Wednesday, 6 June 2018

ప్రజలి ప్రభ (12-06-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: - శ్రీ కృష్ణాయనమ:
Photo
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికమ్ 


నేటి హాస్యం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

భర్త : ఇదిగో మీనాన్న ఉత్తరం వ్రాసారు
భార్య: నేను పుట్టింటికి వెళతాను
           కానీ ఒక షరతు .....  మీరు నన్ను దిగపెట్టాలి అన్నది
భర్త : ఊ...   సరే నది ఒక షరతు 
భార్య: ఏమిటండి అది
భర్త: మల్లి నేను నిన్ను తీసుకోని వెళ్ళడానికి వచ్చేదాకా
        నీవు పుట్టింటింట్లోనే ఉండాలి
భార్య: నాది ఒక షరతు ఈరోజు నిదగ్గరనుంది ఫోన్ రాదో
        ఆ రోజే బయలు దేరి వస్తాను దానికి ఒప్పుకుంటే దించండి
భర్త : పుట్టింటిలో దించి వచ్చాడు
భార్య : రెండో రోజే తిరిగి వచ్చింది ఈషరతు మీద ?
.........................
...........Photo..............

భర్త : మాట తప్పవు నీకు ఫోన్ చెసాగా
భార్య: వేరేవారి ఫోన్ తో చేస్తే నాకు అనుమానం రాదా
భర్త : ఆ...     ఆ..   .. అంటూ బుర్ర గోకుంటున్నాడు
భార్య: బుర్ర గోక్కోకు ఆ ఉన్న జుట్టు కూడా ఊడి పోతుంది
           ఇదిగో ఫోన్ మీ లవర్ కి ఫోన్ చేయండి నీతో
           మా ఆవిడ వచ్చిందని
భర్త: ఆ...       ఆ....        ఆ....           ఆ....

Animation

నేటి హాస్యం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఎరా మనవడా అంటూ పిలిచింది బామ్మా
ఏమిటిరా అంత దిగులుగా ఉన్నావ్
ఏమి లేదు బామ్మ ఫేక్ బుక్ లో వ్రాసే కవితలకు
ఒక్కరు కూడా లైక్ చేయుట లేదు ఎందుకు?
నీవే ఉద్యోగం సద్యోగం లేని సన్నాసివి, నీకెవరురా లైక్ చేసేది
అమ్మాయిలతో చాట్ చేస్తున్నావ్ మోసపోతావంటే
వినిపించుకోవు ...  ఈ పిల్లలు ఎప్పుడు మారుతారో
అంటూ లోపలి వెళ్ళింది బామ్మ
అబ్బా నాకు ఎన్ని లైకులో అంటూ
పెద్దగా అరిచాడు మనవుడు
....  ... .....
పిల్లల సంతోషం కోసం బామ్మలు సెల్ ఫోన్ వాడాల్సిన
పరిస్థితి వచ్చింది ఇది ఏమి లోకం
అంటూ మనవాడి తలనిమిరింది బామ్మా   
ఆ ...  ఆ..      ఆ..    ఆ..   

Gadgets

కొసరాజు చమక్కులు - సిగరెట్టు చురుక్కులు !!

కుక్కపిల్లా, సబ్బు బిళ్ళా, అరటితొక్కా, బల్లచెక్కా ఏదీ కవిత్వంలో వస్తువుగా అనర్హం కాదన్నారు శ్రీశ్రీ. ఉదాత్తమైన వస్తువు మాత్రమే కవితా వస్తువుగా ఉండాలని మన ఆలంకారికుల నమ్మకం. కానీ సమాజంలో తేలికగా చూడబడే సిగరెట్టు లాంటి వస్తువు మీద "న భూతో నభివిష్యతి"

అన్నట్టు అమోఘమైన పాట రాసారు కొసరాజుగారు. సరదా పాటల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన పాటల్లో ఇది మరీ ఉత్తమమైన కోవకు చెందుతుంది

సిగార్ అంటే ఎండిన పొగాకును చుట్టగా చుట్టినది అని అర్థం. ఆ చుట్టని నైస్ గా చిన్నగా చుడితే అదే సిగరెట్. మన తెలుగుభాష మర్యాద ప్రకారం ద్విరుక్తం చేసి సిగరెట్టుగా చేసుకుని వాడుకుంటున్నాం.

.

“సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ దాగు బల్ సిగరెట్టూ

పట్టుబట్టి ఓ దమ్ములాగితే స్వర్గానికి ఇది తొలిమెట్టు"

అంటూ ఓ భర్తగారు గుఫ్పు గుఫ్ఫుమని పొగను పీలుస్తూ వదులుతూ స్వర్గం లో తేలుతున్నట్టుగా మురిసిపోతుంటాడు. భర్త దగ్గరకు వచ్చిన భార్య సిగరెట్టు పొగలు చుట్టుముట్టగా ఉక్కిరి బిక్కిరవుతుంది. ఆ సందర్భంలో సిగరెట్టు మంచి చెడులను ఎవరికి వారు సమర్థించుకుంటూ విమర్శించుకుంటూ సంభాషించుకునే పాట ఇది. తనకి భర్తలో నచ్చని ఈ ధూమపానసేవనం నుంచి ఎలాగయినా మరల్చాలని భార్య ప్రయత్నించడం, ఎన్నో వాగ్బాణాలను విసరడం, భర్త వాటిని తెలివిగా తిరగ్గొట్టడం ఈ క్రమంలో కొసరాజుగారి చమక్కులు ప్రేక్షకులకి, శ్రోతల మనసులకి చురుక్కమనిపంచడం, మనసుల్లో హాసపు మెరుపులు చమక్కుమనడం షరా మామూలే.

భారతీయుల్లో ఉన్న పెద్ద అవలక్షణం - విదేశీ వస్తువుల పట్ల మోజు. మన దేశంలో పొగాకు కు ఈ విధమైన వినియోగాన్ని పరిచయం చేసినవారు బ్రిటిషర్లు. బ్రిటిష్ దొరలు ఓ పైప్ నోట్లో వేసుకుని పొగను పీలుస్తూ వదులుతూ అధికారం ప్రదర్శిస్తూ దర్జాగా ఆర్డర్లు వేస్తుంటే ఆ దొరల స్టైల్ కి దాసోహమన్నారు చాలామంది. అందుకే అలా విలాసంగా, కులాసంగా కనిపించడానికి వారిని అనుకరిస్తూ ఈ సిగరెట్ తో పొగతాగడంలోని ఆనందాన్ని ఊరికే రుచి చూడడానికి ప్రారంభించి చివరకు దానికి దాసోహం అన్నారు. “ దొరల్ దాగు బల్ సిగరెట్టూ “అంటూ ఆ భర్త సీమ దొరలను మెచ్చుకోవడం లో ఈ ఫాషన్ అనుకరణని చూపించారు కొసరాజు.

