Wednesday, 6 June 2018

Pranjali prabha(11-06-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
Sailor walk
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం




నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఎరా మనవడా అంటూ పిలిచింది బామ్మా 
ఏమిటిరా అంత దిగులుగా ఉన్నావ్ 
ఏమి లేదు బామ్మ ఫేస్ బుక్ లో వ్రాసే కవితలకు 
ఒక్కరు కూడా లైక్ చేయుట లేదు ఎందుకు? 
నీవే ఉద్యోగం సద్యోగం లేని సన్నాసివి, నీకెవరురా లైక్ చేసేది 
అమ్మాయిలతో చాట్ చేస్తున్నావ్ మోసపోతావంటే
వినిపించుకోవు ...  ఈ పిల్లలు ఎప్పుడు మారుతారో 
అంటూ లోపలి వెళ్ళింది బామ్మ 
అబ్బా నాకు ఎన్ని లైకులో అంటూ 
పెద్దగా అరిచాడు మనవుడు
....  ... .....
పిల్లల సంతోషం కోసం బామ్మలు సెల్ ఫోన్ వాడాల్సిన 
పరిస్థితి వచ్చింది ఇది ఏమి లోకం
అంటూ మనవాడి తలనిమిరింది బామ్మా    
ఆ ...  ఆ..      ఆ..    ఆ..    

--((*))--






తెనాలి రామలింగ కవి .
తెనాలి రామలింగ కవి మనకు 'వికట కవి' గానే తెలుసు. కాని, ఉద్భటారాధ్యచరిత్రమనే కావ్యంలో చెప్పిన పద్యం చదవండి...యెంత హృద్యంగా ఉందో...
"తరుణ శశాంక శేఖర మరాళమునకు సార గంభీర కాసారమగుచు
కైలాసగిరి నాథ కలకంఠ భర్తకు కొమరారు లేమావి కొమ్మయగుచు
సురలోక వాహినీ ధర షట్పదమునకు ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు
రాజ రాజ ప్రియ రాజకీరమునకు మానిత పంజరస్థానమగుచు"
.
"ఉరగ వల్లభ హార మయూరమునకు
చెన్ను వీడిన భూధర శిఖరమగుచు
లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి
అద్రినందన బొల్చె విహారవేళ"
శివపార్వతులిద్దరు హిమగిరి సానువులలో విహరిస్తున్నారు. ఆ విహార సమయంలో, లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి, పార్వతీ దేవి, పరమేశ్వరుడి పక్కన ఎలా (ఒప్పి) ఉన్నదంటే -పున్నమి చంద్రుని వంటి శేఖరమనే హంసకు మంచి నీటితో కూడిన లోతైన సరస్సు లాగా, కోకిల కూజితం లాంటి కంఠస్వరం ఉన్న భర్తకు, లేమావి కొమ్మ లాగా, సురలోకవాహిని - అంటే గంగ - గంగాధరమనే భ్రమరానికి, ప్రాతః కాలంలో పూచిన తామర లా (పొద్దున పూచిన పూలలో తేనె మెండుగా ఉంటుంది కదా), రాజరాజు (చంద్రుడికి రాజు) అనబడే రామచిలుకకు తనై తను ఒప్పుకుని చేరుకున్న పంజరంలా (మానిత పంజర స్థానము), ఉరగాన్నే హారంగా ధరించిన ఈశ్వరుడనే నెమలికి ఎత్తైన పర్వత సానువు లాగా (నెమళ్ళు పర్వత సానువులనే ఎక్కువ ఆశ్రయిస్తాయి కాబోలు).....ఇలా ఉందట.
.
మామూలుగా శివుడి రంగు తెలుపట, కాబట్టే తరుణ శశాంక శేఖర మరాళమయ్యాడు. ఆ తెలుపు రంగు శివయ్యకు కంఠం మాత్రం నలుపు. విషం మింగాడుగా. మరందుకే కైలాస గిరినాథ కలకంఠ భర్త అయ్యాడాయన. ఇక అమ్మవారో - లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి. భర్త కు తగిన ఇల్లాలు. అందుకే కాబోలు చిఱ్ఱు బుఱ్ఱులాడే ప్రియురాలిలాగా కాకుండా - అంటే - కలహంసకు కాసారంలా, కోకిలకు లేమావికొమ్మలా, తేనెటీగకు కంజాతంలా, రామచిలుకకు ఇష్టపడి బంధించుకున్న పంజరంలా ...ఇలా అందంగా, అనుకూలంగా ఉన్నది భర్త పక్కన.





Image may contain: sky and outdoor

నేటి హాస్యం

లవర్స్ పార్కులో చేరారు
మనం స్కూటర్ మీద పోవటం చూస్తోరుట
మీనాన్న అరిచారా ఏమిటి
మరి అరవక ముద్దు పెట్టుకుంటారా 
మనం పెళ్లి చేసుకుందామనుకున్నాముకదా
మా నాన్న పెళ్లి అయ్యేదాకా ఆటోమీద పో
అలా కుర్రోళ్లతో తిరగకు అని అరిచారు
అయితే ఎంచక్కా నేను ఆడ డ్రస్సు 
వేసుకొని ఆటోలో వస్తాలే 
ఆ ఆటో డ్రైవరుగా ఉండేది మానాన్నే
ఆ ......     ఆ ....
శంభో శంకర హర హర మహాదేవ
తద్ధింతాదిది ధింధిమీ పరుల తాండవకేళీతత్పర
గౌరీమంజుల సింజిణీ జతుల లాస్యవినోదవ శంకర

భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ
నీలకంధరా జాలిపొందరా కరుణతొ ననుగనరా
నేలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా
నగజామనోజ జగదీశ్వరా మాలేందుశేఖరా శంకరా

హర హర మహాదేవ

అంతకాంత నీ సతి అగ్నితప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది
ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది
భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా
రసతరంగిణీలీల యతిని నృత్యరతులు చేయగలిగే ఈ వేళ

జంగమ సావర గంగాచ్యుత శిర భృతమణి పుటకర పురహరా
భక్తశుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వరహరా
పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర
ఆసుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా

వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమపాశమున పిలువంగా
యోగివేష నీ మనసున కలగద రాగలేశమైనా
హే మహేశ నీ భయదపదాహతి దైత్యశోషణము జరుపంగ
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన

నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన
పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాథ శృతివినరా

హర హర మహాదేవ

Showcase and discover creative work on the world's leading online platform for creative industries.
మగధీరుడు

పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవదనకమ్మ ..
మంచుపూల కొమ్మ కొమ్మ ముట్టుకోవదనకమ్మా …
చేతినే తాకోద్దంటే .., చంతకేరావోద్దంటే ఎమవ్తనమ్మ

నిన్ను పొందేటందుకే పుట్టనే గుమ్మ ..నువ్వు అందకపోతే వృదా ఈ జన్మ .
నిన్ను పొందేటందుకే పుట్టనే గుమ్మ ..నువ్వు అందకపోతే వృదా ఈ జన్మ .

పువ్వు పైన చెయ్యేస్తే కసిరినన్ను తిట్టిందే …
పసిడి పువ్వు నువ్వనిపంపిందే

నువ్వు రాకు నా వెంట ..
ఈ పువ్వు చుట్టూ ముల్లంత ..అన్తుకుటే మంటే వొళ్ళంతా

తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నేట్టిందే …
మెరుపు తీగ నువ్వని పంపిందే …

మెరుపు వెంట ఉరుమంట ..ఉరుము వెంట వరదంట …
నే వరద లాగ మారితే ముప్పంత ….

వరదైన వరమని వరిస్తా నమ్మ ..
మునకైన సుకమని వోదీస్తానమ్మ …..
నిన్ను పొందేటందుకే పుట్టనే గుమ్మ ..నువ్వు అందకపోతే వృదా ఈ జన్మ .

గాలి నిన్నుతాకింది నేల నిను తాకింది ..
నేను నిన్ను తాకితే తప్పా ..

గాలి వూపిరి అయ్యింది నేల నన్ను నడిపింది …
ఎవితంత నీలో అది గొప్ప …

వెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది …
పక్షపాతమెందుకు నాపైన ….

వెలుగు దారిచూపింది ..చినుకు లాల పోసింది ..
వాటితోటి పోలిక నీకెలా …

అవి బతికున్నపుడే తోదవుతాయమ్మ ..
నీ చితిలో తోడై నేనోస్తానమ్మ …
నిన్ను పొందేటందుకే పుట్టనే గుమ్మ ..నువ్వు అందకపోతే వృదా ఈ జన్మ .

నేటి హాస్యం

ఆంటీ నాకు కలలు వస్తున్నాయి
"మీరు నిద్ర లో చూసెవి ...
కలలు...కలలే కావు!!
..
మరి ఏమిటి అంటి

ప్రేమ లో పడ్డవాళ్ల కి ...
రక రకాల కలలు చూపించి..
ఫోన్ రిచార్జ్ చేయించు కునేవే .........
అసలు కలలు అంటె ..
పెళ్లయ్యాక తెలుస్తుంది
ఖర్చు గురించా అంటి
ఆ ఆ అదే .....   .....

Image may contain: mountain, sky, night, nature and outdoor
నాకో తండ్రి కావాలి

ఈ ప్రపంచం తనువంతా విషం నింపుకున్న సీసా
మరణం తధ్యం
విషపాత్ర నాది
మధు పాత్ర వాడిది

నా అనురూపమైన ఆత్మ ఒడ్డున నిల్చొని
ఒక్కొక్క కెరటాన్ని చూస్తూ
ఏడుస్తూ ఉంది
అనాదరణతో కుమిలిపోతూ
లోలోన జ్వలిస్తూ ఉంది
ఈ వేదనా ప్రాయపు వయస్సులో
నన్నెవరైనా పెంచుకుంటే బావుండేది

నాకో తండ్రి కావాలి
నా చేయి పట్టుకొని నడిపించే తండ్రి కావాలి
నా దేశానికి నా పిల్లలకూ నా ప్రజలకూ
ఓ తండ్రి కావాలి

ఎవరైనా వస్తారా నా హ్రుదయానికి లేపనం
పూస్తారా
ఎవరైనా వస్తారా నా మనస్సుకు ఓ ప్రేమలేఖ
రాస్తారా
ఎవరైనా వస్తారా నాకో కొత్తలోకం
రచించి ఇస్తారా

నే బ్రతికేందుకు ఒక విశ్వాసం నా శ్వాసలో
వసంతంగా నింపుతారా

నాకో తండ్రి కావాలి
నన్ను ప్రేమించి ముద్దుపెట్టుకొనే తండ్రి కావాలి
Image may contain: people standing, ocean, cloud, sky, outdoor and water

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయత : మల్లప్రగడ రామకృష్ణ 

నాకో తల్లి కావాలి 
విషం చిమ్ముతున్న ఈ లోకంలో 
ఒడి చేర్చుకొని రక్షించేది తల్లి ఒక్కటే 
నా జీవితం మధు పాత్ర లాంటిది 
అందుకున్నవానికి తీపిదనం ఇస్తా 
తీపిదనంతో వచ్చిన తిట్లు భరిస్తా 
అందుకే నాకో తల్లి కావాలి 

నాకో తల్లి కావాలి 
నా ఆత్మ సంద్రము వడ్డున ఉండి 
ఏడుస్తున్నది ఎదుకో తెలుసా 
నన్ను ఒదార్చేవారు లేరని 
మంచి చెడు చెప్పేవారు లేరని 
కెరటం లా ఎగసి పడతావు 
ఒడ్డుకు చేరాకా చల్ల బడతావు 
నన్ను ఆపేవారు ఎవ్వరూ లేరు 
అందుకే నాకో తల్లి కావాలి
నాకో తల్లి కావాలి
అనాదరణతో కుమిలి పోతున్నాను 
అడిగినా ఆదు కొనే వారులేరు
నీ దగ్గరకొస్తే నా కేమిస్తావ్
నీ దగ్గర ఏముంది వయసా, డబ్బా 
అడిగారే తప్ప, నాగుణాన్ని గుర్తించేవారు లేరు    
నాలో జ్వలిస్తున్న వేదాన్ని గమనించ లేరు 
నలుగురి కోసం నే నుందామను కుంటే 
నీవి పాతభావాలు, మావి కొత్త ఆలోచనలు 
అన్నారే తప్ప ఆదరించే వారులేరు 
అందుకే నాకో తల్లి కావాలి
  
నాకో తల్లి కావాలి
నాచేయి పట్టుకొని బిడ్డా బాగున్నావా అంటే 
ఎక్కడలేని శక్తి నాలో వస్తుంది 
నా దేశానికి, నా పిల్లలకు, నా ప్రజలకు 
ఒక తల్లి కావాలి 
నాకో తల్లి కావాలి
ఎవరైనా వస్తారా, కష్టాలను తీరుస్తారా
హృదయానికి లేపనం పూస్తారా
నా మనస్సును తేలిక పరుస్తారా    
నన్ను కొత్తలోకానికి తీసు కెల్తారా  
నేను బ్రతికేందుకు ఒక విశ్వాసం 
విశ్వాసంతో నాలో ప్రేమ నింపు తారా  
నా శ్వాసను బ్రతికించుటకు సహకరిస్తారా 

అందుకే నాకో తల్లి కావాలి 
ఆతల్లికి నేను సేవలు చేసి తరించాలి 
ఒక తల్లి ఋణం తీర్చు కోవాలి 
కడదాకా తల్లిని మోసి జీవితం 
చాలించాలని ఒక ఆశ 
అందుకే నాకో తల్లి కావాలి
అందుకే నాకో తల్లి కావాలి ఎవ్వరైనా వస్తారా? 

--((*))--


వాతాపి గణపతిం భజే… అన్న కృతి వినని తెలుగు వాడుండడు. ఈ కృతి కోసం పుట్టినదే హంసధ్వని రాగం అనిపిస్తుంది .
హంసధ్వని వల్ల వాతాపిగణపతిం కీర్తనకి పేరు వచ్చిందా లేక వాతాపి గణపతిం కీర్తన వల్ల హంసధ్వని అందం పెరిగిందా అనేది చెప్పటం కష్టం. ఇటువంటి అన్యోన్యత మరే ఇతర రాగాలకు ఏ కృతి తోనూ లేదు.
ఈ హంసధ్వని రాగాన్ని సృష్టించినది ముత్తుస్వామి దీక్షితార్ గారి తండ్రి గారైన రామస్వామి దీక్షితార్ గారు. మరి అందుకేనేమో ముత్తుస్వామి దీక్షితార్ గారు ఇంత అందమైన కృతిని కూర్చారు ఈ రాగంలో. ఏ కొడుకు మాత్రం ఇంతకన్న విలువైన బహుమతి ఇవ్వగలడు తండ్రికనిపిస్తుంది .
తెలుగు సినిమా సంగీత దర్శకులలో హంసధ్వనిని నాకు తెలిసి ఎంతో ప్రీతితో వాడినది ఇళయరాజా. రుద్రవీణ సినిమాలో తరలి రాద తనే వసంతం అన్న పాట ఒక అద్భుతమైన కంపోజిషన్. హంసధ్వని ఆధారంగా స్వరపరచిన ఈ పాట మాధుర్యంలో వసంత కోకిల గానాన్ని తలపిస్తుంది.
ప్రేమ చిత్రంలో ఇళయరాజా స్వరపరచిన ఈనాడే ఏదో అయ్యింది అన్న పాట కూడా హంసధ్వని ఆధారంగా చేసినదే. హంసధ్వని రాగాన్ని వాడి వాతాపిగణపతిం కీర్తన ఛాయలనుండి తప్పించుకోవడం ఇళయరాజాకే చెల్లింది.
ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగంది
ఈ అనుభవం మరలా రానిది
ఆనంద రాగం మోగింది
అందాల లోకం రమ్మంది
ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగంది
నింగి నేల ఏకం కాగా ఈ క్షణమిలాగే ఆగింది(2)
ఒకటే మాటన్నది ఒకటై పొమ్మన్నది
మనసే ఇమ్మన్నది అది నా సొమ్మన్నది
పరువాలు మీటి సెలయేటి తోటి
పాడాలి నేడు కావాలి తోడు
సూర్యుని మాపి చంద్రునినాపి
వెన్నెల రోజంత కాచింది(2)
పగలు రేయన్నది అసలే లేదన్నది
కలలే వద్దన్నది నిజమే కమ్మన్నది
ఎదలోని ఆశ ఎదగాలి బాస
కలవాలి నీవు కరగాలి నేను
https://www.youtube.com/watch?v=Opj4p-SeRCU

శ్రీ వెంకటేశా దయాసాగరా...శ్రీ వెంకటేశా...

చిత్రం : శ్రీ తిరుపతమ్మ కథ (1963)
సంగీతం : పామర్తి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : లీల

పల్లవి :

శ్రీ వెంకటేశా దయాసాగరా...శ్రీ వెంకటేశా...
శ్రీ వెంకటేశా దయాసాగరా...శ్రీ వెంకటేశా...

చరణం : 1

ఎక్కడో దూరాన ఏడుకొండలమీద
ఎక్కి కుర్చుని ప్రజల మొక్కులందేవాడ
ఇక్కడే మాయింట వెలసినావయ్యా
నా హృదయ తీరాన నిలచినావయ్యా

చరణం : 2

మనసే తిరుపతికొండ మాకు నీవే అండ
కనులలో నీపాద కమలాలు నిండా
నిను భావించేము నిన్ను కొలిచేము
ఆదుకో రమ్మనీ నిన్ను పిలిచేము

చరణం : 3

దేవతలకందరికి దేవుడవు నీవు
తలచినంతనే కనుల మెదలుతుంటావు
పిలచినంతనే బదులు పలుకు తుంటావు
నన్ను నిదాసిగా భావించవయ్యా

https://www.youtube.com/watch?v=dnBW6nTg7Ek

విశ్వనాథ వారి ' 'రామాయణ కల్ప వృక్షం' !
(దశరథుడు కైకతో కోపముతో,నిస్సహాయత తో అన్న పద్యాలు)
.
వరమిచ్చిన ప్రభువగు శం/
కరు నెత్తిని చేయి పెట్టు కరణిని నాచే/
వరముఁగొని హరీ! హరి! నా/
వరమున నన్నణఁగద్రొక్కు పాతాళమునన్.
.

“శంకరుని నెత్తిన చేయి పెట్టిన భస్మాసురుని వలె” అనే
ఈ ఉపమానం గొప్పగా ఉన్నది. సారస్వతములో
ఇంత గొప్ప ఉపమానాలరుదు.
.
ఇషువుల నొడ్డుచున్ నిలిపి యేటికిఁ గోటికిఁ లాగు వాజులన్/
గృషి మెయి మూర్ఛితున్ నిను భరించిన దానికి వైజయంతపున్/
విషమ మహాహవ క్షితిని వేడక యిచ్చి వరద్వయంబు పౌ/
రుష మిది గాక యిప్పటికి రూపముఁదాల్ప వహో! వరంబులున్.
.

“(ఇషువు) బాణములను అడ్డుకొనుచు, దేవాసుర యుధ్ధభూమిలో
నిన్ను (భరించిన) రక్షించి నందులకు నీవిచ్చిన వరములు ఇప్పటికీ రూపము దాల్చలేదు’ అంటోంది కైక.
పైగా, “వేడక” అనే పదం విశ్వనాథ వారు గొప్పగా ప్రయోగించారు.
ప్రమాణాలు చేసి, పరిణామాల నెదుర్కోవటం త్రేతాయుగ రాజ లక్షణం!
రాజులు చేసిన ప్రమాణాల పరిణామాలను ప్రజలెదుర్కోవటం కలియుగ లక్షణం!
.
ఉ. తల్లినిబోలెఁ జూచును గ దా నిను రాఘవుఁడెల్ల వేళలం/
దుల్లములోన నీచెనఁటి యుద్యమ మేటి కొనర్పఁ బూనితే;
పెల్లు విషంపుఁ బాము నిటు వీఱిఁడి నై నృపకన్య యన్భ్రమం/
బొల్లువడంగ నాదుగృహ ముం జొర నిచ్చితిఁ జేటు దెచ్చితిన్.
.

చెనఁటి యుద్యమము - చెడు ప్రయత్నము
వీఱిఁడి నై - బుద్ధిమాలిన వాడినై
పొల్లు వడంగన్ - చెడి పోవుటకు
రాజకన్య అనే భ్రమతో పామును యింటిలో పెట్టుకొని చేటు తెచ్చుకున్నాను అని
కైక ను నిందిస్తున్నాడు దశరథుడు.
.
విశ్వనాథ వారి రామయణ కల్పవృక్షము లో కైకయి
వరములు తెలపగనే దశరథుడు
.
ఉ.: పచ్చని చెట్టుపై బిడుగుపడ్డవిధంబున గుప్పకూలి రా/
జచ్చెరువున్ భయంబు హృదయంబునయం దసమప్రచారవా/
యూచ్చలదుగ్రతాడన రయోద్ధతి నొప్పగ మేథ, దృష్టి, మ/
త్యుచ్చమనీషలున్ స్మృతిక్రతుల్ వశజాతులు లేక ఱాయియై
.
ప్రతిక్రియలు:
1 అశనిపాతంతో కుప్ప కూలుట. పచ్చని జీవితము దగ్ధమగుట.
2 ఆశ్చర్యము భయము-"నయము భయము విస్మయము గదుర"
అన్నట్టు. దాని వలన గుండెలొ రక్తప్రసారము అతలాకుతలమగుట.
౩.శ్వాస క్రమము, తాపములలో మార్పులు
4.మేధ, దృష్టి, మతి, ఉచ్చ(రణ),మనీష,స్మృతి, క్రతుల్, వశము తప్పి
ఈ 8 లక్షణాలు దశరథుని మతి పోవుట సూచించును.
5. శిల గా స్పందన లేకుండుట
విశ్వనాథ వారు బుద్ధి గురించి 8 విశేషణాలు ఎందుకు వాడేరా
అని ఆలోచించ వలసినది.
.
యుద్ధాకాండలో హనుమంతుడు విజయ వార్త చెప్పినప్పుడు
సీతాదేవి హనుమంతుని ప్రశంసిస్తూ;
"బుద్ధ్యా హ్యష్టాజ్గ్ యా యుక్తం త్వమేవార్హసి భాషణమ్
.
కం: అతి లక్షణసంపన్నం బతిమాధుర్య గుణభూషణాంచితమును స/
మ్మత మష్టాంగయుతం బగు మతి యొప్పగ నీవనేర్తు మాటాడంగన్
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణము -యుద్ధ కాండ
.
శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు అష్టాంగ లక్షణములను వివరించారు:
" గ్రహణం ధారణంచైవ స్మరణం ప్రతిపాదనం ఊహాపోహార్థ విజ్ఞానం
తత్త్వజ్ఞానంచ ధీగుణాః"
గ్రహించుట, ధరించుట,స్మరించుట,బోధించుట,ఊహించుట,
అపూర్వము నూహించుట,అర్థముతెలియుట, తత్త్వము తెలియుట
ననునవి యష్టాంగములు
విశ్వనాథులకు నమస్సులు!

ఆశ్రమ ధర్మాలు.!
మనిషి ధర్మాన్ని ఆచరించడానికి, కాపాడడడానికి వివిధ కర్తవ్యాలు చెప్పబదినవి.
అవే ఆశ్రమ ధర్మాలు:
1) బాల్యం 2) కౌమారం 3) బ్రహ్మచర్యం 4) గృహస్థాశ్రమమ్ం 5) వానప్రస్థం 6) సన్యాసం .
బ్రహ్మచర్యం లోనే విద్య సముపార్జన జరగాల్సి ఉంది. అనగా బ్రహ్మచర్య దశలో ఋషి ఋణాలు కొంత తీర్చుకోవడం జరుగుతుందన్న మాట.గుహస్థాశ్రమంలో పితృ ఋణాలు దైవఋణాలు తీర్చుకోవడం చెయ్యల్సి ఉంటుంది.
గ్రుహస్థాశ్రమ ప్రశస్థి:
గృహస్త ప్రజ్ఞా లక్షణము:
దయా శ్రద్దాక్షమా లజ్ఞా త్యాగశ్శాన్తిః కృతజ్ఞతా
గుణాః యస్యభవన్త్యేతే గృహస్థోముఖ్య ఏవ సః (వ్యాస మహర్షి ఉవాచ)
దయ, శ్రద్ద, ఓర్పు, లజ్జ, సదసద్వివేకము, త్యాగము, కృతజ్ఞత మున్నగు గుణముల కలిగిన గృహస్తుడు ఉత్తముడు.(వ్యాస మహర్షి ఉవాచ)
గృహస్థాశ్రమ ప్రశస్థి:
వానప్రస్థో బ్రహ్మచారీ యతిశ్చైవ తధ ద్విజాః
గృహస్థస్య ప్రసాదేన జీవన్యేతే యథావిధిః
గృహస్థ ఏవ యజతి గృహస్థ్స్తప్యతే తపః
దదాతిచ గృహస్థశ్చ తస్మాచ్ఛ్రేయో గృహాశ్రమే (పరాశర ముని ఉవాచ)
వానప్రస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, ద్విజులు మున్నగువారు గృహస్థుని ఆధారముచేతనే తమతమ ఆశ్రమ ధర్మములను నెరవేర్చుకొనుచూ జీవిస్తున్నారు. ఇందు మూలముచేతనే గృహస్తాశ్రమము సర్వ శ్రేష్ఠ మయినది.
(పరాశర ముని ఉవాచ)
యథా వాయుం సమా శ్రిత్య వర్తంతే సర్వజంతవ:
తథా గృహస్థమాశ్రిత్య వర్తంతే సర్వ ఆశ్రమా:(మను స్మృతి)
ప్రాణదాయువు నాశ్రయించి జంతువులెల్ల జీవించునట్లు, గృహస్థుని నాశ్రయించి తక్కిన యాశ్రమస్థులు జీవింతురు.(మను స్మృతి)
యస్మాత్త్రయో ప్యాశ్రమిణో జ్ఞానేనాన్నేన చాన్వహమ్
గృహస్థేనైవ ధార్యంతే తస్మాజ్జ్యేష్ఠాశ్రమో గృహీ(మను స్మృతి)
గృహస్థుడు తక్కినయాశ్రమముల వారిని వేదాధ్యయనము చేయించియు, అన్నపానముల నొసగియు బ్రతిదినము వారిని పోషించుచున్నాడు గావున గృహస్థుడన్ని యాశ్రమముల వారిలో శ్రేష్ఠుడన బడును. (మను స్మృతి)
సర్వేషామపి చైతేషాం వేదస్మృతివిధానతః
గృహస్ధ ఉచ్యతే శ్రేష్ఠః స త్రీనేతాక్ బిభ ర్తి హి(మను స్మృతి)
ఈ నాలుగాశ్రమములవారిలో శ్రుతిస్మృతులందు జెప్పబడుటవలనను గృహస్ధుడెయు త్తముడనబడును. అతడే కదా తక్కుంగల మూడాశ్రమములవారిని బోషించుచున్నాడు. కావునను ఇతడే శ్రేష్ఠుడు.(మను స్మృతి)
యధా నదీనదాస్సర్వే సాగరే యాంతి సంస్ధితిమ్
తధైవాశ్రమిణస్సర్వే గృహస్ధే యాంతి సంస్ధితిమ్.(మను స్మృతి)
అన్ని నదులను నదములను సముద్రమును జేరునట్లు తక్కిన యాశ్రమములవారందరు గృహస్ధునిపై నాధారపడియున్నరుగాన, వానిని జేరుచున్నారు.(మను స్మృతి)
వివాహము:
ప్రజయాహి మనుష్యః పూర్ణః అన్నారు. ఇక్కడ ప్రజలు అనగా పిల్లలు. ప్రతి పురుషుడు పెండ్లి చేసుకొని సంతానవంతుడు అయినపుడే అతని జీవితమునకు పూర్ణత్వము ప్రాప్తిస్తుంది అని ఈ శ్లోకమునకు అర్ధము.
అలాగే " ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః" అన్నారు. అనగా బ్రహ్మచారి వేదాధ్యయనము పూర్తి అయిన తరువాత ఆచార్యుల వారికి అనగా గురులకు తగిన దక్షిణనొసగి గురువుల అనుమతి తీసుకొని తన, తన పితరులయొక్క వంశాభివృద్ధి కొరకు వివాహము చేసుకొనవలెను.
మరియొక శ్లోకమును గమనిద్దాం:
" ధర్మ ప్రజా సంపత్యర్ధం రతిసుఖ సిధ్యర్ధం స్త్రియముద్వహే " అన్నారు.
అనగా మానవ ధర్మాన్ని నిర్వర్తించడానికి వంశాభివృధ్ధి కొరకు సంతానవంతులవడానికి ప్రాకృతమయిన రతిసుఖము బడయడానికి స్త్రీ యొక్క చేయి పట్టవలెను. ఇక్కడ ఒక విశేషము గమనించవలెను.అనగా మనిషి సంఘజీవిగా నిర్వర్తించవలసిన బాధ్యతలు ( మానవ ధర్మము ) ప్రధమ విధి గాను, తరువాత సంతానము బడయడము ద్వారా వంశాభివృధ్ధి చెయ్యడం ఆ తరువాత చివరిగా రతిసుఖము చెప్పరి. ( కామమునకు చివరి స్థానము ఇచ్చారు )
గర్భాదానము:
దంపతుల ప్రధమ సమాగమాన్ని గర్భాదానమని వ్యవహరిస్తారు. వివాహం తరువాత జరిగాల్సిన తంతు ఇది. అయితే ప్రసుతం వివాహ సమయం లోనె గర్భాదాన మంత్రాలు కూడ వల్లించి చదివెస్తున్నారు.
ఈ మంత్రం ఇలా ఉంటుంది: "దాంపత్యో: ఆయుర్భోగ శోభావృద్ధ్యర్ధం అస్యాం భార్యాయాం ప్రధమ్ గర్భ సంస్కారద్వారా సర్వగర్భ శుద్ధ్యర్ధం గర్భాదానాఖ్యం కర్మ కరిష్యే".
ధర్మ ప్రజా సంపత్త్యర్ధం రతి సుఖ సిత్త్యర్ధం స్త్రియముద్వహే అన్నరు అనగా ఒక స్త్రీని వివాహం ద్వార చేపట్టడం ప్రధమంగ ధర్మాన్ని రక్షించడనికి అని తరువాత పిల్లల్ని కనడం ద్వారా వంసాన్ని ఉద్ధరీచడనికి చివరిగ రతి సుఖానికి అని చెప్పడం విశేషం.
పుంసవనం:
పంచ దశ కర్మలు లేక షోడశ కర్మలు:
మానవుని జన్మ కారణం దగ్గరనుండి మొదలు పెట్టి జీవిత చరమాంకం వరకు మనిశికి శాస్త్ర రీత్య జరుగవలసిన ఉపచారములు లేక కర్మలు పంచ దశ కర్మలు లేక షోడశ కర్మలుగ నిర్దేశించ బడినవి.
అవి వరుసగ: ౧. గర్భదానము, ౨. పుంసవనము, ౩. సీమంతము, ౪. జాతకర్మ, ౫. నామకరణమ్, ౬. అన్నప్రాసనం, ౭. చౌలం, ౮. అక్షరారంభం, ౯. ఉపనయనం, ౧౦. ప్రజాపత్యం, ౧౧. సౌమ్యమ్, ౧౨. ఆగ్నెయమ్, ౧౩. వైస్వదేయం, ౧౪. స్నాతకం, ౧౫. వివాహం, ఆఖరుగ ౧౬. అంత్యేష్టి.
పైన వివరించిన కర్మలలో చివరి కర్మ మినహాయించినపుడు పంచదశ కర్మలుగాను పదహారవ కర్మ అంత్యేష్టి తో కలిపి షొడశ కర్మలు గాను చెబుతారు. ఈ కర్మలనె సంస్కారములు అని కూడ అంటారు.
( ఒక చిత్రమయిన
 విశయమేమిటంటె ౧౫౦ సంవత్సరాల పూర్వం బ్రిటిశు వారు ఈ కర్మలను ఎలా ఎగతాళి చేశారొ ప్రస్తుతం చదువుకున్న వారు కూడ అదే బాణీలొ ఈ సంస్కారాలలోని లోపాలను మాత్రమి ఎత్తి చూపిస్తు వీటి లోని మహాశయాలను విస్మరిస్తున్నారు . అయితే ఎవరి పంధాలొ వారు ఈ కర్మలను తరతరాలుగ పాటిస్తుఉనె వ్య్న్నరు).
గోరువెచ్చని సూరిడమ్మా... పొద్దుపొడుపులో వచ్చాడమ్మా...

చిత్రం: జయసుధ (1980)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

గోరువెచ్చని సూరిడమ్మా... పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
గోరువెచ్చని సూరిడమ్మా... పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
వద్దన్నా... రావద్దన్నా...
గు౦డెల్లో గుడిసె వేసి... అది గుడిగా చేసి
ఆ గుడిలో దాగున్నాడమ్మా...
ఆ గుడిలో దాగున్నాడమ్మా...
గోరువెచ్చని సూరిడమ్మా... పొద్దుపొడుపులో వచ్చాడమ్మా

చరణం 1:

మిట్టమధ్యాహ్న౦ నడి నెత్తిన వచ్చాడు
ఒ౦టరిగా పోతు౦టే ఎ౦టె౦ట పడ్డాడు
ఇనకు౦డా పొతు౦టే అరిచరిచి పిలిచాడు
ఆ..ఆ..ఆ..
పిలిచిపిలిచి అలుపొచ్చి... పైకెక్కానన్నాడు
ఎతికి ఎతికి అలకొచ్చి... ఏడెక్కానన్నాడు
ఆ ఏడి దిగాల౦టే... నా తోడు కావాల౦ట
నే తోడు ఇస్తాన౦టే... తను దిగి వస్తాడ౦ట

గోరువెచ్చని సూరిడమ్మా... పొద్దుపొడుపులో వచ్చాడమ్మా

చరణం 2:

పొద్దుగూకేయేళ ఎదురుగా వచ్చాడు
ఎనుతిరిగిపోతు౦టే ఎనకెనక పిలిచాడు
పోని అని తిరిగితే ఎర్రెక్కి ఉన్నాడు
అ..అ..అ
ఆగి ఆగి అగలేక... దిగి వచ్చానన్నాడు
చూసి చూసి మత్తెక్కి... పిచ్చెత్తిందన్నాడు
ఆ పిచ్చి దిగాల౦టే... నా తోడు కావాల౦ట
నే తోడు ఇస్తాన౦టే... పొమ్మన్నాపోడ౦ట..

గోరువెచ్చని సూరిడమ్మా... పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
వద్దన్నా... రావద్దన్నా...
గు౦డెల్లో గుడిసె వేసి ...అది గుడిగా చేసి
ఆ గుడిలో... దాగున్నాడమ్మా
ఆ గుడిలో... దాగున్నాడమ్మా
గోరువెచ్చని సూరిడమ్మా... పొద్దుపొడుపులో వచ్చాడమ్మా

https://www.youtube.com/watch?v=rZU4EnPQ65U

--((*))--
ఓపలేని వేదనలో ఒలుకుతాయి కన్నీళ్ళు ||
చెక్కిలిపై చిరునవ్వులు చెరుపుతాయి కన్నీళ్ళు || 


అధికమైన ఆనందపు తీరాలను తాకుతూ 
పట్టలేని హాసంలో పలుకుతాయి కన్నీళ్ళు || 


గతమైనా గాయమేదో మౌనముగా పిలిస్తే 
కంటి కుండ బద్దలౌతూ జారుతాయి కన్నీళ్ళు || 


చేజారిన అనుబంధపు ఆలాపన వినిపిస్తే 
శ్వాసఆగి కుప్పకూలి కురుస్తాయి కన్నీళ్ళు || 


మౌనవాణి మాటలన్ని మూగబోయి మిగిలాయి 
పలుకులేని పెదవులపై తొణుకుతాయి కన్నీళ్ళు || 


తడబడుతూ బతుకుబాట నిర్వేదం నింపుకుని 
దైన్యానికి ధైర్యమౌతు చిందుతాయి కన్నీళ్ళు || 


అనుభూతుల అలుకలలో చెమరించిన మరకలో 
ఙ్ఞాపకాల చెట్టునుండి రాలుతాయి కన్నీళ్ళు 



No comments:

Post a Comment