.. మా అక్క అలా చెప్పదే ఎవరికీ..
"అనుమానం.. పెను భూతం.." అనవసరంగా అపార్థం చేసుకోకు.. మీ పుట్టింటి వాళ్ళేమయినా చెపుతున్నారేమో కనుక్కో.. జాతకం రాయించింది మీ తమ్ముడేగా.. " అన్నాడు కాంతారావు.
"ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు" ప్రతీదానికీ మా అన్నదమ్ముల్ని ఆడిపోసుకోవడమే మీరు."ఆడలేనమ్మ మద్దెల గోల" లాగా... అయినా మా తమ్ముడేం మీ అక్కయ్య లాగా ఎవరికీ చాటింపులు వేసే రకం కాదు.." అంది సుమతి.
"ముంజేతి కంకణానికి అద్దమేల".. అయినా.. ఇప్పుడు ఆ గోల ఆపి అసలు సంగతికి రా... ఇంతకీ నీ బాధ... మా అక్క అందరికీ చెపుతోందనా... మనమ్మాయి పెళ్ళి కావడం లేదనా.. " చెవిలో జోరీగ లాగా " నస పెట్టకుండా ఏదో చెప్పు ముందు.." అన్నాడు కాంతారావు.
"ఇంకేం వుందీ చెప్పడానికీ.. మీకు ఎప్పుడూ" కడుపే కైలాసం.. ఇల్లే వైకుంఠం" నా మాట ఎప్పుడు పట్టించుకున్నారు కనకనా.. అమ్మాయికో మంచి సంబంధం వాకబు చేద్దాం అనిగానీ.. అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేద్దామనిగానీ.. ఆలోచనే లేదు.. " అంది సుమతి నిష్ఠూరం గా..
"ఓసి, పిచ్చిదానా.. " కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదే ".. ఆ ఘడియ రాలేదింకా మన పిల్లకి.. " అన్నాడు తాపీగా..
"అబ్బబ్బా మీకు చెప్పీ చెప్పీ నా " తల ప్రాణం తోకకివస్తోంది" . " చెవినిల్లు కట్టుకుని పోరినా" వినిపించుకోరు. మీ పెదనాన్న కొడుకు.. చూడండి.. ఎంచక్కా రెండేళ్ళలో ఇద్దరి ఆడపిల్లలు పెళ్ళి చేసి
"గుండెల మీద కుంపటి" దించేసుకున్నారు.. కాస్త ఆయన ఎరికలో ఏవైనా మంచి సంబంధాలున్నాయేమో అడగండి." అంది సుమతి.
"వాడినా.. వాడు" ఉపకారం అంటే ఊళ్ళోంచి పారిపోయేరకం." వాడినుంచి నేను సహాయం ఆశించడం "ఇసుకలో నూనె పిండినంత".. అయినా వాడు
"అయినవాళ్ళకి ఆకులు.. కాని వాళ్ళకి కంచాలు" పెట్టే తరహా.. వాడిని చచ్చినా అడగను." అన్నాడు కాంతారావు.
"అయ్యో.." అలా అనుకుంటే ఎలా అండీ..
"వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు" ఆయన ముందు మనమెంతటివారం.. అయినా మన
"నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది." మీరోసారి ఫోను చెయ్యండి.. ఆ తర్వాత" అందితే జుట్టు అందకపోతే కాళ్లు" పట్టుకుందాం." అంది సుమతి.
"వాడి గురించి "అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లు" చెప్పినా నీకు అర్ధం కావడం లేదు. సరేలే..
"తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే పోయినా ఒకటే" నీ తృప్తి కోసం వాడిని అడుగుతాను. ఆ ఫోన్ ఇటు తీసుకురా..
"హలో.. అన్నయ్యా.. నేనురా.. కాంతారావు ని.. ఎలా వున్నావు? అమ్మాయిల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా? కులాసాగా వున్నారా ?.. ఆ.. ఏం లేదు.. ఈ ఏడు మేము మా శ్రీవల్లికి సంబంధాలు చూడడం మొదలెట్టాము.. నీ ఎరికలో ఏవైనా మంచి సంబంధా లుంటే చెప్పమని మీ మరదలు అడగమంటే.. అందుకని ఫోను చేస్తున్నాను.. నీకు.."