తన కంపు తనకే ఇంపు కానీ ఇతరులకు కాదు కదా. భార్యకి ఆ సిగరెట్ వాసన కంపుగా కనిపిస్తుందందుకే.

“ కంపుగొట్టు ఈ సిగరెట్టు కాల్చకోయి నా పై ఒట్టు” అంటూ సెంటిమెంట్ తో అతన్ని లొంగదీసుకోవడానికి ప్రయత్నం ప్రారంభిస్తుంది. మనిషి మీద ఒట్టు వేసి, ఆ పై మాట తప్పితే ఒట్టువేయబడిన మనిషికి ప్రాణం మీదకి వస్తుందని మన నమ్మకం. అందుకే తన మీద ఒట్టు వేస్తే భర్త ఆ పాడు సిగరెట్టు కాల్చే అలవాటు మానుకుంటాడేమోనని ఆమె ఆశ. కానీ ఆ భర్త ఒట్టు వేయడానికి ఒప్పుకుంటేనా.

“కడుపు నిండునా కాలునిండునా వదిలి పెట్టవోయ్ నీ పట్టు” అంటూ బతిమాలడం మొదలు పెట్టింది. కడుపునిండుతుందా, కాలు నిండుతుందా అంటూ ఏదైనా ప్రయోజనం లేని పనికి వాడే జాతీయాన్ని ఈ భార్య పాత్రతో అనిపించడం ఎంతో చక్కని ప్రయోగం.

“ఈ సిగరెట్టుతో ఆంజనేయుడు లంకా దహనం చేసాడు “ అంటూ సిగరెట్టు గొప్పదానాన్ని వివరించబోతాడు. ఆంజనేయుడు తన తోకకు నిప్పంటించుకుని లంకను దహనం చేసాడు. ఆ పురాణ గాథని వక్రీకరించి భార్యకి సిగరెట్టు మంటతోనే ఆంజనేయుడు లంకాదహనం చేసాడని, అది అతి పవిత్రమైనదని చెప్పి ఆమెను ఒప్పించాలనుకున్నాడు. కానీ భార్య అతను అనుకున్నంత అమాయకురాలు కాదు. అందుకే – “ఎవడో కోతలు కోసాడు” అంటూ ఆ కల్లబొల్లి మాటలు నమ్మడం మీ తెలివితక్కువ అన్నట్టుగా ఖండించేసింది.

ఇక సిగరెట్ కాల్చడాన్ని ఓ సరదా వ్యాపకంగా చేసేవారు కొందరయితే దాన్ని ఓ మహా కళారాధనగా చేసేవారు మరికొంతమంది. ఈ సిగరెట్ పొగను బయటికి వదలడంలో రింగులు రింగులు తిరిగేలా మబ్బుల్లా కనిపించేలా చేయడం ఓ కళగా అభ్యసిస్తారు కొందరు. అలాంటివారిగురించే ఈ మాట.

“ఈ పొగతోటి గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చు “ అని ఓ గొప్ప కళాసృష్టి చేయబోతున్నట్టు భార్యకి చూపించబోతాడు. కానీ భార్య దాన్ని తేలిగ్గా కొట్టిపారేసింది. అలాంటి పనులు చేయబోయి, చేతకాక “ మీసాలు కాల్చుకోవచ్చు” అంటూ జరగబోయే ప్రమాదాన్ని హెచ్చరించింది. నిప్పును నోట్లో పెట్టుకుని ఆటలు ఆడితే నోటిమీద మీసాలు కాలే ప్రమాదం ఎంతేనా ఉంది మరి.

కన్నెపిల్లలుగా ఉన్నప్పటినుంచే ఆడవాళ్ళు మంచి భర్తకోసం, అతని ఆరోగ్యం కోసం, క్షేమంకోసం లక్షా తొంభై నోములు నోస్తారు. వ్రతాలు చేస్తారు. అలాంటిది తన కళ్ళముందే ఆ భర్త ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా సిగరెట్లను ఊదొత్తుల్లా వెలిగిస్తుంటే భార్య మనసు ఎంత దుఃఖపడుతుందీ. అందుకే అంటుంది ఆ బార్య-

“ ఊపిరితిత్తుల కాన్సర్ కిదియే కారణమన్నారు డాక్టర్లూ”

అంటూ అతని ఆరోగ్యం గురించి హెచ్చరికలు చేస్తుంది. .

కానీ ప్రజలందరూ నిత్యం కొలిచే తెర వేల్పులు మన హీరోలు. ఈకంపెనీ సిగరెట్లు కాల్చండి అంటూ పెద్ద పెద్ద హోర్డింగుల మీద నిలబడి చిద్విలాసంగా సిగరెట్లు కాల్చే ఫోటోలు ఎన్నో చూసాడు సదరు భర్తగారు. అందుకే ఆ డాక్టర్ల కన్నా తాను అభిమానించే తన యాక్టర్ల మాటనే నమ్ముతాడు. అంత గొప్ప యాక్టర్ సిగరెట్ కాలుస్తూ తనని కూడా కాల్చమని సలహా ఇస్తుంటే వద్దనడంలో ఏమీ సహేతుకం కనిపించదు అతనికి.

ఆ రోజుల్లో యస్వీ రంగారావుగారు బర్కిలీ సిగరెట్లకి బ్రాండ్ ఎంబాసిడర్ అట. ఆయనకి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ మనందరికీ తెలిసినదే. ప్రజలు తమ అభిమాననటుల మాటలనే ఎక్కువగా నమ్ముతారని కంపెనీలకి తెలుసుకనుకే టాప్ నటులందరితోను తమ వస్తువులకి ప్రకటనలు గుప్పిస్తారు. ఎన్టీఆర్,ఏఎన్నార్ వంటి నటుల పోజు చూసి సిగరెట్లు అలవాటు చేసుకున్నవారు వేలాదిగా ఉన్నారు ఆంధ్రదేశంలో. అందుకే -

“కాదన్నారులే పెద్ద యాక్టర్లు “అంటూ భార్య మాటలకి రైమింగ్ గా జవాబు చెప్తాడు.

సిగరెట్ పొగ గుండెలనిండా కమ్ముకుని బాగా “ పసరులా చేరి, కఫం పేరుకుని ఊపిరితిత్తులను పనిచేయకుండా చేసి క్రమంగా ఉసురుతీస్తుందని “ ఎంతో బాధగా చెప్తుంది భార్య. అవన్నీ” తెలివితక్కువ దద్దమ్మలు మాత్రమే వినే మాటలని ” తనకి తెలివి ఉందని ఆమె మాటని కొట్టిపారేస్తాడు.

