Tuesday, 5 June 2018

Pranjali pabha (26)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: - శ్రీ కృష్ణాయ నమ:
Photo

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

నీకోసం లొంగాననుకోకు,
నీకోసం తగ్గాననుకోకు 
మౌఖికంగా ఉన్నాననుకోకు 
ఇది నీ అభ్యుదయం కొరకే 

నీ తరుణంకు అడ్డునుకోకు 
నీ నవ్వులకు చేదనుకోకు 
నీ భాషలకు బంధం అనుకోకు 
ఇది నీ అభ్యుదయం కొరకే

నీ స్నేహముకు అడ్డుఅనుకోకు 
నీ సేవకు సమయ మనుకోకు 
నీ విద్యకు నేను అడ్డుఅనుకోకు 
ఇది నీ అభ్యుదయం కొరకే

నీ వయసుకు సరిపోననుకోకు 
నీ మనసుకు పనికిరాననుకోకు 
నీ సొగసుకు సరిగాననుకోకు 
ఇది నీ అభ్యుదయం కొరకే
--((*))--

మూసిన ముత్యాల కేలె మొఱగులు - ఆసల చిత్తాన కేలే అలవోకలు 
//ప// మూసిన ముత్యాల కేలె మొఱగులు 
ఆసల చిత్తాన కేలే అలవోకలు 
//చ// కందులేని మోముకేలే కస్తూరి 
చిందు నీకొప్పున కేలే చేమంతులు 
మందయానమున కేలే మట్టెల మోత 
గందమేలే పైపై కమ్మని నీమేనికి 
//చ// భారపు గుబ్బల కేలే పయ్యద నీ 
బీరపు చూపుల కేలే పెడమోము 
జీరల బుజాల కేలే చెమటలు నీ 
గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు 
//చ// ముద్దుల మాటల కేలే ముదములు నీ 
యద్దపు జెక్కుల కేలే అరవిరులు 
వొద్దిక మాటల కేలే వూర్పులు నీకు 
నద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి 
ముఖ్యపదాల అర్ధం: 
ఆస: ఆశ 
చిత్తము: మనస్సు 
అలవోక: వేడుక, లీల 
కందులేని: నల్లని మచ్చలు లేని 
మోము: మొగము 
చిందు: కదులు 
మందయానము: మందమైన నడక 
మేని: శరీరము 
గుబ్బలు: వక్షములు 
పయ్యెద: పైట 
పెడమోము: ముఖము తిప్పుకొను The face turned away 
ముదము: సంతోషము 
అరవిరులు: సగం నిడిచిన పువ్వులు 
భావం: 
ముత్యపు చిప్పలో దాగి ఉండే ముత్యాలకి మెరగులెందుకు? ఆశపడే మనస్సుకి ఇంకా చపలత్వం కూడా దేనికి? ఈ పైపై మెరుగులు నీకు అవసరంలేదమ్మా! నీవు శ్రీవేంకటేశుని అర్ధాంగివి... 
పరిపూర్ణమైన నీ ముఖానికి కస్తూరీ తిలకం పెట్టి కొత్తగా అందం తేవాలా? 
అటూ, ఇటూ ఊగే నీ కొప్పులో అసలు పువ్వులుంటాయా? మరి ఆ మాత్రానికి చామంతులెందుకు? 
స్వామి ముందుకు వచ్చేడప్పటికి సిగ్గుతో మెల్లగా నడుస్తావు. అంత మాత్రానికి కాలికి మట్టెలు పెట్టుకోవడం దేనికి? 
సహజంగా సువాసనలు వెదజల్లే నీ శరీరానికి ఆ గంధపు పూతలెందుకు? 
అసలే బరువైన పయోధరాలు నీవి. పైన ఆ పైట బరువు కూడా ఎందుకు?. 
స్వామివారి కళ్ళలోకి చూడలేక ఆ ముఖం తిప్పుకోవడం దేనికి? 
ఆ భుజాల పైకి చీర కొంగును కప్పేస్తే చెమటలు పట్టకుండా ఉంటాయా? 
గోరింటాకు పెట్టుకుని ఎర్రగా, ముద్దుగా ఉన్న ఆ పదునైన గోళ్ళకి ఇంకా అలంకారాలెందుకు? 
నీ మాటలే ముద్దులొలుకుతుంటాయి. ఇంకా వాటికి నవ్వు ఎందుకు పులమడం? 
నీ చెక్కిళ్ళు అద్దాల్లా నున్నగా ఉంటాయి, వాటికి ఆ పూరేకులు అదమడం ఎందుకు? 
నీవు శ్రీవేంకటేశుని అర్ధాంగివి. ఆయన నీపై ఎప్పుడూ ఆశని కలిగి ఉంటాడు. నువ్వు వెళ్ళేది మన్మధునికి తండ్రి దగ్గరకి.. ఆయన కౌగిలిలో ఉంటే అసలు నీకు ఊపిరైనా ఆడుతుందా? ఈ పైపై మెరుగులు నీకెందుకమ్మా?