"మేనరికమా... లేదన్నయ్యా.. నీకు తెలీనిదేముందీ.. "పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు" అయినా.. వాడిని గారాబంతో చెడగొట్టింది అక్క... "మొక్కై వంగనిది మానై వంగునా" వాడికి ఇంకా ఉద్యోగం.. సద్యోగం లేదు.. స్ధిరపడలేదు... ఓ పక్క.. అక్కయ్య అంటూనే వుందిలే.. సంబంధం కలుపుకోరా.. అంటూ... మా ఇద్దరికీ సుతారామూ ఇష్టం లేదు.. "అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు" వద్దు అని చెప్పేసాలే అక్కకి.. ఏదైనా సాంప్రదాయ కుటుంబం, మంచి ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాడెవరైనా వుంటే చెప్పు.. నా స్ధితిగతులు నీకెరికేగా..... ఔను.. జాతకంలో కొంచెం కుజ దోషం వుందట.. ఏవో పరిహార పూజలు చేయించింది మీ మరదలు.. అక్క చెప్పిందా..." అన్నాడు కాంతారావు..
ఆ ఫోను లో ఆ అన్నగారి మాటలు అన్నీ విని విసురుగా ఫోను పెట్టేసారు కాంతారావు గారు..
"ఏంటండీ.. ఏమన్నారు మీ అన్నయ్య?" అంది సుమతి.
"నీ మాట విని వాడికి ఫోన్ చేసాను... నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. "మంచోడు మంచోడు అంటే చంకనెక్కి కూర్చున్నాడట" ఇలాంటి వాడే..."కళ్ళు నెత్తికెక్కాయి" వాడికి."కడుపు నిండిన బేరాలూ.. కడుపు నిండిన మాటలూ" వాడివి. ఏంటో ఆడపిల్ల పెళ్ళి చేయడమంటే ఆషామాషి అనుకుంటున్నావా.. నాకంటే ఏదో అదృష్టం పుచ్చి మంచి సంబంధాలు వచ్చాయి... అందరికీ అలా రావు... ఎవరైనా పెళ్ళిళ్ళ పేరయ్యని పట్టుకుని "గంతకి తగిన బొంతని" వెతుక్కోమని ఉచిత సలహా పడేసాడు." "ఊరుకున్నంత ఉత్తమం లేదు.. బోడిగుండంత సుఖం లేదు" అనవసరంగా వీడికి ఫోన్ చేసి మాటలనిపించుకున్నాను" అన్నాడు కాంతారావు కోపంగా..
"అయ్యో.. అంతమాటన్నారా.. అయినా..
"జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి" పోన్లెండి ఆయన బుధ్ది బయటపడింది... "తలని తన్నేవాడొకడుంటే.. తాడిని తన్నేవాడొకడుంటాడు." ఏదో ఒకరోజు ఆయనకే తెలుస్తుంది.. "ఉంగరాల చేత్తో మొట్టేవాడు చెపితేనే మాట వింటారు కొందరు".. మీరేం బాధ పడకండి.. "మనసుంటే మార్గముంటుంది".. ఆ దేముడే మనకే దారి చూపిస్తాడు. చెప్పడం మర్చిపోయా... నా చిన్నప్పటి స్నేహితురాలు పార్వతి నిన్న గుళ్ళో కనపడింది... తనకి తెలిసిన మంచి సంబంధాలు వున్నాయట.. ఈ రోజు మనింటికి వచ్చి.. చెపుతానంది.. చూద్దాం తనేం చెపుతుందో... "విత్తం కొద్దీ వైభోగం" పైగా మన దురదృష్టం "గోరు చుట్టు మీద రోకలి పోటు" లాగా పిల్లకి కుజ దోషం ఒకటీ... అది కప్పెట్టి పెళ్ళి చేయలేం కదా.." అంది సుమతి.
మర్నాడు.. కాంతారావు ఆఫీసు నుంచి.. రాగానే.. ఆనందంతో ఎదురెళ్ళింది సుమతి.
"ఏంటోయ్.. "గాజుల కళకళ గుమ్మంలోనే ఎదురయిందీ".... కొంపతీసి ఉదయం నేను "నక్కని తొక్కివెళ్ళినట్టున్నాను".. అన్నారు.. చమత్కారంగా..
"పోండి.. మీకెప్పుడూ వేళాకోళమే... ముందిలా కూర్చుని కాఫీ తాగుతూ... నేను చెప్పే విషయం సావధానంగా వినండి. "ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకండి" అంది. "ముద్దొచ్చినపుడే చంకకెక్కాలి" అనుకుంది సుమతి.
