Sunday, 17 June 2018

Pranjali Prabha (23-06-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:
Photo
ఆనందం -  ఆరోగ్యం - ఆధ్యాత్మికం   


తేది : 23, జూన్ 2018
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ఏకాదశి
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 22 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 53 ని॥ వరకు)
నక్షత్రం : స్వాతి
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 11 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 21 ని॥ వరకు)
యోగము : శివము
కరణం : వణిజ
వర్జ్యం :
(ఈరోజు ఉదయం 8 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 43 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు రాత్రి 6 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 47 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 7 గం॥ 28 ని॥ నుంచి ఉదయం 8 గం॥ 20 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 9 గం॥ 0 ని॥ నుంచి ఉదయం 10 గం॥ 38 ని॥ వరకు)
గుళికకాలం :
(తెల్లవారుజాము 5 గం॥ 43 ని॥ నుంచి ఉదయం 7 గం॥ 21 ని॥ వరకు)
యమగండం :
(మద్యాహ్నం 1 గం॥ 56 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 34 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 43 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 53 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : తుల

నేటి కవిత   
పితృదినోత్సవం సందర్భముగా 
ప్రాంజలి ప్రభ ప్రాస కవిత్వం 
రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ 

అమృతాన్ని అందించి గరళాన్ని మింగేవాడు 
ఆశ్రయం కల్పించి కల్పతరువైన వాడు 
ఇల్లు, ఇల్లాలిని ఆదరించి ఆదుకునేవాడు 
ఈశ్వరునిలాగా సర్వం త్యజించునట్లుండేవాడు

ఉజ్వల భవిషత్తుకు నాంది పలికిన వాడు
ఊసర వెల్లిలా రంగులు మార్చని వాడు
ఋషి తత్వాన్ని హిత బోధ చేసే వాడు 
ఎన్ని అన్నా భార్య మాట దక్కించే వాడు

ఏ పరిస్థితులలో కుటుంబాన్ని వీడని వాడు
ఐశ్వర్యం ఉన్నా గర్వం లేని వాడు 
ఒనమాలు దిద్దించి గురువుల సైతం పూజించేవాడు 
ఓం శ్రీరాం అని జపిస్తూ దైవాన్ని కొలిచేవాడు 

ఔషధం అందించి తల్లితండ్రులను ఆదుకునే వాడు
అందరి కోసం,  దేశం కోసం బ్రతికేవాడు 
అ: అన్న, ఓహో అన్న, ధర్మాన్ని కాపాడేవాడు  
క్రమశిక్షణతో సమయ పాలన చేసే వాడు 

గర్వము చూపక గణపతిలా ఉండే వాడు 
చమత్కార సంభాషణలతో ఊరడించే వాడు
జయమే ధ్యేయముగా నడిపించే వాడు 
టక్కు టమారులను తరిమే వాడు

డబ్బాలుకొంటెవాడ్ని వాయించే వాడు
తరతరాల సంస్కృతిని కాపాడే వాడు
పగలనక రేయనక కష్టపడే వాడు
మనస్సును పంచి మనస్సేరిగిన వాడు 

యెల్లలు లేని సముద్ర మంత కుటుంబాన్ని ఈదేవాడు
రంజింపచేసి రంజిల్లే వాడు 
లయకారుడుగా దేశసేవ చేసే వాడు 
వజ్రం కన్నా విధ్యే మెలనే వాడు

గతించిన పితృదేవతలకు శ్రాద్ధ కర్మ చేసే వాడు  
కృప,వాత్సల్యం తో పుత్త్రధర్మాన్ని నెరవేర్చే వాడు  
జన్మనిచ్చిన తల్లి దేవతైనా, జన్మకు కారకుడైన తండ్రి 
దైవాంశ సంభూతుడు, మనపాలిట పెన్నిధి
అనురాగ, ఆప్యాయత పంచేవాడు తండ్రి 
--((*))--

సిరివరమై ధరణీవరుల సృజనబలిమిని

పావనమయమొనరించు తరుణమున

అమృతోదయం. పదముల సంపూర్ణత

పలికించు కళాంజలి.ఆత్మీయ సుధాములకు

మనోహర ఆత్మాంజలి.