పాత జ్ఞాపకాల పునాదులపై, 
కట్టబడిన అనుభవాలకోట 
బీటలు వారిన రహదారుల 
అనుభవాల నిర్లిప్తత 
గడచిన కాలపు 
చేదు నిజాలకు 
పొడిబారిన కళ్ళే సాక్ష్యం- 
వదిలేసిన నిన్నలో 

మరలిరాని ఒక్కరోజునైనా- 
వేడుతున్న విధిని 
బంధాలలోని చిక్కుముడుల 
వేదనా,బాధ ఇప్పటికి విడదీసి, 
వేరెవరికీ రుచి చూపించొద్దనీ , 
మరల పంచొద్దనీ ... 

ఈనాటి కష్మలమేదో 
ఇప్పుడే మరచిపోవాలని. 
గతమేదో పాతరేసి 
తిరగతోడ నివ్వక 
కొంగ్రొత్త ఆశ మదిలో నింపి 
మరల జీవించేలా 
ఉత్తెజాన్నివ్వాలి. 

చిమ్మిన కష్మలమేదోవెంట రానివ్వొద్దని.. 
క్రొత్త ఆశలేవో చిగురు లెత్తనిమ్మని.. 
కొత్త జీవనానికి ఊపిరులూదాలని, 
చిత్తమందు ఉత్తేజం..చిందులేయ రమ్మని.. 
కొత్తపిలుపు లేవేవో..గమ్మత్తుగ వినిపించాలని... 
ఇలలో నవ వేకువ నాలో చైతన్యం నింపాలని.... 
ప్రతి హృది లో ఎపుడొ ..ఓనాడిలా.. 
గతానికి పూత పూయు.. 
కొత్త మందు కావాలి..... 

*వసంతశ్రీ ., 
19.5.16.

సింధూరపూ పూదోటలో చిన్నారి ఓ పాపా...ఏ పాపమో ఆ తోటలో వేసిందిలే పాగా 

చిత్రం: కిల్లర్ (1993) 
సంగీతం: ఇళయరాజా 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: బాలు, చిత్ర 

పల్లవి: 

సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా 
ఏ పాపమో.. ఆ తోటలో.. వేసిందిలే పాగా 
ఏమని నే పాడనులే 
ప్రేమకు తానోడెనులే..ఏ..ఏ.. 
ఆ కథ ఎందుకులే..ఏ.. 

చరణం 1: 

తనువే.. కధలల్లే.. కనుపాపే నా బొమ్మగా 
మనసే.. తెరతీసే.. పసిపాపే మా అమ్మగా 
కనులు పగలు కాసే.. చల్లని వెన్నెల కాగా 
చిలక పలకగానే.. గూటికి గుండెలు మ్రోగ 
విధి చదరంగంలో.. విష రణరంగంలో 
గెలవలేని ఆటే.. ఎన్నడు పాడని పాట 

చరణం 2: 

రాబందే కాదా.. ఆ రామయ్యకు బంధువు 
సీతమ్మను విరహాలే.. దాటించిన సేతువు 
కోవెల చేరిన దీపం.. దేవుడి హారతి కాదా 
చీకటి మూగిన చోటే.. వేకువ వెన్నెల రాదా 
ఈతడు మా తోడై.. ఈశ్వరుడే వీడై.. 
కలిసి ఉంటే చాలూ.. వేయి వసంతాలూ 

సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా 
పాపనికే.. మా తోటలో.. లేదందిలే జాగా 

https://www.youtube.com/watch?v=PEvJ32XXQt8
Killer Movie || Sindhura Puvvu Video Song || Nagarjuna, Nagma
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...

అమ్మాయి ముద్దు ఇవ్వందే.. ఈ రేయి తెల్లవారనివ్వనంతే... 

చిత్రం: క్షణం క్షణం (1991) 
సంగీతం: కీరవాణి 
గీతరచయిత: సిరివెన్నెల 
నేపధ్య గానం: బాలు, చిత్ర 

పల్లవి : 

అమ్మాయి ముద్దు ఇవ్వందే.. ఈ రేయి తెల్లవారనివ్వనంతే 
అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే.. అమ్మమ్మమ్మమ్మో గొడవలే 
ముద్దిమ్మంది బుగ్గ...వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా 
ముద్దిమ్మంటే బుగ్గ...అగ్గల్లే వస్తే ఆపేదెట్ట హద్దూ పద్దు వద్దా 

చరణం 1 : 

మొజు లేదనకు.. ఉందనుకో ఇందరిలో ఎలా మనకు 
మోగిపొమ్మనకూ... చీకటిలో ఇద్దరమే ఉన్నమనుకో 
చూడదా సహించని వెన్నెల 
దహించిన కన్నులా 
కళ్ళు మూసేసుకో హయిగా 

చరణం 2 : 

పారిపోను కదా.. అది సరే అసలు కథ అవ్వాలి కదా 
యేది ఆ సరదా.. అన్నిటికీ సిద్ధపడే వచ్చాను కదా 
అందుకే అటు ఇటు చూడకు.. 
సుఖాలను వీడకు 
తొందరేముందిలే విందుకు 

https://www.youtube.com/watch?v=obsY6NfM0Og
Kshana క్ష
శ్యామలా దండకం.! 

ధ్యానమ్- 
మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ | 
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || ౧ || 
చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే | 
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః || ౨ || 
వినియోగః- 
మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ | 
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || ౩ || 
స్తుతి- 
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే | 
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || ౪ || 
దండకమ్- 
జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే, సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే, శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే, ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే, వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే, దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే, స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే కాలికే ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే, 
సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవావిర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్యోతమానానవద్యాంగశోభే శుభే, రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే వాసరారంభవేలాసముజ్జృంభ 
మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే, 
తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే, హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే, చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్శించినీడంబరే దివ్యరత్నాంబరే, 
పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార జంఘాలతే చారులీలాగతే నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే, 
సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే, భైరవీ సంవృతే పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే, శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే, 
పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్తియః పూరుషాః యేన వా శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే, కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం, 
సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః || 
https://www.youtube.com/watch?v=wmpBgBfYzNk
నిన్ను తలవని వాడు 
ఇంజనీరే కాడు 
ఇకపైన మనలేడు 
ఓ గూగులమ్మా! 
తలచినంతనె నీవు 
ప్రత్యక్షమౌతావు 
జగమెల్ల నీ తావు 
ఓ గూగులమ్మా! 
గాలించి లోకాలు 
గుదిగుచ్చి విషయాలు 
చేయుచుంటివి మేలు 
ఓ గూగులమ్మా! 
పలుకంగ నీ పేరు 
మా పనులు నెరవేరు 
గ్రామదేవత తీరు 
ఓ గూగులమ్మా! 
నుడువంగ నీ కీర్తి 
ఆరుద్ర యే స్పూర్తి 
రానారె విద్యార్థి 
ఓ గూగులమ్మా! 
(యర్రపురెడ్డి రామనాధరెడ్డి)


Image may contain: 1 person, drawing



ॐॐॐ
అక్షర ఙ్ఞానం లేదురా రామా నీ నామ స్మరణ వినా

మొక్షమునకు వారధైన నీదు చరితమును రచింప నేరగ

లక్షల పలుకులు గలిగిన వ్రాయ మహిమలు యేరుగను

సాక్షాత్కరించీ రచింప సారధి గాక తప్పదయ్యా నీ ఘనత

దక్షిణగా నాకివ్వగ " ఘంటము " నిరాటంకముగ నీ రచనలే

వీక్షణ మరల్చక నిరతము నా శిర కరముల పై నీ ధ్యానము

లక్షణమైన నీదు చరితమున తప్పులు దొరలక కావవయ్య

కుక్షింభరుడ గానురా నా ఘనత లోకమునకు జూప గొప్పగ

పక్షినై నీ అన్వేషణ నీదు లీలల సంగ్రాహ్యామును వివరించ లోకమునకు

కాంక్ష గాదురా లోక పూజలందుగొనుట నా మనంబు నెన్నటికి

సాక్షిగా నీ బంటునై నీ పాదాశ్రయములు గోర సేవకుడనేరా,,

కక్ష్య గట్టి కలి నా హృద్మందిరమును కకా వికలము జేయగ జూచె

లక్ష్మీపతి జానకీశుడవై నీదు చరితములెల్ల రచింప విరించీ ( బ్రహ్మ )

