ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
నేటి భావ రసమంజరి
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
పోనీ, పోనీ, దేశం ఎటుపోతే నాకేం
పొతే, పోనీ, నన్ను వదిలి పొతే నాకేం
రానీ, రానీ, కష్టాల్, నష్టాల్ నాకేం
వస్తే రానీ భూకంపాల్, పెనుతుఫాన్ నాకేం
కష్టాల్, నష్టాల్, నా మనసును తాక లేవ్
కోపాల్, తాపాల్, శాపాల్ నన్నేమి చేయ లేవ్
తిట్లు, పోట్లు, ఇక్కట్లు, నా తనువుని మార్చ లేవ్
కానీ, రానీ, రానీ, పోనీ, నా హృదయాన్ని కదిలించ లేవ్
కళా కవితా రాగం, రోగం నన్ను వెంబడించ నీ
దీపం, ధ్యానం, యఁగాభ్యాసం నాకు అలవాటు కానీ
హాసం, లాసం, నా ప్రవర్తనను చూసి ఎక్కిరించ నీ
ప్రకృతి వికృతిగా మారినా ప్రేమను పంచుతా ననీ
విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ప్రార్ధించుతున్నాను
మనసు వక్రమార్గం పోకుండా ఉండే విద్య నేర్పమంటున్నాను
నన్ను కన్న తల్లి తండ్రులకు వాగ్దానం చేస్తున్నాను
ప్రాణం ఉన్నంతవరకు ధర్మాన్ని వదలకుండా ఉంటాను
ఉంటాను, ఉండమని చెపుతాను,
కృషితో నాస్తి దృర్భిక్షం - ప్రేమ సత్ప్రవర్తనతో సర్వం సుఖం
--((**))--
భావ రస మంజరి
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
మన కన్నులు నిత్యం
వెతకటం సత్యం
సత్యాన్ని తెలుస్కోవటం
మాత్రం అనిత్యం
కల్పుతాం స్నేహ హస్తం
చెప్పలేము ఎంత సాస్వితం
కల్పుతాం చిరుత హాసం
ఎంతవరకు మార్చునో కల్ముషం
చేస్తాం మధుర సంభాషణం
ఎంతవరకు తీర్చునో పరిష్కరం
పంచు కుంటాం ఆరోగ్యం
ఎందుకు పంచుకోలేము ఆనారోగ్యం
పొందుతాం హృదయానందం
ఇతరుల్లో చూడలేము ఆనందం
సంపాదన కోసం పోరాడుతాం
తృప్తి లేక జీవనం సాగిస్తాం
--((**))--
మరణ ఘడియలను సమీపిస్తున్నాడు!
ఆ శ్రీరామ చంద్ర మూర్తి, లక్ష్మణుని ఆదేశించారు
"లక్ష్మణా! నీవు శీఘ్రమే ఆ మహానుభావుడు రావణాసురుని కడకేగి 'రాజ నీతి' అభ్యసించి రమ్ము "
ఎన్నడూ అన్నగారితో మారు మాటాడని లక్ష్మణుడు
"అన్నగారూ! మన శత్రువుదగ్గరకు నన్ను పంపుచున్నారా? "
"నామీద గౌరవమును పెంపొందించుకొని మరీ నా ఆజ్ఞను తక్షణమే శిరసావహించాలి సుమా,
కాని ఎడల అమూల్య సంపదను జారవిడుచుకొన్నవాడవౌతావు సుమా! "
లక్ష్మణుడు రావణుని శిరస్సున సమీపించి
"మా అన్నగారు మీ దగ్గర 'రాజ నీతి' అభ్యశించుటకు నను పంపినార" నెను!
రావణుని రసవత్తరమైన ప్రత్త్యుత్తరము విందాము:
"లక్ష్మణా!
ఆ మహా పురుషుడు శ్రీరామ చంద్రుని అనుజునిగా జన్మమెత్తిననూ, నిరంతరమూ ఆ మహానుభావుడి సన్నిధిలో గడిపినప్పటికీ, నీ పూర్వజన్మ సుక్రుతము నిను వీడడము లేదు సుమీ!
విద్య నేర్వగోరువారు గురువు పాదముల చెంతనే వుండాలనే ప్రాధమిక విషయాన్నెలా మరచావయ్యా!
ఏది ఏమైనా నా దైవము ఆజ్ఞను మనసారా శిరసావహిస్తాను "
అని లక్ష్మణునకు క్షుణ్ణంగా రాజనీతి బోదించారట ఆ మహానుభావుడు రావణాసురుడు!
అందులో ఒక్క విషయం
" చేయాలనుకున్న మంచిపని వెనకాడకుండా చేసేయ్ - ఆలోచిస్తే అమృతం కూడా విషం గా మారుతుంది, నన్నే చూడు దేవతలను జయించి అమృతాన్ని తెచ్చుకున్నా - తాగ నివ్వలేదు నాలో ప్రవేశించిన అహం. (అహం రాకుండా జాగర్తపడు )
ప్రేమ పాశానికి చిక్కకు, దైవ ప్రార్ధనను మరువకు - నేను ప్రేమ పాశానికి చిక్కి దైవ ప్రార్ధనను తగ్గించా అదే నా మృత్యువుకు మార్గమైనది.
