Tuesday, 12 June 2018

Pranjali Prabha (19-06-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
Image may contain: 1 person
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం



ॐॐॐ మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లూ,,,,,

మాయా దేహములోని నాఆత్మ నీ భుజస్కంధమున

తీయని నీ లీలా ఘనతలు చెవిన పలుకుటకు
లయ హొయల వన్నెచిన్నె లోలుకుచూ వచ్చేను చిలుకనై
దయగల కృష్ణా చిలుక పలుకులకు మానసోల్లాసమై
హొయగారాలు ఒలకగా మా రాధమ్మ సొబగులు
చిన్నబోయే ???
కయ్యము నకు అమ్మ కస్సుమంటుందేమో చిలుకపై
అయ్యా ఆత్మ అదృష్యము,,,పరమాత్మవు అదృష్యమే
చెయ్యెత్తి దండించునేమో అమ్మను ఊరడించరా ,,,
సోయి దప్పునే నీ యాగ్రహమునకు ఆచిలుక అనరా,
వేయవమ్మా దానికి ఙ్ఞాన మను గ్రాస చిరుధాన్యములు
అయినను కల్మష రహిత పంచ రంగుల వాని ఆత్మ
రయ్ రయ్యంటూ నీల రంగుగల నాపై వ్రాలగా వాడు
హాయిగా నయా అనుభూతిని ఆహ్వానించుచూ మురియునే
నాయడల అమితమైన ప్రేమ గల వాని ఆత్మ చిలుక
సంరక్షణ
సేయగ వాని భారము చిలుక గాదు గజము నైనను
మ్రోయుదునే,,,,,రాదమ్మ నీ చేతి,,,,నాచేతి స్పర్శకై తపము
సేయు వాని బ్రోచుటకు త్వరితగతిన ముట్టవే ఆ చిలుకను
సాయముగా నెయ్యమును పంచుట మనవిధి యనరా కృష్ణ మాధవా కేశవా గోవిందా,,,,,హరీ
హరిఃఓం హరిఃఓం హరిఃఓం
--((*))--



నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

చిలక కొరికిన జామపండు రుచి వేరు
పెదాలు నలిపిన ఆకువక్క రుచి వేరు
చిన్నిల్లి తాలింపు పచ్చడి రుచి వేరు
అధరాలు కలయిక చెప్పు  రుచి వేరు

కామం తనువును తపింప చేసే ప్రకృతి వేరు
మోక్షం మలుపు చూపించే కామం తీరు వేరు
విశ్వాన్ని తొలచి వేసే మన్మధ బాణాలు వేరు
వికసించన పువ్వు వేరు, కామించని స్త్రీ వేరు

కామ త్రృప్తి తెల్ప లేని అనుభూతి వేరు
కామం తీర్చుట మన: శాంతికి మరో పేరు
శ్రృంగార కేళి మధురాతి మధురం వేరు
కామ్యార్ధ సిధ్ధి జీవితంలో మలుపు వేరు

--((*))--

Image may contain: water and outdoor

నేటి కవిత
పంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ

నా అన్వేషణ సాగిస్తున్నా
నా లోకాన్ని శాసిస్తున్నా
నా లోకం తీరు వేరనుకున్నా
నా తీరును నేను మార్చలేకున్నా

నా శత్రువుకి బుద్ధి చెపుతున్నా
నా మాట విలువ కాపాడుతున్నా
నా మంచిని నలుగురికి పంచుతున్నా
నా బుద్ధికి తగ్గ మైత్రిని కోరుతున్నా
     
నాలో శక్తిని ధార పోస్తున్నా
నా వ్యక్తిత్వం నాకు తొడన్నా
నా స్వేచ్చ నాకు బాటన్నా
నా ఆలోచన నాకు గమ్యమన్నా

ఏ ఆశ లేకుండా జీవిస్తున్నా
ఆశ్వీరదించమని అడుగు తున్నా
పల్లకి ఎక్కిన వారిని మోస్తున్నా
అభిప్రాయ భేదము లేదన్నా

నాలో మార్పుకు తప్పు నాదని చెప్పుతున్నా
నా లక్ష్యం తల్లి తండ్రులను పూజించాలన్నా
నా గమ్యం అనాధులను ఆదుకోవటమన్నా
నా ధ్యేయం తెలుగు భాషను బ్రతికించాలన్నా

స్త్రీ శక్తే నాకు తోడన్నా
దేశ సేవే నా భవితవ్యమన్నా
వాదాలు వ్యాధులు అసలు రావన్నా
మృత్యువంటే భయము లేదన్నా

సూర్యోదయం, చంద్రోదయం చూసున్నా
నవ్వి నవ్విస్తూ, ప్రేమను పంచి పొందు తున్నా 
నన్ను నన్నుగా గుర్తించే వారిని ప్రేమిస్తున్నా
నా త్యాగం, నా ధైర్యం బ్రతికి బతికించటమన్నా 

--((*))--

నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత : మాల్లాప్రగడ రామకృష్ణ

మస్తకంలో ఉన్న మహత్తును
మహిమాన్వితమైన జగత్ విషయాలను
వ్రాసి మందమతులను, ఉత్తెజులుగాను
ఉద్దండ పండితులుగా మార్చాలి ఎలా ?

అలా ఇలా అనుకోవటం అనవసరము
కంటితో చూసినది బుద్ధికి పదును పెట్టడము
బుద్ధిహీనులకు బుద్ధి చెప్పడమే కవిత్వము
కవిత్వం వ్రాతపూర్వకంగా ఉంటె అర్ధం కానివరికి ఎలా ?

కళ్ళతో అమాయకుల ఆక్రందనలు చూడాలి
ఆదుకొనే శక్తి పరుల ప్రోస్చాహంతో బ్రతికించాలి
ఆశయ సాధన లేని రాజకీయాలను వదలాలి
పకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి మంచిని పంచాలి ఎలా?

హృదయంతరము లోని భావాలను ఉప్పెనలా
సందర్భోచిత పరిష్కారాలను పెను తుఫానులా
దుష్టచతుష్టయాలను ఎదుర్కోవాలి ప్రభంజనంలా
అస్తవ్యస్త సమాజానికి కవిగా చేయూత నివ్వాలి ఎలా ?
--((*))--

నేటి పద్యం

గోపాలా నినుకోరి నీచరణమే ముమ్మాటి ముల్లోక మే
రా...రా సరసకు రారా...రా రా చెంతకు చేరా..
ప్రాణమే నీదిరా ఏలుకో రాదొరా...శ్వాసలో శ్వాసవై రారా

చిత్రం : చంద్రముఖి
సంగీతం : విద్యాసాగర్
గానం : బిన్నీ కృష్ణకుమార్,టిప్పు

రారా సరసకు రారా
రా రా చెంతకు చేరా

ప్రాణమే నీదిరా ఏలుకో రాదొరా
శ్వాసలో శ్వాసవై రారా

తోమ్..తోమ్...తోమ్...తోమ్...తోమ్..తోమ్...
ఆ...ఆ...ఆ..ధీరనన...ధీరనన....ధీరనన....

నీ పొందు నే కోరి...అభిసారికై నేను
వేచాను సుమనోహరా....ఆ...ఆ...
కాలాన పరుగైన ఆనంద రాగాలు
వినిపించ నిలిచానురా....

తనన ధీంత ధీంత ధీంతన
తనన ధీంత ధీంత ధీంతన
తనన ధీంత ధీంత ధీంతన

వయసు జాలమోపలేదురా
మరులు గొన్న చిన్నదాన్నిరా
తనువు బాధ తీర్చరా..రావెరా....
సల సల సల రగిలిన పరువపు పొదయిది
తడి పొడి తడి పొడి తపనల స్వరమిది
రా..రా...రా..రా....రారా......

ఏ బంధమో ఇది ఏ బంధమో
ఏ జన్మ బంధాల సుమగంధమో
ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో
నయనాల నడయాడు తొలి స్వప్నమో
విరహపు వ్యధలను వినవా
ఈ తడబడు తనువును కనవా
మగువల మనసులు తెలిసి
నీ వలపులు మరుచుట సులువా
ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక
సరసకు పిలచితి విరసము తగదిక
జిగి బిగి జిగి బిగి సొగసుల మొరవిని
మిలమిల మగసిరి మెరుపుల మెరియగా

రా...రా..రా..రా.....రారా

తాం తరిగిడ ధీం తరిగిడ తోమ్ తరిగిడ నం తరిగిడ

https://www.youtube.com/watch?v=94dxGOen_fg

నిత్యమంగళ -

మిశ్రజాతిలో సామాన్యముగా మూడు, నాలుగు మాత్రలను ఉపయోగిస్తారు, మొత్తము ఏడు మాత్రలు. ఈ ఏడు మాత్రల ప్రక్కన, మఱొక నాలుగు మాత్రలను కలిపితే మనకు మిశ్రజాతి త్రిపుట తాళపు (లీల) మూస లభిస్తుంది. అలా సృష్టించిన వృత్తమే ఈ నిత్యమంగళ వృత్తము. ప్రతి పాదములో 16 అక్షరాలు. క్రింద నా ఉదాహరణములు -

నిత్యమంగళ - ర/న/య/జ/న/గ UI UII IIU - UI UII IIU
16 అష్టి 31355

నిన్ను జూడఁగ మనమో - నేఁడు పొంగెను చెలియా
కన్నుదోయిని గని నేఁ - గావ్య మల్లితి సకియా
వెన్న నీహృది యవఁగాఁ - బ్రీతి యౌనుగ ఘృతమై
విన్నపాలను వినఁగాఁ - బ్రేమ పారు నమృతమై

నీవు నాకొక నిధిరా - నిత్య మంగళ మదిరా
త్రోవఁ జూపెడు దివెరా - దూరముండెడు నెలరా
భావగీతపు నుడిరా - ప్రాణవాయువు సడిరా
జీవనాభ్రపు రవిరా - చిత్ర కావ్యపు కవిరా

మాల వేసెదఁ ద్వరగా - మంచి గంధపు విరులన్
వ్రేల మీటెద సరసా - వీణ రాగిణి సరులన్
లాలి పాడెద లలితో - రా పరుండుమ యొడిలో
లీలఁ దట్టెద మెల నే - లేవకుండఁగ నిశిలో

ప్రాసయతితో -

నామనోహరి యెలుఁగా - రామచిల్కల గళమా
శ్యామసుందరి కనులా - శ్యామలోగల భములా
ప్రేమసంద్రపు టలలా - కామమోహిని కలలా
యామినీశశి మెఱుఁగా - మోమునందలి వెలుఁగా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం...ఆత్రేయ ప్రేమ గీతం అందానికే వసంతం...

చిత్రం : మాధవయ్య గారి మనవడు
సంగీతం : విద్యా సాగర్
గానం : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

పల్లవి :

నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం - 2
ఆత్రేయ ప్రేమ గీతం అందానికే వసంతం
నీ పాట పాడి నే పల్లవైతి
నీ పదము తప్ప యే పదములు దొరకక - నీ చూపు

నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం - 2
ఆ ఘంటసాల రాగం పాడిందిలే సరాగం
నీ జంట కోరి నే కీర్తనైతి
నీ స్వరము తప్ప యే వరములు అడగక

చరణం :

పూతల్లో పురివిడిచిన పులకింత
చేతల్లో మునుపెరగని చమరింత
వులికి పడిన నీ నలక నడుములో
మెలిక పడితినే వీణాలో తీగానై
తగిలిందే తాళం రగిలిందే రాగం
చినుకల్లే నా ఒణుకేతీరా తాడికోరేటి తాపాలలో - నీ చూపు

చరణం :

ఓ కే లే ముద్దెరగని సాయంత్రం
ఛీ పో లే సిగ్గేరిగిన తాంబూలం
కధలు తెలిసెలే యదల కనులలో
పురుడుకడిగిపో పువ్వుకే తేనెతో
నులిపెట్టే దీపం శీలలోనే శిల్పం
వలపల్లేరా వయసేతీరా జతలూగేటి జంపాలలో - నేనేమో

http://www.dailymotion.com/video/x1bieyg_madhavayya-gaari-manavadu-songs-nee-choopu-suprabhatham-song-anr-sujatha_fun
Madhavayya Gaari Manavadu Songs - Nee Choopu Suprabhatham Song - ANR, Sujatha - Video Dailymotion

 నేటి కవిత

*మధూలికా

మనసు చల్లనే - వయసు వచ్చెనే
వలపు తెచ్చెనే - తణువు విచ్చెనే
సొగసు పండెనే - మమత నిండెనే
కడుపు నిండెనే - రవళి వెల్గెనే

నటన నేర్చెనే - నడక మార్చెనే
వగలు పెంచెనే - తగువు తెచ్చెనే
మొగలి నవ్వేనే - కలువ ఏడ్చేనే
సిగలు వాడెనే - తుళువ నవ్వేనే

సెగలు సాగెనే - పొగలు కమ్మెనే
పరులు తుమ్మెనే - తరువు నవ్వేనే
మురళి మ్రోగెనే - సరస మాడునా
కళలు వచ్చునా - కలత తెచ్చునా

వనిత లేఖలే - నవత బాధలే
కళలు కళ్లలే - కలలు రంగులే
మధుర వాణినే - అక్షర మాటలే
వెలుగు రవ్వలే - కవుల నవ్వులే

కలువ సిగ్గులే - నవల మొగ్గలే
తడక కంతలే - మడత పిచ్చిలే
మరక గుర్తులే - నసగు చేతలే
వలలో చేపలే - నదిలొ తెప్పలే

నిధుల కోసమే - బతుకు ఈతలే
హితుల వాలకం - అసలు దొంగలే
మనిషి విజ్ఞతే - వయసు వేడుకే
సమయ పెద్దోడే - ఉదయ భాణుడే

ఆరుణ బింబమే - మరణ శాసనం
కరుణ వాలమే - ముతక జీవితం
నవమి పూజలే - జయము నిచ్చెనే
మొగలి పువ్వులే - తనయ పల్కులే

వొదిగి వయ్యారం - మిడిసి సింగరం
కనుల సోయగం - ముడుచు రెప్పలా
పగలు సేవలే - ఉచిత శోభనం
తులసి ఆకులే - తెలివి మాతలే

వరద పొంగులే - బడుగు బాధలే
సిరుల ఊయలే - విలువ ఆశలే
కురుల మాయలే - మతికి మత్తులే
తెలుగు నేర్చుకో - తెలివి పెంచుకో

పడతి ప్రేమలే - బడితి మెల్లగా
సరస జేరగా - సరస మాడునే
వరుస చెప్పగా - నగలు పంచనే
కలలు వచ్చునా - కలత తెచ్చునా

మగువ మార్చకూ - వరుస సత్యమే
వరుని తల్చగా - హరియు వచ్చునా
రియు తల్చగా - శివుడు వచ్చునా
తెలుగు పాటలో - తియని తేటలే




నేటి కవిత
పంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ

నా అన్వేషణ సాగిస్తున్నా
నా లోకాన్ని శాసిస్తున్నా
నా లోకం తీరు వేరనుకున్నా
నా తీరును నేను మార్చలేకున్నా

నా శత్రువుకి బుద్ధి చెపుతున్నా
నా మాట విలువ కాపాడుతున్నా
నా మంచిని నలుగురికి పంచుతున్నా
నా బుద్ధికి తగ్గ మైత్రిని కోరుతున్నా
     
నాలో శక్తిని ధార పోస్తున్నా
నా వ్యక్తిత్వం నాకు తొడన్నా
నా స్వేచ్చ నాకు బాటన్నా
నా ఆలోచన నాకు గమ్యమన్నా

ఏ ఆశ లేకుండా జీవిస్తున్నా
ఆశ్వీరదించమని అడుగు తున్నా
పల్లకి ఎక్కిన వారిని మోస్తున్నా
అభిప్రాయ భేదము లేదన్నా

నాలో మార్పుకు తప్పు నాదని చెప్పుతున్నా
నా లక్ష్యం తల్లి తండ్రులను పూజించాలన్నా
నా గమ్యం అనాధులను ఆదుకోవటమన్నా
నా ధ్యేయం తెలుగు భాషను బ్రతికించాలన్నా

స్త్రీ శక్తే నాకు తోడన్నా
దేశ సేవే నా భవితవ్యమన్నా
వాదాలు వ్యాధులు అసలు రావన్నా
మృత్యువంటే భయము లేదన్నా

సూర్యోదయం, చంద్రోదయం చూసున్నా
నవ్వి నవ్విస్తూ, ప్రేమను పంచి పొందు తున్నా 
నన్ను నన్నుగా గుర్తించే వారిని ప్రేమిస్తున్నా
నా త్యాగం, నా ధైర్యం బ్రతికి బతికించటమన్నా 

--((*))--


No comments:

Post a Comment