దక్షతను నాకుఅనుగ్రహించి బ్రోవరా ప్రభూ,,,,,,, శ్రీహరి,,,

రక్షణ నీదేరా రమా రమణుడా ,,,రఘువంశ తిలకుడా రామా

హరిఃఓం హరిఃఓం హరిఃఓం



*గురుస్తోత్రం*[?] 





అఖండ మండలాకారం 
వ్యాప్తం యేన చరాచరమ్ | 
తత్పదం దర్శితం యేన 
తస్మై శ్రీగురవే నమః || 1 ll 

అఙ్ఞానతిమిరాంధస్య 
ఙ్ఞానాంజన శలాకయా | 
చక్షురున్మీలితం యేన 
తస్మై శ్రీగురవే నమః || 2 || 

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః 
గురుర్దేవో మహేశ్వరః | 
గురురేవ పరంబ్రహ్మ 
తస్మై శ్రీగురవే నమః || 3 || 

స్థావరం జంగమం వ్యాప్తం 
యత్కించిత్సచరాచరమ్ | 
తత్పదం దర్శితం యేన 
తస్మై శ్రీగురవే నమః || 4 || 

చిన్మయం వ్యాపియత్సర్వం 
త్రైలోక్యం సచరాచరమ్ | 
తత్పదం దర్శితం యేన 
తస్మై శ్రీగురవే నమః || 5 || 

సర్వశ్రుతి శిరోరత్న 
విరాజిత పదాంబుజః | 
వేదాంతాంబుజసూర్యోయః 
తస్మై శ్రీగురవే నమః || 6 || 

చైతన్యః శాశ్వతఃశాంతో 
వ్యోమాతీతో నిరంజనః | 
బిందునాద కలాతీతః 
తస్మై శ్రీగురవే నమః || 7 || 

ఙ్ఞానశక్తిసమారూఢః 
తత్త్వమాలావిభూషితః | 
భుక్తిముక్తిప్రదాతా చ 
తస్మై శ్రీగురవే నమః || 8 || 

అనేకజన్మసంప్రాప్త 
కర్మబంధవిదాహినే | 
ఆత్మఙ్ఞానప్రదానేన 
తస్మై శ్రీగురవే నమః || 9 || 

శోషణం భవసింధోశ్చ 
ఙ్ఞాపణం సారసంపదః | 
గురోః పాదోదకం సమ్యక్ 
తస్మై శ్రీగురవే నమః || 10 || 

న గురోరధికం తత్త్వం 
న గురోరధికం తపః | 
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి 
తస్మై శ్రీగురవే నమః || 11 || 

మన్నాథః శ్రీజగన్నాథః 
మద్గురుః శ్రీజగద్గురుః | 
మదాత్మా సర్వభూతాత్మా 
తస్మై శ్రీగురవే నమః || 12 || 

గురురాదిరనాదిశ్చ 
గురుః పరమదైవతమ్ | 
గురోః పరతరం నాస్తి 
తస్మై శ్రీగురవే నమః || 13 || 

త్వమేవ మాతాచ పితా త్వమే వ 
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ | 
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ 
త్వమేవ సర్వం మమ దేవ దేవ || 
**********************

శ్రీమదధ్యాత్మ రామాయణము, అయోధ్యకాండ (పండిత నేమాని రామజోగి సన్యాసిరావు) : 

కులగురువు వసిష్ఠమహర్షి శ్రీరామునితో సంభాషించుట: 

దశరథమహారాజు తన జ్యేష్ఠపుత్రుడైన రామచంద్రునికి రాజ్యపట్టాభిషేకము చేయ నిశ్చయించుకుని, ఆ విషయమును గురుదేవునికి, సుమంత్రునకు చెప్పి, వారి సమ్మతిని పొందినాడు. నగరమంతా అలంకరించమని ఆదేశములు జారీ చేసినాడు..... ఈ సంగతిని స్వయముగా రాఘవునికి తెలుపుటకు వసిష్ఠుడు, శ్రీరాముని మందిరమునకు విచ్చేశాడు. సతీసమేతముగా గురుదేవుణ్ణి స్వాగతించిన రఘుకులతిలకుడు, ఆయనకు పాదప్రక్షాళనం చేసి, ఆ పాదతీర్థమును తన తలపైన మరియు సీతాదేవి శిరము పైన చిలకరించాడు. ఆ తర్వాత వారి ఆగమనమునకు కారణం తెలుపవలసిందని కోరగా, వసిష్ఠమహర్షి ఇలా అంటున్నాడు. 

"నిను, కమలామనోహరుని, నీరజపత్రవిశాలలోచనున్, 
దనుజగణ ప్రణాశకుని, ధర్మ సముద్ధరణాశయున్ జనా 
ర్దనునిగ నే నెఱుంగుదును; తద్దయు లౌకికధర్మ పద్ధతిన్ 
నను గురుడంచుఁ గొల్చుచు మన మ్మలరించెద వో సనాతనా!" 

అర్థములు: కమలామనోహరుడు = కమలాలయ అగు లక్ష్మీదేవి యొక్క నాథుడైన విష్ణుమూర్తి; నీరజపత్ర విశాల లోచనుడు = పద్మదళముల వంటి విశాలమైన నేత్రములు కలవాడు; దనుజగణ ప్రణాశకుడు = రాక్షససమూహమును నశింపజేయువాడు; ధర్మ సముద్ధరణాశయుండు = ధర్మమును ఉద్ధరించవలెనను ఆశయము కలిగినవాడు; జనార్దనుడు = ప్రజలను కాపాడువాడు; తద్దయు = ఐనప్పటికి; కొల్చుచు = సేవించుచు; మనమ్ము = మనస్సు; అలరించెదవు = సంతోషపెట్టెదవు; సనాతనుడు = ప్రాచీనుడు, ఆద్యంతములు లేనివాడు. 

భావము: "ఆద్యంతరహితుడవైన ఓ పరంధామా! సనాతనా! నీవు శ్రీమన్నారాయణుడవనీ, దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసి ఈ వసుధపై ధర్మస్థాపన చేయగలవాడవనీ నాకు తెలుసును తండ్రీ! ఐనను, ఈ లోకాచారమును అనుసరించి నీవు నన్ను గురువుగా సంభావిస్తూ, హృదయమునకు ఎంతో మోదమును కలిగిస్తున్నావు సుమా!" అంటున్నాడు వసిష్ఠుడు. 

"రావణముఖ్యులైన బహు రాక్షసవీరుల సంహరించుచున్, 
దేవనికాయ కష్టములు దీర్చుచు, కూర్చుచు శాంతిసౌఖ్యముల్, 
పావనచిత్తులై చెలగు భక్తుల కండగ నిల్చి, ధర్మమున్ 
బ్రోవగ పృథ్విఁ జేరితివి మోక్షఫలప్రద! పూరుషోత్తమా!" 

అర్థములు: దేవనికాయము = దేవతల సమూహము; పావనచిత్తులు = పవిత్రమైన మనసు కలవారు; బ్రోవగ = రక్షించుటకు; పృథివి = భూమి; మోక్షఫలప్రద = మోక్షమును అనుగ్రహించువాడా; పూరుషోత్తమా = పురుషులందరిలోకి ఉత్తముడా! 

భావము: "దేవా! పురుషోత్తమా! రావణుడు మున్నగు దానవులను సంహరించి, సురబృందము యొక్క కడగండ్లను తీర్చి, వారికి శాంతిసుఖములను ప్రసాదించి, పావనహృదయులైన నీ భక్తులందరికీ అండగా నిలుచుటకు, ధర్మమును కాపాడుటకు నీవు ఈ అవనిపై అవతరించావు స్వామీ" అంటున్నాడు వసిష్ఠమహర్షి.

*పక్షుల సంభాషణలు  
మానవుల గురించి 

సూటిగా కళ్ళలోకి చూస్తే 
కళ్ళు పసిపాప చూపులుగా మారుతాయి 
చెంపలు చేతులతో తట్టుతూ ఉంటే
చెంపలు పసిపాప ముద్దాడి నట్లుంటాయి 

సూటిగా గొంతు విప్పి మాట్లాడితే
మాటలు పసి పాప ఏడుపులా మారి పోతాయి
శాంతంగా నవ్వుతూ పలకరిస్తే 
అమాయకంగా ముద్దుగా మాటలు మారుతాయి

చిలిపి మాటలతో ఉడికిస్తే  
ఎప్పుడు చూడని కొత్త ప్రేమలు పుట్టు కొస్తాయి   
ఏడువు మొహంతో ఏడిపిస్తే
అరుపులు గదిలో చిక్కిన పిల్లిలా అరుస్తాయి     

ఓదార్పు మాటలు వెంబడిస్తే 
అహంకారం అడ్డు వచ్చి మాటలు వినలేనంటాయి 
ఖర్చుమాటలు తెలియ చేస్తే
బీదరికం మాటలు వద్దనకుండా వచ్చేస్తాయి 

పుట్టిన రోజని గుర్తు చేస్తే 
ఖర్చు క్లుప్తముగా చేయుట అలవాటవుతాయి 
పెళ్లి రోజు గుర్తు చేస్తే 
తనస్తోమత గుర్తు చేసి కొత్తవి కొందామంటాయి 

దాన ధర్మాలు చేయమంటే 
మనసును నొ ప్పింపని దానం చేయమని చెపుతాయి   
ఆబ్దికం గుర్తు చేస్తే 
శక్తి కొద్దీ పెద్దలును తలుచుకో మని చెపుతాయి

