Monday, 24 June 2024

Poims

 ధ్రు. కో. జయ విరూపము  దివ్య లోచన జయతుహస్త దిశానివై 

జయ పినాకిని ష్వాస! శాశ్వత! జయతు నిత్యము శాంతివై 

జయమహాశివ రుద్ర దైవము జయతు చింత్యము నిత్యమై 

జయ ముకుంద గిరీశ భక్తిరి జయతు ఖేచర యీశ్వరా

******

ప్రకృతి యొక్క విధి విధానాలకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మలచుకోండి.   


లేకుంటే మీరు మలచబడతారు.


: పత్రం పుష్పం ఫలం తోయం,  యోమే భక్త్యా ప్రయచ్చతి

 తదహం భక్త్యు ప్రహృతమస్నామి  ప్రయతాత్మనః      ( భగవద్గీత )


సామాన్యమైన అర్థం ఏమిటంటే :-

భగవంతునికి పత్రం, పుష్పం, ఫలం, జలం సమర్పించి పూజ చేయమని.


 కానీ అంతరార్థం ఏమిటంటే అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం మాత్రమే భగవంతుడు సమర్పించమన్నాడు.


* పత్రం -- మనస్సు -- చంచలం.

* పుష్పం -- బుద్ధి -- వికసించడం.

* తోయం -- చిత్తం -- నిర్మలం.

* ఫలం  -- అహంకారం -- నారికేళం రెండు ముక్కలవడం.


అవి ధ్యానం వల్లనే సాధ్యం.

* ధ్యానంలో 'మనస్సు' యొక్క చంచలత్వం పోతుంది.

* అప్పుడు లభించే ప్రాణశక్తి వల్ల 'బుద్ధి' వికసిస్తుంది.

* అప్పుడు లోపల ఉన్న చెత్త ఆలోచనలు అన్నీ పోయి 'చిత్తం'      నిర్మలమవుతుంది.

* దానివల్ల నేను అనే 'అహంకారం' తొలగిపోతుంది.

 అప్పుడే లోకానికి మేలు చేస్తాడు. అటువంటి వాడే ఆయనకు ప్రీతి పాత్రులు అవుతారు.

*****


శా. ధీరోదాత్త! పినాకి! వత్సలత పృ౹ధ్వింజేరి శ్రీశైల ది 

వ్యారాధ్య స్థలి నిల్చి భక్తజనుల౹న్బాలించు మృత్యుంజయా!

