Thursday 6 June 2024

09-06-2024





భగవద్గీతలో ఉన్న మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం.. మొత్తం 47 శ్లోకాలు ఒకటి నుంచి 11 వరకు ఇరుపక్షాల వీరుల వర్ణన 12 నుంచి 19 వరకు ఆయా  సేనల సంఖనాదాలు 20 నుంచి 27 శ్లోకాలు వరకు అర్జునుని సేనా నిరీక్షణ ప్రసంగం 28 నుండి 47 వరకు అర్జునుని యొక్క విషాదపూరిత వచనాలు 


2. సాంఖ్యయోగం.. సాంఖ్యతో కూడింది సాక్ష్యం సాంఖ్యం అంటే జ్ఞానం ఇందులో 72 శ్లోకాలు వాటిలో అర్జునుడు తన మానసిక విధులు శ్రీకృష్ణ పరమాత్మకు తెలిపే నివారణ ఉపాయాన్ని అర్థిం చటం (1-10), ఆత్మ స్వరూప వర్ణనం (11-30),యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత(31-38), నిష్కామ కర్మ యోగ ప్రతిపాదనం (39-53), స్థితి ప్రజ్ఞుని లక్షణాలు మహిమ (54-72)


3.కర్మయోగం.. లోకంలో కర్మ చేయకుండా ఏ జీవియు ఉండరు. ఇందులో 43 శ్లోకాలు నియత కర్మలను ఆచరించడం ఉత్తమం అని నిరూపించుట (1-8), ఫలాపేక్ష లేని కర్మ యజ్ఞమని యజ్ఞాన్ని ఆచరించాల్సిన ఆవశ్యకత తెలియజేయడం (9-16),

 జ్ఞాని భగవానుడు లోక సంఘర్షణ సంగ్రహార్ధం కర్మలు చేస్తూనే ఉంటా (17-24), అజ్ఞాని జ్ఞాని లక్షణాలు రాగద్వేషరహితంగా కర్మ నాచరించాలని ఉద్దేంచుట (25-35), కామ క్రోధాదుల స్వభావాన్ని వానిని జయించే పద్ధతులు తెలియజేయడం (36-43) ఉన్నాయి.


భగవద్గీతలో అధ్యాయాలు ఎన్ని? అవి ఏవి?

అధ్యాయాలు.. 18

1. అర్జున విషాద యోగం 

2. సాంఖ్యయోగం 

3. కర్మయోగం

4. జ్ఞానయోగం

5. కర్మ సన్యాసయోగం

6. ఆత్మసంవ్యమయోగం 

7. విజ్ఞానయోగం

8. అక్షర పరబ్రహ్మయోగం 

9. రాజవిద్యా రాజగుహ్య యోగం

10. విభూతి యోగం

11. విశ్వరూప సందర్శన యోగం

12. భక్తి యోగం 

13. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం 

14. గుణత్రయ విభాగయోగం

15. పురుషోత్తమ ప్రాప్తియోగం

16. జై వాసుల సంపద్వి భాగయోగం

17. శ్రద్ధాత్రయ విభాగయోగం 

18. మోక్ష సన్యాసయోగం


 [ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 

సేకరణ.. మల్లాప్రగడ 


హనుమంతుని పుట్టినరోజు?

01-06-2024


*US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా యేల?


US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (చిత్రం) వ్యాపార రికార్డులను తప్పుడు 34 గణనల్లో దోషిగా నిర్ధారించారు.


*ఇండీ కార్ రేస్ లో ఎవరు గెలిచారు?


ఇండీ కార్ రేసింగ్‌లో, జోసెఫ్ న్యూగార్డెన్ ఇండియానాపోలిస్ 500ను గెలుచుకున్నాడు.


*ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచింది ఎవరు?


క్రికెట్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచింది.


*లిథువేనియా అధ్యక్షుడిగా ఎవరు?


లిథువేనియా అధ్యక్షుడిగా గిటానాస్ నౌసెడా తిరిగి ఎన్నికయ్యారు.


*పాపువా న్యూ గినియాలో ఏం జరిగింది?


పాపువా న్యూ గినియాలోని ఎంగా ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో వేలాది మంది ప్రజలు తప్పిపోయి చనిపోయారని భావించారు.


*ఇటీవల, ఉగ్రవాద నిరోధకంపై భారత్-జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 6వ సమావేశం ఎక్కడ జరిగింది? [A] న్యూఢిల్లీ[B] హైదరాబాద్[C] చెన్నై[D] బెంగళూరు షో 


సరైన సమాధానం: A [న్యూఢిల్లీ]


*రాకెట్..అగ్నబాన్ ప్రయోగం ఎక్కడ ఎప్పుడు ఎవరు?


IIT మద్రాస్‌లో ప్రారంభించబడిన అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ, మే 30, 2024న పూర్తిగా 3D-ప్రింటెడ్ ఇంజన్‌తో నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి రాకెట్ "అగ్నిబాన్ - SorTeD"ని సురక్షితంగా ప్రయోగించడం ద్వారా చరిత్ర సృష్టించింది. శ్రీహరికోటలో ఈ కీలక ఘట్టం చోటుచేసుకుంది.


*కాన్సర్ కు మందు?


క్యాన్సర్ వ్యాక్సిన్‌లు ఒక రకమైన ఇమ్యునోథెరపీ. క్యాన్సర్‌ను నివారించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్‌ల మాదిరిగా కాకుండా, రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను కనుగొని చంపడంలో సహాయపడటం ద్వారా క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. DNA సీక్వెన్సింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం..


*పేరు మార్పు?


OSIRIS-APEX ప్రాజెక్ట్ OSIRIS-RExగా ప్రారంభమైనప్పటి నుండి మార్చబడింది, ఇది బెన్నూ ఉల్క నుండి నమూనాలను విజయవంతంగా తీసుకుంది. అంతరిక్ష నౌక ఇప్పుడు సుదీర్ఘమైన మిషన్‌లో ఉంది, ఇందులో అపోఫిస్ అనే గ్రహశకలాన్ని సందర్శించడం కూడా ఉంది.


ఊహల ఊయల ఊసుల వేళలు 


ఉండిపో ఊసులకలలో ఊపిరగుచు

 ఎప్పటి తలపు అప్పుడే యెదనుతాకు

ఆశల వలయం ప్రేమల అణుకువ కథ

చెప్పగలుగుహృదయ వాంఛ చింతకాదు


 వ్రాసి కథలుగాతెలిపేది వరుసకాదు 

చదలని దులిపే పుస్తకం చరిత్ర కాదు

ఇదియు నిన్నునన్నుకలిపే యిరుసుకాదు

 కలువ పువ్వుచూడనికళ కాలమవదు


 గడప చేరే వెలుతురుగా గమ్య మగుచు 

తడిసి తడవని వయసుగు తపన యగుచు 

తడబడే మనసున శాంతి తత్వ మగుచు 

నడవడిక మనమధ్యన నమ్మ పరచు


రక్ష ణకరువె యనుచునే రాజు వెంట

రాతి గుండె కరుగలేక  రక్ష వెంట 

సగటు మనిషి చాలుబతుకు  సాయ మంట 

చేరు మతని చెంతకళలు చెలిమి మంట 


ఉత్తమ గుణాల దక్షత యుత్తమంబు 

తనదు విద్యయే తనకు నుత్తమ ధనంబు

లాభతతిని యారోగ్యమే లాస్య మంబు 

ఉన్నదానితో సంతృప్తి యుచిత మంబు 


మాట వినటలేక మమత మనసు రాక 

మౌన హృదయపూర్వక తలమో పలేక 

బంధ బాసటగా యేది బలము లేక 

ప్రేమ భద్రత మనలోన ప్రీతి కేక 


అపరిపక్వపండు యనుచు నాశ కలిగి 

రుచులు రావుగాని బ్రతుకు రోత కలిగి 

పెద్ద  చదువు చెప్పబతుకు పిలుపు కలిగి 

చేరదయ్య ఫలమునాకు  చెలిమి కలిగి


రేపటి దిన తపనయేల రీతి మార్చ 

నేటి నిద్ర కదియుతెచ్చు చేటు చేర్చ 

నేడు నిద్ర లేకగతియు నిత్య మచ్చ 

చేటు తెచ్చు రేపు కథలు చింత కచ్చ


అ - అహింస

ఆ - ఆత్మజ్ఞానం

ఇ -  ఇంగిత జ్ఞానం

ఈ - ఈశ్వర ప్రాప్తి 

ఉ - ఉత్సవం

ఊ - ఊర్ధ్వ లోక గమనం


అహింసాయుతంగా జీవిస్తూ,

ఆత్మజ్ఞానాన్ని పొందుతూ,

ఇంగిత జ్ఞానం తో ( Common sense) జీవిస్తూ ఉంటే ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది.

ఇక మన జీవితం ఉత్సవమే కదా. 

మరి తదుపరి మన జన్మలు ఊర్ధ్వ లోక గమనమేగా!!

----

ఆలి అనగా నేమి?


నిన్ను నీవుగ మరచినా నీడ ఆలి

ఆమె గాక ఇతరముగ ఆశ లొల్లి 

సంగతులను ముంగిట సర్దు సేవ జల్లు 

నవ్వుతూ యామెనెపుడునూ నటన ననకు


బ్రహ్మచారికి పెళ్ళైన వాడికి తేడా యేమి?


బ్రహ్మచారి ఏదిపడితే అది తింటాడు, వాక్కు స్వేచ్ఛ 

పెళ్లైనవాడు ఏదిపడితే అదే తింటాడు, వాక్కు మౌనం


యేది నాటకం?


మాయ యనేది జగన్నాటకం 

ప్రేమ యనేది ధర్మ సంకటం

మోహ మనేది దేహ నాటకం 

కుటుంబం యనేది జంజాటం


విడదీయలేని బంధం లేవి?


 సూర్యునికి సూర్యకిరణాలకు, చంద్రునికి వెన్నెలకు, సముద్రానికి అలలకు,

 భార్యాభర్తలకు  పిల్లలు.


ముల్లోకాలు చూసే వెలిగేది?


 నిర్మల జ్ఞానం అనే వెలుగు, స్వచ్ఛమైన వెన్నెల వెలుగు, అజ్ఞానం అనే చీకట్లను తొలగించే వెలుగు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వెలుగు.


భౌతిక క్లేశాలను ఎలా తగ్గించుకుంటారు?


"ఆహారాన్ని, నిద్రను, విహారాన్ని, పనుల అలవాట్లను క్రమపరచగలిగే వాడు యోగసాధన ద్వారా సమస్త భౌతిక క్లేశాలను తగ్గించు కుంటారు


శ్రీకృష్ణుని అష్ట భార్యల పేర్లు?


1. రుక్మిణీ దేవి, 2. జంబావతీ దేవి, 3. సత్యభామాదేవి, 4. కాళిందీదేవి, 5. మిత్రవిందాదేవి, 6. సత్యకీర్తిదేవి, 7. భద్రా దేవి, 8. లక్ష్మణా దేవి.


 కోపానికి ఆహ్వానం?


దీపం మీద కోపం... చీకటికే ఆహ్వానం

ఆకలి మీద కోపం... మృత్యువుకే ఆహ్వానం

 ప్రేయసి మీద కోపం... ఒంటరి కే ఆహ్వానం

 కాలం మీద కోపం... కలతల కే ఆహ్వానం 

 విద్య మీద కోపం... అజ్ఞానానికే ఆహ్వానం 

 నడక మీద కోపం... అనారోగ్యానికి ఆహ్వానం

 పట్టు మీద కోపం... పాఠానికి ఆహ్వానం

 చినుకు మీద కోపం... చింతకే ఆహ్వానం

*****


116..స్వయం ప్రజ్ఞ లేకపోతే?

స్వయం ప్రజ్ఞ లేని వానికి శాస్త్రము ఏమీ చేయలేదు అనేది ఎటువంటిది అంటే,  అసలు కళ్ళే లేని వానికి,  అంధునికి ఒక దర్పణం (అద్దం) ఇచ్చినట్లే. అతనికి దర్పణం ఏవిధంగానూ ఉపయోగపడదు. అతని అంధత్వాన్ని ఆ దర్పణం పోగొట్టలేదు.

117..మనోగాయానికి మందు?

బాణ గొడ్డళ్ళ దెబ్బలు పడినగాని
జీవతరులు మళ్ళీ మళ్ళి చిగురువేయు
(కాని) పరుష పదముతో మనసులో పడిన పుండు
మంచి పదములు చెప్పినా మానిపోదు.

118.. మధ్వాచార్యులు చెప్పిన ముక్తి మార్గాలు ఎన్ని?  అవి ఏవి?)
ముఖ్య మార్గాలు నాలుగు విధానాలు 1. సాలౌఖ్యం.. జీవాత్మ భగవంతుని లోకంలో భగవంతునితో పాటు నివసించడం
2. సామీప్యం. భగవంతుడి సన్నిధానంలో నివసిస్తూ కామెతార్థాలను అనుభవించడం. 3. సారూప్యం.
భగవంతుడి రూపం పొంది ఇష్ట భోగాలు అనుభవిస్తూ ఆనందించడం 4. సాయిజ్యం.. భక్తుడు భగవంతుని కంటే వేరుగా ఉంటూనే ఆయన ఆనందంలో పాలు పంచుకోవడం.
101..విత్తనానికి మనిషికి తేడా ఏమిటి?

విత్తనం మంచిదైతే వృక్షం మవుతుంది
మనిషి వ్యక్తిత్వం మంచి కీర్తి పెరుగుతుంది

102.. యోగి స్పృహ యొక్క మూడు స్థితిలేవి? కార్యాచరణ స్థితులేవి?

స్థితులు.. జాగృత స్వప్న మరియు గాడ నిద్ర
కార్యాచరణ స్థితులు.. ప్రారంభం మద్యమం మరియు ముగింపు

103.. సమభావ స్థితి అనగానేమి
బ్రహ్మ జ్ఞానము గల వ్యక్తి సమబావ స్థితిని కలిగించవలన వస్తువులన్నియును సుగుణ బ్రహ్మ స్వరూపముకనే కనబడును

104..లౌకికం పారలౌకికం అనగానే?

మన శరీరంలో దేహం రథం, మనసు సారధి, ధైర్యగా పగ్గాలు, ధైర్య కలిగి ఇంద్రియాలు అదుపులో ఉంచుతుందో వాడే లౌకికంగా పారాలౌకికంగా గొప్పవాడు అవుతాడు.

105..దేశానికి, ప్రభువుకు, భూమికి, విత్తనానికి, ఏమి కావాలి?

దేశమునకు తగిన భాష వేష జనులు
ప్రభువుకు సలహాలు తగిన పలుకు జనులు
భూమికి తగినట్లు జలము భుక్తి జనులు
విత్తనానికి తగినట్లు మొక్క బతుకు

106..నారాయణా అష్టాక్షరీ మంత్రము యేది?

ఆ + ఉ + మ  ఓంకారమే ప్రణవం /అ.. = నారాయణుడు
మ.. జీవుడు, ఆ + ఉ + మ ల యీ అక్షరముల సంబంధము తెలిపేదే ఉకారము
గీతలో భగవంతుడు "అక్షరాణామ్ అకారోస్మి "
సృష్టించిన వాడే వరుడు, పరాత్పరుడే జగన్నాధడు.

107.. వేదానికి మూలం ఏది?

ఓంకారము

108.. మౌనం ఎన్ని రకాలు అవి ఏవి?

నాలుగు రకాలు ఒకటి వాక్  మౌనం...  వాక్కుని నిరోధించడం
రెండు అక్షర మౌ నం :: బలవంతంగా ఇంద్రియాలను నిరోధించడం
మూడు కాష్ఠ మౌనం.. సర్వదేహ ప్రయత్నాలు విడిచిపెట్టి ఉండటం
నాలుగు సౌషుప్త మౌనం.. ఇంద్రియం మనసుల పతీతంగా ఉంటూ విషయ రాహిత్య స్థితిని అభ్యసించడం

109.. ఆత్మ విలీనం?

తన పుట్టినిల్లయినా ఆత్మలో విలీనమయ్యే సమయాన చివరి దశలో ప్రాణం ఎంతో సంతోషాన్ని పొందుతుంది.
పుట్టింటికి చేరడమంటే ఎవరికైనా సంతోషమేగా.

110..శరీరం ఎంతవరకు?

'ఈ శరీరం నేను కాదు' అని తెలుసుకునే వరకు శరీరం అవసరమే.

111.. దైవం అవసరం?

'దైవమే నేను' అని తెలుసుకునే వరకు తాను కొలిచే దైవం అవసరమే.

112..మైలే అనగా?

మనిషి పుట్టినప్పుడు మైలే.
చచ్చినప్పుడు మైలే.
మధ్యలో జీవితం కూడా మైలే.

*తాను కానీ దేహాన్ని తాను అని మోసుకు తిరగడం మైలే కదా.*

113.. జీవితాన్ని ఉన్నతశిఖరాలను చేర్చే అంశాలేవి?
మూడు అంశాలు. 1 ఆత్మగౌరవం 2. ఆత్మ నిగ్రహం 3. ఆత్మజ్ఞానం

114..భగవంతుని ఋషులు ఏమని స్తుతించారు?

1. పరబ్రహ్మ.. అన్నిటికి అతీతుడైనవాడే పరమాత్మ
2. పరంధామ.. పరమాత్మ స్థానం పరంధామం. ఆ స్థానాన్ని పొందితే యిక మల్లీ ఎక్కడకు వెళ్ళవలసిన పనిలేదు. అదే పరమాత్మ పదం
3. పరమం పవిత్రం.. గంగానదిలో స్నానము చేసినా, పరమాత్మను స్మరించిన పాపాలు పోతాయి, కనుక పరమ పవిత్రమూర్తి పరమాత్మ.
4. పురుషం.. పురమునందంత ట వ్యాపించి యున్నావాడే పురుషుడు. అంతర్యామి రూపంలో సయనించి విశ్రాంతి పొందు పరమ పురుషుడు శ్రేష్ట పురుషుడు.
5. శాశ్వతం.. జనన మరణాలు లేనట్టి జగద్రూపంలో నున్న పరమాత్ముడు
6. దివ్యం.. ఆయన లక్షణాలాన్ని దివ్య మైనవి, ప్రకాశ రూపం గల పరమాత్మ
7. ఆదిదేవం.. ఉద్భవించి చివరకు ఆయనలో లయమై పోవు కనుక పరమాత్మ ఆదిదేవుడు
8. అజం..తల్లి తండ్రి లేని, పుట్టుకేలేని అజం అనేపరమాత్మ
9. విభుమ్.. గుణమే లేని, సూక్షాతిసూక్ష్మం, సర్వవ్యాపకం అందుకే విభుమ్ అన్నారు.

115..మూడు కోతుల సందేశం ఆధ్యాత్మికంగా?

👉నోరు మూసుకుని  కూర్చుంటే ముని అవుతాడు.
👉 కళ్ళు మూసుకుని కూర్చుంటే యోగి అవుతాడు.
👉 చెవులు మూసుకుని అంతర్ జ్ఞానాన్ని వింటే జ్ఞాని అవుతాడు.
*****

కంసుడు పంపిన భటులు బాల కృ ష్ణుని కనిపెట్టాలని చెట్టు క్రింద వృద్ధున్నీ పలకరించారు (వృద్ధ రూపంలో కృష్ణుడే )

ఏమని చెప్పేదా ఏలని చెప్పేదా
ఏలిన కృష్ణయ్య ఏదని చెప్పేదా
లీలా మానుష రూపమని చెప్పేదా
మా ఆత్మబంధువు అని చెప్పేదా

ఎండమావుల నీరు తాగగలమా?
కృష్ణ లీలలు మనకు అర్థమవునా?
ప్రకృతి ప్రభంజనాన్ని ఆపగలమా?
కాలాన్ని బట్టి సత్యాన్ని తెలుపగలమా?

వెడలెల్లిన కాలాన్ని తిరిగి తేగలమా?
ఇంద్రియాలను జయించగలమా?
వయసుడికాక యవ్వనాన్ని పంచగలమా?
నిత్య  కాల ధర్మాన్ని ఆపగలమా?

విశాలాకాశానికి హద్దులు గీయగలమా?
శ్రీ మనసు గుణాన్ని తెలుపగలమా
మొక్క ఎదుగుదలను ఆపగలమా
మృత్యువు ఆగమనాన్ని పసిగట్టగలమా?

పాతాళానికి తుది కనుగొనగలమా?
అంతర్యామిని పట్టు కోగలమా ?
గుప్పెట లొ నీటిని దాచగలమా?
సముద్రంలో కలిసే జలాన్ని ఆపగలమా?

సూర్యచంద్రులు లేక జగాన మనగలమా?
తల్లిదండ్రులు లేని లోకాన మనగలమా?
ప్రేమలేని చోట  జీవిగా మనగలమా?
దైవ తత్వాన్ని  అర్థం చేసుకోగలమా ?

మూర్ఖులతో వాదన చేసి నెగ్గగలమా?
వాడి కర్మ యని వదిలేయగలమా?
తెలిసి తెలియక  తప్పు చేయకు మా
ఇంతి మది అంచనా వేయుట సాధ్యమా?

కన్నవారి ఋణం తీర్చుకొనుట తరమా?
కానీ వారిని ప్రోత్సహించడం తరమా?
కాలం నీదైతే నీవే తెలుసు కనుమా?
మూర్ఖ మాటలని  భావించకుమా?

పెద్దల సుద్దులు వినక బాగుపడెదమా?
కామధేనువును గురించి చెప్పేదమా?
కల్పతరువును గురించి చెప్పేదమా
బాల కృష్ణ గురించి చెప్పేదమా?
భగవంతుని అనుజ్ఞ తో బ్రతుకగా సాగెదమా?

ఏమని చెప్పేదా ఏలని చెప్పేదా
ఏలిన కృష్ణయ్య ఏదని చెప్పేదా
లీలా మానుష రూపమని చెప్పేదా
మా ఆత్మబంధువు అని చెప్పేదా

అంతే తాత్వాలు అర్ధంగాక తలపట్టుకొని రేపల్లెనుండి కొందరు వెనుదిరిగారు


*****


1.పాండురాజు శపించిన మహర్షి నామము?
2.  శ్వేతకేతువు ఎవరు?
3. ధృతరాష్ట్రునికి వైశ్య ద్వారా పుట్టిన కుమారుడు ఎవరు?
4. పాండవులకు ఉపననాదులు నిర్వహించిన మహర్షి ?
5. భీకర విష ఉరగాదులతో గేములు కనిపించిన ప్రదేశం ఏది?
  6. శరధ్వంతుని సంతానం ఎవరు?
7. ద్రోణాచార్య ధర్మపత్ని?
8. ఏకలవ్యుని తండ్రి?
9 దేవేంద్రుని వజ్రాయుధం ఏ మహర్షి వెన్నెముక?

10. శకుని ఆప్త మంత్రి ఎవరు?

(జవాబులు. 01. కిందముడు 02 ఉద్దాలకముని కుమారుడు 03 యు యు త్సుడు 04 శతశృంగ పర్వతం మీద మహామునులు 05 ప్రమాణ కోటి
06 కృపుడు 07 కృపి  08
హిరణ్య ధన్వుడు 09 దధీచి మహర్షి 10 కణికుడు

****
11 కాశీరాజ తనయుల పేర్లు?
12  జమదగ్ని సంహరించిన వారెవరు?
13  పరశురాము డెవరిని చంపాడు?
14 సుబలుడెవరు?
15 గాంధారి సోదరుడెవరు?
16  శ్రీకృష్ణ పితామహుడెవరు?
17 సూరసేనుని జేష్ఠ పుత్రిక ఎవరు?
18 పృథ. కుంతికి మంత్రోపదేశము చేసిన మహర్షి?
19 సత్యోగర్భ సంజాతు డైన కర్ణుని పెంచిన వారు?
20 అమూల్య రత్నాలతో లభించిన కర్ణునికి కలిగిన విఖ్యాతి ఏది?

(జవాబులు..11 అంబ అంబికా అంబాలిక 12 కార్తవీర్యార్జునుడు  13 కార్తవీర్యార్జునుని  14 గాంధారి తండ్రి 15 శకుని 16 సూరసేన మహారాజు  17 పృధా దేవి  18 దుర్వాసుడు 19 సూతుడు రాధ  20 కణి కుడు )

*****


21 అక్షర దేవత ఎవరు?  
22 రామాయణంలో ఎన్ని ఖండాలు అవి ఏవి?
23 హనుమంతునికి ఐదు ముఖాలు ఏవి?

24. హనుమంతుని అవతారాలు ఎన్ని అవి ఏవి?


25. హనుమంతుని తల్లి పేరు? పూర్వజన్మలో పేరు?


26. రామ రహస్యం ఉపనిషత్తులో హనుమంతుడు ఎవరికి రామ తత్వం గురించి తెలియ పరిచారు?


27. భక్తి భావనలో ఎన్ని అంశాలు అవి ఏవి?


28. ప్రాణాయామం దేనికి?


29. మనిషికి పాశం ఏది?


30. ఏది మృత్యువు?



21 సరస్వతి 22.. 5 బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ యుద్ధకాండ

23. మద్య ముఖం హనుమంతుని స్వస్వరూపం దీనినే పూర్వముఖం, దక్షిణ మొఖం నారసింహం పశ్చిమ ముఖం గరుత్మంతుడు ఉత్తర ముఖం వారాహం ఊర్ధ్వముఖం హయాగ్రీవం


24. మూడు రామాయణంలో హనుమంతుడు, భారతంలో భీముడు, జ్ఞానావతారం మధ్వాచార్యులు మరియు చిరంజీవి


25. తల్లి అంజన, పూర్వజన్మలో పుంజిక స్థల అనే అప్సర


26. సనక, సనందన సనత్ కుమార, శాండిల్య, ముద్గ లాది ఋషులకు


27. భక్తి భావనలో మూడు అంశాలు ఒకటి దేహభావం రెండు జీవభావం మూడు ఆత్మభావం


28. కార్యసాధనకు ఏకాగ్రతకు మంచి ఆలోచనలకు


29. మమత


30. తనకు తానే తెచ్చుకున్న అప కీర్తి

*****

31. గీత అనగానేమి?


32. భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునకు బోధించిన ఇంకా ఎవరికి తెలుసు?


33. భగవద్గీత కు ఉన్న 18 పేర్లు ఏవి?


34.సంసార దుఃఖాన్ని తొల గించి మోక్షాన్ని అందించేది?

35. రానులకు స్వర్గ సుఖాన్ని ఇచ్చేది?


36. నిజమైన చెవిటి ఎవరు?


37. ఎవరు మగవారు?


38. షెడ్యూలు అత్యంత బలమైనవి ఏవి?


39. దుఃఖానికి అంతటికి మూలం ఏది?


40. శాశ్వత స్వర్గలోకం ఎవరికి వస్తుంది?


****

31. గీత అనే పదంలో " గీ "  అంటే త్యాగం "త'" అంటే తత్వ జ్ఞానం


32. వ్యాసుడు సంజయుడు అర్జున్ రథం పై ఉన్న ఆంజనేయుడు


33. గీత, గంగ, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మ విద్య, బ్రహ్మ వల్లి, త్రిసంధ్య, ముక్తి గేహిని, అర్థమాత్ర, చిదానంద, భవఘ్ని,  భయనాశిని, పర, అనంత, వేదత్రయి, తత్వాత జ్ఞాన మంజరి అనేవి 18 పేర్లు


34. ఆత్మజ్ఞానం


35. అహింస


36. సత్యం హితం చెప్పినా వినని వాడు


37. అవసరానికి పలకని వారు


38.  కోపం, కామం, అసత్యం      లోభం, తృష్ణ

39. నేను నాది అనే భావం


40. కోపాన్ని జయించి, ఆత్మస్తుతి పరనిందా విడిచి, మాట తప్పనివాడు

.


41. ద్రవ్య యజ్ఞం అనగానేమి?

42. తాపయజ్ఞం అనగానేమి?

43. స్వాధ్యాయ యజ్ఞ అనగానేమి?

44. యోగ యజ్ఞం అనగానేమి?

45.  జ్ఞాన యజ్ఞం అనగానేమి?

46. సంశిత యజ్ఞం అనగానేమి?

47. ధనుర్మాసం అనగానేమి?

48. త్రిమూర్తులలో ఉన్న శక్తి ఎవరు? వారిలో ఏవిధంగా నిక్షిప్తమై ఉంటుంది?

49. శరీరం అవసరం యెంత వరకు?

50. దైవం అవసరం ఎంతవరకు?


41. ద్రవ్యాన్ని న్యాయంగా ధర్మంగా అర్జించి ధర్మ కార్యాలకు ధనం వెచ్చించుడే ద్రవ్య యజ్ఞం 

42. జ్ఞాణాగ్నితో ఆత్మను తపింపచేసి, పునీతం తేజోవంతం చేయడమే తాపయజ్ఞం 

43.  ఏ విద్యనైనా అధ్యయనం చేసి  అర్థం చేసుకొని లోకకళ్యాణమునకు వినియోగించడమే సాధ్యాయ యజ్ఞం 

44. యమ నియమాలతో మనస్సుపై పట్టు సాధించి మానసిక శక్తి సంపాదించడమే యోగ యజ్ఞం 

45. మర్షిత ఎవరు? ఎందుకు పుట్టాడు? ఏం చేయాలి?  ఆలోచించి ఆత్మ దర్శన అనుభవం పొందాలి అదియే జ్ఞాన యజ్ఞం 

46. తనలో నున్న  కామ క్రోధ మదమాత్సర్యాలను జయించి నియమవర్ధంగా ఖర్మాచరణం చేయడమే సంశిత యజ్ఞం

47. ధనం మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం

48. త్రిమూర్తులలో ప్రతిష్టురాలైన శక్తి ఆదిశక్తి, విష్ణువులో సాత్వికి శక్తిగా, బ్రాహ్మలో రాజ సీ శక్తిగా, శంకరునిలో తామసి శక్తిగా

49. 'ఈ శరీరం నేను కాదు' అని తెలుసుకునే వరకు శరీరం అవసరమే.


'50. దైవమే నేను' అని తెలుసుకునే వరకు తాను కొలిచే దైవం అవసరమే.

****

50.  అటుకులు దేని నుండి వస్తాయి? ఉపయోగం ఏమి?

51. అనాస పండు ఉపయోగం ఏమి?

52. అమృతపాణి అరటి పళ్ళు ప్రయోజనం ఏమి?

53. యాపిల్ పేరు? ఉపయోగం?

54. ప్రపంచంలోనే అతికరీ దైన సుఖంధ్ర దవ్యం

55. నీటి యేనుగు పాలు యే రంగులో ఉంటాయి

56. తేనెలో నీటి శాతమెంత? 

57. మణిరత్నం తీసిన దొంగ దొంగ సినిమాకు రచయిత?

58. తొలిచిత్రంతో రెండునందులు పొంది ఉత్తమచిత్రం అనిపించుకున్న దర్శకుడు?

59. హిందీలో శ్రీదేవితో తీసిన రంగీలా సినిమా దర్శకుడు?

60. ఖడ్గమృగం పాలు యే రంగు?





50. బియ్యం నుండి అటుకులు తయారు చేస్తారు. ఆకలని పోగొడతాయి శరీరానికి వేడిని కలగజేస్తాయి బలాన్ని వీర్య పుష్టి  కలగచేస్తాయి. 

51. అనాసపండు చలవ చేస్తుంది దాహాన్ని పైత్య వికారాన్ని అరుచుని పోగొడుతుంది.

52. అరటిపండు తిన్నా పైత్య శాంతి మోహ శాంతి చలవ కూడా కలగజేసి దేహపుష్టిని ఇస్తుంది 

53. అమృత ఫలము అనగా యాపిల్.. దేహాబుష్టి రక్త వృద్ధి వీర్య వృద్ధి కలగా చేస్తుంది వాత పిత్త శ్లే ష్మాలను శాంతింప జేస్తుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది

54. కుంకుమ పువ్వు

55. గులాబీ 

56. 17 శాతము

57. రాంగోపాల్ వర్మ

58. రాం గోపాల్ వర్మ

59. రాం గోపాల వర్మ 

60. నలుపు

****

60.సాసింపనలివికాని వారిని తెలపండి?

61.యే కొంచం లభించిన సంతసించే వారెవరు?

62. పొంగివచ్చు శత్రువును సేవించువాడు?

63. స్త్రీ లను రక్షిస్తూ మేలుపొందే వారు ఎవరు?

64. యాచింపదగని వారిని యాచించువాడు?

65. తన్ను తాను పొగడుకొనేవారెవరు?

66. మంచి కులమన పుట్టి పాడు పనులు చేయకూడదెందుకు?

67. పెద్ద లేనివాడికి ఉపదేశాలు చేసేవాడు?

68. కోరదగని  దానిని కోరువాడు?

69. రామో విగ్రహవాన్ ధర్మః అనటంలో అంతరార్ధం?

70. దుష్టత్వాన్ని మంచితనంగా, అబద్దాన్ని నిజంగా సమర్థించ్చేవాడు?






60.రాజుని, భగవంతున్ని, వేదబ్రాహ్మణున్ని, ఋషులను గురువులను, పుణ్యబువాంతులైన  పతివ్రతాలను 

61. దక్కినవాడికి దక్కినంత

62. వ్యక్తిత్వం, ఆత్మగౌరవం లేక ప్రాణరక్షణకు శత్రువుని ప్రేమిస్తారు

63. కోజ్జాలు స్త్రీలకు రక్షకులగా ఉండేవారు. ప్రత్యేక జీతభత్యాలు

64.  సన్యాసులు, విరాగులు, పిల్లలు, బీదవారు, యాచింప రాదు. యాచాన అలవాటు అయ్యాక ఉచితం అనుచితం ఆలోచింపరు

65. గొప్పవారు కానివరే గొప్పలు చెప్తారు

66. కాలమాన పరిస్థితులు బట్టి ప్రస్తుతం కులవృత్తులు అమలులో లేవు సంస్కార విరుద్ధమైన పనులు చేయకూడదు

67.   ఉపదేశాల పట్ల ఉదాసీనత నిర్లక్ష్యం పనికిరాదు మనకు ఏది తెలియదు దానిని తెలిసిన వాళ్ళతో తెలుసుకోవాలి

68. దుర్యోధన వంటి వారు

69. పరమాత్మే ధర్మం.. ధర్మమే పరమాత్మ

70. చేతకాని వాడు

****

71. ఒక త్యాగమూర్తి ప్రేమకు పాదులోనరించి స్వీయరక్తం వార్షించి నాడు?

72. ఒక మహాత్మా అంటే స్వేచ్ఛగా ప్రాణం అర్పించి మై మీద బట్టతో బ్రతికినవాడు?

73. ఒక రాచవాడ హింసకు సర్వరాజ్యబు విడనాడి బిక్షకు నడిచిన వాడు?

74. తెలుగు భాష వెలుగు తెలుగు దేశ ముపార్టి పెట్టిన నాయకుడు?

75. ఉదయం కానే కాదని అనుకోవటం నిరాశ ఉదయించే అట్లానే ఉంటుందను కోవడం దురాశ అన్నవారు?

76. రంగుల వెళ్ళు నింగిలో వెలసింది?

77. చెయ్యి వెయ్యకు కసుక్కున గుచ్చును?

78. పండు జారింది ఆకాశం అంచున?

79. ఎన్నెన్నో అనర్థాలకు మూలం?

80. సర్వ అర్థ నర్థాలకు మూల కారణం?



71. యేసుక్రీస్తు 

72. మహాత్మా గాంధీ 

33. గౌతమ బుద్ధుడు 

74. N. T. R

75. కాళోజీ

76. ఇంద్రధనుస్సు 

67. కన్నె గులాబీ 

78. సంధ్యా సమయం

79. ఆవేశం

80. ధనం

****

*_ మీకోసం ఒక తమాషా ఫజిల్_*

♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️


*Palindrome అంటే ఆంగ్లభాషలో కుడినుండి ఎడమకైనా, ఎడమనుండి కుడికైనా ఒకే విధంగా ఉండే పదాలు అని మనందరికీ తెలుసు.  palindrome ని తెలుగులో _‘పదభ్రమకం’_ అంటారట. అంటే.. ‘వికటకవి’ లాంటి పదాలు అన్నమాట. ప్రస్తుతం ఈ క్రింది పదాలలో ఒక్కోదానికీ  సమానార్ధం గల మరో పదాన్ని కనుక్కోండి. మీరు కనుక్కునే ఆ పదం తప్పనిసరిగా ‘పదభ్రమకం’ అయివుండాలి. అదీ నియమం.*

➖➖➖➖➖➖➖➖➖➖  

81. పిమ్మట =  

82. వస్త్రము =

83. సమీపము =

84. కాంతి =

85. పెండ్లి కానీ పడుచు =

86. కాబట్టి =

87. కాలిన పిడక =

88. కసాయి =

89. అగడ్త =

90. ముమ్మరము, మిక్కిలి= 

91. మౌక్తికము= 

92. రుచుల్లో ఒకటి= 

93. నిరక్షరాస్యుడి  చేవ్రాలు= 

94. స్వరాల్లో ఒకటి=

----------------------------


జవాబులు 

81) తర్వాత 82)వలువ   83)సరస 84) మిసిమి 85) కన్యక 86) కనుక 87) కచ్చిక  88)   కటక  99) కందకం90) విరివి 91) ముక్తము 92) పులుపు 93) నిశాని 94) మధ్యమ




 🌻. పాండవ చరిత వర్ణనము - 1 🌻

అథ పాణ్డవ చరిత వర్ణనమ్‌.

అగ్నిరువాచ :

యుధిష్ఠరే తు రాజ్యస్థే ఆశ్రమాదాశ్రమాన్తరమ్‌ | ధృతరాష్ట్రో వనమగాద్గాన్ధారీ చ పృథా ద్విజత 1

అగ్ని పలికెను: ఓ ద్విజుడా! యుద్ధిష్ఠురుడు రాజ్యము చేయుచుంéడగా ధృతరాష్ట్రడును, గాందారియు, కుంతియు, అరణ్యమునకు వెళ్ళి ఒక ఆశ్రమమునుండి మరి యొక ఆశ్రమమునకు సంచరించుచుండిరి.

విదురస్త్వగ్ని నా దగ్ధో వనజేన దివం గతః | ఏవం విష్ణుర్భువో భారమహరద్ధానవాదికమ్‌. 2

ధర్మాయాధర్మానాశాయ నిమిత్తీకృత్య పాణ్డవాన్‌ | స విప్రశాపవ్యాజేన ముసలేనాహనత్కులమ్‌. 3

యాదవానాం భారకరమ్‌-

విదురుడు దావాగ్నిచే దగ్ధుడై మృతి చెందెను. ఈ విధముగ మహావిష్ణువు పాండవులను నిమిత్తముగ చేసి కొని, ధర్మరక్షణముకొరకును, అధర్మవినాశమునకు, పూనుకొని దానవాదిక మగు భూభారమును హరించెను. విప్రశాప మను వంకచే, ముసలముచే, భూభారకర మగు యాదవకులమును నశింపచేసెను.

వజ్రం రాజ్యే7భిషేచయత్‌ | దేవాదేశాత్ర్పభాసే స దేహం త్యక్త్వా స్వయం హరిః 4

ఇన్ద్రలోకే బ్రహ్మలోకే పూజ్యతే స్వర్గవాసిభిః | బలభద్రో7నన్తమూర్తిః పాతాల స్వర్గమీయివాన్‌. 5

శ్రీకృష్ణుడు వజ్రుని రాజ్యాభిషిక్తుని చేసి దేవతల ఆదేశమునే ప్రభాసక్షేత్రమునందు తన దేహమును పరిత్యజించి, ఇంద్రలోక బ్రహ్మలోకములందు స్వర్గవాసులచే పూజింపబడెను. బలరాముడు ఆదిశేషరూపధారి యై పాతాళ స్వర్గము చేరెను.

అవినాశీ హరిర్దేవో ధ్యానిభిర్ధ్యేయ ఏవ సః | వినా తం ద్వారకాస్థానం ప్లావయామాస సాగరః. 6

వినాశరహితు డగు ఆ శ్రీ హరి యోగులచే ధ్యానింపబడు వాడు. అట్టి శ్రీ కృష్ణుడు లేని ద్వారకను సముద్రము ముంచివేసెను.

సంస్కృత్య యాదవాన్‌ పార్థో దత్తోదకధనాదికః | స్త్రియో7ష్టావక్రశాపేన భార్యా విష్ణోశ్చ యాః స్థితాః. 7

పునస్తచ్ఛాపతో నీతా గోపాలైర్లగుడాయుధై ః | అర్జునం హి తిరస్కృత్య పార్థః శోకం చకార హ. 8

వ్యాసేనాశ్వాసితో మేనే బలిం మే కృష్ణసన్నిధౌ య | హస్తినాపురమాగత్య పార్థః సర్వం న్యవేదయత్‌. 9

యుధిష్టిరాయ స భ్రాత్రే పాలకాయ నృణాం తదా |

అర్జునుడు యాదవులకు ప్రేత సంస్కారాదులు చేసి ఉదకధనాదిదానములు చేసెను.

అష్టావక్రుని శాపముచే విష్ణుభార్యలుగా అయిన స్త్రీలను, మరల అతని శాపము చేతనే, కఱ్ఱలు ఆయుధములుగా గల రోపాలకులు అర్జునుని ఓడించి తీసికొని పోయిరి. అర్జునుడు చాల శోకించెను.

వ్యాసు డాతనిని ఊరడించెను. కృష్ణుడున్నప్పుడే నా బలము అని అతడు గ్రహించెను. అతడు హస్తినాపురమునకు వచ్చి, రాజ్యపాలకు డైన యుధిష్ఠిరునకు ఇది యంతయు చెప్పెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 37 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 15
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. పాండవ చరిత వర్ణనము - 2 🌻

తద్థనుస్తాని చాస్త్రాణి స రథస్తే చ వాఇనః. 10

వినా కృష్ణేన తన్నషటం దానం చాశ్రోత్రియే యథా |

కృష్ణుడు ఈ లోకమును విడచి వెళ్ళిపోయిన తోడనే అర్జునుని అదే ధనస్సు, అవే అస్త్రములు, అదే రథము, అవే గుఱ్ఱములు, అవన్నియు శ్రోత్రియుడు కాని వానికి ఇచ్చిన దానము వలె నష్టమైపోయెను.

తచ్ర్ఛుత్వా ధర్మరాజస్తు రాజ్యే స్థాప్య పరీక్షితమ్‌.

ప్రస్థానం ప్రస్థితో ధీమాన్‌ ద్రౌపద్యా భ్రాతృభిః సహ | సంసారానిత్యతాం జ్ఞాత్వా జపన్నష్టశతం హరేః. 12

ధర్మరాజు ఆ వార్త విని, పరీక్షిత్తును రాజ్యపాలనకై నియోగించి, ఈ సంసార మనిత్య మను విషయము గ్రహించినవాడై, ద్రౌపదియు, సోదరులును వెంట రాగా, మహావిష్ణుని అష్టోత్తరశతనాముములు జపించుచు మహా ప్రస్థానమున బయలుదేరెను.

మహాపథే తు పతితా ద్రౌపదీ సహదేవకః | నకులః ఫల్గునో భీమో రాజా వోకపరాయణః. 13

ఇన్ద్రానీతరథారూఢః సానుజః స్వర్గమా స్తవాన్‌ | దృష్ట్వా దుర్యోధనాదీంశ్చ వాసుదేవం చ హర్షితః. 14

ఏత త్తే భారతం ప్రోక్తం యః పఠేత్స దివం వ్రజేత్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మహాభారతాఖ్యానం నామ పఞ్చదశో7ధ్యాయః.

ఆ మహాప్రస్థానమునందు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడును పడిపోయిరి. రాజు శోకాతురుడయ్యెను. ఆతడు ఇంద్రుడు తీసికొని వచ్చిన రథము నధిరోహించి, సోదరనహితుడై స్వర్గము చేరెను. ఆచట దుర్యోధనాదులను, వాసుదేవుని చూచి సంతసించెను. నీ కీ భారతకథను చెప్పితిని. దీనిని పఠించినవారు స్వర్గమునకు వెళ్లెదరు.

అగ్ని మహాపురాణములో మహాబారతాఖ్యాన మను పంచదశాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment