ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
ఆనందం ఆరోగ్యం - ఆధ్యాత్మికం
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
ఏవో. ఏవేవో,
లేనిపోని ఆలోచనలు నిన్ను
చుట్టు కుంటాయి
కొందరి ఘోషలు
వినబడు తున్నాయి
గుండెలు విడిపోతున్నాయి
ఎవరో, ఏవరెవరో
తల విరబోసుకు
నగ్నంగా నర్తిస్తున్నారు
ప్రేమగా చూస్తున్నారు
ద్విగ్నంగా ప్రవర్తిస్తున్నారు
అవిగో అవిగవుగో
వికసిస్తున్న పూలు
గగనపు మేఘాలు
కొందరి ఆర్తనాదాలు
మరణించిన యువయోధులు
ప్రవహించిన నెత్తురు మడుగులు
నేడే ఈనాడే, ఈనాడే-
మనస్సుల్లో ఉత్సాహం
మమతల్లో ఆరాటం
నరజాతి విమోచనం
నవజీవనానికి శుభసమయం
వసంతుని ఆర్భాటం
శ్లేషము, ప్రసాదము,
మాధుర్యము, సౌకుమార్యము,
సమత, అర్థదీపనము,
ఔదార్యము, కాంతి,
ఓజస్సు, సమాధి.
ఎదో ఎదో తెలుసుకోలేని
మానవుని జీవితం
--((*))--
నేటి హాస్యం
ప్రాంజలి ప్రభ
మనిషి పొతే....
కొవ్వొత్తి వెలిగిస్తారు!!!
పుట్టిన రోజు కి మాత్రం ....
కొవ్వొత్తి ఆర్పేస్తారు!!
ఎందుకు ??
ఫూలాన్ దేవి , బందిపోటు....
అయినా ఎన్నికలలో గెలిపిస్తారు
కిరణ్ బేడి....ఐ పి ఎస్ పోలీసాఫీసరు..
ఎన్నికలలో ఓడిస్తారు
నాయకుల మాట నమ్మి ఓటేస్తారు
నాయకులను కనీసం అడగలేని వారు
అవునా ..... అవునురా అవునూ
మేము గెలిపిస్తాం, ఓడిస్తాం
ఇది మా ఇష్టమ్
అవునా ..... అవునూ ఆ.... ఆ .....
ఓడి పోకకొనసాగవోయ్..
గోడు వీడి పయనించ వోయ్..
బ్రతుకునీది..బరువునీది
ఎంచుకున్న దారినీది..!
లక్ష్యమన్నది ఎదుట నుండగ
ఆశయం వెన్నాడుచుoది గ..!
కళ్ళముందర మార్గముందిగ
,వెరుపు.వదలిక.కదలిపోవోయ్,!
నిర్ణయం..నీతీర్పు,, నీదోయ్..
వెన్నుచూపక.. వేగపడవోయ్..!
వెనుకనెవ్వరు వెంటరారోయ్
ఒక్కడంటే..ఒక్కడే... !
.
నీభారమంతా.వడివడి గ నీవె
వంటరివి. వదలక మోయవోయ్!
వెన్నుతట్టే.. హితుల పలుకులు
బలముగూర్చును..చింతపడకోయ్!
పక్కచేరిన గుంటనక్కల '' ఛీ '' కొట్టి
సాగేటి సాధన చేయవోయ్!
కర్తవ్యమే.. నీఊపిరిగా మార్చుకు
కలలు..ఋజు వును..కాంతు వోయ్!
పూలదారులు..ముళ్ళబాటలు
ఎదుటగున్నవి..చూడవోయ్!
వెలుగురేఖలుపిలుచుచున్నవి.
వెనుదిరిగి నీవికచూడకోయ్..!
కళ్యాణగౌరి
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
ముందు చూపు ఉండాలోయ్
వెలుగు రేఖ నీకన్నా ముందే వుండునోయ్
పూలు, ముళ్ళు నీకు అడ్డు రావోయ్
లక్ష్య సాధకు ముందుకు సాగాలోయ్
కలలు కళ్ళలని తెలుసుకోవాలోయ్
కర్తవ్యం ఊపిరిగా మార్చుకోవాలోయ్
గుంటనక్కలను తరిమి కొట్టాలోయ్
గుండె నిబ్బరంగా ఉంచి సాగవోయ్
హితోక్తులు నమ్మి మనసు మార్చుకోకోయ్
నీ నమ్మక బలము నీకు తోడుంటుందోయ్
ఎప్పటికప్పుడు నీవు లెక్కలేసు కోవద్దోయ్
ఏరోజుకారోజు హాయి అని తృప్తిగా సాగాలోయ్
గుర్తింపు కోసం పాకులాడుడట ఎందుకోయ్
గుప్పెడు ఆకలి కోసం అబద్దాలాడుటెందుకోయ్
దారితప్పని బ్రతుకు ఆయుర్దాయముపెంచునోయ్
నిర్ణయం, తీర్పు నీదే వెన్ను చూపక వేగపడవోయ్
ఆశకు చిక్కక ఆశయ సాధనకు సాగాలోయ్
పాశానికి చిక్కక కరుణ చూపుతూ సాగాలోయ్
దిశా నిర్దేశం కాలాన్ని బట్టి అనుకరించాలోయ్
త్యాగం, ధర్మమ్, దానం, ప్రేమ నీఆయుధాలోయ్
--((*))--
శీర్షిక: ఎవరు కారణం
రచన్: బిట్రా వెంకట నాగమల్లేశ్వర రావు
చేనేతల కడుపు కొట్టు
దుర్మార్గులు ఎవరురా ?
గాదికింది పందికొక్కు
తెగ బొక్కే మాష్టర్ వీవర్ !
ముసలి కంటి నీరు కార్చు
దొంగ వాడు ఎవరురా?
రాయితీలు మింగేసే
రాజకీయ దళారీ!
నేత బట్ట విలువ చంపు
దుండగీడు ఎవడురా?
మిల్లు సరుకు కలిపి అమ్ము
చౌకబారు వ్యాపారి!
నేతన్నల అర్ధాకలి
కారకుండు ఎవడురా?
శ్రమకు తగ్గ ఫలితమీని
స్వార్ద కుటిల వ్యాపారి!
సంఘాలను స్తాపించే
నవ నాయకులెవరురా?
మేక తోలు కప్పుకున్న
మెగా మాస్టర్ వీవరే!
సబ్సిడీలు భోంచేసే
మహా భోక్తలెవరురా?
సంఘాలకు నాయకులౌ
పెత్తనాల రాయుళ్ళు!
వంద కూలి కార్మికునికి
రెండొందలు వ్యాపారికి
వేలకొద్ది రిటైలరుకు
తినేవాడు తినీ తినీ
విదిల్చింది నేతన్నకు
కొనువానికి కార్మికునకు
మధ్య వాడు తొలగిపోతె
కొనేవాడు నేరుగా
కార్మికునే చేరుకుంటె
దళారీల లాభమంత
కార్మికుడికి మజూరైతె
ఆకలన్న బాధ లేదు
పస్తుండే పనేలేదు
చేనేతకు వున్న విలువ
కలనైనా తరగబోదు
కొనేవారి కొరతెన్నడు
కలియుగాన ఉండబోదు
నాణ్యమైన బట్ట నిచ్చి
నిజాయితీ నిలుపు చాలు
మోసగించు బుద్ధి మాని
అభివృద్ధికి తోడు నిలచి
నేతన్నను వెన్ను తట్టి
నడిపించర ముందుకు.
భారమనుకోయ్
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
మనం మనం ఒక్కటే
మన భావాలు ఒక్కటే
మన ఆశయాలు ఒక్కటే
గుణాన్ని బట్టి నడుచుకుందాం
ఆధునికంలో మారాలి మనం
అంతర భాష నేర్చాలి మనం
సులాభ మార్గమ్ చూడాలి మనం
శ్రమే మన ఆయుధం అని బ్రతుకుదాం
మారుతున్న కాలంతో మారుదాం
మనసు మనసు కలిపి తిరుగుదాం
మనమంతా ఒక్కటేనని చెప్పుదాం
ఎవరు ఎమన్నా స్నేహం మార్చం
వచ్చేది రోబోర్డు ల యుగం
తెబోతుంది మెమరీ కి గాయం
కళ్ళే కమ్పూటర్ అయ్యే వయనం
కాలం బట్టి చేసేది మన ప్రయాణం
నేటి హాస్యం
భార్యలు చెప్పిన మాట వినాలంటే......
మనసుకు నచ్చినట్లు వుండాలంటే....
అటువంటి భార్య దొరకాలంటే ....
"పత్నీం మనోరమాం దేహి మనో వృత్తానుసారిణీమ్,
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్ ".....
అని రోజూ 108 సార్లు చేయాలి ....
మంత్రాలకి చింతకాయలు రాలుతాయాఅంటే
మాఇంట్లో రాలలేదు(చెట్టులేదు.)..
కానీరాలుతాయి..
మూడు వరాలు
ఒకామె అడవిలో వెళుతూ ఉంది. నడుస్తుండగా దారి పక్కగా ఒక కప్ప ముళ్ళ కంపల్లో చిక్కుకుని కనిపించింది. దానికి దగ్గరగా వెళ్ళేసరికి అది మాట్లాడటం ప్రారంభించింది. “నన్ను ఇక్కడి నుంచి తప్పిస్తే నీకు మూడు వరాలిస్తాను” అన్నది. ఆమె అలాగే విడిపించింది.
తర్వాత “విడిపించినందుకు థాంక్స్. అన్నట్టు చెప్పడం మరిచిపోయాను. ఈ మూడు కోరికలకు ఒక షరతు ఉంది” అన్నది కప్ప.
“ఏంటో చెప్పు” అన్నదామె.
“నువ్వు ఏది కోరుకుంటే దానికి పది రెట్లు నీ భర్తకు దక్కుతుంది” అన్నది కప్ప.
“ఓకే నో ప్రాబ్లం”
“నా మొదటి కోరిక: ప్రపంచంలోకెల్లా అత్యంత అందగత్తెను కావాలి నేను”
“బాగా ఆలోచించుకో. నీ భర్త నీ కంటే పది రెట్లు అందగాడవుతాడు మరి”
“అయినా పర్లేదు ప్రపంచం లోకెల్లా నేనే అందగత్తెను కాబట్టి అతనికి నా మీద నుండి దృష్టి ఎక్కడికీ పోదు”. అంతే ఆమె అత్యంత సౌందర్యవతిగా మారిపోయింది.
“నా రెండో కోరిక: ప్రపంచంలో అత్యంత ధనవంతురాల్ని అవ్వాలి”
“మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నీ భర్త నీ కంటే పదిరెట్లు ధనవంతుడవుతాడు.”
“పర్లేదు నా దగ్గరుంటే ఆయ దగ్గర ఉన్నట్లు. ఆయన దగ్గరుంటే నా దగ్గర ఉన్నట్లే కదా”.
“తథాస్తు”
ఆమె అత్యంత ధనవంతురాలైంది.
” నా మూడో కోరిక: నాకు కొంచెం గుండె నొప్పి రావాలి”:-)
ఆనందం ఆరోగ్యం - ఆధ్యాత్మికం
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
ఏవో. ఏవేవో,
లేనిపోని ఆలోచనలు నిన్ను
చుట్టు కుంటాయి
కొందరి ఘోషలు
వినబడు తున్నాయి
గుండెలు విడిపోతున్నాయి
ఎవరో, ఏవరెవరో
తల విరబోసుకు
నగ్నంగా నర్తిస్తున్నారు
ప్రేమగా చూస్తున్నారు
ద్విగ్నంగా ప్రవర్తిస్తున్నారు
అవిగో అవిగవుగో
వికసిస్తున్న పూలు
గగనపు మేఘాలు
కొందరి ఆర్తనాదాలు
మరణించిన యువయోధులు
ప్రవహించిన నెత్తురు మడుగులు
నేడే ఈనాడే, ఈనాడే-
మనస్సుల్లో ఉత్సాహం
మమతల్లో ఆరాటం
నరజాతి విమోచనం
నవజీవనానికి శుభసమయం
వసంతుని ఆర్భాటం
శ్లేషము, ప్రసాదము,
మాధుర్యము, సౌకుమార్యము,
సమత, అర్థదీపనము,
ఔదార్యము, కాంతి,
ఓజస్సు, సమాధి.
ఎదో ఎదో తెలుసుకోలేని
మానవుని జీవితం
--((*))--
నేటి హాస్యం
ప్రాంజలి ప్రభ
మనిషి పొతే....
కొవ్వొత్తి వెలిగిస్తారు!!!
పుట్టిన రోజు కి మాత్రం ....
కొవ్వొత్తి ఆర్పేస్తారు!!
ఎందుకు ??
ఫూలాన్ దేవి , బందిపోటు....
అయినా ఎన్నికలలో గెలిపిస్తారు
కిరణ్ బేడి....ఐ పి ఎస్ పోలీసాఫీసరు..
ఎన్నికలలో ఓడిస్తారు
నాయకుల మాట నమ్మి ఓటేస్తారు
నాయకులను కనీసం అడగలేని వారు
అవునా ..... అవునురా అవునూ
మేము గెలిపిస్తాం, ఓడిస్తాం
ఇది మా ఇష్టమ్
అవునా ..... అవునూ ఆ.... ఆ .....
ఓడి పోకకొనసాగవోయ్..
గోడు వీడి పయనించ వోయ్..
బ్రతుకునీది..బరువునీది
ఎంచుకున్న దారినీది..!
లక్ష్యమన్నది ఎదుట నుండగ
ఆశయం వెన్నాడుచుoది గ..!
కళ్ళముందర మార్గముందిగ
,వెరుపు.వదలిక.కదలిపోవోయ్,!
నిర్ణయం..నీతీర్పు,, నీదోయ్..
వెన్నుచూపక.. వేగపడవోయ్..!
వెనుకనెవ్వరు వెంటరారోయ్
ఒక్కడంటే..ఒక్కడే... !
.
నీభారమంతా.వడివడి గ నీవె
వంటరివి. వదలక మోయవోయ్!
వెన్నుతట్టే.. హితుల పలుకులు
బలముగూర్చును..చింతపడకోయ్!
పక్కచేరిన గుంటనక్కల '' ఛీ '' కొట్టి
సాగేటి సాధన చేయవోయ్!
కర్తవ్యమే.. నీఊపిరిగా మార్చుకు
కలలు..ఋజు వును..కాంతు వోయ్!
పూలదారులు..ముళ్ళబాటలు
ఎదుటగున్నవి..చూడవోయ్!
వెలుగురేఖలుపిలుచుచున్నవి.
వెనుదిరిగి నీవికచూడకోయ్..!
కళ్యాణగౌరి
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
ముందు చూపు ఉండాలోయ్
వెలుగు రేఖ నీకన్నా ముందే వుండునోయ్
పూలు, ముళ్ళు నీకు అడ్డు రావోయ్
లక్ష్య సాధకు ముందుకు సాగాలోయ్
కలలు కళ్ళలని తెలుసుకోవాలోయ్
కర్తవ్యం ఊపిరిగా మార్చుకోవాలోయ్
గుంటనక్కలను తరిమి కొట్టాలోయ్
గుండె నిబ్బరంగా ఉంచి సాగవోయ్
హితోక్తులు నమ్మి మనసు మార్చుకోకోయ్
నీ నమ్మక బలము నీకు తోడుంటుందోయ్
ఎప్పటికప్పుడు నీవు లెక్కలేసు కోవద్దోయ్
ఏరోజుకారోజు హాయి అని తృప్తిగా సాగాలోయ్
గుర్తింపు కోసం పాకులాడుడట ఎందుకోయ్
గుప్పెడు ఆకలి కోసం అబద్దాలాడుటెందుకోయ్
దారితప్పని బ్రతుకు ఆయుర్దాయముపెంచునోయ్
నిర్ణయం, తీర్పు నీదే వెన్ను చూపక వేగపడవోయ్
ఆశకు చిక్కక ఆశయ సాధనకు సాగాలోయ్
పాశానికి చిక్కక కరుణ చూపుతూ సాగాలోయ్
దిశా నిర్దేశం కాలాన్ని బట్టి అనుకరించాలోయ్
త్యాగం, ధర్మమ్, దానం, ప్రేమ నీఆయుధాలోయ్
--((*))--
శీర్షిక: ఎవరు కారణం
రచన్: బిట్రా వెంకట నాగమల్లేశ్వర రావు
చేనేతల కడుపు కొట్టు
దుర్మార్గులు ఎవరురా ?
గాదికింది పందికొక్కు
తెగ బొక్కే మాష్టర్ వీవర్ !
ముసలి కంటి నీరు కార్చు
దొంగ వాడు ఎవరురా?
రాయితీలు మింగేసే
రాజకీయ దళారీ!
నేత బట్ట విలువ చంపు
దుండగీడు ఎవడురా?
మిల్లు సరుకు కలిపి అమ్ము
చౌకబారు వ్యాపారి!
నేతన్నల అర్ధాకలి
కారకుండు ఎవడురా?
శ్రమకు తగ్గ ఫలితమీని
స్వార్ద కుటిల వ్యాపారి!
సంఘాలను స్తాపించే
నవ నాయకులెవరురా?
మేక తోలు కప్పుకున్న
మెగా మాస్టర్ వీవరే!
సబ్సిడీలు భోంచేసే
మహా భోక్తలెవరురా?
సంఘాలకు నాయకులౌ
పెత్తనాల రాయుళ్ళు!
వంద కూలి కార్మికునికి
రెండొందలు వ్యాపారికి
వేలకొద్ది రిటైలరుకు
తినేవాడు తినీ తినీ
విదిల్చింది నేతన్నకు
కొనువానికి కార్మికునకు
మధ్య వాడు తొలగిపోతె
కొనేవాడు నేరుగా
కార్మికునే చేరుకుంటె
దళారీల లాభమంత
కార్మికుడికి మజూరైతె
ఆకలన్న బాధ లేదు
పస్తుండే పనేలేదు
చేనేతకు వున్న విలువ
కలనైనా తరగబోదు
కొనేవారి కొరతెన్నడు
కలియుగాన ఉండబోదు
నాణ్యమైన బట్ట నిచ్చి
నిజాయితీ నిలుపు చాలు
మోసగించు బుద్ధి మాని
అభివృద్ధికి తోడు నిలచి
నేతన్నను వెన్ను తట్టి
నడిపించర ముందుకు.
భారమనుకోయ్
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
మనం మనం ఒక్కటే
మన భావాలు ఒక్కటే
మన ఆశయాలు ఒక్కటే
గుణాన్ని బట్టి నడుచుకుందాం
ఆధునికంలో మారాలి మనం
అంతర భాష నేర్చాలి మనం
సులాభ మార్గమ్ చూడాలి మనం
శ్రమే మన ఆయుధం అని బ్రతుకుదాం
మారుతున్న కాలంతో మారుదాం
మనసు మనసు కలిపి తిరుగుదాం
మనమంతా ఒక్కటేనని చెప్పుదాం
ఎవరు ఎమన్నా స్నేహం మార్చం
వచ్చేది రోబోర్డు ల యుగం
తెబోతుంది మెమరీ కి గాయం
కళ్ళే కమ్పూటర్ అయ్యే వయనం
కాలం బట్టి చేసేది మన ప్రయాణం
నేటి హాస్యం
భార్యలు చెప్పిన మాట వినాలంటే......
మనసుకు నచ్చినట్లు వుండాలంటే....
అటువంటి భార్య దొరకాలంటే ....
"పత్నీం మనోరమాం దేహి మనో వృత్తానుసారిణీమ్,
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్ ".....
అని రోజూ 108 సార్లు చేయాలి ....
మంత్రాలకి చింతకాయలు రాలుతాయాఅంటే
మాఇంట్లో రాలలేదు(చెట్టులేదు.)..
కానీరాలుతాయి..
మూడు వరాలు
ఒకామె అడవిలో వెళుతూ ఉంది. నడుస్తుండగా దారి పక్కగా ఒక కప్ప ముళ్ళ కంపల్లో చిక్కుకుని కనిపించింది. దానికి దగ్గరగా వెళ్ళేసరికి అది మాట్లాడటం ప్రారంభించింది. “నన్ను ఇక్కడి నుంచి తప్పిస్తే నీకు మూడు వరాలిస్తాను” అన్నది. ఆమె అలాగే విడిపించింది.
తర్వాత “విడిపించినందుకు థాంక్స్. అన్నట్టు చెప్పడం మరిచిపోయాను. ఈ మూడు కోరికలకు ఒక షరతు ఉంది” అన్నది కప్ప.
“ఏంటో చెప్పు” అన్నదామె.
“నువ్వు ఏది కోరుకుంటే దానికి పది రెట్లు నీ భర్తకు దక్కుతుంది” అన్నది కప్ప.
“ఓకే నో ప్రాబ్లం”
“నా మొదటి కోరిక: ప్రపంచంలోకెల్లా అత్యంత అందగత్తెను కావాలి నేను”
“బాగా ఆలోచించుకో. నీ భర్త నీ కంటే పది రెట్లు అందగాడవుతాడు మరి”
“అయినా పర్లేదు ప్రపంచం లోకెల్లా నేనే అందగత్తెను కాబట్టి అతనికి నా మీద నుండి దృష్టి ఎక్కడికీ పోదు”. అంతే ఆమె అత్యంత సౌందర్యవతిగా మారిపోయింది.
“నా రెండో కోరిక: ప్రపంచంలో అత్యంత ధనవంతురాల్ని అవ్వాలి”
“మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నీ భర్త నీ కంటే పదిరెట్లు ధనవంతుడవుతాడు.”
“పర్లేదు నా దగ్గరుంటే ఆయ దగ్గర ఉన్నట్లు. ఆయన దగ్గరుంటే నా దగ్గర ఉన్నట్లే కదా”.
“తథాస్తు”
ఆమె అత్యంత ధనవంతురాలైంది.
” నా మూడో కోరిక: నాకు కొంచెం గుండె నొప్పి రావాలి”:-)
| ||||
om
ReplyDelete