సిగరెట్ కాల్చేవారికి దాని పొగ సుగంధ పరిమళాలు వెదజల్లవచ్చు. కానీ ఆ పొగను పీల్చేవారి దురవస్థ వారికేం పడుతుంది. మిత్రులు తెలిసినవారు, సిగరెట్ తాగుతుంటే పక్కనున్నవారు ముక్కు మూసుకుంటే మర్యాదగా ఉండదేమోనని మొహమాట పడేవారుంటారు. ఆ కంపు భరించలేక ఆ మాట చెప్పలేక ముక్కులు ఎగరేస్తారు.

కానీ ఈ విషయాన్ని తనకు కావలసినట్టు అర్థం చేసుకుంటారు ధూమపానిస్టులు. అందుకే

“ పక్కనున్నవారు దీని సువాసనకు ముక్కులు ఎగరేస్తారు

నీవెరుగవు దీని హుషారు”

అంటూ ఆమెకి పరమళాన్ని గుర్తించే శక్తిలేకపోవడమేమిటో నని ఆశ్చర్యం ప్రకటిస్తాడు. ఈ కంపు భరించలేకనే ధియేటర్లలో ధూమపానాన్ని నిషేధించారని అతన్ని వారించబోతుంది భార్య. ధియేటర్లలో ఈ ధూమపాన నిషేదం ప్రకటించినదగ్గర్నించే సినిమాలకు డబ్బులు వసూళ్ళు తగ్గిపోయాయని ఆ అస్త్రాన్ని తిప్పికొడతాడు భర్త. ఇది తిరుగులేని అస్త్రం మరి. సినిమాలు బాగా ఆడకపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. కానీ ధూమపానం పైన నిషేధమే దానికి కారణమని చెప్పడం కొసరాజు గారి చమక్కు.

నిరుపహతి స్థలమూ, రమణీప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పురపువిడెమూ - అంటూ కవిత్వం రాయడానికి బోల్డు వస్తువులు అమరాలి అని పెద్దనగారు ఓ జాబితా చదివారు. అందులో ఆధునికులు చేర్చుకున్న కొత్త వస్తువు సిగరెట్టు. సిగరెట్టు ముట్టించి రెండు దమ్ములు పీలుస్తే కానీ మంచి కవిత్వం రాయలేమని చాలామంది కవుల ఉవాచ. సిగరెట్టు తో పాటు ఇంగ్లీషువారు మనకి నేర్పిన మరో అలవాటు కాఫీ. అందుకే కవిత్వానికి సిగరెట్టూ, కాఫీకే ఇది తోబుట్టూ అంటూ సిగరెట్టుకి, కాఫీ సేవనానికి ముడిపెట్టి రెండూ తమలోని కళాకారులకి అవసరం అని చెప్తాడు.

ఆరోజుల్లో కాఫీ తాగితే పైత్యం చేస్తుందని చాలామంది నమ్మేవారు. అందుకే ఆ భార్య ఈ సిగరెట్టుతో పాటు ఆ కాఫీ కూడా కలిపితే ఇక పైత్యం ప్రకోపిస్తుందని హెచ్చరిస్తుంది. అలా సిగరెట్టుని బడాయి కోసం గొప్పకోసం కాల్చి తనను గొప్పవాడిగా జమకట్టుకోవడం తప్పంటుంది.

సిగరెట్ కాల్చనిదే తమలో కొత్త సృష్టిచేసే ఆలోచన రాదని నమ్మే వాళ్ళని మనసులో పెట్టుకుని కొసరాజుగారు రాసిన మాట – “ ఆనందానికి సిగరెట్టు ఆలోచనలను గిలకొట్టు” అని భర్తతో అనిపించడం. సాగరాన్ని మధిస్తే అమృతం వచ్చింది. ఈ సిగరెట్ తన మనసు లోతుల్లో ఆలోచనలను బాగా మధించి కొత్త సృష్టి చేస్తుందని దబాయించబోతాడు భర్త.

“ పనిలేకుంటే సిగరెట్టు – తిని కూర్చుంటే పొగపట్టు “ అంటూ ఆ సిగరెట్ వల్ల కర్తవ్య విమూఢులుగా మారిపోతారని, పని చేయాలనే ఉత్సాహం నశిస్తుందని, అలా పని పాటలేకుండా తినికూర్చోవడం వల్ల బద్ధకం పెరిగి సిగరెట్టు పొగ ఒళ్ళంతా పట్టి ఆరోగ్యం నాశనం అవుతుందని బెదిరిస్తుంది భార్య.

“రవ్వలు రాల్చే రాకెట్టూ, రంగు రంగుల పాకెట్టూ” అంటూ సిగరెట్ ని నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిసే రాకెట్ తో పోల్చి, ఆ సిగరెట్ల పాకెట్ రంగురంగుల పాకింగ్ ని మెచ్చుకుంటాడు భర్త.

సిగరెట్ తో ఆంజనేయుడు లంకా దహనం చేయడం ఏమో కానీ అది తన భర్త ఆరోగ్యాన్ని పాడుచేసి చివరకు తమ కొంప కాల్చే కొరివిలా మారబోతోందని కోపం తెచ్చుకుంటుంది భార్య. అందుకే ఆఖరి మాటగా చెప్పి అతని దగ్గర పేకెట్ తీసేసుకుని –

“కొంపలు కాల్చే సిగరెట్టు, దీని గొప్ప చెప్ప చీదరబుట్టు” అంటూ ఆ సిగరెట్ మీద తనకున్న కోపాన్ని దాచుకోలేక అతని దగ్గరున్న పేకెట్ని తీసుకుని నలిపి పారేస్తుంది.

ఏదైనా కార్యసాధనకు ‘ సామదాన భేద దండోపాయాలు ’ అంటూ చతుర్విధ ఉపాయాలు చెప్తారు పెద్దలు. ఈ పాటలో సిగరెట్ మాన్పించడానికి భార్య చేసిన ప్రయత్నాలన్నీ అలాంటివే. కానీ సిగరెట్ మోజులో మునిగి ఉన్న భర్త ఆ ఉపాయాలకు లొంగడు. ప్రతి వాగస్త్రాన్ని ఖండిస్తూపోతాడు. చివరకు కోపం హద్దుల కట్ట తెగి, భార్య ఆ సిగరెట్ పాకెట్ తీసుకని నలిపి పడేయడంతో అక్కడికి కథ ముగుస్తుంది.

ఆ సంభాషణలోని ప్రతి వాక్యం ఒక్కో చమత్కార రసగుళికలు. రెండు పాత్రల్లోను సమానమైన వాక్చమత్కృతి వెల్లివిరుస్తుంది. ఆహా ఓహో అనిపిస్తుంది. అందుకే సరదా సరదా పాటల్లో ఉత్తమోత్తమమయిన సరదా పాట ఈ సరదా సరదా సిగరెట్టు పాట.