Image may contain: one or more people



ॐॐॐ

రాయిరప్పల చెట్టు పుట్టలలో రామ ధ్యానములేలరా హనుమ

ఓయి నా మది రామాలయమే,,అందు మూల విరాట్ రాముడే

వేయి నామముల అర్చనకు అర్చకుడు లేక రామయ్య అలిగె

మాయా జీవనంతో మలినములు చేరి రాముడు మలినమాయే

వాయుపుత్రా నా జీవన పర్యంతము తోడై పరిమళ అనుభవ

మయిన పుష్పములతో రామయ్యను సేవింపరా,,,,,నీకు

భత్యముగా నీ భజనలు రామయ్య గాధా చరితలు
నిత్య స్మరణలు జేసెదరా

పుణ్య కర్మ ఫలములను నైవేధ్యముగా సమర్పించరా,,,,,

ధన్యము సేయరా దయామయా ఆంజనేయ నను బ్రోవరా,,

రామ భక్త హనుమానుకు జయ జయ జయ జయహే,,,,,

హరిఃఓం హరిఃఓం హరిఃఓం

Photo
అన్నిమతములు.. 
అన్ని ధర్మములు 
సకల జనులకు 
సద్బుద్ధి కొరకే..! 
బేధాలు మరచి.. 
ఖేదాలు.విడచి.. 
ఆమోదమ్ముతో 
అన్నదమ్ముల 
వలెను..కట్టుగ 
ఐకమత్యమ్ము 
అంతు కనుగొని.. 
అంతరాత్మను 
వినగ లేమా? 
అంతర్యామిజాడ.. 
కనుగొనగలేమా? 
మనుషులంతా 
ఒక్కటే.. 
మంచి కోరెడు 
మతములన్నీ 
ఎన్నటికీ 
సమ్మతములే! 
ప్రజాక్షేమం 
సుజన.సౌఖ్యము 
ఎల్లరకూ 
అవసరము కాదా!.... 
విoత పోకడలను నేర్చి 
పంతమున 
చెలరేగిపోయి 
జన సంతతికి 
పెను ముప్పుతెచ్చుట 
మతము కాదది.. 
విపరీతమగు 
ఉన్మాదము..! 
మోదమేదో 
తెలుసుకొని 
అనురాగ. 
ఫలములు.. 
పంచుకోనుడీ! 
ఇలను..స్వర్గము 
సచ్చిoతనలతో 
సాధించుకొందుము 
సాధు..జనులై..! 
చేయి చేయి 
కలుపరండు 
చైతన్యమంత్రము 
నేర్చుకొనగ..! 
మునుముందుగ 
మానవులమన్న 
విషయము 
యోచించ వలయు.!. 
నదుల వాహిని 
పెను సాగరము 
చేరుటది ఎంతనిజమో ! 
మతములన్నిటి 
సారాంశ మొకటే 
తరచి చూసిన.. 
శాంతి..సౌఖ్యం 
సత్యధర్మపధం... 
మోక్ష సాధన 
చివరి లక్ష్యం.. 
అహింసయే ఇల 
పరమధర్మం..! 
మత మనే మత్తులో..చిక్కి.. 
మానవసంతతి పెనుముప్పునుఆశిస్తున్న. తీరును గర్హిస్తూ 
సకల జనులూ సుఖసంతోషాలతో కలసిమెలసి.జీవించాలని 
ఆకాంక్షిస్తూ.. 
సర్వే.జనా..సుఖినో భవంతు... 
కళ్యాణగౌరి..కాశీభట్ల..(భమిడి పాటి)
లంకాధిపతి రావణబ్రహ్మ యుద్ద భూమిలో, 
మృత్యు శయ్యపై అవసాన దశలో, 
శ్రీరాముడితో ఇలా అంటాడు. 
"రామా........... నీ కంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి. 
నేను బ్రాహ్మణ జాతి లో పుట్టాను..నీది క్షత్రియ జాతి. 
నేను, నీ కంటే వయసులో పెద్ద. 
నా కుటుంబం, మీ కుటుంబం కన్నా పెద్ద. 
నా వైభవం, నీ వైభవం కన్నా అధికం. 
మీ అంత:పురం మాత్రమే స్వర్ణం, నా లంకానగరం మొత్తం స్వర్ణమయం. 
నేను బలపరాక్రమాలలో నీకంటే శ్రేష్ఠుడిని. 
నా రాజ్యము, నీ రాజ్యము కంటే పెద్దది. 
జ్ఞానంలో, తపస్సులో నీ కంటే శ్రేష్ఠుడిని". 
"ఇన్ని శ్రేష్ఠమైన విషయాలు కలిగి వున్నా, యుద్ధంలో నేను 
నీ ముందు ఓడిపోయాను". 
దీనికి కారణం ఒకటే. 
"నీ తమ్ముడు నీ దగ్గర వున్నాడు. 
నా తమ్ముడు నన్ను వదలి వెళ్ళిపోయాడు". 
నీతి: 
తమ్ముడు వెంట లేకుండా, రావణబ్రహ్మ లాంటి వాడే 
ఓటమి పాలయ్యాడంటే , మనలాంటి వాళ్ళ బ్రతుకెంత? 
అందరూ కలిసి వుండండి. విజయాలు పొందండి. 
కుటుంబాలు విచ్చిన్నం కాకుండా అందరూ ప్రయత్నించండి. 
కనీసం సోదరులంతా లోలోపల (మానసికంగా) అయినా కలిసి వుండండి. 
ఎందుకంటే... 
"ఏ వృక్షమూ, కఱ్ఱ సహాయం లేని గొడ్డలితో తెగి పడదు". 
"వృక్ష జాతి స్నేహం తోనే, గొడ్డలి విజయం సాధిస్తుంది". 
విభీషణుడి స్నేహం వల్ల శ్రీరాముడి పని సులువు అయినట్టు.. 
నువ్వుంటే నా జతగా...నేనుంటా ఊపిరిగా ... 
No automatic alt text available.




ॐॐॐ
చిలువలు పలువలుగా నిను హేళన చేయుదురేలరా

వలువలు దొంగిలించి వలపులు గురిపించువాడని,,,

తలచిన మదిలో కృష్ణుని గాంచుట కష్టతరమవదే,,,

కలనైన వీడరయా నీ తలపులు వ్రేపల్లె గోపికలేల్లరు

తలచినదే తడవుగా పరుగున వచ్చే దైవమా,,,,

ఇల నున్న పడతులెల్లరు పసివారురా నీ యదలో,,,

తలవరేనాటికి పరమాత్మ నీవని వ్రతముల జేసెదరు

మ్రొలినవారెల్ల సుతులవుదురే ??? సతులెల ఔదురు,

వల్లమాలిన ప్రేమన పతి యనెదరే వ్రేపల్లె పడతులు

ఒల్లరయ్యా జనులు పతియన తండ్రి యని మరో భావము

నల్లనయ్యా నీకే సకలము అర్పితము తండ్రి అనిన

కల్లలేరా దేహాభిమానములు దేహ భ్రాంతి యేలరా ప్రభూ,

గొల్లభామలెల్లరు మొహించినా నీవు నిష్కామివే గదరా,,

తలపై శిఖి పింఛము నీ బ్రహ్మచర్యమునకు తార్కాణమే

కల్లనైన మర్మావయముల సంగమము లేని పవిత్ర
జీవులు మయూరములు,,,

వలదయ్యా జనులారా కృష్ణ ధూషణ,,,కృష్ణుడే విష్ణువు,,,

మాలక్ష్మీ వినా హరి అన్య పడతులను స్పృశించడు,,,,

ఇలవేలుపు నీవేరా శ్రీహరి,,,,నీ లీలాధ్భుతములు పెక్కురా,,,

హరిఃఓం హరిఃఓం హరిఃఓం

--((*))--

మేఘ సైన్యంతో మెరుపు జండాతో
ఫెళ ఫెళార్భటీ హర్ష హాసంతో
వరుణా! వరుణా! అరుదెంచుమా!
ధరణీ తరుణుని కరుణించుమా!

గ్రీష్మాదిత్యుని పటుజ్వాలలకు
బ్రతుకులు ఆవిరి కాక ముందే
అవని పాత్రలో అమృతధారలు
ఇంపు నింపి సొంపొంగ వేదమే

ఉబికి ఉబికి చేదికంద బావి నీళ్ళు
అబ్బురాన చెమ్మగిల్ల ఎడారి కళ్ళు
శత శతఘ్న లొక్కసారి ప్రేలినట్లు
ఇంద్రధనుసు నెక్కిబెట్టి ఇలను చేరి!!

వానలో పిల్లా పెద్దలు వల్లప్పలాడగా
గుండెతో కొంగొత్త ముత్యాల జల్లులు
విరియ పూదోటలు.మురియ ఎద పాటలు
పచ్చ నవ్వులు పుడమి పండించుకోగా
ఆనందముతో ప్రతీ మనిషీ తాండవ నౄత్యము చేయడా!!

చిత్రం : ఐ (మనోహరుడు) 
సంగీతం : AR.రెహమాన్ 
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి 
గానం : సిద్ శ్రీరామ్,ఇష్రాత్ ఖాద్రే 

పల్లవి : 

వీచే చిరుగాలిని వెలివేస్తా 
హో పారే నదిలా విరిచేస్తా 
నేనున్న నేలనంతా మాయం చేస్తా 
లేదే లేదే అవసరమే 
నువ్వే నాకు ప్రియవరమే 

నువ్వుంటే నా జతగా 
నేనుంటా ఊపిరిగా ... 
నేనుంటా ఊపిరిగా ... 
నువ్వుంటే నా జతగా 

నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ 
ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ 
నీ కోసం ఈలోకం బహుమానం చేసేస్తా 
నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా 
నువ్వుంటే నా జతగా 

చరణం : 

ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా 
అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా 
సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా 
నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా 
అగ్గిపుల్ల అంచున రోజా పూయునా 
పువ్వుల్లోని తేనె పురుగులకందునా 
మొసళ్లే తగిలే మొగ్గనై మొలిచా 
బూచినే చూసిన పాపనై బెదిరా 
నువ్వుంటే నా జతగా 
నేనుంటా ఊపిరిగా 
నువ్వుంటే నా జతగా 
నేనుంటా ఊపిరిగా 
నువ్వుంటే నా జతగా 
నేనుంటా ఊపిరిగా ... 
నేనుంటా ఊనువ్వుంటే నా జతగా... 

https://www.youtube.com/watch?v=Zc7SeDL-0uE
శాంతాకారం భుజగశయనం, పద్మనాభం, సురేశం 
విశ్వాకారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగం 
లక్ష్మీకాంతం, కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం 
వందే విష్ణుం, భవభయహరం సర్వలోకైక నాధం!! 
ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో , ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. 
ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట! ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటారు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు. సంసారులు, వయో, లింగబేధము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు. 
ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు. 
ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి. 
అట్టి గోమాత నివశించే గోశాలను ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. అలా, గోపద్మవ్రతం చెయ్యాలి. 
ఇంత పుణ్యప్రదమైన తొలిఏకాదశి పర్వదినం శుభప్రదముగా జరుపుకుందాము.

No comments:

Post a Comment