ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమా: శ్రీ కృష్ణాయనమ:
అందరికి ఆనందం ఆరోగ్యం - ఆధ్యాత్మికం )-
ఓం శ్రీ రామ్ - శ్రీ మాయాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
అచ్చిన వాని ఇల్లాలి గట్టగజూచు - ఇవ్వవలసిన దండ ఇచ్చా ననుచు
అలుసైనా వాని ఇల్లు ఆక్రమింప జూచు - తనకిష్టమైన వాడైన పాదాలు పట్టుచు
అణువుగా చూచు వానిని తప్పు పెట్టుచు - గోరంత తప్పును కొండంత చేయుచు
అలక చూపి బంధువులందు దూషించు - చీటికి మాటికీ తప్పు పట్టి వేదించు
దుర్ణయుల దుర్గుణంబులఁ ద్రోయరాదు
దానికి ఫలంబు యమ సన్నిధాన మందె
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((*)--
నేటి కవిత ( అధిక్షేప ప్రేమ లీల )
ప్రాంజలి ప్రభ (లోకం తీరు)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
పరుల కొంపలు కాల్చి రావచ్చు
- తన ఇల్లు కాలితే నవ్వక ఏడ్వా వచ్చు
పడచు గుఱ్ఱము తోక బట్టి ఈడ్వా వచ్చు
- ప్రేమనుండి తప్పించుకోలేక పోవచ్చు
పెద్దపులి జనంలోకి రావచ్చు
- దాన్ని చూస్తూ భయము లేకుండా తిరగవచ్చు
కందిరీగలు ఒక్కసారి దాడి చేయవచ్చు
- మచ్చబడ్డ మాన్పించ లేక పోవచ్చు
గార్యతతులెల్లఁజేసి తత్కార్యఫలము
లనుభవింపుదు రాయాయి యవసరముల
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
ఒకరికొకరు తోడైనట్లు - తనువుతపనతో ఒడి చేరినట్లు
నీడలు ఏకమైనట్లు - చెవిలో గుసగుసలు సోకినట్లు
కళలతో కరిగినట్లు - శ్వాస వేగముగా మారినట్లు
యదలో కదిలినట్లు - నువ్వు నేను ఒకటైనట్లు
ఇట్లు ఎట్లు అనక, మత్తులో
గుబాళింపులు కమ్ముకున్నాట్లు
సిగపట్లు లేని పట్లు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
త్యాగముతో కూడిన ధనమున్నూ - గర్వము లేని విద్య యున్నూ
క్షమ కల్గిన శౌర్యమున్నూ - ప్రియవచనంతో దానమున్నూ
నిత్య ప్రార్దనతో దైవమున్నూ- అనారోగ్యునికి ఔషదమున్నూ
ఇచ్చు పుచ్చుకొనే నిర్మల మనసుతనువుతపనతోతనువుతపనతో న్నూ - అపకీర్తి కన్నా చావున్నూ
ఒకరికొకరు తోడుగా మానవత్వాన్ని నిలబెట్టి
మౌనవత్వాన్ని వీడి తన్మయత్వాన్ని చెందుటే
వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--
దానం ప్రియ వాక్సహితం జ్ఞాన
మగర్వం క్షమాన్వితం శౌర్యం
విత్తం చ త్యాగనియుక్తం
దుర్లభ మే తచ్చతు ర్భద్రం
తా:--ప్రియవచనములతో గూడిన దానమున్నూ,గర్వము లేని విద్య యున్నూ, క్షమ గలిగిన శౌర్యము న్నూ, త్యాగముతో గూడిన ధనమున్నూ , ఈ నాలుగూఎక్కడో అరుదుగా వుంటాయి.
ఎడ్డె మనుష్యుడే మెరుంగు నెన్ని దినంబులు గూడి యుండినన్
దొడ్డ గుణాడ్యు నందు గల తోరపు వర్తన లెల్ల ప్రజ్ఞ నే
ర్పడ్డ వివేక రీతి; రుచి పాకము నాలుక గా కెరుంగనే
తెడ్డది కూరలో గలయ ద్రిమ్మరు చుండిన నైన భాస్కరా!
అర్థము:--మూఢ మతి గుణవంతుని వెంట తిరుగుచున్ననూ అతని సద్గుణముల తో గూడిన నడవడికలు గుర్తించి నేర్చుకోలేడు జ్ఞాని మాత్రమే అతని జ్ఞానాన్ని గుర్తించి నేర్చుకో గలడు.ఎట్లనగా తెడ్డు (గరిటె ) కూరలోఎన్ని మారులు కలయ తిరిగినా గానీ దాని రుచి గ్రహింప జాలదు నాలికకే అది సాధ్యము. సుజ్ఞాని మాత్రమే జ్ఞానిని గుర్తించ గలడు అని భావము.
వగగొను లోభముం బిశున భావము సత్యము చిత్తశుద్దియుం
దగు సుజనత్వమున్ సమహితత్వము విద్యయు లోకనిందయుం
దగిలిన దుర్గుణంబు దురితంబు దపంబును దీర్థ సేవ భృ
త్యగణము సొమ్ములుం ధనచయంబును జావురు వేర యున్నవే.
(భర్తృహరి సుభాషితము, ఏనుగు లక్ష్మణ కవి అనువాదము).
అర్థము:-- అత్యాశ యున్న వేరొక దుర్గుణ మక్కరలేదు. చాడీలు చెప్పే దుర్గుణ మున్నచో వేరే పాప మక్కరలేదు. సత్యము,సర్వజనులనులను సమానముగా చూచు గుణమున్న వేరే తపస్సు అక్కర లేదు. ద్రోహచింత మొదల గు దుష్ట సంకల్పము
లేక నిర్మలమైన మనస్సున్న వేరే తీర్థ యాత్రలు చేయనక్కర లెదు. మంచితనము,గౌరవ మర్యాదలుండిన వేరు యలంకారము లక్కర లెదు.మంచి విద్య యుండిన వేరు ధనము అక్కరలెదు. అపకీర్తి కలిగె నేని దానికంటే వేరు చావు లేదు.
అద్భిర్గాత్రాణి శుద్ధ్యన్తి ; మనస్సత్యేన శుద్ధ్యతి
విద్యా తపోభ్యాం భూతాత్మా ; బుధ్ధి: జ్ఞానేన శుద్ధ్యతి :
అర్థము:-- జలము చేత శరీరము పరిశుద్ధ మగును: సత్యముచేత మనస్సు పరిశుద్ద మగును, జ్ఞానము చే బుద్ది శుచి యగును,
విద్య చేత,తపస్సు చేత ఆత్మ పరిశుద్ధ మగును.
మేళము లేని యూరు మిడిమేళమెరుంగుని యట్టి పోరు తాం
బూలము లేని నోరు రుచి పుట్టగ నుప్పును లేని చారు యే
వేళను తిట్టు నోరు విను మెంతయు వాడినయట్టి నారు బల్
హేళనగాక యోగ్యమని ఎవ్వరటందురు వేంకటేశ్వరా
నేటి కవిత ( అధిక్షేప ప్రేమ లీల )
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
45. ఒకరికొకరు తోడైనట్లు - తనువుతపనతో ఒడి చేరినట్లు
నీడలు ఏకమైనట్లు - చెవిలో గుసగుసలు సోకినట్లు
కళలతో కరిగినట్లు - శ్వాస వేగముగా మారినట్లు
యదలో కదిలినట్లు - నువ్వు నేను ఒకటైనట్లు
ఇట్లు ఎట్లు అనక, మత్తులో
గుబాళింపులు కమ్ముకున్నాట్లు
సిగపట్లు లేని పట్లు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
om
ReplyDelete