Tuesday, 12 June 2018

ప్రాంజలి ప్రభ (౨౦-౦౬-౨౦౧౮)

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
Animated Photo
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 


నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయత మల్లాప్రగడ రామకృష్ణ

మళ్ళీ మళ్ళీ రాని రోజు
మరచి పోయిన రోజు 
మళ్ళీ మళ్ళీ వచ్చే రోజు 
మనసున కదిలించిన రోజు 

మళ్ళీ మళ్ళీ నచ్చే రోజు 
దాహాన్ని తీర్చే రోజు
మల్లె మళ్ళీ మెచ్చేరోజు   
ఆకలి తగ్గించిణ రోజు 

మళ్ళీ మళ్ళీ తపించే రోజు 
ఎడబాటు గుర్తించిన రోజు 
మళ్ళీ మళ్ళీ యాచించే రోజు 
కోరిక స్మరణ తీర్చే రోజు 

మళ్ళీ మళ్ళీ ప్రేమించే రోజు 
బిడ్డలా ప్రేమను పొందే రోజు 
మళ్ళీ మళ్ళీ ద్వేషించే రోజు 
ఆశకు చిక్కి అల్లాడిన రోజు 

మళ్ళీ మళ్ళీ మండి పడ్డ రోజు
కోపాన్ని రెచ్చ కొట్టిన రోజు
మళ్ళీ మళ్ళీ చదివిన రోజు
సుందరాకాండ పరాయణ రోజు 

మళ్ళీ మళ్ళీ పూజించిన రోజు
కల్ముషములేని మనసున్న రోజు 
మళ్ళీ మళ్ళీ ప్రార్ధించిన రోజు 
తల్లితండ్రుల పాదసేవచేసిన రోజు 

--((*))--   


నేటి కవిత
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ

మృత్యువంటే భయము నాకు లేదు
నా దగ్గరకు రావాలన్నా నేను చేసిన
పాప మేదో తెలిపి తీసు కెళ్ల మంటా

కాలంతో పాటు నడిచేవాణ్ణి
రహస్యాలను తెల్పి మేలుకొల్పేవాణ్ణి
పాపప్రక్షాళన చేయుటకు ప్రయత్నిస్తూ ఉంటా

ఎన్నో సూర్యోదయాలను చూసిన వాణ్ణి
ఏ నిముషమున ఏ రంగు మారునో తెలిసిన వాణ్ణి 
ఎండకు ఎండిన మీకోసం నావంతు సహాయం చేస్తూ ఉంటా

ఋతువుల్లా నా రక్తంలో మార్పు లొస్తున్నా
వయసు కోరికలు పెరిగి అనగారి పోతున్నా
తుది రక్తపు బిందువు వరకు దేశ సేవకోసం బ్రతికే ఉంటా

పోయిన కాలాన్ని తిరిగి తేలేము
మృదంగంలా వర్తమానంలో జీవిస్తాము
ఆశయాల సాధనతో భవిషత్తులో బ్రతుకుతూ ఉంటా

గుమ్మానికి కట్టిన మామిడి తోరణాన్ని
పరుల దృష్టి దోషం రాకుండా ఆపేవాణ్ణి
ఎండు ఆకులలో పచ్చదనాన్ని నింపుతూ ఉంటా

ఊహలకన్నా వాస్తవాన్ని గ్రహించే వాణ్ణి
సంతానం సంసారాన్ని నమ్మిన వాణ్ణి
వయసు మీదపడ్డ, వాస్తవ జ్ఞానాన్ని తెలుపుతూ ఉంటా 

సమయాన్ని వ్యర్ధ పరచక గీతా భోధకుణ్ణి
మనస్సు తృప్తి పరిచే మార్గాన్ని తెలిపే వాణ్ణి
దయ,ధర్మం,దానం నిత్యకృత్యంగా భావిస్తూ ఉంటా

తెల్లవారుజామున లేచి పుస్తకపఠనం చేసిన వాణ్ణి
బ్రతుకు వేటలో అనేక బాణాలు గ్రుచ్చుకున్నా బ్రతికినవాణ్ణి
తల్లితండ్రుల సేవకన్నా మించినది లేదని వాదిస్తూ ఉంటా
నా గమ్యం సత్యం,ధర్మ, న్యాయంగా ఉండాలని దేవుణ్ణి వేడుకుంటా
    --((*))--
Animated Photo

నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత : మాలాప్రగడ రామకృష్ణ 

ఊహలు నిజం అవుటం మాత్రం కష్టం
లోకాలు చూడటం కష్టం అనుకోకు
వాస్తవాలు గ్రహించటం మాత్రం కష్టం
భౌతికాలు గ్రహించటం కష్టం అనుకోకు

మంచిని బ్రతికించటం మాత్రం కష్టం
చెడును చూడటం కష్టం అనుకోకు
ప్రశాంతంగా జీవించటం  మాత్రం కష్టం
ప్రేమ పెంచుకోవటం కష్టం అనుకోకు 

సమయాన్ని పాటించటం మాత్రం కష్టం
కల్పనలను కల్పించటం కష్టం అనుకోకు 
మానవత్వాన్ని బ్రతికించటం మాత్రం కష్టం
మనసు అర్ధం చేసుకోవటం కష్టం అనుకోకు 

చిత్రంలా మనిషి జీవించటం మాత్రం కష్టం
విచిత్రాలు సృష్టించటం కష్టం అనుకోకు 
కలలో చూసిన స్వర్గం పొందటం మాత్రం కష్టం
కుటుంబం స్వర్గంగా మార్చుట కష్టం అనుకోకు 

ప్రకృతిని అర్ధం చేసు కోవటం మాత్రం కష్టం
కాలాన్ని బట్టి నడుచుకోవటం కష్టం అనుకోకు
భార్యాభర్తలు విడి విడిగా ఉండుట మాత్రం కష్టం
ఒడిదుడుకులు జీవితం ఎప్పుడూ కష్టమనుకోకు   