కొసరాజు రాఘవయ్యగారి హాస్యస్ఫూర్తిని ప్రకటించడానికి రేలంగి గిరిజల హావభావ విన్యాసం, మాధవపెద్ది సత్యం జమునారాణి ల స్వర విన్యాసం తోడయ్యి పాటని చిరంజీవిని చేసాయి. సిగరెట్, దాని పొగ నచ్చనివారుంటారేమో కానీ సిగరెట్టు మీద ఈ పాటని మెచ్చనివారుండరు

లలనా! యేటికి తెల్లవాఱె?
.
లలనా! యేటికి తెల్లవాఱె? రవి యేలాదోఁచెఁ బూర్వాద్రిపైఁ?
గలకాలంబు నహంబుగాక నిశిగాఁ గల్పింపఁ డా బ్రహ్మ దా
వలఱేఁడుం గృపలేఁడు; కీరములు దుర్వారంబు; లెట్లోకదే;
కలదే మాపటికాల మందు మనకుం గంజాక్షు సంభోగముల్.
.
ఏమే చెలీ! అప్పుడే ఎందుకు తెల్లవారిపోయిందే! తూర్పుకొండమీద ఆ సూర్యుడు ఎందుకు పొద్దుపొడిచేసేడే బాబు! అవును పగళ్ళన్నవి లేకుండా ఎప్పటికి తెల్లవారని రాత్రిళ్ళుగా ఎందుకు చెయ్యడే ఈ బ్రహ్మదేవుడు! ఈ మన్మథుడేమో మరీ కరుణమాలిన వాడైపోయాడు; చిలకలను చూస్తే వారించేవాళ్ళే లేరు; ఇంకా ఎలాగమ్మా బతకటం! అసలు రాత్రి ఎప్పటికేనా అవుతుందా! ఆ కలువ కన్నుల కన్నయ్యతో కలిసే అదృష్టం లభిస్తుందంటావా!
(పోతనామాత్యుడు.)

// సుప్రభాతం // సరిత భూపతి

తొలివేకువ కిరణాలకై చేతులు చాచి అర్థిస్తున్న కొండలు
మగత నిద్రలో ఊగుతూ పచ్చని పాన్పులపై మంచుబొట్లు
సుప్రభాతరాగాలు ఆలపిస్తూ శ్రావ్యంగా తాకిన పిల్లగాలి
లోకమంతపెద్ద ఏకాంతంలో మురిసిపోతూ పక్షుల కిలకిలలు
ఆ ఏకాంతాన్ని చెరిపివేయటానికి విఫల ప్రయత్నంతో ఒక గువ్వపిట్ట
కళ్ళు తెరుస్తూనే అమాయకంగా నవ్విన ఓ పువ్వు
వీటన్నింటికీ కనువిప్పు కలిగిస్తూ ఓ అందమైన పుట్టుక
తూర్పున సింధూరంలా ఒక ఎర్ర మంధారం