బుద్ధి గా చేతులుకట్టుకుని..ఆ.. ఇప్పుడు చెప్పు" అన్నాడు కాంతారావు.
"నిన్న.. నా స్నేహితురాలు పార్వతి గురించి చెప్పాను కదా.. మధ్యాహ్నం తను వాళ్ళాయనని తీసుకుని మన ఇంటికి వచ్చింది. ఆయన బేంక్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయ్యారట. పెద్దది ఆడపిల్ల కి పెళ్ళి చేసి.. కాపురానికి పంపారట. తర్వాత అబ్బాయి.. వేణుగోపాల్.. ఎమ్ బి ఏ.. చేసి.. ఏదో పెద్ద కంపెనీలో చేస్తున్నడట. నెలకి లక్ష పైగా జీతం వస్తోందట. గుళ్ళో నాతో పాటు మన వల్లిని చూసారు కదా.. పిల్ల చక్కగా
"చిదిమి దీపం పెట్టుకునేలా వుంది" అనిపించిందట. వాళ్ళ వేణుకి చేసుకుంటామని అడిగారు. అప్పటికీ చెప్పాను.. "అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వుంది" అన్న చందాన పిల్ల జాతకంలో కుజ దోషం గురించి కూడా చెప్పాను. వాళ్ళ కి అలాంటి పట్టింపులు ఏవీ లేవనీ... అసలు జాతకాల గురించి
ఆలోచించమనీ.. పైగా పెట్టుపోతలు కూడా ఏవీ ఆశించమనీ.. చెప్పారు. నాకైతే... "వెతకపోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు" అనిపించింది. "ఉయ్యాల్లో బిడ్డని పెట్టుకుని ఊరంతా తిరిగామేమో" మనం. ఇదిగో అబ్బాయి ఫోటో ఇచ్చి వెళ్ళారు.. చూడండి.. దొరబాబు లా వున్నాడు.. మన శ్రీవల్లి పక్కన చూడ ముచ్చటగా వుంటాడనిపించింది. ఇంతకంటే గొప్ప సంబంధం మనం తేలేము.. ఆలోచించండి.." అంది సుమతి.. సంబరంగా.
"నువ్వు చెప్పిందీ నిజమే సుమతీ... పిల్లాడు బావున్నాడు.. కుటుంబమా.. మంచి సాంప్రదాయ కుటుంబమని చెపుతున్నావు.. పైగా వాళ్ళకి ఈ జాతకాల పట్టింపు లేకపోవడం... నిజంగా మన అదృష్టం. సరే మరి.. రేపు వెళ్లి మంచీ చెడూ మాట్లాడి వద్దాం." అన్నాడు కాంతారావు.
రేపటిదాకా ఎందుకూ..
"శుభస్య శీఘ్రం..." ."తలుచుకున్నపుడే తాత ప్రయాణం" అన్నట్లుగా ఇప్పుడే బయలుదేరదాం. మనం వస్తున్న్నట్టు పార్వతి కి ఫోన్ చేస్తాను."మీన మేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది".. లేవండి.. లేవండి.." అంది సుమతి.
"లేడికి లేచిందే పరుగు".. మా లేడీ గారు యమ హుషారుగా వున్నారు.. ఉండు పనిలో పని... మా పెదనాన్న కొడుక్కి ఫోన్ చేసి.. ఈ విషయం చెప్పాలి.
"గంతకి తగిన బొంత" అన్నాడుగా... ఇప్పుడు నేను చెప్పే ఈ సంబంధం వాడికి "కుక్క కాటుకి చెప్పు దెబ్బ" అనిపించాలి. "ఇనుము విరిగినా అతకవచ్చుకానీ.. మనసు విరిగితే అతకలేము..".. అంతలా నా మనసుని బాధ పెట్టాడు వాడు." అన్నాడు కాంతారావు.
"పోన్లెండి.. "ఊరందరిదీ ఓ దారి ఉలిపిరి కట్టెదో దారి" వదిలేయండి.. ఆయనని.. "గురివింద గింజ తనకింద నలుపెరగదట" మనకెందుకింక ఆయన సంగతి.. ముందు బయలుదేరదాం పదండి" అంటూ భర్త ని తొందరపెట్టింది సుమతి.
వెళ్లే దారిలో..."ఏవండీ.. చెప్పడం మర్చిపోయా.. ఇందాక పార్వతీ.. వాళ్ళాయన వచ్చినపుడు మీ అక్కయ్య గారు వచ్చారు.. విషయం అంతా తెలుసుకున్నారు.. వాళ్ళు వెళ్ళాక.. తన కొడుక్కి.. శ్రీవల్లి ని ఇవ్వడంలేదని ఉక్రోషం తో.. నానా మాటలు అన్నారు.."ఏ రాయైతేనేం పళ్ళూడకొట్టు కోవడానికి"....ఆ జాతకాల పట్టింపులు నాకు లేవుఅ న్నాను. అయినా నా మాటకి విలువీయకుండా పరాయి సంబంధాలకి పోతున్నారూ.. "కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక పోతుంది" అంటూ.. శాపనార్థాలు పెట్టిందావిడ..
"శుభం పలకరా పెళ్ళి కొడకా అంటే పెళ్ళి కూతురు... ఏది ?" అన్నట్టుగా.. ఈవిడ అపశకునపుమాటలేంటీ.. అని బాధేసింది నాకు" అంది సుమతి.
"పోనీలే.. మా అక్క సంగతి తెలుసుకదా... నువ్వు ఎందుకు.."గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకుంటావు" పట్టించుకోకు..."గుడ్డి గుర్రానికి పళ్ళు తోమడం" తప్ప దానికి వేరే పనీపాటా లేదు.
"పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు" అది అలా వాగుతూనే వుంటుంది. వదిలేయి తన మాటలు.. ఎప్పుడూ వుండేవేగా.." అంటూ భార్య ని ఓదార్చాడు.
పెళ్లి చూపులు అయిపోవడం.. పెళ్లి మాటలు మాట్లాడుకోవడం.. ఆకాశమోత పెళ్ళి పందిరిలో భూదేవంత అరుగు మీద.. కాంతారావు, సుమతి దంపతులు.. పెళ్లి కొడుకు కి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం అయిపోయి.. . అమ్మాయిని అత్తగారింటికి సాగనంపారు.
--(())--
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక కధలు (1007)
సేకరణ :రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ధర్మసూక్ష్మమ్ 🌻
****
కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో,
పండునో విడిచి పెట్టి రావాలంటారు. ఆమేరకు మనం మనకిష్టమైన ఏదో ఫలాన్ని, ఏదో ఒక కాయను వదిలేసి వస్తుంటాం.
ఆ తర్వాత నుండి వాటిని తినడం మానేస్తాం.
పైగా “నేను జామపండు తి ననండీ కాశీలో ఎప్పుడో వదిలేశాను "
"నేను కాకరకాయ తిననండీ, కాశీలో వదిలేశాను అని చెప్పుకుంటాం.
నిజానికి పెద్దలు వదలమంది,
"కాయాపేక్ష, ఫలా పేక్ష "
కాయా పేక్ష అంటే :- దేహం పట్ల ప్రేమ,ప్రతి వ్యక్తికి ఉంటుంది. శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది వదిలేయమని ,నా శరీరానికి సుఖం కావాలి , ఏసీ కావాలి, మెత్తని పరుపు కావాలి, తినడానికి
రుచి కరమైన భోజనం కావాలి ,ఇలాంటి వన్నీ
వదిలేసి సాధువులా బతకమని అర్ధం.
ఫలా పేక్ష అంటే :- ఏదైనా పని చేసి దాని ద్వారా లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలేయమని,
ఉదా:- పది రూపాయలు దానం చేసి, దాని ద్వారా ఫలితం ఆశించటం,యజ్ఞం చేసి ఏదో కోరుకోవడం,బంధు మిత్రులకు, సహాయం చేసి దాని ద్వారా ఏదో కావాలని కోరుకోవడం మానుకొమ్మని అర్ధం.
(ఎవరినో అనాలని కాదు అందరం చేసేవే మారటానికి ప్రయత్నిద్దాం *అన్యధా భావించవద్దు*)
🕉సర్వేజనా సుఖినో భవంతు🕉
(ఎక్కడో చదివాను బావుందని తెలియపరుస్తున్నాను)
ఓం నమశ్శివాయ
**
--(())--
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక కధలు (1008)
సేకరణ :రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పై పంచతో చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూ..
"అందరికాళ్ళు మొక్కినా అత్తవారింటికి పోక తప్పదు కదా" అంటూ అనుకున్నాడు ఆ ఆడపిల్ల తండ్రి.
ఈ జాతకాలు కుదరడం లేదనే వంకో.. ఈ కుజ దోషం కారణంగానో.. చాలా మంది ఆడపిల్లలకి.. సరైన సమయంలో వివాహం కాకపోవడమో.. అసలు వివాహాలే కాకపోవడమో జరుగుతోంది. విఙ్ఙానం ఇంతలా వెల్లివిరిసి.. ప్రపంచం ఆధునికంగా ముందుకు కు సాగిపోతోంటే... ఇంకా ఈ మూఢ నమ్మకాలేంటి ? ఆడపిల్లల జీవితాలకి ఈ జాతకాలు ఓ అడ్డుగోడ.. చదువుకున్నవారిలోనే ఈ జాడ్యం ఎక్కువగా వుంది.. అందరికీ.. మా శ్రీవల్లి చేయందుకున్న వేణుమాధవ్.. ఓ ఆదర్శం కావాలి... అనుకున్నాడు కాంతారావు.
ఇంతలో ఫోన్మోగింది.... ఈ పెళ్ళి కి పిలవలేదుగా.. అందుకే ఈ సంగతి తెలీక ... పెదనాన్న కొడుకు.... "ఒరేయ్ కాంతారావూ... మీ అమ్మాయికి ఏదైనా నా సంబంధం వుంటే చెప్పమన్నావుగా... ఇక్కడ.. ఈ. సేవ లో పనిచేస్తూంటాడు.. నెలకి పదివేలు జీతం .. అతనికీ కుజ దోషం వుందట. సరిపోతుంది ఇద్దరికీ.. వాళ్ళ నెంబర్ ఇస్తాను.. ఓ సారి మాట్లాడి.. సంబంధం కుదుర్చుకో... నాపేరు చెపితే.. కట్నంలో.. కాస్త తగ్గిస్తారు.." అన్నాడు..
"ఆ.. అన్నయ్యా... "దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్కలు మొరిగాయట".. అర్ధమయిందనుకుంటాను.." అంటూ ఫోన్ పెట్టేసాడు.. ఇన్ని సామెతలతో చక్కటి సన్నివేశం రక్తి కట్టించిన అజ్ఞాత రచయిత కు అనేక అభినందనలతో..ఇది మీరూ ఆనందించగోరుతున్నాను✨
--(())--
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక కధలు (1009)
సేకరణ :రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
🙏🌹సీనియర్ సిటిజన్స్ దయచేసి గమనించండి
యునైటెడ్ స్టేట్ లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం 51% పైగా వృద్ధులు మెట్లు ఎక్కేటప్పుడు పడిపోతారు.
ప్రతి సంవత్సరం, చాలా మంది అమెరికన్లు మెట్లు ఎక్కేటప్పుడు పడి చనిపోయారు.
* నిపుణుల రిమైండర్: *
60 సంవత్సరాల తరువాత, ఈ 10 చర్యలకు దూరంగా ఉండాలి.
* 1. మెట్లు ఎక్కవద్దు. *
మీరు తప్పక ఎక్కితే, మెట్ల కేసు రైలింగ్‌లను గట్టిగా పట్టుకొని ఎక్కండి,
* 2. మీ తలను వేగంగా తిప్పకండి. *
కళ్ళు బైర్లు కమ్మి మీరు క్రింద పడిపోవచ్చు,
* 3. మీ కాలి బొటనవేలును తాకడానికి మీ శరీరాన్ని వంచవద్దు.🤸🤸
మొదట మీ శరీరాన్ని సిద్ధం చేసుకోండి,
* 4. మీ ప్యాంటు ధరించడానికి నిలబడకండి.
కూర్చుని మీ ప్యాంటు ధరించండి *
* 5. నిలబడి ఒక్కసారి గా పడుకోకుండా మీ శరీరం యొక్క ఒక వైపు (ఎడమ చేతి వైపు, లేదా కుడి చేతి వైపు) నుండి కూర్చోని పడుకోండి,
* 6. వ్యాయామానికి ముందు మీ శరీరాన్ని ట్విస్ట్ చేయవద్దు. మొదట మీ శరీరాన్ని సిద్ధం చేసుకోండి,
* 7. వెనుకకు నడవకండి. *
వెనుకకు పడటం వలన తీవ్రమైన గాయం అవుతుంది.
* 8. భారీ బరువును ఎత్తడానికి నడుము వంచవద్దు. మీ మోకాళ్ళను వంచి, సగం చతికిలబడినప్పుడు వస్తువును పైకి ఎత్తండి. 🏋♀ *
* 9. మంచం మీద నుండి వేగంగా లేవకండి. మంచం నుండి లేవడానికి ముందు కొన్ని నిమిషాలు వేచి ఉండండి. *
* 10. వాష్‌రూమ్‌లో అధిక శక్తిని ఉపయోగించవద్దు. ఇది సహజంగా రావనివ్వండి. *
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలి మరియు
🥀🌹🥀అన్ని బాదలకి దివ్య ఔషదo
చిరునవ్వు ఒకటే🥀🌹🥀
🥀🌹🥀ఎన్ని కష్టాలు వచ్చినా సరే
గుండె నిబ్బరంతో ఉంటూ🥀🌹🥀
🥀🌹🥀పెదవులపై నీ చిరునవ్వు ని
ఎప్పటికి చెదరనివ్వకు నేస్తం🥀🌹🥀
🥀🌹🥀నీ చిరునవ్వు కి నీ కష్టాలు
దాసోహం అవుతాయి నేస్తం 🥀🌹🥀
దయచేసి అందరూ సీనియర్లకు ఫార్వార్డ్ చేయండి 💐🙏
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక కధలు (1010)
సేకరణ :రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
: స్త్రీ యొక్క 9 అవతారాలు
1 . ఉదయం —ఇంటిపనుల్లో —అష్టభుజి
2 . పిల్లలని చదివిస్తూ —సరస్వతి
3 . ఇంటి ఖర్చులో పొదుపు—మహాలక్ష్మి
4 . కుటుంబం కోసం వంట చేయడం లో —అన్నపూర్ణ
5 . కుటుంబం విషయాల్లో దృడంగా
నిలబటటంలో—పార్వతి
6 . భర్త తడి టవల్ మంచం మీద
వేసినపుడు —దుర్గ
7 . భర్త తెచ్చిన వస్తువు నచ్చకపోతే —కాళీ
8 . పుట్టింటి వారిని ఏమైనా అంటే —
మహిషాసురమర్దిని
9 . భర్త వేరే స్త్రీని మెచ్చుకుంటే —చండి
పెళ్లి ఐన మగవారు ఇంట్లో ఉండి రోజు నవదుర్గలను
దర్శించే అవకాశం ఉంటుంది
జై మాత జి
🌻 అన్ని జన్మలలోను ఏది ఉత్తమమైనది 🌻
🌺అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది. అసలు జన్మలు 3 రకాలు. 1) దేవజన్మ 2) మానవజన్మ 3) జంతుజన్మ.
🌺జన్మలు ఎలా వస్తాయి? వాటి ప్రత్యేకతలేమిటి?
🌺మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు.
🌺అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. అందులో అన్నీ పుణ్య కర్మలఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ నెత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు.
🌺అది భోగభూమి కనుక అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అధికారం లేదు. అందువల్ల పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు. తన కర్మఫలాలననుసరించి భోగాలనుభవించి, ఆ కర్మఫలాలు క్షయంకాగానే
🌺క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి” అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని మానవ లోకాన్ని చేరుకోవలసిందే.
🌺మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే. ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులుంటాయి గాని కర్మజేయుటకు సాధనమైన స్థూలశరీరం ఉండదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు దేవజన్మ.
🌺ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తాడు. ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు. జంతుజన్మలలో కర్మలు చేస్తున్నట్లు కన్పించినా, ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు. కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి .
🌺కారణం ఈ జన్మలలో శరీరం - మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు.
🌺ఇక పుణ్యపాపకర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు. పాపకర్మఫలాల కారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు.
🌺అయితే ఇలా కర్మఫలాలను అనుభవించటం మాత్రమే గాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవ జన్మలోనే ఉన్నది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం, మనస్సు, బుద్ధి అనే 3 సాధనాలు ఉన్న జన్మ ఇది.
🌺కనుక పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు.
🌺84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవ జన్మను
🌺జంతూనాం నరజన్మ దుర్లభం” అని ఆచార్య శంకరులు “వివేక చూడామణి” గ్రంధంలో తెలియజేయటం జరిగింది.
🌺ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి.
ధర్మో రక్షిత రక్షితః
No comments:
Post a Comment