ఓం శ్రీ రామ్ సర్వం శ్రీ రామార్పణమస్తు
--((**))--
క్రూరాత్ముడు అజామీళుడు
నారాయణ యనచు నందుని బిలువన్
ఏ రీతిని ఏలుకొంటివొ వెలదగ క్రిష్ణ
ఏరీ నీ సాటి వేల్పు నగధర సౌరీ!
అజామీళుడు క్రూరుడు, ధుర్మార్గుడు, నీచుడు, దోపిడీదారుడు, దయాదాక్షిణ్య రహిత హంతకుడు, స్త్రీలోలుడు!
తన చరమాంకము వుంపుడుగత్తె ఇంట గడిపాడు!
అనుకోకుండా ఆమె వల్ల కన్న కొడుకుకి "నారాయణ " అనే పేరు పెట్టడం జరిగింది!
ఒకానొక సంధ్య వేళ!
అజామీళుడు దాహార్తితో పరితపిస్తూ కొడుకును పిలుస్తున్నాడు! వాడు ఎంతకూ రాకపోయేసరికి కొడుకును వేడుకుంటున్నట్లు
"నారాయణ! నారాయణ! నారాయణ! "
అని అతి దీనంగా, ఆర్తితో మొర పెట్టుకోసాగాడు!
స్వయంగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వాని దాహము తీర్చిన పిమ్మట ప్రాణము విడిచాడు!
శ్రీమన్నారాయణుడు అతనికి స్వర్గప్రాప్తి కలిగించాడు!
అందుకే మనము కూడా అంతిమ ఘడియలలో
"నారాయణుని స్మరించాలి సుమా!
తెనాలి రామకృష్ణ కధలు
తాతాచార్యులవారికీ, తెనాలి రామకృషునికీ పడేది కాదుట ఎప్పుడూ నేను చెప్పింది సరైనదంటే నేను చెప్పినదే సరైనదని వాదులాడుకునే వారట.
ఒకసారి ఆ వాదనలో ఒక పందెం వేసుకున్నారట. నేను చెప్పినది సరైనదైతే మీరు నన్ను భుజాల మీదికెక్కించుకొని రాజవీధిలో తిరగాలి, నేను ఓడినట్లైతే, నేను మిమ్మల్ని భుజాలమీదికెక్కించుకొని రాజవీధిలో తిరుగుతాను. అదీ పందెం. ఆ పందెం లో
తాతాచార్యులవారు ఓడిపోయారట. ఇంకేముంది నన్ను భుజాలమీదెక్కించుకొని రాజవీధిలో తిరగాలి రండి అని రామకృష్ణుడు పట్టుబట్టాడాట. రాహ్మకృష్ణా! అలా చేయకురా! నా పరువు పోతుందని ఆయన బ్రతిమలాడినా రామకృష్ణుడు వినకయేసరికి . తాతాచార్యులవారు విధి లేక రామకృష్ణుడిని భుజాలమీదెక్కించుకొని,రాజవీధిలో నడుస్తున్నాడట.
ఈ దృశ్యాన్ని రాయలవారు తనగది కిటికీలోనుంచి చూశారట. భటులను పిలిపించి
ఆ పైనున్నవాడిని కొరడాలతో కొట్టుకుంటూ నా దగ్గరికి తీసుకొని రండని ఆజ్ఞాపించాడు.
రాయలవారు చూడడం గ్రహించిన రామకృష్ణుడు తాతాచార్యులవారి భుజం మీదినుంచి
దిగి ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించండి గురువర్యా! నా వల్ల అపరాధం జరిగిపోయింది.
దానికి శిక్షగా నేను మిమ్మల్ని భుజాలపై ఎక్కించుకొని తిరుగుతానని చెప్పి ఆయన్ని ఒప్పించి ఆయన్ను తన భుజాల మీదికి ఎక్కించుకొని నడవసాగేడు. భటులు వచ్చి రాజుగారు పైనున్నవాడిని కొరడాలతో కొట్టి తీసుకొని రమ్మన్నారు కదా! రామకృష్ణుని భుజాలపైన వున్న తాతాచార్యుల వారిని కొరడాలతో కొట్టుకుంటూ ఆయన నేను రాయలవారి గురువుగారినని చెప్తున్నా వినిపించుకోకుండా యిది రాజుగారి ఆజ్ఞ అంటూ తీసుకెళ్లారట. రాయలవారు చూసి ఇదేమిటి నేను పైనఉన్నవాడిని కదా తీసుకొని రమ్మనింది. మాగురువుగారిని తీసికోచ్చారేమిటని గద్దించి అడిగేసరికి భటులు వణికి పోతూ ఈయనగారే పైనున్నదని చెప్పారట. రాయలవారు గురువుగారి కాళ్ళమీద పడి
క్షమించమని వేడుకొని సంగతేమని అడిగితే, జరింగింది చెప్పి తాతాచార్యులవారు
కళ్ళనీళ్ళ పర్యంత మయ్యారట. రామకృష్ణుని పిలిపించి బాగా తిట్టి కొరడా దెబ్బలతో సత్కరించి, ఇలాంటివి యికమీద జరిగితే పెద్ద శిక్షే పడుతుందని హెచ్చరించారట.
మేము తెగ నవ్వేవాళ్ళం
"ఇదేంటిరా ......
పిల్లలని స్కూల్ కి దలడానికి ....
వాళ్ల "మమ్మీ" లు వస్తారు !!
కానీ...
పప్పూ గాడిని ....
స్కూల్ కి వదలడానికి .....
రొజూ వాళ్ల డాడీ వస్తారు..??
ఎందుకంటావ్?" అడిగాడు "సందేహం" గాడు
"హహహ....
ఒరేయ్...
అందుకే రా, మరి వాళ్ల డాడీ వస్తున్నారు.....
--((**))--
నీకు ఇంకా అమాయకత్వం పొలెదురా!!!!!" అన్నాడు "పిడుగు" 'గారు
మంత్రిగారూ! తమరేమీ అనుకోరంటే ఓ మాట!
ఏమీ అనుకోను, చెప్పవోయ్!
మీ కింద ఊడిగం చేసేవాడికి అప్పనంగా ఇరవై లక్షలు చేతిలో పెట్టి ఓ పదిమందిని రోజూ ఇస్తానని చెప్పి ఎం. పి గా పోటీ చేయమన్నారు,
అదంత అవసరమా అని?
ఓరి పిచ్చోడా! ఇంతకాలం నాతో తిరిగావు గానీ రాజకీయాలు వంట పట్టించుకున్న పాపాన పోలేదు.
గత మూడు సార్లు మనకు ఎదురు లేదు కాబట్టి నెగ్గుకొచ్చాము, ఇప్పుడా పరిస్థితి లేదు, ఇక్కడ సరిసమానముగా రెండు వర్గాలున్నాయి!
ఇప్పుడు మనది కాని వర్గము మనిషి పోటీ చేయబోతున్నాడు, ఆ వర్గానికి చెందిన ఈ నా అనుచరుడిని బరిలోకి దింపుతున్నాను, వీడికి, వీడి వర్గంలో మంచోడనే పేరుంది, వీడు వీడి వర్గం నుండి నాలుగో వంతు వోట్లు రాబట్టుకున్నా నా గెలుపు సునాయాసము!
--((**))--
ॐ ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః ॐ
👬మిత్రులకు శ్రేయోభిలాషులకు👬
☕శుభశుభోదయం శుభదినం☕
మీకు మీ కుటుంబసభ్యలకు
🌞 "రథసప్తమి" శుభాకాంక్షలు🌞
సూర్యాష్టకం
(1).ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోzస్తుతే ||
(2)సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
(3)లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
(4)త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మావిష్ణుమహేశ్వరమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
(5)బృంహితం తేజఃపుంజం చ వాయురాకాశమేవ చ |
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
(6)బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితమ్ |
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
(7)తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
(8)తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
(9)సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్ |
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్ ||
(10)ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా ||
(11)స్త్రీతైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి ||
నేటి కవిత
భావ రస మంజరి
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
వర్ణాలు వేరైనా ఒకటవ్వాలని
వలపులన్ని పంచుకొని బతకాలని
వలకు చిక్కక జీవించాలని
వద్దన్నా ప్రేమను బ్రతికించాలని
ఇరువురు చేరే నగరం
వెంబడించే నగర మృగాలు చిక్కి
వేడుకున్న, ఏడ్చినా ఫలితం లేక మ్రొక్కి
ఊరకుక్కల బారినుండి తప్పించుకొని
నగర బక్షకులను ఆశ్ర ఇంచే
వర్ధమాన వరులను వేరుచేసే
వలదన్నా వరుసకలిపి ముచ్చటించే
నక్క బుద్దులు నమ్మ బలికె
నవనితాన్ని అమాంతం మింగ చూసే
రాబందులు వచ్చి నవనితాన్ని నాకే
వేడి సెగలు కమ్ముకోగా కరగక తప్పక
చల్ల కుండ లాంటి నది లో జారే
ఆవురావురమంటూ
తిమింగలాలు చుట్టు ముట్టే
బ్రతుకు తెల్వని చేపపిల్ల
వడ్డుకు చేరి గిల గిల కొట్టుకొని
కసాయివానికి చిక్కి ఆహారమయ్యే
ఇదేమి నగరం
--((**))--
No comments:
Post a Comment