--((**))--

   
శీర్షిక: కల – నిజం
రచన : బిట్రా వెంకట నాగమల్లేశ్వర రావు

కలలోకి జారినప్పుడల్లా
అందమయిన లోకాలు
ఊహల భవనాలు

కలలోంచి జారినపుడల్లా
భౌతిక లోకాలు
వాస్తవ దృశ్యాలు

కలల మరుల్ని
విదిలించుకోడానికి
మనిషికెంత యాతనో

నిజం బతుకు
గడిపేందుకు
తనువుకెంత నరకమో

విచిత్రంలోంచి చిత్రంలోకి
నాకునేను మారిపోతున్నప్పుడు
నన్ను నేను కోల్పోతుంటాను

అవాస్తవం నుంచి వాస్తవంలోకి
లాగాబడుతున్నప్పుడల్లా
నాకు నేను కాకుండా పోతాను

కల కలే
నిజం నిజమే
కల్పనా చిత్రం అనుభూతి
వాస్తవం చిత్రం అనుభవం

--((*))--



వాల్మీకి మహర్షి విరచిత యోగ వాశిష్ట సారము
26. సృష్టిక్రమము, చైతన్యము 

పరమ కారణమైన బ్రహ్మము నుండి, మొదట మనస్సు ఉదయించినది. మనస్సు నుండి భోగవస్తువులు ఏర్పడుచున్నవి. దృశ్యపదార్ధముల స్ధితి, మనస్సున ఆక్రమించియుండును. మనస్సు బ్రహ్మము కంటె వేరుగాదు. మనస్సు తరంగములవలె ఇటునటు మారుచున్నది. ప్రపంచములోని భేదములన్నియు, మనస్సు కల్పితములు. మనస్సు నాశనమైన భేదములు తొలగి, బ్రహ్మ యొక్కటియె మిగులును. అపుడు జీవుడు, మనస్సు, కర్త, కర్మ జగత్తు అను భేదము లుండవు. ఈ జగత్తు, చిత్తములు అనిత్యములై యున్నవి. అందువలననే అసత్యములు, అజ్ఞానికి సత్యముల వలె ప్రతిభాసించుచున్నవి. బాలుడు, భూతమును భావించుకొని భయపడినట్లు, అజ్ఞాని మనస్సు, జగత్తును గాంచుచు భ్రమించుచున్నారు. 
పరమాత్మ సృజనేచ్చ నుండి చిత్తమును, చిత్తము నుండి జీవత్వము, అందుండి అహంకారము, అహంకారము నుండి విషయ తన్నాత్రలు, అందుండి ఇంద్రియములు, ఇంద్రియముల నుండి దేహములు, దేహముల నుండి శోక మోహములు, వీని వలన స్వర్గనరకములు, బంధమోక్షములు బీజాంకురముల వలె గల్గుచున్నవి. చిన్మాత్ర, బ్రహ్మ, జీవుడు వాస్తనమునకు భిన్నములు కావు. అట్లే జీవుడు, చిత్తము, దేహము, కర్మలు వేరుకావు. దేహమునకు కర్మలు సహజము. అందువలన కర్మలే చిత్తమును, అహంభావమును, జీవుడు. ఇవన్నియు బ్రహ్మమే. ఒక దీపము నుండి పెక్కు దీపములు వెలిగించబడినట్లు, ఆ పరమాత్మ ఒక్కటియె నానా రూపముల వెలియుచున్నది. పరమాత్మ జ్ఞానము లభించిన, తక్కిన వన్నియు మిధ్యయని బోధపడగలదు. అపుడు శోకము తొలగి ముక్తి లభించును. భ్రాంతికిలోనై, చిత్తమే జనన మరణములను; బాల్య, యవ్వన, వార్ధక్యములను, స్వర్గనరకములను గాంచుచున్నది. బాలురు గుండ్రముగ తిరిగి ఆడుకొనుచు, జగత్తు తిరుగుచున్నట్లు భావించును. చిత్తపరివర్తన వలెనే ఈ విచిత్ర దృశ్యములు కనిపించును. 
కట్టెలు లేకున్న నిప్పు ఆరిపోవునట్లు, సమాధి అభ్యాసమున విషయ దర్శనము తొలగిపోవ చిత్తము నశించును. అపుడు జీవుడు కర్మల నొనర్చుచున్నను. ముక్తుడని చెప్పబడును. నిర్వికల్ప సమాధి యందు, చైతన్య ప్రకాశ మధికమై, చిత్తము నిర్విషయమగుచున్నది. అపుడు కర్తృత్వ భావము తొలగిపోవును. గాలికి స్పందన, చిత్తమునకు విషయములు సహజములు. విషయములు తొలగిన, చిత్తము నశించును. ఆత్మజ్ఞాన మొక్కటియె సంసారవ్యాధికి తగిన మందు. బాహ్యదర్శనములు, అంతర వాసనలు, సమాధి వలన నశించి ముక్తిలభించును. కోరుకొను వస్తువులు బొందుటకు, ప్రాణములనే త్యజించునట్లు, యోగులు కోరికలను త్యజించి ముక్తులగుదురు. 