నేటి పాత  సాహిత్యం 

సీ|| పద్మలోచన సీసపద్యముల్ నీ మీఁదఁ 
జెప్పఁబూనితినయ్య! చిత్తగింపు 
గణ యతి ప్రాస లక్షణముఁజూడగ లేదు; 
పంచకావ్య శ్లోక పఠన లేదు, 
అమరకాండత్రయం బరసి చూఁడగ లేదు, 
శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు, 
నీ కటాక్షంబున నే రచించెదఁగాని 
ప్రజ్ఞ నాయదికాదు ప్రస్తుతింపఁ 
తే|| దప్పు గలిగిన సద్భక్తి తక్కువౌనె? 
చెఱకునకు వంకపోతేమి జెడునె తీపి! భూ. 

సీ|| గార్ధభంబున కేల కస్తూరి తిలకంబు? 
మర్కటంబున కేల మలయజంబు? 
శార్దూలమున కేల శర్కరాపూపంబు? 
సూకరంబులకేల చూతఫలము? 
మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి? 
గుడ్లగూబల కేల కుండలములు? 
మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్? 
బకసంతతికి నేల పంజరంబు? 
తే|| ద్రోహచింతనఁ జేసెడి దుర్జనులకు 
మధురమైనట్టి నీ నామ మంత్రమేల? భూ

--((*))--


కొండగాలి తిరిగింది !
.
కొండగాలి తిరిగింది గుండె వూసు లాడింది
.
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది "
.
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
.
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది "
.
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయింది
.
నాగమల్లె పూలతో నల్లని జడ నవ్వింది "
.
పడుచు దనం అందానికి తాంబూలమిచ్చింది
.
ప్రాప్తమున్న తీరానికి పడవసాగి పోయింది "

శ్రీకాళహస్తీశ్వర శతకము.!.....ధూర్జటి...

నిన్నున్నమ్మినరీతి నమ్ము నొరులన్, నీకన్న నాకన్న లే 
రన్నల్దమ్ములు,తల్లిదండ్రులు గురుం డాపత్సహాయండు, నా 
యన్నా!యెన్నడు నన్ను సంస్కృతి విషా దాంబోధి దాటించి య 
చ్చిన్నానంద సుఖాబ్ది దేల్చెదోకదే! శ్రీ కాళహస్తీశ్వరా!. 

పరమేశ్వరా! నేను నిన్ను నమ్మిన విధముగా వేరెవ్వరినీ నమ్మలేదు. 
నమ్మను కూడ.నీకంటే నాకు తల్లీ-తండ్రి,అన్న-తమ్ముడు,గురువు,మిత్రుడు, 
ఎవ్వరునూ లేరు.నన్ను సంసార సముద్రమును దాటించి, 
ఆనందము అను సముద్రము నందు తేల్చెదవని కోరుచున్నాను. 

నాకోర్కె మన్నింపుము.

--((*))---

నేటి హాస్యం 

"కేటు"..."డూప్లికెటు".....ఒక ఊరికి వెళ్లారు!! 
అక్కడ ఒక నది దగ్గర ఒక బోర్డు చూసారు!!! 
"ఈ నది లో ఎవరైనా మునిగి పోతున్న వాళ్లని .... 
రక్షిస్తే రూ.లు 500/- ఇవ్వబడును" అని వుంది 
"ఒరేయ్ ..కేటు... 
నేను నది లో దూకుతాను... 
నువ్వు నన్ను రక్షించు..మనకి 500 రూ.లు వస్తాయి.... 
అందులో నీకు 100 రూ.లు ఇస్తాను!!" అన్నాడు "డూప్లికెటు '' 
"100 రూ'లా ....అన్యాయం...కనీసం 200 రూ.లు ఇవ్వొచ్చుగా?" అన్నాడు "కేటు" 
"ఎడిసావ్...నీకు 100 రూ.లే ఎక్కువ... 
ఐడియా నాది....కాబట్టి అంతే ఇస్తాను!!" అంటూ..నది లో దూకెశాడు "డూప్లికెట్" 
"కేటు" గాడు అలాగే చూస్తూ నిలబడ్డాడు.. 
"ఒరేయ్....దొంగ సచ్చినోడా.... 
నాకు ఈత కూడా రాదు....రక్షించు.." అంటూ అరవడం మొదలెట్టాడు "డూప్లికెటు" 
"హహహ....మరదే...బోర్డు నువ్వు పూర్తిగా చదవలేదు.... 

కింద బ్రాకెట్ లో "నది లో శవం తీసిన వాళ్లకి 5000 రూ.లు బహుమతి " అని రాసి వుంది!!" అన్నాడు "కేటు" , పల్లీలు తింటూ!!!

--((*))--

మే డే...సందర్భము గా ...ఒక యదార్ధ కల్పిత గాధ!! 
"అశ్వారావ్ జమీందార్ " గారి గుర్రం "పంచకల్యాణి" కి జబ్బు చేసింది!! 
పట్నం నుండి ,పెద్ద డాక్టర్ "పశుపతి" వచ్చాడు... 
"మీ పంచకల్యాణి కి " 3 రోజులు మందు ఇస్తాను...తగ్గితే ఓకే...లేక పొతే దీన్ని చంపెయ్యాలి..లేక పొతే ఈ రోగం మిగతా వాటికి వస్తుంది " అన్నాడు 
ఈ మాటలు పక్కనే ఉన్న ఒక పొట్టేలు వింది... 
మరునాడు "పశుపతి" వచ్చి గుర్రానికి ...సారీ.."పంచకల్యాణి" కి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లాడు!! 
వెంఠనె....పొట్టేలు వచ్చి..."నెమ్మది గా లేవడానికి ట్రై చెయ్యి...లేక పొతే యజమాని నిన్ను చంపేస్తాడు" అంది...అయినా "పంచకల్యాణి " లెవా లేక పోయింది!! 

రెండొ రోజు "పశుపతి" వచ్చి ..."పంచకల్యాణి" కి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లాడు!! 
వెంఠనె....పొట్టేలు వచ్చి..."నెమ్మది గా లేవడానికి ట్రై చెయ్యి...లేక పొతే యజమాని నిన్ను చంపేస్తాడు" అంది...అయినా "పంచకల్యాణి " లేవ లేక పోయింది!! 

మూడో నాడు "పశుపతి" వచ్చి .."పంచకల్యాణి" కి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లాడు!! 
వెంఠనె....పొట్టేలు వచ్చి... 
"నెమ్మది గా లేవడానికి ట్రై చెయ్యి... 
నువ్వు లేవ గలవు...లే... 
అదీ...అద్గదీ..నేనున్నాను గా.... 
భయం లేదు..... 
ఈ రోజు కూడా లేవక పొతే నిన్ను చంపేస్తారు.... 
లే....గుడ్ ...ఇప్పుడు నెమ్మదిగా అడుగులు వెయ్యి.... 
గుడ్ మెల్లగా పరుగు పెట్టు... 
సహబాస్ ...సాధించావ్...మిత్రమా...సాన్దిన్చావ్వ్..." 
అని సంభర పడిపోయింది "పొట్టేలు" 
ఇంతలో "అశ్వారవ్ జమిందార్" బయటికి వచ్చి "చూసారు!!! 
"హే...నా "పంచకల్యాణి" పరుగులు తీస్తోంది...నాకు చాలా సంతోషం గా వుంది..." అని అందరినీ పిలిచి ..... 
"ఒరేయ్...ఈ సందర్భం గా ....ఈ రోజు..... 
"పొట్టేలు" ని కొయ్యండిరా ...మనం సంభరం చేసుకోవాలా" అన్నాడు!! 
(ఇది మేనేజ్మెంట్ ధోరణి.......... ఇలాగే వుంటుంది.....నిజం!!)


కుంతీకుమారి -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి 

చ. అది రమణీయ పుష్పవన మావన మందొక మేడ మేడపై 
నది యొక మారుమూల గది యా గది తల్పులు తీసి మెల్లగా 
పదునయిదేండ్ల యీడుగల బాలిక పోలిక రాచపిల్ల జం 
కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగా! 

ఉ. కన్నియ లాగె వాలకము కన్పడుచున్నది కాదు కాదు ఆ 
చిన్ని గులాబి లేత యరచేతులలో పసిబిడ్డ డున్న య 
ట్లున్నది యేమి కావలయునో గద యామెకు? యచ్చుగ్రుద్దిన 
ట్లున్నవి రూపురేఖ లెవరో యనరా దతడామె బిడ్డయే! 

తే. దొరలు నానంద బాష్పాలొ పొరలు దుఃఖ 
బాష్పములొ గాని యవి గుర్తుపట్టలేము; 
రాలుచున్నవి ఆమె నేత్రాలనుండి 
బాలకుని ముద్దు చెక్కుటద్దాల మీద! 

ఉ. పొత్తులలోని బిడ్డనికి పుట్టియు పుట్టక ముందె యెవ్వరో 
క్రొత్తవి వజ్రపుం గవచ కుండలముల్ గయిసేసినారు మేల్ 
పుత్తడి తమ్మిమొగ్గ బుజిబుగ్గల ముద్దులు మూటగట్టు నీ 
నెత్తురుకందు నెత్తుకొని నెచ్చెలి యెచ్చటి కేగుచున్నదో! 

తే. గాలి తాకున జలతారు మేలిముసుగు 
జారె నొక్కింత యదిగొ! చిన్నారి మోము! 
పోల్చుకొన్నాములే! కుంతిభోజపుత్రి 
స్నిగ్ధ సుకుమారి యామె కుంతీకుమారి!! 

మ. కడువేగమ్మున చెంగుచెంగున తరంగాల్ పొంగ నా తోట వెం 
బడి గంగానది పారుచున్నయది బ్రహ్మాండమ్ముగా అల్లదే 
బుడుతన్ చేతులలోన బట్టుకొని యా పూబోడియున్ గూడ ని 
య్యెడకే వచ్చుచునుండె గద్గదికతో నేమేమొ వాపోవుచున్ 

మ. "ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర 
మ్మని నే కోరగనేల? కోరితిని బో యాతండు రానేల? వ 
చ్చెను బో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగా నేల? ప 
ట్టెను బో పట్టి నొసంగనేల? యడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్" 

ఉ. ఏయెడ దాచుకొందు నిపుడీ కసిగందును? కన్నతండ్రి "ఛీ 
ఛీ" యనకుండునే? పరిహసింపరె బంధువు? లాత్మగౌరవ 
శ్రీ యిక దక్కునే? జనులు చేతులు చూపరె? దైవ యోగమున్ 
ద్రోయగరాదు ఈ శిశువుతో నొడి గట్టితి లోకనిందకున్ 

తే. "ఈ విషాదాశ్రువుల తోడ నింక నెంత 
కాలమీ మేను చూతు? గంగాభవాని 
కలుష హారిణి యీ తల్లి కడుపులోన 
కలిసి పోయెద నా కన్న కడుపు తోడ" 

తే. అనుచు పసివాని రొమ్ములో నదుము కొనుచు 
కుంతి దిగినది నదిలోన యంతలోన 
పెట్టె కాబోలు పవన కంపిత తరంగ 
మాలికా డోలికల తేలి వచ్చు ---- 

తే. మందసము రాక గనెనేమొ ముందు కిడిన 
యడుగు వెనుకకు బెట్టి దుఃఖాశ్రుపూర్ణ 
నయనములలోన ఆశాకణాలు మెరయ 
ఆ దెసకె చూచు నామె కన్నార్పకుండ 

తే. దూర దూరాల ప్రాణబంధువు విధాన 
అంత కంతకు తనను దాపగుచునున్న 
పెట్టె పొడవును తన ముద్దుపట్టి పొడవు 
చూచి తలయూచు మదినేమి తోచి నదియె? 

తే. ఆత్మహత్యయు శిశుహత్య యనక గంగ 
పాలు గానున్న యీ దీనురాలి మీద 
భువనబంధునకే జాలి పుట్టెనేమొ! 
పెట్టె నంపించి తెరువు చూపెట్టినాడు 

తే. "ఇట్టులున్నది కాబోలు నీశ్వరేఛ్ఛ" 
యనుచు విభ్రాంతియై దిక్కు లరసి కొనుచు 
నగము తడిసిన కోకతో మగువ, పెట్టె 
దరికి జని మెల్ల మెల్లగా దరికి తెచ్చి 

తే. ఒత్తుగా పూలగుత్తుల నెత్తు పెట్టి, 
పై చెరగు చింపి మెత్తగా ప్రక్కపరచి 
క్రొత్త నెత్తలిరాకుల గూర్చి పేర్చి 
ఒత్తుకొనకుండ చేతితో నొత్తిచూచి - 

తే. ఎట్టకేలకు దడ దడ కొట్టుకొనెడి 
గుండె బిగబట్టుకొని కళ్ళ నిండ జూచి 
బాష్పముల సాము తడిసిన ప్రక్కమీద 
చిట్టిబాబును బజ్జుండ బెట్టె తల్లి 

తే. చిన్ని పెదవుల ముత్యాలు చింది పడగ 
కలకల మటంచు నవ్వునే గాని, కన్న 
యమ్మ కష్టము తన యదృష్టమ్ము కూడ 
నెరుగ డింతయు నా యమాయికపు బిడ్డ 

తే. చెదరు హృదయము రాయి చేసికొని పెట్టె 
నలలలో త్రోయబోవును; వలపు నిలుప 
లేక చెయి రాక సుతు కౌగిలించి వెక్కి 
వెక్కి యేడ్చును; కన్నీరు గ్రుక్కు కొనును 

తే. "భోగ భాగ్యాలతో తులదూగుచున్న 
కుంతి భోజుని గారాబు కూతురు నయి 
కన్న నలుసుకు ఒక పట్టె డన్నమైన 
పెట్టుకో నోచనైతి పాపిష్ఠిదాన." 

ఉ. నన్నతి పేర్మియై గనెడి నా తలిదండ్రుల ప్రేమ యర్థమౌ 
చున్నది; నేడు బిడ్డనిట నొంటరిగా విడిపోవ కాళ్ళు రా 
కున్నవి; యేమి సేతు; కనియున్ గనలేని యభాగ్యురాల నే 
నన్ని విధాల; కన్నకడుపన్నది కాంతల కింత తీపియే! 

ఉ. "పెట్టియలోన నొత్తిగిల బెట్టి నినున్ నడి గంగలోనికిన్ 
నెట్టుచు నుంటి తండ్రి! యిక నీకును నాకు ఋణంబుదీరె; మీ 
దెట్టుల నున్నదో మన యదృష్టము! ఘోరము చేసినాను నా 
పుట్టుక మాసిపోను! నిను బోలిన రత్నము నాకు దక్కునే!" 

ఉ. "పున్నమ చందమామ సరిపోయెడి నీ వరహాల మోము నే 
నెన్నటికైన చూతునె! మరే! దురదృష్టము గప్పికొన్న నా 
కన్నుల కంత భాగ్యమును కల్గునె? ఏయమయైన యింత నీ 
కన్నము పెట్టి యాయువిడినప్పటి మాట గదోయి నాయనా!" 

తే. పాల బుగ్గల చిక్కదనాల తండ్రి 
వాలుగన్నుల చక్కదనాల తండ్రి 
మేలి నీలి ముంగురుల వరాల తండ్రి 
కాలుచెయి రాని తండ్రి! నా కన్నతండ్రి! 

తే. కన్నతండ్రి నవ్వులపూలు గంపెడేసి 
చిన్నినాన్నకు కన్నులు చేరెడేసి 
చక్కనయ్యకు నెరికురుల్ జానెడేసి 
చిట్టి బాబు మై నిగనిగల్ పెట్టెడేసి 

తే. "బాల భానుని బోలు నా బాలు నీదు 
గర్భమున నుంచు చుంటి గంగా భవాని! 
వీని నేతల్లి చేతిలోనైన బెట్టి 
మాట మన్నింపు మమ్మ! నమస్సు లమ్మ!" 

తే. దిక్కులను జూచి భూదేవి దిక్కు చూచి 
గంగదెస చూచి బిడ్డ మొగమ్ము చూచి 
సజల నయనాలతో ఒక్కసారి కలువ 
కంటి తలయెత్తి బాలభాస్కరుని చూచె 

తే. మరులు రేకెత్త బిడ్డను మరల మరల 
నెత్తుకొనుచు పాలిండ్లపై నొత్తుకొనుచు 
బుజ్జగింపుల మమకార ముజ్జగించి 
పెట్టెలోపల నుంచి జోకొట్టె తల్లి. 

తే. ఆత పత్రమ్ము భంగి కంజాత పత్ర 
మొండు బంగారు తండ్రిపై నెండ తగుల 
కుండ సంధించి ఆకులోనుండి ముద్దు 
మూతిపై కడపటి ముద్దు నునిచి 

తే. "నన్ను విడి పోవుచుండె మా నాన్న" యనుచు 
కరుణ గద్గద కంఠియై కంపమాన 
హస్తముల తోడ కాంక్షలల్లాడ కనులు 
మూసికొని నీటిలోనికి ద్రోసె పెట్టె. 

తే. ఏటి కెరటాలలో పెట్టె యేగుచుండ 
గట్టుపై నిల్చి యట్టె నిర్ఘాంతపోయి 
నిశ్చల నిరీహ నీరస నిర్నిమేష 
లోచనమ్ములతో కుంతి చూచుచుండె.


"ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట" అన్న హృద్యమైన భక్తి గీతం శ్రీరంగం గోపాలరత్నం గారి నోట చాలాసార్లు విన్నాము కదా? మొన్నటి సంవత్సరం తిరుమల శ్రీవారి పుష్కరిణిలో నేను మా అమ్మా నాన్నలు, సతీ సమేతంగా అందులో మునకేస్తుంటే మైక్ ల నుండి భక్తి తరంగాలు వెదజల్లుతూ ఈపాటే వినబడింది. ఇంతకీ ఎవరు రచయిత అనుకున్నాను.. ఇపుడు స్వామి దర్శనానికి వెళుతున్నాం ఎవరు వ్రాస్తే ఏముంది అద్భుతంగా ఉంది అని అనుకున్నాను .. సంప్రదాయ బద్ధంగా బట్టలు మార్చుకుని వరాహ స్వామి వారి దర్శనం చేసుకుని ఇంక గోవింద నామ స్మరణం చేస్తూ 300/- టికెట్ కంపార్ట్మెంట్ దగ్గరకు వెళ్లి అక్కడ నుండీ వెళ్లి ఓ రెండున్నర గంటల్లో స్వామి వారి దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకుని ఆరగించి.. అక్కడ తిరుమల తిరుపతి వారు ఇచ్చే లడ్డూలు తీసుకుని బయట పడ్డాము మళ్ళీ " ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట" పాట గుర్తుకు వచ్చింది.. మా అమ్మను అడిగితే ఏమో నాకు గుర్తు లేదు " రావులపర్తి భద్రిరాజు " ఏమో అంది.. వారు వ్రాసిన భక్తి గీతాలు లలిత గీతాలు నాకు అన్నీ గుర్తే .. కానీ ఈ పాట వారు వ్రాసినదని మాత్రం ఎందుకో అనిపించలేదు. సరేలే అనుకున్నాను.. మొన్నీమధ్య ప్రముఖ నిర్మాత ఏడిదవారు పరమపదించినపుడు వారి గూర్చి మరిన్ని వివరాలు తెలుసుకుందామా అని అనుకుంటుండగానే ఏడిద అని గూగుల్ తల్లిని అడగ్గానే ఆమె ఏడిద కామేశ్వర రావు అని సమాధానం ఒకటి.. ఏడిద నాగేశ్వర రావు అని ఏడిద గోపాలరావు అని లిస్టు ఇచ్చింది. ఇంక చూద్దును కదా.. వారు మువ్వురు సోదరులే.. ఏడిద కామేశ్వర రావు గారేమో మనకు ఏడు కొండల వెంకన్న మీద మంచి భక్తి గీతం " ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట " అని.. ఇంకో అతను ఏడిద గోపాలరావు గారు ఆకాశవాణి డిల్లీ నుండి తెలుగు వార్తలు చదివి వినిపించేవారు అని.. ఇంక చివరి వారు నాగేశ్వర రావు మనకు తెలుగు జాతి గర్వించదగ్గ అపూర్వ ఆణిముత్యాలు, సిరి సిరి మువ్వ, శంకరాభరణం వంటి మరెన్నో చిత్రాలు అందించారు. ఇదండీ జన్మమెత్తినందుకు మనిషి పుట్టుక పుట్టినందుకు ఏదోటి చేయాలి కదా.. అలా చేస్తూ కొందరు గొప్ప కార్యాలు చేసి చరిత్రలో నిలిచి పోతారు.. అలాగ మన ఏడిద సోదరులు కూడా మంచి పనులే చేసి మనకు ఇలా గుర్తుండి పోయారు.. కారణ జన్ములు మరి.

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట
నాపలుకులో కులుకుతావట

ఓ ఆపద మ్రొక్కుల సామీ
నీ సన్నిదే నా పెన్నిధి
ఓ ఆపద మ్రొక్కుల సామీ
నీ సన్నిదే నా పెన్నిధి

కొండంత దేవుడవని
కొండంత ఆశతో
నీ కొండ చేర వచ్చితిని
అండ జేర్చి కాపాడరా

అభయహస్తమున్నదట
అభయమూర్తి నీవెయట
అభయదాన మిచ్చి నాకు
భవతరణ పథంబు చూపు

వడ్డి కాసువాడవట
వడ్డీ వడ్డీ గుంజ్దువట
అసలు లేని వారమయ్య
వెతలు బాపి కావవయ్య






1 comment: