*శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ గౌరీదశకం*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*శ్రీ గౌరీ దశకము*
*ॐॐॐॐॐॐॐॐॐॐॐ*
*1)లీలారబ్ధస్థాపిత లుప్తాఖిలలోకాం !!*
*లోకాతీతైర్యోగిభిరన్త శ్చిరమృగ్యామ్ !!*
*బాలాదిత్య శ్రేణిసమాన ద్యుతిపుంజాం !!*
*గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!*
*తన లీలచే సమస్తలోకములను సృష్టించి కాపాడి నశింపచేయునదీ, లోకాతీతులైన యోగులచే చిరకాలముగా వెతకబడుచున్నదీ, బాలసూర్య సమూహము వంటి కాంతి మండలము కలదీ, పద్మముల వంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించు చున్నాను.*
*2) ప్రత్యాహార ధ్యానసమాధిస్థితి భాజాం!!*
*నిత్యం చిత్తే నిర్వృతికాష్టాం కలయంతీమ్!!*
*సత్యజ్ఞానానన్దమయీం తాం తనురూపాం!!*
*గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!*
*ప్రత్యాహారము-ధ్యానము-సమాధి అను యోగముల నాచరించు యోగుల మనస్సు నందు ఎల్లప్పుడు సంతోషమును కలిగించునదీ, సత్యము- జ్ఞానము- ఆనందములు స్వరూపముగా కలదీ, సూక్ష్మ రూపములోనున్నదీ, పద్మముల వంటి కన్నులు కలదీ,అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.*
*3)చన్ద్రాపీడానన్దిత మన్దస్మితవక్త్రాం !!*
*చన్ద్రాపీడాలంకృత నీలాలకశొభామ్ !!*
*ఇంద్రోపేంద్రాద్యర్చితపాదామ్బుజయుగ్మాం !!*
*గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!*
*చంద్రచూడుడగు శివునిచే ఆనందింప చేయబడిన చిరునవ్వు ముఖము కలదీ, తన నల్లని కురులలో చంద్రుని అలంకరించుకున్నదీ, ఇంద్రుడు- విష్ణువు మొదలగు దేవతలచే పూజింపబడు పాదపద్మములు కలదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.*
*4) ఆదిక్షాన్తా మక్షరమూర్త్యా విలసన్తీం!!*
*భూతేె భూతే భూతకదంబ ప్రసవిత్రీమ్!!*
*శబ్దబ్రహ్మానంద మయీం తాం తటిదాభాం!!*
*గౌరీమంబామంబురుహాక్షీమహమీడే !!*
*’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరములు తన స్వరూపముగా విలసిల్లుచున్నదీ, పంచమహాభూతములలో (భూమి- నీరు- గాలి- అగ్ని- ఆకాశము) ప్రతి దానియందు అనేక ప్రాణులను సృష్టించునదీ, శబ్దబ్రహ్మ స్వరూపిణియైనదీ, ఆనందముతో నండినదీ మెరుపువలే ప్రకాశించునదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీ దేవిని నేను స్తుతించు చున్నాను.*
*5)మూలాధారాదుత్థితవీథ్యా విధిరన్ధ్రం !!*
*సౌరం చాన్ద్రం వ్యాప్య విహారజ్వలితాఙ్గీమ్ !!*
*యేయం సూక్ష్మాత్సూక్ష్మతనుస్తాం సుఖరూపాం !!*
*గౌరీమంబామమ్బురుహాక్షీమహమీడే !!*
*సుషుమ్నానాడీ మార్గము ద్వారా మూలాధారచక్రము నుండి బ్రహ్మరంధ్రము వరకు సూర్య చంద్రస్థానములైన ’ఇడా’ ’పింగళా' నాడుల యందు విహారించునదీ, తేజోమూర్తి యైనదీ, సూక్ష్మమైన పదార్థము కంటే సూక్ష్మమైనదీ, సుఖస్వరూపిణియైనదీ, పద్మముల వంటి కన్నుల కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని స్తుతించు చున్నాను.*
*6)నిత్యః శుద్ధో నిష్కల ఎకో జగదీశః !!*
*సాక్షీ యస్యాః సర్గవిధౌ సంహరణే చ !!*
*విశ్వత్రాణక్రీడన లోలాం శివపత్నీం !!*
*గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!*