బ్రహ్మము, అనాదికాలము నుండి, ప్రకటితమగుచున్న చేతన శక్తినే జీవుడందురు. సంకల్ప స్వరూపమును, చిత్త సంస్కార మయమునగు చిచ్చకతనంతటతానే సంకల్పించుకొని, ద్యైతభావమును జనన మరణాది భావమును పొందుచున్నది. ఈ సృష్టి జగత్తు చైతన్యము యొక్క సత్తయె, ఈ చైతన్యము రజోపాధితో కూడినపుడు సృష్టి జరుగును. అది దూరమైనపుడు శాంతమగును. చైతన్యము అజ్ఞానము వలన, తన చిద్భావమును, చిత్తమని తలచుటనే, చిత్‌స్పందనమని పండితుల భావము. దాని వలనే, జగత్తు బ్రహ్మము, జీవుడు, కర్మలు, దైవము అను వేర్వేరు అవస్ధలు, నామములు ఏర్పడినవి. స్వ విషయకము అజ్ఞానము వలన, నానా రూపములు ధరించి సృష్టి యందగపడుచు, సంకల్పానుసారము నానావిధ యోనుల నందుచున్నవి. 
చైతన్యము సూక్ష్మ భూతములతో నేకమై పితృ శరీరము నుండి శుక్రరూపము వెలువడి శరీరమును పొందుచున్నది. సువర్ణ మొకటియేయైనను, వివిధ ఆకారములుగ మారుచున్నట్లు, చైతన్యము వేరువేరు శరీరములనాశ్రయించి భిన్నమైనట్లు అగపడుచున్నది. శరీరఉపాధానములగు పంచభూతములు వికారగ్రస్తమగుటచే, అవి నానావిధముల భేదించుచున్నవి. అందువలన నిత్యమైన చిద్వస్తువు ''నేను జన్మించితిని, మరణించితిని'' మున్నగు బ్రాంతులను పొందుచున్నవి. పరబ్రహ్మమున, స్వాభావికముగనున్న మాయ యొక్క విజృంభణమే, జీవరూపమున వెలయుచు, దృశ్య రూపమున ప్రకటితమగుచున్నది. మనస్సే తన్మాత్రాదులను గల్పించుకొని, మిధ్యయగు జగత్తును సత్యమువలె విస్తరింపజేయుచున్నది. శుద్దమును, శాంతమును అగు ఆత్మ స్వమాయా రచితమగు, ఈచిత్త భ్రమను అనుభవించుచున్నది. ఈఆత్మమే ఇంద్రియ ద్వారముల ద్వారా, జాగ్రదవస్ధ అనియు, అవాంభావముతో హృదయ మందు భరించుటను స్వప్నమనియు, స్మృతిబీజముల వాసనతో హృదయ మందు సంచరించుటను స్వప్నమనియు, ఈమూడవస్ధలు దాటి, చిత్‌స్వరూపము నందుట తురీయమని చెప్పబడుచున్నది. 
బీజము నుండి అంకురము, పత్రములు, ఫలములు ఉత్పన్నమగునట్లు, చిత్తు నుండి చిత్తము, జీవులు, మనస్సుగల్గుచున్నది. భీజము యొక్క వృక్ష జననశక్తి, బ్రహ్మము యొక్క జగజ్ఞనని శక్తి ఒకే తీరుగ సమానములైనను, రెండింటి మధ్య భేదము, శక్తిపరంగ గోచరించుచున్నది. అద్దములో అరణ్యము, భూమి, వృక్షాదులు కన్పించుచున్నట్లు, బ్రహ్మము కూడ, దృశ్యమున, ప్రపంచమట్లు భాసించుచున్నది. అలానే పూర్వ కల్పిత జీవసంసారము ననుసరించి, పరబ్రహ్మమున జీవభావము ప్రకాశించుచున్నది. అందువలన జీవుడు ఒకపక్క శుద్దుడయ్యు, వాసనోద్ఛవుడుగను, సత్యముగను, అసత్యముగను, పరమాత్మ కంటె అభిన్నుడయ్యు భిన్నుడుగను, పరమాత్మ యందు స్పురించుచున్నాడు. మనస్సు, తన్మాత్రలను గూర్చి చింతించి తన్మాత్రలుగ మారుచున్నది. సూర్య మండలాకాశమున లెక్కకు మించిన మంచు తుంపురులు ప్రకాశించునట్లు, సమిష్టి మనో రూపుడగు హిరణ్యగర్భుని యందు అసంఖ్యాకములైన బ్రహ్మండములను, తదంతర్గతములునగు సూక్ష్మ దేహములును ప్రకాశించుచున్నవి. మనోచైతన్యము పొంది, తన స్వరూపమును గుర్తింపజాలక నే నెవ్వడను అను సందిగ్ధ జ్ఞానమును పొందును. పిదప పురుషార్ధ విభాగమున, జగత్‌తత్వము గ్రహించి, తనకు బ్రహ్మమునకు భేదము లేదని గ్రహించును. 
జీవాత్మ క్రమముగా; రుచి, దృశ్యము, వాసన స్పర్శ, వినికిడి అను పంచతన్మాత్రలు పొంది, వాటికి అధీనుడగుచున్నాడు. ఇట్లు భావనా మయములగు పంచేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనునవి ఏర్పడుచున్నవి. ఇట్లు సమిష్టి జీవుని యొక్కయు, వ్యష్టి జీవి యొక్కయు భావమయ అతివాహిక, దేహములుత్సన్నమగుచున్నవి. అవ్యక్తమగు పరమాత్మయె అజ్ఞానముతో చేరి, అతివాహిక దేహమును పొందుచున్నవి. ఆ పరమాత్మయె, బ్రహ్మభావము వలన, బ్రహ్మస్వరూపముగను, అన్యభావము వలన అన్య స్వరూపముగను, ప్రతిభాసించుచున్నది. బ్రహ్మము అజ్ఞాన భావము అసంభవమైనప్పటికి, అది స్వత:సిద్ధమైనప్పటికిని, మోక్షము, విచారము అనుభేదముల విచార మేమిటని శ్రీరాముడు వసిష్ఠుని ప్రశ్నించెను. అందుకు వసిష్ఠుడిట్లు చెప్పెను. ఈ జగత్తు వాస్తవమున జన్మించుట లేదు, మృతి చెందుట లేదు, బ్రహ్మమే జగత్తు రూపమున, ఇతర వస్తు రూపమున ప్రకాశించుచున్నది. బ్రహ్మ కీటక పర్యంతము, అందరి సృష్టియు సమానమే. విశుద్ధ, సత్వప్రధానుడగుట వలన, బ్రహ్మ గొప్పవానిగ, మలిన సత్వప్రధానుడగుట వలన కీటకము తుచ్చమునై యున్నవి. కీటకము దుష్కృత ఫలితముగ, బ్రహ్మము సహజత్వము వలనను భేద మేర్పడుచున్నది. జ్ఞాన బోధ వలన ఈ భేగములు తొలగిపోవును. ఆనంద స్వరూపుడయిన బ్రహ్మము, తన మాయ వలన, ద్వైత బంధము అనుభవించుచున్నాడు. వట బీజము నుండి వట వృక్షము, అన్యభజముల నుండి, అన్యవృక్షములును జన్మించునట్లు; బుద్బుదములు క్షణకాలము, బ్రహ్మండములు మహాకల్పపర్వంతము వెలయుట, నియతి స్వభావముననుసరించియె జరుగుచున్నది. అందువలన సృష్టి సత్యము కాదు. జ్ఞానము వలననే సృష్టి, అశుద్ధము, అసత్తు పరిమితము, అనేక రూపములైనట్లు గోచరించును. మూఢులు నీటిని, అలలను వేరువేరుగ బావించునట్లు, రజ్జు సర్ప భ్రాంతివలె, ఈ భేదములు కల్పింపబడుచున్నవి. ఒకనియందే సంబంధ భేదము ననుసరించి, పరస్పర విరోధములగు శతృత్వ మిత్రత్వ గుణములు ఏర్పడుచున్నవి. ఇట్లు ఆత్మ మనస్సుగా, అహంకారిగా, తన్మాత్రలు, పంచభూతములు, చివరకు జీవునిగా రూపొంది జగత్తును దర్శించుచున్నాడు.


శ్రీగిరీశ్వర నీదుసేవ ముక్తికిఁ ద్రోవ నీనామ మఘవార్ధి నిల్పునావ
సిరులిచ్చు చెలిపొందుఁ జేసెఁగా నీ బావ త్రిపురవాసుల ద్రుంచు తెలివి ఠేవ
మునుపుత్రు మొఱ విని చనితివౌ దయఁగావ మామను దలగొట్టు మాటెలావ
చలమలసుత నేలఁగలవాఁడవే నీవ వేలపులు జాలిరే విషము ద్రావ

సకలసురలందు బ్రాహ్మణజాతివీవ చావుపుట్టుల లేనట్టి సామి గావ
భావభవభంగ గౌరీహృత్పద్మభృంగ రాజితశుభాంగ రేపాలరాజలింగం

కొమఱ్ఱాజు వేంకటశివకవి "రేపాల రాజలింగ శతకము" నుండి

వెయ్యి వెర్రి తలలు వేస్తోం
ది....

అబ్బాయి: హ్యాపీ బర్తడే
అమ్మాయి: థ్యాంక్యూ
అబ్బాయి:మై ప్లెజర్
అమ్మాయి: మై యాక్టివా !!!

No comments:

Post a Comment