Thursday, 7 June 2018

Pranjali Prabha (15-06-2018)



మనసు పడే మగడొస్తాడని మేనంతా మెరిసింది...మిడిసిపడే మదిలో సందడి
Artists, Animations and Inspirations — art-of-sumi:  Magical Girl animation rough…. need...


నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

పువ్వు విరిసింది - పాప నవ్వింది 
కన్ను ఆదిరింది - పాప ఏడ్చింది    
స్పర్స తగిలింది - పాప నాకింది  
సైగ చేసింది  - పాప చూసింది 

పక్షి కూసింది - పాప పలికింది 
గంట మ్రోగింది - పాప చేయి ఊపింది 
ఊయల కదిలింది - పాప నిద్రకొచ్చింది 
బొమ్మ ఆడింది - పాప నవ్వుకుంది    

అమ్మ పాడింది - పాప ఆడింది 
అమ్మ నేత్రమంది - పాపజాతరంది   
అమ్మ పండగంది - పాపబెంగ అంది 
అమ్మ జో జో అంది - పాప ఊఉ అంది 

అమ్మ అలసింది - పాప నిదురైంది 
అమ్మ ఆతృతై౦ది - పాప తడిపింది 
అమ్మ తుడిచింది - పాప పెదాలుకల్పింది
అమ్మ స్తన్యం ఇచ్చింది - పాప త్రాగింది 

అమ్మ ప్రేమకు కొదువలేదు 
పాప ఆటకు అంటూ లేదు 
పేగు భందాన్ని విడదియలేరు
ఎంతకష్టమొచ్చిన అమ్మ ప్రేమ మారదు      
--((*))--
నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

నేను నేను కాదు 
నాలో ప్రవహించేది రక్తము కాదు
కరుణ, దయ, త్యాగ ముంది 

నేను మీలో ఉన్నాను
మనస్సును కదుపుతున్నను
అమ్రుతఘడియల సత్యాన్ని 
కధగా కవితగా తెలపుతున్నాను      

నేను ప్రకృతితో తిరుగుతాను 
కాలాన్ని గమనించ లేను
ఇతరులను నొప్పించకుండా 
సమయాన్ని వ్యర్ధపరచకుండా   
ఏ మనస్సును భాదపెట్టకుండా
ఆధ్యాత్మిక విషయాలు తెలుపుతున్నాను 

మనిషిగా పుట్టుకలో ఏముంది 
అహం,స్వార్ధం, ఈర్ష్య, ద్వేషం 
లేకుండా ఉండటంలో ఉంది 
ప్రయత్నంలోనే విజయం దాగుంది  
అపార్ధంలోనే అపజయం దాగుంది 
నమ్మకం తో బ్రతుకుతున్నాను 
నమ్మకమే మనిషిగా గుర్తిపు ఇస్తుంది 
ప్రేమించి ప్రేమ పొందటంలోనే 
నిజమైన జీవితమని నాభావన 
     
నా పుట్టిన రోజు సందర్భముగా 
అనేకమంది శుభాకాంక్షలు 
తెలిపినవారికి హ్రుదయపూర్వక 
పెద్దలకు పాదాభివంద వందనములు
పిల్లలకు నా ఆసీర్వచనాలు 
అంజలి ఘటిస్తు ప్రాంజలి ప్రభను 
మీ అందుబాటులో ఉండుటకు 
నిత్యమూ కృషి చేస్తాను 
ప్రతిఒక్కరికి మరొక్కసారి 
ధన్యవాదములు 
తెలియపరుస్తున్నాను 

ఇట్లు ఇప్పుడే పుట్టిన మిత్రుడు 

   --((*))__
నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ

ప్రసవవేదన అమ్మ ఎంత కష్టపడుతుందో 
అమ్మ గర్భాన చేరి కడుమార్లు చుట్టలుగా తిరిగి 
సుడిగుండాల కదిలించాను అమ్మ భరించింది

పెంకును పగల కొట్టుకొని 
కోడిపిల్ల బయటకు తొంగి  చూసినాట్లుగా   
టెంకను చిలికచేస్తూ 
మామిడి మోలక తలెత్తినట్లుగాను
అమ్మ పొట్టను చీల్చుకొని
బిడ్డగా పుడమి తల్లి వడిలోచేరాను

మాతృత్వంతో ముద్దాడి తన కష్టాలను మరచి 
ఆనందాన్ని పొంది పంచేది అమ్మ ఒక్కటే 
అమ్మ సాక్షాత్తు భగవంతున్నే కన్నానని 
భావించి లాలించి ముద్దాడి ప్రేమిస్తుంది 
పేగు బంధంతో ప్రేమను రంగరించి 
మురిపాలను అందించి అత్మజులుగా మార్చేది అమ్మ

మనోవాంఛ సంతానంద్వారా తీర్చుకోవాలని 
పెద్దలు తెలిపారు 
బిడ్డలుగా తల్లి తండ్రుల ఋణం తీర్చుకోవాలని 
పెద్దలు తెలిపారు
అనుదిన సంతోషణముల్ 
జనిత శ్రమ తాప దు:ఖ సంశోషణముల్
జనకుల సంభాషణముల్
తల్లి తండ్రుల కర్ణ యుగల సద్భూషణముల్ 
అవ్యక్త మధురోక్తముల్ 
యజ్న యాగాది పుణ్య క్రతువుల్ 
పుట్టిన బిడ్డ పొంద గలుగుతాడు 
జన్మ సార్ధకం చేసుకున్నవాడు 
నిజమైన బిడ్డ అని అన్నారు       
ధర్మో రక్షితి రక్షిత:
జనకుల్ రక్షితి రక్షిత:        
--((*))--