*నిత్యుడు- శుద్దుడు- పరిపూర్ణుడు- ఒక్కడు- జగదీశుడు అగు పరమేశ్వరుడు గౌరీదేవిని చేయు సృష్టి స్థితిలయలకు సాక్షి,ప్రపంచ రక్షణము అను క్రీడయందు ఇష్టము కలదీ, శివుని భార్య యైనదీ,పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించు చున్నాను.*
*7) యస్యాః కుక్షౌ లీనమఖణ్డం జగదణ్డం !!*
*భూయోభూయః ప్రాదురభూదుత్థితమేవ !!*
*పత్యా సార్ధం తాం రజతాద్రౌ విహరన్తీం !!*
*గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!*
*గౌరీదేవి గర్భము నందున్న సమస్త లోకములు మరల మరల పుట్టు చుండును. లీనమగు చుండును. భర్తతో కలిసి వెండి కొండపై విహరించునదీ,పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబ యైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.*
*8)యస్యామోతం ప్రోతమశేషం మణిమాలా !!*
*సూత్రే యద్వత్ క్వాపి చరం చాప్యచరం చ !!*
*తామధ్యాత్మజ్ఞానపదవ్యా గమనీయాం !!*
*గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!*
*చరాచర రూపమైన ఈ ప్రపంచమంతయు,దారము నందు మణులవలే గౌరీ దేవియందు అల్లుకుని ఉన్నది. అధ్యాత్మజ్ఞాన మార్గముచే తెలుసుకొనదగినదీ,పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.*
*9)నానాకారైః శక్తికదమ్బైర్భువనాని !!*
*వాప్య స్వైరం క్రీడతి యేయం స్వయమేకా !!*
*కల్యాణీం తాం కల్పలతామానతిభాజాం !!*
*గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!*
*గౌరీదేవి తాను ఒక్కతేగానే ఉండి శక్తివంతములైన నానారూపములతో లోకములనన్నిటినీ వ్యాపించి స్వేచ్చగా క్రీడించు చున్నది. కళ్యాణస్వరూపిణి, భక్తుల పాలిట కల్పలత, పద్మముల వంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.*
*10)ఆశాపాశక్లేశవినాశం విదధానాం !!*
*పాదామ్భోజధ్యానపరాణాం పురుషాణామ్!!*
*ఈశామీశార్ధాఙ్గహరాం తామభి రామాం!!*
*గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!*
*తన పద్మములను ధ్యానించు మనుషులకు ఆశాపాశముల వలన కలుగు బాధలను నశింప చేయునదీ, పరమశివుని అర్ధాంగి, పరమేశ్వరీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.*
*11)ప్రాతఃకాలే భావవిశుద్ధః ప్రణిధానా- !!*
*ద్భక్త్యా నిత్యం జల్పతి గౌరీదశకం యః !!*
*వాచాం సిద్ధిం సంపదమగ్ర్యాం శివభక్తిం !!*
*తశ్యావశ్యం పర్వతపుత్రీ విదధాతి !!*
*ఎవరైతే శుద్ధమైన హృదయమును కలవారై భక్తితో ప్రాతః కాలము నందు ఈ గౌరీ దశకమును స్తోత్రమును పఠించునో అతనికి వాక్సిద్దినీ, ఉన్నతమైన సంపదను, శివభక్తినీ గౌరీదేవి తప్పక ప్రసాదించును.*
*!!జయ జయ శంకర !! హర హర శంకర !!*
🕉🌞🌏🌙🌟🚩
॥ శ్రీ శంకరాచార్య కృతః సువర్ణ మాలాస్తుతిః ॥
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
1) అథ కథమపి మద్రసనాం త్వద్గుణలేశైర్విశోధయామి విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ ప్రభూ! నీ గుణములలో కొన్నిటితో ఏదో విధముగా నానాలుకను పవిత్రము చేసెదను. జగన్మాతతో కలిసిఉన్నవాడా! ఎల్లపుడూ శుభము నిచ్చువాడా! శంభో! మంగళము కలుగచేయువాడా! నీ చరణ యుగళము నాకు శరణము.
2) ఆఖణ్డల మదఖణ్డనపణ్డిత తణ్డుప్రియ చణ్డీశ విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
ఇంద్రుని మదమనణుచుటలో నిపుణుడైన నందీశ్వరునకు ప్రియమైనవాడా! చండీశుడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
3) ఇభచర్మామ్బర శమ్బరరిపువపురపహరణోజ్జ్వలనయన విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
గజ చర్మము ధరించినవాడా! శంబరుని శత్రువగు మన్మథుని దహించిన ఉజ్జ్వల నేత్రముగలవాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
4) ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ బిలేశయ భూషణ భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
లోకములను పాలించువాడా! కైలాసముపైనుండు వాడా! మానవుల నేలువాడా! పరాశక్తికి పతియైనవాడా! మహేశా! సర్పాభరణములు కలవాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
5) ఉమయా దివ్యసుమఙ్గలవిగ్రహయాలిఙ్గితవామాఙ్గ విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
దివ్యమణ్గళ విగ్రహముకల పార్వతిచే ఆలింగనము చేయబడిన శరీరపు ఎడమభాగము కలవాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
6) ఊరీకురు మామజ్ఞమనాథం దూరీకురు మే దురితం భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
ఓ స్వామీ! తెలివిలేనివాడను మరియు అనాథను అగు నన్ను దరిచేర్చుకొని నా పాపములను దూరం చేయుము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
7) ఋషివరమాన సహంస చరాచర జననస్థితిలయకారణ భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఋషిశ్రేష్టుల మానసములో చరించు ఓ హంసమా! చరాచరముల జననము, స్థితి మరియు లయలకు కారణమైనవాడా ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
8) ౠక్షాధీశకిరీట మహోక్షారూఢ విధృతరుద్రాక్ష విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
నక్షత్రనాథుడగు చంద్రుని కిరీటముపై ధరించువాడా! మహావృషభము నధిరోహించినవాడా! రుద్రాక్షలు ధరిమ్చినవాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
9) ఌవర్ణద్వన్ద్వమవృన్తసుకుసుమమివాఙ్ఘ్రౌ తవార్పయామి విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ ప్రభూ! తొడిములులేని మంచి పుష్పములవలే ఉన్న ఌ, ౡ అను అక్షరములను నీపాదమునందు సమర్పించుచున్నాను. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
10) ఏకం సదితి శ్రుత్యా త్వమేవ సదసీత్యుపాస్మహే మృడ భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ శివా! " ఏకం సద్విప్రాబహుధా వదన్తి"( ఒకే పరమాత్ముని విజ్ఞులు బహువిధములగా వర్ణించుచున్నారు) అను శృతిలోని సుద్రూపము ( పరమాత్మ) నీవే అని ఉపాసించు చున్నాము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
11) ఐక్యం నిజభక్త్యేభ్యో వితరసి విశ్వమ్భరోఽత్ర సాక్షీ భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
ఓ ప్రభూ! నీ భక్తులను నీలో ఐక్యము చేసుకొనుచున్నావు. దీనికి విశ్వంభరుడగు నీవే సాక్షి. ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
12) ఓమితి తవ నిర్దేష్ట్రీ మాయాఽస్మాకం మృడోపకర్త్రీ భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
సుఖకరుడవగు ఓ దేవా ! మాయాస్వరూపమైన ఓంకారము నిన్ను నిర్దేశించుచూ మాకు ఉపకారము చేయుచున్నది.ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
13) ఔదాస్యం స్ఫుటయతి విషయేషు దిగమ్బరతా చ తవైవ విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ ప్రభూ ! నీ దిగంబరత్వము నీకు సుఖముల పట్ల ఉదాశీనతను స్పష్టము చేయున్నది. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
14) అన్తఃకరణవిశుద్ధిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ ప్రభూ! చిత్త శుధ్ధిని మరియు నీయందు స్థిరభక్తిని ప్రసాదించుము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
17) అస్తోపాధి సమస్తవ్యస్తై రూపైర్జగన్మయోఽసి విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
ఓ ప్రభూ! నిరాకారుడ వైననూ నీవు చరాచరములు రూపములతో ప్రపంచమమ్తా నిండి ఉన్నావు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
18) కరుణా వరుణాలయ మయి దాస ఉదాసస్తవోచితో న హి భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
ఓ కరుణాసముద్రుడా! దాసుడనైనా నాపై నీవు ఔదాసీన్యము వహించుట ఉచితము కాదు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
16) ఖలసహవాసం విఘటయ సతామేవ సఙ్గమనిశం భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
ఓ స్వామి! నాకు దుష్టసహవాసమును తెగగొట్టి సజ్జనమైత్రిని సదా కల్పించుము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
18) గరళం జగదుపకృతయే గిలితం భవతా సమోఽస్తి కోఽత్ర విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
ఓ ప్రభూ! ప్రపంచమునకు ఉపకారముచేయుటకై నీవు విషము మింగితివి. నీతో సమానుడెవడు? సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
19) ఘనసార గౌరగాత్ర ప్రచుర జటాజూటబద్ధగఙ్గ విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
ఓ ప్రభూ! ముద్దకర్పూరము వలే తెల్లని శరీరము కలవాడా! దట్టమైన జటాజూటముతో గంగను ధరించిన వాడా! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
20) జ్ఞప్తిః సర్వశరీరేష్వఖణ్డితా యా విభాతి సాత్వం భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
ఓ స్వామి ! శరీరములన్నిటిలో ఒకటిగా వెలుగొందు చైతన్యము నీవే. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
21) చపలం మమ హృదయకపిం విషయద్రుచరం దృఢం బధాన విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ ప్రభూ! ఇంద్రియ సుఖములచే చెట్టుపై సంచరించు చపలమైన నా హృదయమనే కోతిని ధృఢముగా బంధించుము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
22) ఛాయా స్థాణోరపి తవ పాపం నమతాం హరత్యహో శివ భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ స్వామి! నీవు స్థాణువు అని పిలువబడుచున్నావు. (స్థాణువనగా స్థిరమైనవాడు మరియు కొమ్మలు లేని మోడు అని రెండర్థములు) ఐననూ నీనీడ భక్తులు సంతాపనము పోగొట్టుచున్నది. ఓ సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
23) జయ కైలాసనివాస ప్రమథగణాధీశ భూసురార్చిత భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ ప్రభూ! కైలాశ నివాసా! ప్రమథ గణాధీశా ! బ్రాహ్మణులచే పూజింపబడువాడా! నీకు జయమగుగాక. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
24) ఝణుతకఝిఙ్కిణుఝణుతత్కిటతకశబ్దైర్నటసి మహానట భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
నటరాజువగు ఓ దేవా ! ఝణుతక ఝంకిణు ఝణుతత్కిటకిట అను తాళధ్వనితో నీవు నటించుచున్నావు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
25) జ్ఞానం విక్షేపావృతిరహితం కురు మే గురూస్త్వమేవ విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
ఓ ప్రభూ! చాంచల్యములేని స్థిరమైన జ్ఞానమునుపదేశించుము. నీవే గురువవు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
టఙ్కారస్తవ ధనుషో దలయతి హృదయం ద్విపామశనిరివ భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
ఓ స్వామీ! నీ ధనుష్టంకారము పిడుగువలే శత్రుహృదయమును భేదించుచున్నది. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
27) ఠాకృతిరివ తవ మాయా బహిరన్తః శూన్యరూపిణీ ఖలు భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
ఓ దేవా ! ఠ అను అక్షరము వలే నీ మాయ బయట మరియు లోపల శూన్యముగా ఉన్నది. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
*28) డమ్బర మమ్బురుహామపి దలయత్యనఘం త్వదఙ్ఘ్రియుగలం భో । *
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ స్వామీ! నీ పాదముల జంట పాపమనే బురద అంటనిదై పద్మముల ఆడంబరమును అణుచుచున్నది. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
29) ఢక్కాక్షసూత్రశూలద్రుహిణకరోటీసముల్లసత్కర భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
ఢక్క, రుద్రాక్షమాల, శూలము మరియు బ్రహ్మకపాలములతో విరాజిల్లు హస్తములు కల ఓ స్వామి! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
30) ణాకారగర్భిణీ చేచ్ఛభదా తే శరణగతిర్నృణామిహ భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ స్వామీ! ’ణ’ అను అక్షరము మధ్యలో ఉన్న నీ బాణగతి ఈ లోకములో మానవులకు శుభమునిచ్చుచున్నది. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
31) తవ మన్వతిసఞ్జపతః సద్యస్తరతి నరో హి భవాబ్ధిం భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ దేవా! నీ మంత్రములు ఎక్కువగా జపించుటవలన మానవుడు సంసారసాగరమును తరించుచున్నాడు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
32) థూత్కారస్తస్య ముఖే భూయాత్తే నామ నాస్తి యస్య విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ ప్రభూ! నీ నామము జపించనివాడి ముఖము "థూత్" అని చీత్కరించబడుగాక.సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
33) దయనీయశ్చ దయాళుః కోఽస్తి మదన్యస్త్వదన్య ఇహ వద భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ స్వామీ! నీ కంటే దయకలవాడు మరియు నా కంటె దయనీయుడు ఈ లోకములో ఎవరున్నారు? సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
34) ధర్మస్థాపన దక్ష త్ర్యక్ష గురో దక్షయజ్ఞశిక్షక భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
ఓ దేవా ! ధర్మస్థాపనలో సమర్ధుడా! ముక్కంటీ ! గురువైనవాడా! దక్షయజ్ఞనాశకుడా!సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
35) ననుతాడి తోఽసి ధనుషా లుబ్ధధియా త్వం పురా నరేణ విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ ప్రభూ ! బుధ్ధిమంతుడైన అర్జునునిచే నీవు పూర్వము ధనస్సుచే కొట్టబడితివి.సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
36) పరిమాతుం తవ మూర్తిం నాలమజస్తత్పరాత్పరోఽసి విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ ప్రభూ ! బ్రహ్మదేవుడు కూడా నీ స్వరూప మిటువంటిదని వర్ణించలేడు. కనుక నీవు శ్రేష్టములైన వాటి కంటే శ్రేష్ఠుడవు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
