Monday, 11 June 2018

Pranjali Prabha (18-06-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
Photo
అఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం   

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

చిలక కొరికిన జామపండు రుచి వేరు
పెదాలు నలిపిన ఆకువక్క రుచి వేరు
చిన్నిల్లి తాలింపు పచ్చడి రుచి వేరు
అధరాలు కలయిక చెప్పు  రుచి వేరు

కామం తనువును తపింప చేసే ప్రకృతి వేరు
మోక్షం మలుపు చూపించే కామం తీరు వేరు
విశ్వాన్ని తొలచి వేసే మన్మధ బాణాలు వేరు
వికసించన పువ్వు వేరు, కామించని స్త్రీ వేరు

కామ త్రృప్తి తెల్ప లేని అనుభూతి వేరు
కామం తీర్చుట మన: శాంతికి మరో పేరు
శ్రృంగార కేళి మధురాతి మధురం వేరు
కామ్యార్ధ సిధ్ధి జీవితంలో మలుపు వేరు
--((*))--


నేటి కవిత
*మధూలికా
rachayaa Mallapragada ramakrishna

మనసు చల్లనే - వయసు వచ్చెనే
వలపు తెచ్చెనే - తణువు విచ్చెనే
సొగసు పండెనే - మమత నిండెనే
కడుపు నిండెనే - రవళి వెల్గెనే

నటన నేర్చెనే - నడక మార్చెనే
వగలు పెంచెనే - తగువు తెచ్చెనే
మొగలి నవ్వేనే - కలువ ఏడ్చేనే
సిగలు వాడెనే - తుళువ నవ్వేనే

సెగలు సాగెనే - పొగలు కమ్మెనే
పరులు తుమ్మెనే - తరువు నవ్వేనే
మురళి మ్రోగెనే - సరస మాడునా
కళలు వచ్చునా - కలత తెచ్చునా

వనిత లేఖలే - నవత బాధలే
కళలు కళ్లలే - కలలు రంగులే
మధుర వాణినే - అక్షర మాటలే
వెలుగు రవ్వలే - కవుల నవ్వులే

కలువ సిగ్గులే - నవల మొగ్గలే
తడక కంతలే - మడత పిచ్చిలే
మరక గుర్తులే - నసగు చేతలే
వలలో చేపలే - నదిలొ తెప్పలే

నిధుల కోసమే - బతుకు ఈతలే
హితుల వాలకం - అసలు దొంగలే
మనిషి విజ్ఞతే - వయసు వేడుకే
సమయ పెద్దోడే - ఉదయ భాణుడే

ఆరుణ బింబమే - మరణ శాసనం
కరుణ వాలమే - ముతక జీవితం
నవమి పూజలే - జయము నిచ్చెనే
మొగలి పువ్వులే - తనయ పల్కులే

వొదిగి వయ్యారం - మిడిసి సింగరం
కనుల సోయగం - ముడుచు రెప్పలా
పగలు సేవలే - ఉచిత శోభనం
తులసి ఆకులే - తెలివి మాతలే

వరద పొంగులే - బడుగు బాధలే
సిరుల ఊయలే - విలువ ఆశలే
కురుల మాయలే - మతికి మత్తులే
తెలుగు నేర్చుకో - తెలివి పెంచుకో

పడతి ప్రేమలే - బడితి మెల్లగా
సరస జేరగా - సరస మాడునే
వరుస చెప్పగా - నగలు పంచనే
కలలు వచ్చునా - కలత తెచ్చునా

మగువ మార్చకూ - వరుస సత్యమే
వరుని తల్చగా - హరియు వచ్చునా
రియు తల్చగా - శివుడు వచ్చునా
తెలుగు పాటలో - తియని తేటలే

Photo



2 ఏప్రిల్ అంతర్జాతీయ బాలల పుస్తక దినొత్సవం (2 Apr International Children’s Book Day)

“మావాడి చదువు ఇప్పుడిప్పుడే రూట్లో పడుతూంది. వాడికోసమే న్యూస్ పేపర్ కూడా బందు చేశాము” ఒక తండ్రి చెబుతాడు.

‘మన కాలపు చదువులు వేరు. ఇప్పటి సబ్జెక్టులు చాలా హార్డు. ఇంకా పిల్లలను చందమామలూ, బాలమిత్రలూ చదువనిస్తామా” అని ఒక తల్లి తన స్నేహితురాలితో వివరిస్తుంది.

“మీవాడు స్టడీస్ లో చాలా ఫాస్ట్, ఈ స్పీడ్ ఇలాగే కంటిన్యూ కావలంటే, కధలూ, కామిక్సు గట్రా చదవనివ్వకండి” అని ఓ కాన్వెంటు టీచరు తల్లిదండ్రులకు చెబుతుంది.

గ్రేడు, ర్యాంకులే జీవిత లక్ష్యంగా చూపిస్తూ తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ, సమాజం కూడబలుక్కున్నట్టుగా పాఠశాల విద్యార్ధులను, పిల్లలనూ విస్తృత పఠనానికి దూరం చేస్తున్నారు. ప్రత్యేకించి మనదేశం‌లోనే ఈ ధోరణి ఎక్కువగా ప్రబలుతూంది,

పిల్లలకు విస్తృత పఠనం ఖఛ్చితమైన అవసరమని పలుదేశాలు పరిశోధనలతో నిర్ధారించుకున్నాయి. అవేమిటో ఈ రోజు తెలుసుకుందాం.

మామూలుగా విద్యార్ధులు భాషకు సంబంధించి చేసే తప్పులను ఆంగ్లం‌లో SODA (Substitution, Omission, Deletion, Addition) అంటారు, అంటే రాయడం లేదా మాట్లాడేటప్పుడు ఒక పదానికి బదులు మరొక పదం వాడటం, కొన్నిసార్లు పదాలను వదలివేయడం, అప్పుడప్పుడు అవసరమైన పదాలను తొలగించడం, అనవసరమైన పదాలను చేర్చడం వంటివి. విస్తృత పఠనం చేసే విద్యార్ధులలో భాషాపరమైన నైపుణ్యాలు పెరగటం వల్ల ఇటువంటి పొరపాట్లకు అవకాశం తక్కువ.
విస్తృత పఠనంతో పిల్లలకు నిశ్శబ్దపఠనం‌లో నైపుణ్యం, వేగం పెరుగుతాయి. పలు అంశాలపై లోతైన అవగాహన ఏర్పడుతుంది. భావోద్వేగ, మేధోపరమైన నిర్మాణం జరుగుతుంది. ద్ధృఢమైన భావోద్వేగ నిర్మాణం వల్ల తదుపరికాలాల్లో సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కోవడం, విచక్షణాయుత నిర్ణాయాలు తీసుకోవడం, తద్వారా విజ్జయం పొందటం సంభవిస్తుంది. Reader is the Leader అనే మరో నానుడి ఉంది. ఉత్తమ చదువరియే సమర్ధవంతుడైన నాయకుడు కాగల్గుతాడు.

Jonathan Swift అనే ఆంగ్ల సాహిత్య విమర్శకుడు తన The Battle of Books అనే పుస్తకం‌లో ప్రాచీన రచయితకీ, ఆధునిక రచఇతకీ గల తేడాను చక్కగా వివరించాడు. ఈ వివరణను మనం ఇలా అన్వయించుకోవచ్చు.

చదువరి తేనెటీగ మాదిరిగా పలు పుస్తకాలనుండి విజ్ఞ్జానాన్ని సేకరింఛి తన మస్తిష్కం‌లో ప్రోదిచేస్తాడు. క్రమంతప్పకుండా తేనె సేవించేవారికి సహజంగా రోగ నిరోధక శక్తి పెరిగినట్టుగా నిరంతర చదువరి తనకు ఎదురయ్యే ఎటువంటి సమస్యలనైనా తట్టుకొని విజయం సాధిస్తాడు. పైగా అతనితో సాంగత్యం చేసేవారికి, చర్చించే వారికి ఆమాధుర్యం రుచి దొరుకుతుంది.

నిర్లిప్త చదువరులు సాలెపురుగువంటివారు. సాలీడు తన శరీరం‌లో ఉత్పత్తి అయ్యే ‘క్రిస్టలీన్’ అనే చిక్కటి ద్రవ పధార్ధం‌నుండి దారాన్నీ, దాంతో గూళ్ళను నిర్మిస్తుంది. వారితో సంపర్కం అంటే సాలెగుడూలో చిక్కుబడిపోయిన కీటకాల పరిస్థితికి దిగజారిపోతాము.

మీపిల్లల విస్తృత పఠనాన్ని ప్రోత్సహించండి. అందుబాటులోని బుక్ హౌజ్, బుక్ ఎగ్జిబిషన్, గ్రంధాలయానికి తీసుకువెళ్ళండి. వారు చదివేటప్పుడు తోడుగాఉండి సహకరించండి. చందమామ, బాలమిత్ర వంటి పత్రికలకు మీపిల్లలనే చందాదారులుగా చేయండి. వారు చదివిందేమిటో మీకు చెప్పమనండి. దాన్నే రాయమనండి. మీ పిల్లలతో మీరు గడిపే గుణాత్మకమైన సమయమే వారిని భావ్విజీవితం‌లో విజేతలుగా నిలబెడుతుంది.

ఇంకేమి, ఈ రోజునుండే మీపిల్లల విస్తృతపఠనకు మార్గం వేయండి.
--((*))--


రమ్యముగా ;- 
రాధా మాధవ దేవులు ; 
ఆడుచుండిరి బృందావనమున ; 
రమ్యముగా అతి రమ్యముగా; ||రాధా|| 

హరిణాక్షి చేతి పావులతో ; 
కంకణముల రవళి కూడ; 
శృతిని కలిపెను ; 
అను శృతిని కలిపెను; ||రాధా|| 

వనములోని హరిణమ్ములు ; 
ఆట చూచి, మైమరిచి ; 
రెప్ప వేయ మరచినవి ; 
కనురెప్ప వేయ మరచినవి ; ||రాధా|| 

హరి, పొంకము మీరగా ; 
వంగి వంగి , తానాడుచుండగా ; 
నింగిలోని హరివిల్లు ; వంగి చూసెను ; 
తాను వంగి చూసెను ; ||రాధా|| 

ధరణిలోని గిరులు , 
ఝరులు తరులు అన్నీ ; 
పాట పాడాయి ; 
'వంత పాట 'పాడాయి ; ||రాధా|| 

===============, 


సింధూరపూ పూదోటలో చిన్నారి ఓ పాపా...ఏ పాపమో ఆ తోటలో వేసిందిలే పాగా

చిత్రం: కిల్లర్ (1993)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా
ఏ పాపమో.. ఆ తోటలో.. వేసిందిలే పాగా
ఏమని నే పాడనులే
ప్రేమకు తానోడెనులే..ఏ..ఏ..
ఆ కథ ఎందుకులే..ఏ..

చరణం 1:

తనువే.. కధలల్లే.. కనుపాపే నా బొమ్మగా
మనసే.. తెరతీసే.. పసిపాపే మా అమ్మగా
కనులు పగలు కాసే.. చల్లని వెన్నెల కాగా
చిలక పలకగానే.. గూటికి గుండెలు మ్రోగ
విధి చదరంగంలో.. విష రణరంగంలో
గెలవలేని ఆటే.. ఎన్నడు పాడని పాట

చరణం 2:

రాబందే కాదా.. ఆ రామయ్యకు బంధువు
సీతమ్మను విరహాలే.. దాటించిన సేతువు
కోవెల చేరిన దీపం.. దేవుడి హారతి కాదా
చీకటి మూగిన చోటే.. వేకువ వెన్నెల రాదా
ఈతడు మా తోడై.. ఈశ్వరుడే వీడై..
కలిసి ఉంటే చాలూ.. వేయి వసంతాలూ

సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా
పాపనికే.. మా తోటలో.. లేదందిలే జాగా

https://www.youtube.com/watch?v=PEvJ32XXQt8

No comments:

Post a Comment