ప్రాంజలి ప్రభ రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ ముందు చూపు ఉండాలోయ్ వెలుగు రేఖ నీకన్నా ముందే వుండునోయ్ పూలు, ముళ్ళు నీకు అడ్డు రావోయ్ లక్ష్య సాధనకు ముందుకు సాగాలోయ్ కలలు కళ్ళలని తెలుసు కోవాలోయ్ కర్తవ్యం ఊపిరిగా మార్చు కోవాలోయ్ గుంట నక్కలను తరిమి కొట్టాలోయ్ గుండెను నిబ్బరంగా ఉంచ గలగాలోయ్ హితోక్తులు నమ్మి మనసు మార్చుకోకోయ్ నీ నమ్మక బలము నీకు తోడుంటుందోయ్ ఎప్పటికప్పుడు నీవు లెక్కలేసు కోవద్దోయ్ ఏరోజుకారోజు హాయి అని తృప్తిగా సాగాలోయ్ గుర్తింపు కోసం పాకులాడుడట ఎందుకోయ్ గుప్పెడు ఆకలి కోసం అబద్దాలాడుటెందుకోయ్ దారితప్పని బ్రతుకు ఆయుర్దాయము పెంచునోయ్ నిర్ణయం, తీర్పు నీదే వెన్ను చూపక వేగపడవోయ్ ఆశకు చిక్కక ఆశయ సాధనకు సాగాలోయ్ పాశానికి చిక్కక కరుణ చూపుతూ సాగాలోయ్ దిశా నిర్దేశం కాలాన్ని బట్టి అనుకరించాలోయ్ త్యాగం, ధర్మమ్, దానం, ప్రేమ నీఆయుధాలోయ్ --((*))--



చిత్రం : ఒక్కడు
సంగీతం : మణిశర్మ
గానం : హరిహరన్,శ్రేయ ఘోషల్,ప్రియ సిస్టర్స్

సాకీ :

ముత్తైదులంతా ముదమారా ఈ బాలకీ మంగళ స్నానాలు చేయించరే
శ్రీరామ రక్షణని క్షీరాబ్ది కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించారే

పల్లవి :

మనసు పడే మగడొస్తాడని మేనంతా మెరిసింది
మిడిసిపడే మదిలో సందడి మేళాలై మోగింది
నీకు నాకు ముందే రాసుంది జోడీ...

హరిలో రంగా హరి…వహ్ వాహంటూ చూస్తోంది ఈ పందిరి
బరిలో హోరాహోరీ..బహు బాగుంది బాజా బాజంతిరీ…

అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంసా వైభోగంగా
కన్యాదానమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా

చరణం :

గెలిచానే నీ హృదయం..కలకాలం ఈ విజయం నీతో పంచుకోనా…
ప్రియురాలా నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపనా
కలలన్నీ ఈ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా
దరిచేరే నీ కోసం చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా
ముస్తాబు చెయ్యరటే ఈ ముద్దులగుమ్మకీ..
సిగ్గుపడు చెంపకి సిరిచుక్క దిద్దరే
పట్టుచీర కట్టరటే ఈ పుత్తడి బొమ్మకీ
తడబడు కాళ్లకి పారాణి పెట్టరే
వగలన్నీ నిగనిగలాడగా నన్నల్లే కౌగిళ్లు
నగలన్నీ వెలవెలబోవ చేరందే నీ ఒళ్లో
నాకే సొంతం కాని నీ సొమ్ములన్నీ



మూడు వరాలు
ఒకామె అడవిలో వెళుతూ ఉంది. నడుస్తుండగా దారి పక్కగా ఒక కప్ప ముళ్ళ కంపల్లో చిక్కుకుని కనిపించింది. దానికి దగ్గరగా వెళ్ళేసరికి అది మాట్లాడటం ప్రారంభించింది. “నన్ను ఇక్కడి నుంచి తప్పిస్తే నీకు మూడు వరాలిస్తాను” అన్నది. ఆమె అలాగే విడిపించింది.
తర్వాత “విడిపించినందుకు థాంక్స్. అన్నట్టు చెప్పడం మరిచిపోయాను. ఈ మూడు కోరికలకు ఒక షరతు ఉంది” అన్నది కప్ప.
“ఏంటో చెప్పు” అన్నదామె.
“నువ్వు ఏది కోరుకుంటే దానికి పది రెట్లు నీ భర్తకు దక్కుతుంది” అన్నది కప్ప.
“ఓకే నో ప్రాబ్లం”
“నా మొదటి కోరిక: ప్రపంచంలోకెల్లా అత్యంత అందగత్తెను కావాలి నేను”
“బాగా ఆలోచించుకో. నీ భర్త నీ కంటే పది రెట్లు అందగాడవుతాడు మరి”
“అయినా పర్లేదు ప్రపంచం లోకెల్లా నేనే అందగత్తెను కాబట్టి అతనికి నా మీద నుండి దృష్టి ఎక్కడికీ పోదు”. అంతే ఆమె అత్యంత సౌందర్యవతిగా మారిపోయింది.
“నా రెండో కోరిక: ప్రపంచంలో అత్యంత ధనవంతురాల్ని అవ్వాలి”
“మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నీ భర్త నీ కంటే పదిరెట్లు ధనవంతుడవుతాడు.”
“పర్లేదు నా దగ్గరుంటే ఆయ దగ్గర ఉన్నట్లు. ఆయన దగ్గరుంటే నా దగ్గర ఉన్నట్లే కదా”.
“తథాస్తు”
ఆమె అత్యంత ధనవంతురాలైంది.
” నా మూడో కోరిక: నాకు కొంచెం గుండె నొప్పి రావాలి”:-)
చరణం :
.
ఒట్టేసి చెబుతున్నా..కడదాకా నడిపించే తోడై నేనున్నా
ఏడడుగుల పయనానా ఏడేడు లోకాలైనా దాటనా
వధువై ఎదురొస్తున్నా వరమాలై ఎద పైన వాలే ముహూర్తానా
వరసయ్యే వలపంతా చదివిస్తా వరకట్నంగా..సరేనా
ముక్కోటి దేవతలు మక్కువగా కలిపారే
ఎన్నెన్ని జన్మలదో ఈ కొంగుముడి
ముత్యాల జల్లులుగా అక్షింతలు వెయ్యాలే..
ముచ్చట తీరేలా అంతా రండి
ఏనాడూ ఎవరూ చేరని ఏకాంతం వెతకాలి
ఏ కన్నూ ఎపుడూ చూడని లోకంలో బతకాలి
పగలూ రేయీ లేని జగమేలుకోనీ

https://www.youtube.com/watch?v=rezPqKstask
Mahesh B

చందమామ కధ.!
.
పూర్వం విష్ణు శర్మ అనే ఒక రాజుండే వాడు.అతడికి విపరీత మయిన కథల పిచ్చి.తన ఆస్థానం లో వున్న వారి నందరినీ కథలు చెప్పమని సతాయించేవాడు.అందరికీ విసుగై పోయింది. మంత్రి రాజుతో సంప్రదించి రాజుకు కథలు చెప్పడానికి ఎవరైనా రావచ్చుననీ తగిన బహుమానం యివ్వ బడుతుందనీ టముకు వేయించాడు.
ఎంతమందో వచ్చి ఆయనకు ఎన్నో కథలు వినిపించేవారు.ఎన్ని చెప్పినా ఆయన యింకా చెప్పమని అడిగే వాడు.అతనికి విసుగే వుండేది కాదు.ఎంత మంది వచ్చినా రాజును తృప్తి పరచ లేక పోయారు.నాకు కథలు చెప్పి తృప్తి పరిస్తే సగం రాజ్యమిస్తాను లేకుంటే మరణ శిక్ష అని ప్రకటించాడు.కొంత మంది యువకులుసగం రాజ్యం ఆశతోవచ్చారు ఆ యనను సంతృప్తి పరచలేక మరణించారు.ఆఖరుకు మరణ భయం తో ఎవరూ రావడం లేదు.రాజు మంత్రిని పదే పదే ఈ విషయం గురించి సతాయించే వాడు.
ఒకనాడు ఒక బీద బ్రాహ్మణుడు నేను మీకు కథ చెప్తానని వచ్చాడు.సరే నని రాజు కూర్చున్నాడు.ఆ బ్రాహ్మణుడు కథ చెప్పడం మొదులు పెట్టాడు.ఒక వూరిలో ఒక రైతు ఉండేవాడు అతను తనపొలం లో జొన్నలు పండించాడు.ఆ సారి వర్షాలు బాగా పడి విపరీత మైన పంట పండింది.ఆ రైతు ఒక పెద్ద గోదాము కట్టించి వంద పుట్ల జొన్నలను అందులో వుంచాడు.దాన్నిఅన్ని పక్కలనుంచీ మూసివేసినా ఒక మూల చిన్న కంత వుండి పోయింది.అది ఒక పిట్ట చూసింది.ఆ కంత లోనుంచి లోపలి పోయి తనముక్కున ఒక గింజ కరుచుకొని పోయింది మళ్ళీ వచ్చి ఒక గింజ ముక్కున కరుచుకొని పోయింది యిది చూసి మిగతా పిట్టలు కూడా వచ్చి ఒక్కో గింజా ముక్కున కరుచుకొని పోతూ వున్నాయి.ఒక పిట్టా ఒక గింజ,ఒకపిట్టా
ఒకగింజ అంటూ అదే మాట చెప్తూ వచ్చాడు దినాలు గడుస్తున్నా అదే చెప్తూ వున్నాడు.రాజుకు విసుగు పుట్టింది తరువాతి కథ చెప్పకుండా యిదేమిటి?అని విసుక్కున్నాడు.అందుకు అతను మహారాజా!మరి అన్ని పుట్ల ధాన్యం అయిపోవాలికదా! ఆ తరువాతే మిగతా కథ అని మరీ ఒక పిట్టా ఒక గింజ అని మొదులు పెట్టాడు..రాజుగారికి తల బొప్పి కట్టింది.యింక చాలించు మహా ప్రభూ అన్నాడు.అందుకు వాడు
ఎలా చాలించేది ప్రభూ!చాలిస్తే నా చావు తప్పదు కదా! అని మరీ మొదులు పెట్టాడు.రాజుకు విసుగు పుట్టి
యిక మీదట కథలు చెప్పమని అడగను నీకు అర్ధ రాజ్యం యిస్తాను దయచేసి యింక చాలించు అన్నాడు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా అన్నారు బాగుంది.యింకేప్పుడూ కథలు చెప్పమని ఎవరినీ యిబ్బంది పెట్టకండి.అని అర్ధ రాజ్యం నాకేమీ వద్దు కొంత ధనం యిప్పించండి చాలు అన్నాడు.అప్పుడు రాజు అతనికి
జీవితానికి సరి పడా ధనం యిచ్చి పంపించాడు.అందరూ ఈ కథల పీడ వదిలించి నందుకు ఆ బ్రాహ్మడిని అభినందించి ఊపిరి పీల్చు కున్నారు..అప్పటి నుండీ ఆ రాజు బుద్ధి తెచ్చుకొని ప్రజానురంజకంగా పరిపాలించాడు.
అధికారం చేతిలో వుంది కదా! అని ఎవరు కూడా ప్రజలను,తనక్రింది అధికారులనూ సతాయించ కూడదు.ఏ విషయం లోనైనా సరే.
మా చిన్నప్పుడు మా నాన్నను మేము కథ చెప్పమని సతాయిస్తే ఈ కథ మొదులు పెట్టేవారు. తరువాత
ఎప్పుడో ఈ కథ చందమామ లో చదివాను.


 విధాత తలపున ప్రభవించినది... అనాది జీవన వేదం... ఓం...
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం... ఓం...

చిత్రం : సిరివెన్నెల (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

విధాత తలపున ప్రభవించినది... అనాది జీవన వేదం... ఓం...
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం... ఓం...

కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వ రూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం... ఆ...

సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం... ఈ గీతం...

విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం...

చరణం 1 :

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన

పలికిన కిలకిల ధ్వనముల.. స్వరగతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకిది భాష్యముగా...

విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం...

చరణం 2 :

జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం

అనాది రాగం.. ఆదితాళమున.. అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే..
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం...

నా ఉఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం
నా ఉఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం... ఈ గీతం...

https://www.youtube.com/watch?v=vaLtLiiQu5g
శ్రీ గురుసంపద

5.అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ !
తద్దావతో2 న్యానత్యేతి తిష్థత్తస్మిన్నపో మాతరిశ్వా దధాతి !!

( తత్)=ఆ పరమేశ్వరుడు; అనేజత్=స్థిరమైనవాడు; ఏకమ్=ఒక్కడే ; మనసః= మనస్సుకంటే; జవీయః= మిక్కిలివేగముకలిగినట్టి; పూర్వ మ్= సర్వమునకు ఆదియైన ( మొదటిదైన); అర్షత్=జ్ణానస్వరూపము అనగా సర్వము తెలియునట్టి; ఏనత్=ఈ పరమేశ్వరుని పరమతత్త్వమును; దేవాః= ఇంద్రాదిదేవతలు కూడా; న,ఆప్నువన్= పొందలేకపోయిరి ( తెలియలేక పోయిరి); తత్=ఆ పరబ్రహ్మ పురుషోత్తమతత్త్వము; అన్యాన్= ఇతరులను; ధావత=పరుగెత్తుచున్నవారిని; తిష్ఠత్= ( స్వయంగా) స్థిరంగా ఉంటునే; అత్యేతి= అతిక్రమించును; తస్మిన్= అతని ఉనికి యందే ఆతని సత్తా, శక్తి, బలము, కృపచేతనే; మాతరిశ్వా=వాయువు మొదలగు దేవతలు; ఆపః= వర్షాదిక్రియలను; దధాతి= సమకూర్చుటలో సమర్ధులగుదురు

