నేటి కవిత
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
మేము ఒక యంత్రము
విధ్యుత్ లేక నడిచే యంత్రము
అది మా మేధస్సు మంత్రము
మాకు తెలియదు తంత్రము
జీవితాన్ని కొదువ పెట్టిన బానిసలం
సమయాన్ని పాటించే వాళ్ళం
ప్రజా సంపదే మాకు నిలయం
వారికోసమే శ్రమిస్తాం ప్రతినిముషం
అర్ధం లోనే ఉంది జీవితం
అర్ధాన్ని అందించటంలోనే యుక్తం
రాజకీయానికి నలిగే పావులం
వత్తిడికి చిక్కే మూగ జీవులం
విత్తంలోనే ఉంది చిత్తం
చిత్తంగా పనిచేసే జీవం
శ్రమకు తగ్గ ప్రతిఫలం
అదియే జీవనాధారం
ఎప్పుడు చూపవద్దు జాలి
తక్కువచేసి చేయవద్దు ఎగతాళి
ఆడవద్దు మాతో వైకుంఠ పాళి
అందుకే ఉద్యోగానికి కడతాం తాళి
__((*))--
----------------------సుప్రభాతం-----------------------------------------
ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ ఆంధ్ర దేశ జన్మభూ నాలయస్య తపసః ఫలమ్
తెలుగునాట పుట్టడం తెలుగును మాతృభాషగా పొందడం జన్మ జన్మల పుణ్య ఫలం. ఈ శ్లోకం అప్పయ్య దీక్షితులు అనే తమిళుడు చెప్పినది.ఆయన మీ తెలుగువారు ఎంత అదృష్ట వంతులు.భార్యను వోసీ వోసి అని పిలుస్తూ నిరంతరమూ సివో సివో అని శివ నామం జపిస్తుంటారు.(వోసి అనేది తిరగరాస్తే శివో అని వినిపిస్తుంది)పూర్వము భార్యను వోసీ అని పిలిచేవారట .తర్వాత అది ఒసే అయింది.తమిళులు కూడా మెచ్చుకున్న మన తెలుగును మనం మాత్రం గౌరవించలేక పోవటం బాధాకరం.
అన్నాదురై పాలనలో అన్నానికి కరువు లేదు
పన్నుగ రూపాయికి పడి బియ్యమిడితివి అన్నా మున్నెన్నడు లేని రీతిన్
ఈ పద్యము ఒక తెలుగు కవి అన్నదురైకి రాసి ఇచ్చాడట. తెలుగు ప్రేమికుడైన ఆయన ఈ పద్యాన్ని తన దస్త్రం(ఫైలు) లో భద్రంగా దాచుకున్నాడట.
శ్రీ శృంగేరి సంయమీంద్రులు – 22
జగద్గురు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి దివ్య చరిత్ర
సదాత్మ ధ్యాన నిరతం విషయేభ్య: పరాజ్ఞ్ముఖమ్
నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్ర శేఖర భారతీమ్ !!
ఒకసారి శ్రీజగద్గురువులు శ్రీ చంద్రమౌళీశ్వరస్వామికి అభిషేకం చేస్తున్నప్పుడు కొందరు శిష్యులు చూస్తూ కూర్చున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక త్రాచుపాము ఎక్కడినుండో ప్రాకుతూ వచ్చింది. శిష్యులంతా భయభ్రాంతులై లేచి నిలబడ్డారు. ఆ కోలాహాలాన్ని జగద్గురువులు చూసి దానికి కారణం అయిన ఆ కోడె త్రాచును చూసి భయము లేదని శిష్యులకు సంజ్ఞ చేసి వారు కూర్చునేటట్లు చేసారు. త్రాచుపాము మెల్లమెల్లగా అభిషేకం చేస్తున్న శ్రీ జగద్గురువులను సమీపించింది. శిష్యులంతా మరల భయపడ్డారు. అప్పుడు త్రాచు తలయెత్తి నిలుచుంది. శ్రీ జగద్గురువులు చిన్న పాత్రను తీసుకుని దానిలో పాలు పోసి ఆ పాత్రను చేతిలో పట్టుకుని చేయి చాచి ఆ పాత్రాను త్రాచుపాము నోటిక్రింద పెట్టారు. ఆ సన్నివేశాన్ని చూసిన భక్తులంతా ఆందోళన పడ్డారు. అయితే వారేమి చెయ్యలేని స్థితిలో మూగాపోయారు. ఆ త్రాచుపాము శ్రీజగద్గురువులు అందించిన పాలను మెల్లిగా తాపీగా ఠీవిగా నాలుకతో చప్పరించి తాగింది. తన పాడగను చాలా పైకెత్తి అభిషేకింపబడుతున్న శ్రీ చంద్రమౌళీశ్వరుని పరిశీలించి చూసింది. తరువాత శ్రీ జగద్గురువుల అనుమతిని తీసుకున్నట్టు ఆయన వంకకు తిరిగి పడగ వంచి మరల వెనకకు తిరిగి వచ్చిన త్రోవను వెళ్ళింది.
పరమాత్మ భగవద్గీతలో (12 అ 15 శ్లో) ఆత్మజ్ఞానికి దేనివలన భయము లేదని అతని వలన లోకంలో ఎవ్వరికీ భయం లేదని చెప్పారు. ఇలాగ జంతువులు సరీసృపములు కూడా ఆయన యందు ప్రవర్తించగా మానవులందరూ ఆయన యందు ప్రేమ భక్తి గౌరవాలతో ప్రవర్తించడంలో ఆశ్చర్యం లేదు. అతి ఛాందసులు, విద్వాంసులు, జ్ఞానులు, ప్రభువులు, కృషీవలులు, అమాయకులు, అఖండ పాండిత్య విలసితులు, బాలురు, వృద్ధులు అందరూ ఆయన ముందు భక్తి వినమ్రులై ఉండేవారు. ఆయన ఉన్న ఆత్మ నిష్ఠాసమున్నత స్థితి యందు ఈ విభేదములు లేవు. అందరి యందున్న బ్రహ్మమునే ఆయన చూసేవారు. శ్రీజగాద్గురువుల దృష్టిలో భూతభవిష్యత్వర్తమానములు ఒకే విధంగా ప్రత్యక్షములు అయ్యేవి. ఆయన దృష్టిలో ఉపాధికి అతీతముగా ప్రవర్తించేవి. ఇప్పటివరకు వారి లీలలు చదివిన మీరు గ్రహించే వుంటారు వారి గొప్పదనము, మతిమాతిశయము అతిలోకములు.
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!
" తెలుగు " చరిత
రాగం : శుద్ధధన్యాసి
తెలుగుతల్లి చరితమిదే తెలుసుకోరా!
ఆ తల్లి ఘనకీర్తిని నలుదెసలా చాటరా ! ~ తెలుగు ~
అమరావతిసీమలో డోలలూగిన బాల
నన్నయ్య చేయి పట్టి నడకలే నేర్చింది
కాకతీయుల యింట కన్నెగా యీడేరి
నెల్లూరివాడలో నెరజాణ అయ్యింది ~ తెలుగు ~
శ్రీనాధుని యింటిలో చీర కట్టిన ముగ్ధ
పెద్దన్న కావ్యాల హొయలెన్నో బోయింది
ఆ భువన విజయాన జవ్వనిగా నర్తించి
ఆ రాయల నలరించె ఆముక్తమాల్యదై ~ తెలుగు ~
ఆటవెలదీ తానే వేమన్న పద్యాల
అలమేలు మంగరా అన్నమయ గీతాల
త్యాగయ్య, గోపన్న రాముడై రాణించి
కృష్ణుడై పోతన్న తృష్ణనే తీర్చింది ~ తెలుగు ~
పద్యమై ప్రభవించి, పాటగా రవళించి
అరుణారుణ కవితగా, అలరించె నవలగా
వృత్తాల పొత్తాల పరిధి వీడి కదిలింది
విశ్వాన తెలుగు గుండె తేజమై నిలిచింది ~ తెలుగు ~
బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి!
.
చిన్నారి పొన్నారి చిఱుత కుఱ్ఱఁడ రార!
.
అయ్య రారా! చక్కనయ్య రార!
అల్లారు ముద్దుల పిల్లవాఁడా రార!
.
అప్ప రారా! కూర్మికుప్ప రార!
రత్నాల చిటిముల్లె రార! నవ్వుంబువ
.
తోట రారా! ముద్దుమూట రార!
ముత్యాల క్రోవి రా! ముచ్చట్లదీవి రా!
.
పల్కు వెన్నెల చిన్ని చిల్క రార!
కన్నకాచి రార! గారాలకూచి రా!
.
నాన్నరార! చిన్నియన్నరార!
ఆడ రార! నవ్వులాడ రారా! పల్కు
లాడ రార! కుల్కులాడ రార!
చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి !
(మనజమున కి శుభాకంక్షలుతో పెళ్లినాటి ప్రమాణాలు లోపాట.)
కావనగానే సరియా
ఈ పూవులు నీవేగా.. దేవీ..
పల్లవి: చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి దేవీ..
చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి
మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళీ అల్లరి తగునా..
చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి
చరణం: మలయానిలముల లాలన వలెనే
వలపులు హాయిగ కురిసీ.. | మలయానిలముల |
కలికి చూపులను చెలిమిని విరిసి
చిలిపిగ దాగుట న్యాయమా? ..
చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి
చరణం: తెలి మబ్బులలో జాబిలి వలెనే
కళకళ లాడుచు నిలిచీ.. | తెలి మబ్బులలో |
జిలిబిలి సిగ్గుల పిలువక పిలిచి
పలుకక పోవుట న్యాయమా?..
చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి
మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళీ అల్లరి తగునా..
చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి
No comments:
Post a Comment