Tuesday 11 June 2024

12-06-2024

 


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
 
కనువిప్పు 
పూర్వము భారవి అనే కవి వుండేవాడు. ఆయన చిన్నతనం లోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. వూర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు. భారవి తండ్రి తో నీ కొడుకు చాలాబాగా వ్రాస్తాడయ్యా అనేవారు. ఆయన మాత్రం వాడింకా చిన్నవాడు యింక నేర్చు కోవలిసింది
చాలా వుంది. ఏదో వ్రాస్తాడు. అనేవాడు. భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి. తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు.వూర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే వుంటే తనేమో ఏమున్నది యింకా వాడు చిన్నవాడు. అన్నట్టు మాట్లాడుతారు.అని చాలా సార్లు చెప్పుకున్నాడు. ఎన్నాళ్ళు పోయినా ఆయన ధోరణి మారక పోయే సరికి భారవికి తండ్రి మీద కసి పుట్టింది ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ వుంది. భారవి ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు. అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని చిన్నబుచ్చినట్టు మాట్లాడుతారు?వాడు చాలా బాధ పడుతున్నాడు. వూరు ఊరంతా తనను మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట. అప్పుడు తండ్రి నవ్వి *"పిచ్చిదానా నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా?*
*తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుక్షీణం అంటారు! అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది వాడి అభివృద్ధికి ఆటంక మవుతుంది*.
*ఇంకా యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంత వాడు లేడని .విర్రవీగుతాడు.దానితో వాడి అభివృద్ధి ఆగిపోతుంది.."అన్నాడు*
అదివిని భారవికి బుర్ర తిరిగి పోయింది. పశ్చాత్తాపం తో రగిలి పోయాడు.
వెంటనే బండ అక్కడ పారవేసి లోపలి వెళ్లి తండ్రి పాదాల  మీద పడి భోరున ఏడ్చాడు.
తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదయినా శిక్ష వేయమని బ్రతిమాలుకున్నాడు.
పశ్చాత్తాపం తో నీ పాపం పోయింది శిక్ష ఎందుకు అని తండ్రి చెప్తున్నావినకుండా తనకు శిక్షపడాలని పట్టు బట్టాడు.
తండ్రి సరే అలాగయితే మీ అత్తగారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ చివరికి నీ భార్యకు కూడా ఏమీ చెప్పకుండా వుండి రా అన్నాడు.
ఇంత చిన్న శిక్షనా అన్నాడు భారవి. తండ్రి నవ్వి *అది చాల్లే*వెళ్ళు అన్నాడు.
భారవికి చిన్నతనం లోనే పెళ్లయింది. అప్పటికి యింకా భారవి భార్య కాపురానికి రాలేదు.
సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు.. వాళ్ళు అల్లుడు వచ్చాడని చాలా మర్యాద చేశారు. రోజుకో పిండివంట చేసి ఆదరించారు.
నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు. చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు.మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు..
దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు. అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు.
భారవి భార్యకు చాలా బాధగా వుండేది.భర్తకు ఆవిడ మీరు మీ వూరు వెళ్లిపోండని యెంతో చెప్పి చూసింది. భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించే వాడు. ఇలా సంవత్సరం గడిచింది.
అప్పుడు భారవి యింక నేను మా వూరికి పోయి వస్తానని బయల్దేరాడు.
ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.
భార్యకు,అత్తామామలకూ విషయం వివరించి నా శిక్ష పూర్తి అయింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు. ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.
తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి.
*మీ అభివృద్ధిని* కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు!
చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి..
అదంతా మీరు బాగు పడాలనీ వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!
*తల్లి దండ్రులను ద్వేషించకండి. అంత కంటే పాపం ఇంకోటి వుండదు. . . .*

--((**))--

శాంతాన్ని మించిన సుగుణం లేదు


మనం అనుకున్నట్లుగా లోకం నడవదు. దానితీరు వేరు, మన ఆలోచనలతో అందరూ ఏకీభవించకపోవచ్చు


 ఓర్పు లేనివారికి, ఈర్యాసూయలు గలవారికి మనసు వెంటనే చికాకు పుడుతుంది. అది కోపం రూపంలో వ్యక్తమవుతుంది. కోపావేశం ఆలోచనాశక్తిని క్షీణింపజేస్తుంది. నోటివెంట పరుషపదాలు వెలువడతాయి. చినికి చినికి గాలివాన అయినట్లు- అది తగాదాలకు తుదకు తన్నులాటకు దారితీస్తుంది