పరమెశ్వరుడు స్థిరమైన వాడు, అద్వితీయుడు, మనస్సునకంటే మిక్కిలి వేగవంతమైనవాడు, సర్వమునకు ఆదియైనవాడు. జ్ణానస్వరూపుడు, ఇంద్రాదిదేవతలు కూడా అతనికి తెలియజాలరు. ఆ పరమేస్వరుడు స్థిరముగ ఉంటూనే పరుగెత్తు చున్న అందఱిని అతిక్రమించి పోవును. అతని సత్తా, స్ఫూర్తులవల్లనే, ఆతని కృపాకటాక్షము వల్లనే వాయువు మొదలగు ఇతర దేవతలు వర్షములను సమకూర్చుటలో సమర్ధులగుచున్నారు.
**************** ఓమ్ తత్సత్ !
గజల్ కాన్వాస్ (సిరి): బిట్రా వెంకట నాగమల్లేశ్వర రావు

లాహిరిలో నవజవ్వని సోయగాల విందుల సిరి
దేవకాంత సమూహాల కల నవ్వులు హంసల సిరి

ప్రణయ భావ వాహినిలో ఆకాంక్షల పడవ నూచు
తుహిన తిమిర సమీరాలు మేను సోకు పులకల సిరి

సరాగాల వెలుగు ధార సమ్మోహన రుచిర కలన
చివురించిన చిరు చెమటల చిరు పూతల వలపుల సిరి

నిశి రాతిరి మసి ముసుగులు వన శాఖల నీలి నీడ
సడి తెలియని చెలుని కోరు కలవర పద గువ్వల సిరి

పున్నమిలో వెన్నెల తడి ఊహలలో మరుల పొరలు
వాహినిలో గాలివాలు పోకడలో మువ్వల సిరి

అడవి పూల వాసనలకు వరదాయక తోయజాలు
పసి మోమున పొటమరించు దరహాసపు రవ్వల సిరి

నాగమల్లి సందడిలో కులికిపడే నయగారము
మూగ బాస దొంతరలో ఒలికిపడే నవ్వుల సిరి

ఇది పాత కధ - చదివితే కొత్త కధ
.
అనగనగా ఒక ఊరిలో బుడంకాయంత బుడ్డోడున్నాడు.
.
ఆ బుడంకాయంత
బుడ్డోడికి ఒక రోజు వంకాయంత వజ్రం దొరికిందట,
.
ఆ బుడంకాయంత బుడ్డోడు ఆ వంకాయంత వజ్రాన్ని బీరకాయంత బీరువాలో
పెట్టి తాటికాయంత తాళం వేస్తుంటే దోసకాయంత దొంగోడు చూస్తాడు.
.
ఆ దోసకాయంత దొంగోడు బీరకాయంత బీరువా దగ్గరికి వచ్చి తాటికాయంత
తాళం పగలగొట్టి ఆ వంకాయంత వజ్రాన్ని తీస్తుంటే మునక్కాయంత
ముసలమ్మ చూసి పొట్లకాయంత పోలీసులకు చెప్పుతుంది.
.
ఆ పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపు వేసుకొని లవంగం అంత లాఠి
పట్టుకొని వచ్చి ఆ దొంగని పట్టుకొని, కొట్టి, సొరకాయంత స్టేషన్లో
ఉంచి, ఆ వంకాయంత వజ్రాన్ని ఆ బుడంకాయంత బుడ్డోడికి ఇప్పిస్తారు.
.
అప్పుడు వాడు సంతోషించి, ఆ మునక్కాయంత ముసలమ్మ కి బంగాళ దుంప
అంత బహుమానం ఇచ్చాడంట.

 
Kalyani Gauri Kasibhatla
June 20 at 8:20pm

// వసంతం //

వయసు తెచ్చె
వసంతం
ముగ్ధమోహనం..
మోములో
సౌందర్యం
నడతలో
అమాయకత్వం
సిగ్గులొలుకు
సింగారం..
పరికిణీ.,వోణీలో
పచ్చదనపు
తొలి పరువం..
నవ్వుల్లో..
నయగారం..
మురిపించే
నవ రాగం.
పులకించే..
యవ్వనం.
కిలకిలమను
దరహాసం.
కలత లేని
కలల.విహారం..
పదుగురూ
మెచ్చు కొనే
ముచ్చటైన
కన్నెతనం
అందరినీ అలరించే
అందమైన హరివిల్లు.
మరుడెoతోమక్కువ తో
చేబూనినపూల విల్లు.

కళ్యాణగౌరి.కాశీభట్ల( భమిడిపాటి)
శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(20 / 6 /16.)
..............................
ఏ వేదంబు పఠించె లూత? భుజగం బే శాస్త్రముల్సూచెఁ దా
నే విద్యాభ్యసనం బొనర్చెఁగరి; చెం చే మంత్ర మూహించె? బో
ధా విర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు; నీ పాదసం
సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా!
.
ప్రాణికోటికి మోక్షము కలుగుటకు నీ పాదాలు సేవించు భక్తి ఒక్కటే కారణం గానీ, చదువులెన్ని చదివినా జ్ఞానమును, మోక్షమును కలిగించునా? ఎంతమంది చదివినవారు లేరు? వారందరికీ జ్ఞానము కలిగిందా? మోక్షము కలిగిందా? నీ దయతో మోక్షము పొందిన సాలెపురుగు ఏ వేదము చదివింది? పాము ఏ శాస్త్రములు పఠించినది? ఏనుగు ఏ విద్యలు నేర్చుకొంది? ఎరుకలవాడు ఏ మంత్రజపము చేశాడు. వీరందరూ ముక్తి పొందటానికి చదువులే కారణమైనవా?
// వేణు ధరుడు//
ఆకన్నయ్య వేణువాదన ఉల్లమలరించె
ఆ వెదురు బొంగు లో రాగాలు మ్రోగె..
గోపబాలుడతడు..గీత కారుడతడు..
జీవన గమ్యం,.ముక్తి ని ఉపదేశించాడు
అతని కా భరణం..ఆపిల్లన గ్రోవి..
అతని ఉనికికి.. చిరునామా ఆ రవళి
ఈ కన్నయ్య ధరించాడు.. అదే మురళి
వెదురు లోంచి రాగాలు పలికిస్తూ
తన జీవన రాగంలో ఆరోహణ అవరోహణలు
వెతుక్కుంటూ. శ్రమ తో మూర్చనలు పోతూ
అపశృతులు లేని అద్భుత రాగాల
పల్లవులు.. కనిపిస్తూ , వినిపిస్తున్న
మురళీ మోహన రాగ స్రవంతిని.
ప్రదర్శిస్తున్నాడు..వీనుల విందుగా
కంటికింపుగా.. జీవన యానంలో...
గుర్తింపులేని,గురువులేని వాద్యకారుడు
కీర్తి కిరీటాలు ,సింహతలాటాలు ఎరుగని
సంగీతకారుడు- బాల విద్వాంసుడు
బతుకు తెరువులో..బాటసారి..
బాల్యమా? అది శాపమా?

