నేటి కవిత- 1 0 0 0 1
ప్రాంజలి పభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
కళ్ళు కళ్ళు కలిపి,
కలసి మెలసి తిరిగి,
కాన రాతివి ఓ సఖియా
వలచి పిలిచితి
నీ జాడ కనబడక,
వగచి వగచి క్రుంగితిని ఓ మావా
వల్లంతా కళ్ళు చేసి
వెతికి వెతికి వేసారి
విసిగి పోతిని ఓ సఖియా
మొహమన్నావు,
దాహమన్నావు
పిలవగా కానరాతివి ఓ మావా
కోరి కోరి వెంట తిప్పుకొని,
మోహమును కనులలో
చూపితివి ఓ సఖియా
కళ్ళల్లో నీ రూపును దాచాను,
కన్ను తెరిస్తే,
నీరూపు చెరుగునెమో ఓ మావా
మరల మరల చూసి,
కొంటె నవ్వు నవ్వి
హృదయాన్ని దోచితివి ఓ సఖియా
ఆశలు చూపి,
ఆశయాల గొప్పచేప్పి,
ప్రేమను చూపక మారితివి ఓ మావా
తొలగి తొలగి తెరమాటునచేరి,
వలపులో ఉన్నా
వేడితగ్గించవా ఓ సఖియా
మనసు పొరలు
మరగి పోతున్నాయి,
తపణలు చల్లార్చి పోవా ఓ మావా
మరమనిషి అనక,
మనసున్న మనిషిని,
మమతలు అందిస్తా ఓ సఖియా
పెద్దల ఆసీర్వాదంతో
ఇద్దరం ఏకమై అనంత సౌఖ్యాలు
పొందుదామా మావా
నీ మాటే నామాట,
నీ ప్రేమ సఫలం ఈనాడని
ఆ బ్రహ్మ వ్రాసాడు సఖియా
--((*))--
35. గోవుల నఱవంగఁ గోసి వండుక తిను, వారలు నైశ్వర్యవంతు లైరి
మానాభిమానముల్ మాని వర్తించు గు, లాములు గౌరవధాములైరి
అక్షరం బెఱుగని యాకార పుష్టిచే, వర్ణ సంకరులు విద్వాంసులైరి
బాజారి ఱంకుకుఁ బంచాయతీ చెప్పు, ప్రాఁత లంజెలు వీరమాతలైరి
అహహ! కలియుగ ధర్మ మేమనఁగ వచ్చు
నన్నిటికి నోర్చి యూరక యుండవలయు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
36. చదువుచుండెడివేళ సభలోనఁ గూర్చుండి, దున్నపోతుల కొడుకెన్నుఁ దప్పు
విద్యాధికుల కిచ్చు వేళడ్డుపడి మాల, ధగిడీల కొడుకు వద్దనుచుఁ జెప్పు
ధన మెక్కుడుగఁ గూర్చి తినలేక యేడ్చెడి, పెనులుబ్ధుఁ డర్థుల గనిన ఱొప్పు
బిరుదు గల్గిన యింటఁ బెరిగినఁ గొణతంబు, విప్పినంతనె కుక్క వెదకుఁ జెప్పు
రాజసభలందుఁ బండిత రత్నములకుఁ
జనులు చెఱచును నొక్కొక్క పాపి నరుఁడు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
''ప్రభచనాలు''
అబ్బాయలకు ప్రత్యేకం .....
"మీరు 2 వీలర్ మీద వెళుతున్నప్పుడు ....
4 వీలర్ మీద వెళుతునప్పుడు ....
రొడ్డు మీద "సౌన్దర్య దర్శనం" తగ్గించుకోండి...
లేకా పొతే మీకు "దైవదర్శనం" తప్పదు!!
