Tuesday, 19 June 2018

Pranjali Prabha (24-06-2018)

om sri raam - sri matrenama: - sri krishnyanama:

anandam - aarogyam - aadhyatmikam  నేటి కవిత ( అధిక్షేప ప్రేమ లీల ) -18
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

సంగీత విద్యా బల్ చౌకనాయె - వేదశాస్త్రములు వినసొంపు కాదాయె
భూసురలకును దుర్భుద్ధులు మెండాయె- నల్పుల వైభవము అధికమాయె  
కవితా రసజ్ఞులకు ఆదరణ కరువాయె - ఆర్ధిక దృష్టి అర్ధం అంతు చిక్కదాయె
ఆశ్రమ ఆచార గురు ధర్మములు లేదాయె -  హింసకులంబులు హెచ్చులాయె

పుట్టుక ప్రశస్థం గమనించకపోతే - బ్రతుకు దుర్భరమవుతుంది 
వేశ్య వృత్తికి అలవాటు బడితే - సంపదకు కొరవ అనేది ఉండదు
హెచ్చుతగ్గులు ఆలోచించక - అవని మనుష్యుల అర్ధం చేసుకోగలిగితే 
ఇది వేణుగోపాల ప్రేమ సుమా 
   --((*))--

మగమహారాజులూ ఒక్క విషయం గుర్తుంచుకోండి !!! 
భార్యలు .... 
**పెళ్లి ఐన కొత్తలో... 
మీకు బి జె పి గుర్తు తో పూజ చేస్తారు!!!! 
శ్రీవైదేహసుతన్ భృగూద్వహజయశ్రీ నబ్జభృచ్చాపలీ 
లావాప్తిన్ వరియించి సత్కుశలవత్త్వామూల్యమాంగల్యాదీ 
క్షావాలం బగునాపరిగ్రహయుగం బన్యోన్యహార్దంబునన్ 
సేవింపం దగు రామచంద్రుఁడు శుభశ్రీలిచ్చు మా కెప్పుడున్ 

రామరాజ భూషణుని "హరిశ్చంద్రనలోపాఖ్యానము" (ద్వ్యర్థికావ్యము) ప్రథమ పద్యం 

శ్రీవైదేహసుతన్=లక్ష్మీస్వరూపిణి యైన సీతను, భృగూద్వహజయశ్రీన్=పరశురమజయలక్ష్మిని, అబ్జభృచ్చాప-ఆబ్జ=శంఖము, చంద్రుడు(అబ్జౌ శంఖౌ, శశాంకౌ చ" అని అమరము) భృత్=(శంఖము) భరించునట్టి విష్ణువుయొక్కయు, (చంద్రుని) భరించునట్టి శివునియొక్కయు, చాప=ధనుస్సులయొక్క, లీలావ్యాప్తిన్= విలాసమున బొందుటచేత, వరియించి=ఉంకువ సరిగాజేసి (వరించి యనుట), సత్=శ్రేష్టమైన, కుశలవత్త్వ=కుశలవులు గలుగుటచేతను, సుశలము గలుగుటచేతను, అమూల్యమైన మాంగల్య దీక్షకు=వివాహదీక్షకు, ఆలవాలంబు=ఆటపట్త్టైన, ఆపరిగ్రహయుగంబు=ఆభార్యయుగ్మము, అన్యోన్యహార్ధంబున=పరస్పరమైత్రి చేత, (సత్కుశలవత్త్వము సమముగా నుండుటచే వారిద్దరు నన్యోన్యమైత్రిగలిగి) సేవింపగా, తగు రామచంద్రుఁడు మాకు ఎప్పుడును, శుభశ్రీలు=శుభసంపదలు ఇచ్చునుగాక. అని యాశీర్వాదరూప మంగళము.
చిన్ని శిశువు చిన్ని శిశువు 
అన్నమాచార్య కృతి 

చిన్ని శిశువు చిన్ని శిశువు 
ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు || 

తోయంపు కురులతోడ తూగేటిశిరసు, చింత 
కాయలవంటి జడల గములతోడ 
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ 
పాయక యశోద వెంట పారాడు శిశువు || 

ముద్దుల వ్రేళ్ళాతోడా మొరవంక యుంగరాల 
నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ 
అద్దపు చెక్కుల తోడ అప్పలప్పలనినంత 
గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు || 