కళ్యాణగౌరి.కాశీభట్ల(భమిడిపాటి)
గజల్: బిట్రా వెంకట నాగమల్లేశ్వరరావు

శాంతి నిధులు కలువ కనులు దోబూచులు చూసాను
మాయ మర్మ మెరుగని తొలి తెలి నవ్వులు చూసాను

చంకనెక్కి ఆశ్చికొచ్చి అన్నిటినీ అడుగుతుంటె
వద్దంటే పట్టు విడని మారాములు చూసాను

చేయిపట్టి నడిపిస్తే తప్పటడుగు లేస్తుంటే
పరుగులకై గింజులాడు తగరాదులు చూసాను

ఓనమాలు పలికిస్తే తొసితొసిగా పలుకుతుంటే
కొత్త కొత్త పలుకుబడుల కదంబములు చూసాను

చదువులలో ముందు నిలచి మెట్టు మెట్టు ఎక్కుతుంటె
భవిష్యత్తు దిద్దుకునే సరి దారులు చూసాను

ఉద్యోగపు పర్వంలో అందలాలు ఎక్కుతుంటె
ఉప్పొంగే ఉల్లాసపు గొప్ప సిరులు చూసాను.

నాగమల్లి జీవితమే సఫలీ కృత మాయననుచు
పదినోళ్ళా పొగుడుతుంటె హృది పొంగులు చూసాను

నా మనసే నాతో తియ్యగా పాడింది ఈ వేళ
నా తలపున వలపే కమ్మగా పూచింది ఈ వేళ

అను రాగమనే రాగం నేర్చుకున్నాను నీ వల్ల
నా, కాలం వల్లకి చక్కగా మ్రోగింది ఈ వేళ

“తోడై ఉంటా”నంటూ నువ్వు దగ్గఱకు వచ్చావు
రాబోయే భాగ్యం చల్లగా నవ్వింది ఈ వేళ

ఏమై పోతానోనని నేను తపిస్తూ కృశించా
నీ ప్రేమే నాకో అండగా నిలిచింది ఈ వేళ

చూస్తూనే ఉన్నావు కళ్లల్లో కాంతి కలబోసి
రోచిష్మాన్ పై సుధ ధారగా కురిసింది ఈవేళ

ఈ గౙల్లో రదీఫ్ తో పాటు ‘జూ(zoo) కాఫియతన్’- అంటే 2 కాఫియాలు వాడాను

నెమ్మదిగా

ప్రయాణానికి సహకరిస్తూ కదులుదాం నెమ్మదిగా
ప్రమాణానికి అనుకరిస్తూ మెదలుదాం నెమ్మదిగా

చేయాలన్నవి చేయలేనివి ప్రయత్నిస్తూ చేరువుగా
విమర్శలు రాకుండా పనులన్నీ చేద్దాం నెమ్మదిగా

బ్రతుకు భారమన్న వారికి సహకరిస్తూ ఓదార్పుగా
చేయూత నిచ్చి ఆదుకుంటూ కదులుదాం నెమ్మదిగా

తెలుగు తల్లి, బాష ,ను గౌరవిస్తూ, స్వచ్చమైన తేటగా
మంచిని పెంచుదాం కలసి మెలసి సాగుదాం నెమ్మదిగా

రోగులకు సహకరిస్తూ, కలాన్ని అనుకరించే గాలిలాగా
కదులుతూ మానవత్వాన్ని బ్రతికించుదాం నెమ్మదిగా

శతృభావం వదలి, అందరిపై కరుణ భావం చూడాలిగా
సాటి మానవులపై స్నేహభావంతో కదలాలి నెమ్మదిగా


