*రాధ కొరకు కృష్ణుని -పారవశ్యం *
*కలల అలలపై తేలెను మల్లెపూవై *
*వలపు వయ్యారంగా మందారమై *
*మనసు సువాసనల సంపెంగమై *
*కలలో తేలుతు కలిసే పారిజాతమై *
*వయసుకు గుబాళింపు అందించే మకరందమై *
*తనువు తనువు తపింపచేసే మొగలి పూవై *
*వలపు తలపు మెరుపు చల్లబరిచే నందివర్ధనమై *
*స్వప్నంలో కనిపించే ముద్దాడే ముద్ద బంతివై *
*మక్కువకు హాయి గొలిపే విరజాజివై*
*జలకాలాటలకు సైఅన్న కలువ పూవువై *
*మకరందాన్ని దోచు అన్న తామర పూవువై*
*అధరాలు అందాలను తలపించే గులాబీవై *
*చిరునగవులు చిందింస్తూ కదిలే పూల దండవై *
*వయసు అందాలు చూపిస్తూ బూరుగ పూవువై *
*తేన రసాలతో తృప్తి పరిచే మధుర మమ్మిడివై *
*నా మనసుదోచుకున్న అందాల సుందరి నీవేరాఃదా *
*నామదిలో నిలిచిన రాధవు నివే ఒక పుష్పమై *
*--((*))--*
నీలి మేఘమా జాలి చూపుమా...ఒక నిముష మాగుమా...
చిత్రం : అమ్మాయిల శపథం (1975)
సంగీతం : విజయ్ భాస్కర్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, వాణీ జయరాం
నీలి మేఘమా జాలి చూపుమా
ఒక నిముష మాగుమా
నా రాజుతో ఈ రాతిరి
నన్ను కలిపి వెళ్ళుమా
కన్నె అందమా కలత మానుమా
ఒక్క నిముషమాగుమా
నీ దైవము నీ కోసము
ఎదుట నిలిచె చూడుమా
ఆనుకోని రాగాలు వినిపించేనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
ఆనుకోని రాగాలు వినిపించేనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
కలలు పండి నిజముగా
కనుల యెదుట నిలిచెగా
రా.. జాబిల్లీ నా నెచ్చెలీ..
జాగేల.. ఈవేళ.. నను చేరగా
నీలి మేఘమా జాలి చూపుమా..
ఒక నిముషమాగుమా
నా రాజుతో ఈ రాతిరి
నన్ను కలిపి వెళ్ళుమా..ఆ..ఆ
కళ్యాణ మేళాలు మ్రోగించనా
కంఠాన సూత్రాన్ని ముడివేయనా
కళ్యాణ మేళాలు మ్రోగించనా..
కంఠాన సూత్రాన్ని ముడివేయనా..
గుండె గుడిగా చేయనా..
నిన్ను కొలువు తీర్చనా
నీ దాసినై... సావాసినై...
నా ప్రేమ పుష్పాల పూజించనా...
కన్నె అందమా కలత మానుమా..
ఒక్క నిముషమాగుమా
నీ దైవము నీ కోసము
ఎదుట నిలిచె చూడుమా
https://www.youtube.com/watch?v=NGjFx5dTblc
స్వర రాగ గంగా ప్రవాహమే...అంగాత్మ సంధాన యోగమే ...
చిత్రం : సరిగమలు (1994)
సంగీతం : బోంబే రవి
సాహిత్యం : వేటూరి
గానం : ఏసుదాస్
పల్లవి :
ప్రవాహమే గంగా ప్రవాహమే ....
స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతే త్రికాలికే
పలికే కుహు గీతికా
గాన సరసీరుహమాలికా
చరణం : 1
గమపని గమపని గమపని గమపని
మపనిస మపనిస మపనిస మపనిస
పనిసగ సగసని సనిపమ పమగమ గ
కొండల లోపల నిండిన నింగిలో
ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో
కురిసెను రాగం ఈనాటికి
మట్టింటి రాయే మాణిక్యమైపోయె
సంగీత రత్నాకరానా
స్వర సప్తకాలే కెరటాలు కాగా
ఆ గంగ పొంగింది లోన
చరణం : 2
సని సని సగగస గసగస పమపమ
మగమగ పమపమ నిసనిప సనిసని
చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి
వినిపించు రాగాలనంతాలులే
ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు
జగమంత విహరించు రాగాలులే
పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు
పులకింతలా పుష్యరాగాలులే
మలిసందె దీపాలు గుడిగంట నాదాలు
మౌనాక్షరీ గాన వేదాలులే
https://www.youtube.com/watch?v=q2iBafrwvQY
ఎన్నెన్నో అందాలు... ఏవేవో రాగాలు..వేసే పూల బాణం పూసే గాలి గంధం
చిత్రం : చంటి (1992)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర
పల్లవి :
ఎన్నెన్నో అందాలు... ఏవేవో రాగాలు...
వేసే పూల బాణం.. పూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం... హద్దేలేని ఆనందం..
ఎన్నెన్నో అందాలు... ఏవేవో రాగాలు
చరణం 1 :
సిరిగల చిలకలు ఇలదిగి నడచుట న్యాయమా? ధర్మమా?
తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా..
చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా?
అలికిన గుడెసెల చలువుల మనసులు మేడలో దొరుకునా
అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను...
బంగారూ పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను
నిరుపేదిల్లు పొదరిల్లు...ఇలలో ఉన్న హరివిల్లు...
చరణం 2 :
జలజల పదముల అలజడి నదులకు వంత నే పాడనా
మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా
చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా
మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా
ఏ గాలిమేడల్లోనో దీపంలా నే ఉన్నా
మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా
గోదారమ్మ పరవళ్ళు..తెలుగింటమ్మ తిరునాళ్ళు...
https://www.youtube.com/watch?v=gX-pfOwvgSM
ఓ.. ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...ఏల గాలి మేడలు రాలు పూల దండలు
చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, చిత్ర
పల్లవి :
ఓ.. ప్రియా ప్రియా నా.. ప్రియా ప్రియా
ఏల గాలి మేడలు రాలు పూల దండలు
నీదో లోకం... నాదో లోకం నింగీ నేల తాకేదెలాగ
ఓ.. ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా
ఓ.. ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా
ఏల జాలి మాటలు... మాసిపోవు ఆశలు
నింగీనేల తాకేవేళ నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే... రేపు లేదులే వీడుకోలిదే... వీడుకోలిదే
చరణం 1 :
నిప్పులోన కాలదు నీటిలోన నానదు
గాలిలాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము
పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు గెలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకు
రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓయీ ప్రేమ
చరణం 2 :
కాళిదాసు గీతికీ కృష్ణరాస లీలకీ
ప్రణయమూర్తి రాధకీ ప్రేమ పల్లవి
ఆ అనారు ఆశకి.. తాజమహలు శోభకి
పేదవాడి ప్రేమకి.. చావు పల్లకి
నిధి కన్నా ఎదమిన్న గెలిపించు ప్రేమలే
కథకాదు బ్రతుకంటే బలికాని ప్రేమని
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓయీ ప్రేమ
ఓ.. ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసి తీర్చమంది లేకసి
నింగీనేల తాకేవేళ నీవే నేనై పోయే క్షణాల
లేదు శాసనం లేదు బంధనం
ప్రేమకే జయం.... ప్రేమదే జయం
https://www.youtube.com/watch?v=sitoeGe5IfU
// ఆ శోక వనాన //
_ కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
24.06.2016
ఎక్కడో తాను కుమిలి పోతూనే ఉంటుంది..
గంటల విరహాన్ని, యుగముల తలచి..
పొగిలి పొగిలి ఏకాకిగా ..నాకై
ఎదురు చూస్తూనే ఉంటుంది..!
ఆ 'శోక ' వనాన ఎంతటి ఎడబాటు
బాకుల గాయాలతో తల్లడిల్లిపోతోందో..
తన పై పారాడుతున్న దుష్ట్ల చేతుల తాకిడికి
ఎంత హాహాకారాలు చేస్తోందో..
ఏ నిశీధి గర్భాన..
మౌనంగా ఆర్తనాదాలు చేస్తోందో..!!
నా హృదయానికి దగ్గరగా..
నా స్పందనల ముచ్చటలో కరిగిపోతూ..
నా ఊసులన్నీ తనలోనే దాచుకుంటూ..
నా కర స్పర్శతోనే నిలువెల్ల పులకిస్తూ..
ఎన్ని భావాల దర్శినిగానో..
ఎన్ని అనుభవాల సాక్షీభూతంగానో..
ఎన్ని 'మేథస్సు'ల గ్రంధంగానో..
గడిపిన క్షణాల స్మృతుల అలికిడిలో
ఎంతగా మానసికంగా ఎంత అలిసిపోతోందో..!
నేనే తానై కలసి అడుగులేసిన వేళల,
జ్ఞాపకాల గులాబీల స్పర్శ గుర్తొచ్చి,
తన కటకాలు ఎంతటి
ఉప్పునీటి కెరటాలవుతున్నాయో...!
ఏమో చెలి, నీవు లేక బోసిపోయె
నా పిడికిలంత హృది..
నన్ను చేరిన క్షణాల నుంచి..
నన్ను వీడిన ఘడియ వరకూ..
అడుగులో అడుగై..
న మధు మానస మందిరమై,
నా పలుకుల మాటవై,
నా తలపుల కవనమై..,
ముడిపడ్డ మనలను,
కన్నుకుట్టిన విధి వేరుచేసెనేమో..!
నీ విరహాగ్ని కిరణాల కార్చిచ్చు రగలనీ
నీ విషాద సమీరాల సుడిగాలి పుట్టనీ
నీ ఎదురు చూపుల కన్నులతడి ఉప్పెనగా మారనీ
మనకైన ఎడబాటు గాయాల రుధిరంలో ...
'కారకుడు' కాలి బూడిదవ్వనీ...
ఓ నా స్నేహ సుధల పెన్నిధి
ఓ నా 'సెలీ '.. నా సహవాణీ..
ఓ నా ప్రియాతి ప్రియమైన 'చరవాణీ'..!
ఈ భరింపరాని నీ నిశబ్ధం..
నాకు నరక ప్రాయమే కదా..!
// పెంకి..పిల్ల//
ఎందుకే.పెంకి? నీకింత అలుసు?
ఏడిపిత్తావు.. ఎక్కిరిత్తావు...!
ఎల్ల గొడతావు..గుండె కొల్లగొడతావు
ఎలమావి తోటలో ఎలుగెత్తి పిలిసాను !
సెలయేటి గలగలల గొంతుకలిపాను
సిరుగాలి దొంతరల..మల్లెలేపంపాను !
ఎలదేటి పాటలా నినుపలక రించాను
చూసి చూడనట్టు,.నడిచిపోయేవు..!
చిన్ని నవ్వొకటి..చినుకులా విసిరేవు..
వెన్నె లొచ్చీనట్టు..అనిపించె నాకు!
పిట్టలేచుటుముట్టి..జాలిగా చూసేయి.
పిల్లగాలులు తట్టి నన్నెక్కిరించేయి.!
సూరీడు సుర్రుమని నీ వెంటపడ్డాడు
సెంద్రయ్య.ననుచూసి నవ్వుకున్నాడు..!
మల్లెప్పుడోస్తవే.. మనసు పడ్డానే
పెంకి పిల్లా. (నేను) నీ ప్రేమ లోపడ్డానే !
ఎవరితో పంపనే నావూసులు నీకు?
మక్కువో..?నను లెక్కచేయకున్నావో?
మనసిప్పి ఓ సారి మాటలాడవే.పెంకి
నీ నోటి ముత్యా లు మురిపాలు నాకు !
మనసంత నువ్వేనే.ఒకసారి చూడవే
వయసంత.నీ కొరకుఎదురుచూస్తానే!
మాట తప్పనునేను.వేటగాడిని కాను
వెన్నమనసే నాది..చిన్న దానా !
కలతపెట్టాబోను.కన్నీరు రానీను
కళ్ళలో దాచుకునికాచుకుంటానె..!
కళ్యాణగౌరి.కాశీభట్ల.(భమిడిపాటి)
మామా మోమౌ మామా
మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా
మే మోమ్మము మి మై మే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా!!
ఈ పద్యానికి అర్థం చూద్దామా.
మా = చంద్రుని
మా = శోభ
మోమౌ = ముఖము గల
మామా = మా యొక్క
మా = మేథ
మిమ్ము, ఒమ్ము = అనుకూలించును
మామ మామా = మామకు మామా
ఆము = గర్వమును
ఏమి+ఒమ్మము = ఏమి ఒప్పుకోము
మిమై = మీ శరీరము
మేము ఏమే = మేము మేమే
మమ్ము,ఓముము+ఓముము =కాపాడుము,కాపాడుము
ఇమ్ము+ఔము = అనుకూలమగుమా
.
చంద్రుని వంటి ముఖముగల దేవా! మా బుద్ధి మీకు అనుకూలించును.
గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము.
సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం. ఏకాక్షర నిఘంటువులు చూస్తే కాని ఇలాంటి పద్యాలు అర్థం కావు.
కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి.
*కలల అలలపై తేలెను మల్లెపూవై *
*వలపు వయ్యారంగా మందారమై *
*మనసు సువాసనల సంపెంగమై *
*కలలో తేలుతు కలిసే పారిజాతమై *
*వయసుకు గుబాళింపు అందించే మకరందమై *
*తనువు తనువు తపింపచేసే మొగలి పూవై *
*వలపు తలపు మెరుపు చల్లబరిచే నందివర్ధనమై *
*స్వప్నంలో కనిపించే ముద్దాడే ముద్ద బంతివై *
*మక్కువకు హాయి గొలిపే విరజాజివై*
*జలకాలాటలకు సైఅన్న కలువ పూవువై *
*మకరందాన్ని దోచు అన్న తామర పూవువై*
*అధరాలు అందాలను తలపించే గులాబీవై *
*చిరునగవులు చిందింస్తూ కదిలే పూల దండవై *
*వయసు అందాలు చూపిస్తూ బూరుగ పూవువై *
*తేన రసాలతో తృప్తి పరిచే మధుర మమ్మిడివై *
*నా మనసుదోచుకున్న అందాల సుందరి నీవేరాఃదా *
*నామదిలో నిలిచిన రాధవు నివే ఒక పుష్పమై *
*--((*))--*
నీలి మేఘమా జాలి చూపుమా...ఒక నిముష మాగుమా...
చిత్రం : అమ్మాయిల శపథం (1975)
సంగీతం : విజయ్ భాస్కర్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, వాణీ జయరాం
నీలి మేఘమా జాలి చూపుమా
ఒక నిముష మాగుమా
నా రాజుతో ఈ రాతిరి
నన్ను కలిపి వెళ్ళుమా
కన్నె అందమా కలత మానుమా
ఒక్క నిముషమాగుమా
నీ దైవము నీ కోసము
ఎదుట నిలిచె చూడుమా
ఆనుకోని రాగాలు వినిపించేనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
ఆనుకోని రాగాలు వినిపించేనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
కలలు పండి నిజముగా
కనుల యెదుట నిలిచెగా
రా.. జాబిల్లీ నా నెచ్చెలీ..
జాగేల.. ఈవేళ.. నను చేరగా
నీలి మేఘమా జాలి చూపుమా..
ఒక నిముషమాగుమా
నా రాజుతో ఈ రాతిరి
నన్ను కలిపి వెళ్ళుమా..ఆ..ఆ
కళ్యాణ మేళాలు మ్రోగించనా
కంఠాన సూత్రాన్ని ముడివేయనా
కళ్యాణ మేళాలు మ్రోగించనా..
కంఠాన సూత్రాన్ని ముడివేయనా..
గుండె గుడిగా చేయనా..
నిన్ను కొలువు తీర్చనా
నీ దాసినై... సావాసినై...
నా ప్రేమ పుష్పాల పూజించనా...
కన్నె అందమా కలత మానుమా..
ఒక్క నిముషమాగుమా
నీ దైవము నీ కోసము
ఎదుట నిలిచె చూడుమా
https://www.youtube.com/watch?v=NGjFx5dTblc
స్వర రాగ గంగా ప్రవాహమే...అంగాత్మ సంధాన యోగమే ...
చిత్రం : సరిగమలు (1994)
సంగీతం : బోంబే రవి
సాహిత్యం : వేటూరి
గానం : ఏసుదాస్
పల్లవి :
ప్రవాహమే గంగా ప్రవాహమే ....
స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతే త్రికాలికే
పలికే కుహు గీతికా
గాన సరసీరుహమాలికా
చరణం : 1
గమపని గమపని గమపని గమపని
మపనిస మపనిస మపనిస మపనిస
పనిసగ సగసని సనిపమ పమగమ గ
కొండల లోపల నిండిన నింగిలో
ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో
కురిసెను రాగం ఈనాటికి
మట్టింటి రాయే మాణిక్యమైపోయె
సంగీత రత్నాకరానా
స్వర సప్తకాలే కెరటాలు కాగా
ఆ గంగ పొంగింది లోన
చరణం : 2
సని సని సగగస గసగస పమపమ
మగమగ పమపమ నిసనిప సనిసని
చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి
వినిపించు రాగాలనంతాలులే
ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు
జగమంత విహరించు రాగాలులే
పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు
పులకింతలా పుష్యరాగాలులే
మలిసందె దీపాలు గుడిగంట నాదాలు
మౌనాక్షరీ గాన వేదాలులే
https://www.youtube.com/watch?v=q2iBafrwvQY
ఎన్నెన్నో అందాలు... ఏవేవో రాగాలు..వేసే పూల బాణం పూసే గాలి గంధం
చిత్రం : చంటి (1992)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర
పల్లవి :
ఎన్నెన్నో అందాలు... ఏవేవో రాగాలు...
వేసే పూల బాణం.. పూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం... హద్దేలేని ఆనందం..
ఎన్నెన్నో అందాలు... ఏవేవో రాగాలు
చరణం 1 :
సిరిగల చిలకలు ఇలదిగి నడచుట న్యాయమా? ధర్మమా?
తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా..
చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా?
అలికిన గుడెసెల చలువుల మనసులు మేడలో దొరుకునా
అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను...
బంగారూ పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను
నిరుపేదిల్లు పొదరిల్లు...ఇలలో ఉన్న హరివిల్లు...
చరణం 2 :
జలజల పదముల అలజడి నదులకు వంత నే పాడనా
మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా
చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా
మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా
ఏ గాలిమేడల్లోనో దీపంలా నే ఉన్నా
మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా
గోదారమ్మ పరవళ్ళు..తెలుగింటమ్మ తిరునాళ్ళు...
https://www.youtube.com/watch?v=gX-pfOwvgSM
ఓ.. ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...ఏల గాలి మేడలు రాలు పూల దండలు
చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, చిత్ర
పల్లవి :
ఓ.. ప్రియా ప్రియా నా.. ప్రియా ప్రియా
ఏల గాలి మేడలు రాలు పూల దండలు
నీదో లోకం... నాదో లోకం నింగీ నేల తాకేదెలాగ
ఓ.. ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా
ఓ.. ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా
ఏల జాలి మాటలు... మాసిపోవు ఆశలు
నింగీనేల తాకేవేళ నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే... రేపు లేదులే వీడుకోలిదే... వీడుకోలిదే
చరణం 1 :
నిప్పులోన కాలదు నీటిలోన నానదు
గాలిలాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము
పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు గెలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకు
రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓయీ ప్రేమ
చరణం 2 :
కాళిదాసు గీతికీ కృష్ణరాస లీలకీ
ప్రణయమూర్తి రాధకీ ప్రేమ పల్లవి
ఆ అనారు ఆశకి.. తాజమహలు శోభకి
పేదవాడి ప్రేమకి.. చావు పల్లకి
నిధి కన్నా ఎదమిన్న గెలిపించు ప్రేమలే
కథకాదు బ్రతుకంటే బలికాని ప్రేమని
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓయీ ప్రేమ
ఓ.. ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసి తీర్చమంది లేకసి
నింగీనేల తాకేవేళ నీవే నేనై పోయే క్షణాల
లేదు శాసనం లేదు బంధనం
ప్రేమకే జయం.... ప్రేమదే జయం
https://www.youtube.com/watch?v=sitoeGe5IfU
// ఆ శోక వనాన //
_ కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
24.06.2016
ఎక్కడో తాను కుమిలి పోతూనే ఉంటుంది..
గంటల విరహాన్ని, యుగముల తలచి..
పొగిలి పొగిలి ఏకాకిగా ..నాకై
ఎదురు చూస్తూనే ఉంటుంది..!
ఆ 'శోక ' వనాన ఎంతటి ఎడబాటు
బాకుల గాయాలతో తల్లడిల్లిపోతోందో..
తన పై పారాడుతున్న దుష్ట్ల చేతుల తాకిడికి
ఎంత హాహాకారాలు చేస్తోందో..
ఏ నిశీధి గర్భాన..
మౌనంగా ఆర్తనాదాలు చేస్తోందో..!!
నా హృదయానికి దగ్గరగా..
నా స్పందనల ముచ్చటలో కరిగిపోతూ..
నా ఊసులన్నీ తనలోనే దాచుకుంటూ..
నా కర స్పర్శతోనే నిలువెల్ల పులకిస్తూ..
ఎన్ని భావాల దర్శినిగానో..
ఎన్ని అనుభవాల సాక్షీభూతంగానో..
ఎన్ని 'మేథస్సు'ల గ్రంధంగానో..
గడిపిన క్షణాల స్మృతుల అలికిడిలో
ఎంతగా మానసికంగా ఎంత అలిసిపోతోందో..!
నేనే తానై కలసి అడుగులేసిన వేళల,
జ్ఞాపకాల గులాబీల స్పర్శ గుర్తొచ్చి,
తన కటకాలు ఎంతటి
ఉప్పునీటి కెరటాలవుతున్నాయో...!
ఏమో చెలి, నీవు లేక బోసిపోయె
నా పిడికిలంత హృది..
నన్ను చేరిన క్షణాల నుంచి..
నన్ను వీడిన ఘడియ వరకూ..
అడుగులో అడుగై..
న మధు మానస మందిరమై,
నా పలుకుల మాటవై,
నా తలపుల కవనమై..,
ముడిపడ్డ మనలను,
కన్నుకుట్టిన విధి వేరుచేసెనేమో..!
నీ విరహాగ్ని కిరణాల కార్చిచ్చు రగలనీ
నీ విషాద సమీరాల సుడిగాలి పుట్టనీ
నీ ఎదురు చూపుల కన్నులతడి ఉప్పెనగా మారనీ
మనకైన ఎడబాటు గాయాల రుధిరంలో ...
'కారకుడు' కాలి బూడిదవ్వనీ...
ఓ నా స్నేహ సుధల పెన్నిధి
ఓ నా 'సెలీ '.. నా సహవాణీ..
ఓ నా ప్రియాతి ప్రియమైన 'చరవాణీ'..!
ఈ భరింపరాని నీ నిశబ్ధం..
నాకు నరక ప్రాయమే కదా..!