బలుపైన పొట్ట మీది పాల చారలతోడ 
నులివేడి వెన్నతిన్న నోరితోడ 
చెలగి నేడిదే వచ్చి శ్రీవేంకటాద్రిపై 
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు ||




***ఆ తరువాత.... 
కాంగ్రెస్ గుర్తు తో ... 
బుగ్గలు ఎరుపెక్కిస్తారు!!! 

****చివరాఖరికి..... 
ఆప్ గుర్తు తో భరతం పడతారు!! 
(శ్రీమతి వసంత శ్రీ గారు ఇచ్చిన స్ఫూర్తి!!)

చూసాను యెన్నడో పరికిణిలో 
వచ్చాయి కొత్తగా సొగసులేవో 
హృదయాన దాచిన పొంగులేవో 
పరువాన పూచిన వన్నెలేవో 
వన్నెల వానల్లో వనరైన జలకాలలో ..

ఈ గీతం పై మీ అభిప్రాయాలు వ్రాయండి, నచ్చితే షేర్ చెయ్యండి 

నీతిశాస్త్రము - పండిత పరిష్కృతము 
శ్లో === సభా కల్పతరుం వన్దే వేద శాఖోపజివిత మ్ 
          శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వాద్భ్రమర శోభితమ్ 

భావము === వేదములనే కొమ్మలచే వ్యాపింప బదినదియు, శాస్త్రములనే పువ్వులచే శోభింప బదినదియు. పండితులనే తుమ్మేదలచే ప్రకాశింప బడినది యునైన సభ అనే కల్ప వృక్షము నకు   నమస్కరించు చున్నాను.


    స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము 
శౌర్యము గల్గు నిద్ధరన్ 

సందర్భము: దేవతలను పిలువా లంటే ఒక పద్ధతి ప్రకారమే పిలువాలి. అడుగా లంటే ఒక పద్ధతి ప్రకారమే అడుగాలి. మంత్ర జపాలకు ఖచ్చితమైన నియమాలూ వున్నవి. పాటించకపోతే బెడిసికొడుతాయి కూడ. 
శ్రీ మతులను ఎలా పిలిచినా సరే! 
(ఒసేవ్! అన్నా పలుకుతూనే వున్నారు కదా! 'ఎక్కడ చచ్చావ్' అన్నా వస్తూనే వున్నారు కదా!) అడుగక ముందే ఇస్తూనే వున్నారు గదా! తమ మాంగల్యం కోసమైనా అన్నీ భర్తలకు సమకూర్చి యిల్లు చక్కదిద్దుకుంటూనే వున్నారు గదా! వ్యసనపరులనూ భరిస్తూనే వున్నారు గదా! 
అందువల్ల లక్ష్మీ సరస్వతీ పార్వతుల కన్న మన గృహిణులే గొప్పవారు కారా! మీరే చెప్పాలి మరి!!! 
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ 
మేలుగఁ బిల్వగా వలయు; 
మేలుగనే యడుగన్ వలెన్ గదా! 
శ్రీ లును విద్య లీయగను 
శ్రేయము లీయగ మువ్వు రమ్మలన్.. 
లీలగఁ బిల్చినన్ బలుక 
లే మన; రిచ్చెద; రింటి దివ్వెలౌ 
స్త్రీలకు మ్రొక్కినన్ ధనము 
శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్ 

మేలుగ పిలవ వలయు - అవినీతి అవినీతి అన్న ఫలితం శూన్యం 
స్త్రీలను గౌరవించ వలయు - అవినీతి అంటే స్త్రీ విలువ శూన్యం 


🖋~డా.వెలుదండ సత్యనారాయణ 
ఏమిటి రాధా యీ వింత 
ఎదలో కలిగిన గిలిగి౦త! 

మనసున పొంగగ వలపంత 
తనువే కోరెను కౌగిలింత! 

విరిసిన కమలమె నీ వదనం 
తిరిగే భ్రమరమె నా హృదయం! 

పున్నమి వెన్నెల నవ్వై కురిసె 
పులకింతలతో మనసే మురిసె! 

అందమంత నీ అభినయ మైతె 
ఆనందమె నా గీతము కాద ! 

ప్రణయ నాదమె వేణు వూదిన 
జగతికి ప్రేమే ప్రాణము పోయద! 