37) ఫలమిహ నృతయా జనుషస్త్వత్పదసేవా సనాతనేశ విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ ప్రభూ! సనాతనుడైన ఈశ్వరా! ఈ లోకములో మానవునిగా జన్మించినందుకు ఫలము నీ పాద సేవయే. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
38) బలమారోగ్యం చాయుస్త్వద్గుణరుచితాం చిరం ప్రదేహి విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ ప్రభూ! బలమును, ఆరోగ్యమును, ఆయుష్షును, నీ గుణములందు ఇష్టమును చిరకాలము అనుగ్రహించుము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
39) భగవన్ భర్గ భయాపహ భూతపతే భూతి భూషితాఙ్గ విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
ఓ భగవంతుడా! శివుడా ! భయమును పోగొట్టువాడా! భూతపతీ! విభూతితో అలంకరించబడిన శరీరము కలవాడా ! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
40) మహిమా తవ నహి మాతి శ్రుతిషు హిమానీధరాత్మజాధవ భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
పార్వతీ పతియైన ఓ స్వామీ ! నీ మహిమ వేదములలో ఇముడుటలేదు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
41) యమనియ మాదిభిరఙ్గైర్యమినో హృదయే భజన్తి స త్వం భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ స్వామీ ! యతులు నిన్ను యమనిమాది అష్టాంగములతో తమ హృదయములో సేవించుచున్నారు.సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
42) రజ్జావహిరివ శుక్తౌ రజతమివ త్వయి జగన్తి భాన్తి విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ ప్రభూ ! తాడుతో పామువలే మరియు మృత్యువు చిప్పలో వెండివలే నీలో ఈ జగత్తులో ఆ భాసించుచున్నవి. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
43) లబ్ధ్వా భవత్ప్రసాదాచ్చక్రం విధురవతి లోకమఖిలం భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ దేవా! నీ అనుగ్రహముతో చక్రాయుధమును పొంది విష్ణుమూర్తి లోకములన్నిటినీ రక్షించుచున్నాడు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
44) వసుధాతద్ధరచ్ఛయరథమౌర్వీశరపరాకృతాసుర భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
ఓ స్వామీ! భూమిని రథముగానూ, సర్పమును వింటి త్రాడుగానూ, విష్ణువును బాణముగానూ చేసుకొని త్రిపురసంహారము చేసితివి. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
45) శర్వ దేవ సర్వోత్తమ సర్వద దుర్వత్తగర్వహరణ విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ సర్వరూపీ ! దేవా! సర్వోత్తమా! అన్నిటినీ ప్రసాదించువాడా! దుష్టుల గర్వమును హరించువాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
46) షడ్రిపుషడూర్మిషడ్వికారహర సన్ముఖ షణ్ముఖజనక విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
కామము- క్రోధము - లోభము- మోహము -మదము- మాత్సర్యము అను ఆరు శత్రువులను, అట్లే ఆకలి- దప్పిక- శోకము- అజ్ఞానము- ముసలితనము- మరణము అను ఆరు కష్టములను, మరియు ఉండుట- పుట్టుట- పెరుగుట- క్షీణించుట- నశించుట అను ఆరు వికారములను హరించువాడా! సుందరముఖుడా! షణ్ముఖుని జనకుడా! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
47) సత్యం జ్ఞానమనన్తం బ్రహ్మేత్యేతల్లక్షణలక్షిత భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
" సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ" అను వాక్యముచే తెలియజేయుబడువాడా! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
48) హాహాహూహూ ముఖసురగాయకగీతాపదానవద్య విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
హాహా హూహూ మొదలైనదేవగాయకులు పొగడు కీర్తి గలవాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
49) ళాదిర్న హి ప్రయోగస్తదన్తమిహ మఙ్గలం సదాఽస్తు విభో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥
"ళ" అను అక్షరముతో ఏ పదమూ మొదలవదు.ఆ అక్షరం చివరగా ఉన్న ’మంగళం’ ఎల్లప్పుడూ కలుగుగాక. ఓ ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
50) క్షణమివ దివసాన్నేష్యతి త్వత్పదసేవాక్షణోత్సుకః శివ భో ।
సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥
ఓ స్వామీ! నీ పాదసేవామహోత్సవము నందు ఉత్సాహము కలవాడు దినములను క్షణమువలే గడుపును. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.
॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతః సువర్ణమాలాస్తుతిః సమ్పూర్ణః ॥
--00((--
Swami Vivekananda's wisdom for daily inspiration
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి .
Unselfishness is more paying, only people have not the patience to practise it.
స్వార్ధరాహిత్యమే విశేష లాభదాయకం. కాని దానిని అలవరచుకొనే ఓర్పు జనానికి లేదు.
Inspiring Sayings of Swami Vivekananda / స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక వచనాలు.
Great enterprise boundless courage, tremendous energy and, above all. perfect obedience - these are the only traits that lead to individual and national regeneration.
అఖండమైన ఉత్సాహం, అప్రతిహితమైన ధైర్యం, అప్రతిహితమైన శక్తి... అన్నింటినీ మించి పరిపూర్ణ విధేయత - ఈ లక్షణాలే ఒక వ్యక్తినిగాని, ఒక దేశాన్నిగాని పునరుజ్జీవింప చేయగలవు.
భాగవతము ... శ్రీగురుభ్యోనమః
5. శివుడు - నియుత్తు. శివశక్తి దేనినైనా నియమించగలదు. శివారాధన చేసేవాడు దేనినైనా నియమించే శక్తి గలవాడుగా ఉంటాడు. తనను తాను నియమించుకోగలిగిన వాడే ఇతరులను నియమించగలడు. ఈ శక్తి శివుడిస్తాడు.
నియుత్తు అంటే చక్కగా వినియోగించడం.నియుత్తు తెలిసినవారికి ఎవరికి, ఏవిషయమందు, ఏరకముగా నియుత్తం చేయాలో తెలుసు. అలా కానప్పుడు తెలియక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మొత్తము సృష్టిలో సమస్తమైన వనరులను లేక శక్తిని చక్కగా సద్వినియోగము చేసే శక్తిగా 5 వ రుద్రుడు పని చేస్తుంటాడు.
శ్రీరమణీయం - (726)
"భావం ఆత్మసాక్ష్యాత్కారానికి ఏవిధంగా అడ్డు అవుతుంది !?"
మనిషిలో ఏర్పడే తొలి భావమే నేను అనే తొలి తలపుగా ఉంది. ఆ భావమే ఆత్మసాక్షాత్కారానికి అడ్డుగా ఉంది. అయితే ప్రపంచంతోనూ, మన కష్టసుఖాలతోనూ మనను అనుసంధానం చేసేది భావమే. భావం అంటే మనో సంభాషణ. ఒక జంతువుకు దాహం వేస్తే వెళ్ళి నీరు త్రాగుతుంది. అదే మనిషి అయితే దాహం వేయగానే 'దాహంవేస్తోంది' అని అనుకుంటాడు. ఇలా అనుకునే మనో సంభాషణే భావం అంటే. అది బయటికి చెబితే భాష అవుతుంది. అంటే లోపల భావంగా ఉన్నదే బయటకు భాషగా వ్యక్తమౌతుంది. భాషకు ముందు మనసులో జరిగే సంభాషణే భావం. జంతువుకు దాహం తీర్చుకోవడానికి సహజ ప్రేరణ సరిపోతుంది. ఏ భావంతో అవసరంలేదు. దానికి ఏ భావం లేదు కనుకనే 'నేను' అనే భావం కూడా రాలేదు. ఇప్పుడు మనం భావాలతో ఉన్నాం కనుక నేను దేహాన్ని, నేను ఫలానా అని అనుకుంటూ ఉంటాం. ఆత్మసాక్షాత్కారం అంటే నేను ఆత్మను అని అనిపిస్తుందేమోనని అనుకుంటాం. కానీ అలాకాదు. ఆత్మసాక్షాత్కారం అంటే తాను దేహం అనిగాని, ఆత్మనని గానీ అనుకోని స్థితి. అది అసలు అనిపించడమే లేని స్థితి. నిద్రపోయేవాడు తాను నిద్రపోతున్నాను అనుకుంటున్నాడంటే తను నిజంగా నిద్ర పోవటం లేదని అర్థం. అలాగే ఆత్మానుభవం పొందినవాడు నేను దేహాన్ని అనుకోన్నట్లే నేను ఆత్మ స్వరూపుడిని అని కూడా అనుకోడు. ఏదీ అనుకోకుండా ప్రకృతి ప్రేరణతో కదులుతాడు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం }"
"భగవదానుభవానికి భావ దూరంలోనే ఉన్నాము !''- (అధ్యాయం -89)
"ఋభుగీత " (193)
సర్వసిద్ధాంత సంగ్రహము
14వ అధ్యాయము
సత్యం అర్థమైతే ఇక బంధమోక్షాలతో నిమిత్తం లేదని తెలుస్తుంది !!
వేదాంతంలో సాధన, శోధన... అంతా మనసే. దాని సమస్త కదలికలు అర్థం అయితే అనుక్షణం ఆత్మే మనసుగా ఎలా చరిస్తుందో, మనసే ఆత్మగా ఎలా నిలుస్తుందో అర్థమవుతుంది. మనసులోని ప్రియత్వం గానీ, ప్రపంచహీనత్వం గానీ రెండూ ఆత్మ స్వభావాలేనని తెలుస్తుంది. దేహవివర్జితము అంటే దేహంలేదని గుర్తించమనే కానీ, దేహాన్ని విస్మరించమని కాదు. నేను అనేది దేహం కారణంగా తెలుస్తున్నా అది కేవలం దేహానికే పరిమితమైందని కాదని తెలిస్తే మనం దేహవివర్జితులం ఎలా అవుతామో అర్థమవుతుంది. అలాగే మనం దేహవివర్జితులమన్న సత్యం అర్థమైతే ఇక బంధమోక్షాలతో నిమిత్తం లేదని కూడా తెలుస్తుంది !
🌷85-మంద్రగీత🌷అధ్యాయము-7
🥀 శాస్త్రవిజ్ఞానము🥀
5. ఈ ఎనిమిది ప్రకృతులు నా ప్రకృతి అనబడు తొమ్మిదవ దాని యందు పలకలపై సున్నాలు చుట్టినట్లు వర్తించుచున్నవి. ఈ తొమ్మిదవది పరాప్రకృతి లేక ఉత్తమ ప్రకృతి. మిగిలిన ఎనిమిదియు దీనినుండి వేరై వర్తించి దీనిలోనికి ప్రవేశించుచున్నవి. ఈ తొమ్మిదవ ప్రకృతి యందు, దానికన్న మొదటి వాడుగ నేనుందును. నేనే దాని యందు జీవుడుగ దిగివచ్చుచున్నాను, కనుక దీనికి నేను మొదటి వాడను. సృష్టిగా పదవ వాడను. ఈ విధముగా నేను దిగి వచ్చుట పది అంకెలలో జరుగుచున్నది.
తొమ్మిదవ ప్రకృతి జీవము అనబడును. దానిచే ధరించి పోషింపబడి మిగిలిన ఎనిమిదియు జీవులు అగుచున్నవి.
6. ఈ తొమ్మిదియు నా ఉత్పత్తి ద్వారములు అని ఎరుగుము. అవే అంకెలు. వాని యందు నేనుందును, వాని ఉత్పత్తి, లీనము నేనే!
7. నాకన్నా పైన ఇంకేమియు లేదు. నా యందు ఈ తొమ్మిదియు దారమునందు పూసలవలె కూర్చబడియున్నవి. కన్ను, ముక్కు, చెవి, మనస్సు, బుద్ధి నావి అనబడును. మానవుడు నా మనస్సు అని వ్యవహరించుటలో "నా" అను దారమునకు ఇవి అన్నియు గ్రుచ్చబడి ఉన్నవని తత్వము.
98) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
షష్టము: చిత్రదీప ప్రకరణము
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యథా చిత్రపటే దృష్టమవస్థానాం చతుష్టయమ్ ౹ పరమాత్మని విజ్ఞేయం తథాఽ వస్థాచతుష్టయమ్ ౹౹1౹౹
1. చిత్రపటములు చిత్రీకరించుటయందు నాలుగు అవస్థలను మనము గమనించినట్లే పరమాత్మపై జరుగు జగద్రచన యందు కూడా నాలుగు అవస్థలను తెలియవలెను.
వాఖ్య:అవ్యక్తము అంచిత్యము అగు బ్రహ్మమునకు బదులు ఇంద్రియ గోచరము అపారవైవిధ్య సంపన్నము అగు ఈ జగత్తును మనము చూచుచుండుట ఎట్లు జరుగుచున్నది?
ఆరోపించుట వలన.
తెల్ల కాగితముపై గాని వస్త్రముపైగాని వివిధ వర్ణములను ఆరోపించుట వలన మనము ఇక కాగితమును గాని వస్త్రమును గాని చూడము.
వానిపై ఆరోపించబడిన పర్వతములను నదులను వృక్షములను ప్రాణిజాతమును చూచుచు
"ఎంత మనోహరమైన చిత్రము"
అని ఆనందించుచు మైమరచి పోవుదుము.
శ్రద్ధాయుతమగు వివేచన వలనగాని ఆ చిత్రమంతా శుద్ధ వస్త్రము పైని రంగురంగుల విన్యాసమే అని మనస్సునకు తోచదు.అట్లే జనన మరణములు జరావ్యాధులు సుఖదుఃఖములతో నిండి మనలను సమ్మోహపరచు ఈ జగత్తు కూడా శుద్ధము ఆనందస్వరూపము అగు బ్రహ్మముపై ఆరోపింపబడిన అజ్ఞానపు విన్యాస వైచిత్ర్యమే.
వస్త్రమును రంగులను వివేచించినట్లే బ్రహ్మమును అజ్ఞానవికారములను వివేచించి తత్త్వమును తెలియవలెను.
ఈ రెండు ప్రక్రియలకే
అద్వైత శాస్త్రమున
"అధ్యారోపము-అపవాదము"అని పరిభాష.
జగద్రచనలో శుద్ధ బ్రహ్మము, అంతర్యామి,సూత్రాత్మ ,విరాట్టు అను నాలుగు అవస్థలు గలవు.
అధ్యారోప అపవాదమును
శంకర భగవత్పాదులు ఇలా చెప్పుచున్నారు-
"బ్రహ్మమునందు దేహేంద్రియాది ప్రపంచమున్నదని ఆరోపణచేసి అటుపై అపవాదము అనగా ఇదిగాదు ఇదిగాదు అని నిషేధించగా ఆత్మ తత్త్వము తెలియబడుచున్నది".
ఈ విధముగా ఆత్మయందు లేక బ్రహ్మమునందు ఆరోపింపబడిన జగత్తు సత్యముగాదు.శుక్తియందు రజితమువలె,రజ్జువందు సర్పమువలె బ్రహ్మము యందు జగత్తుయున్నది.
ఎంతవరకు స్వస్వరూపమైన బ్రహ్మము తెలియబడదో అంతవరకు ఈ బ్రహ్మమే జగద్రూపముగా తోచుచున్నదేగానీ నిజముగా లేదు.
ఆత్మ తన మాయ ద్వారా తనలో వివిధ ఆకారముల,రజ్జువు పై జూడబడు సర్పాది స్వరూపముల వలె కల్పించు కొనును.కాన ఈ జగత్తు మిథ్యయే.బ్రహ్మము తెలియనందువల్ల కనబడు ఈ జగత్తు సృష్టించ బడినదని చెప్పుట అవివేకి దృష్టి ననుసరించియేగానీ, వివేకిదృష్టి ననుసరించి చెప్పబడలేదు.
--(())--
ప్రాంజలి ప్రభ
సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
శ్రీనాథ కవి సార్వభౌముడు: సంక్షిప్త కధ
కం. ఒక వర్ష శతంబున నొం
డొక తీర్ధము నందు గల ప్రయోజన లాభము
బొక దివసంబున నానం
ద కాననము నందు సర్వదా సిద్ధించున్! (121)
తా. కాశీ కంటే వెరొక తీర్ధమునందు ఒక నూరు సంవత్సరములకు లభించెడి ప్రయోజనము ఆనందదాయకమైన కాశీ యందు ఒక్క దినమునందే యెల్లప్పుడూ సిద్ధించును.
కం. నేమంబున నొక ప్రాణా
యామంబున నరుడు పడయునట్టి ఫలశ్రీ
సామాగ్రి యొండెడ ముని
గ్రామణి ! సాష్టాంగయోగ గతి గనరు నరుల్! (122)
నేమంబున = నియమముతో; ఒండెడన్ = వెరొక తీర్ధమునందు.
తా.కాశీ క్షేత్రములో ఒక్క ప్రాణా యామము వలన మనుష్యుడు పొందెడి సమగ్ర ఫలసమృద్ధిని అన్య క్షేత్రమునందు అష్టాంగసహిత యోగ మార్గమున కూడా పొందజాలరు.
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
45. బామ్మగారు
బామ్మగారు నెమ్మదిగా నడుస్తూ ఇంట్లోకి రండి
మా అబ్బాయి నునె పారబోసాడు, కాసేపు ఉండండి
సర్ఫు వేసి తుడుస్తా బామ్మతో అన్నది ఆ ఇల్లాలు
పిల్లలు చేసినపని అని కొట్టకండి అంటూ ముందుకు నడిచింది బామ్మగారు
అంటే జారి క్రింద పడింది, నా నడుం ఇరిగినంటుంది కొడకా ....
లోపలనుమ్చి పిల్లవాడి ఒకటే నవ్వు ...............
46. ఖచ్చితముగా
నువ్వు ఖచ్చితముగా లక్ష రూపాయలు ఇవ్వకపోతే మీ ఆవిడను
చంపేస్తామని ఫోన్ చేసారు కిడ్నాపర్సు
నేను ఖచ్చితముగా మాట నిలబెట్టుకోలేను
మీరైన ఖచ్చితముగా మాట నిలబెట్టుకొండి అని భర్త చెప్పి ఫోన్ పెట్టేసాడు
47. కొత్త మోజు
చూడండి వాళ్ళు చిలకా గోరింకలుగా ఉన్నారు అంది భర్తతో భార్య
ఏముందే మనలో లేని ప్రచ్చేకత వాళ్ళల్లో అన్నాడు భర్త
వాల్లావిడ కోసం కారు తలుపు తెరిచి ఎలా పట్టుకున్నాడో అంది భార్య
కారు అయినా కొత్తది అయి ఉండాలి, లేదా పెళ్ళైన కొత్త మోజు అయినా
ఉండాలి అన్నాడు భర్త భార్యతో ..................
48. నాలుగోనెల
అమ్మ నేను ఒక పిల్లవాడిని ప్రేమిస్తున్నాను అంది కూతురు
అబ్బాయి వయసెంతా, ఏమ్చేస్తున్న్నాడు, అని అడిగింది తల్లి
నాలుగోనెల నాపొట్టలో ఉండి తంతున్నాడు అంది కూతురూ ..........