Monday 3 June 2024

06-06-2024





#046..కర్మ_పునర్జన్మ?


                 

*మనకి కష్టాలు ఎదురైనప్పుడు మనకి మూడు లాభాలు కలుగుతున్నాయి.*


*1.మొదటిది*

*మనం గత జన్మల్లో చేసుకున్న కర్మ రుణం తీరిపోతున్నది.*


*2.రెండవది*

*వాటిని ఎదిరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి. సాధన వలన మరింతగా ప్రకాశిస్తాయి.*


 *3. మూడవది*

*ఈ శక్తులు మన వర్తమానం లోనూ భవిష్యత్తులోను గొప్ప సత్కర్మ చేసే అవకాశం మనకిస్తాయి.*


*ఈ పనే పాండవులు చేశారు. మనం మాత్రం ఎందుకు చేయకూడదు.*


*మహర్షులు, యోగులు కర్మలనుండి ఎలా తప్పించుకోవాలా? అని ఎప్పుడు ఆలోచించలేదు. కర్మ క్షాళనం కోసం తపించారు. వారు అనుసరించిన పద్ధతినే మనం కూడా అనుసరించ వచ్చును.*


*మనం గత జన్మల్లో చేసుకున్న పాప రాశి కొండంత ఉంటుంది. దీనిని చాలా నెమ్మదిగాను, వాటినుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మ భారం వచ్చే జన్మలకి వాయిదా పడి ఇంకా జన్మలు పెరిగి పోతాయి.*


*విష్ణుమూర్తి ద్వారపాలకులు అయిన జయవిజయులని “మూడు జన్మల్లో హరి వైరులుగా మారి, శ్రీహరితో చంపబడి వైకుంఠం చేరతారా? లేదా ఏడు జన్మల్లో హరిభక్తులు గా జన్మించి వైకుంఠం చేరతారా?” అని అడిగితే వారు “ఏడు జన్మల హరి విరహం భరించలేము. ఏడు జన్మల సుదీర్ఘ కాలం భరించలేము” అన్నారు.*


*మనం మాత్రం మన కర్మాభారాన్ని కొద్ది జన్మల్లోనే వదిలించుకోవద్దూ? దీనికి మనం ఏమి చేయాలి. దీనికి శ్రీకృష్ణుడు ఒక మహాద్భుత మార్గాన్ని సూచించాడు.*


*యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జీతాః*

*జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితమ్ బుధాః*

                                                                      

*-భగవద్గీత.. జ్ఞానయోగం..19 శ్లో.*


*ఎవరి సమస్త కర్మలు కోరిక సంకల్పం లేకుండా ఉంటాయో, వారి కర్మలు జ్ఞానం అనేయగ్ని చేత దహించబడతాయి.*

                  

*"యధేయాంసి సమిద్ధో అగ్ని ర్భస్మాత్కురుతే అర్జున*

*జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్కతరుతే తధా”*

                                                                     

*-జ్ఞాన యోగం: 37 శ్లో.*

    

*"అర్జునా! బాగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని కట్టెలని ఏ విధంగా బూడిద చేయగలుగుతుందో, మనం సంపాదించిన జ్ఞానం మన సర్వకర్మలని బూడిద చేయగలుగుతుంది.”


*ఈ ఉపదేశం లో పరమార్ధం ఏమిటి?


*జ్ఞానం మనలో అగ్నిలా జ్వలిస్తే… మన కర్మలు మనలని బాధించలేవు. మనం గతంలో ఎవరినో మానసికంగా హింసిస్తే, ఇప్పుడు వారు తిరిగి ఆ కర్మ మనకి ప్రసాదించడానికి వచ్చారు.*


*మనం ఈ కర్మ రహస్యాన్ని...  జ్ఞానాన్ని పొందితే మన పెదవులపైన చిరునవ్వే ఉంటుంది కదా! కర్మలు వస్తాయి, మనలని చుట్టుముడతాయి. అవి మనపైన ఏ ప్రభావం చూపవు.


*జ్ఞానం చేత ఆ కర్మ దగ్ధమయింది కదా!!*


            🚩 సర్వేజనా సుఖినోభవంతు 🚩

0047🌹🌹    పరమాత్మ చివరి సందేశం     🌹🌹*


            *ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసి పోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు...*


                *శ్రీ కృష్ణుడు బలరాముడితో "అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమునువిడిచి పెట్టెయ్యండి" అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్యసఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు.*


              *ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి "కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడు కున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసి పోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి" అన్నాడు.*

              *అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేసాడు.*

               *ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.*

               *దీని తర్వాత ఇంక కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించ డానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు.*

           *“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది.*

                 *కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలుదేరుతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం.*

              *ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు.*

               *కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు. కోపము చేతను, అపారమయిన కోర్కెలచేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి.*

                *కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు.*

                *అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజ యోగం చేయడం మరచి పోతారు.తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్నా స్థితికి చేర్చే లయయోగం ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు. ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.*

              *ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదముకొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతఃశుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు.*

                *మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసు కోలేకపోతారు.*

            *ఇంద్రియములకు వశులు అయిపోతారు.⁠⁠⁠⁠ రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు.*

                *ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు.*

             *కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది.*

            *ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి.*

            *కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి.*

              *కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరునియందు భేదమును చూస్తారు.*

             *కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. "ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు? వెళ్ళిపో"*

             *కలియుగంలో గాని ఏ యుగంలోగాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీదారి శ్వాస దారి కావాలి. శ్వాస దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేను ఉన్నాను,ఉంటాను. ఇది విశ్వసించు ఉద్ధవా. ప్రయత్న పూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము ధ్యానం, ఇంద్రియ నిగ్రహము, చేయుట, నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు.*

            *ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివ్వరి సందేశం ...*

           *ఈ సందేశం మనందరికోసం పరమాత్మ చెప్పిన సత్యం.*

048

*🌹 సిద్దేశ్వరయానం - 72 🌹*


*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*


*🏵 1864 - సాధకయోగి  🏵*


*పరమాత్మస్వామి దక్షిణ భారతంలో సంచారం చేస్తూ ఒక పర్వత ప్రాంతానికి చేరుకొన్నాడు. దానికి చతురగిరి అని పేరు. ఆ కొండమీద సిద్ధులుంటారని ప్రసిద్ధి. అక్కడ మార్గమధ్యంలో ఒక ఆశ్రమం దగ్గరకు చేరగానే అక్కడ నివసించేవారు ఆహ్వానించి, ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించారు. ఆ కాలంలో బాటసారులెవరైనా ప్రయాణం చేస్తుంటే ఆపి ఆహారాదులిచ్చేవారు. దానివల్ల పుణ్యం సంపాదించుకోవచ్చునని ఆశ. అందులోను యతులు, తపస్వులు అయితే మరింత సంతృప్తి. ధూర్జటి అనే కవి తన హృదయాన్ని ఈ విధంగా తెలియజేశాడు.*