ఏమిటి రాధా యీ వింత 
ఎదలో పొంగిన గిలిగింత! 

శ్రీనివాసమూర్తి గంజాం 

నేటి గీతం 
సిగ్గేస్తుంది అబ్బబ్బ సిగ్గేస్తుంది
నలప బుద్దేస్తుంది
  
నిగనిగ లాడి పచ్చని 
మామిడి పండుని చుస్తే 
కోర మీసమున్న కుఱ్ఱవాడ్ని 
కండలు తిరిగి ఉన్నవాడ్ని 
చూస్తే 
సిగ్గేస్తుంది అబ్బబ్బ సిగ్గేస్తుంది
నలప బుద్దేస్తుంది

నగు మోము కలవాడ్ని 
చిలిపి కన్నుల సోగ్గాడ్ని   
ఆరడుగుల అందగాడ్ని 
చేయి చాచి అడిగేవాణ్ణి
చూస్తే  
సిగ్గేస్తుంది అబ్బబ్బ సిగ్గేస్తుంది
నలప బుద్దేస్తుంది


కొంటె చూపు కుర్రవాడు 
కోర మీస మున్నవాడు 
కోరు కున్న మొనగాడి 
క౦డ లనే చూస్తుంటే.... 
సిగ్గేస్తుంది నాకు సిగ్గేస్తుంది! 

చంద్రు డంత అందగాడు 
చిరు నవ్వుల మోము వాడు 
చిలిపి కనుల సోగ్గాడు 
చేయి చాచి అడుగుతుంటే.. 
సిగ్గేస్తుంది నాకు సిగ్గేస్తుంది! 

చేతి లోన చెయ్యి వేసి 
అడుగులోన అడుగు వేసి 
ఆలి గా అతని వెంట 
అత్త గారి౦టి కెళ్ల.... 
సిగ్గేస్తుంది నాకు సిగ్గేస్తుంది! 

తొలి రేయి ముచ్చటల 
తొంగి చూచు బిడియాల 
ముద్దు మురిపాల నడుమ 
మాల్లె పూల పాన్పు చూడ... 
సిగ్గేస్తుంది నాకు సిగ్గేస్తుంది! 

కన్నెపిల్ల కన్నులలో 
కనిపించె ఆ సిగ్గులు 
కన్నవారి మనసులొ 
కాంతి నింపు దీపాలై! 

శ్రీనివాసమూర్తి గంజాం 

--((**))--



~ ఖాళీ పంజరం ~

కనుదోయి అంచులకంటిన కాటుకలా నల్లగా పరిమళిస్తూ
కోట్ల హృదయాలని కొల్లగొట్టిన ఆనందంతో
కమ్మగా నవ్వుకుంటున్నట్లుంది ఎక్కడెక్కడి చీకటి

వెలుతురు కప్పుకున్నామనుకున్న శరీరాలకి
లోలోన నిలువెత్తుగా పేరుకుపోయిన
తిమిరపు శేవధులు గోచరించవు
జీవితాన్ని తల్లకిందులు చేసే వరకూ

నువ్వు శ్వాసించిన క్షణాలన్నీ శిధిలాలుగా
చరిత్రను విప్పి చెబుతుంటే
ఈ మట్టి చూసిన ప్రతి మరణ శాసనం
నీ లిఖితమేనన్న చిహ్నం
నీలో ఇంకా పదిలంగా ఉంచుకున్నావ్ చూడూ…
ఓ మనిషీ
శతాబ్దాలుగా మనసులన్నిటినీ
మభ్యపెడుతున్న ఇంద్రజాలికుడివి నువ్వు

ఏయ్… మనిషీ
నువ్వెంతటి మాయావివైనా సరే
కొన్ని స్వచ్ఛతా చూపులు వెంటాడినప్పుడు
నీలో నుండి నువ్వు నిర్దోషిగా బయటకి రాలేవు

నవ్వొస్తేనే నవ్వేంత
ఏడుపొస్తేనే ఏడ్చేంత స్వచ్ఛత ఆవరించినప్పుడు
ఏడవగలిగినంత దుఃఖం
నవ్వగలిగినంత సంతోషం కన్నా
జీవితానికి పెద్ద కోరికల భారమేమీ లేనప్పుడు
పంజరం ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది
అనంతంగా స్వేచ్ఛను పాడుకుంటూ