Physics

ఈ అందాల్ని భగ్నం చేయటానికా అన్నట్టు అప్పుడే మేల్కొంటున్న మనిషి
బ్రహ్మ కడిగిన పాదము
రాగం ముఖారి
అన్నమయ్య కృతి
పల్లవి
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెనీ పాదము
(బ్రహ్మ)
చరణం 1
చెలగి వసుద గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము
(బ్రహ్మ)
చరణం 2
కామిని పాపము గడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము
(బ్రహ్మ)
చరణం 3
పరమ యోగులకు పరి పరి విధముల
వరమొసగెడి నీ పాదము
తిరువెంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము
. బాపు గారి చిత్రం...
ఇది ఘంటసాల గారి పాట రాజేశ్వరరావు గారి సంగీతం.https://www.youtube.com/watch?v=xfbhlGZ-rnY
ఓహోహో మామయ్యా!! ఇదేమయ్యా?? బలె బలె బాగా ఉందయ్యా.....!!
.
(చిత్రం.ఆరాధన...గానం . ఘంటసాల , పి. సుశీల..అభినయం . గిరిజ, రేలంగి)
ఓ తరానికి ఈ పాట అంటే మహా ఇష్టం. తెలుగు సినిమాలలో హాస్యం అంటే రేలంగే, రేలంగి అంటేనే హాస్యం. రేలంగిగారిమీద చిత్రించబడిన పాటల్లో ఇది ఒకటి. రేలంగికి చాలామంది జంటగా నటించినా గిరిజతో నటించిన చిత్రాలు, పాటలు చాలా హిట్ అయ్యాయి. ప్రజలు ఆదరించిన జంట రేలంగి -గిరిజ. వారిద్దరి మీద చిత్రించబడిన గీతం ఇది.
ఈ పాట చిత్రీకరణ ఆరోజుల్లో ఎప్పుడూ ఉండేలా ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టో, పార్కుల్లో డాన్సు చేస్తున్నట్టో కాకుండా ఒక జూపార్క్ లో చిత్రించబడడం విశేషం.
అబ్బాయి ఆ అమ్మాయికి వరసకి మామయ్య కాబట్టి -
"ఓహోహో మామయ్యా ఇదేమయ్యా బలె బలెబాగా ఉందయ్యా.
ఇంటిని విడిచి షికారు కొస్తే ఎంతో హాయి కలదయ్యా...."
అంటూ తనకి తండ్రి కట్టుబాట్ల మధ్యనుంచి దొరికిన స్వేచ్ఛను అనుభవిస్తూ ఇంటిని విడిచి వచ్చి షికార్లు కొడుతున్నందుకు సంతోషం ప్రకటిస్తుంది.
అమ్మాయిని సంబోధిస్తూ ఆ మామయ్య తాము వచ్చిన చోటు గురించి చెప్తాడు.
"ఓహొహో అమ్మాయి ఇది కాలేజీ బలె బలె బతికిన కాలేజీ
మాటలురాని మృగాలు కొన్ని మనిషికి పాఠ చెబుతాయి"
అంటూ తాము జూ పార్క్ అని పిలవబడే జంతు ప్రదర్శనశాలకి వచ్చామని చెప్తాడు. జూలో బంధించబడిన జంతువులనుంచి మనం తెలుసుకోదగిన విషయాలెన్నో ఉన్నాయంటూ, "మాటలు రాని మృగాలు సైతం మనిషికి పాఠం చెబుతాయి "అంటాడు.
ఇక్కడ జూ పార్కుని బతికిన కాలేజీ అనే పదంతో ప్రయోగించడమే సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. చాలా ఏళ్ళపాటు ఆంధ్ర ప్రాంతాలలో చాలామంది మద్రాసులోని జూని బతికిన కాలేజీ అని, మ్యూజియం ని చచ్చిన కాలేజీ అని పిలిచేవారు
పులి, సింహం వంటివి క్రూర జంతువులు. సాధుజంతువులను, మనుషులను వేటాడి భుజించే స్వభావం కలిగినవి. అవి అడవిలో నివసిస్తాయి. కానీ మనుషులు ఈవిధంగా వాటిని బోనుల్లో బంధించి ఉంచడం ఆ అమ్మాయికి ఆశ్చర్యం కలిగించింది. అందుకే-
"పులులూ చిరుతలు సింహాలన్నీ వెలుపల తిరిగితే ప్రమాదమే"
అంటూ అందుకే వాటిని ఇలా జూలో బంధించారా? అని అడుగుతుంది. అందుకు ఆ మామయ్య ఇలా అంటాడు.
"కొందరు ఘరాన మనుషులకన్నా క్రూరము కావీ జంతువులు"
అంటూ మనుషుల్లో ఉండే క్రూర స్వబావం జంతువుల క్రౌర్యాన్ని మించిపోయిందని చెప్తాడు. అంతే కాక క్రౌర్యం పెరిగిన మనిషిని, మృగాన్ని కటకటాలలో పెడతారు అంటూ మనుషులలో క్రూర స్వభావం ఉన్నవారు చివరకు జైలు శిక్ష అనుభవిస్తారని ఓ మంచి నీతి పాఠం చెప్తాడు. జూలో జంతువులయినా, మనుషులలో నేరస్వభావం ప్రదర్శించిన వారైనా వారి నివాసం కటకటాల గదుల్లోనే అనే విషయాన్ని ఆరుద్ర ఎంతో చక్కగా చెప్పారు.
"గుర్రపు అంశం, గాడిద వంశం చారల చారల జీబ్రాది"
అంటూ జూపార్క్ లోని జీబ్రా అనే జంతువును చూపించి దాని లక్షణాన్ని ఆమెకి వివరిస్తాడు మామయ్య. జీబ్రా చూడడానికి గాడిదలాగా ఉంటుంది. ఒళ్ళంతా నలుపురంగు నిలువు చారలుంటాయి. ఈ జీబ్రాపేరు లాటిన్ లో అడవిగుర్రం అనే అర్థంతో ఉండే పదం. అందుకే ఆరుద్రగారు జీబ్రాని అమ్మాయికి పరిచయం చేస్తూ గుర్రపు అంశం, గాడిద వంశం చారల చారల జీబ్రా అంటూ ఆమె ఎప్పుడూ చూడని జీబ్రాని చూపించాడు.
జిరాఫీ ని చూపిస్తూ
"చుక్కల జిరాఫీ ఒంటెకు బంధువు" అని చెప్పాడు. ఒంటె చాలా ఎత్తుగా బాగా సాగిన మెడతో ఉంటుంది. అందుకే చూడడానికి ఒంటెలా ఉండే ఆఫ్రికన్ జంతువు జిరాఫీ లేత పసుపురంగులో చుక్కలు నిండిన చర్మంతో బాగా ఎత్తుగా, పెద్ద తల మెడతో ఉంటుంది అందుకని దాన్ని ఒంటె కి బంధువు అంటూ వివరించాడు.
ఆ పక్కనే కోతి జాతికి చెందిన చింపాంజీలు ఉన్నాయి. వాటిని చూపిస్తూ జిరాఫీ ఒంటెకి బంధువయితే "మనిషికి బంధువు ఈ చింపాంజీ" అని పరిచయం చేసాడు.
ఆరుద్రగారు కూడా దీన్నే దృష్టిలో పెట్టుకుని మనిషికి బంధువు చింపంజీ అంటూ ఆ అమ్మాయికి చూపించారు. కోతులను దగ్గరగా గమనిస్తే అవి మనుషులను ఎంత చక్కగా అనుకరించగలవో చూడగలం. అందుకే
"మనుషుల చేష్టలు కోతులవైతే - కోతి చేష్టలు కొందరివి"
అంటూ కోతులు జంతువులు కనుక జంతు స్వభావంతో మనుషులను అనుకరించడం లాంటివి చేస్తాయి. కానీ మనుషులు కోతి కన్నా అభివృద్ధి చెందిన జీవులు. మెదడు పెరిగింది. అయినా కొందరు తను మనిషిని అన్నమాట మరిచిపోయి కోతుల్లా ప్రవర్తించడం గురించి ఇలా అన్నారు ఆరుద్ర. కోతి వేషాలు అంటూ ఆకతాయిగా ఉండే మనుషులగురించి మనం అనుకుంటూ ఉంటాం. దానిగురించే ఆరుద్ర ఇక్కడ చక్కగా విడమర్చి చెప్పి చీవాట్లు పెట్టారు.
"తీరున తిరిగే నోరును తెరిచే ఏనుగు లాంటిది ఏమిటది"
అంటూ అమ్మాయి మామయ్యని ఓ జంతువును చూపించి అడిగింది.
"ఏనుగు వంటిది నీటిగుర్రము దానికి తమ్ముడు ఖడ్గమృగం " అని చెప్పాడు మామయ్య. ఏనుగు లాగా పెద్ద శరీరంతో నోరు ను బాగా తెరుస్తూ ఉన్న ఆ జంతువు ఏనుగులాగా పెద్దగా ఉన్నా దాని పేరు నీటిగుర్రము అని చెప్పాడు మామయ్య. అంతే కాక ఆ పక్కనే ఉన్న మరో జంతువు ఉంది. అది కూడా ఏనుగు లాగే భారీ శరీరంతో తిరుగుతోంది. దాన్ని చూపిస్తూ నీటిగుర్రంలాగే అది కూడా పెద్ద శరీరంతో ఉందని దాని పేరు ఖడ్గ మృగం అని చెప్పాడు.
ఇక్కడ మనుషుల స్వభావం మీద మరో చురకవేసారు ఆరుద్ర.
"అధికులు పేదల కాల్చుకు తింటే ఇవి ఆకూ అలమే తింటాయి" అంటూ.
నీటిగుర్రం, ఖడ్గమృగం రెండూ ఏనుగు లాగా అతి భారీ శరీరాలున్న జంతువులే కానీ అవి కేవలం ఆకూ అలములు తిని బతికే శాకాహార జంతువులు. మనుషుల్లో అధికులు అంటే సంపన్నులు పేదవారిని దోచుకుని తింటూ వారి రక్తమాంసాలను కష్టం రూపంలో దోచుకుని తమ సంపదను పెంచుకుంటారు.
జూ పార్క్ లో సందర్శకులు ఏనుగుపైన ఎక్కి ఒకసారి విహరించడానికి అవకాశం కల్పిస్తారు జూ వారు. ఆ మామయ్య, అమ్మాయి అలా ఆ జూలో ఏనుగును ఎక్కారు. ఏనుగుఅంబారీ ఎక్కడం అంటే మామూలుగా సామాన్యమైన విషయం కాదు కదా. పాతకాలంలో రాజులు, చాలా గొప్పవారు మాత్రమే ఏనుగును ఎక్కగలిగేవారు. అందుకే అమ్మాయికి పట్టలేని సంతోషం కలిగింది.కానీ " రాజులు ఎక్కే అంబారీపై అందరు ఎక్కుట తప్పు కదా" అంటూ రాజులు ఎక్కే అంబారీపైన సామాన్యులమైన తమలాంటి వారు ఎక్కి తిరగడం తప్పేమో అనే అమాయకపు ఆలోచనతో మామయ్యని అడిగింది.
మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఒకప్పుడు మాహారాజులు పరిపాలించిన ప్రాంతాలన్నిటా రాజరికం పోయి ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులతో నడిచే ప్రభుత్వాలు వచ్చాయి. అదే ప్రజా స్వామ్యం. అందుకే ఆరుద్ర ఇక్కడ-
" రాజులు పోయి రోజులు మారి ప్రజలే ప్రభువులు ఈనాడు "
అంటూ భారతదేశం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానాన్ని మామయ్యతో చెప్పించి అమ్మాయికి పరిచయం చేసారు.
ఒహొహో మామయ్యా ఇదేమయ్యా అంటూ అమ్మాయి అడిగిన ప్రశ్నలకు, ఒహొహో అమ్మాయి అంటూ ప్రతి సంబోధనతో మామయ్యతో జవాబులు చెప్పించిన ఈ పాట అప్పటికీ ఇప్పటికీ సరదా పాటల్లో మేటిగా నిలిచింది.
పాట రచన ఆరుద్ర(భాగవతుల సదాశివ శంకరశాస్త్రి)
చిత్రం ఆరాధన
గానం ఘంటసాల , పి. సుశీల
అభినయం గిరిజ, రేలంగి