// పెంకి..పిల్ల//
ఎందుకే.పెంకి? నీకింత అలుసు?
ఏడిపిత్తావు.. ఎక్కిరిత్తావు...!
ఎల్ల గొడతావు..గుండె కొల్లగొడతావు
ఎలమావి తోటలో ఎలుగెత్తి పిలిసాను !
సెలయేటి గలగలల గొంతుకలిపాను
సిరుగాలి దొంతరల..మల్లెలేపంపాను !
ఎలదేటి పాటలా నినుపలక రించాను
చూసి చూడనట్టు,.నడిచిపోయేవు..!
చిన్ని నవ్వొకటి..చినుకులా విసిరేవు..
వెన్నె లొచ్చీనట్టు..అనిపించె నాకు!
పిట్టలేచుటుముట్టి..జాలిగా చూసేయి.
పిల్లగాలులు తట్టి నన్నెక్కిరించేయి.!
సూరీడు సుర్రుమని నీ వెంటపడ్డాడు
సెంద్రయ్య.ననుచూసి నవ్వుకున్నాడు..!
మల్లెప్పుడోస్తవే.. మనసు పడ్డానే
పెంకి పిల్లా. (నేను) నీ ప్రేమ లోపడ్డానే !
ఎవరితో పంపనే నావూసులు నీకు?
మక్కువో..?నను లెక్కచేయకున్నావో?
మనసిప్పి ఓ సారి మాటలాడవే.పెంకి
నీ నోటి ముత్యా లు మురిపాలు నాకు !
మనసంత నువ్వేనే.ఒకసారి చూడవే
వయసంత.నీ కొరకుఎదురుచూస్తానే!
మాట తప్పనునేను.వేటగాడిని కాను
వెన్నమనసే నాది..చిన్న దానా !
కలతపెట్టాబోను.కన్నీరు రానీను
కళ్ళలో దాచుకునికాచుకుంటానె..!
కళ్యాణగౌరి.కాశీభట్ల.(భమిడిపాటి)
మామా మోమౌ మామా
మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా
మే మోమ్మము మి మై మే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా!!
ఈ పద్యానికి అర్థం చూద్దామా.
మా = చంద్రుని
మా = శోభ
మోమౌ = ముఖము గల
మామా = మా యొక్క
మా = మేథ
మిమ్ము, ఒమ్ము = అనుకూలించును
మామ మామా = మామకు మామా
ఆము = గర్వమును
ఏమి+ఒమ్మము = ఏమి ఒప్పుకోము
మిమై = మీ శరీరము
మేము ఏమే = మేము మేమే
మమ్ము,ఓముము+ఓముము =కాపాడుము,కాపాడుము
ఇమ్ము+ఔము = అనుకూలమగుమా
.
చంద్రుని వంటి ముఖముగల దేవా! మా బుద్ధి మీకు అనుకూలించును.
గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము.
సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం. ఏకాక్షర నిఘంటువులు చూస్తే కాని ఇలాంటి పద్యాలు అర్థం కావు.
కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి.
-------------------శుభోదయం --------------------------
ఒకరోజు ధర్మరాజు పొద్దున్నుంచీ దానాలు చేస్తూ వున్నాడు .సాయింత్రం అయేసరికి అలసిపోయి ఇవాల్టికి యింక చాలించేస్తాము అన్నాడు భీముడితో.అలా అనుకుంటుండగా ఒకతను దానం కోసం వచ్చి తనబిడ్డ పెళ్లి చేయాలను కుంటున్నాను.కొంత ధనం కావాలి అని అడిగాడు.అప్పుడు ధర్మరాజు అయ్యా!యివ్వాల్టికి సమయముఅయిపొయింది రేపు రండి.యిస్తాను అన్నాడు.ఈ మాట విని భీముడు పక్కుమని నవ్వాడు.ధర్మరాజు భీమా ఎందుకు అలా నవ్వు తున్నావు? అని అడిగాడు.అన్నా!మంచి పని ని వాయిదా వేయకూడదు.రేపటికి నీవు బతికి వుంటావని హామీ ఏమిటి?అతను బతికి వుంటాడో లేదో చెప్పగలవా?దానం చెయ్యాలని అనిపించినప్పుడే చెయ్యాలి.వాయిదా వెయ్యకూడదు,ఎవరికి తెలుసు రేపటికి నీ మనసు మారిపోవచ్చు.యివ్వటానికి నీదగ్గర ఏమీ లేకపోవచ్చు. అంటూ ఈ క్రింది పద్యము చెప్తాడు.
భోజనాత్ త్పూర్వ భాగే చ భోజనాత్ పరత స్తథా
క్షణే క్షణే మతిర్భిన్నా ధర్మస్య త్వరితా గతి:
అర్థము:--భోజనం చేయక ముందు వున్న బుద్ధి భోజనం చేసి సుఖంగా కూర్చున్నప్పుడు వుండదు. మానవుల చిత్తప్రవృత్తులు క్షణ క్షణానికి మారుతుంటాయి. కావున ధర్మకార్య మేదైనా సరే చేయబుద్ధి పుట్టిన వెంటనే చేసెయ్యాలి. లేకుంటే బుద్ధి మారిపోయే ప్రమాదం వుంది.అప్పుడు ధర్మరాజు సిగ్గుపడి ఆ యాచకునికి కావలిసినంత ధనం యిచ్చి పంపివేశాడు.