~ ఖాళీ పంజరం ~
కనుదోయి అంచులకంటిన కాటుకలా నల్లగా పరిమళిస్తూ
కోట్ల హృదయాలని కొల్లగొట్టిన ఆనందంతో
కమ్మగా నవ్వుకుంటున్నట్లుంది ఎక్కడెక్కడి చీకటి
వెలుతురు కప్పుకున్నామనుకున్న శరీరాలకి
లోలోన నిలువెత్తుగా పేరుకుపోయిన
తిమిరపు శేవధులు గోచరించవు
జీవితాన్ని తల్లకిందులు చేసే వరకూ
నువ్వు శ్వాసించిన క్షణాలన్నీ శిధిలాలుగా
చరిత్రను విప్పి చెబుతుంటే
ఈ మట్టి చూసిన ప్రతి మరణ శాసనం
నీ లిఖితమేనన్న చిహ్నం
నీలో ఇంకా పదిలంగా ఉంచుకున్నావ్ చూడూ…
ఓ మనిషీ
శతాబ్దాలుగా మనసులన్నిటినీ
మభ్యపెడుతున్న ఇంద్రజాలికుడివి నువ్వు
ఏయ్… మనిషీ
నువ్వెంతటి మాయావివైనా సరే
కొన్ని స్వచ్ఛతా చూపులు వెంటాడినప్పుడు
నీలో నుండి నువ్వు నిర్దోషిగా బయటకి రాలేవు
నవ్వొస్తేనే నవ్వేంత
ఏడుపొస్తేనే ఏడ్చేంత స్వచ్ఛత ఆవరించినప్పుడు
ఏడవగలిగినంత దుఃఖం
నవ్వగలిగినంత సంతోషం కన్నా
జీవితానికి పెద్ద కోరికల భారమేమీ లేనప్పుడు
పంజరం ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది
అనంతంగా స్వేచ్ఛను పాడుకుంటూ
మన Sandhya Gollamudi.. గారు కట్టిన దండ.!
.
చెతన్ చె,తొడన్ తో. హహహహహహహహహ.
చెతన్ ని , నీతొ తొడుకు పోతావా!!
పట్టుకు పొ. అచ్చు కు ,హల్లు పరం బైనప్పుడు!
ఏమవుతుంది. పరంబా !!!
బాగుంది ,జగదంబ విన్నాము కాని , పరంబ !!! వినలేదు. .
ఉత్పల మాల,చెంపక మాల.!!
చెంపకాలు చూసినాము సారు,
ఉత్పలాలంటే?? అర్ధమయుంది . ఉమ్మెత్త పూలా ?
కొయ్యంగానే,వాడి పొతాయె!! మాల ఎట్టగబ్బా !
సంధులు,గొందులు, బానెదిప్పినావ్.
*******************************************
సంధ్య గొల్లమూడి గారికి కృతజ్ఞతలతో..
బాపూరమణీయలోగిలి నుంచిదొంగిలించాను.. చాలబాగుంది..
మీరుభావుకలోపోస్ట్ చెయ్యకపోవడం భావ్యంకాదు..
ఆణిముత్యాలు అందరికీ పంచాలి... మరి.
లేకుంటే ఇలా ఘరానా గజదొంగలయ్యే ప్రమాదం మాకు..ప్రమోదంమీకు......
దొంగలించినందుకు... మన్నింపులు......
ఆ ఒక్కటి......
ఆకాశం అక్షరాలను కురిపిస్తే
ఆ అక్షర ఝరీ ప్రవాహంతో
అవనితల్లి పులకరించదా!!
అడుగడుగునా అక్షర కాసారాలై
అక్షర సేద్యాన అక్షర పైరులైతే
అక్షర సిరులే పంటలుగావా!!
ప్రవహించే ప్రవాహాలు
కలిసిన వారాసీ
ఓ అక్షరాంభుధైతే
జనమంతా ..........
అక్షరవాహినిల్లో తడుస్తూ.....
అక్షర కడలిలొ మునుగుతూ
అక్షర జ్ఞానులై విజ్ఞానఖను
లౌతారని కలలు కంటూన్న నాకు....
నాలోని .......,
మరోనేను
పకపకానవ్వింది...
క్షయమైపోయే నీటి చుక్కనే రాల్చలేని ఆకాశం ......
అక్షయమైన అక్షరాన్ని
కురిపిస్తుందా?......
అంటు నవ్వింది
మళ్ళీ నవ్వింది...
మళ్ళి మళ్ళీ నవ్వింది....,
అలా నవ్వుతుంటే
దాని కళ్ళల్లొకి నీళ్ళొస్తే.....
ఆ కన్నీటిని చూసిన
మరో నాకు చిరాకెత్తు కొచ్చింది.
ఎందుకా నవ్వో అర్థం కాక........
.అప్పుడు చెప్పింది
అక్షరాల్లో మునిగి
అక్షరాన్నొంటబట్టించు
కున్నోళ్ళంతా జ్ఞానులు
అనుకునే నీ అజ్ఞానానికి నవ్వుతున్నా...,...
మనిషికి అక్షరమొకటే సరిపోదు
అక్షరానికి మించిన అలంకారం
అదేకావాలి మనకు సంస్కారం
సంస్కారమున్నవాడే జ్ఞాని
ఆ ఒక్కటి మరిచి అక్షరాలవెంట
బడితే వాడు అజ్ఞాని...... అసురుడు....,
చీడపురుగవుతాడు ద్రోహియౌతాడు
యావజ్జాతి వినాశకుడౌతాడు
నల్ల గా వున అమ్మాయి..
"ఎంజల్ "
లావు పాటి అబ్బాయిలు....
"స్మార్ట్ బాబీ"
పిరికి అబ్బాయిలు....
"కిల్లర్"
45 సం.ల ఆంటి....
"కుశ్బూ"
55 సం.ల వాళ్లు....
హ(,,,,ఆయన సంగతి నాకెన్దుకులెండి!!!!
కత్ఆత్ (కత్అ లు)
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
మళ్ళీ మళ్ళీ రాని రోజు
మరచి పోయిన రోజు
మళ్ళీ మళ్ళీ వచ్చే రోజు
మనసున కదిలించిన రోజు
మళ్ళీ మళ్ళీ నచ్చే రోజు
దాహాన్ని తీర్చే రోజు
మల్లె మళ్ళీ మెచ్చేరోజు
ఆకలి తగ్గించిణ రోజు
మళ్ళీ మళ్ళీ తపించే రోజు
ఎడబాటు గుర్తించిన రోజు
మళ్ళీ మళ్ళీ యాచించే రోజు
కోరిక స్మరణ తీర్చే రోజు
మళ్ళీ మళ్ళీ ప్రేమించే రోజు
బిడ్డలా ప్రేమను పొందే రోజు
మళ్ళీ మళ్ళీ ద్వేషించే రోజు
ఆశకు చిక్కి అల్లాడిన రోజు
మళ్ళీ మళ్ళీ మండి పడ్డ రోజు
కోపాన్ని రెచ్చ కొట్టిన రోజు
మళ్ళీ మళ్ళీ చదివిన రోజు
సుందరాకాండ పరాయణ రోజు
మళ్ళీ మళ్ళీ పూజించిన రోజు
కల్ముషములేని మనసున్న రోజు
మళ్ళీ మళ్ళీ ప్రార్ధించిన రోజు
తల్లితండ్రుల పాదసేవచేసిన రోజు
--((*))--
1
రగులుతోంది మనసులో అగ్నిలా తపన
ఆగి పోవడం లేదు కోరికల స్మరణ
మనసు, మెదడు తమ పనులను చేస్తున్నాయి
మనిషి కాలుతున్నాడు బ్రతకడం వలన
2
ఉద్గ్రంథాలు ఎన్నో ఎన్నెన్నో వచ్చాయి
ఉవాచలు ఎన్నో ఎన్నెన్నో అందాయి
చాలా కాలంగా పిలుస్తున్నా, సిసలైన
మంచి పనులు మనకు దూరంగానే ఉన్నాయి
3
పంథా లెన్నిటినో పట్టుకున్నాడు
రోజూ ప్రయత్నాలను చేస్తున్నాడు
పడిపోయే వఱకూ సాగుతున్నాడు
మనిషి పయనంలో ఇరుక్కునాడు
4
చెడ్డతనం వల్ల గడ్డు రోజులొచ్చాయి
అడ్డదారులవల్ల ఆపదలు కలిగాయి
పట్టిన చెద పుఱుగులయ్యాయి, పరిస్థితులు
బ్రతుకుల పుస్తకాలను అవి తింటున్నాయి
5
తన అవసరాలకు తానే బానిస అయ్యాడు మనిషి
తన పనులకు తాను బలి పశువై పోతున్నాడు మనిషి
ఆఱిపోని ఆశల అగ్నిలో కాలుతున్నది మనసు
తన తీరుతో తానే నుసిగా రాలుతున్నాడు మనిషి
రోచిష్మాన్
నేటికవిత
ప్రాంజలి ప్రభ
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం
పువ్వు వైనానీవె, సాహస స్పూర్తివైనా నీవే
సహనానికి పేరు నీదే, ఘనకీర్తికి మరోపేరు నీదే
ఓర్పు వహించి, నిగ్రహాన్ని పెంచే స్త్రీవి నీవే
రాతలలో ఘనత నీదే, మాటలలో నేర్ప నీదే
అందుకే స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం
స్త్రీ అణకువ తనాన్ని చులకచేయుట ఎందుకు
స్త్రీని చూసి నిర్మల హ్రదయంతో సాగు ముందుకు
స్త్రీ సీలాన్ని పరీక్ష చేసి వేదించుట ఎందుకు
స్త్రీని ఎప్పుడు అవమానించి సాగలేవు ముందుకు
స్త్రీ గౌరవాన్ని నలుగురిలో చులకన ఎందుకు
శుభోదయం .!
Janaki Padhuka గారి అద్బుత ఝలక్ .!
.
ఏ కృష్ణుడూ రాలేదు. ఏ సాయమూ అందలేదు...అసలక్కర్లేదు.
ఆవిడ ఎన్నాళ్ళో వేచిన ఉదయం..
నిన్న ఎదురయ్యింది.
ఏకాలని నిర్ణయమైతే ముందే చేసుకుంది.
ఏకాకిగానే మొదలెట్టింది. ఇక...
ఏ కాకీ అరవలేకపోయింది.
వేలెత్తిచూపించిన ‘చేతు'లన్నీ నవరంధ్రాలూ మూసుకోడంలో బిజీగా వున్నాయి.
ఇష్టులంతా శ్రద్ధగా విన్నారు.
‘ఇస్ట్'లంతా దుగ్ధగా వున్నారు.
నిజాలు మాట్లాడుతోంటే ‘ఇజా'లన్నీ ఇరుకునపడి, భయపడి “అలా చాయ్ తాగొద్దాంరా భాయ్!" అంటూ పలాయనం చిత్తగించాయి.
కన్నెర్రచేసిన ఎర్రచొక్కాలకి
వెర్రిచూపులే మిగిలాయి.
అధికారముందికదా అని అదుపు తప్పలేదు
‘అబలనని అవమానిస్తారా' అని దెప్పలేదు
అప్రస్తుత ప్రసంగానికై ప్రతిక్షణం ప్రతీక్షించే
ప్రతి‘పక్షపాతా'నికి పక్షవాతమొచ్చేలా చేసింది.
కమ్యూ‘నిష్టా గరిష్టులు' వారి మడిబట్ట ఏ మురికినీళ్ళలో ఆరేసుకుంటున్నారో చెప్పేసింది.
‘దేశభక్తనేది దండేనికి వేలాడే చొక్కాకాదు..ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకురాడానికి. అది నీ చర్మం లాంటిది. నీతోనే పుడుతుంది, నీతోనే కాలిపోతుంది' అని ఋజువైంది.
తల్లిని తిడితే తప్పుకాదు..కొడితేనే తప్పుకింద వస్తుందనే సింధియాల సంధిప్రేలాపనలు వినికూడా బ్రతికున్న మనకు బ్రతకాలన్న ఆశను ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది.
నీదేశాన్ని ప్రేమించడమంటే అదేమీ గొప్ప విషయం కాదు. నీసంతానాన్ని సరైనమార్గంలో పెంచితేచాలు. అదే వారిని దేశంపట్ల ఆకర్షితుల్ని చేస్తుంది.
నీపిల్లలు తాగేనీళ్ళు, పీల్చేగాలి, తినేతిండి ఎలా స్వచ్ఛంగా వుండాలనుకుంటావో చదివే చదువుకూడా అంత స్వచ్ఛంగానూ వుండాలి...!
ఇంతకంటే ఇంకేం చెప్పాలి?
అంచేత...నువ్విలాగే దూసుకెళ్ళు!
నీవెనక మేమున్నామని అనడంకన్నా
మాముందు నువ్వున్నావన్నదే బావుంది.
మొదటిది నీనమ్మకం!
రెండోది మాధైర్యం!!
కలలు, కల్పనలూ
పక్కగుడ్డలపై పెచ్చుకట్టిన తడిస్వప్నపు గుర్తులూ కాదు కదూ
సగం తెల్లపిల్లా మనవి...
కాలెండర్లలో లేని రోజుల్లో
అసలు గడియారంలోనే లేని నిమిషాలలో
నువ్వూ,నేను కలిసి సృష్టించుకున్న సమయాలలో
మన సంక్లిష్టపు సంయోగం ఎంతటి సంయమనమయ్యిందో కదూ...
ఓ మైథాజికల్ పిల్లా
లవ్ ఈస్ ఏ లాజిక్ లెస్ లవబుల్ థింగ్..
హియర్
ఎవ్రిథింగ్ ఈస్ ప్రీ డిటెర్మిన్డ్ ప్రాసెస్
ఫీలింగ్స్ ఆర్ పోస్ట్ ఇంక్రిమెంటెడ్ ఫిలాసఫీస్...
కానీ....
నీచే,నాచే సృష్టించబడని
కాలెండర్లలోనో,గడియారాల్లోనో
చిక్కుకున్న
ఒకానొక సమయంలో మనం ఎదురు పడొచ్చు
అప్పుడు మనం
పరిచయం ఉన్న అపరిచితులుగా మిగిలిపోవచ్చు
కానీ ...
మన కళ్ళు మాత్రం ఖచ్చితంగా అష్టావధానం చేసుకుంటాయి
నిన్నూ నన్నూ సమస్త విశ్వాన్ని పంకించి చూస్తున్న
ప్రకృతి సాక్షిగా....
అప్పుడు జీవితం ఓ ఫార్ములా కథ...
కన్నీళ్లు కళ్ళల్లోకే జారిపోతుంటాయి
భార్యో,భర్తో,కుటుంబమో
ఓ బహిర్గత వాస్తవానికి కార్బన్ పేపర్లా అడ్డుపడతారు....
కాలం చిత్రమైనది సగంతెల్లపిల్లా.....
జ్ఞాపకాల పిల్లర్ల పై జీవితాన్ని ఒక్కో ఏడూ పెంచుకుంటూ
చివరి క్షణాన పెంట్ హౌస్లో
శరీరంతో పాటు జ్ఞాపకాలనీ తగలెట్టుకోమని
చెప్తుంది ..... Siddhardha కట్ట
జన్యంబున దనుజుల దౌ
ర్జన్యము లుడుపంగఁ గోరి చనుదెంచిన సౌ
జన్యవతిఁ జూచి యదురా
జన్యశ్రేష్ఠుండు సరస సల్లాపములన్
లేమా! దనుజులఁ గెలువఁగ
లేమా నీ వేల గణఁగి లేచితి విటు రా
లే మాను మాన వేనిన్
లేమా విల్లందుకొనుము లీలం గేలన్
హరిణాక్షికి హరి యొసఁగెను
సురనిక రోల్లాసనమును శూర కఠోరా
సుర సైన్య త్రాసనమును
బరగర్వ నిరాసనమును బాణాసనమున్
నారి మొరయించె రిపు సే
నా రింఖణ హేతువైన నాదము నిగుడన్
నారీమణి బలసంప
న్నారీభాదికము మూర్ఛ నంద నరేంద్రా!
కొమ్మా! దానవనాధుని
కొ మ్మాహవనమునకుఁ దొలఁగె గురువిజయముఁ గై
కొమ్మా మెచ్చితి నిచ్చెదఁ
గొ మ్మాభరణములు నీవు గోరిన వెల్లన్
పోతనామాత్య భాగవతం దశమస్కంధం లోని నరకాసురవధ ఘట్టం నుండి కొన్ని అందమైన కందాలు.
ఏదో రాగం ఎదను తాకింది
మదిని కదిపింది
వయసును తడిమింది
ఆ రాగమే
ఒక యోగమై
నీ రూపమై
కలలకు ప్రతిరూపమై
సాక్షాత్కరించింది
మనసుకు జత నీవన్నది
ఈ లత కు మాను నీవన్నది
కంటికి కనుపాపవై కరుణించమన్నది
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
మన్ను తిన్న మనిషయ్యావు
కన్ను గీటి కలత పెంచావు
వెన్ను చూపి వెళుతున్నావు
తన్నుకొని తపించమన్నావు
కన్నె వయసులో ఉన్నావు
వన్నెలెన్నో చూపించావు
ఎన్ని మాటలన్నా పలకవు
తన్ను కొచ్చిన ప్రేమమింగావు
పన్ను భాదలో ఉన్నావు
టన్ను బరువులో మారావు
జున్ను తిని బలిసి నావు
బన్నులాగా తయారయ్యావు
నన్ను మరిచా నన్నావు
నిన్ను నీవు మార్చుకోలేవు
నన్ను వదలి ఉండలేవు
నిన్ను మరిచానని అరవవు
ప్రేమించటం ఎంతకష్టమో
అది నిలబెట్టుకోవటం మరి కష్టం
--((**))--
--((**))--
No comments:
Post a Comment