Insects

గదిలో

నలుగురుంటారు ఏమీ అనిపించదు
ఒకడు రాగానే అంతా మారిపోతుంది
వాతావరణంలో వసంతం ప్రవేశిస్తుంది

కాంతికి వెలుగొస్తుంది
మాటలకి యవ్వనమొస్తుంది
రక్త ప్రసరణ మహానదిలా సాగుతుంది

మళ్ళా అతనొక్కడే
అట్టే తేడా లేదు

సున్న పక్కన నిల్చొని
ఓ మహా సంఖ్యను స్రుష్టిస్తాడు
అనంత శూన్యాన్ని శక్తితో నింపేస్తాడు

ఆరిపోయిన దీపాలు శిరసెత్తుతాయి
సకల లోకాలు
అతని ఆలింగనాన్ని కోరతాయి

ప్రేమతో పుష్పవ్రుష్టి కురిపిస్తాయి
అధినాయకుడని కీర్తిస్తాయి

అటవీ దేవదారుల్లోకి
కొత్త రుతువొచ్చి
ఊయలలూగుతుంది

మోడువారిన నితంబ వ్రుక్ష శాఖల
చిగుర్లలోకి
కోయల వచ్చి
కూర్చుంటుంది

మైదాన మంతా ఆలివ్ గ్రీన్ రంగు
కప్పు కుంటుంది
చలికి వణకదు
భయానికి చలించదు

Chemistry
శ్రీ రఘురామ్ జయ రఘురామ్!
.
శ్రీ రామ చ౦ద్రః ఆశ్రిత పారిజాతః
సమస్తకళ్యాణ గుణాభిరామః
సీతా ముఖా౦బోరుహ చ౦చరీకః
నిర౦తర౦ మ౦గళమాతనోతూ..
.
వెలయునేయెడ నీ దివ్యమూర్తి
వెలిగేనాయెడ ఆన౦దజ్యోతి
వెలయునేయెడ నీ దివ్యమూర్తి
వెలిగేనాయెడ ఆన౦దజ్యోతి
వెలసి మాగృహ౦ శా౦తినివాస౦
సలుపవె శుభ గుణ శోభితరామ్
శ్రీ రఘురామ్ జయ రఘురామ్
సీతామనోభిరామ్
శ్రీ రఘురామ్ జయ రఘురామ్