*శా॥ ఊరూరన్ జనులెల్ల బిచ్చమిడరో ఉండన్ గుహల్ గల్గవో చీరానీకము వీధులన్ దొరుకదో శీతామృత స్వచ్ఛవాః*

*పూరం బేరుల బారదో తపసులన్ బ్రోవంగ నీ వుండవో చేరంబోవుడు లేలరాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!*


*ఏ ఊరు వెళ్ళినా బిచ్చం పెట్టని చోటు లేదు. ఉండటానికి గుహలున్నవి. వీధులలో వస్త్రాలు దొరకుతవి. ఇంట్లో అవసరం లేనివి, కాస్తమాసినవి, పాతవి అయిన గుడ్డలను వీధి బయట ఒక దండెం కట్టి దానిపై వేసేవారు. త్రోవన పోయేవారు ఇంట్లో వాళ్లను అడగకుండా వాటిని తీసుకెళ్లవచ్చు. అప్పటి సంప్రదాయమది. నదులలో సరస్సులలో నిర్మలమైన నీరు దొరుకుతుంది. ప్రశాంతంగా తపస్సు చేసేవారిని దేవుడు రక్షిస్తాడు. ధనవంతులను, రాజులను ఆశ్రయించ వలసిన పనిలేదు. అప్పటి వారి ఆలోచనలు, జీవనం ఇలా ఉండేవి.*


*అతిథిని నారాయణునిగా భావించే వారింకా ఉన్నారు. ఇతర దేశాల మతస్థుల ప్రభావం వచ్చినా గ్రామీణ జీవనం చాలా చోట్ల పూర్వ పద్ధతిలో కొనసాగుతున్నది. అలాంటి ప్రదేశంలోని వారి ప్రార్ధన మీద పరమాత్మ స్వామి తమ శిష్యులతో ఆ ఆశ్రమంలో ఆగాడు. ఆతిథ్య స్వీకారాదులు, విశ్రాంతి అయిన తర్వాత సాయంకాల వేళ ఆ ఆశ్రమాధిపతితో సంభాషణ జరిగింది.*


*ఆశ్రమాధిపతి : స్వామివారూ! మీరెక్కడి నుండి వస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే సామాన్యులుగా అనిపించటం లేదు. మీలో మానవాతీతమైన ఏదో దివ్యశక్తి పని చేస్తున్నట్లు అనిపిస్తున్నది.*


*పరమాత్మస్వామి : నేను ఆంధ్రుడను. హిమాలయాల నుండి కన్యాకుమారి దాకా దివ్యక్షేత్రాలు దర్శించి అక్కడి దేవతలను సేవిస్తున్నాను. ఇక్కడికి దగ్గరలోని కుర్తాళం సిద్ధక్షేత్రము. అగస్త్య మహర్షి నివసిస్తున్న ప్రదేశమది. అక్కడ కొద్ది రోజులుండి ధరణీపీఠంలోని కుర్తాళ నాధేశ్వరుని సేవించుకొని వస్తున్నాను. మీలోను యోగమార్గానికి చెందిన సాధక లక్షణాలు కనిపిస్తున్నవి. వేదాధ్యయనము, వేదమంత్రములు హోమములు, శౌచపద్ధతులు – వీటితో సంబంధం లేని మార్గంలో మీరు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తున్నది. పట్టుదల వల్ల గురుకృపవల్ల ధ్యానమార్గంలో ముందుకు వెళుతున్నారు. కుండలినీ యోగంలో ఒక దశకు చేరుకొన్నారు. అక్కడ ఆగింది. పురోగమించటానికి త్రోవ తెలియక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మీరున్న స్థితి ఇది.*


*ఆశ్రమాధిపతి : స్వామీ ! మీరు త్రికాలజ్ఞుల వలె ఉన్నారు. మిమ్ము చూస్తుంటే మీతో మాట్లాడుతుంటే నేను చాలా అదృష్టవంతుడ ననిపిస్తుంది. మీరంటే పూజ్య భావం కలుగుతున్నది. సాధనలో ముందుకు వెళ్ళటానికి సిద్ధశక్తులు సాధించటానికి దయచేసి నాకు మార్గదర్శనం చేయండి.*


*పరమాత్మస్వామి : నేనిక్కడ నుండి దివ్యక్షేత్రాలు దర్శిస్తూ కాశీ చేరుకొంటాను అక్కడ కొన్నాళ్ళుండి హిమాలయాలలోని కైలాస పర్వత ప్రాంతం చేరి అక్కడి సిద్ధాశ్రమ యోగుల సాహచర్యంలో కొన్నాళ్ళుంటాను. అక్కడ నాతో కలసి చదువుకొన్న కౌశికుడనే యోగి ఉన్నాడు. అతనితో కలసి అచటి డాకినీ శ్మశానంలో తారా సాధన కొన్ని సంవత్సరాలు చేశాను. ఆ దేవత అనుగ్రహం నన్ను నడుపుతున్నది. నీకు అతనితో పూర్వజన్మాను బంధం ఉంది. అప్పుడతని అగ్రజుడవు. మీ తండ్రి మరణిస్తే ఇతనిని చిన్న వయస్సులో ఉన్నవానిని పెంచి ప్రేమతో పెద్ద చేశావు. వృద్ధాప్యం వచ్చి మరణించావు. తమిళనాడులో పుట్టి యిలా ఉన్నావు. సుకృతం వల్ల యోగసాధకుడివైనావు. అతడు కఠోరమైన తపస్సు చేసి విద్యున్మయమైన శరీరాన్ని పొంది దీర్ఘాయువుతో ప్రకాశిస్తున్నాడు. దివ్యజ్ఞాని కావటం వల్ల నీయందు ఇప్పటికీ భక్తి గౌరవాలతో ఉన్నాడు. అతని సాహచర్యంలో చేయగలిగినంత తపస్సు చేసి ఈ శరీరాన్ని విడిచి పెట్టి సరిగా వంద సంవత్సరాల తరువాత మళ్ళీ తెలుగుదేశంలో పుట్టగలవు. నీకు యౌవనదశ వచ్చిన తరువాత అజ్ఞానంలో ఉన్న నీ దగ్గరకు వచ్చి నీ కిచ్చిన మాట ప్రకారం ఖండయోగ మార్గంలో నీ కపాలములోని నాడులను సంచలింప జేసి పూర్వజన్మ స్మృతి కలిగించి తపోమార్గంలో ప్రవేశపెట్టి సిద్ధయోగులతో పరిచయం కలిగిస్తాడు. నీవు పిలిచినప్పుడల్లా తన మిత్రులతో వచ్చి నీవు కోరిన పనులు తన సిద్ధశక్తులతో చేసి పెడుతుంటాడు.*


*( సశేషం )*

🌹🌹🌹🌹🌹

49..సర్వమూ దైవాధీనం. 


అజ్ఞానం వల్ల అన్నీ మనమే చేస్తున్నాం అనుకుంటాం! 


మనం సంపాదించే ధనం నశించిపోతుంది. 


గొప్పతనం అంతా అశాశ్వతం. 


కుమారుడు, స్నేహితుడు, భార్య... 

ఈ సంబంధాలు అన్నీ తెగిపోతాయి. 


ఎంత గొప్పవారికైనా తుదకు మరణం తప్పదు. 

గడచిన రేయి ఎప్పటికీ తిరిగి రాదు. 

చెట్టుపై పండిన పండ్లు రాలి కింద పడిపోతాయి. సముద్రంలో కలిసిన నది వెనక్కి రాదు. 

రాళ్లతో గట్టిగా కట్టిన భవనం కూడా శిథిలం అవుతుంది. 


జీవులన్నీ వృద్ధాప్యం వచ్చి మృతి చెందుతాయి. రేయింబవళ్లతోపాటు మన ఆయువూ అలా ముందుకు పోతూనే ఉంటుంది. మనం నడుస్తున్నా, కదలకుండా ఒక్కచోటే కూర్చున్నా అది మాత్రం ముందుకు కదులుతూ ఉంటుంది. మృత్యువు ఎప్పుడూ ఒక నీడలా మనల్ని సదా వెన్నంటే ఉంటుంది. 


మనం మరణించి, మరలా పుట్టడం 

అనేది ఒక యాత్ర. 


సూర్యోదయం కాగానే అందరం సంతోషిస్తాం. 

కాని... మన జీవితంలో ఒకరోజు తగ్గిపోయింది అని మాత్రం ఎవరూ ఆలోచించరు. రుతువులు మారుతూ ఉంటే ఆనందిస్తారు గానీ ఆయుష్షు ఆరిపోతున్నదని గుర్తించరు!


0050..దక్షిణ అంటే ఏంటి

          పూజారికి దక్షిణ ఇవ్వటం తప్పనిసరా..?


ముందుగా దక్షిణ అంటే ఏంటో తెలుసుకుందాము ..దక్షత కలిగిన వారికి సమర్పించుకునేది దక్షిణ .. 

ప్రదక్షిణ అనేది మనము మనకుగా భగవంతుడిని ధ్యానిస్తూ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఆయన వైపుగా కదలడము ప్రదక్షిణము,ఆ దక్షత కలిగిన వారు భగవంతుడు మాత్రమే కనుక మనము ప్రదక్షిణము భగవంతుడికి మాత్రమే సమర్పించుకుంటాము.


*సమర్పణ ఎందుకు ?*


సాధారణముగా మనకు ఏ పని చేసి పెట్టినా వారు ఎవరు అయినా వారికి వారి కష్టానికి డబ్బులు లేక వారి కష్టానికి ప్రతిఫలము ఇవ్వడము ధర్మము .ఒకవేళ అలా ఇవ్వకపోతే అది పెద్ద అధర్మం ..

ఇది నేను కాదు, వాల్మీకి రామాయణములో భరతుడు చెప్పిన ధర్మము.ఇప్పుడు పూజారులకు దక్షిణ ఎందుకు ఇవ్వడమో చూద్దాము.


వేదము అంటేనే దైవము, మానవ నేత్రముకి కనిపించని దైవము మంత్ర రూపములో వేదరాశిలో నిక్షిప్తమయి మనకు వినిపిస్తారు, 

మన సాధనకు మార్గము చూపి తనలో మనని తన వైపు నడిపించేదే వేదము. అటువంటి దైవముకి కానీ వేదముకి కానీ వెల కట్టే సొమ్ము ఎంత ?


పూజాదికాలు యజ్ఞ యాగాదులు చేయగలిగే దక్షత కలిగినవారు ఎవరు ?

కేవలము పూజారులే .. పూజారులకు దక్షిణ ఇచ్చేదీ వేదము చదివే దక్షత పొందిన దక్షులు కనుక. వారిలో ఉన్న వేదముకి విలువ, ఆ వేదముకి విలువ కట్టేంత వారము కాదు, ఈ విషయము గ్రహించాలి. వారికి దక్షిణ ఇవ్వడము అంటే మనము ఇవ్వగలిగినంత ఇవ్వడము కానీ 10 రూపాయలో లేక 100 రూపాయలో విలువ కట్టి ఇవ్వడము కానే కాదు. అది తప్పు . గుడిలో పూజ లేక అర్చన లేక హారతి లేక ఇతర ఎటువంటి క్రతువులు చేయించుకున్నా పూజారి గారికి దక్షిణ తప్పకుండా ఇవ్వవలసిందే.నియమం అనరు కానీ ఇది తప్పకుండా పాటించ వలసిన ధర్మం మరియు ఆచారం .. దక్షిణ ఇవ్వకుంటే చేసుకున్న పూజకి పూర్తి ఫలితము ఎలా దక్కుతుంది.. ?


ఇది వాస్తవము మరియు సత్యము. పూజారులకు వారి సంతృప్తి కలిగే దక్షిణ ఇవ్వడము చేత వారు సంతృప్తి చెందడము చేత పొందేవి ఏమిటంటే ?


1) వారి కంఠము, స్వరము , ఊపిరితిత్తులను అనుక్షణమూ నొప్పిస్తూ, అనుగుణముగా లయబద్ధముగా ఉపయోగిస్తూ మంత్రభాగము తప్పు దొర్లకుండా దేవతలను ఆవాహనము చేస్తూ పూజాదికాలు నిర్వహించే వారి కష్టమునకు ప్రతిఫలము, దానికి విలువ ఎంత ఇవ్వగలరో ఊహించి మన ధర్మము కోసము ఇవ్వడము.


2) జీవులను ఉద్ధరించడము దైవ ధర్మము, వేద రూపమున తనను స్మరించి సర్వ మనవాళికి శుభము కలిగించే మనకు మరియు దైవముకు సాధనముగా ఉన్న పూజారులకు వారి సంతృప్తి మేర దక్షిణ ఇస్తే, తన ధర్మము కోసము ఉన్న పూజారి సంతృప్తి చూసి దైవము కూడా సంతృప్తి చెందుతారు. ఏవరికి ఎప్పుడూ ఋణపడి ఉండకూడదు.


3) ఉచితంగా ముహూర్తాలు, జాతకాలు అడగకూడదు. 


జ్యోతిష్యునికి,పురోహితునికి ఎప్పుడూ ఋణపడిపోకూడదు.

వారి ద్వారా సేవలను తీసుకున్నప్పుడు తప్పక వారికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారిని గౌరవిస్తూ ఉంటే ..

వారి ఆత్మ సంతృప్తి మనకు దీవెనల రూపంలో మంచిని కలుగజేస్తాయి.

సర్వం సద్గురు సమర్పయామి🙏🏻

          🚩సర్వేజనా సుఖినోభవంతు 🚩

Oo41..తల్లి తండ్రుల గురువుల తత్వమదియు 

బంధుజన సఖుల తలపు పలుక రింపు 

హృదయ వాంఛమలుపు మార్పు కృపయు గురువు 

నేర్పిన పలుకు తల్లి తండ్రిగను నేర్పు 


గురువు నిరతము భక్తియు గుర్తు జేయు 

తల్లితండ్రుల మోక్షము తన్మయమగు

పరమ పదనందజేయుట పలుకు పూజ్య 

సకళ సృష్టికిమూలము సమయ గురువు 


యాది నుండి గురువు సేవ యాట పట్టు 

పరతరమునలేని గురువు పాఠ్యమగును 

వందన శతము నిత్యము వాక్కు గాను 

ఆది గురువమ్మగాను లే ఆత్మ తృప్తి

*****

సీ..నీటి చుక్క కొరకు నిన్నునె ప్రార్థించ

గడ్డు స్థితియిది సగమ్య మేది 

బయటకు రాలేక పాడికరువు నేడు 

నీరు లేని వసుధ  నిజము నరకమని

చెప్పు చుంటితి మేము  చెలిమి తో శ్రీరామ 

పనిని చేయలేము ఫలితమేది 

విలువతగ్గక మంచి విధము తెలపు రామ 

 చేయగాపనులను  చెడ్డ నగును 


తే..సిరులబలిమిపెరుగు చుండ చెలిమి కలిగె 

కరుణజూపియు మమ్ము కావు రామ 

ధరణి కష్టమ్మును తీర్చు ధర్మతేజ 

జానకీ ప్రాణ నాధవి జగతి రామ

****

ఓరి భడవా కథల యాట ఓర్పు నుంచి 

చక్కగా పరుగులు యాట చింత వలదు 

నర్ధ రూపాయి యిచ్చి మా బామ్మ ముద్దు 

చేసి యాడు ఎవరినైన చెలిమి చేయ


గాలి పఠమడగానేను గేలి యనక

కొనమని యె పైస ఇచ్చేను కోర బామ్మ

అమ్మ కోపంబు పెరిగిన నడ్డు తగిలి 

చిన్న పిల్లోడు యన బామ్మ చింత వలదు

*****

తే.. జీవభావార్ధమును తెల్ప చేత కాదు 

మనిషి మర్మం సహన మౌను మాయ జేరి 

విశ్వ వసుదేవునిలీల విజయ మివ్వ 

రవి కుమార కళలు తీరు రమ్య పరచ

****

యానతి సేయవయ్య మది యాసల పర్వము నాకు నీదయే 

కానని నీదు లీలలు సకామ్యము సేవల దాసు నీ కృపా 

మానని వేడుకే సకళ మార్గము నీదగు శాంతి కోరితీ 

ప్రాణము నీకు నిచ్చితి నుపాయ సహాయ మనేది తెల్పుమా

*****

కామ్య మనేది నేటి కళ కారము తీపిగ వాక్కు రాజకీ

యమ్మగు నీతి కారమగు యాశ పురోగతి డబ్బు చుట్టు సా 

ధ్యమ్మగు నేత కారమగుట ధ్యాన మనోమయ కర్త కర్మ కా 

ర్యమ్మగు ప్రేమ బంధమున యానతి కారము సౌఖ్య జీవితమ్

*****

సీ..ఆదిగాను వ్యవస్థ ఆర్భాట నాణ్యత 

పైపై మెఱుగు గాను పైస కదులు 

ఇసుక కరువు నున్న ఇష్ట బూడిద వాడు 

రాతి లేక ఇనుము రంగు పులుము

అట్ట రేకుల గోడ ఆశ్చర్య పరుచుతు

అలమరలేలేని ఆశ్రి మగుట 

హద్దుయాశలవల యణుకువజీవితం 

పచ్చదనము లేని పడక లిల్లు 


విధి సనాతనంమేసహ విద్య తోడు 

నాయక కళయిష్టారాజ్య నయన విద్య 

నీలకంఠనిలయమని విలువ నిల్పి 

అతిధి సేవా గృహమనుచూ నలరు కథలు

*****

 శ్రీకార మనెడి శక్తీ 

ఆకారముపకర మాయ ఆశ్రిత గనుమా 

సాకారము లెళ్ల మనసు 

ప్రాకారము హృదయమౌను ప్రాకృతి మహిమే


 రేపటి దిన తపనయేల రీతి మార్చ 

నేటి నిద్ర కదియుతెచ్చు చేటు చేర్చ 

నేడు నిద్ర లేకగతియు నిత్య మచ్చ 

చేటు తెచ్చు రేపు కథలు చింత కచ్చ


****

*మాడుగులమురళీధరశర్మ*

*************************    

       *గురు స్తోత్రమునకు* 

*నా కందపద్య వందనములు*

***************************

🙏🌹గురు స్తోత్రం🌹🙏

➖️➖️➖️➖️➖️➖️➖️➖️

*శ్లో-1*

అఖండమండలాకారం*

వ్యాప్తం యేన చరాచరమ్|

తత్పదం దర్శితం యేన*

*తస్మై శ్రీగురవే నమః||*


*కం-1*

గురుచరణములపరంపర

నరయుచుదర్శించుజీవు*

లచరాచరముల్!

సిరి,సంపదలును,పుణ్యము

విరివిగనందించుచుండు*

*విశ్వగురుండౌ!*


*శ్లో-2*

అఙ్ఞానతిమిరాంధస్య*

 ఙ్ఞానాంజనశలాకయా|

చక్షురున్మీలితం యేన*

*తస్మై శ్రీగురవే నమః||* 


*కం-2*

అజ్ఞానమ్మనునంధుని

విజ్ఞానపుకాటుకనిడి*

విజ్ఞతనిడుచున్!

సుజ్ఞాననేత్రమొసగెడు

విజ్ఞుడెతాసర్వజీవ*

*విశ్వగురుండౌ!*


*శ్లో-3*

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః*

గురుర్దేవో మహేశ్వరః |

గురురేవ పరంబ్రహ్మ* 

*తస్మై శ్రీగురవే నమః||* 


*కం-3*

గురుడేబ్రహ్మా,విష్ణువు,

గురుడుమహేశ్వరుడులోక*

గురువుపదేశిన్!

గురుసాక్షాత్పరబ్రహ్మా

గురువుకు వందనము జేతు*

కూర్మినియెపుడున్!


*శ్లో-4*

స్థావరం జంగమం వ్యాప్తం*

యత్కించిత్సచరాచరమ్|

తత్పదం దర్శితం యేన*

*తస్మై శ్రీగురవే నమః ||* 


*కం-4*

స్థావర,జంగమ,వ్యాపక

భావచరాచరమునైన*

ప్రాపక గురునిన్!

పావనపాదములనుగని

సేవించినవిశ్వమందు*

జీవన్ముక్తిన్!


*శ్లో-5*

చిన్మయం వ్యాపితత్సర్వం*

త్రైలోక్యం సచరాచరమ్|

తత్పదం దర్శితం యేన*

*తస్మై శ్రీగురవే నమః||* 


*కం-5*

ముల్లోకముసచరాచర

సల్లలితవ్యాప్తిగన్న*

సచ్చరితార్థు!

న్నెల్లరుపాదముకడుగన్

చల్లనిదీవెనలొసగును*

సద్గురుడతడై!


*శ్లో-6*

సర్వశ్రుతిశిరోరత్న*

విరాజిత పదాంబుజః |

వేదాంతాంబుజసూర్యోయ:* 

*తస్మై శ్రీగురవే నమః||*


*కం-6*

సర్వమునెరిగినవాడగు

నార్యునిపాదములచెంత*

నడుగిడిమ్రొక్కన్!

సర్వోదయవేదాంగపు

సూర్యుడెసద్గురువునెపుడు*

శుభమగుజగతిన్!


*శ్లో-7*

చైతన్యశ్శాశ్వతశ్శాంతో*

వ్యోమాతీతో నిరంజనః|

బిందునాద కలాతీతః*

*తస్మై శ్రీగురవే నమః||* 


*కం-7*

చేతన శాశ్వత శాంత;పు

నీతుడునీశ్వరుడుతాను*

నిరతిశయనుడున్!

కాతరభావకదూరుడు

నాతనిఁగనుగొన్నవాడె*

నాత్మగురుండౌ!


*శ్లో-7*

ఙ్ఞానశక్తిస్సమారూఢః*

తత్త్వమాలావిభూషితః|

భుక్తిముక్తిప్రదాతా చ* 

*తస్మై శ్రీగురవే నమః||*


*కం-8*

జ్ఞానము,శక్తిని కలిగిన

మానితతత్త్వపుసుమాల*

మాలాధారీ!

తానై భక్తియు ముక్తిడు

వానికినావందనములు*

వాస్తవగురుకున్!


*శ్లో-8*

అనేకజన్మసంప్రాప్త:*

కర్మబంధవిదాహినే|

ఆత్మఙ్ఞానప్రదానేన* 

*తస్మై శ్రీగురవే నమః||* 


*కం-9*

పలుజన్మలలోపొందిన

మలినపుకర్మలవిబంధ*

మారక గురుడై!

కలినాత్మజ్ఞానమొసగు

నలుపెరుగనియాత్మగురువు*

నతనిస్మరింతున్!


*శ్లో-10*

శోషణం భవసింధోశ్చ*

ఙ్ఞాపణం సారసంపదః|

గురోః పాదోదకం సమ్యక్*

*తస్మై శ్రీగురవే నమః||* 


*కం-10*

గురువిజ్ఞానపు సింధువు,

కరమరుదగుసారనిధిని*

గనుధీమతులున్!

వరగురుపాదములటులే

విరులిడివందనముజేతు*

విశ్వగురునికిన్!


*శ్లో-11*

న గురోరధికం తత్త్వం* 

న గురోరధికం తపః|

తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి*

*తస్మై శ్రీగురవే నమః||* 


*కం-11*

గురువును మించిన తత్వము,

గురువుకుమిన్నగుతపమ్ము*

కూర్మినిఁగలదే?

గురుతత్వబోధకన్నను

పరమేదియులేదుఁనతని*

ప్రస్తుతిఁజేతున్!


*శ్లో-12*

మన్నాథ శ్శ్రీజగన్నాథః*

మద్గురు శ్శ్రీ జగద్గురుః|

మదాత్మా సర్వభూతాత్మా*

*తస్మై శ్రీగురవే నమః||* 


*కం-12*

శ్రీపతియు జగన్నాథుడు,

ప్రాపుననాజగతిగురుడు*

భాసిలునెపుడున్!

ఆపైనాత్మగనిలుచుచు

కాపాడెడుసర్వభూత*

కారి గురుండే!


*శ్లో-13*

గురురాదిరనాదిశ్చ*

 గురుః పరమదైవతమ్|

గురోః పరతరం నాస్తి* 

*తస్మై శ్రీగురవే నమః||*


*కం-13*

ఆదియనాదిగురుండే,

నాదైవముపరమునాస్తి*

నాపరతరమున్!

కాదనకనునానమసులు

మోదముతోనందజేతు*

మోక్షార్థునిగా!


*శ్లో-14*

త్వమేవ మాతాచపితాత్వమేవ*

త్వమేవ!బంధుశ్చసఖా త్వమేవ!

త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ*

*త్వమేవ సర్వంమమదేవదేవ||* 


*కం-14*

నీవే తల్లివి తండ్రివి

నీవే నాబంధు,సఖుడు*

నిజమగుదేవా!

నీవే విద్యయు,ద్రవ్యము

నీవేనా సర్వసౌఖ్య*

నేస్తము దేవా!


*శ్లో-15*

న గురోరధికం తత్త్వం* 

న గురోరధికం తపః|

తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి*

*తస్మై శ్రీగురవే నమః||* 


*కం-15*

లేడే తత్వాధికగురు

లేడేతపమధికగురుడు*

లేలేడెచటన్!

లేడేతత్త్వజ్ఞుడు;పై

వాడౌ!సద్గురునకిత్తు*

వందనశతముల్!


*శ్లో-16*

గురురాదిరనాదిశ్చ*

గురుః పరమదైవతమ్|

గురోః పరతరం నాస్తి* 

*తస్మై శ్రీగురవే నమః||*


*కం-16*

గురుడేయాదియనాదియు

గురుడగుపరదైవతమ్ము*

గోవిందునిగా!

గురుమించినదైవమ్మిల

పరతరమునలేనిగురుకు*

వందనశతముల్!


*శ్లో-1*

త్వమేవ మాతా చ పితా త్వమేవ

త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |

త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ

త్వమేవ సర్వం మమ దేవ దేవ || 

*కం-17*

గురుడే తల్లియుఁదండ్రియు

గురుడేసద్బంధుసఖులు*

కోవిధధనమున్!

గురుడేసర్వముజీవికి

గురుడేనాదేవదేవ*

గురుసద్గురుడున్!


*కం-18*

గురువనురెండక్షరములు

నిరతమునజ్ఞానమంపు*

నేమముతలువన్!

గురువేభక్తియుమోక్షము,

పరమపదమునందజేయు*

భక్తినికొలువన్!


*!ఓంశ్రీసద్గురుభ్యోనమః!*

🙏🙏🙏🙏🙏

 042..కౌంటింగ్!.. మందారం 

*********

ఉత్కంఠత వద్దు జరిగేది జరగక మానదు హద్దు 

 ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఓర్పు జూపు హద్దు 


 గుండె నిబ్బరమే రాజకీయ నాటక సర్వమై 

కోట్ల నోట్ల ఖర్చు సీట్ల గెల్పు కొరకు రాజి హద్దు 


దూరదర్శిని ముందు కాలక్షేపం మంత్ర నయనమై 

ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టు ప్రతిభకు  జన హద్దు 


ఏ క్షణం ఎలాంటిదొ అనుటయే మానవ పరమై 

అబద్ధాలతో అతి నికృష్టం యైన జాతి హద్దు 


నాయకులకు ఓట్లు ప్రాణత్యాగానులే ప్రజలవై 

 అవినీతా? ఆదర్శమా? త్రాసు వేసి ఓటు హద్దు 


ఉత్కంఠ భరిత దినోత్సవమే ఓర్పు జూప హద్దు 

జైబోలో భారత్ మాతాకీ జై!జై జై హద్దు 

            *******

   

కౌంటింగ్ దినోత్సవం సందర్బంగా


0051.శుభోదయం .🙏

దాంపత్య జీవితంలో ప్రేమ వేడి చేస్తున్న ద్రవం వంటిది. రోజులు గడిచే కొలది ద్రవం ఆవిరి ఐనట్లే  ప్రేమ కూడా .. .......ప్రేమ ఆవిరి అయ్యే కొలది, మనుష్యులలో Logic/ Reasoning  పెరుగుతుంది. 

Logic/ Reasoning పెరగడం అంటే, దంపతుల మధ్య కీచులాటలు ఆరంభమైనట్లే. 

1)ప్రేమ ఆవిరి అయి logic/ reasoning ఎక్కువైనా వారి దాంపత్య జీవితం

వాడిపోయే ప్రమాదముంది. 2) ప్రేమలు తరగక,   logic/ Reasoning  బల పడక పోయినా, వారి దాంపత్యం అపరిపక్వంగా రుచి లేకుండ  ఉండే ప్రమాదముంది.

నైపుణ్యం కలిగిన దంపతులు ప్రేమకు, Logic/ Reasoning కు తగిన ప్రాధాన్యతలిస్తూ సంతోషకరమైన జీవితం చవి చూస్తారు.  

కొందరు ప్రతి నిత్యం నిపుణతలు నేర్చుకొంటూ ఉంటారు.   

నేర్పు అలవాటు కాని వారికి అందుకు తగిన ఫలితాలు వస్తాయి. కాబట్టి దాంపత్య జీవితం ఎవరికైనా అన్ని వేళలా ఒకేలా ఉండే అవకాశం లేదు. 

అవగాహన/ నైపుణ్యం పెరిగే కొలదీ బంధం బలపడి  వారి దాంపత్య జీవితానికి శోభ చేకూరి, అర్ధవంతంగా మారి సంతృప్తి, సంతోషం  సమ పాళ్ళతో పక్వానికి వచ్చిన పండులా అందంగా, రుచిగా తయారవుతుంది. 

అంత వరకూ  ఆలుమగలు ఇరువురూ  సహనంతో, నిరంతర నేర్పు ప్రక్రియ కొనససాగించాలి. 

అలా కాక అపరిపక్వ దశలో  అవగాహన కొరవడి వైవాహిక బంధానికి చరమాంకం పాడ వలసి వస్తే/పాడితే అ దాంపత్య జీవితానికి అర్ధం, పరమార్థం కలగవు కదా. అప్పుడు ఆ దంపతుల జీవితాలు ఎండిన మోడులై జవసత్వాలు కోల్పాతాయి కదా ! 

బంధానికి చరమగీతం పాడాక, పోస్ట్ మార్టం నిర్వహంచినా, బంధ విశ్ఛిత్తిలో ఎవరి పాత్ర  ఎంతో తెలుస్తుందేమో కానీ, కోల్పోయిన జవసత్వాలు పొంద గలరా !

అందుకే చేతులు కాలక ముందే జాగరూకత అవసరం.

ఏ విషయమందైనా సహనం, నిపుణతల నేర్పు అభిలషనీయం, నిరంతరం....జీవితాంతం.

 

""ఎంత చెట్టుకు అంతగాలి 

యెరుక పరచగలుగు శక్తి యుక్తి

దాంపత్య మంటే ధర్మ ముక్తి 

సర్వమానవ సృష్టి యె సంపద "'


""జగతి యందున గంధమ్ము చల్లదనము

అంతకును మించి చంద్రుడు హాయినిచ్చు 

సూర్య కిరణాల వేడియు సూత్ర మగును 

పృద్వి ఓర్పు జీవిత గమ్య శృతి లయలగు 

సజ్జనులతోడ సాంగత్య చలువ చేయ ""


""అనుభవాలు పంచు కొనుట ఆత్మ తృప్తి 

కష్టబడ్డ విషయమును కాల తీర్పు 

బాధలేని వ్యక్తి ఎవరు పాలునీళ్లు 

సంకటములు సహజమౌను సమయ మందు "'


#052...మోదీ మెచ్చుకుని 

#DRDO లో ఉద్యోగం ఇప్పించిన ఈ బాలుడు ఎవరో తెలుసా..??

****************************************************


ఇతని పేరు #ప్రతాప్, వయస్సు కేవలం 21 ఏళ్ళు..

కర్ణాటక #మైసూరు సమీపంలోని #కాడైకుడి స్వంత గ్రామం..

తండ్రి ఒక సాధారణ రైతు కూలీ..

రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి..

ఇతను చిన్నప్పటి నుంచి క్లాసులో ఫస్ట్, కానీ పూట గడవని పరిస్థితి..

స్కూలు సెలవు రోజుల్లో చిన్న చిన్న పనులకు వెళ్ళి, వచ్చిన 100-150/- డబ్బులతో సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్ళి #ISRO, #NASA, #BOEING, #ROLLS_ROYCE, #HOWITZER Etc గురించి సోధించేవాడు, అక్కడి సైంటిస్టులకు ఈ-మెయిళ్ళు పంపేవాడు..

రిప్లై మాత్రం వచ్చేది కాదు, అయినా నిరాశ చెందక ప్రయత్నం విరమించలేదు..

#ఎలక్ట్రానిక్స్ అంటే అతనికి ఎనలేని ప్రేమ, #ఇంజనీరింగ్_ఇన్_ఎలక్ట్రానిక్స్ చేయాలని అతని కల, కానీ పేదరికం కారణంగా B.Sc (Physics) కోర్సులో చేరవలసివచ్చింది.. అయినా నిరాశపడలేదు..

హాస్టల్ ఫీజు చెల్లించలేకపోవడంతో బయటకు తోసేశారు..

బస్టాపుల్లో ఉండి, పబ్లిక్ టాయిలెట్లలో పనిచేసి, ఒక మిత్రుడు కొద్దిగా ధన సహాయం చేయడంతో C++, Java, Python వగైరా నేర్చుకున్నాడు..

మిత్రుల నుంచి మరియు ఆఫీసుల నుంచి e-waste రూపంలో కీ బోర్డులు, మౌస్‌లూ, మదర్ బోర్డులు తదితర కంప్యూటర్ సామాన్లు సేకరించి వాటిపై పరిశోధన చేసేవాడు..

మైసూరులోని ఎలక్ట్రానిక్ కంపెనీల వద్దకు వెళ్ళి e-waste రూపంలో వస్తువులను సేకరించి ఒక డ్రోన్ తయారుచేయాలని ప్రయత్నాలు ప్రారంభించాడు..

పగలు చదువు మరియు పనులు, రాత్రి ఆవిధంగా ప్రయోగాలు చేస్తుండేవాడు..

ఈవిధంగా సుమారు ఓ 80 ప్రయత్నాల తరువాత అతను తయారు చేసిన డ్రోన్ గాల్లోకి ఎగిరింది.. ఈ సందర్భంలో అతను ఓ గంటసేపు ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చాడట..

డ్రోన్ సక్సెస్ విషయం తెలియడంతో అతను మిత్రుల మధ్య హీరో అయిపోయాడు..

అతని వద్ద ఇంకా చాలా డ్రోన్ మోడల్ ప్లాన్‌లు ఉన్నాయి..

ఇంతలో ఢిల్లీలో డ్రోన్ కాంపిటీషన్స్ జరుగబోతున్నాయన్న వార్త తెలిసింది..

దానితో కూలి పనులకు వెళ్ళి ఓ 2000/- కూడబెట్టుకుని ఢిల్లీకి జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణం కట్టాడు..

ఆ కాంపిటిషన్‌లో 2nd ప్రైజ్ వచ్చింది.. అంతేకాకుండా జపాన్ వెళ్ళి ప్రపంచ డ్రోన్ కాంపిటిషన్‌లో పాల్గొనే అవకాశం కూడా అక్కడ లభించింది..

ఆ ఆనందంతో మళ్ళీ ఓ గంట వెక్కి వెక్కి ఏడ్చాడు..


#జపాన్‌కు పోవడం లక్షలతో కూడుకున్న వ్యవహారం..

అంతేకాకుండా ఎవరో ఒకరి రెఫరెన్స్ తప్పనిసరి..

చైన్నైలోని ఒక ఇంజనీరింగ్ కాలేజి ప్రొఫెసర్ రెఫరెన్స్ ఇచ్చేలా ఒక మిత్రుడు సహాయం చేశాడు..

విమాన టికెట్లకు మైసూరు లోని ఒక దాత ముందుకు వచ్చాడు..

ఇతర ఖర్చుల కోసం తన #తల్లిగారు తన #మంగళసూత్రాన్ని మరియు #కమ్మలు అమ్మగా వచ్చిన 60,000/- ఇచ్చింది..

బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కి టోక్యోలో దిగాడు..

బుల్లెట్ ట్రైన్ ఎక్కే స్తోమత లేదు, సాధారణ రైల్లో 16 స్టేషన్లలో రైళ్ళు మారి చివరి స్టేషన్లో దిగాడు..

అక్కడి నుంచి మరో 8 కి.మీ లగేజీ మోసుకుంటూ నడిచివెళ్ళి చివరకు గమ్యం చేరాడు..


అక్కడ మొత్తం హైఫై పీపుల్ ఉన్నారు..

అత్యంత సోఫెస్టికేటెడ్ డ్రోన్స్ వచ్చి ఉన్నాయి..

కాంపిటిషన్‌లో పార్టిసిపేషన్ చేసేవాళ్ళు బెంజ్, రోల్స్‌రాయిస్ కార్లలో వచ్చి ఉన్నారు..

#అర్జునునికి చెట్టు కనపడలేదు, పక్షి కనపడలేదు, #పక్షికన్ను మాత్రమే కనపడింది..

అలాగే మన #ప్రతాప్‌కు కూడా ఇవేవీ పట్టించుకోకుండా తన మనస్సు తన డ్రోన్ మోడల్‌పైనే ఉంది..

తన మోడల్స్ వారికి సమర్పించి, డ్రోన్ పనితీరు చూపించాడు..

వారు రిజల్ట్స్ ఫేజ్డ్ మ్యానర్‌లో అనౌన్స్ చేయడానికి సమయం పడుతుంది వెయిట్ చేయమన్నారు..

మొత్తం 127 దేశాల నుంచి ప్రతినిధులు ఆ కాంపిటిషన్‌లో పాల్గొన్నారు..

రిజల్ట్స్ డిక్లేర్ చేయడం ప్రారంభించారు..

ప్రతాప్ పేరు ఏ రౌండ్లోనూ వినపడలేదు..

నిరాశకు గురయ్యాడు, తన మోడల్ అసలు క్వాలిఫై కాలేదేమోనని బాధపడుతూ అశ్రునయనాలతో మెల్లగా లేచి వచ్చేస్తున్నాడు..

ఇంతలోనే 3వ ప్రైజ్ అనౌన్స్ చేశారు, అది #ఫ్రాన్స్‌కు వెళ్ళింది..

తరువాత 2వ ప్రైజ్ అనౌన్స్ చేశారు, అది #అమెరికాకు వెళ్ళింది..

అప్పటికి మన ప్రతాప్ నిరాశతో తిరిగి వచ్చేస్తూ ఆ ప్రాంగణం గేటు దగ్గరకు చేరుకున్నాడు..


ఇంతలో చివరి అనౌన్స్‌మెంట్ వినిపించింది: "Please Welcome #Mr_Pratap, First Prize, From INDIA.." అని..

అంతే, లగేజీ అక్కడే వదిలేశాడు, కిందపడిపోయాడు, బిగ్గరగా ఏడ్చేశాడు, తన #తల్లిదండ్రులు, #గురువులు, #మిత్రులు, ధన సహాయం చేసిన #దాతల పేర్లను ఉచ్చరిస్తూ పోడియం వద్దకు చేరుకున్నాడు..

రెండవ స్థానంలో ఉన్న అమెరికా ఫ్లాగ్ దిగిపోతూ, మొదటి స్థానం సంపాదించిన భారత్ ఫ్లాగ్ పైకి పోతూ ఉన్నది..

ఇటు కాళ్ళూ చేతులూ వణికిపోతూ చెమటలు పట్టిన బట్టలతో ప్రతాప్ స్టేజ్ పైకి చేరుకున్నాడు..

మొదటి ప్రైజ్ తోపాటు 10,000 డాలర్లు అతనికి బహుమతిగా అందాయి. (సమారు 7 లక్షల రూపాయలు)


3వ బహుమతి వచ్చిన ఫ్రాన్స్ వాళ్ళు అక్కడే అతనిని సంప్రదించారు..

"నీకు నెలకు 16 లక్షల జీతం ఇస్తాం, ప్యారిస్‌లో ప్లాటు మరియు 2.5 కోట్ల విలువైన కారు ఇస్తాం. ఇటు నుంచి ఇటే మా దేశానికి వచ్చేయ్.." అన్నారు

"నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు నా మాత్రృభూమికి సేవచేయడమే నా సంకల్పం.." అని వారికి క్రుతజ్ఞతలు తెలిపి స్వదేశం చేరుకున్నాడు..


ఈవిషయం స్థానిక #BJP MLA మరియు MP లకు తెలిసింది..

వారు అతని ఇంటికెళ్ళి అభినందించి, ఆ బాలునికి ప్రధానమంత్రి మోదీజీతో అపాయింట్‌మెంట్ ఇప్పించారు..

మోదీజీ అతనిని అభినందించి #DRDOకు రెఫర్ చేశారు..

ఇప్పుడు అతను DRDO లో డ్రోన్ విభాగంలో సైంటిస్టుగా నియమితులయ్యారు..

నెలకు 28 రోజులు విదేశాలు తిరుగుతూ DRDO కు డ్రోన్ సరఫరా ఆర్డర్లు తీసుకువస్తున్నాడు....!!


" #శ్రమ నీ ఆయుధం అయితే, #విజయం నీ బానిస అవుతుంది.." అన్న భారతీయ నానుడికి ప్రత్యక్ష నిదర్శనం మన యంగ్ సైంటిస్ట్ ప్రతాప్....!!


Source: Asthram News

053...సుభాషితం - 1164.. ప్రాంజలి 

---------------

🌺అవిద్యాయామంతరే       వర్తమానాః

     స్వయం ధీరాః    పండితంమన్యమానాః |

     దంద్రమ్యమాణాః పరియంతి మూఢాః

     అంధేనైవ నీయమానా యథాంధాః ||🌺

(కఠోపనిషత్)

          అవిద్య మధ్యన నివసిస్తూ మేమే ధీరులమని (అంటే జ్ఞానవంతులమని), మేమే పండితులమని (అంటే శాస్త్రపరులమని) అన్నంత అహంకారంతో వక్రమార్గాల్లో సాగుతూ, గ్రుడ్డివారిని అనుసరించే గ్రుడ్డివాళ్లలా మూర్ఖులు సతమతమౌతూ ఉంటారు."_

          లౌకిక వ్యవహార జీవితం అంతా అవిద్యా పరిధిలోనే జరుగుతున్నదనే మూలసూత్రాన్ని గ్రహించకపోతే ప్రతి వ్యక్తీ తనకు ఇతరులకు మధ్య నీవు-నేను, ఉత్తమం-అధమం,  బుద్ధిమంతుడు-మూర్ఖుడు అంటూ భేదాలు కల్పించుకుని సారహీన విషయాల కోసం కష్టపడతాడు. ఈ విశ్లేషణ పారమార్థికం, లౌకికం - రెండింటికీ అన్వయిస్తుంది. నడిచే వాడు, నడిపించే వాడు ఇద్దరూ అంధులయితే ఫలితం గందరగోళమే. దీన్ని వివరించే నీతికథలకు కొరత లేదు.

         ఒక ప్రయాణికుడు వాహనంగా ఒక గాడిదను అద్దెకు తీసుకున్నాడు. ఎండ తీవ్రంగా ఉండడంతో కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరాలని నిర్ణయించాడు. గాడిద పక్కన నీడ పడినందున అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. దీనిని చూసి గాడిద యజమానికి అసూయ వచ్చింది. కానీ ఆ నీడ ఒక్కరికి మాత్రమే సరిపోయేటంత ఉండింది. తగాదా మొదలైంది. అద్దెకు గాడిదను తీసుకున్నప్పుడు దాని నీడ కూడా తన స్వామ్యమనే చెప్పాడు, ప్రయాణికుడు. 'నేను అద్దెకి ఇచ్చింది గాడిద మాత్రమే, నీడ కాదు' అని వాదించాడు యజమాని. వాగ్వాదం తీవ్రతరమై సాగింది; పరిష్కారం కనపడలేదు. ఇద్దరూ వాగ్వాదంలో నిమగ్నులై ఉన్న సమయంలో గాడిద అక్కడ నుంచి పారిపోయింది.

          నీడ గురించి "త్వంచాహంచ" (మీది-మాది) అంటే అసలు వస్తువు కనుమరుగవుతుంది!

🌺✍🏽ప్రభలు .

           4-6-2024.


****

054..ప్రాంజలి ప్రభ కథలు 


*శ్రాద్ధ సమయంలో వడ్డించే కూరల విశిష్టత :

***


    శ్రాద్ధ సమయములో వడ్డించిన ఒక కాకరకాయ నూరు కూరగాయలకు సమానము, పనసపండు ఆరు వందల కూరలకు సమానము


ఒకసారి తమ పితరుల శ్రాద్ధము తిథి భోజనానికి భోక్తగా రమ్మని వశిష్ఠులు విశ్వామిత్రులను పిలిచినారు.దానికి విశ్వామిత్రులు దానికేమి వస్తాను కాని నాదొక నిబంధన మీరు ఒకవెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసి నాకు వడ్డించవలెను అన్నారు.


మీరు అడిగిన వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఉపయోగించి వంట చేయమని అరుంధతికి చెబుతాను అన్నారు. శ్రాద్ధ దినము రానే వచ్చింది విశ్వామిత్రులు రానే వచ్చినారు. 


వారికి అరటి ఆకు పరచి కాకర కాయకూర పనస పండు మరియు నల్లేరు తీగతో పచ్చడి చేసి ఇంకా కొన్ని కూరలు మాత్రము వాడి చేసిన వంటను అరుంధతి వడ్డించింది. 


వెయ్యిన్ని ఎనిమిది కూరలు అయితే లేవు. దానికి విశ్వామిత్రులు కోపించి ఇదేమిది? ఈ ఆకులో వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఎక్కడున్నాయి ? అన్నారు.


దానికి వశిష్ఠులు నేను తమ కోరికను అరుంధతి వద్ద ముందే చెప్పి ఉంచినాను. మీ కోరిక ప్రకారమే చేస్తాను అని చెప్పింది కూడా అడుగుతాను ఉండండి అన్నారు.వీరి మాటలు వింటున్న అరుంధతి తానే ముందుకు వచ్చి ఈ శ్లోకాన్ని విశ్వామిత్రులకు చెపుతుంది.


*॥కారవల్లీ శతం చైవ*

*వజ్రవల్లీ శత త్రయం*

*పనసమ్ షట్ శతశ్చైవ*

*శ్రాద్ధకాలే విధీయతే॥*


దాని అర్థము శ్రాద్ధ సమయములో వడ్డించిన ఒక కాకరకాయ నూరు కూరగాయలకు సమానము. మరియు వజ్రవళ్ళి [ నల్లేరు ] పచ్చడి మూడు వందల కూరలకు సమానము. పనసపండు ఆరు వందల కూరలకు సమానము.ఇవి మూడూ కలిపితే మొత్తం వెయ్యి కూరలు. ఇవికాక ఇంకొక ఎనిమిది రకాల కూరలు వండి వడ్డించినాను అంది నమస్కరించి వినయముతో.


అది విని విశ్వామిత్రులు సంతోషంతో తబ్బిబ్బై భోజనము చేసి వెళ్లారుట.


*సేకరణ :*

*_ప్రాంజలి ప్రభ 

No comments:

Post a Comment