Tuesday, 26 June 2018

Pranjali Prabha*

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయ నమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 
వద్దన్నా రాంద్రాన్వేషణా సక్తి ఎందుకు - యతి వినయంబు ఉన్నజాగర్త పడ రెందుకు
కార్యం సఫలం అవుటకు గర్వం ఎందుకు - సమాయంబు కాదంటూ త్రిప్పుటెందుకు
దర్శనం కోసం వస్తే అడ్డుపెట్టుటెందుకు - పెడమోము చూపి తిరస్కరించుట ఎందుకు
నీవు లోభంతో గదిమి వేయుట ఎందుకు - సమాధానము చెప్పక మౌనం ఎందుకు       

లిట్టి ప్రభుదుర్ణయపుఁ జేష్ట లెఱుగలేక
వెంబడించెడి వాడెపో వెఱ్ఱివాడు
దానికొడ బడ డింగిత జ్ఞానశాలి
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--


కన్నంబు ద్రవ్వి తస్కరు డింటివానికి, వాడు లేడని ముంతవైచి చనునె
తెరవాటుకాడు చింతించునే కట్టిన, బట్ట డుల్చిన మానభంగ మనుచు
వలబడ్డమెకము చూల్వహియించె నంచును, విడువంగఁజూచునే వేఁటకాఁడు
జారుండు పరకాంతశయ్యపై దారిచి, వావి గాదనిపల్కి వదలి చనునె
ఆత్మజను గుత్త రూకల కమ్ము నాతఁ
దరణమున నొసంగఁజూచునే యల్లునకును
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

నేటి కవిత 
భావ రస రంజరి 
రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ  

కన్నంబు తవ్వి తస్కరుడు 
ఇంట దూరే  
మగవాడు లేడు మొత్తం 
దోచుకోరా తస్కరా
కళ్లుతెరచి ఉడాయించే తస్కరుడు   

తస్కరుడు తెరచాటు చేరి 
కదిలించగా 
వెలువలూడ్చి దాహం తీర్చరా 
కళ్లుతెరచి ఉడాయించే తస్కరుడు

తస్కరుడు వలలో చిక్కానే 
అనే భయముతో 
విడువరా నన్ను విడువరా  
తస్కరా, తన్ను తినకరా  
కళ్లుతెరచి ఉడాయించే తస్కరుడు

కలవరింతలు కాపు కాసి
భ్రమలు తొలగింప చేసి  
కలలో తన్మయత్వం చూపి 
హాయిగా నిద్రలో జారే 
--((**))--


నేటి కవిత  
భావ రస మంజరి
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

ఆకాశ వీధి: లో హాయిగా తిరిగేవు 
చల్లగా జారీ వర్షము కురిపించావా మబ్బు మామా 
తెల్లని వెన్నెలతొ తిమిరాలు తొలగించ
చల్లని గాలితో తడిలో ముంచవా మామా 

నీలాల గగనంలొ నిండుగా వెలి గేవు! 
కనుసైగ చేస్తున్నా కరిగి పావుటకు రావా మామా 
చల్లని వెన్నెలలొ సాగర తీరములొ 
ఉడుకు రక్తం తో ఉవ్విళ్లూరుతో ఉన్నాను మామా 

చలి గాలి కెగిరేను సరస మాడగ పైరు 
ఆకలి తీర్చి అలసట తీర్చుకో మబ్బు మామా 
ఊహలలొ విహరించె నామనసు నీకె 
త్వరత్వరగా వచ్చి తమకం తగ్గించు మామా 

వీణ మూగ బోయింది నీ వేడి కదలిక కోసం 
మదిలో తలిచా కనురెప్ప కదిలించు మామా  
పున్నమి రేయిది పూల పానుపులా పిలిచా  
నీ తుషార బిందువులను రాల్చి చల్లఁపర్చు మామ 

తెల్లచీరెలొఅందమే తళుకు మని ఉన్నా  
ఉరుములు మెరుపులు తగ్గించి చల్లపరచి పోమామా 


--((**))--


నేటి కవిత 
భావ రస మంజరి 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

1 . కలల్లో దాహం గమనించి 
      - కల్లోలాన్నీ తొలగించు 
     కనువిందు చూపు అందించి 
     - కొనలనాగు కోరిక తృప్తి పరచు

     నవ్వులతో నయనాల కదలిక 
     -హృదయ స్పందనవు మేలి కలయక
     నధరాల అమృతం మరువలేక 
     -విశ్రాంతి కల్పించి విందు చేయుచు          