ఒకనాటి కధ కాదు ఇది నేటి కధ

భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ వుంది. భర్త ఆమె చేయి పట్టుకుని, నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు. అతను ఆమె తో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమె కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..ఎలాగయినా ఆమె కి ఆ విషయం చెప్పాలి.. చివరికి ఇలా చెప్పాడు...
.
భర్త - నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తన తో అసలు విషయం చెప్పాడు.
.
భార్య - (ఆ మాటలకి బదులుగా ఆమె ) ఎందుకు అని మాములుగా అడిగింది?
.
భర్త - ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏం ఇవ్వలేదు..
.
భార్య - (ఆమెకి కోపం వచ్చింది.) ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి, మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది..
.
ఆ రాత్రి, వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్త ని గట్టిగా అడిగింది..భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు.
.
భర్త - నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీపైన ప్రేమ లేదు..
.
భార్య - ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది.. ఒక నిమిషం ఏం అవుతుందో తనకేం అర్థం కాలేదు..
.
భర్త - గిల్టీ ఫీలింగ్ తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి నువ్వు వొప్పుకునేందుకు , నువ్వు ఉండడానికి సొంత ఇల్లు , కారు అండ్ నా సంస్థ లో 30% వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు..
.
భార్య - చాలా కోపం తో ఆ పేపర్లు ని చింపేసింది.. ప్రేమ ని ఎప్పటికి కొనలేరు అని గట్టిగా ఏడిచేసింది..
.
భర్త గా తన లైఫ్ లో ఒక తెలియని వ్యక్తి లా ఆమె జీవితంలో పది సంవత్సరాలు వున్నాడు. అతని భార్య సమయం వృధా చేసానని బాధ పడుతున్నాడు. అతను తన భార్య ని అర్థం చేస్కునే ప్రయత్నం ఎప్పుడు చెయ్యలేదు.కానీ అతను జాను ని మాత్రమే ప్రేమిస్తున్నాడు.. ఏడుస్తున్న తన భార్య ని చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది..
.
మరుసటి రోజు, అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తు కనిపించింది. అతను భోజనం చేయలేదు కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. ఏందుకుంటే ఆ రోజంతా అతని లవర్ జానూ తో కలిసి రోజంతా తిరగటం వల్ల, బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది. అతను తన భార్య ని పట్టించుకోకుండా, పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు.
.
ఉదయం, ఆమె విడాకులకు సంబధించి కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతని నుండి ఏమి కోరుకోవటంలేదు, కానీ విడాకులు ముందు ఒక నెల రోజుల పాటు అతను తన తో వుండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది.
.
ఆమె కారణాలు చాలా సాధారణం గా ఉన్నాయి. వాళ్ళ కొడుకుకు ఒక నెల రోజుల్లో పరీక్షలు వున్నాయి. వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది. అందుకే తను, వాళ్ళ భర్త ని నెల రోజులు గడువు అడిగింది.
.
నాకు అంగీకరమే అని వాళ్ళ భర్త ఆమె తో చెప్పాడు. కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది. ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది, మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఏలా తీసుకువెళ్ళారు గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతి రోజు ఉదయం ఆమె ని ఎత్తుకుని వాళ్ళ బెడ్ రూమ్ నుండి హల్ వరకు తీసుకువెళ్లాలని కోరింది. అప్పుడు అతడు ఆమె కి మతిపోయిందా అని అనుకున్నాడు. వాళ్ళు కలిసివుండే చివరి రోజులలో, తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు.
.
అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతులు గురించి అతని లవర్ జానూ కి చెప్పాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు కి అర్ధంలేనట్లుగా అతను భావించాడు. నీ భార్య, నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలాడుతుంది అని జాను అతని తో అంది..
.
విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి , అతని భార్యకు ఏలాంటి శారీరక సంబంధం లేదు.
.
మొదటి రోజున తాను తన భార్యను ఎత్త్తుకున్నప్పుడు, అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది. "హేయ్..! నాన్న, అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లుకొట్టాడు". ఆ అబ్బాయి మాటలు అతనికి కు బాధను కలిగించాయి. అలా ఎత్తుకుని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తన తో ఇలా చెప్పింది. "మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగినా, నవ్వాడు.. అతను ఆఫీస్ కి వెళ్తున్నదని ఆమె తలుపు దగ్గరకి వచ్చింది... ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురుచూస్తుంది. తాను ఆఫీసుకు ఒక్కడే , ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు. .
.
రెండవ రోజు న , వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది..ఆమె తల తన గుండె ని తాకుతుంది..ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది.. తాను కొంత కాలంగా తన భార్య ని గమనించలేదు అని అనుకున్నాడు. ఆమె వయసు పైబడుతుందని అతను గ్రహించాడు. ఆమె ముఖం మీద ముడుతలు కనిపిస్తున్నాయి, ఆమె జుట్టు ఎగురుతుంది. మన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్త ని భార్య అడిగింది. అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తు తాను ఆశ్చర్యపోయాడు..
.
నాలుగో రోజు, తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య దగ్గరితనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఈ అంమ్మాయ్ తోనేనా నేను పది సంవత్సరాల జీవించిదని అతనికి అనిపించింది.
.
ఐదవ మరియు ఆరవ రోజున, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నందని తాను తెలుసుకున్నాడు. తాను ఈ విషయం గురించి జాను కి చెప్పలేదు. ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్ళటం సులభంగా మారిపోయింది. బహుశా రోజు ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా, దృఢంగా అనిపించాడు.
.
ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్ లు ట్రై చేసింది కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి బాగోలేదు. వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూస్ గానే ఉంది.. అప్పుడు అతనికి అర్థం అయ్యింది తను చాలా సన్నగా అయ్యింది అని.. అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని.. ఆ విషయం అతనికి బలం గా తగిలింది.. ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థం అయ్యింది.. అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె తల ని తాకింది... ఆ సమయం లోనే వాళ్ళ అబ్బాయ్ వచ్చాడు..
.
ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్న తో ఇలా అన్నాడు.."నాన్న అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది.." అని అన్నాడు.. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయిజీవితంలో విలువైన, అపురూపమైన సంఘటన..
.
అతని భార్య, వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది, వాడు వాళ్ళ అమ్మ దగ్గరకి వచ్చాడు.. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయ్ ని గట్టిగా హత్తుకుంది.వాళ్
ళ నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు.
.
రోజులానే అతను ఆమె ని ఎత్తుకుని బెడ్ రూం నుండి హల్ కి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమ గా, సహజం గా వేసింది.. అతను ఆమె ని గట్టిగా పట్టుకున్నాడు అచ్ఛం వాళ్ళ పెళ్లి రోజులాగా, కానీ ఆమె చాలా తేలికగా వుండటం వలన అతనికి చాలా బాధ గా అనిపించిది.
.
చివరి రోజున, అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూలుకి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకుని తనతో ఇలా చెప్పాడు, "మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించాయి" అని చెప్పాడు..
.
తర్వాత అతను ఆఫీసుకు వెళ్ళిపోయాడు. కారు నుండి వేగం గా దిగి, డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యేకొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపొతుందెమో అని.
.
అతను జాను వుండే క్యాబిన్ కి వెళ్ళాడు.. సారి చెప్పి , అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు. ఆమె(జాను) అతని వైపు ఆశ్చర్యంగా చూసి, తన నుదిటిపై చేయి వేసింది. నువ్వు బాగానే వున్నావ్ కదా? అని అడిగింది. అతను తన నుదిటి మీద వున్న ఆమె చేతిని తీసి, సారీ జాను నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదు. మా వివాహా జీవితం నాకు విసుగుగా అనిపించేది ఎందుకంటే నాకు,తనకి ప్రేమ విలువ, గొప్పతనం తెలియలేదు. మేము ఎప్పుడు ప్రేమ గా మాట్లాడనుకోలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు..ఎప్పుడయితే నేను తనని అలా ఎత్తుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థం అయ్యింది తను చనిపోయే దాకా నేను తనని అలానే చూసుకుంటానని అచ్ఛం మా పెళ్లిరోజు లానే....
.
జాను హఠాత్తుగా లేచి, అతనిని ఒక చెంప దెబ్బ కొట్టింది. ఏడుస్తు తన ని బయటకి పంపి తలుపు వేసింది. ఇంక అతను ఇంటికి వెళ్తూ దారి లో పూల దుకాణం వద్ద, తన భార్య కోసం ప్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు.
.
కార్డ్ మీద ఏమి రాయాలి అని ఆ సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది .
.
అప్పుడు అతను నవ్వుతూ "మరణం మనల్ని దూరం చేసేవరకు... నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను ." అని రాయమని చెప్పాడు..
.
ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే, తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఏక్కి పైకి వెళ్ళాడు .తన భార్యను మంచం మీద చూసాడు.
. .....
అప్పటికే ఆమె చనిపోయింది.
.
ఒక్కసారి అతని కి ఏం అర్థం కాలేదు.. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్..
.
తన భార్య కొన్ని నెలలగా క్యాన్సర్ తో పోరాడుతుంది. తాను జాను తో బిజీగా వుండటం వల్ల ఈ విషయం తను గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు. ఆమె వాళ్ళ సంసార మరియు విడాకుల విషయాలు సంగతి వీలైనంతవరకు వాళ్ళ కొడుకుకు దూరంగా వుంచి, తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా వుండాలి అనుకుంది.
.
మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్ధం తెలుపుతాయి. భవనం, కారు, ఆస్తి, బ్యాంకు లో డబ్బు ఇవేమి బంధానికి సంబధించినవి కావు. ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కానీ నిజమైన ఆనందం ఇవ్వవు.
.
మీ జీవిత భాగస్వామితో వీలునైంతవరకు సమయం కేటాయిస్తూ, ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ వుంటే ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరుగుతాయి. అప్పుడు నిజమైన, సంతోషకరమైన వివాహం బంధం నిలబడుతుంది.
.
మనం ఏం చేసినా , ఎంత ప్రేమ గా చూసుకున్న అని వాళ్ళు వున్నప్పుడే చూసుకోవాలి.. వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమ చూసుకుందాం అన్న వాళ్ళు మనతో వుండరు..
.
చాలా మంది కేవలం అపార్ధాల వల్ల విడిపోతున్నారు, ఇది చదివి కొంతమందైనా తాము చేసే తప్పును తెలుసుకుని, తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను

ఈ మ‌ధ్య ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వ‌స్తున్నాయి. వాటిని తీసుకున్న వినియోగ‌దారులు బ్యాంకుకు వెళ్తే బ్యాంక్ వారు త‌మ‌కేం తెలియ‌ద‌ని స‌మాధానం చెప్ప‌డం దీంతో బాధితులు గ‌గ్గోలు పెట్టడం ఇప్పుడు స‌ర్వ సాధార‌ణం అయింది.

అయితే మీకు తెలుసా....?

ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వ‌చ్చినా వాటిని తిరిగి ఇచ్చి బ్యాంకుల ద్వారా అస‌లైన నోట్లు పొంద‌వ‌చ్చని.

అవును మీరు చుస్తున్నది నిజ‌మే. ఇలాంటి స‌మ‌స్య ఎదుర‌య్యే వారు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఏటీఎంలో న‌కిలీ నోట్లు రాగానే కంగారు ప‌డ‌కూడ‌దు. వెంట‌నే అప్రమత్తమై అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డుకు ఈ విష‌యాన్ని తెలియ‌జేయాలి. ఇటీవ‌లి కాలంలో దాదాపు అధిక శాతం ఏటీఎంల వ‌ద్ద సెక్యూరిటీ గార్డులు ఉంటున్నారు. కాబ‌ట్టి న‌కిలీ నోట్లు రాగానే ఆ గార్డుకు విష‌యం చెప్పి అత‌ని వ‌ద్ద ఉండే రిజిస్టర్‌లో మీరు డ్రా చేసిన మొత్తం, న‌కిలీ నోట్లు ఎన్ని వ‌చ్చాయి, ఏయే నోట్లు వ‌చ్చాయి, వాటి నంబ‌ర్లు, మీరు లావాదేవీ నిర్వహించిన స‌మ‌యం, తేదీ, ఏటీఎం స్లిప్, దాని ట్రాన్‌సాక్షన్ నంబ‌ర్‌ వంటి వివ‌రాలను అన్నింటిని ఆ రిజిస్టర్‌లో ఎంట‌ర్ చేసి గార్డు సంత‌కం తీసుకోవాలి. వీలైతే ఇప్పుడు చెప్పిన వివ‌రాల‌కు సంబంధించిన ఫొటోల‌న్నింటినీ స్మార్ట్‌ఫోన్ ద్వారా తీసి భ‌ద్ర ప‌రుచుకోవాలి.

అనంతరం పైన చెప్పిన ఆయా వివ‌రాల‌కు సంబంధించిన జిరాక్స్ ప్రతులను తీసి బ్యాంక్‌కు వెళ్లి అక్కడి మేనేజ‌ర్‌కు ఫిర్యాదు చేయాలి. బాధితుడు తాను చేసిన లావాదేవీకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌తో కూడిన ఓ లెట‌ర్‌ను రాసి మేనేజ‌ర్‌కు ఇవ్వాలి. దానికి ముందు చెప్పిన జిరాక్స్ ప్రతుల‌ను కూడా ఇవ్వాలి. బ్యాంక్ వారు మీ ద‌‌గ్గర ఉన్న న‌కిలీ నోట్ల‌ను తీసుకుని వాటిని త‌మ ద‌గ్గర ఉండే ప‌రిక‌రాల ద్వారా స్కాన్ చేసి అవి నకిలీ నోట్ల‌నే విష‌యాన్ని ధృవపరచిన అనంతరం వాటికి బ‌దులుగా మీకు అంతే మొత్తంలో డ‌బ్బును ఇస్తారు.

ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్రకారం ప్రతి బ్యాంక్ పైన చెప్పిన విధంగా చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఏ బ్యాంక్ అయినా స్పందించ‌క‌పోతే స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసే హ‌క్కు బాధితునికి ఉంటుంది.

అంతేకాదు త‌దుప‌రి చ‌ర్యగా బాధితుడు ఆర్‌బీఐ సైట్‌(www.rbi.org.in)లో ఉన్న మెయిల్ ఐడీకి త‌మ ఫిర్యాదుతో కూడిన లేఖ‌ను మెయిల్ రూపంలో పంపించ‌వ‌చ్చు. లేదంటే స్థానికంగా ఉన్న బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. అలా ఇచ్చిన ఫిర్యాదుకు ఆర్‌బీఐ లేదా బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్ అధికారులు స్పందించి త‌క్షణమే చ‌ర్య తీసుకుంటారు. బాధితునికి త‌గిన న్యాయం చేస్తారు.

ఇప్పుడు తెలుసుకున్నారుగా, ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వ‌స్తే ఏం చేయాలో. ఈ స‌మాచారం మీకు నచ్చితే మ‌రింత మందికి షేర్ చేయడం మ‌రిచిపోకండి.

దీని వ‌ల్ల న‌కిలీ నోట్ల‌ బాధితులు ఎవ‌రైనా ఉంటే వెంట‌నే త‌మ స‌మ‌స్యను ప‌రిష్కరించుకోగ‌లుగుతారు.


1 comment: