ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
ఆనందం - అనారోగ్యం - ఆధ్యాత్మికం
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
ఒకతల్లికి పుట్టిన బిడ్డలం
తండ్రి ప్రేమ నోచుకోని బిడ్డలం
మేము భారతమాత ముద్దు బిడ్డలం
భవ్య చరితమును తెలిపే ఆడు బిడ్డలం
స్వేస్చ కోసం ప్రతిద్వనిస్తున్న బిడ్డలం
ప్రకృతిలో నిర్భందంలో ఉన్న బిడ్డలం
మగధీరుల్ని బ్రతికిస్తున్న బిడ్డలం
ఇనుప సంకెళ్ళకు చిక్క కున్న బిడ్డలం
మనోధైర్యంతో బ్రతకాలనుకున్న బిడ్డలం
ఓర్పు దయా దాక్షన్యము చూపు బిడ్డలం
మానవ మృగాలను వేటాడే బిడ్డలం
పైశాచి కత్వం చూపెవారిని అరికట్టే బిడ్డలం
అర్ధరాత్రి అరాచకత్వం అనిచే ఆడు బిడ్డలం
పిల్లలని అదుపులో ధర్మబుద్ధి నేర్పే బిడ్డలం
బానిసబతుకుకు, వెట్టి చాకిరీకి స్వస్తిచేప్పే బిడ్డలం
స్త్రీ హృదయం లో భయం తరిమే నిర్భయ బిడ్డలం
పెద్దలను, పిల్లలను, అందరినీ బ్రతికించే బిడ్డలం
స్పందనకు, ప్రతిస్పందనకి ఓర్పే ఆయుధం గల బిడ్డలం
--((*))--
|
|
|
ఎక్కడ లేని వాఁడనెద .. =======================
ఉ.
ఎక్కడ లేని వాఁడనెద నిందును నందును నెందు నుండఁగా! నక్కజమంద నెల్లరును నంతట నిండిన వాడెయైననున్ జిక్కఁగఁ బోఁడు చేతికని చింతయు లేక నిమేషమైననున్ మక్కువ మీఱఁ దల్చుకొని మన్నన సేతును సర్వదా హరిన్
చం.
హరికథలానుచుండుటయు హర్షము గూర్చును మెండుగా మదిన్ గురువులు సెప్పఁ గొన్నిటినిఁ గూర్చుని వింటిని శ్రద్ధతోడనే సిరులిడలేదు నాకనుచుఁ జేయక నిందను గోపగించుచున్ దొరికిన దానితోఁ దనిసి తోయజనేత్రునకిత్తు జోతలన్
వరముల నీయ రమ్మనుచుఁ బ్రార్థన సేయను కోరి యాతనిన్ కరుణను జూపఁ జాలనెదఁ గానఁగ వెల్గుల గుండెనందునన్ హరి,హరులిద్దఱొక్కటని యాంతరమందున నెంచు దాననై మఱి మఱి వేడుదున్ విభుని మాప భవమ్మును జన్మలేకిఁకన్
పిలిచిన యంతఁ బల్కునని విందును గాని పరీక్ష సేయ నేఁ దలఁచఁగఁ బోను దర్పమున, దక్కువ సేయను వాని కూర్మియున్ వలసిన జ్ఞానమిమ్మనుచు వాసనలున్ వడి మాసిపోవఁగా సలుపుటయే నుతుల్ సతము, సర్వమెరింగిన దేవదేవుకై
హరిచరణారవిందముల కర్పణ సేయుచు "నేను" భావమున్ హరి! హరి! యంచు నొక్కపరి యన్నను జాలుగ వచ్చి కావఁగా! కరియొకటందె రక్షణను గావఁగఁ గుయ్యిడి యావిధమ్మునే విరివిగ నున్నవా కథలు పెంచఁగ భక్తినిఁ గోరువారికై
చిరుతవయస్సు నందొకఁడు చెప్పె నిరూఢిగ నమ్మకమ్ముగా హరిపద సేవనా గరిమ మందఱు మెచ్చెడి భక్తి భావమున్! ఎఱుఁగని వారలెవ్వరిల నింపయినట్టిది వానిగాథ, తా వరలఁగ మేటి భక్తుడయి ప్రస్తుతులందుచు నేటికిన్ ధరన్
సుప్రభ
కనులు ఎంతగ తడిసినా నీ కలలు జాగ్రత్త హృదయ మెంతగ నలిగినా స్పందనలు జాగ్రత్త
బతుకు ప్రశ్నకు బదులు చెప్పుట కష్టమంటావా ఉచ్చులై మనసులను లాగే వలలు జాగ్రత్త
వడిగ పారే నదివి నీవు ఆగిపోగలవా ఉప్పొంగి దూకి చెడును కడిగే అలలు జాగ్రత్త
గాయమెంతగ కమలినా అనురాగమొలికేవా! ఆనంద సంద్రం చిలికితే ఆ సుధలు జాగ్రత్త
మనసు తె�లియని మనిషితోటి చెలిమి ఎంతో కష్టము రాగాలు తీయని గుండెతో గానాలు జాగ్రత్త
సత్యమే నీ బాట ఐతే శాంతి నీ తోడు శ్యామా! మాయతో ఏమార్చివేసే ఎరలు జాగ్రత్త |
|
|
|
|
|
|
|
|
om
ReplyDelete