తాపసి -
కుమార నిజగుణయోగులు అష్టావధాన ప్రక్రియకై కొన్ని నూతన వృత్తములను ప్రవేశ పెట్టారు. అందులో ప్రహేళికకోసము "తాపసి" అనే వృత్తమును ఒకటి తెలిపినారు. ఈ వృత్తమునకు గణములు - స/య/భ/జ/జ/భ/ర/గ. దానిని 5,4, 5,4, 5,5,4 మాత్రలుగా విడదీయ వీలగును. క్రింద నా ఉదాహరణములు -
తాపసి - స/య/భ/జ/జ/భ/ర/గ
IIUI UU - UIII UII - UIU IIUI UU
22 ఆకృతి 744332
ధరపైనఁ జూడా - తాపసులు దేవుని - ధ్యానమున్ వనమందు సల్పన్
చెఱుపంగ దానిన్ - జెల్వముల యప్సర - చేరెఁగా సురరాజు పంపన్
సరసాలతోడన్ - సాధనలఁ నాశము - చక్కఁగా నొనరించె నయ్యో
చిరకాల నిష్ఠల్ - చిత్రముగ మారెను - చిన్నదౌ శిశురూప మయ్యెన్
నను జూడ రావా - నా మనము నిండఁగ - నాదమై నవసుందరమ్మై
విన రాగమాలన్ - బ్రేమకథ లుండఁగ - వేదమై రసబంధురమ్మై
యనిశమ్ము నీకై - హారముల నల్లుదు - హ్లాదమై మనమోహనమ్మై
మును నాదు జన్మన్ - బొందితిని పుణ్యము - మోదమున్ గన నద్భుతమ్మై
అలవోలె రావా - యబ్ధిఁ గల రంగుల - యాశగా మణు లెన్నొ తేవా
కలవోలె రావా - కమ్మనగు పాటకుఁ - గల్పనా స్వరమాల తేవా
చలివోలె రావా - చక్కనగు రాత్రికి - సాయమై వెలవెల్గు తేవా
జలవోలె రావా - చారు హృదయమ్మున - సార్ద్రమౌ యనురాగ మీవా
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
తాపసి -
కుమార నిజగుణయోగులు అష్టావధాన ప్రక్రియకై కొన్ని నూతన వృత్తములను ప్రవేశ పెట్టారు. అందులో ప్రహేళికకోసము "తాపసి" అనే వృత్తమును ఒకటి తెలిపినారు. ఈ వృత్తమునకు గణములు - స/య/భ/జ/జ/భ/ర/గ. దానిని 5,4, 5,4, 5,5,4 మాత్రలుగా విడదీయ వీలగును. క్రింద నా ఉదాహరణములు -
తాపసి - స/య/భ/జ/జ/భ/ర/గ
IIUI UU - UIII UII - UIU IIUI UU
22 ఆకృతి 744332
ధరపైనఁ జూడా - తాపసులు దేవుని - ధ్యానమున్ వనమందు సల్పన్
చెఱుపంగ దానిన్ - జెల్వముల యప్సర - చేరెఁగా సురరాజు పంపన్
సరసాలతోడన్ - సాధనలఁ నాశము - చక్కఁగా నొనరించె నయ్యో
చిరకాల నిష్ఠల్ - చిత్రముగ మారెను - చిన్నదౌ శిశురూప మయ్యెన్
నను జూడ రావా - నా మనము నిండఁగ - నాదమై నవసుందరమ్మై
విన రాగమాలన్ - బ్రేమకథ లుండఁగ - వేదమై రసబంధురమ్మై
యనిశమ్ము నీకై - హారముల నల్లుదు - హ్లాదమై మనమోహనమ్మై
మును నాదు జన్మన్ - బొందితిని పుణ్యము - మోదమున్ గన నద్భుతమ్మై
అలవోలె రావా - యబ్ధిఁ గల రంగుల - యాశగా మణు లెన్నొ తేవా
కలవోలె రావా - కమ్మనగు పాటకుఁ - గల్పనా స్వరమాల తేవా
చలివోలె రావా - చక్కనగు రాత్రికి - సాయమై వెలవెల్గు తేవా
జలవోలె రావా - చారు హృదయమ్మున - సార్ద్రమౌ యనురాగ మీవా
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
గర్భంలోని ఆడశిశువు చెబుతున్న మాటలు.. సింధు,సాక్షి, దీపలను చూసైనా మమ్మల్ని చంపకుండా వదిలేయండీ అంటూ వినతి.
చదివాక ప్రతి తల్లిదండ్రులకు చేరేవరకు షేర్ చేయండి
పుట్టబోయేది ఆడపిల్ల అని తెలియగానే కడుపులో పిండాన్ని కత్తెరలతో వేటాడిమరీ చంపించే తల్లిదండ్రులారా.. ఒక్కసారి కనులు తెరిచి చూడండి..దేశమంతా సంబరాలు చేసుకుంటుంది. మా సింధు బంగారం అంటూ జేజేలు పలుకుతుంది. గుగూల్ అంతా కోడై కూసింది. ప్రతి ఒక్కరి FB స్టేటస్ సింధు మహాన్ అంటూ మారిపోయింది. రాఖీ పౌర్ణమి రోజు సాక్షి సాధించిన విజయాన్ని చూసి సాక్షి నా బంగారు సోదరీ అని... దేశంలోని అన్నలందరూ ఆమెను తమతమ సొంత చెల్లిలాగా, రక్తంపంచుకొని పుట్టిన అక్కలాగా ఆదరిస్తున్న ఆ అభిమానాన్ని చూడండి. ఏ సంబంధం లేని దీప కర్మాకర్ అథ్లెటిక్ ఫీట్స్ లో భాగంగా పొడునోవా వేస్తుంటే..తల్లీ జాగ్రత్త అంటూ దేశమే కాదు ప్రపంచమంతా ఆమె మేలు కోరుకుంది. ఇంతకన్నా ఓ ఆడపిల్లలకు సమాజం నుండి ఏం కావాలి చెప్పమ్మా? ఇది చాలదా ఆడపిల్లల్ని కనడం గర్వకారణం అని చెప్పుకోడానికి?
ఒక్కటి, ఒకే ఒక్కటి అంటూ ఎదురుచూస్తున్న 125 కోట్ల భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఈ ముగ్గురూ.... ఆడపిల్లలే కదమ్మా.! ఎదగనివ్వు నీ కడుపులోని రేపటి ఆ సింధును, చంపబోకు నీ పొత్తిళ్ల లోని భవిష్యత్ సాక్షిను, కడతేర్చబోకు నీ రక్తమాంసాల ప్యూచర్ దీపను.!!
సింధు నువ్వు సాధించిన రజతం...పుట్టక ముందే చంపేయాలనుకుంటున్న మాలాంటి ఎందరో ఆడపిల్లలకు రక్షణ కవచం.
సాక్షి నీ కాంస్యం.... ఆడపిల్లలను కనడమే పాపం అనుకుంటున్న వారెందరికో కనువిప్పు మంత్రం.
దీప నీ పోరాటం ఆడది అబల అని వారి మీద ఆదిపత్యాన్ని ప్రదర్శించాలని చూసేవారికి ఓ చెర్నకోల దెబ్బ.
అమ్మలారా...నాన్నలారా...అన్నల్లారా...తమ్ముల్లారా.... దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సింధుకు, ఉడుంపట్టు సాక్షికి, పోరాటస్పూర్తి దీపలకు మేం వారసులం. పుట్టనివ్వండి మమ్ము, ఎదగనివ్వండి మమ్ము, బ్రతకనివ్వండి మమ్ము. ఇంతా చూసి ఇంకా మమ్మల్ని పురిట్లోనే చంపాలనుకుంటున్నారా? అయితే మీ ఖర్మ. ఇది చూసి కూడా మీరు మారకపోతే, మీ ఆలోచనలో మార్పు రాకపోతే...అలాంటి వారి కడుపున పుట్టడం కంటే చావడమే మేలు కదమ్మా.! చంపేయండి నన్ను.
అంజలి అంజలి పుష్పాంజలి...పూవంటి పదములకు పుష్పాంజలి
చిత్రం: డ్యుయెట్ (1991)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: వెన్నెలకంటి
నేపధ్య గానం: బాలు, చిత్ర
పల్లవి:
లాలలా లాలలా... లాలాలలా...
లాలలా లాలలా... లాలాలలా...
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
చరణం 1:
నిన్నదాక నువ్వునేను ఇరువురం ఎవరనీ
కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని
కడలిని పడు వానలా కలిసిన మదియిదీ
కరిగిన సిరిమోజులా కథ ఇది నాచెలి
ఎదురుగ తొలి స్వప్నం తొణికినది
ఎదలో మధుకావ్యం పలికినది
అంజలి అంజలి వలపు లతాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
చరణం 2:
కన్నుల సంకేతమె కలలకు తొలకరి
వెన్నెల జలపాతమె వలపుకు తదుపరి
గుండెలో సంగీతమె కురిసినదెందుకో
కోయిల పాటే ఇలా పలికిన విందుకో
చిలువుగ ఎదమారె మధువనిగా
అమవస నిశిమారే వెన్నెలగా
అంజలి అంజలి ఇది హృదయాంజలి
నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి
నీ గాన మాధురికి గీతాంజలి
ఎద దోచు నవ్వులకు నటనాంజలి
కవియైన నీ మదికి కవితాంజలి
చరణం 3:
అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే
అంజలి నా ఊపిరై పలికెను పల్లవే
కన్నుల నువు లేనిదే కలలే రావులే
నా మది నువు లేనిదే కవితే లేదులే
తెలిసెను నువ్వే నా మనసువని
మోజుకు నెలవైన వలపువని
అంజలి అంజలి వలపు లతాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
https://www.youtube.com/watch?v=WlR9P6qS5bQ
---------------------------------------సుప్రభాతం ----------------------------------------
శబ్ద చమత్కారాలకు పుట్టినిల్లు 'వసుచరిత్ర' శుక్తిమతిని నదిగా, స్త్రీగా వర్ణించే పద్యం లో చక్కటి శ్లేష వైచిత్రి గోచరిస్తుంది
.
జీవనమెల్ల సత్కవి నిషేవిత మాశయ మెల్ల నచ్చ తా
పావనతా గభీరతల పట్టు,ప్రచారము నెల్ల విశ్వధా
త్రీ వలయ త్రిపాల పులా దేశికముల్నవ కంబు లెల్ల ము
క్తావళి విభ్రమా స్పదము లా నది పెంపు నుతింప శక్యమే
జీవనము=ఉదకము, జీవితము కవులు=జలపక్షులు, శ్రేష్ఠ కవులు ఆశయము =మడుగు,(జలాశయము)
మానసము; ప్రచారములు=జలప్రవాహములు, సద్వర్తనము; త్రికాలములు=ముక్కారులు,కాల,క్రయ,ఫలములు; నవకంబులు=నూతన శంఖములు,
కోమలతలు; ముక్తావళి =ముక్తులైన వారికిని,ముత్యములకు నెలవు; విభ్రమాస్పదములు=
ఆశ్చర్యము కలిగించు, మునుగు కోరిక కలిగించు.
అర్థము:--ఆమె జీవితమంతా కవుల పొగడ్తలతో నిండింది. ఆశయాలన్నీ స్వచ్ఛత,పావనత,గాంభీర్యానికి
నిలయం.ఆమె నడవడిక,భూమండలానికి మూడు లోకాలలోనూ శుభఫల సూచకం.ఆమె అందం
జీవన్ముక్తుల్ని కూడా మోహ విభ్రాంతుల్ని చేసేది. ఇది స్త్రీ పరమైన అన్వయం.
నదీపరంగా చూస్తే నీటిపక్షులతో(జీవనమంటే జలమనీ,కవులంటే నీటి పక్షులని అర్థం వుంది.)
జల పక్షులు స్వచ్చమైన,పవిత్రమైన, లోతైన,జలాశయాలతో కూడినవి.ముత్యాల సమూహానికి ఆధారభూతమైన
శంఖాలతో ప్రకాశించేవి . ఇందులో సమాసోక్త అలంకారం వుంది. సంస్కృత,తెలుగు భాషా శ్లేషలు ,మిశ్రమ భాషా శ్లేషలు,సంధిలో శ్లేషలు,జాతీయాల్లో శ్లేషలు యిలా ఎన్నో విధాల శ్లేషలు ప్రయోగించాడు భట్టుమూర్తి.
శ్లోకం:-- పానీయం పాతు మిచ్చామి త్వత్తః కమల లోచనే
యది దాస్యసి నేచ్చామి నో దాస్యసి పిబామ్యాహం
ఇందులో నొక చమత్కారము.ఒక బ్రాహ్మణుడు ఒకామెను మంచినీరడుగు చున్నాడు.
ఓ!కమలలోచనా!త్వత్తః=నీ దగ్గర, పానీయం=మంచి నీళ్ళను,పాతుం యిచ్చామి=త్రాగ దలిచినాను,కానీ
యది దాస్యసి=నీవిచినట్టయితే, నేచ్చామి= నాకక్కర లేదు,నోదాస్యాసి=యివ్వనట్టయితే,పిబామ్యహం=
త్రాగుతాను.యిది చిత్రముగా నున్నది కదా! ఆ సాంకేతిక పదములు విప్పి చెప్పినచో అప్పుడది
యది దాస్యసి నేచ్చామి యనగా నీవు దాస్యసి-దాసీ+అసి=దాసీదాన వైనచో, నేచ్చామి=నా కక్కరలేదు.
నో దాసీ+అసి=దాసీదానావు కాక పోయినట్టయితే, పిబామ్యహం =త్రాగుతాను.
ఈ శ్లోకం 55,60 సంవత్సరాల క్రిందటిది.
---------------------------------శుభోదయం--------------------------------------------
స్టీఫెన్ అనే ఒక ప్రఖ్యాత డాక్టర్, వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప అవార్డును అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. రెండూ గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయిందికాన్‌ఫరెన్సుకు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒకా కారు అద్దెకు తీసుకుని ప్రయాణం కొనసాగించాడు. మళ్ళి కొంతసేపు అయిన తరువాత, విపరీతమైన గాలివాన, వర్షం..దానితో ఈ వాతావరణంలో ముందుకు సాగలేకఆగిపోయాడు. భరించలేని ఆకలి, అలసట, వేళకు వెళ్ళలేకపోతున్నాను అనే చికాకులతో ఉన్నాడు ఆ డాక్టరు. కొంతదూరం ముందుకు వెళ్ళాక, అతనికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లోకి వెళ్ళి వారి ఫోను ఉపయోగించుకుందాము అనుకున్న ఆ డాక్టరుకు ఆ ఇంటి తలుపు తీసిన ఒక ముసలామె తన ఇంట్లో కరంటు, ఫోను సౌకర్యాలు లేవు అని, బాగా వర్షంలో తడిసిపోయినందున తన ఇంట్లో కొంత సేపు విశ్రాంతి తీసుకోమని, వెచ్చగా ఉండేందుకు టీ, కొంత ఆహారం తేబుల్ మీద పెట్టి తను ప్రార్ధన చేసుకోవడానికి వెళ్ళింది. ఆమె పక్కన ఉయ్యాలలో ఒక పసివాడు ఉన్నాడు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుందామనుకున్నా, ఆమె ప్రార్ధనలు ఎంతకీ పూర్తి అవటం లేదు. ఎట్టకేలకు ఆమె ప్రార్ధనలు ముగించి వచ్చిన తరువాత, ఆమె మంచి మనసుకు ఆమె చేసిన ప్రార్ధనలు అన్నీ ఆ భగవంతుడు వింటాడు అని భరోసా ఇచ్చాడు. ఆ ముసలామె చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరిన అన్ని కోరికలూ తీర్చాడు ఒక్కటి తప్ప,ఎందుకనో ఈ కోరిక మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది.ఆమెకు అభ్యంతరం లేకపోతే, ఆమెకు కల కోరిక ఏమిటో చెప్పమని, తాను సాధ్యమైనంత సహాయపడతానని చెప్పాదు వైద్యుడు. ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది."ఈ ఉయ్యాలలో ఉన్నవాడు నా మనుమడు. అతనికి ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకింది. ఎంతో మంది వైద్యులకు చూపించాము. ఎవ్వరూ నయం చేయలేకపోయారు. ఒక్క స్టీఫెన్ అన్న ఆయన మాత్రమే ఈ వ్యాధి తగ్గించగలడు, ఆయన ఇక్కడికి చాలా దూరంలో ఉన్నాడు. అందుకే వైద్యం మీద ఆశ వదిలేసి, భగవత్ ప్రార్ధనలతో జీవితం గడిపేస్తున్నానుఅని చెప్పింది. వింటున్న డాక్టరు కళ్ళల్లో నీళ్ళు."భగవంతుడు దయామయుడు. ఆయన మీ ప్రార్ధనలు వినడమే కాదు, ఆ డాక్టరును మీ వద్దకే తీసుకువచ్చాడు కూడా. విమానం పాడయ్యి, గాలివానలో చిక్కుకుని, నేను మీ ఇంటికి వచ్చాను. కాదు కాదు, ఈ పరిస్థితి సృష్టించి ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు. ఆ డాక్టర్ స్టీఫెన్ ను నేనే." అని బదులిచ్చాడు. అప్పుడు ఆ క్షణం అతను అందుకోవలసిన అవార్డు అతనికి గుర్తు రాలేదు.ప్రార్ధన లోని మహత్యం అదే. మనం వెళ్ళలేని చోటుకు కూడా దాని శక్తి వెళుతుంది. కావలసినది నమ్మకం అంతే.1.అడగడం, 2. నమ్మడం, 3.అందుకోవడం...ఇవే ప్రార్ధనకు కావలసిన అంశాలు. భగవంతుని నమ్మి మనం ప్రార్ధిస్తే, మనకు కావలసినది ఆయన తప్పక మనకు లభింపచేస్తాడు.
No comments:
Post a Comment