    ప్రేమకు సమానమైన విద్య లేదు   
     -విద్యకు సమానమైన నేత్రము లేదు
    పతిదేవునికి వాక్కు మించినది లేదు 
    -సత్యవాక్కుకు సమానమైన తపస్సు లేదు 

    సుఖానికి మించిన తపస్సు లేదు 
     -తపస్సే సుఖానికి నాంది అనక తప్పదు
     అలుకలేని కాపురం అందమైనది కాదు 
    -స్వీయ తపనలు పతి కౌగిలింతకు నాంది

    మనసు, మాట, పని, ఒకే మాదిరి
    సర్వ కార్య సిద్ధికి ఇరువురిదీ ఒకేదారి 
   త్రికరణ శుద్ధిగా  ఏకమై బ్రతుకే దారి 
   అభ్యుదయమే హృదయానందానికి దారి 
             
      --((*))-- 

ఆకాశ వీధిలో హాయిగా తిరిగేవు 
అందాల ఓమామ నా చందమామ! 

తెల్లని వెన్నెలతొ తిమిరాలు తొలగించ 
నీలాల గగనంలొ నిండుగా వెలి గేవు! 

చల్లని వెన్నెలలొ సాగర తీరములొ 
చలి గాలి కెగిరేను సరస మాడగ పైట! 

ఊహలలొ విహరించె విను వీధిలొమనసు 
వీణలే మ్రోగగా మదిలోన నిను తలచి! 

పున్నమి రేయిది పూల పానుపు పిలిచె 
తెల్లచీరెలొఅందమే తళుకు మని మెరియ! 

శ్రీనివాసమూర్తి గంజాం 
26-6-18


శ్రీవారూ! నాకు రచయిత్రినవాలనుంది! 

నాకు సంబందించి 
నువ్వు గొప్ప రచయిత్రివే, 
ఇప్పుడీ విషయం లోకానికి తెలియాల్సుంది! 

కాస్త విడమరచి చెప్పొచ్చుగా! 
మంచి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తెస్తాను! 

నువ్వు ఏదైనా పెళ్ళికి వెళ్ళావనుకో 
ఆ పెళ్ళి ఎంత ఘనంగా జరిగిందో కళ్ళకు కట్టినట్లుగా నాకు చెబుతూ కొసమెరుపుగా మగపెళ్ళివారి పెట్టుపోతలు మరీ మరీ చెప్పి, దానిని మన పెళ్ళితో ముడి పెట్టి, మావాళ్ళు నీకు చేసిన అన్యాయాన్ని పూస గుచ్చినట్లు వర్ణించి విచారంలో మునిగిపోతావు! 
ఎవరింటికైనా వెళ్ళావనుకో 
వాళ్ళ ఇంటిపై, ఆ ఇంటాయన చూపించే శ్రద్ద, 
ఆయన కారణంగా బాత్రూమ్, కమోడ్ 
ఎంత శుభ్రముగా వుంటాయో వర్ణించి, వర్ణించి, 
ఆ విషయాన్ని నాతో పోల్చి నేనొక్కడినే కాకుండా, నన్ను కన్న పాపానికి మా అమ్మనూ కలిపి 
నాకు కూడా తెలియని భయంకర రహస్యాలను కూడా జొప్పించి కడు రమ్యముగా దులిపేస్తావు!
--((**))--


గురువుగారూ! 
సముద్రపు నీళ్ళంత ఉప్పగా కన్నీళ్ళు ఎందుకు ఉంటాయో? 

సముద్రమంత బాధ గుండెల్లో ఉంటుంది కాబట్టి నాయనా!

--((**))--

మాష్టారూ!ఐదు వందలివ్వండి సార్, 
నాలుగు రోజుల్లో ఇచ్చేస్తా 

ఇంద! ఖచ్చితంగా ఇచ్చేయాలి సుమీ! 

ఎంత మాట! మీరు నా పాలిట దేముడంటే నమ్మండి! 
********************* 

ఎక్కువ డబ్బిచ్చేసావు ఆనందం 

500 తల్లి సార్, 50 పిల్ల సార్ 

*******×***** 

మాష్టారు! 20,000 అప్పివ్వండి సార్, 
పది రోజుల్లో తిరిగిచ్చేస్తా! 

ఇంద! 
*****************×* 

ఇవిగో సార్, తల్లి 20,000, పిల్ల 2000 
**×*********** 

మాష్టారు! నెలలో ఇచ్చేస్తాను, 5,00,000 అప్పివ్వండి సార్! 

మాష్టారు తల్లి,పిల్లని ధ్రుష్టిలో పెట్టుకుని ఇచ్చేసారు 5,00,000 
********* 

ఏమయ్య ఆనందం! ఆర్నెల్ల పోద్దైంది, 
తల్లీ లేదూ, పిల్లా లేదు! 
నీకిదేమైనా ధర్మమా చెప్పు! నువ్వు అదనంగా ఇచ్చే సొమ్ముకి ఆశపడి, మా ఇంటావిడ నగలు తాకట్టు పెట్టి మరీ నీకిచ్చానే 5,00,000 

" మూణ్ణెలైంది తల్లి పోయి! 
ఆ బాదలో నేనున్నాను సార్ 
ఇంక పిల్ల వూసే లేదు సార్! "

--((**))--

నేటి కవిత 
భావ రస రంజరి 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

వాకిట్లొ ముగ్గూలె, లోగిల్లొ చిందూలె, 
సరదా సరదాకి ముచ్చట్లే  
చీకట్లొ ఆట్లాటె, అంగట్లొ అప్పుల్లె, 
ముద్దు మురిపాల ముచ్చట్లే  
తాకట్లొ ఆస్తుల్లు, సందట్లొ ఆర్భాటు
విద్య ఆర్భాట ముచ్చట్లే 
ఎండల్లొ చన్నీళ్ళు, వాణల్లొ వేడ్నిళ్లు,
మూడు నాళ్ళ ముచ్చట్లే 
నిద్రాకి దుప్పట్లు, కుంపట్లొ మంటళ్లు, 
ఒకరి కొకరు ముచ్చట్లే 
అత్తింట్లొ ముచ్చట్లు, పుట్టింట్లొ చప్పట్లు 
నీకు నాకు మధ్య ముచ్చట్లే 

ఈ పూట కేమేమి,ఈ రాత్రి వెన్నెల్లొ 
నవ్వుల పువ్వుల ముచ్చట్లే 
నవ్వు ల్లె పువ్వుల్లొ,  నావెల్గు నీవేగ
నలిగి కరిగే ముచ్చట్లే 
నాతృప్తి నీ వేగ, ఈ వేష మెచ్చేన 
చీకటి వెల్తురు ముచ్చట్లే 
ఈ మాట ఏ తీర్పు, ఈ ఆశ ఏ మాయ
సరుబాటు ముచ్చట్లే 
ఈ బొమ్మ నీదేను, పొందాలి చీకట్లొ 
ఏకపరాకాష్ట ముచ్చట్లే
ఇకచాలు నిద్రవస్తుంది      
వలువలు కట్టుకొని నిద్రపో 
--((**))--


హరహర శంకర

జయజయశంకర వరసుత

అభయ అభిరామ సుధావర

విరిహరి సుమసమ పరిమళ

నందనానందుల కౌశలసుధామ

పావనవనికి పావనవనమాలి

భావనావననీ

సుసృజనభాషితములు.🌹🌹


**** చరవాణి స్తోత్రమ్ ****
*********************
ప్రథమం వాయుభాషణం|
ద్వితీయం యంత్ర గణనం|
తృతీయం ఛాయాచిత్రాణి |
చతుర్థం క్రయ విక్రయం |
పంచమం అంతర్జాలిన్యాం |
షష్టమం క్రీడా విలాసిని |
సప్తమం చిత్ర దర్శిని |
అష్టమం ఖండాతర దర్శినీ |
నవమం సర్వప్రాంత విహారిణీ |
దశమం మార్గదర్శిని |
ఏకాదశం ముఖపుస్తకే |
ద్వాదశం వ్యర్థ సందేశః |
ఇతి ద్వాదశ నామానీ |
చరవాణీ నమోస్తుతే||

చరవాణీ నమస్తుభ్యం |
సర్వ వార్తా సమన్వితః|
చరాచర స్వరూపేణ |
విద్యుత్ గ్రాస భక్షిణీ||1||

చిత్రగ్రహణ రూపేణ|
యంత్ర గణన రూపిణీ |
క్రయ విక్రయ సర్వాణీ |
గృహ ప్రాంగణ దర్శిని||2||

సర్వ స్తోత్రాణి గానాని |
కర్ణాంతరాళ శ్రావణి |
దూర ప్రాంతేషుమార్గాణి |
అంతర్జాల సందర్శిని ||3||

మధ్యమాంగుళ తర్జన్యా|
స్పర్ళ మాత్రేణ శోభినీ |
సర్వ మానవ హస్తేన |
అలంకారేణ దర్శనం॥|4॥

సర్వక్రీడా సముత్పన్న |
సర్వ వస్తు విలక్షణ|
దూరభారాణి విచ్ఛేద |
వాయుమార్గ సంచారిణీ ॥5॥

ఖండాంతర నివాసిన్యాం|
భాషణేషు సమీపతః |
వాయు సంకేత గ్రాహేణ|
సమీపేన సందర్శిని ॥6॥

వినా మానవ హస్తేన |
క్షణక్షణ విచారిణః |
చరవాణి సభా మధ్యే |
సంభాషణే విశేషతః ॥7॥

కార్య కారణ సంబంధ |
మధ్యే వాయు విహారిణీ |
సందేశాని సంకేతాణి |
పురోగతి నిరోదకః ॥8॥

వయో విత్తం జ్ఞాన శూన్యం|
లింగ భేదాన్యేవచ |
చరవాణీ వినాహస్తే |
పశు రూపేణ గణ్యతే ॥9॥

జల మధ్యే జంతు మధ్యే ప్ర యాణే గమనేషుచ|
గృహ మధ్యే కార్య మధ్యే ప్రయాణ ప్రాంగణేషుచ |
యాజ్ఞీకేషు యాచకేషు వైద్య వైజ్ఞానికేషుచ|
దేవాలయే విద్యాలయే చరవాణీ సందర్శనమ్ ॥ 10 ॥

వాగ్భూషణం చరభాషణం|
చరవాణీ హస్త భూషణం|
కర్ణే వార్తాయాం శ్రవణం |
చరవాణీ నమోనమః ॥11॥

కంపనం ఆగమనేన |
సూక్ష్మ ప్రాణి వినాశనం |
సంభాషణేన సర్వాణీ |
వాయు మార్గేన గమ్యతే ॥12॥

సంఖ్యా మాత్రేణ ఆహ్వానం |
సంఖ్యా ధీనేన వర్తినీ|
వ్యర్థేన కాలక్షేపాయ |
కుర్వంతి వ్యర్థ భాషణం ॥13॥

జ్ఞప్తి పత్రాణి సంయుక్త |
నామ పత్ర సమన్విత |
ఇదం పత్ర వినాశేన |
సర్వ సంబంధ నాశనం ॥14॥

#$ ఫలశృతి* *#$
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
ప్రయాణే భాషణేనస్య |
ప్రమాదానిచ లభ్యతే |
వైద్యశాలాయాం గచ్చంతీ |
పరలోకం చ లభ్యతే ॥

చరవాణీ యో జానాతి |
అనారోగ్యంచ లభ్యతే|
నిత్య ప్రయోగ మాత్రేన|
మృత్యు మార్గం చ గమ్యతే||
***************ఎవరు రాసారో తెలీదు కాని బాగుంది.



సిగ్గేలనే బాల సిగ్గేలనె మదినేలు మాధవుడు
మనసార నిను పిలువ సిగ్గేలనే బాల సిగ్గేలనె!

సిగ్గు తో వాలగా సింగారి నీ కనులు
సిగలోని మొగ్గలు విరబూసె నవ్వులై!

సుకుమారి సుందరి, సోయగాలను చూచి
కోరింది నా మనసు కోసరుగా ఒక ముద్దు!

హద్దు లేదే చెలియ యిద్దరి మధ్య నిక
హత్తు కొనవే హృదిని అరమరికలే వద్దు!

ప్రణయా రాధన వేళ పంతాలు యేలనె
పంచు కోరావె మన ప్రేమ సామ్రాజ్యము!

శ్రీనివాస మూర్తి గంజాం
25-6-18


--((**))--

ఆవుపాలు నెయ్యి నైవేద్యమిడినారు 
కర్పూర హారతినె జూపినారు 
సుప్రభాతము ముగిసె భక్తులెల్ల తనియ 
తిరుమలగిరివాస ఓ శ్రీనివాస! 

సుప్రభాతగానం పూర్తికాగానే స్వామికి నైవేద్యమిచ్చి, కర్పూర హారతిని చూపిస్తారు. ఇదంతా తెరవెనుక జరుగుతుంది. సుప్రభాత సమయంలో లోపల అర్చకులు, జియ్యంగార్లు మాత్రమే ఉంటారు. వారు దీపాలను సరిజేసి, కొత్తదీపాలు వెలిగించి, స్వామివారి దోమతెర తొలగించి, తూగుటుయ్యలపైన పవళించిన స్వామిని మేల్కొలిపి, ఆ భోగశ్రీనివాసుని స్నపనమండపం నుండి గర్భగృహంలోని జీవస్థానానికి చేరుస్తారు. స్వామివారి పరుపు, మంచాలను గొల్ల బయటకు తెచ్చేస్తాడు. ఇవన్నీ పూర్తయ్యాక భక్తులకు స్వామి దర్శనం కలుగజేస్తారు. 

No comments:

Post a Comment