పారంజూడవె నీ కటాక్ష ఝరి నా ౹వ్యామోహమార న్కప 

ర్దీ!రావే కన, మల్లికార్జున, శివా ! శ్రీశైలవాసా,నమో॥


అందరూ స్త్రీ ని హింసిస్తున్నారని మొత్తు కుంటున్నారు

మరి స్త్రీల హింసకు గురియైన భర్తబతుకు ఎలావుంటుందో మీరే చెప్పండి

నాభవనా కవిత్వం యిది ఎవ్వరినీ యుద్దేశించినది కాదు

****

అమ్మా నాన్న కు భార్యా భాదితుని గా యీ లేఖ

సీస పద్య మాలగా చిన్న ప్రయత్నం

మీ అభిప్రాయాలు తెలపండి 


అమ్మ కడుపులోన అలలుగా నెలలుగా 

నీవిద్య గుండెలో నిండు కుంది


పువ్వులా పెరిగాను పూజకై బ్రతికాను 

నీ తలా తాకట్టు నీడ జూపు


భార్య దేవతయని బంధము నిజమని 

అమ్మ అమ్మా యని అలక జూప


పుట్టినింటిని గొప్ప పూర్తి చెప్పెది భార్య 

నిజము నోరేత్తక నీడ నైతి


తరచుగా అంటుంది తమరు మావారని

తిరగడం నేర్చింది తప్పు యైన


ఉద్యోగ మనచునే ఊర్లలో తిరుగుడు

ఉండ మ నన్నను ఉండ కుండె


సంపాదనే లేదు సంసార మేలను

పెట్టింది తినమనే పెనుగు లాట


భార్య దేవతకాదు బాధించు రక్కసి 

భార్యయు భద్ర కాళి బానిసవదు


కన్నీళ్లు భర్తకు కళ్ళాపు జల్లుటే

వెన్నీళ్ల తిట్లుయే వెన్నెలగుట 


మొదలవుతుంది నా  మోక్ష కాపురమేను 

పగలంత దిరుగుడే భార్య బతుకు


రాత్రి పందిరి మంచ రక్షగా తోడుయే 

పడుకోను సుఖములేని బతుకు


నాభార్య గౌరవ నాదు సంసారమే 

అరచేతుల అంట్లు తోమడ మగు


కళ్ళని వంటింట కాలపు పనిగాను 

గుంజలా వున్నాను గుర్తు పెళ్లి


యీ విసినకర్రతో విసిరి సుఖము పెట్ట 

వీపుని భార్యకు విడిచి పెట్టె


చెవుల్ని బూతుల్ని చరిత్రగా వినడమే 

కళ్ళని కన్నీళ్ల కాపురమ్ము


గొంతుని భార్యకు గోరు ముద్దలు గాను

నోరు కుట్టియు మరీ నొక్కి చెప్పె


భార్య నన్నెంతనూ దుమ్మెత్తి పోస్తున్నా

ధ్వజస్తంభంలాగ ధరణి యందు


గడపమీదన జుట్టు గలగల విరబోసు 

క్కూర్చున్న పడచుకు కూడు నేను 


నావంక దీనంగ ఆపని యీ పని 

ఆవులు-గేదెలా ఆట పట్టు


రాత్రవుతుందంటే రమ్యత బెంగగా 

ఊయలే కరువుగా ఉంది నాన్న


తెల్లారుతుందంటే దడగాను భయమేను 

అమ్మని నిన్నూను అడగ లేను


చూడాలనియు ఉంది చూపుల కొడుకుగా

నాకువద్దన్నాను నాకు పెళ్లి


ఈ ఉత్తరం మీకు  ఇష్టమోనోసదా

నిజముగా చెప్పెద నీడ కర్మ


నేను మీరన్నట్లు నిడలేని మొగుడ్ని 

నేను నిజంగా స్వర్గ నీదు కొడుకు


ఆనందం అధరమ్ము గాను చరితమ్మేలే మనస్సే గతీ

ఆనందం సహనమ్ముగాను సమయమ్మేలే వయస్సే గతీ

ఆనందం వినయమ్ముగాను మధురమ్మేలే ఉషస్సే గతీ

ఆనందం సుగుణమ్ముగాను పయనమ్మేలే యశస్సే విదీ 


శా. భర్తే దైవమనే సుబుద్ది కరువే భార్య ప్రభావమ్ముగా

కర్తే భర్తనకే మధించు కడు నీకాగ్రమ్ము తెంచేయుటే

స్ఫూర్తే పెళ్లి యనేది సూర్పణఖగా పూజ్యమ్ము వేధింపుయే

కిర్తీ గా బతుకంత వేదనముగా ఇష్టమ్మె పెళ్ళామనే 

.

.-మీ కన్న కొడుకు


స్త్రీ తనువు దయా హృద్యము

స్త్రీ తమకమ్ముయె  సహాయ స్త్రీ పంతముగా

స్త్రీ తావున నున్న మహిమ

స్త్రీ తీరున శక్తి జూప స్త్రీ యుక్తి గనే 


🙏🙏🙏


" కం.

*'స్త్రీ * యేలక్ష్మీరూపిణి

* స్త్రీ * యే ప్రేమార్ద్రహృదయి.. ధీశాలినియున్ ..

* స్త్రీ * యేపరాత్పరి యరయ

* స్త్రీ * యే సదమల కుటుంబజీవనమొసఁగున్ !!! "

----

దత్తపది........


స్త్రీ

స్త్రీ

స్త్రీ

స్త్రీ


🚷🚷🚷🚷


శా. స్త్రీ శీలాన్ని భవిష్య వాణి తెలిపా స్త్రీశక్తి సర్వార్ధమే

స్త్రీ శీలాన్ని సమస్య నెంచ విధిగా స్త్రీ యుక్తి విశ్వాసమే

స్త్రీ శీలాన్ని శుభాషితం వినయమై స్త్రీ భుక్తి దాహమ్ముయే

స్త్రీ శీలాన్ని సుధర్మ మార్గమముగా స్త్రీ ముక్తి సంతృప్తియే 


ఉ.మోసితి బంధబాధ్యతలు మోక్షము కోరియు జీవితమ్మునన్

వాసన ఈర్ష్య భావములు వాదన వెల్లువ సర్దుబాటుగన్

వేసితి తప్పడడ్గులను వీనుల విందని చెప్పకే స్థితీ

పూసిన పువ్వు రాలుటయు స్ఫూర్తిగతృప్తియు బత్కు ఆటలే


ఉ.పద్మిని పద్మనేత్ర కళ పాద్యతప:ఫల పొంద గోరియున్

దాత్మయు యీశ్వరిన్ విలసిత్చాపయు ధాత్యత పొందు వి

శ్వాత్మయు జేర నుండియు విశ్వాసము ఏర్పడి సేవ బంధమున్

పద్మిని నూయలూగుచునె ప్రేరణ ప్రేమయు పొందగల్గుటన్


శా.తల్లోపూలు గొనిస్త సేతులకు మెర్పుద్గాజులేయిస్త యీ

ఊల్లో కంకణమేను యుంగ రమునే టుప్పాడ కోకా బుటా

మల్లే మొగ్గల తెల్ల హారముగా మత్తే యి గమ్మత్తె గా

సల్లాపమ్ము సుఖా మమస్సు యగుటే సందర్బ ప్రేమమ్ముగన్


డా.మల్లాప్రగడ పూరణ

సమస్య:

నరకములోన గాంచెదరు నాక సుఖంబుల పాపులెల్లరున్


చం.

విరిగిన కొమ్మ చేర్చకళ వేగము బాటగ జీవితమ్ముగా 

మరిగిన వేళ నెంచుకళ మానస నేస్తము ధర్మ మార్గమై 

తరుణము తాపమెంచకళ తత్త్వము కార్య సమాన బాధతో

నరకములోన గాంచెదరు నాక సుఖంబుల పాపు రెల్లరున్

ఉన్నదేదో ఉంది, ఉన్నదంతా అందులోనే ఉంది.

ఇంతకన్నా వేదాంతం ఏముంది?

చిన్న దేదో అంది, ఉన్నదంతా అందులోనే ఉంది

అందుకున్న రాద్ధాంతం ఏముంది


ఉన్నది ఒకడే.

వాడే ఇక్కడ జీవుడు.

వాడే అక్కడ దేవుడు.


 'ఒకటి'ని అనేకంగా చూడగలిగే శక్తీ తనకు ఉంది,  దానికి ''మాయ" అని జీవుడు.


తిరిగి 'అనేకాన్ని' ఏకంగా చూడగలిగే శక్తీ తనకు ఉంది.  దానికి "జ్ఞానం" అని దేవుడు.


తెలుసుకో రోజులో ఆఖరి మజిలీ నిద్ర

తెలుసుకో జీవితంలో ఆఖరి మజిలీ మరణం

 తెలుసుకో జన్మపరంపరలో ఆఖరి మజిలీ సద్గురువు


భూమి రూపంగా వ్యక్తమైనప్పుడు అవి క్షేత్రాలుగా 

 జల రూపంగా వ్యక్తమైనప్పుడు అవి తీర్థాలుగా 

 శబ్ద రూపంగా  వ్యక్తమైనప్పుడు అవి వేదాలుగా 

వ్యక్తి రూపంగా  వ్యక్తమైనప్పుడు అవి అవతారాలుగా 


అనుభవాలను పక్కకు తోసేయండి.

తెలియ జేయుట మక్కువ మానేయండి 

 అనుభవించేవాడి మీద మీ ధ్యాస నిలపండి.

అనుకవే నీనాడి మీద మీ దృష్టి నిలపండి 


కన్నప్రేమే అంది, చిన్నదంతా పొందులోనే ఉంది.

సొంత మన్న సిద్ధంతం ఏముంది

విన్న మాటే అంది, విన్నదంతా హద్దులోనే ఉంది

కొంత యన్న అర్ధాంతం ఏముంది

ప్రాంజలి ప్రభ నేటి పద్యాలు

రచయిత. మల్లప్రగడ 


చ.మధువుకు ఏమి తెల్సును సుదా మృతమేను సుఖాల చిత్తమే 

వధువుకు ఏమి తెల్సును నవాభ్యుదయామృతమేను పొత్తుగా      

అధరము కేమి తెల్సును సమానము ప్రేమ అనేది పొందుగా 

కధల ను తెల్ప కాలము సకామము బుద్ధి ప్రవర్తనే సుదీ


చ. గురువన ధర్మ బోధలు వినూత్న విధాన చతుర్ముఖుండగా 

గురువన దైవ నిర్ణయ సచిహ్న  సహాయ మనస్సు శివుడౌ

గురువన శక్తి రూపము అకుంటిత దీక్షగు కీర్తి విష్ణువే   

గురువన మోక్ష మేయగు సకూల నొసంగు విచిత్ర దైవమే


చ. కరుణ యనేది లేని విధి గల్ల విధాన మనేది నాయకుల్ 

బిరబికుయుక్తి యుక్తియు సువిస్తరణమ్మున  ప్రేమ పల్కులే 

యరకొర లక్ష్య మంతయు సయోధ్య జనించి జనాళి చిత్తమున్ 

మరులను తెల్పనున్నది సుమా! ప్రతిభా ప్రకృతీయశస్సుగా .


ఉ.ఆయుధ మేమదీ విన సకామపు బుద్ధియు తృప్తిగా       

సాయుధ శక్తియుక్తి  మది సాధన దీక్షయు ధైర్యమై  

కాయము కర్త కర్మ కళ కామ్యపు శక్తియు విశ్వమై 

ప్రాయము నేర్పు మంచి కళ ప్రాభవ మంతయు యుక్తిగా


చ. గురువన ధర్మ బోధలు వినూత్న విధాన చతుర్ముఖుండగా 

గురువన దైవ నిర్ణయ సగుర్తు సహాయ మనస్సు శివుడౌ

గురువన శక్తి రూపము అకుంటిత దీక్షగు కీర్తి విష్ణువే   

గురువన మోక్ష మేయగు సకూల నొసంగు విచిత్ర దైవమే


డా.మల్లాప్ర గడ పూరణ

సమస్య:

వింతగ గానుపించునట విశ్వము సర్వము మేడిపండులో 

ఉ.

శాంతము లేక  నెన్నికలు, శాపము మాదిరి అంటి అంటకే 

చింతలు మార్చలేరనియు చిత్రము చూపుచు ఆశ పెంచుటే 

పంతము చెప్పి చెప్పకయు పాలన దెల్యునిజాలు నేస్తమై 

వింతగ గానుపించునట విశ్వము సర్వము మేడిపండులో


శా. నాలో ప్రేరణయే ప్రభావ మదినాకర్షస్వభావమ్ము తా

త్కాలీసాధనలే సమర్ధ సమరం తన్ మాయ చోజ్యము యే

వేళా ధైర్యమునే వహించి జపమై విద్యార్థి గా సేవ యే

గాలో నన్నునుచేరి కామ్య కధలే కర్తవ్య మే స్వర్గమౌ


ఉ.అల్లరి పాలు నవ్వుటయు ఆత్రఅనర్ధఅ భాస పాలుగా

అల్లుకు పోవు బుద్ధిగను ఆశ్రయ లక్ష్మియు ఇంటి యందునే

చెల్లని మాటలేల కథ చింత మదీ యనినాద మేనులే

చల్లని చూపు లేలుమది చక్క వరాలగు నిత్య సత్యమున్


ఉ.ఏమని చెప్పలేనుకథ ఎల్లరు మెచ్చెడి బుద్ధిమాధ్యమున్

ఆమని పిల్పులే మనసు ఆటలు బీటలు మారిపోవుటన్

ప్రేమను వ్యక్త పర్చ గలిగే విధి వైనము తోడునీడగన్

శోముని సేవ భాగ్యమిది శోధన సాధన జీవితమ్ముగన్


డా.మల్లాప్రగడ పూరణ

సమస్య:

హరిణము గాంచి సింహము భయమ్మున బాఱెను ప్రాణభీతితోన్


చం. చరితము తెల్పు విద్యలు విచారణ లేని దియుక్తి లక్ష్యమే ధరణిన తప్పుకానిది విధాన పరమ్ము జయమ్ము ధైర్యమే

పరువని భేద భావమును పాలన నేత యు ధర్మ బుద్ధియే

హరిణము గాంచి సింహము భయమ్మున బాఱెను ప్రాణభీతితో


శా. పత్రాలే ఉపయోగమై నలిగి సప్రేమా  సహాయమ్ముగన్

సూత్రాలే సహకారమై మిగిలినే సూ ర్వార్ధ భావమ్ముగన్

నేత్రాలే సమయమ్ముగా కదలి వినోదం విషాదమ్ముగన్

చిత్రాలే కనులార శంకర దే దీప్యమ్ము సర్వార్ధమున్


ఉ.అమ్మయె సామరస్యమును అన్నిట చూపుసమమ్ము మార్గమై

అమ్మయె విద్య పోషణయు ఆశ్రమ తృప్తికి నాంది మూలమే

అమ్మయె సర్వసృష్టికి మనస్సును పంచెను సౌఖ్య శాంతికే

అమ్మయె రక్తమిచ్చియి సమస్యలు మాపెడి ఈశ్వర సతీ


స్కంద షట్పది 


మౌనమునీ శంకరుడే

ధ్యానమునా నుండుటయే

జ్ఞానము పంచే మదిగను జ్ఞప్తిగ సతితో

ప్రాణము పోసెడి వాడును

ప్రాణము తీసెడి వాడును

తృణమై కిరణమ్ము భక్తి తృప్తి శివుడుగా


ఉ.సోదర సోదరీ మణుల కోర్కెలు తీర్చగ ఏగు తెంచితిన్

బాదర బందియేయనక బంధము పెంచుట బాధ్యతే యగున్

ఆదరణే మనో పలుకు పాఠము నిత్యము సత్యమేయగున్

నాదము దివ్యమై మనసు నానతి కోరితి పార్వతీ పతీ


తెల్ప లేను మనశ్శక్తిని సవిద్యా జగమ్మునా

నిల్ప లేను మహాయుక్తిని సుదీక్షా మనమ్మునా

కల్ప వల్లిగ హృద్యమ్ము కమనీయా స్వనమ్మునా

అల్ప మైన మనస్సేను సహకారం వినమ్రతే


ఉ.భీముడు మంకు, కావ్యజుని భీతి మహీపతి రంకు సాహనం

శోమ కళంకు విద్యగను స్తోత్రము డొంకు పయోధియింకు అం

కామ హితుండు క్రుంకు, కలకాల గుణంబుల నీకు ధారుణిన్

రాముని నేస్తమే హనుమ రాజ్యము ఏలెడి ధర్మ మూర్తిగన్


ప్రాంజలి ప్రభ నేటి పద్యములు

రచయిత. మల్లాప్రగడ రామకృష్ణ 


ఉ.చేతిన వెన్నముద్ద కడు చేష్టల కృష్ణుడు పిల్ల వాడుగా

చూతము రండి మాలికల పూజ్యుడు గజ్జలకృష్ణుడేయగున్

పూతన చంపినా చిలిపి పూర్తిగ  చూపిన చిన్ని కృష్ణుడే

జాతక మార్పు తెల్పగల జాతికి రక్షగ గీత మాధవా


మల్లాప్రగడ పూరణ

సమస్య: పుస్తకమన్న నేడు గరభూషణ మన్నది‍ వట్టిమాటయే


ఉ. ఆస్తులు యమ్మి కోరెడిది ఆశలు తీర్చెడి విద్య ఏది శా

శిస్తు మనోబ లాన్ని కదలించని విద్యలు కూడు గుడ్డ లే

నిస్థితి తెచ్చు విద్య ఎవరి స్థితి మార్చును ఎల్లవేళలన్

పుస్తకమన్న నేడు గర భూషణమన్నది వట్టిమాటయే


ఉ. మబ్బులు వల్లనే మనసు మారకముందునె దారిమార్పుగన్

జబ్బులు ఉన్న కామగుల జా డ్యము పొంతన లేని బత్కులన్

గబ్బు సమాజమే ఇదియు గమ్యము చూపని దేశమేయగున్ 

డబ్బుల గోలయే విధిగ డాంబిక బుద్ధియు తెల్ప గల్గుటన్


ఉ. కష్టము కారుచిచ్చుగను కాలము నేర్పెను గమ్య మార్గమున్

నష్టము యేడ్చు బిడ్డల సనాతన మేనన చేవలేక యే

పౌష్టిక భోజనమ్ము కరువాయెసుమంగళి కష్ట మోర్చుచున్

ఇష్టము భర్తసేవలకు ఈశ్వరి ఇచ్ఛని చేయసాగుటే


శా. వ్యర్థంబే సతి లేని దాతబతుకే వాశ్చల్యమేమౌనని

స్వార్ధంబే సహితం వినమ్ర తిమిరం సామాన్య సద్భావమే

వార్దిఖ్య0 సహతోడు భక్తి కరుణా సాహిత్య సంతృప్తి యే

అర్ధాంగీ పలుకే మదీయ పరమై ఆరాధ్య తత్త్వమ్ము గన్


ఉ.కాలము నాది కాదనియె గర్జన దేనికి ఆపుమా మనో

ఉల్లము జల్లుగా అయిన ఊయల లాగున అర్వకే మనో

మల్లిక వచ్చెనే మనసు మాయగా మోహము కమ్మెనే మనో

ఏలిక వల్లనే ఇదియు ఏకము ఏమియు జీవితమ్ముగన్ 


ఉ.  " మండెడి యగ్నిగోళముగ మారెనుభాస్కరుఁడిప్పుడెంతగా

యెండలు ఠావుఁబోవునటు లెంతఁగ భీతినిఁగల్గుచున్నదే

దండిగ నీరుఁద్రావినను దాహముఁదీరుటలేదునాకు..మా

ర్తాండునిఁగ్రమ్మెడిన్ మొయిలు రాకను ప్రార్థనఁజేయు దిప్పుడున్.."


ఉ. అమ్మవు అన్నపూర్ణవు సమశ్యలుతీర్చెడి జ్ఞానదీపమై

నమ్మక ముంచగల్గెడి మనస్సుకు శాంతిని నిచ్చు దేవతై

ఉమ్మడి నీడ నిచ్చెడి సమున్నత శక్తియు సర్వ శ్రేష్టికై

అమ్మ అనంత మైన మది ఆత్మయు అందరి ఇచ్ఛ యీశ్వరీ


ఉ.నల్లని మబ్బు మేఘములు నాలుగు వైపుల కమ్మియుండుటన్

చల్లని గాలి శోకమగు జల్లుల విస్తరి కుంభ వృష్టిగన్

పల్లవ నీరుయే పుడమి పచ్చని చేనుల చీరదాల్చిడిన్

మెల్లగ చేరు బంధువగు మెత్తని చూపుల వర్ష మీశ్వరీ


ఉ.ప్రాసల పోరు ఏల మది ప్రాణము నిల్పెడి మాటపొందికన్

రాశిగ పోయు విద్యలని రాట్నము మల్లెను తిర్గుటేలనున్

వాసన బట్టిఏల గతి వాంఛల జీవత సౌఖ్య మవ్వుటన్

మాసిన బట్టమార్చినను మానస బంధము పోదు యీశ్వరీ


ఉ.అంబర నీటి బాణముల ఆత్రపు దాహము తీర్చగల్గుటన్

సంబర మాయభూ మగువ శాంతిగ గర్భము దాల్చగల్గుటన్

ప్రాభవవిత్తుగా కడుపు ప్రాణపు కంకులు యుద్భవించుటన్

శోభన వల్లనే వసుధ శోకము తీర్చెను వర్ష మీశ్వరీ


ఉ. భూమిగ మూలధార చక్ర భుక్తికి శక్తి మనోమయమ్మగున్

స్వామిగ వర్ష తత్త్వము విశ్వాస సహాయ అభిష్ట సిద్ధిగన్

కామిత అగ్ని ఆజ్ఞ మది కాంక్షల తృప్తిగ కార్యవర్ధిగన్

ప్రేమిత వాయుముంబరము ప్రీతి గనే పరమేశ్వరసతీ


ఉ.రంగులు మార్చతెల్విగల రంభసహాయపు వేష భాషలున్

పొంగులు రచ్చచేసినను కోర్కెల కుంపటి తెల్సి చేరుటన్

చెంగును మార్పు చూపులగు చిల్పి గ నవ్వులు కైపు పెంచుటన్

మంగున చిక్కి కత్తెరగు మంధర మాయకు చిక్కి తీశ్వరా


ఉ.హృద్య విహంగమై కదలు హారతి చీకటి రాత్రి మార్చుటన్

సాధ్య సహాయమే కదలి సాన సమాన మనో సుదీర్ఘ మై

శోధ్యము వల్లనే మనిషి శోకము చుట్టును తిర్గ గల్గుటే

విద్య అతీ తమై విధిగ విధుల వెంటయు పార్వతీపతీ 


ఉ.వైరము కాని మాటలు సమైకము సృష్టిగ జీవనమ్మగన్

నేరము దుఃఖ భాగ్యమగు నీడల వెంటన కష్టమే మదిన్

ద్వార సుఖాలు కో రగల దాశ్వపు బుద్ది వినాశమే యగున్

కారము లేని కూరదిని కాంతుడు మెచ్చెను భార్య నత్తరిన్


ఉ.అందము పొందగోర మది ఆశయ లక్ష్యము నిత్య సత్యమై

స్పందన తెల్ప నీడలగు సాధన శోధన దేహ వాంఛగన్

చిందు మతీగతీ వలన చిత్రము సోద్యము సర్వ ధర్మమై

పొందు సుఖమ్ము దుఃఖమగు పోరుసమానము పార్వతీపతీ


ఉ.గోడును జెప్పుకున్న మది గూడదు పొమ్మన మూర్ఖ బుద్దిగన్

పాడు మనస్సు ఊరకయె పాపము నీడను సాగ పొం దుగన్

వాడుక పువ్వుగా గుణము వాదము చేయక భక్తి చూపగన్ 

వేడుక తీర్చ బుద్దిగను వెంగము లాడిరి పార్వతీపతీ


శా:: అజ్ఞానం మనసయ్యె సమిదిగా యన్నార్తి నైయుంటినే  

విజ్ఞానం ప్రతిగమ్యమాయ కలిగే వేదమ్ము పాఠమ్ము గా

సుజ్ఞానాత్మ సహాయమేది ధరణీ శోధించకే నన్నికన్

ప్రజ్ఞానందరిచేర్చి బాపుమిక శ్రీమాతా మనోశక్తిగన్


ఉ:: నేలను చాపలా మడిచి నింగిని గుప్పెట పట్ట బుద్ధియున్ 

గాలము వేసి తోడుమతి కాలము పట్టియు గొప్ప చెప్పుటన్

తాలను లేక చీకటిన దారిని తప్పుగ ఎంచ గల్గుటన్         

మేళము తాళమైన గతి మోహము మాత్రము యీశ్వరీ పతీ


నేటి సమస్య 

కారము లేని కూరదిని కాంతుడు  మెచ్చెను భార్యనత్తఱిన్

ఉ.

రారని కోరు పెట్టుటయు రమ్యత సఖ్యత చూపగల్గుటన్  

బేరము కాదు వేదనది బీగము చేష్టలు పొల్లుపోవుటన్  

నేరము చేయు వక్తి యని నీడను కూడను తాకనివ్వకున్

కారము లేని కూరదిని కాంతుడు మెచ్చెను భార్యనత్తఱిన్


వార్తను బట్టి.. ప్రాంజలి ప్రభ 


ఉ..కాకులుగా నిరీక్షణ సకామ్యము భారత కర్మ నేస్తమై 

కాకులె కెన్య యెక్కరవు కాలపరిశ్రమ నష్ట మూలమే 

కాకుల కారణం తెలుప కార్యము హేతువు ధర్మ మార్గమై 

కాకుల బాధ హింస మది కజ్జల వార్తల బాధ భారతం


(పది లక్షల భారత వలస కాకులను చంపాలని కెన్యాలో మిషనని తాజా వార్త నేపధ్యంలో)


ఉ. యీశ్వర దేవదేవ భవ ధీయమ హేశ్వర విశ్వ రూప రా

మేశ్వర సర్వ రక్ష నిధి మోక్ష గుణేశ్వర దీక్ష రూప లిం

గేశ్వర విశ్వ సృష్టి సహ దీశ్వర మర్మము మాయ మాపు భీ

మేశ్వర భక్తితో కొలువ దీనుల పాలిట పార్వతీ పతీ 


శా.శర్వేసీ పరమేశ్వరాభ్య నయనా సౌందర్య సౌభాగ్యనీ 

భార్యేసీ లయ కామి తార్ధ సుదతీ భాందవ్య భాగ్యమ్ము యే 

కార్యేసీ విధి సర్వ కాల విన తీ కర్తవ్య కాలమ్ముయే 

పర్వే సీ విజయమ్ము గాను సహనం ప్రారబ్ద బంధాలులే


ఉ.ఎంతటి విశ్వమైన మది నెంచక తాండవ మాడుటే యగున్

నెంతటి సూక్ష్మ నిర్మతము నిర్మల నిర్ణయ భాగ్యమే యగున్

ఎంతటి యల్పమో కళలు ఎంచియు తీర్చుట ధర్మ మార్గ యిం

కెంతటి సర్వ మోక్ష పరమేశ్వర దివ్య కధామృత స్తోత్రమే


ఉ.కన్గవమూసినన్,దెరచి గాంచగ యత్నము సల్పినన్,శివా!

నిన్గనజాలలేను,మది నెమ్మదినొందదు,భావరూపమున్

కన్గొనలేను,కర్మయన గామ్యము గాదె,నినెట్లు బొందుటో?

చిన్గినయప్పుడే కుదుఱు చిత్తమునందున మోహపాశముల్


 మ.బుధజనులందు నే వినయభూతమనస్కుడనై చరింతు,వా

క్సుధ పలుకెల్ల‌ నిండుకొన సాధువునై ప్రవచింతు,దీక్షతో

వదలను నేను‌ధిక్కృతుల వైదికబాహ్యవచోవిదగ్ధులన్

వధయొనరింపగావలయు వ్యర్థపుతర్కపుహేతువాదులన్.


వర్ణాలే కలిసే నువేగ కళగా వార్ధఖ్య జీవమ్ముగా 

స్వర్ణంబయ్యి కలౌనుమార్గ కధగా సామర్ధ్య సంభావ్యతే 

పూర్ణత్వమ్ము సకామ్య వేద కళగా గా పూజ్యమ్ము సౌఖ్యమ్ముగా 

*కర్ణాటోర్వినిఁ దేజరిల్లెఁ దెలుగాఁకర్ణింపుమా వేడుకన్*


శా.రామమ్మే హృదయమ్ము గాను ధ్రుతమై రాక్షశ్య లంకాననే

రామమ్మే విధి సంహరించ తిమిరమ్మే ఛాయ రూపమ్మె లే

రామమ్మే గురు నేత్రమౌను విధిగా రమ్యత్వ భావమ్ముయే

రామమ్మే హనుమా నినాద నిధిగా రాత్రి పగళ్లేను గా


ఉ. శ్రీగతి నాల్గు చక్రములగు శ్రీకర శక్తియు లోక చక్రమే 

శ్రీగతి మూలకారణము శ్రీ మతి తత్త్వము కూడుచక్రమే 

శ్రీగతి అష్ట కోణములు శ్రీ విధి సత్యము తెల్పు చక్రమే 

శ్రీగతి మూడు విద్యలగు శ్రీ నిధి అంచులు యీశ్వరాసతీ


ఉ.గమ్యము నిత్యమై జయముగల్గును సాగుట సంసయమ్మె లా

సౌమ్యము నుంచియే భయము సాగుట ఏలను మౌనకమ్మె లా

దామ్యము చెందుటేనయము దారియుచేరుట న్యాయమార్గమే

కామ్యము వల్లనే లయము కాలము తీర్పగు పార్వతీసతీ


ఉ.వాళ్ళ మృధుత్వమే జగతి వాకిట ఉప్పెన నవ్వ గల్గుటన్

వీళ్ళ భయమ్మయే జగతి వీనుల విందగు ఎల్లవేళలన్

ఏళ్ల తరమ్ము గా జగతి ఏదియు కోరక సత్యమవ్వుటన్

కళ్ళకు చిక్క కుండగను కామ్యము ఏదియ పార్వతీసతీ

No comments:

Post a Comment