మన Sandhya Gollamudi.. గారు కట్టిన దండ.!
.
చెతన్ చె,తొడన్ తో. హహహహహహహహహ.
చెతన్ ని , నీతొ తొడుకు పోతావా!!
పట్టుకు పొ. అచ్చు కు ,హల్లు పరం బైనప్పుడు!
ఏమవుతుంది. పరంబా !!!
బాగుంది ,జగదంబ విన్నాము కాని , పరంబ !!! వినలేదు. .
ఉత్పల మాల,చెంపక మాల.!!
చెంపకాలు చూసినాము సారు,
ఉత్పలాలంటే?? అర్ధమయుంది . ఉమ్మెత్త పూలా ?
కొయ్యంగానే,వాడి పొతాయె!! మాల ఎట్టగబ్బా !
సంధులు,గొందులు, బానెదిప్పినావ్.
*******************************************
సంధ్య గొల్లమూడి గారికి కృతజ్ఞతలతో..
బాపూరమణీయలోగిలి నుంచిదొంగిలించాను.. చాలబాగుంది..
మీరుభావుకలోపోస్ట్ చెయ్యకపోవడం భావ్యంకాదు..
ఆణిముత్యాలు అందరికీ పంచాలి... మరి.
లేకుంటే ఇలా ఘరానా గజదొంగలయ్యే ప్రమాదం మాకు..ప్రమోదంమీకు......
దొంగలించినందుకు... మన్నింపులు......

ఆ ఒక్కటి......

ఆకాశం అక్షరాలను కురిపిస్తే
ఆ అక్షర ఝరీ ప్రవాహంతో
అవనితల్లి పులకరించదా!!

అడుగడుగునా అక్షర కాసారాలై
అక్షర సేద్యాన అక్షర పైరులైతే
అక్షర సిరులే పంటలుగావా!!

ప్రవహించే ప్రవాహాలు
కలిసిన వారాసీ
ఓ అక్షరాంభుధైతే
జనమంతా ..........

అక్షరవాహినిల్లో తడుస్తూ.....
అక్షర కడలిలొ మునుగుతూ
అక్షర జ్ఞానులై విజ్ఞానఖను
లౌతారని కలలు కంటూన్న నాకు....

నాలోని .......,
మరోనేను
పకపకానవ్వింది...

క్షయమైపోయే నీటి చుక్కనే రాల్చలేని ఆకాశం ......
అక్షయమైన అక్షరాన్ని
కురిపిస్తుందా?......
అంటు నవ్వింది

మళ్ళీ నవ్వింది...
మళ్ళి మళ్ళీ నవ్వింది....,
అలా నవ్వుతుంటే
దాని కళ్ళల్లొకి నీళ్ళొస్తే.....
ఆ కన్నీటిని చూసిన
మరో నాకు చిరాకెత్తు కొచ్చింది.
ఎందుకా నవ్వో అర్థం కాక........

.అప్పుడు చెప్పింది

అక్షరాల్లో మునిగి
అక్షరాన్నొంటబట్టించు
కున్నోళ్ళంతా జ్ఞానులు
అనుకునే నీ అజ్ఞానానికి నవ్వుతున్నా...,...

మనిషికి అక్షరమొకటే సరిపోదు
అక్షరానికి మించిన అలంకారం
అదేకావాలి మనకు సంస్కారం

సంస్కారమున్నవాడే జ్ఞాని
ఆ ఒక్కటి మరిచి అక్షరాలవెంట
బడితే వాడు అజ్ఞాని...... అసురుడు....,

చీడపురుగవుతాడు ద్రోహియౌతాడు
యావజ్జాతి వినాశకుడౌతాడు

నల్ల గా వున అమ్మాయి..
"ఎంజల్ "

లావు పాటి అబ్బాయిలు....
"స్మార్ట్ బాబీ"

పిరికి అబ్బాయిలు....
"కిల్లర్"
45 సం.ల ఆంటి....
"కుశ్బూ"

55 సం.ల వాళ్లు....
హ(,,,,ఆయన సంగతి నాకెన్దుకులెండి!!!!

కత్ఆత్ (కత్అ లు)
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ

మళ్ళీ మళ్ళీ రాని రోజు
మరచి పోయిన రోజు
మళ్ళీ మళ్ళీ వచ్చే రోజు
మనసున కదిలించిన రోజు

మళ్ళీ మళ్ళీ నచ్చే రోజు
దాహాన్ని తీర్చే రోజు
మల్లె మళ్ళీ మెచ్చేరోజు 
ఆకలి తగ్గించిణ రోజు

మళ్ళీ మళ్ళీ తపించే రోజు
ఎడబాటు గుర్తించిన రోజు
మళ్ళీ మళ్ళీ యాచించే రోజు
కోరిక స్మరణ తీర్చే రోజు

మళ్ళీ మళ్ళీ ప్రేమించే రోజు
బిడ్డలా ప్రేమను పొందే రోజు
మళ్ళీ మళ్ళీ ద్వేషించే రోజు
ఆశకు చిక్కి అల్లాడిన రోజు

మళ్ళీ మళ్ళీ మండి పడ్డ రోజు
కోపాన్ని రెచ్చ కొట్టిన రోజు
మళ్ళీ మళ్ళీ చదివిన రోజు
సుందరాకాండ పరాయణ రోజు

మళ్ళీ మళ్ళీ పూజించిన రోజు
కల్ముషములేని మనసున్న రోజు
మళ్ళీ మళ్ళీ ప్రార్ధించిన రోజు
తల్లితండ్రుల పాదసేవచేసిన రోజు

--((*))-- 
   
1
రగులుతోంది మనసులో అగ్నిలా తపన
ఆగి పోవడం లేదు కోరికల స్మరణ
మనసు, మెదడు తమ పనులను చేస్తున్నాయి
మనిషి కాలుతున్నాడు బ్రతకడం వలన

2
ఉద్గ్రంథాలు ఎన్నో ఎన్నెన్నో వచ్చాయి
ఉవాచలు ఎన్నో ఎన్నెన్నో అందాయి
చాలా కాలంగా పిలుస్తున్నా, సిసలైన
మంచి పనులు మనకు దూరంగానే ఉన్నాయి

3
పంథా లెన్నిటినో పట్టుకున్నాడు
రోజూ ప్రయత్నాలను చేస్తున్నాడు
పడిపోయే వఱకూ సాగుతున్నాడు
మనిషి పయనంలో ఇరుక్కునాడు

4
చెడ్డతనం వల్ల గడ్డు రోజులొచ్చాయి
అడ్డదారులవల్ల ఆపదలు కలిగాయి
పట్టిన చెద పుఱుగులయ్యాయి, పరిస్థితులు
బ్రతుకుల పుస్తకాలను అవి తింటున్నాయి

5
తన అవసరాలకు తానే బానిస అయ్యాడు మనిషి
తన పనులకు తాను బలి పశువై పోతున్నాడు మనిషి
ఆఱిపోని ఆశల అగ్నిలో కాలుతున్నది మనసు
తన తీరుతో తానే నుసిగా రాలుతున్నాడు మనిషి

రోచిష్మాన్

నేటికవిత
ప్రాంజలి ప్రభ
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం

పువ్వు వైనానీవె, సాహస స్పూర్తివైనా నీవే
సహనానికి పేరు నీదే, ఘనకీర్తికి మరోపేరు నీదే
ఓర్పు వహించి, నిగ్రహాన్ని పెంచే స్త్రీవి నీవే
రాతలలో ఘనత నీదే, మాటలలో నేర్ప నీదే

అందుకే స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం

స్త్రీ అణకువ తనాన్ని చులకచేయుట ఎందుకు
స్త్రీని చూసి నిర్మల హ్రదయంతో సాగు ముందుకు
స్త్రీ సీలాన్ని పరీక్ష చేసి వేదించుట ఎందుకు
స్త్రీని ఎప్పుడు అవమానించి సాగలేవు ముందుకు

స్త్రీ గౌరవాన్ని నలుగురిలో చులకన ఎందుకు
స్త్రీని అందరిముందు ఆదరంచుట మరువకు
స్త్రీ శ్రమలో శ్రవంతి అంటూ హింసించుట ఎందుకు
స్త్రీకి శ్రమలో సహాయపడి ఆనందించుట మరువకు

అందుకే స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం
--((**))--

No comments:

Post a Comment