చంద మామ కధ.!
(మూడు రాళ్లు)
.
ఒక ఊరిలో నారాయణ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు బాగా వృద్ధుడు. ఒకరోజు నారాయణ తన ముగ్గురు కొడుకులను పిలిచి, ఇలా అన్నాడు.
‘‘నాయనలారా! నేను ఎంతోకాలం జీవించను. ఇంతకాలం కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి, ఈ ఆస్తిని సంపాదించాను. మిమ్మల్ని పెంచి పెద్దవాళ్లను చేశాను. ఎప్పటికైనా నా బాధ్యతలు మీకు అప్పగించాలి కదా. అందుకు ఏం చేయాలో పూర్తి వివరాలు ఆ మూలనున్న పెట్టెలో ఉంచాను.
మీరు నా మరణానంతరం ఆ పెట్టెను నా ప్రాణమిత్రుడు సత్యమూర్తి సమక్షంలో తెరవాలి. సత్యమూర్తి తెలివైనవాడు. నా వ్యాపారాభివృద్ధికి అతను ఎన్నో సలహాలిచ్చినవాడు. అందుకే అతను చెప్పినట్లు నడుచుకోండి. అప్పుడే నాకు మనఃశాంతి కలుగుతుంది. అలా చేస్తామని నాకు మాటివ్వండి’’ అన్నాడు.
అలాగే చేస్తామని ముగ్గురు కొడుకులూ ప్రమాణం చేశారు.
కొద్దిరోజుల్లోనే నారాయణ మరణించాడు. ఆ తర్వాత ముగ్గురు కొడుకులూ, తండ్రి ఇచ్చిన పెట్టెను సత్యమూర్తి దగ్గరకు తీసుకెళ్లారు. సత్యమూర్తి ఆ పెట్టెను తెరవమన్నాడు. ఆతృతగా వారు ఆ పెట్టెను తెరిచారు. అందులో ఇంటి తాళాలు, మూడు రాళ్లు, ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరం పైన ‘సత్యమూర్తి మాత్రమే చదవాలి’ అని రాసి ఉంది.
సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని తెరిచి చదివాడు. తర్వాత ముగ్గురి వైపు తిరిగి, ‘‘అబ్బాయిలూ! ఈ ఉత్తరంలో మీ నాన్న తన చివరి కోరిక రాశాడు’’ అని చెప్పాడు. ‘‘ఏంటది?’’ అన్నారు ముగ్గురూ ముక్తకంఠంతో.
‘‘ఆ కోరిక ఏదో మీకు తర్వాత చెబుతాను. ముందు ఆ మూడు రాళ్లను పెట్టెలో ఎందుకు పెట్టాడో తెలుసుకోవాలి. మీకు ఏమైనా తోస్తే చెప్పండి’’ అని అడిగాడు సత్యమూర్తి.
‘‘ఓస్! అదేమంత పెద్ద విషయం కాదు. మీ ముగ్గురు మూడురాళ్లను వెనకేసుకోండి. అంటే దుబారా ఖర్చులు మాని, మరింత సంపాదించండి అని చెప్పి ఉంటాడు. అందువలన ఎవరి ఆస్తి వారికి ఇచ్చేస్తే, మేం మరింత అభివృద్ధి చేసుకుంటాం’’ అన్నాడు పెద్దకొడుకు.
‘‘అంతే కాదు. మూడు రాళ్లలా ఎక్కువ తక్కువ కాకుండా, మూడు వాటాలు సమానంగా వేసుకొని జీవించండి అని చెప్పి ఉంటాడు’’ అన్నాడు రెండోవాడు .
ఇక మూడోవాడు, ‘‘ఆ మూడు రాళ్లు పొయ్యికి గల మూడు రాళ్లు. అంటే మూడు రాళ్లు కలిస్తేనే కమ్మని వంట వండటం సాధ్యమవుతుంది. అలాగే మేం ముగ్గురం కలిసి జీవిస్తేనే కమనీయమైన పంట పండుతుంది అని చెప్పడానికే ఆ మూడు రాళ్లు పెట్టాడు’’ అని వివరించాడు.
ముగ్గురు అభిప్రాయాలు విన్న తర్వాత, సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని వారికి చూపాడు. అందులో ‘ముగ్గురు అన్నదమ్ములు కలసిమెలసి ఉండాలి. నా కోరిక నెరవేర్చగల మనస్తత్వం ఉన్నవారికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను’ అని రాసి ఉంది.
‘‘చదివారు కదా! మీ నాన్న ఉద్దేశాన్ని మూడోవాడే చక్కగా అర్థం చేసుకున్నాడు. మనసు ఎలా ఉంటే పనులు అలాగే ఉంటాయి. తండ్రి ఉద్దేశం ఎరిగిన కొడుకే అతని కోరికను నెరవేర్చగలడు. అందుకే కలసిమెలసి ఉండాలన్న జీవనాన్ని కోరుకున్న మూడోవాడికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను’’ అని చెప్పి ఆ తాళాలు మూడోవాడికి ఇచ్చాడు సత్యమూర్తి.
‘‘ఈ తాళాలు నా ఒక్కడివి కావు. మనందరివీ’’ అని తన అన్నలిద్దర్నీ కలుపుకొని ముందుకు నడిచాడు మూడోవాడు.
తను చెప్పినట్లే పెట్టెలో మూడు రాళ్లు పెట్టి సులువుగా సమస్యను పరిష్కరించినందుకు నారాయణను మనసులోనే అభినందించాడు సత్యమూర్తి.


//అదిగదిగో వాడే//
_కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
04.07.2016

మనవాడే వాడు...
మసిపూసినోడు..
మనమున్నవాడు
మది తెలిసినోడు..

నీరు మోసెటోడు
నీవు మొక్కెటోడు
నీడవాడె చూడు...
నీలకంఠుడె వాడు

విషము దాచినోడు
విషనాగు చుట్టినోడు..
వికారాకారుడువాడు
విశ్వమంతయు వాడు

ముక్కన్నుల వాడు
మూలపురుషుడె వాడు
ముదము ఇచ్చువాడు
ముమ్మూర్తులొకడు

లయకారుడతడు
లంబోదరపితడు
లలాటనయనవాడు
లచ్చమ్మసోదరుడు

రమా సఖుడెవాడు
రామ ప్రీతివాడు
రావణ లోకంవాడు
రసభగ్నుడతడు

నెలవంక ధర్తవాడు
నెలతలిద్దరోడు
నెపములేనోడు
నెంజెలి బాపువాడు

కాలుడువాడు
కాముని దహించినోడు
క్రాంతదర్శి వాడు
కరకమల మూర్తివాడు

నాదమువాడు
నందివాహనుడు
నాగభూషణుడు
నటరాజె వాడు

తల,మాసినోడు
త్రిశూలం బట్టినోడు
తాండవ రుద్రుడాడు
తాపసి తపనే వాడు

పశుపతి వాడు
పరమేశ్వరుడువాడు
పదనిసల రూపివాడు
పంచాక్షరిలో పీఠమేసినోడు

హరుడు వాడు
హఠయోగివాడు
హిమజ వల్లభుడు
హరిహరుడెవాడు

నిన్ను నన్ను చూసేటి నిఖిలాక్షుడు
అన్నుమిన్ను కాచేటి కాలాతీతుడు
కన్ను దన్ను జేసేటి గంగాధరుడు
తన్ను తాను మరిచేటి భోళాశంకరుడు

అదిగదిగో వాడే..!
కదిలొచ్చినాడు చూడే..!!

శుభ సాయంత్రం మిత్రాస్.. _ మీ కరణం..

ఈ నాటి ఇల్లాలు ఎక్కడుంది విశ్రాంతి ?

సాయంత్రం అలా వస్తుంది
T V ,ఫ్యాన్ ఆపి వేస్తుంది
ఇళ్లను సర్ది సరి చేస్తుంది
పిల్లల బ్యాగ్ సర్ది పాలు ఇస్తుంది

లీలాగా తనలో ఏదో కోపం
తెలియయని అలసట
కొంత అలసటతో అరుపు
అసంతృప్తి ఎవరి కోసమో

కొంత విసురుగా నడక
అర్ధం కాని ఏదో ఆవేశం
వ్యక్తం చేయక గుస గుస
కాస్త పొదుపు అంటూ
నూనె దీపం వెలిగిస్తుంది

గూటికి చేరిన గోరింకను చూసి
పొగలు లేచే కాఫీ కప్పు అందించి
ఎంత ఘాటు ప్రేమ అనే చేలోక్తితో
పైట సర్దుకొని అంతా నిశ్శబ్దం

జడివాన కురిసి వెళ్లినట్లు
ఏదోకొత్త మొహం చూసి నట్లు
చూపులకు అర్ధం తెలియనట్లు
నవ్వుల చూపు రాత్రికదా అన్నట్లు

పిల్లల ఆటల తర్వాత చదివించి
కంచంలో ముద్దలు కలిపి పెట్టి
నిద్ర పోవుటకు పక్కలు సర్ది
నిద్ర పోబోతున్న పిల్లలకు పాలు ఇచ్చి
మంచంలో ఉన్న తాతగారికి మందులిచ్చి
బామ్మ గారికి రామాయణం వినిపించి
ఈ అలసట లేని ప్రయాణం ఆగదా
ఆయనా ఆలస్యము నీదే అన్న పిలుపు

రాత్రి పదికి విశ్రాంతితో స్నానం
చీర సింగారించి మల్లెల కురులతో
సగం తెరిచిన తలుపు మూసి
ధూమ పరిమళాల అందించి
చల్లగా చందమామను చల్లపరిచి
కొత్త నీరు నింపుకొని పొద్దున్నే నిద్రలేపు
ఉద్యోగానికి పోవాలి కదా అంటూ
కౌగలింతలో కలవరింతలతో
ఈ నాటి ఇల్లాలు ఎక్కడుంది విశ్రాంతి

మల్లాప్రగడ రామకృష్ణగారి..రచన

ముగ్గిన పండగు నమ్ముది
వగ్గది విని రెండు మూఁడు భాష్పకణంబుల్
నిగ్గుడిగియున్న చెక్కులు
డిగ్గన్ గాద్గదిక సంఘటిలిన యెలుఁగునన్

నా వయస్సెంతొ చంద్రమండలము వయసు
నించుమించుగ సరిపోవు నెంచిచూడ
నాచరిత్రంబు నిన్నమొన్నటిది గాదు
యెన్నియుగములు దాటిపోయెనొ కుమార!

ఆకాశరామ నీళ్ళాడుచక్కదనాల బుడుతచుక్కల కెల్లఁ బురుడువొసి
ఆలవోక నిండు జాబిలి రాట్నములమీఁద మేలైన వెన్నెలనూలు వడికి
విభునిదుర్దశఁ జూచి విలపించురోహిణీ నారీవతంసంబు నూఱడించి
గ్రహణకాలమునందుఁ గలుషితంబైపోవు నుడూపతిపుట్టంబు లుదికిపెట్టి

ప్రసవవేదనఁబడు వేల్పుఁబడతులకు
వీనుమిగిలిన మంతరసాని నగుచు
నమవసకుఁగూడఁ గన్నుమూయను కుమార!
కవులు వర్ణించు జింకను గాను నేను

గుర్రం జాషువా గారి "స్వప్నకథ" నుండి కొన్ని పద్యములు
తెలవారదేమో స్వామీ.. నీ తలపుల మునుకలోఅలసిన దేవేరి అలమేలు మంగకూ

చిత్రం : శృతిలయలు (1987)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : ఏసుదాస్, సుశీల

పల్లవి :

తెలవారదేమో స్వామీ..
నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకూ

చరణం 1 :

చెలువమునేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలలాలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి అలసిన దేవేరి
అలమేలు మంగకూ... తెలవారదేమో స్వామీ

చరణం 2 :

మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజుకేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగా
మరి మరి తలచగా..
అలసిన దేవేరి అలమేలు మంగకూ...తెలవారదేమో స్వామీ

గామపని... తెలవారదేమో...
సా ని ద ప మ ప మ గ ని స గా మ... తెలవారదేమో స్వామీ
పా ని ద ప మ గ మ
ప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి సా రి నీ స
తెలవారదేమో స్వామీ...

https://www.youtube.com/watch?v=8-cxDavJ51g
తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా...మళ్ళీ పరుండేవు లేరా

చిత్రం: చిరంజీవులు (1956)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: మల్లాది
నేపధ్య గానం: పి.లీల

పల్లవి:

తెల్లవారవచ్చె తెలియక నా సామి
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు ….
మారాము చాలింకలేరా … మారాము చాలింకలేరా

చరణం 1:

కలకలమని పక్షి గణములు చెదిరేను
కళ్యాణ గుణధామ లేరా
తరుణులందరు దధి చిలికే వేళాయే
దైవరాయ నిదురలేరా

చరణం 2:

నల్లనయ్య రారా నను కన్నవాడా
బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను
వెన్న తిందువుగాని రారా

https://www.youtube.com/watch?v=41XDTvI3mpA

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్

హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 ||

దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 2 ||

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 3 ||

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 4 ||

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 5 ||

హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ |
హే వీర తారక జయాౙ్మరబృందవంద్య,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 6 ||

పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 7 ||

శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 8 ||

సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి ||
--((*))--
చందమామ కధ...అన్న..గోపాలా .!
ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ గోపీతో వుండేది. ఆమెకు భర్త లేడు, ఒక్కడే పిల్లాడు. అన్నెం పున్నెం యెరుగని బాలుడు.
ఆ తల్లి చాలా కష్టాలు పడేది పిల్లవాడిని
పోషించడానికి. భగవతుడిని నమ్ముకుని బ్రతికేది. వూరికి దూరంగా వున్న బడిలో గోపీ చదువుకునేవాడు. రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు.
సాయంత్రం చింతతోపు లోంచి నడుచుకుంటూ ఇంటికి రావటానికి చాలా భయ పడేవాడు. వేరే పిల్లలంతా తల్లి-తండ్రులతోనో, బళ్ళల్లోనో
వచ్చేవారు.
ఒక రోజు గోపీ తన తల్లితో అన్నాడు, అమ్మా నువ్వు రోజూ నాకు పెరుగన్నమే పెడతావు, నేనేమీ పంచభక్ష్య పరమాన్నాలు అడగటం
లేదు. కానీ రోజు చింతతోపు లోంచి
రావాలంటే చాలా భయమేస్తుందమ్మా!
నువ్వు రోజూ నాకు తోడు రాలేవా?”
నాయనా! నీ పేరే గోపీ, గోపాల క్రిష్ణుడి
పేరు పెట్టుకున్నాను. ఆయనే నీకు దిక్కు. భగవంతుడే మనకు రక్ష! భయం కలిగినప్పుడల్లా, “అన్నా! గోపాలా!” అని తలుచుకో, ఆయనే చూసుకుంటాడు అంతా.” అని ధైర్యం చెప్పింది.
ఆ మాటను అక్షరాలా పఠించేవాడు గోపీ.
సాయంత్రాలు భయమేసినప్పుడల్లా, అన్నా! గోపాలా!” అని తలుచుకునేవాడు. ధైర్యంగా
భయం లేకుండా చింతతోపు దాటుకుని ఇంటికి వచ్చేసేవాడు.
ఒక రోజు బడిలో అయ్యవారు తన కూతురి పెళ్ళికి అందరినీ ఆహ్వానించాడు. అందరూ పిల్లలు తల్లి తండ్రులని అడిగి బహుమతులు తీసుకుని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు.
సాయంత్రం ఇంటికి వస్తూ పిల్లాడు, “అన్నా! గోపాలా!” అని పిలిచాడు.
ఏం బహుమతి తీసుకుని వెళ్ళాలి, పాపం మా అమ్మ ఏం ఇవ్వగలదు?” అని అడిగాడు. అమ్మ ఏమిస్తే అదే సరిలే అనుకున్నాడు. పెళ్ళిరోజు చక్కగా స్నానం చేసి, వున్న వాటిల్లో మంచి బట్టలు వేసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఇచ్చిన
చిట్టి పిడతలో పెరుగు జాగ్రత్తగా పట్టుకెళ్ళాడు. అందరూ ఖరీదైన బహుమానాలు తీసుకుని వచ్చారు.
కొంత మంది పిల్లలు గోపీ తెచ్చిన బహుమానం చూసి నవ్వేరు. కాని అయ్యవారు చాలా ఆప్యాయంగా గోపీని ఇంట్లోకి రమ్మని, ఆ చిట్టి పిడతని తీసుకుని పక్కగా పెట్టారు. గోపీని
కూడ అందరి లాగానే సత్కరించారు.
విందులో అందరినీ కూర్చోమన్నారు. పప్పూ, కూరలూ, పులుసులూ ఆరగించారు. పులిహోరా, మిఠాయివుండలూ, జాంగ్రీలూ వగైరా ఆస్వాదించారు. చివరిగా పెరుగు
వడ్డించ మన్నారు. చిట్టి పిడతలో వున్న పెరుగు ఒక్కరికి సరిపోతుందనుకుని, అయ్యవారు
ముందు ఆ గిన్నిలోని పెరుగు ఒకరి
విస్తరలో వంపేరు.
ఆశ్చర్యం! తిరిగేసరికి ఆ పిడతలో మళ్ళి
పెరుగు నిండిపోయింది. ఈ లోపల ఆ పెరుగు తింటున్న వ్యక్తి, “అద్భుతం! అమోఘం! ఈ
పెరుగేంటి ఇంత రుచిగా వుంది, ఎక్కడనించి తెప్పించారు?” అన్నాడు. వేరే వాళ్ళంతా, యేది, మాకు వడ్డించండి, మేమూ
చూస్తాము”, అన్నారు.
అయ్యవారు పిడతలో పెరుగు అందరికి వడ్డించడం మొదలెట్టారు. అసలు యెంత మందికి అందులోంచి పెరుగు వడ్డించినా,
అందులో మళ్ళీ మళ్ళీ పెరుగు నిండిపోయింది.
వచ్చిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు. ఈ మహిమ యేమిటొ అని అయ్యవారు గోపీని అడిగారు. గోపీ జరిగిందంతా చెప్పాడు. అందరూ యేది, అన్నా! గోపాలా! అని పిలూ,
మేమూ చూస్తాము!” అన్నారు.
అయ్యవారు అందరిని మందలించారు. “
మనలాంటి వాళ్ళకు కనిపించాల్సిన అవసరం
దేవుడికిలేదు. ఈ బాలుడి వల్ల మనం ఈ రోజు ఈ మహిమ చూడగలిగాము.” అన్నారు.
అందరూ ఆకాశం వైపు చూశారు.....!!!!!!!!

2 comments:

  1. మీకు చెడ్డ క్రెడిట్ ఉందా? మీరు బిల్లులను చెల్లించడానికి డబ్బు అవసరం? మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? నిరుపేద నిధుల కారణంగా మీరు అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్ ఉందా? మీకు ప్రయోజనం కలిగించే ఏ ప్రత్యేకతలోనైనా పెట్టుబడి పెట్టడానికి మీకు డబ్బు అవసరమా? మరియు మీరు ఏమి చేయాలో మీకు తెలియదు? మేము క్రింది రుణాలను అందిస్తాయి: వ్యక్తిగత రుణాలు, సురక్షితం మరియు అసురక్షిత రుణాలు, కలయిక రుణాలు, విద్యార్థి రుణాలు, ఏకీకరణ రుణాలు మరియు చాలామంది ఇతరులు 2% వడ్డీ రేటుతో చాలా అనుకూలమైన నిబంధనలు మరియు షరతులతో. కానీ దయచేసి దరఖాస్తుదారులు 18 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి. ద్వారా మరింత సమాచారం కోసం ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించండి సంకోచించకండి (ఇమెయిల్: prudentialinvestmentmanagement@gmail.com) లేదా సంప్రదించండి: +1 205-671-0404

    ReplyDelete
  2. మీకు చెడ్డ క్రెడిట్ ఉందా? మీరు బిల్లులను చెల్లించడానికి డబ్బు అవసరం? మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? నిరుపేద నిధుల కారణంగా మీరు అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్ ఉందా? మీకు ప్రయోజనం కలిగించే ఏ ప్రత్యేకతలోనైనా పెట్టుబడి పెట్టడానికి మీకు డబ్బు అవసరమా? మరియు మీరు ఏమి చేయాలో మీకు తెలియదు? మేము క్రింది రుణాలను అందిస్తాయి: వ్యక్తిగత రుణాలు, సురక్షితం మరియు అసురక్షిత రుణాలు, కలయిక రుణాలు, విద్యార్థి రుణాలు, ఏకీకరణ రుణాలు మరియు చాలామంది ఇతరులు 2% వడ్డీ రేటుతో చాలా అనుకూలమైన నిబంధనలు మరియు షరతులతో. కానీ దయచేసి దరఖాస్తుదారులు 18 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి. ద్వారా మరింత సమాచారం కోసం ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించండి సంకోచించకండి (ఇమెయిల్: prudentialinvestmentmanagement@gmail.com) లేదా సంప్రదించండి: +1 205-671-0404

    ReplyDelete