క్షమ మంచిదా, లేక బలప్రయోగం మంచిదా? అని బలిచక్రవర్తి తన తాత అయిన ప్రహ్లాదుణ్ని ప్రశ్నించాడు. సదా ప్రతాపం ప్రదర్శించడం గాని, లేక ఎల్లప్పుడూ ఓర్పుతో ఉండటం అనేది గాని మంచిది కాదు. శాంతి శాంతి అంటూ జనం చేస్తూ కూర్చునేవాళ్ళు తుదకు అందరికి లోకువైపోతారు. ఆ పరిస్థితిలో కొందరికి మరణమే మేలనిపించవచ్చు.' అని ప్రహ్లాదుడు పలికాడు. బలం ఉంది కదా అని ప్రతాపం ఎక్కువగా ప్రదర్శిస్తే ప్రాణాపాయం సంభవించవచ్చు సమయానుకూలంగా మనసులోని మృదుత్వాన్ని, కాఠిన్యాన్ని కూడా ప్రదర్శించడం నేర్చుకుంటే ఇహ వరాల్లో సుఖం పొందుతారు!

అని వనపర్వం చెబుతోంది.


 మనకు ఎవరైనా ఉపకారం చేసి ఉంటే, ఇప్పుడు వారు మన విషయంలో అపరాధం  చేసినా వారిని క్షమించాలి తక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు మనకు అపకారం చేసినా పట్టించుకోకూడదు అయితే, కపటబుద్ధితో అపకారం తలపెట్టి, తరవాత  'నాకు తెలియక చేశాను'  అనేవాళ్లను విడిచిపెట్టకూడదు ఒకే తప్పు రెండో పర్యాయం చేస్తే కఠినంగా శిక్షించాలని ప్రహ్లాదుడి  ఉపదేశం  ద్రౌపది తనకు కౌరవులు చేసిన అవమానానికి మండిపడింది. ఆ మంట శాంతివచనాలతో చల్లారేది  కాదు. ధర్మరాజు ఆమె కోపాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాడు.

 

 'ద్రౌపదీ!  కోపం విచక్షణాజ్ఞానాన్ని నాశనం చేస్తుంది.  కోపిష్టులకు 'ఇలా అనవచ్చు,  ఇలా అనకూడదు' అనే తేడా ఉండదు. కాబట్టి ఓర్పు పుణ్యహేతువు అని గ్రహించు!" అన్నాడు..


వ్యాసుడు, భీష్ముడు, శ్రీకృష్ణుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, విదురుడు, సంజయుడు మొదలైన పెద్దలందరూ శాంతినే కోరతారు. పెద్దల మాటను పెడచెవిన పెట్టేవారికి శాంతివచనాలు ఎక్కవుగదా!  

రాజ్యాధికారానికి అర్హత లేకపోయినా సింహాసనం కోరిన సుయోధనుడికి ఓర్పు తక్కువ, అర్హతగల ధర్మరాజుకు ఓర్పు అధికం!


ద్రౌపది తాను పొందిన అవమానాల వల్ల పట్టరాని కోపంతో బుసలు కొడుతున్నది. "జీవులకు కష్టసుఖాలు బ్రహ్మదేవుడి వల్లనే కలుగుతున్నాయి. పెద్దలు మాటిమాటికీ ధర్మో రక్షతి రక్షితః అనగా ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మల మనల్ని రక్షిస్తుంది అంటూ ఉంటారు గదా! మరి ఆ ధర్మం మిమ్మల్ని రక్షించిందా, మంచివాళ్లు కూడు లేక అల్లాడుతూ ఉంటే, దుర్మార్గులు సుఖంగా ఉంటున్నారు. ఆ దుర్మార్గుడైన దుర్యోధనుడు సంపదతో విలాసంగా జీవిస్తున్నాడు. అలాంటి పాపికి సంపద లభించడానికి కారణం ఏమిటి"  అని

ధర్మరాజును నిలదీసింది. ధర్మరాజు సమాధానం ఇది- పాంచాలీ!   ధర్మ వ్యతిరేక బుద్ధి వదిలిపెట్టు, ధర్మానికి - ఆధర్మానికి తగిన ఫలితం ఉంటుంది. ధర్మదృష్టి లేని వాళ్లు పశువుల్లా జీవిస్తారు, ఈశ్వరుడిని, బ్రహ్మను నిందించకూడదు. మనిషి దేవతల్లాగానే అమరత్వాన్ని పొందుతాడు...  శాంతాన్ని మించిన సుగుణం లేదు.


హృదయాల సవ్వడి.. మందారం 


ఏమి చెప్పేది మీకు ఏమేమిచెప్పేదా 

లోక తీరేమో లొల్లిబతికే చెప్పేదా

మనుషుల లోని ప్రేమ ధైర్యాన్నీ చెప్పేదా  

 కాల ప్రకృతి బ్రహ్మ రాతలనే చెప్పేదా


పిడికెటి గుండెలొ కడలికి మించిన తలపులు సవ్వడి 

కనుల భాషకు మనసు భావాల అర్థాల సవ్వడి 


పలుకే వేణువుకు తనువెల్లా గాయాలగు సవ్వడి 

ఉలి దెబ్బ తినిన శిలలకే ఆరాధనల సవ్వడి 

 

వయ్యారి పూబాలల హృదయమ్ము  వేదనల సవ్వడి 

మౌనం నేర్చిన మది మోసేను కష్టాల సవ్వడి 


 కన్నీటికి కను రెప్పల కళల నేస్తాల సవ్వడి 

నీకు నీవే ఓదార్పైతే మనసున సవ్వడి


వయసు పరుగుల జతలో  ప్రేమకలయికలో సవ్వడి 

బిడ్డలుదూరమై పాశముగా వేదనలై సవ్వడి 


ఏమి చెప్పేది మీకు ఏమేమిచెప్పేదా 

లోక తీరేమో లొల్లిబతికే చెప్పేదా

మనుషుల లోని ప్రేమ ధైర్యాన్నీ చెప్పేదా  

 కాల ప్రకృతి బ్రహ్మ రాతలనే చెప్పేదా


సుభాషితం - 1172

---------------

🌺న యత్ర శక్యతే కర్తుం

     సామ దానమథాపి వా |

     భేదస్తత్ర ప్రయోక్తవ్యో

     యతః స వశకారకః ||🌺

(పంచతంత్రం)

        ఎక్కడ సామోపాయంవల్లకానీ, దానంతోకానీ కార్యాన్ని సాధించడానికి సాధ్యం కాదో అక్కడ భేదోపాయాన్ని ప్రయోగించాలి. ఎందుకంటే అది వశం చేసుకొని కార్యాన్ని సాధించగలదు.

🌺✍🏾ప్రభ,మైసూరు.

           12-6-2024.


నిత్యపద్య నైవేద్యం-1515వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-150. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


 సుభాషితం:

మంత్రేయ తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురౌl

యాదృశీం భావానాం కుర్యాత్ సిద్ధిర్భవతి తాదృశీll


తేటగీతి:

మంత్రము, సుతీర్థమున్ను, బ్రాహ్మణుడు, సురయు,

జ్యోతిషవరుడు, మరియును శుద్ధగురువు..

వీరి యెడల యే భావముల్ వెలుగు మదిని 

స్థిరముగ మనకు దక్కును సిద్ధి కూడ.


భావం: మంత్రం, తీర్థక్షేత్రం, బ్రాహ్మణుడు, దేవుడు, జ్యోతిష్యుడు మరియు గురువు.. వీళ్ళందరి విషయంలో ఏ రకమైన భావనలు పొందితే అదే రీతిలో సిద్ధి కూడా దొరుకుతుంది.


సీస మాలిక.. రామ రాజ్యం 

మల్లా ప్రగడ రామకృష్ణ 


భూతల స్వర్గము భుక్తికి జూపెడి 

గిలిగింతల కళలు గెలుపగుటయు 

ఎదురు చూపుల రామ ఎల్లరు సుఖమును 

మధురత భావము మంజులగుట 

కన్నీటి కెరటాల కాలము కాకుండ 

కన్నబిడ్డలసాగు కాలమగుట 

మధురాతి మధురము మధిరోహలు కలుగు 

మృదు వచన పలుకు ముఖ్యమగుట 


హరి వదనము వంటి యాస్యంబు కలవాఁడు 

హరిదంత సమదంత మలరువాఁడు 

స్నిగ్ధ గాంభీర్యమౌ స్వీయ గళమువాఁడు 

రమ్య మధునిభ నేత్రములవాఁడు 

ముగ్ధ పింగళవర్ణ భ్రుకుటులు కలవాఁడు

శ్యేన సదృశమునాసికమువాఁడు 

గజగండములవంటి గండముల్ గలవాఁడు 

శ్లథ దీర్ఘమైన కేశములవాఁడు 

పీనవక్షము మఱి భిదుర మధ్యమువాఁడు 

నాగవృషభ గమనములవాఁడు 


రామచంద్రునికళ రాజ్య మేలగ జూడు 

రసరమ్య భావము రమ్య పరచ 

సమయ సర్వుల రక్ష సంఘ తృప్తిని కోర 

పాలనా పరమగు పగలు రాత్రి 

దారిద్రమనునది ధరణినా గనలేదు 

వేదవేదాంగళ విద్య కదులు 

అవివేక గుణములు అసలు కనగలేవు 

భవిత వాదనలేని బంధ మదియు 

పరుషపు పలుకులు పదములు గనరావు 

మెరుగగు విద్యలు మేలు జరుగు 


తే గీ 

బలిసివ్రేలాడు బాహువుల్ కలిగినట్టి 

కరము బలవంతమయమగు కాంతకుఁగొడు

మనసు లోకైక వీరుని మమత గనుము 

స్పష్టముగను దెలియును లక్షణముఁ రామ


సీ..కలమన్న వ్రాతేది కళలుగా కవితేది 

గుణమునే తెలిపేది గుర్తు ఏది 

కాగితాలే లేవు కలగమనా చిత్ర 

అక్షర రూపము అసలు లేదు 

ఆధునికపు మోజు అక్షర చరవాణి 

అభినందనవ్రాత అసలు లేదు 

మిత్రుల కలయిక మెరుగు జవాబేది 

చదువు వ్రాతలు తగ్గ చలన మేది


పరపరి విధాల కవితలు పలకరింపు

మనసు అన్యధా వ్రాతల మనుగడేది

అగ్గి కంటే అధిక శక్తి అసలు వ్రాత 

ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత


తె౹సీ మా॥

హరి వదనము వంటి యాస్యంబు కలవాఁడు 

     హరిదంత సమదంత మలరువాఁడు 

స్నిగ్ధ గాంభీర్యమౌ స్వీయ గళమువాఁడు 

       రమ్య మధునిభ నేత్రములవాఁడు 

ముగ్ధ పింగళవర్ణ భ్రుకుటులు కలవాఁడు

     శ్యేన సదృశమునాసికమువాఁడు 

గజగండములవంటి గండముల్ గలవాఁడు 

     శ్లథ దీర్ఘమైన కేశములవాఁడు 

పీనవక్షము మఱి భిదుర మధ్యమువాఁడు 

    నాగవృషభ గమనములవాఁడు 

తే గీ 

బలిసివ్రేలాడు బాహువుల్ కలిగినట్టి 

కరము బలవంతమయమగు కాంతకుఁగొడు

మనసు లోకైక వీరుని మమత గనుము 

స్పష్టముగను దెలియును లక్షణముఁ రామ


దశరథాత్మజ శతకము (54)


 సీ.భరతాగ్రజా !  రామ ! భానువంశ ప్రదీప !

                  నిరతమ్ము నినుగొల్తు నిగమవేద్య !

     తారకమంత్రమ్ము తలచిన మాత్రాన

                 పాపముల్ నశియించి పరము గల్గు  

     కౌసల్యనందనా ! కమనీయ గుణధామ !

                 కైవల్యమిచ్చినన్ గావు మయ్య

     భూమిజపతిరామ ! భువనైక మోహనా !

                 కోసలాధిప రామ ! కూర్మి  కొలుతు

తే.నీదునామమ్ము  దలచియు న్నిచ్చ లందు     

     బడసె కైవల్య పదము నా భక్త శబరి      

     భక్తితో నిన్ను  గొల్చిన ముక్తి గల్గు

     దశరథాత్మజ ! రఘురామ ! ధర్మ తేజ !


       జయలక్ష్మి  పిరాట్ల


 

261) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
అస్తి కూటస్థ ఇత్యాదౌ పరోక్షం వేత్తి వార్తయా ౹ 

పశ్చాత్కూటస్థ ఏవాస్మీత్యేవం వేత్తి విచారతః ౹౹31౹౹

31. గురూపదేశాదుల వలన పరోక్షముగ కూటస్థము కలదు అని తెలిసికొనును.పిదప విచారణ పూర్వకముగ స్వానభవముననే 

"నేను కూటస్థమును" అని తెలియును. (ఇది అపరోక్షజ్ఞానము).

వ్యాఖ్య:- శబ్దం వల్ల వచ్చే జ్ఞానము సాధారణంగా పరోక్షజ్ఞానము.అది దూరవస్తువయితే ఎప్పటికీ పరోక్షజ్ఞానమే. "కాశీ"కి వెళ్ళని వానికి ఆశబ్దం వలన వచ్చిన జ్ఞానము సర్వదా పరోక్షమే.అనుభవంలోకి రాదుగదా ! 

ఇంద్రాది దేవతలు,స్వర్గం మొదలగునవన్నీ అంతే గదా !

దగ్గరలోనే ఉన్న ఘటమును 'ఘటమున్నది అని బోధిస్తే అదీ  పరోక్షమే', అలాగక ఎదురుగా చూపించి బోధిస్తే అది అపరోక్షజ్ఞానమగును.

ఇది ఘటము, నేను బ్రహ్మమును, నీవు దశముడవు మొదలగునవి ఉదాహరణలు. ఇందులో పదిమంది పరమానందయ్య శిష్యులు నదిలో స్నానము చేసి బయటకు వచ్చి లెక్క చూస్తే లెక్కచూచిన వానికి తాను తప్ప తొమ్మిది మంది లెక్కకు వస్తున్నారు.

అందువలన దశముడు అనగా పదవ వాడు నదిలో కొట్టుకొని పోయాడని ఏడుస్తున్నాడు.

ఒక బాటసారి వీరిని చూచి మీరు పది మంది ఉన్నారయ్యా (దశమః అస్తి) అన్నాడు.ఇది పరోక్షజ్ఞానము. అపుడు వారు పదవవాడు(దశముడు)ఏడి అని అడిగితే, ఆ లెక్కించినవాడే దశముడని(దశమః త్వమసి) చెప్పాడు.అప్పుడు కలిగినది అపరోక్షజ్ఞానము. అలాగే బ్రహ్మమున్నదని చెప్పినది, జీవుడు - ఆత్మ అన్నది పరోక్షజ్ఞానము. 

"ఆ ఆత్మ నీవే", "ఆ బ్రహ్మము నీవే" అని చెప్పిన వాక్యము  అపరోక్ష జ్ఞానము. కనుక

మహావాక్యం చెప్పేది అపరోక్షజ్ఞానమే. 

చర్చల ద్వారా,విచారణద్వారా,సద్గురువుచేత బోధింపబడినవాడై "కూటస్థుడున్నాడు కూటస్థోఽస్తి" అని తెలుసుకుంటాడు ఈ విధంగా తెలుసుకోవటం పరోక్షజ్ఞానం.

పిమ్మట శ్రవణాదులు పరిపక్వమైన పిమ్మట - 

"నేనే బ్రహ్మము కంటే భిన్నం కానట్టి కూటస్థుడను!కూటస్థోఽహమేవాస్మి" అని స్వానుభవమున తెలుసు కుంటున్నాడు.ఇది అపరోక్షజ్ఞానం.

--(())--

కర్తా భోక్తేత్యేవమాది శోకజాతం ప్రముఞ్చతి ౹ 

కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తుష్యతి ౹౹32౹౹


32.ఆపై 'పుణ్యాపుణ్య కర్మలకు నేను కర్తను,సుఖదుఃఖములను అనుభవించు భోక్తను నేనే ' మొదలగు దుఃఖసమూహమును వదలివేయును.

వ్యాఖ్య:-

శ్రవణమననాదుల ద్వారా "నేను బ్రహ్మం కంటే భిన్నం కానట్టి కూటస్థుడను" అని తెలుసుకుని స్థితుడైన వానికి ప్రపంచము నందలి వస్తుసముదాయమంతయు కేవలం వస్తువులు మాత్రమే కాక బ్రహ్మం నందు కదలాడు   అలలులాగా కనబడుతుంటాయి.

వస్తువులతో గల తాదాత్మ్యాన్ని విడనాడి సత్యవస్తువులకు అధిష్ఠానమయిన బ్రహ్మానుసంధానముతో వుండువానికి 

"నేను కర్తను,నేను భోక్తను" అనే వాటివల్ల కలిగే శోకాన్ని దుఃఖాన్ని వదిలివేస్తాడు.

"నేను చేయవలసినదంతా చేసాను", "పొందవలసినదంతా పొందాను" అనే సంతోషాత్మకమైన జ్ఞానాన్ని పొందుతాడు.

దీనినే తృప్తీ అంటారు.

క్రమం తప్పని నిరంతరాభ్యాసం వలన సాధకుడు ముందుగా అనంత చైతన్యాన్ని అప్పుడప్పుడు స్వానుభవంతో గ్రహిస్తాడు.

దీక్షతో సాధనను కొనసాగించగా చివరగా ఆనందనందమయమయిన స్వరూప స్థితిలో వ్యష్ఠి  భావననేది లేకుండా లీనమయిపోతాడు.

తానూ బ్రహ్మంకంటే వేరుకాదనీ,తానే బ్రహ్మమనీ గ్రహించాలి.

"అహం బ్రహ్మస్మి" అని తెలుసుకుంటూ ప్రజ్ఞాన ఘనమయి నిలుస్తాడు.


అజ్ఞాన మావృత్తీ స్తద్వద్విక్షేపశ్చ పరోక్షధీః ౹ 

అపరోక్షమతిః శోఖ మోక్ష స్తృప్తిర్నిరఙ్కుశా ౹౹33౹౹


 అజ్ఞానము, ఆవరణము, విక్షేపము, పరోక్షజ్ఞానము, అపరోక్షజ్ఞానము,దుఃఖనివృత్తి,

నిరతిశయమైన తృప్తి.


సప్తావస్థ ఇమాః సన్తి చిదాభాసస్య తాస్విమౌ ౹ 

బన్దమోక్షౌ స్థితౌ తత్ర తిస్రో బంధ కృతః స్మృతాః.. 34


చిదాభాసుడగు జీవుడు ఈ సప్తదశలనుగడచును.అందు మొదటి మూడూ బంధకారణములని చెప్పబడినవి.


ఓంశ్రీమాత్రే నమః


*న జానామీత్యుదాసీన వ్యవహారస్య కారణమ్ ౹ విచార ప్రాగభావేన యుక్తమజ్ఞానమీరితమ్ ౹౹35౹౹*

35. నాకు తెలియదు అనుభావము,సత్యమును గూర్చి నిర్లిక్ష్యము,వివేకము లేకపోవుట అనేవి అజ్ఞానమని చెప్పబడినవి.

వాఖ్య:-

అజ్ఞానము, ఆవరణము(ఆవృత్తి),

విక్షేపము,పరోక్షజ్ఞానము,

అపరోక్షజ్ఞానము,శోకనివృత్తి,

నిరతిశయానందము అనేవి చిదాభాసలోని సప్తావస్థలు.

ఇవే బంధమును మోక్షమును కూడా కల్పించును.

ఈ ఏడు అవస్థల్ని ఆత్మధర్మాలుగా అంగీకరిస్తే,

ఆత్మ అనేది నిర్వికారమైనది ఎట్లా అవుతుంది?

అంటే,సమాధానం -

ఈ ఏడు అవస్థలు చిదాభాసకు(జీవునికి) ఉండేవే తప్ప కూటస్థునివి కావు.ఈ ఏడు అవస్థల్లోనూ బంధమోక్షాలు రెండూ ఉన్నాయి.

మొదటి మూడు అవస్థలూ (అజ్ఞానం,ఆవరణ,విక్షేపం)

బంధాన్ని కలిగించేవి.

మిగిలిన నాలుగూ (పరోక్షజ్ఞానము,

అపరోక్షజ్ఞానము, దుఃఖనివృత్తి,

నిరతిశయమైన తృప్తి) మోక్షాన్ని కలిగించేవి.

ఇప్పుడు వీటిలో అజ్ఞానస్వరూపం -

ఎవనియందైనా సరే,

ఆత్మతత్త్వ విచారణకు సంబంధించిన ప్రావభావం -

ఆత్మ తత్త్వవిచారణ  లేకపోవటంతో కూడిన తూష్ణీ భావంతో ఉదాసీనుడుగా ఉండటం అనేవి కనిపిస్తే వాటికి కారణం అజ్ఞానం అన్నమాట.

అట్లాగే,

"నేను కూటస్థుని ఎరుగను" అనే ఈ విధమైన అనుభవానికి

విషయమైనదే అజ్ఞానం. ఔదాసీన్యం,సత్యత్వము పై నిర్లిక్ష్యము,వివేకము లేకపోవుట అనేవి అజ్ఞాన స్వరూపమని,

 "నేను ఎరుగను" అనే అనుభవం అజ్ఞానానికి కార్యం అన్నమాట.

ఏ చైతన్యస్వరూపమైన ఆత్మవల్ల సమస్తమూ తెలుసుకొనబడుతోందో,అటువంటి సత్యమును దేనివల్ల తెలుసుకోగలము ? అనే శ్రుతివచనాన్ని బట్టి ఏ ఆత్మతత్త్వంతో ఈ దృశ్యాన్నంతనూ తెలుసుకోగలుగుతున్నామో అటువంటి సత్యాన్ని ఏ జడవస్తువుతో చూడగలగుతాము?

తెలుసుకోగలుగుతాము?

జ్ఞానానికి సాధనమైన మనస్సు కూడా జ్ఞాతవ్యమైన విషయాన్నే తెలుసుకోగలుగుతుందేతప్ప జ్ఞాతయైన ఆత్మను తెలుసుకోలేదు.

మరొక శ్రుతి కూడా ఇదే చెపుతొంది.

"నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యోన చక్షషా..."  

కఠ 2-3-13.

ఆత్మను వాక్కుతో గాని,మనస్సుతోగాని,చక్షురాది ఇతర ఇంద్రియాలతో గాని పొందటానికి వీలులేదు.వాఖ్య:-అజ్ఞానము, ఆవరణము(ఆవృత్తి),

విక్షేపము,పరోక్షజ్ఞానము,

అపరోక్షజ్ఞానము,శోకనివృత్తి,

నిరతిశయానందము అనేవి చిదాభాసలోని సప్తావస్థలు.

ఇవే బంధమును మోక్షమును కూడా కల్పించును.

ఈ ఏడు అవస్థల్ని ఆత్మధర్మాలుగా అంగీకరిస్తే,

ఆత్మ అనేది నిర్వికారమైనది ఎట్లా అవుతుంది?

అంటే,సమాధానం -

ఈ ఏడు అవస్థలు చిదాభాసకు(జీవునికి) ఉండేవే తప్ప కూటస్థునివి కావు.ఈ ఏడు అవస్థల్లోనూ బంధమోక్షాలు రెండూ ఉన్నాయి.

మొదటి మూడు అవస్థలూ (అజ్ఞానం,ఆవరణ,విక్షేపం)

బంధాన్ని కలిగించేవి.

మిగిలిన నాలుగూ (పరోక్షజ్ఞానము,

అపరోక్షజ్ఞానము, దుఃఖనివృత్తి,

నిరతిశయమైన తృప్తి) మోక్షాన్ని కలిగించేవి.

ఇప్పుడు వీటిలో అజ్ఞానస్వరూపం -

ఎవనియందైనా సరే,

ఆత్మతత్త్వ విచారణకు సంబంధించిన ప్రావభావం -

ఆత్మ తత్త్వవిచారణ  లేకపోవటంతో కూడిన తూష్ణీ భావంతో ఉదాసీనుడుగా ఉండటం అనేవి కనిపిస్తే వాటికి కారణం అజ్ఞానం అన్నమాట.

అట్లాగే,

"నేను కూటస్థుని ఎరుగను" అనే ఈ విధమైన అనుభవానికి

విషయమైనదే అజ్ఞానం. ఔదాసీన్యం,సత్యత్వము పై నిర్లిక్ష్యము,వివేకము లేకపోవుట అనేవి అజ్ఞాన స్వరూపమని,

 "నేను ఎరుగను" అనే అనుభవం అజ్ఞానానికి కార్యం అన్నమాట.

ఏ చైతన్యస్వరూపమైన ఆత్మవల్ల సమస్తమూ తెలుసుకొనబడుతోందో,అటువంటి సత్యమును దేనివల్ల తెలుసుకోగలము ? అనే శ్రుతివచనాన్ని బట్టి ఏ ఆత్మతత్త్వంతో ఈ దృశ్యాన్నంతనూ తెలుసుకోగలుగుతున్నామో అటువంటి సత్యాన్ని ఏ జడవస్తువుతో చూడగలగుతాము?

తెలుసుకోగలుగుతాము?

జ్ఞానానికి సాధనమైన మనస్సు కూడా జ్ఞాతవ్యమైన విషయాన్నే తెలుసుకోగలుగుతుందేతప్ప జ్ఞాతయైన ఆత్మను తెలుసుకోలేదు.

మరొక శ్రుతికూడా ఇదే చెపుతొంది.

"నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యోన చక్షషా..."  

కఠ 2-3-13.

ఆత్మను వాక్కుతో గాని,మనస్సుతోగాని,చక్షురాది ఇతర ఇంద్రియాలతో గాని పొందటానికి వీలు లేదు.ఓంశ్రీమాత్రే నమః

*ఆమార్గేణ విచార్యాథ నాస్తి నో భాతి చేత్యసౌ ౹ విపరీత వ్యవహృతి రావృతేః కార్యమిష్యతే ౹౹36౹౹*

36.అశాస్త్రీయమగు తర్కము ద్వారా కూటస్థము కన్పింపదు అది లేదు అనే విపరీత వ్యవహారము ఆవరణము యొక్క ఫలము.


*దేహద్వయ చిదాభాసరూపో విక్షేప ఈరితః ౹ కర్తృత్వా ద్యఖిలః శోకః సంసారాఖ్యోఽ స్య బంధక ౹౹37౹౹*

37.చిదాభాసుడు  శరీరములతో తాదాత్మ్యము నొందుట విక్షేపమనబడినది. దీని వలన కర్తృత్వభావనతో ప్రారంభమగు సకల దుఃఖములకు లోనగును.ఈ దుఃఖజాతమే సంసారము.అదే బంధము.

వ్యాఖ్య:-

శాస్త్రాల్లో ప్రతిపాదింపబడిన ప్రక్రియల్ని
ఉల్లంఘించి,కేవలం కుతర్కాలతో ఆలోచించినమీదట "కూటస్థుడు లేనూలేడు, కనపడనూ కనపడటం లేదు" అనే ఈ విధమైన విరుద్ధ వ్యవహారం ఆవరణకు కారణమౌతుంది.
అజ్ఞానావరణ వల్లనే ఈ విధంగా వ్యవహరిస్తారు.

స్థూలశరీరం,సూక్ష్మశరీరం ఈ రెంటితోనూ కూడి తాదాత్మ్యము నొంది ఉన్న చిదాభాసనే(జీవుణ్ణే)విక్షేపం అంటారు.
బంధనహేతువైనట్టి సంసారమనే పేరుతో వ్యవహరింపబడే 
కర్తృత్వ భోక్తృత్వాది రూపంలో ఉండే సమస్త శోకమూ చిదాభాస యొక్క కార్యమనే అంగీకరించాలి.

ఈ పై రెండు అవస్థలూ  చిదాభాసలో ఎట్లా ఉంటాయి ?
అజ్ఞానం,ఆవృత్తి అనేవి విక్షేపం పుట్టటానికి ముందు గూడా ఉన్నాయి గదా !
చిదాభాసమనేది విక్షేపాంతర్గతమైనదని అంటారేమి ? అంటే -

అజ్ఞానము, ఆవరణము (ఆవృత్తి)అనే ఈ రెండు అవస్థలూ విక్షేపం పుట్టటానికి పూర్వమే ఉన్నప్పటికీ అవి చిదాభాసకున్నవే తప్ఫ కూటస్థమైన చైతన్యానికి సంబంధించినవు కావు.

కూటస్థమనేది అసంగమైనది కాబట్టి,చిదాత్మ యందు అజ్ఞానము ఆవరణము అనేవి సంభవం కాదు.
ఇక పరిశేష న్యాయంగా ఆ రెండు అవస్థలూ చిదాభాసకు చెందినవే అని అంగీకరించాలి.

అంతఃకరణ వృత్తి అంతర్ముఖమయిన తరువాత సూక్ష్మమైన చైతన్యము ను అందుకొనుటకు నిరీక్షించాలి.
నిలకడ లేక బహిర్ముఖమయినచో అదే "విక్షేపం".

ఇంట్లో నిధి ఉన్నది.తవ్వాడు దానికి ఒక విష సర్పము కాపలా ఉన్నది.చాలా ప్రయత్నాలతో ఆ సర్పము అడ్డు తొలగినది.దీని వలన మనస్సుకు సంతోషం కలిగింది.
ఈ సంతోషంతో ఆగిపోతే"నిధి"
దొరకదు.

అలాగే మనలోనే బ్రహ్మరూప నిధి గలదు.దానికి కాపలాగా విక్షేపం వున్నది.అది తొలగితే వచ్చే ఆనందం దగ్గరే ఆగితే బ్రహ్మానందం లభించదు.

బాహ్య విషయాకార వృత్తి - విక్షేపం.
అంతర వాసనాకార వృత్త - రాగద్వేషాదులు.
విషయాలను దోషాలుగా గమనించటం ద్వారా దీనిని పోగొట్టవచ్చును.No comments:

Post a Comment